breaking news
Psy Vishesh
-
ఫైనాన్షియల్ పర్సనాలిటీ అంటే..?
డబ్బు కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది మీ 'పర్సనాలిటీకి అద్దం'. మీరు డబ్బును ఎలా చూస్తున్నారు? భద్రత కోసం చూస్తున్నారా? లేక హోదా కోసం చూస్తున్నారా? మీ వ్యక్తిత్వం ఎంత గొప్పదైనా, మీ డబ్బు ఖర్చు చేసే విధానం మీలోని భయాలను, ఆశలను బయటపెడుతుంది. సైకాలజీ ప్రకారం, మన ఫైనాన్షియల్ నిర్ణయాలు మన బాల్యంలో ఏర్పడిన నమ్మకాలపై (Money Beliefs) ఆధారపడి ఉంటాయి.1. నాలుగు రకాల ఫైనాన్షియల్ పర్సనాలిటీలుసైకాలజీ ప్రకారం, మనుషులను డబ్బును ఖర్చు చేసే తీరు బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు. The Spender (ఖర్చు చేసేవాడు): వీరు డబ్బును 'సంతోషం' కోసం ఖర్చు చేస్తారు. ఎవరైనా ఏమనుకుంటారో అని, లేదా ఇన్స్టంట్ హ్యాపీనెస్ కోసం ఖర్చు చేస్తారు. ఇది వారిలోని 'అభద్రతా భావం' (Insecurity) ను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం.The Saver (దాచుకునేవాడు): వీరు డబ్బును 'భద్రత'గా భావిస్తారు. ప్రతి రూపాయిని దాచుకోవడం వీరి పర్సనాలిటీ. ఇది వారిలోని 'భవిష్యత్తు భయం' (Fear of the future) ను ప్రతిబింబిస్తుంది. The Avoider (తప్పించుకునేవాడు): వీరు తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూడ్డానికి కూడా భయపడతారు. డబ్బు విషయంలో ఒక రకమైన 'నిరాసక్తత'ను ప్రదర్శిస్తారు. ఇది వారి 'అసమర్థత' (Feeling of helplessness) ని సూచిస్తుంది. The Investor/Planner: వీరు డబ్బును ఒక 'సాధనం'లా వాడతారు. వీరిలో ప్లానింగ్, క్రమశిక్షణ ఉంటాయి. వీరు తమ వ్యక్తిత్వాన్ని 'రిస్క్ అండ్ రివార్డ్' తో బ్యాలెన్స్ చేసుకుంటారు.2. మనీ ట్రాప్స్: పర్సనాలిటీని ఎలా దెబ్బతీస్తాయి?Status Spending: మనకు నచ్చని వస్తువులను, మనకు ఇష్టం లేని వ్యక్తులను మెప్పించడానికి కొనడం. ఇది మీ 'ఆత్మవిశ్వాసం' లేకపోవడానికి సంకేతం.Impulse Buying: ఎమోషనల్ గా ఉన్నప్పుడు (కోపం లేదా బాధ) ఖర్చు చేయడం. ఇది మీ 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్' లోపం.3. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ డబ్బుని మీ పర్సనాలిటీని పెంచే ఆయుధంగా ఎలా మార్చుకోవాలి?Step 1: డబ్బుతో ఉన్న ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ని బ్రేక్ చేయండిమీరు ఎందుకు ఖర్చు చేస్తున్నారో గమనించండి. అది మీ అవసరమా? లేక మీలోని ఏదో వెలితిని నింపుకోవడానికా? మీరు 'Spender' అయితే, మీలోని 'Insecurity' ని 'Break' చేయండి. 'Saver' అయితే, మీలోని 'భయాన్ని' బ్రేక్ చేయండి.Step 2: వాల్యూ బేస్డ్ స్పెండింగ్మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి మీ Values ని ప్రతిబింబించాలి. మీరు చదువుకోవడానికి, ఆరోగ్యం కోసం, మంచి సంబంధాల కోసం ఖర్చు చేస్తున్నారా? అయితే అది మీ పర్సనాలిటీని Build చేసుకోవడం. అనవసరమైన వాటిని కట్ చేయండి.Step 3: ఆర్థిక స్వేచ్ఛడబ్బు కోసమే బ్రతకడం కాదు, డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. మీ ఆర్థిక క్రమశిక్షణే మీ పర్సనాలిటీకి ఒక 'స్టేటస్'ను ఇస్తుంది. ఆర్థికంగా స్వేచ్ఛ ఉన్నప్పుడు, మీరు ప్రపంచాన్ని మరింత ధైర్యంగా ప్రభావితం చేయగలరు. ఇదే 'Beyond' స్టేజ్.4. మీ ఫైనాన్షియల్ అద్దంఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీ గత నెల ఖర్చులలో ఎన్ని 'అవసరం' కోసం, ఎన్ని 'హోదా' కోసం?మీరు ఎందుకు దాచుకుంటున్నారు? (భయం కోసమా? లక్ష్యం కోసమా?)మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకి, మీ వ్యక్తిత్వానికి సంబంధం ఉందని మీరు నమ్ముతున్నారా?డబ్బు - మీ పర్సనాలిటీకి మందు!బ్రో, డబ్బు లేకపోవడం వల్ల వచ్చేది పేదరికం, కానీ డబ్బుని సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల వచ్చేది 'పర్సనాలిటీ క్రైసిస్'. క్రమశిక్షణతో కూడిన ఖర్చు, మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప గౌరవాన్ని ఇస్తుంది."Wealth is not about having a lot of money; it's about having a lot of options." Naval Ravikanthసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ఒత్తిడిలో మీ నిజమైన పర్సనాలిటీ బయటపడుతుందా?) -
ఒత్తిడిలో మీ నిజమైన పర్సనాలిటీ బయటపడుతుందా?
సాధారణ స్థితిలో ప్రతి ఒక్కరూ మంచే మాట్లాడతారు, ప్రశాంతంగానే ఉంటారు. కానీ, "ఒత్తిడి (Stress) ఉన్నప్పుడు మీరు ఎవరు?" అనేదే మీ అసలైన వ్యక్తిత్వం."నేను ఆ టైమ్ లో కోపంగా మాట్లాడాను బ్రో, కానీ నేను చాలా మంచివాడిని" అని చాలామంది అంటారు. సైకాలజీలో దీనిని మనం అంగీకరించలేం. ఎందుకంటే, ఒత్తిడి అనేది మీలోని ముసుగును తీసేసే ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది. ఒత్తిడిలో మీరు అరుస్తున్నారంటే, ఆ కోపం మీలో ఎప్పుడూ ఉన్నదే, అది ఆ సమయంలో బయటపడింది అంతే.1. ఒత్తిడిలో మెదడు ఏం చేస్తుంది? మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడులో భయాన్ని నియంత్రించే Amygdala యాక్టివేట్ అవుతుంది. దీన్నే 'Amygdala Hijack' అంటారు. ఆ సమయంలో మన లాజికల్ మెదడు (Prefrontal Cortex) పనిచేయడం ఆగిపోయి, కేవలం మన 'సర్వైవల్ ఇన్స్టింట్స్' (Fight or Flight) మాత్రమే పనిచేస్తాయి.Fight (పోరాటం): కోపంతో అరవడం, వాదించడం.Flight (పారిపోవడం): సమస్య నుండి తప్పించుకోవడం, బాధ్యత తీసుకోకపోవడం.Freeze (స్తంభించిపోవడం): ఏం చేయాలో తెలియక ఆగిపోవడం.మీరు ఈ మూడింటిలో దేనికి రియాక్ట్ అవుతున్నారో గమనిస్తే, మీ 'ఒత్తిడి వ్యక్తిత్వం' అర్థమవుతుంది.2. మీ పర్సనాలిటీని ఒత్తిడి ఎలా మార్చేస్తుంది?ఒత్తిడిలో మీరు మూడు రకాలుగా మారతారు.The Victim: "నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?" అని నిరంతరం బాధపడటం.The Bully: ఒత్తిడిని భరించలేక ఇతరులను డామినేట్ చేసి, కంట్రోల్ చేయాలని చూడటం.The Hermit: పూర్తిగా ప్రపంచానికి దూరంగా వెళ్లిపోవడం.కానీ, Resilient Personality ఉన్న వ్యక్తి మాత్రం ఒత్తిడిలో కూడా నిశ్శబ్దంగా తన పని చేసుకుంటాడు. అతను సమస్యను చూసి భయపడడు, పరిష్కారం కోసం చూస్తాడు.3. నిజమైన స్ట్రెస్ మేనేజ్మెంట్"ఎప్పుడూ హ్యాపీగా ఉండు, స్ట్రెస్ కి చోటు ఇవ్వకు" అని సోకాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు చెప్తారు. ఇది అసాధ్యం, ఎందుకంటే జీవితం ఉన్నచోట స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ మధ్యలో ఉండి కూడా ఎలా ప్రశాంతంగా ఉండాలో సైకాలజీ (Mindfulness & Stoicism) నేర్పిస్తుంది. స్ట్రెస్‌ను పూర్తిగా తొలగించడం కాదు, స్ట్రెస్‌ను 'మేనేజ్' చేయడం నేర్చుకోవాలి.4. ఒత్తిడిలో కూడా 'మీరు'గా ఉండటం ఎలా?నా Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఒత్తిడిని మీ పర్సనాలిటీకి ఆయుధంగా మార్చుకోండి.Step 1: రియాక్షన్ బ్రేక్ఒత్తిడి మొదలవ్వగానే, ముందుగా శారీరక మార్పులను (గుండె వేగం పెరగడం) గుర్తించండి. వెంటనే ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే, మీరు 'అమైగ్డాలా హైజాక్' నుండి బయటపడవచ్చు. ఆ 'రియాక్షన్'ని బ్రేక్ చేయడం మీ మొదటి విజయం.Step 2: స్ట్రెస్ వాల్యుయేషన్"ఈ ఒత్తిడికి కారణం ఏంటి? ఇది నా కంట్రోల్ లో ఉందా?" అని ప్రశ్నించుకోండి. మీ కంట్రోల్ లో ఉంటే పని చేయండి, లేకపోతే దాన్ని 'లెట్ గో' (Let go) చేయండి. మీ ఎనర్జీని కంట్రోల్ చేయలేని వాటి కోసం వృథా చేయకుండా, కంట్రోల్ చేయగలిగే వాటిపై 'Build' చేయండి.Step 3: స్టాయిక్ కామ్తుఫానులో కూడా చెట్టు కదలనట్లు, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మీరు మీ సెల్ఫ్-కంట్రోల్ ని కోల్పోకూడదు. ఎవరైతే ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటారో, వారే నిజమైన నాయకులు. ఇదే Beyond స్టేజ్.5. మీ స్ట్రెస్ రిపోర్ట్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ వారంలో మీరు ఎక్కడ అతిగా రియాక్ట్ అయ్యారు?ఆ సమయంలో మీ మెదడు మిమ్మల్ని ఏమని భయపెట్టింది?ఇప్పుడు ఆ పరిస్థితిని తిరిగి చూస్తే, మీరు ఎలా స్పందించి ఉండాల్సింది?ఒత్తిడి మీ పర్సనాలిటీకి అద్దం!బ్రో, ఒత్తిడి మిమ్మల్ని చెడగొట్టదు, అది కేవలం మీ లోపల ఏముందో బయటకు తీస్తుంది. మీ లోపల శాంతి ఉంటే, ఒత్తిడిలో కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. లోపల గందరగోళం ఉంటే, ఒత్తిడిలో మీరు నలిగిపోతారు. కాబట్టి బయట పరిస్థితులను మార్చడం కంటే, లోపలి పర్సనాలిటీని నిర్మించడం ముఖ్యమని గుర్తుంచుకోండి."It is not the mountain we conquer, but ourselves." Edmund Hillaryసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అదే అసలైన కాన్ఫిడెన్స్..!) -
అదే అసలైన కాన్ఫిడెన్స్..!
కాన్ఫిడెన్స్ అంటే ఎదుటివారిని డామినేట్ చేయడం లేదా గట్టిగా అరవడమని చాలామంది అనుకుంటుంటారు. కానీ సైకాలజీలో కాన్ఫిడెన్స్ అంటే "నేను గొప్పవాడిని" అని అరుచుకోవడం కాదు, "నేను దేనినైనా ఎదుర్కోగలను" అని మనసులో ఉండే 'Self-Efficacy' (ఆత్మసామర్థ్యం). దీనికి గర్వానికి (Arrogance) మధ్య ఉన్న తేడాను గుర్తించడమే అసలైన వ్యక్తిత్వ వికాసం. అసలైన కాన్ఫిడెన్స్ ఒక 'నిశ్శబ్ద బలం' (Silent Strength).1. Albert Bandura సిద్ధాంతంకాన్ఫిడెన్స్ అనేది ఒక పుట్టినప్పుడు వచ్చే లక్షణం కాదు. ఆల్బర్ట్ బాండూరా అనే సైకాలజిస్ట్ దీనిని 'Self-Efficacy' అని పిలిచారు. దీనికి నాలుగు మూలస్తంభాలు ఉన్నాయి.Mastery Experiences: మీరు ఒక పనిని పదే పదే చేసి, అందులో నైపుణ్యం సంపాదించినప్పుడు వచ్చే నమ్మకం.Vicarious Experiences: మీలాంటి వారే ఒక పనిని సాధించడం చూసి, "అతనే సాధించగలిగినప్పుడు నేను ఎందుకు సాధించలేను?" అని అనుకోవడం.Social Persuasion: మీపై నమ్మకం ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహించడం.Physiological States: మీ శరీరంలోని ఒత్తిడిని, ఉత్సాహాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది.2. గర్వానికి, కాన్ఫిడెన్స్ కి తేడా ఏంటి?Arrogance (గర్వం): "నేను అందరికంటే తోపు, నేను ఎప్పుడూ తప్పు చేయను." ఇది భయాన్ని దాచుకోవడానికి వేసే ముసుగు.Confidence (ఆత్మవిశ్వాసం): "నేను తప్పు చేయవచ్చు, కానీ ఆ తప్పు నుండి నేర్చుకుని మళ్ళీ లేవగలను." ఇది వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యం.కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలుసు, అందుకే అతను ఇతరుల విమర్శలకు భయపడడు. గర్వం ఉన్న వ్యక్తికి తన బలహీనతలు తెలిస్తే భయం, అందుకే అతను ఇతరుల మీద అరుస్తాడు.3. నిజమైన కాన్ఫిడెన్స్మోటివేషన్ ట్రైనర్లు "నువ్వు అద్దంలో చూసి నిన్ను నువ్వు పొగుడుకో, నువ్వు గెలుస్తావు" అని చెప్తారు. ఇది కేవలం పైన పూసే రంగు. కానీ సైకాలజీ ప్రకారం కాన్ఫిడెన్స్ రావాలంటే 'కాంపిటెన్స్' (నైపుణ్యం) ఉండాలి (Competence-based Confidence). మీరు ఒక పనిని కష్టపడి నేర్చుకుని, అందులో ప్రావీణ్యం సంపాదిస్తే.. ఆటోమేటిక్‌గా మీలో కాన్ఫిడెన్స్ పుడుతుంది.4. కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం మూడు అంచెల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పొందాలో చూద్దాం.Step 1: అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండిముందుగా I am not enough అనే అభద్రతా భావాన్ని బ్రేక్ చేయండి. మీరు ఎవరితోనూ పోటీ పడనవసరం లేదు, మీ నిన్నటి వెర్షన్ తో మాత్రమే పోటీ పడండి.Step 2: చిన్న చిన్న విజయాలుఒక రోజులో మీరు అనుకున్న పనిని పూర్తి చేయండి. ఆ చిన్న 'విజయం' మీ సబ్-కాన్షియస్ మైండ్‌కి మీరు నమ్మదగ్గ వ్యక్తి అని చెప్తుంది. ఇలా రోజురోజుకూ మీ కాన్ఫిడెన్స్ మజిల్ని Build చేయండి.Step 3: నిశ్శబ్ద విజేతమీరు స్టేజ్ ఎక్కనవసరం లేదు, అరవనవసరం లేదు.. మీ నడకలో, మీ కళ్ళలో, మీ మాటల్లో ఆ బలం కనిపిస్తుంది. ఎదుటివారికి మీరు ఒక 'ముప్పు'గా కాకుండా, ఒక 'ప్రేరణ'గా కనిపిస్తారు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ కాన్ఫిడెన్స్ రిపోర్ట్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు ఎప్పుడు, ఏ పని చేస్తున్నప్పుడు ఎక్కువగా కాన్ఫిడెంట్‌గా ఫీలవుతారు? మీలో ఉన్న ఒక బలహీనతను మీరు గర్వంగా ఒప్పుకోగలరా?ఇతరుల విమర్శలు మిమ్మల్ని ఇంకా కదిలిస్తున్నాయా?కాన్ఫిడెన్స్ ఒక ప్రయాణం!బ్రో, కాన్ఫిడెన్స్ అనేది ఒక రోజులో రాదు. ఇది ఒక ప్రయాణం. మీ నైపుణ్యాలను పెంచుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీ గాయాలను హీల్ చేసుకోండి.. అప్పుడు కాన్ఫిడెన్స్ దానంతట అదే ఒక నీడలా మిమ్మల్ని అనుసరిస్తుంది."Confidence is silent. Insecurities are loud."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: సమయాన్ని గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే..) -
సమయాన్ని గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే..
సమయం అంటే కేవలం గడియారంలోని ముల్లులు కాదు, అది మీ జీవితం. మీరు ఒకరికి సమయాన్ని ఇచ్చినప్పుడు, ఆ సమయం తిరిగి రాదు. అంటే, మీరు వారికి మీ 'జీవితం' లోని కొంత భాగాన్ని ఇస్తున్నారు. కాబట్టి, సమయాన్ని వృథా చేయడం అంటే, మీ జీవితాన్ని మీరు వృథా చేసుకోవడమే.చాలామంది టైమ్ మేనేజ్మెంట్ని ఒక Technique అనుకుంటారు, కానీ సైకాలజీ ప్రకారం "సమయాన్ని గౌరవించడం అంటే, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడమే". ఇది మీ వ్యక్తిత్వ వికాసానికి వజ్రాయుధం లాంటింది. 1. The Psychology of Procrastinationచాలామంది "నాకు సమయం సరిపోవడం లేదు" అంటారు. ఇది అబద్ధం! అందరికీ 24 గంటలే ఉంటాయి. అసలు సమస్య 'సమయం' కాదు, 'ప్రాధాన్యత' (Priority).మీరు వాయిదా వేస్తున్నారంటే (Procrastination), అది బద్ధకం కాదు. అది ఆ పని పట్ల మీకు ఉన్న 'భయం' లేదా 'అభద్రత'. మీరు ఆ భయాన్ని దాటలేనప్పుడు, సమయాన్ని వృథా చేస్తూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు.2. మీ సమయం.. మీ ఆత్మగౌరవంSelf-Respect: మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకున్నప్పుడు, మీ పట్ల మీకే గౌరవం పెరుగుతుంది.Self-Disrespect: మీరు "ఈ పని చేస్తాను" అని చెప్పి, వాయిదా వేస్తే.. "నేను నా మాటను నిలబెట్టుకోలేను" అనే నెగటివ్ సిగ్నల్ మీ సబ్-కాన్షియస్ మైండ్‌కి వెళ్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని లోపల నుండి తినేస్తుంది.3. నిజమైన టైమ్ మేనేజ్మెంట్ట్రైనర్స్ "ఒక రోజులో 100 పనులు చేసేయ్, యంత్రంలా పని చెయ్" అని చెప్తారు. ఇది మీకు స్ట్రెస్ ఇస్తుంది. మీరు 10 పనులు చేయడం కాదు, మీ జీవితానికి ముఖ్యమైన 1 పని చేయడం ముఖ్యమని సైకాలజీ చెప్తుంది. 'Busy'గా ఉండటం వేరు, 'Productive'గా ఉండటం వేరు.4. మీ సమయాన్ని మీరు ఎలా ఓన్ చేసుకోవాలి?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ సమయాన్ని మీరు గౌరవించడానికి మూడు స్టెప్స్. Step 1: వాయిదా అలవాటును బ్రేక్ చేయండివాయిదా వేయడానికి గల కారణాన్ని వెతకండి. అది భయమా? పర్ఫెక్షనిజమా? ఆ భయాన్ని 'Break' చేయండి. "పని పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు, కానీ పూర్తవ్వాలి" అని మీ మైండ్‌ని ప్రోగ్రామ్ చేయండి.Step 2: The Priority Boxమీ పనులను ఇలా విభజించండి.ముఖ్యమైనవి & అత్యవసరమైనవి: ఇవి వెంటనే పూర్తి చేయాలి.ముఖ్యమైనవి కానీ అత్యవసరం కానివి: వీటికి మీరు సమయాన్ని 'Build' చేయాలి. ఇవే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మిగతా వాటిని తగ్గించండి.Step 3: Presenceసమయాన్ని గౌరవించడం అంటే, పని చేస్తున్నప్పుడు ఆ పనిలోనే లీనమైపోవడం. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. మీ సమయం మీ చేతుల్లో ఉన్నప్పుడు, మీరు ప్రపంచాన్ని శాసించగలరు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ సమయం ఎక్కడికి వెళ్తోంది?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.నిన్నటి రోజున మీరు వృథా చేసిన రెండు గంటలు ఎక్కడ వెచ్చించారు?ఆ రెండు గంటల్లో మీరు మీ లక్ష్యం కోసం ఏమైనా చేసి ఉంటే ఏమయ్యేది?మీరు మీ సమయానికి మీరే యజమాని అని ఈ రోజు అంగీకరిస్తున్నారా?సమయమే మీ నిజమైన ఆస్తి!బ్రో, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే ఆయుష్షు తగ్గుతుంది. మీ సమయాన్ని ఎవరికీ, దేనికీ చౌకగా అమ్మకండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, అప్పుడు ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది."Time is the most valuable thing a man can spend."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..) -
సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..
మనుషులతో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. మనం ఎప్పుడూ 'మన' కోణం నుండే ప్రపంచాన్ని చూస్తాం. అందుకే గొడవలు, అపార్థాలు వస్తాయి. కానీ, నిజమైన వ్యక్తిత్వ వికాసం సహానుభూతి (empathy)లో ఉంటుంది. ఇది మీ పర్సనాలిటీని ఒక అసాధారణమైన స్థాయికి తీసుకెళ్తుంది. ఎంపతీ ఉన్న వ్యక్తి ఎదుటివారి దృష్టిని అర్థంచేసుకుని (Walking in their shoes), వారు ఏమనిపిస్తుందో ఆలోచించగలడు. ఇదే మీకు దొరికే అత్యంత శక్తివంతమైన సామాజిక ఆయుధం.1. Sympathy vs EmpathySympathy (జాలి): ఎదుటివారిని చూసి బాధపడటం. ఇది పైపైన ఉంటుంది.Empathy (సహానుభూతి): ఎదుటివారి బాధను, ఆనందాన్ని లోతుగా అనుభూతి చెందడం.ప్రఖ్యాత సైకాలజిస్ట్ కార్ల్ రోజర్స్ ప్రకారం, ఎంపతీ అంటే ఎదుటివ్యక్తిపై ఎలాంటి తీర్పులు ఇవ్వకుండా (Non-judgmental) వారిని అర్థం చేసుకోవడం. ఇది ఒక 'సూపర్ పవర్' ఎందుకంటే, ప్రపంచంలో ఎవరూ తమని అర్థం చేసుకునే వ్యక్తిని వదులుకోరు.2. ఇది ఒక సూపర్ పవర్ ఎలా అవుతుంది?మీరు ఎంపతీని పెంచుకుంటే మీకు కలిగే లాభాలు.Influence: మీరు ఎదుటివారిని డామినేట్ చేయకుండానే, వారి మనసు గెలుచుకోగలరు. మీ మాటలకు, మీ ప్రవర్తనకు ఒక ప్రత్యేకమైన విలువ వస్తుంది.Conflict Resolution: గొడవలు పడే వ్యక్తుల మధ్య మీరు ఉంటే, మీరు వారిద్దరి కోణాన్ని అర్థం చేసుకుని, సులభంగా పరిష్కరించగలరు.Emotional Intelligence: మీ EQ ఆకాశాన్ని తాకుతుంది. ఎదుటివారికి మీరు ఇచ్చే 'అర్థం చేసుకునే అవకాశం' వారికి ఒక గొప్ప ఊరటనిస్తుంది.3. నిజమైన ఎంపతీట్రైనర్స్ "ఎదుటివారిని ఎలా మానిప్యులేట్ చేయాలో నేర్చుకో" అని చెప్తారు. ఇది మీకు అశాంతిని మిగులుస్తుంది. "ఎదుటివారికి మీరు ఇచ్చే గౌరవం, మీకున్న హృదయ విశాలతను పెంచుతుంది" అని సైకాలజీ చెప్తుంది. ఎంపతీ అనేది ఒక 'హార్ట్ సెంట్రిక్' పవర్, ఇది మిమ్మల్ని మనిషిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది.4. ఎంపతీని ఎలా బిల్డ్ చేయాలి?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ సూపర్ పవర్‌ను ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం:Step 1: జడ్జిమెంట్ బ్రేక్ చేయండిఎదుటి వ్యక్తిని చూడగానే "వీడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?" అని జడ్జ్ చేయడం మానేయండి. ఆ జడ్జిమెంట్ మీ మెదడులో పడితే, ఆ వ్యక్తిని అర్థం చేసుకునే అవకాశం పోతుంది. ఈ అహంకారాన్ని 'Break' చేయండి.Step 2: లిజనింగ్ స్పేస్వారు మాట్లాడుతున్నప్పుడు, మీ సమాధానం గురించి కాకుండా, వారు ఆ మాట ఎందుకు అంటున్నారో అని ఆలోచించండి. వారు ఏదైనా అంటున్నప్పుడు "నీకు అలా అనిపించడానికి కారణం ఏంటి?" అని అడగండి. ఇది మీకు వారి మనసులో ఒక స్థానాన్ని 'Build' చేస్తుంది.Step 3: యూనివర్సల్ కనెక్షన్ప్రతి వ్యక్తిలోనూ ఒక గాయం, ఒక ఆశ, ఒక భయం ఉంటాయి. ఎదుటివారిని చూసినప్పుడు వారి 'ముసుగు'ను కాకుండా, వారిలోని 'మనిషి'ని చూడటం మొదలుపెడితే, మీరు ఒక యూనివర్సల్ స్థాయికి చేరుకుంటారు. ఇదే 'Beyond' స్టేజ్.5. ఒక పరీక్ష!ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకు నచ్చని వ్యక్తిని ఎంచుకోండి.ఆ వ్యక్తి స్థానంలో ఉండి, తన బాధను, తన కష్టాలను ఆలోచించడానికి ప్రయత్నించండి.మీకు అప్పుడూ కోపం వస్తోందా? లేక ఒక రకమైన అర్థం చేసుకునే భావం కలుగుతోందా?ప్రపంచం మీకు మిత్రులుగా మారుతుంది!బ్రో, ప్రపంచం లోని సమస్యలన్నీ మాయమవ్వాలంటే ఎంపతీ ఒక్కటే మార్గం. మీరు ఎంపతీని వాడినప్పుడల్లా మీరు ఎదుటివారిని గెలవడమే కాదు, మీ మనసును విస్తరించుకుంటున్నారు. ఇదే అసలైన లెగసీ!"Empathy is a bridge that connects the heart of one person to another."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మీ మాట..మీ బాట) -
మీ మాట… మీ బాట
మన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపించే అతిపెద్ద సాధనం-'కమ్యూనికేషన్' (Communication). చాలామంది ఏమనుకుంటారంటే, కమ్యూనికేషన్ అంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడటం లేదా ఎదుటివారిని బురిడీ కొట్టించడం. కానీ అసలైన కమ్యూనికేషన్ అంటే ఒక ఆత్మ నుంచి మరొక ఆత్మకు వారధి నిర్మించడం.కమ్యూనికేషన్ అనేది కేవలం సమాచార మార్పిడి కాదు, అది ఒక మనిషి మరొక మనిషిని అర్థం చేసుకునే పద్ధతి. మీరు ఎలా మాట్లాడుతున్నారో, మీ వ్యక్తిత్వం ఎలా ఉందో అది ప్రపంచానికి చెబుతుంది. అందుకే, "మీ మాట.. మీ బాట". మీరు మాట్లాడే విధానమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.1. The Three-Layered Modelకమ్యూనికేషన్ అంటే కేవలం మనం వాడే పదాలు మాత్రమే కాదు. దీనికి మూడు పొరలు ఉంటాయి.పదాలు (7%): మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా తక్కువ ప్రభావం చూపుతుంది.స్వరం/టోన్ (38%): మీరు ఎలా మాట్లాడుతున్నారు? (కోపంగానా? ఆవేశంగానా? ఆప్యాయంగానా?) అనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది.బాడీ లాంగ్వేజ్ (55%): మీ కళ్ళు, మీ చేతులు, మీ నడక, మీ నిలబడే విధానం.. ఇవే అసలైన భాష.2. కమ్యూనికేషన్ అడ్డంకులు మనం ఎదుటివారిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతాం? ఎందుకు గొడవలు అవుతాయి?Judgmental Listening: అవతలి వ్యక్తి మాట్లాడుతుంటే, మనం మన మనసులో సమాధానాలు వెతుకుతాం. ఇది వారధిని కూల్చేస్తుంది.డిఫెన్సివ్ మోడ్: మనం ఎప్పుడూ మనల్ని మనం సమర్థించుకోవడానికి చూస్తాం, ఎదుటివారి పాయింట్ వినం.స్పష్టత లేకపోవడం: మనకు ఏం కావాలో మనకే స్పష్టత లేనప్పుడు, ఎదుటివారికి ఎలా చెప్తాం?3. నిజమైన కమ్యూనికేషన్మోటివేషన్ "ఎదుటివారిని ఇంప్రెస్ చెయ్, గొప్పగా మాట్లాడు" అని చెప్తుంది. సైకాలజీ (Active Listening) "ఎదుటివారిని అర్థం చేసుకో, వారు ఏమనుకుంటున్నారో ఫీలవ్వడం మొదలుపెట్టు" అని చెప్తుంది. నిజమైన లీడర్ మాట్లాడటం కంటే, వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు.4. వారధిని నిర్మించడం సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు) -
చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు
చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే అనుకుంటారు. కానీ, అసలైన విప్లవం చిన్న చిన్న అలవాట్లలోనే ఉంది. అవి మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ఇటుకలని జేమ్స్ క్లియర్ (James Clear) అంటాడు.మనం చేసే ప్రతి పనికి, మనకు ఒక 'ఐడెంటిటీ' (Identity) ఉంటుంది. మీరు రోజూ చదివితే మీరు 'రీడర్' అవుతారు. మీరు రోజూ వ్యాయామం చేస్తే మీరు 'అథ్లెట్' అవుతారు. మన పర్సనాలిటీ అనేది మనం రోజూ చేసే పనుల మొత్తమే. అయితే, కొత్త అలవాట్లను మొదలుపెట్టడం చాలా కష్టం. అందుకే, Habit Stacking అనే టెక్నిక్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది.1. Habit Stacking అంటే ఏంటి?మీకు ఇప్పటికే అలవాటుగా ఉన్న ఒక పాత పనిని (Anchor Habit), కొత్తగా మీరు చేయాలనుకుంటున్న పనితో కలిపి (Stack) చేయడం.పాత అలవాటు (Anchor): కాఫీ తాగడం, పళ్ళు తోముకోవడం, బాత్రూమ్కి వెళ్లడం.కొత్త అలవాటు (New Habit): పుస్తకం చదవడం, మెడిటేషన్, ప్లానింగ్.ఉదాహరణకు, "నేను కాఫీ తాగాక, వెంటనే 5 నిమిషాలు నా గోల్స్ రాసుకుంటాను" అని నిర్ణయించుకుంటారు. ఇక్కడ 'కాఫీ తాగడం' అనేది పాత అలవాటు, 'గోల్స్ రాయడం' అనేది కొత్త అలవాటు. దీనివల్ల మీరు కొత్తగా ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పాతది దానంతట అదే మిమ్మల్ని కొత్త పనికి తీసుకెళ్తుంది.2. పర్సనాలిటీకి ఇది ఎందుకు కీలకం?ఒక రోజులో లేదా ఒక వారంలో లేదా ఒక నెలలో నా పర్సనాలిటీ మారిపోవాలనే లక్ష్యం పెట్టుకుంటే మెదడు భయపడుతుంది. అదే చిన్న అలవాట్లతో మనం మెదడుకు తెలియకుండానే గొప్ప మార్పులను తీసుకొస్తాం.Consistency: ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచుతుంది.Compound Effect: చిన్న అలవాట్లు రోజులు గడిచేకొద్దీ పెద్ద రిజల్ట్స్‌ని ఇస్తాయి.Self-Identity: "నేను ప్రతిరోజూ 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాను" అని మీ మైండ్ నమ్మినప్పుడు, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.3. మోటివేషన్ మాయ vs సైకలాజికల్ సిస్టమ్స్"రేపటి నుండి రోజూ రెండు గంటలు చదువుతాను" అనుకోవడం మోటివేషన్. కానీ రెండు రోజుల్లో ఆపేస్తారు"నేను ప్రతిరోజూ పడుకునే ముందు 1 పేజీ చదువుతాను" అని చిన్నదిగా మొదలుపెట్టడం అలవాటు చేసుకోండి. అలవాటు అనేది 'గోల్' కాదు, అది ఒక 'సిస్టమ్'.4. మీ 'Habit Stack' ని బిల్డ్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీకి కావాల్సిన స్టాక్ ఇది.Step 1: చెడు అలవాట్లను బ్రేక్ చేయండిముందుగా మీకు ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయండి. ఉదాహరణకు, నిద్రలేవగానే ఫోన్ చూడటం. దానికి బదులుగా ఒక మంచి హ్యాబిట్ స్టాక్ పెట్టండి.Step 2: మీ స్టాక్ ని డిజైన్ చేయండిమీ డైలీ రొటీన్లో ఈ మూడు స్టాక్స్‌ను ప్రయత్నించండి:ఉదయం: "నేను లేవగానే, ఒక గ్లాసు నీళ్లు తాగి, రెండు నిమిషాలు నా పర్సనాలిటీ లక్ష్యం గురించి ఆలోచిస్తాను."మధ్యాహ్నం: "నేను లంచ్ చేశాక, ఒక పేజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం చదువుతాను."రాత్రి: "నేను పడుకునే ముందు, రోజంతా ఏం నేర్చుకున్నానో ఒక డైరీలో రాస్తాను."Step 3: ఆటో-పైలట్ పర్సనాలిటీఒక్కసారి ఈ స్టాక్స్ ఆటోమేటిక్ అయిపోతే, మీ వ్యక్తిత్వం దానంతట అదే మారుతుంది. అప్పుడు మీరు ఆలోచించక్కర్లేదు, మీ అలవాట్లే మిమ్మల్ని గెలిపిస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.5. ఈరోజు మీరు ఏ స్టాక్ మొదలుపెడతారు?ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకున్న ఒక మంచి పాత అలవాటుని గుర్తించండి (ఉదా: టీ తాగడం).దానికి జత చేయాల్సిన ఒక చిన్న కొత్త అలవాటుని ఎంచుకోండి (ఉదా: రెండు నిమిషాల ప్రార్థన లేదా ప్లానింగ్).వచ్చే ఏడు రోజులు దీన్ని కచ్చితంగా చేయండి.మీ అలవాట్లే మీ వారసత్వం!బ్రో, ఒక మహా వృక్షం చిన్న విత్తనం నుండే మొదలవుతుంది. మీ పర్సనాలిటీ కూడా అంతే. చిన్న చిన్న అలవాట్లే రేపు మీ లెగసీ (Legacy) గా మిగిలిపోతాయి. గొప్ప వ్యక్తులు గొప్పగా ఉండటం వల్ల గొప్పవారు కాలేదు, వారు చేసే పనులు గొప్పవి కాబట్టి గొప్పవారు అయ్యారు."We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit." : Aristotleసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!) -
అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అందరినీ మెప్పించడం లేదా అందరినీ ఎదిరించడమని చాలామంది అపోహపడుతుంటారు. మీరు గమనిస్తే, ఆఫీసులోనో లేదా కుటుంబంలోనో కొందరు వ్యక్తులు ఎప్పుడూ అందరినీ ప్లీజ్ చేస్తూ ఉంటారు, కొందరు మాత్రం ఎప్పుడూ గొడవ పడుతుంటారు. ఈ రెండూ సరైన పద్ధతులు కావు. అసలైన పర్సనాలిటీ గ్రోత్ 'Assertiveness' (నిశ్చయత) లో ఉంది. ఇది ఎదుటివారిని గౌరవిస్తూనే, మన హక్కులను మనం కాపాడుకోవడం.1. మూడు రకాల ప్రవర్తనలు (The Behavioral Spectrum)సైకాలజీలో మనం మనుషులతో ప్రవర్తించే విధానాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.Passive (అణగిపోవడం): ఎదుటివారు ఏమనుకుంటారో అని మీ అభిప్రాయాలను దాచుకోవడం. దీనివల్ల మీ ఆత్మగౌరవం తగ్గుతుంది, దీనివల్ల మీకు లేనిపోని ఒత్తిడి పెరుగుతుంది.Aggressive (అతిగా అరవడం): ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం, డామినేట్ చేయడం. దీనివల్ల మనుషులు మీకు దూరమవుతారు, మీ చుట్టూ ఉన్నవారు భయపడతారు తప్ప గౌరవించరు.Assertive (The Golden Mean): "నా అభిప్రాయం ముఖ్యం, అలాగే నీ అభిప్రాయం కూడా ముఖ్యం." ఇది ఎదుటివారిని హర్ట్ చేయకుండా మీ బౌండరీని మీరు సెట్ చేసుకోవడం.2. Assertiveness ఎందుకు అవసరం? Assertiveness అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ స్కిల్ మాత్రమే కాదు, అది మీ ఆత్మగౌరవానికి (Self-Respect) ప్రతిరూపం.మీరు 'Assertive' గా ఉన్నప్పుడు, మీ నిర్ణయాలకు ఒక విలువ ఉంటుంది.మీరు చెప్పే 'Yes' కు ఒక గౌరవం, చెప్పే 'No' కు ఒక క్లారిటీ ఉంటుంది.అతిగా అరవాల్సిన అవసరం లేదు, అణగిపోవాల్సిన అవసరం అస్సలు లేదు.3. మోటివేషన్ మాయ vs నిజమైన సైకాలజీట్రైనర్స్ "ఎవ్వరినీ వదిలిపెట్టకు, సింహంలా ఉండు, గర్జించు" అని చెప్తారు. ఇది మీకు అగ్రెసివ్ ట్యాగ్‌ను ఇస్తుంది. కానీ సైకాలజీ మీ గొంతును కాదు, మీ పాయింట్‌ని బలంగా చెప్పమంటుంది. కోపం తగ్గించి, స్పష్టతను పెంచుకోమంటుంది. నిజమైన నాయకుడు అరిచి పని చేయించడు, తన క్లారిటీతో పని చేయిస్తాడు.4. Assertive గా ఉండటం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ ఆర్ట్‌ను ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం.Step 1: మొహమాటాన్ని బ్రేక్ చేయండిమొహమాటం అనేది ఒక జబ్బు. "నేను వాళ్ళని ఏమీ అనకూడదు" అనే ఆలోచనని బ్రేక్ చేయండి. మీరు ఎదుటివారికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే, వారు చెప్పే ప్రతి తప్పుకు తల ఊపడం కాదు. మీ బౌండరీలను దాటినప్పుడు సున్నితంగా, బలంగా 'No' చెప్పడం ప్రాక్టీస్ చేయండి.Step 2: Build 'I' స్టేట్మెంట్స్ఇతరులను విమర్శించేటప్పుడు "నువ్వు తప్పు చేస్తున్నావు" అనకుండా, "నీ వల్ల నాకు ఇలా ఇబ్బందిగా ఉంది" (I feel... when you...) అని చెప్పండి. ఇది ఎదుటివారిని డిఫెన్సివ్ మోడ్‌లో పడకుండా, మీ పాయింట్‌ని అర్థం చేసుకునేలా చేస్తుంది. దీన్నే మనం బిల్డ్ చేసుకోవాలి.Step 3: ప్రశాంతతే బలంమీరు ఏ పరిస్థితిలో అయినా ప్రశాంతంగా, క్లారిటీతో మాట్లాడగలిగినప్పుడు, అది మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. మీరు ఎవరినీ డామినేట్ చేయరు, ఎవరూ మిమ్మల్ని డామినేట్ చేయలేరు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీరు ఎక్కడ ఉన్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు నిన్నటి రోజున ఎవరికైనా ఇష్టం లేకపోయినా 'సరే' అని అన్నారా? (Passive)మీరు ఎవరి మీదైనా అనవసరంగా కోప్పడ్డారా? (Aggressive)ఏ సందర్భంలో మీరు మీ పాయింట్‌ను గౌరవంగా చెప్పగలిగారు? (Assertive)మీ గొంతుకే మీ ఆయుధం!బ్రో, మీ గొంతులో ఉండేది కేవలం శబ్దం మాత్రమే కాదు, మీ అస్తిత్వం (Identity). దాన్ని అణచివేయనివ్వకండి, అలాగని దాన్ని ఎదుటివారిపైకి గర్జనలా వాడకండి. ఒక స్పష్టమైన, ప్రశాంతమైన, దృఢమైన గొంతుకను డెవలప్ చేసుకోండి."Assertiveness is not about what you say, but how you say it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం) -
మైండ్ ఫుల్నెస్.. బిజీ షెడ్యూల్లో ప్రశాంతతను వెతుక్కోవడం
నేటి ఆధునిక కార్పొరేట్ ఉద్యోగి జీవితం ఒక నిరంతర పరుగుపందెం. ఉదయం నిద్రలేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు టార్గెట్లు, డెడ్లైన్లు, ఈమెయిల్ నోటిఫికేషన్లు, ఫోన్ కాల్స్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పనులు మిమ్మల్ని చుట్టుముడుతుంటాయి. ఈ ఉరుకుల పరుగుల మధ్య మీ మెదడు నిరంతరం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ లేదా గతం గురించి అసహనంతో ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో యంత్రంలా మారిపోతాం. ఇలాంటి సందర్భంలో మైండ్‌ఫుల్‌నెస్ (Mindfulness) అనేది ఒక విలాసం కాదు, అది అత్యవసరమైన జీవన నైపుణ్యం.మైండ్‌ఫుల్‌నెస్ అంటే కేవలం ధ్యానం కాదు..చాలామంది మైండ్‌ఫుల్‌నెస్ అంటే కళ్లు మూసుకొని గంటల తరబడి ధ్యానం చేయడం అనుకుంటారు. అది తప్పు. మైండ్‌ఫుల్‌నెస్ అంటే 'ప్రస్తుత క్షణంలో పూర్తిగా నిమగ్నమై ఉండటం'. మీరు కాఫీ తాగుతున్నప్పుడు కేవలంకాఫీ రుచిని, దాని సువాసనను మాత్రమే అనుభవిస్తూ తాగడం. ఆఫీసులో మీటింగ్ జరుగుతున్నప్పుడు, పక్కాగా ఆ మీటింగ్ మీదే దృష్టి పెట్టడం. గతంలోని అపజయాల గురించి గానీ, భవిష్యత్తులోని భయాల గురించి గానీ ఆలోచించకుండా, ఆ క్షణంలో మీరు చేసే పనిని పూర్తిగా ఆస్వాదించడమే మైండ్‌ఫుల్‌నెస్.బిజీ షెడ్యూల్లో మైండ్‌ఫుల్‌నెస్‌ను ఎలా పాటించాలి?మీకు గంటల కొద్దీ సమయం లేకపోయినా, పద్ధతిగా ప్రయత్నిస్తే బిజీ షెడ్యూల్లోనే ప్రశాంతతను పొందవచ్చు.మైండ్‌ఫుల్ బ్రీతింగ్: ఆఫీసులో ప్రతి గంటకు ఒకసారి కేవలం ఒక నిమిషం పాటు పని ఆపేయండి. మీ కళ్లు మూసుకొని, మీ శ్వాస గాలి లోపలికి వెళ్లడం, బయటకు రావడం మీద దృష్టి పెట్టండి. అది మీ నాడీ వ్యవస్థకు ఒక 'రీసెట్ బటన్'లా పనిచేస్తుంది.ఏకకాలంలో ఒకటే పని: మల్టీ-టాస్కింగ్ అనేది మెదడును త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఒకే సమయంలో పది పనులు చేసే ప్రయత్నం చేయడం మానేసి, ప్రస్తుతం చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. దీనివల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది, మానసిక అలసట తగ్గుతుంది.ఆహారపు అలవాట్లు: లంచ్ బ్రేక్ సమయంలో ఫోన్ చూస్తూ తినడం మానేయండి. మీరు తినే ఆహారం రుచి, రంగు, వాసనను గమనిస్తూ తినండి. ఇది మీ మనసును ఆఫీసు ఒత్తిడి నుండి ఆ క్షణానికి తీసుకువస్తుంది.నడకలో ధ్యానం (Walking Meditation): ఆఫీసు కారిడార్‌లో నడుస్తున్నప్పుడు లేదా పార్కింగ్ ఏరియాకు వెళ్తున్నప్పుడు, ప్రతి అడుగును గమనిస్తూ నడవండి. మీ పాదాలు నేలను తాకడం, మీ చుట్టూ ఉన్న గాలిని గమనించడం చేయండి. ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్.నా దగ్గరికి వచ్చిన ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ (పేరు, వివరాలు మార్చాను) తన బిజీ షెడ్యూల్ వల్ల ప్రతిరోజూ పానిక్ అటాక్స్కు గురయ్యేవాడు. అతను ప్రతి రోజూ కనీసం 50 కాల్స్ అటెండ్ చేసేవాడు. మేము అతనికి '3-సెకన్ల రూల్' నేర్పించాం. ఫోన్ మోగగానే వెంటనే ఎత్తకుండా, 3 సెకన్లు ఆగి, రెండు సార్లు దీర్ఘ శ్వాస తీసుకున్న తర్వాతే ఫోన్ ఎత్తడం అలవాటు చేసుకున్నాడు. ఆ చిన్న మార్పు అతని మొత్తం రోజువారీ అనుభవాన్ని మార్చేసింది. ఆ మూడు సెకన్లు అతనికి ఎంతో ప్రశాంతతను ఇచ్చాయి.ఎందుకు మైండ్‌ఫుల్‌నెస్ అవసరం?👉ప్రశాంతంగా ఉన్న మెదడు సంక్లిష్టమైన నిర్ణయాలను తప్పులు లేకుండా తీసుకోగలదు.👉మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వారి వైపు శ్రద్ధ చూపిస్తే, సంబంధాలు మెరుగుపడతాయి.👉కోపం, భయం వంటి భావోద్వేగాలను మీ మెదడు పసిగట్టి, వాటికి ప్రతిస్పందించేలా చేస్తుంది.మీ కోసం ఒక చిన్న టాస్క్...ఈ రోజు మీరు పని చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న శబ్దాలను గమనించండి. ఏసీ శబ్దం, కీబోర్డ్ టైపింగ్ శబ్దం, పక్కవారి మాటలు.. కేవలం గమనించండి, వాటికి రియాక్ట్ అవ్వకండి. మీరు గమనించిన క్షణమే మీరు మైండ్‌ఫుల్‌గా ఉన్నట్టు లెక్క. జీవితం అంటే మీరు ఎక్కడికో వెళ్లడం కాదు, మీరు ఉన్న చోటే ఎలా జీవిస్తున్నారో అన్నదే ముఖ్యం. బిజీగా ఉండటం అంటే కష్టపడటం మాత్రమే కాదు, మీకంటూ ఒక ప్రశాంతమైన స్థానాన్ని మెదడులో నిర్మించుకోవడం. కాస్త ఆగి, శ్వాస తీసుకోండి.. ప్రపంచం ఎక్కడికీ పారిపోదు, కానీ మీ ప్రశాంతత మీతోనే ఉంటుంది.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్‌సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, గెలుస్తూ ఉండటం అనుకుంటారు. కానీ నిజమైన పర్సనాలిటీ గ్రోత్.. మీరు కింద పడ్డప్పుడు ఎంత వేగంగా లేచి నిలబడతారో, అందులోనే ఉంది. సైకాలజీలో దీనినే 'Resilience' అంటారు.1. Resilience అంటే ఏమిటి?మనిషి జీవితంలో ఎప్పుడూ 'హ్యాపీగా' ఉండలేడు. ఓటములు, అవమానాలు, గాయాలు అనేవి రాక మానవు. కానీ, అక్కడే ఆగిపోకుండా, మనల్ని మరింత పవర్‌ఫుల్‌గా మలిచే శక్తి Resilience (పునరుద్ధరణ శక్తి).జీవితం అనేది ఒక సముద్రంలాంటిది, అలలు (సమస్యలు) వస్తూనే ఉంటాయి. రెసిలియన్స్ అంటే అలలను ఆపడం కాదు, ఆ అలల మీద సర్ఫింగ్ చేయడం నేర్చుకోవడం. ఇది ఒక టాలెంట్ కాదు, ఇది మనం ప్రాక్టీస్ చేసి పెంచుకోవాల్సిన ఒక 'మజిల్' (Muscle).* Fixed Mindset: "నేను ఓడిపోయాను, నా వల్ల కాదు" అని అనుకోవడం.* Growth Mindset (Resilience): "నేను ఓడిపోయాను, కానీ ఇది ఒక లెసన్. దీన్నుండి నేను ఏం నేర్చుకున్నాను?" అని అనుకోవడం.2. The 3 Pillars of Resilienceఒక వ్యక్తి కింద పడ్డా తిరిగి లేవాలంటే, అతని మైండ్‌సెట్‌లో ఈ మూడు ఉండాలి.* Acceptance: "ప్రస్తుతం నా జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితి ఉంది" అని ఆ వాస్తవాన్ని భయపడకుండా అంగీకరించడం.* Purpose: మీరు ఎందుకు బ్రతకాలి? మీ లక్ష్యం ఏంటి? మీకంటూ ఒక 'ఎందుకు' (Why) బలంగా ఉంటే, మీరు 'ఎలాంటి' (How) పరిస్థితినైనా దాటగలరు.* Adaptability: పాత పద్ధతులు పని చేయనప్పుడు, మూర్ఖంగా వాటినే పట్టుకోకుండా, కొత్త మార్గాలను వెతకడం.3. మోటివేషన్ మాయ vs నిజమైన దృఢత్వంమోటివేషన్ "ఎప్పుడూ గెలుస్తూనే ఉండు" అని చెప్తుంది. ఇది ఒక అబద్ధం, ఎందుకంటే గెలవకపోతే వారు కుంగిపోతారు.రెసిలియన్స్ "ఓడిపోవడం సహజం, కానీ ఆ ఓటమికి నీ జీవితాన్ని అప్పగించకు" అని చెప్తుంది. రెసిలియన్స్ ఉన్న వ్యక్తికి ఓటమి ఒక 'ఎండ్' కాదు, ఒక 'ఎపిసోడ్' మాత్రమే.4. రెసిలియెంట్ మైండ్‌సెట్ బిల్డింగ్Genius Matrix మోడల్ ఉపయోగించి, మీరు కూడా ఒక 'అజేయమైన వ్యక్తి'గా ఎలా మారాలి?Step 1: భయం బంధనాలను బ్రేక్ చేయండిఓడిపోతే ఏమవుతుందో అన్న భయం, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం.. వీటిని 'Break' చేయండి. ఓటమిని అవమానంగా కాకుండా, ఒక 'డేటా పాయింట్' (Data Point) లా చూడండి. మీరు ఎంత ఎక్కువ ప్రయోగాలు చేస్తే, అంత ఎక్కువ డేటా మీకు దొరుకుతుంది.Step 2: పోరాట పటిమ (Build)మీ రెసిలియెన్స్ను ఒక మజిల్ లాగా బిల్డ్ చేయండి. చిన్న చిన్న సవాళ్లను తీసుకోవడం ద్వారా మీ మెదడును ట్రైన్ చేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు "ఎందుకు నాకు ఇలా జరిగింది?" అని కాకుండా, "దీన్ని నేను ఎలా అధిగమించగలను?" అని అడగండి. మీ మైండ్‌ని 'Solutions' వైపు 'Build' చేయండి.Step 3: స్టాయిక్ మాస్టరీ ( Beyond)పరిస్థితులు మీ కంట్రోల్లో లేనప్పుడు, మీరు వాటికి ఇచ్చే 'రియాక్షన్' మీ కంట్రోల్లో ఉంటుంది. తుఫానులో కూడా ప్రశాంతంగా ఉండటమే 'Beyond' స్టేజ్. దీంతో మీరు అజేయంగా మారుతారు.5. మీ రెసిలియన్స్ స్కోర్ ఎంత?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.* మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతి పెద్ద ఓటమి ఏంటి?* ఆ ఓటమి మీకు నేర్పిన ఒకే ఒక్క ముఖ్యమైన పాఠం ఏంటి?* ఇప్పుడు ఆ ఓటమిని మీరు గర్వంగా (ఒక అనుభవంగా) చెప్పుకోగలరా?కింద పడటం ఒక కళ!బ్రో, కింద పడటం వల్ల కాదు, పడి అక్కడే ఉండిపోవడం వల్ల మీ వ్యక్తిత్వం దెబ్బతింటుంది. కింద పడి, దుమ్ము దులుపుకుని, నవ్వుతూ లేచి నిలబడటమే ఒక కళ (Art of Resilience). మీరు ఎంత బలంగా దెబ్బ తింటే, అంత బలంగా తిరిగి రాగలరు. ఇదే మీ Real Personality కి అసలైన కొలమానం."The greatest glory in living lies not in never falling, but in rising every time we fall." -Nelson Mandela-సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
మీ మైండ్ మీకు అబద్ధాలు చెప్తోందా?
మన మెదడు ఒక అద్భుతమైన యంత్రం, కానీ ఒక్కోసారి అది మనకే విరుద్ధంగా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే, మన మనసు వాస్తవాలను వక్రీకరించి మనకు అబద్ధాలు చెప్తుంది. దీన్నే సైకాలజీలో "Cognitive Distortions" (ఆలోచనా వైకల్యాలు) అంటారు. వీటిని గుర్తించి, అదుపులో ఉంచుకోవడం అంటే.. మీ మెదడులో సాగుతున్న 'తప్పుడు కోడింగ్'ను సరిచేయడమే.చాలామందికి ఒక అలవాటు ఉంటుంది—ఒక చిన్న తప్పు జరిగితే, "నేను ఎప్పుడూ తప్పులే చేస్తాను" అని అనుకుంటారు. లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని పలకరించకపోతే, "అతనికి నా మీద కోపం, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు" అని భ్రమపడతారు. ఇవన్నీ నిజాలు కావు, ఇవన్నీ మీ మెదడు సృష్టించిన భ్రమలు. ఆరోన్ బెక్ (Aaron Beck) అనే సైకాలజిస్ట్ ఈ Cognitive Distortions అనే కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు.1. మన మెదడు ఆడుతున్న 3 పెద్ద అబద్ధాలుమీ మెదడు రోజువారీ జీవితంలో మిమ్మల్ని మోసం చేసే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:All-or-Nothing Thinking: "నేను ఒక పనిని పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే నేను ఫెయిల్యూర్" అని అనుకోవడం. అంటే, మధ్యేమార్గం (Grey area) ఉండదు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.Catastrophizing: చిన్న సమస్య జరిగినా.. "ఇక నా జీవితం అయిపోయింది, అంతా నాశనం" అని అతిగా ఊహించుకోవడం.Mind Reading: "ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు" అని భ్రమపడటం. వాస్తవానికి, వారు మీ గురించి అస్సలు ఆలోచించడం లేదు.2. ఈ అబద్ధాలు మీ పర్సనాలిటీని ఎలా నాశనం చేస్తాయి?ఈ 'డిస్టార్షన్స్' వల్ల మీరు నిరంతరం ఒత్తిడిలో ఉంటారు.మీరు ఎప్పుడూ తప్పు చేస్తానేమోనని భయపడుతుంటారు (Anxiety).ఎదుటివారి గురించి తప్పుడు అభిప్రాయాలు పెంచుకుని రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటారు.అతిగా ఆలోచించి (Overthinking) మీ శక్తిని కోల్పోతారు.3. పాజిటివ్‌గా ఉంటే సరిపోదుట్రైనర్స్ "అన్నీ పాజిటివ్‌గానే చూడు" అని చెప్తారు. కానీ, అబద్ధం చెప్పే మెదడుకు 'పాజిటివ్ థింకింగ్' కేవలం ఒక ప్లాస్టర్ లాంటిది. మార్కెట్ పాజిటివిటీని నమ్మమంటుంది.సైకాలజీ (CBT - Cognitive Behavioral Therapy) మీ మెదడు అబద్ధం చెప్తున్నప్పుడు దాన్ని పట్టుకుని, "ఇది నిజమేనా? దీనికి ఆధారం ఏంటి?" అని లాజిక్‌తో ప్రశ్నించమంటుంది. దీన్నే 'Reality Testing' అంటారు.4. మీ మైండ్ ని రీ-సెట్ చేసుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ డిస్టార్షన్స్ ని ఎలా అదుపు చేయాలో చూద్దాం.Step 1: అబద్ధాన్ని పట్టుకోండిమీ మైండ్ ఎప్పుడు నెగటివ్ ఆలోచనలను ఇస్తుందో, వెంటనే 'STOP' అని అనుకోండి. "నేను నా మెదడు చెప్పే అబద్ధాన్ని నమ్మను" అని గట్టిగా చెప్పండి. ఇది ఒక చిన్న 'Break'.Step 2: లాజికల్ ఛాలెంజ్మీ మైండ్ చెప్పిన నెగటివ్ ఆలోచనకు ఒక కోర్టు విచారణ పెట్టండి.* "నేను ఫెయిల్యూర్" అని మీ మెదడు చెప్తే.. "గతంలో నేను సాధించిన విజయాలు ఏంటి?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సాక్ష్యాలతో మీ మెదడు అబద్ధాన్ని ఖండించండి.Step 3: క్లారిటీ ఒక్కసారి మీ మెదడు అబద్ధాలు చెప్తోందని మీకు తెలిస్తే, మీరు ఇక వాటికి భయపడరు. మీ మైండ్ ఒక అద్దంలా మారుతుంది—అక్కడ వాస్తవాలు మాత్రమే కనిపిస్తాయి, అపోహలు కాదు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మైండ్ చెప్పే అబద్ధాల లిస్ట్ఈ రోజు ఒక చిన్న పని చేయండి.ఈ రోజు మీకు వచ్చిన అతి పెద్ద నెగటివ్ ఆలోచనను రాసుకోండి.ఆ ఆలోచన 'Distortion' (అబద్ధం) అని మీకు అనిపిస్తోందా?ఆ ఆలోచన నిజం కాదని నిరూపించే 3 వాస్తవాలను రాయండి.మీ మెదడుకి మీరు యజమాని!బ్రో, మీ మైండ్ ఒక సర్వెంట్ లాంటిది. కానీ అది ఒక్కోసారి యజమానిలా ప్రవర్తిస్తూ మీకు తప్పుడు సమాచారం ఇస్తుంది. దాన్ని నమ్మడం మానేసి, దాని మీద నిఘా పెట్టండి. మీ మెదడు చెప్పే ప్రతిదీ నిజం కాదు, అది కేవలం ఒక ఆలోచన (Thought) మాత్రమే.గుర్తుంచుకోండి, "Don't believe everything you think."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
మీ కలలు చెప్పే నిజాలు
మన నిద్రలో వచ్చే కలలు కేవలం పిచ్చి ఊహలు కావు, అవి మన Subconscious Mind మనతో మాట్లాడుతున్న భాష. సిగ్మండ్ ఫ్రాయిడ్ వీటిని Wish Fulfillment అని పిలిస్తే, కార్ల్ యుంగ్ Messages from the Psyche అని చెప్పారు.మనం మేల్కొని ఉన్నప్పుడు సమాజం కోసం ఒక ముసుగు (Mask) వేసుకుంటాం. కానీ నిద్రపోయినప్పుడు, ఆ ముసుగు తొలగిపోయి మన అసలైన భయాలు, కోరికలు, మరియు పరిష్కారం కాని సమస్యలు బయటకు వస్తాయి. మీ కలలు మీ పర్సనాలిటీకి ఒక 'రిఫ్లెక్షన్' లాంటివి. మీరు పదే పదే ఒకే రకమైన కలలు కంటున్నారంటే, మీ మనసు ఏదో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.1. ఫ్రాయిడ్ vs యుంగ్: కలల వెనుక ఉన్న సైకాలజీSigmund Freud ప్రకారం, మన కలలో వచ్చే ప్రతిదీ మన లోపల అణిచిపెట్టబడిన కోరికల ప్రతిరూపం. మనం పగలు బయటపెట్టలేని కోపాలు, ఆశలు అన్నీ కలల రూపంలో బయటపడతాయి.Carl Jung దీనిని ఇంకా లోతుగా చూశారు. కలలు మనలోని లోపాలను, మనం మర్చిపోయిన మన 'Shadow Self' (చీకటి కోణం) ను సరిదిద్దడానికి ప్రయత్నిస్తాయి. ఒక వ్యక్తికి పదే పదే ఎత్తు నుండి పడిపోతున్నట్లు కల వస్తుందంటే, అది అతను తన జీవితంలో నియంత్రణ (Control) కోల్పోతున్నాడని అర్థం.2. కలల్లో కనిపించే సింబల్స్ మీరు కలలను విశ్లేషించడం ద్వారా మీ పర్సనాలిటీలో ఉన్న బలాలు, బలహీనతలను తెలుసుకోవచ్చు.పారిపోవడం: ఇది మీ జీవితంలోని సమస్యల నుండి లేదా ఒక బాధ్యత నుండి మీరు పారిపోవాలని చూస్తున్నారని అర్థం. ఇది మీ 'Avoidant Personality' కి సంకేతం.పరీక్షలో ఫెయిల్ అవ్వడం: మీ పర్సనాలిటీలో మీకు 'పర్ఫెక్షనిస్ట్' భయం ఎక్కువగా ఉందని, ఎక్కడ తప్పు చేస్తానో అన్న ఆందోళన ఉందని అర్థం.నీటిలో మునిగిపోవడం: మీ ఎమోషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారని అర్థం. మీ Emotional Intelligence తక్కువగా ఉందని ఇది సూచిస్తుంది.3. "కలలు కనండి.. విజయం మీదే"మోటివేషనల్ స్పీకర్లు 'కలలు' అంటే కేవలం 'గోల్స్' అని చెప్తారు. కానీ సైకాలజీలో కలలు అంటే 'సెల్ఫ్-రిఫ్లెక్షన్'. కలలను కేవలం విజయం కోసం మెట్లుగా కాకుండా, మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దే 'గైడ్' లా చూడండి.4. కలలను మీ పర్సనాలిటీకి అద్దంగా మార్చుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ కలల నుండి మీరు నేర్చుకోవాల్సింది ఇదే.Step 1: కలల డైరీ రాయండిప్రతిరోజూ ఉదయం లేవగానే మీరు కన్న కలలను ఒక డైరీలో రాయండి. అది ఎంత పిచ్చిగా ఉన్నా సరే. ఆ కలలో మీకు కలిగిన 'ఎమోషన్' (భయమా? ఆనందమా? కోపమా?) ఏంటో గుర్తించండి. కలలోని సంఘటనల కంటే ఆ 'ఎమోషన్' చాలా ముఖ్యం. ఇది మీ పాత ప్రోగ్రామింగ్‌ను 'Break' చేసి, నిజమైన మీరు ఎవరో చూపిస్తుంది.Step 2: కలల వెనుక ఉన్న మూలాన్ని వెతకండిఆ కల మీ పగటిపూట జీవితానికి ఎలా కనెక్ట్ అయ్యి ఉందో విశ్లేషించండి. మీరు పగలు దేని గురించి భయపడుతున్నారో, అదే కలగా వస్తుంది. అక్కడ మీరు ఎక్కడ తగ్గుతున్నారో, దాన్ని మీ పర్సనాలిటీలో 'Build' చేయండి.Step 3: మాస్టరీఒక్కసారి మీ కలల భాష (Dream Language) మీకు అర్థమైతే, మీరు మీ సబ్-కాన్షియస్ మైండ్‌ను కూడా కంట్రోల్ చేయగలరు. అదే Lucid Dreaming కి పునాది. మీరు మీ అంతరాత్మతో నేరుగా సంభాషిస్తున్నప్పుడు, మీ వ్యక్తిత్వం ఒక 'హైయర్ లెవెల్' కి చేరుకుంటుంది.5. కలల విశ్లేషణఈ రోజు ఒక చిన్న పని చేయండి:* ఈ వారం మీకు వచ్చిన అతి ముఖ్యమైన కలని రాసుకోండి.* ఆ కలలో మీరు ఏ పాత్ర పోషించారు? (బాధపడేవారా? పోరాడేవారా? పారిపోయేవారా?)* మీ నిజ జీవితంలో మీరు కూడా ఆ పాత్రనే పోషిస్తున్నారా?కలలు మీ అంతరాత్మ ప్రతిబింబాలు!బ్రో, కలలు మనకు భవిష్యత్తును చెప్పవు, కానీ అవి మన వర్తమానాన్ని, మన అస్తిత్వాన్ని మనకు చూపిస్తాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేయకండి. మీరు ఎవరో తెలుసుకోవాలంటే, మీరు నిద్రపోయినప్పుడు మీ మనసు ఏం చెప్తుందో వినండి."The dream is the small hidden door in the deepest and most intimate sanctum of the soul."-Carl Jungసైకాలజిస్ట్ విశేష్Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Biology of Behavior: మీ హార్మోన్లు మీ వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తున్నాయి?) -
మీకు ఎప్పుడు కోపం వస్తుంది? ఎందుకు?
చాలామంది "నాకు కోపం రాదు, కానీ ఎవరైనా తప్పు చేస్తేనే కోపం వస్తుంది" అని అంటుంటారు. ఇది నిజం కాదు. నిజానికి, ఎదుటివారు చేసే తప్పు మీ మెదడులో ఉన్న ఒక పాత గాయాన్ని లేదా ఒక భయాన్ని తాకడం వల్లే మీకు కోపం వస్తుంది. మన వ్యక్తిత్వాన్ని శాసించే ఈ 'ఎమోషనల్ ట్రిగ్గర్స్'ను మనం ఈరోజు డీకోడ్ చేద్దాం.1. The Anatomy of a Triggerట్రిగ్గర్ అనేది ఒక వ్యక్తి, ఒక మాట, ఒక శబ్దం లేదా ఒక సంఘటన. అది మన సబ్-కాన్షియస్ మైండ్‌లోని ఒక పాత బాధను లేదా అభద్రతా భావాన్ని వెలికితీస్తుంది.* ఉదాహరణకు ఆఫీసులో మీ బాస్ మీ పనిని విమర్శించారనుకోండి. మీకు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు? అక్కడ ఆ పనిలోని తప్పు కంటే, మీ బాస్ మాట మిమ్మల్ని "నువ్వు అసమర్థుడివి" అని గుర్తుచేస్తోంది. ఆ 'అసమర్థత' అనే ఫీలింగ్ మీకు చిన్నప్పుడు స్కూల్ టీచర్ దగ్గర లేదా ఇంట్లో ఎదురై ఉండవచ్చు. అక్కడ బాస్ కాదు, మీలోని పాత గాయం ట్రిగ్గర్ అయ్యింది.2. ట్రిగ్గర్లను గుర్తించడం ఎలా?మనకు ట్రిగ్గర్ ఎప్పుడు అవుతుందో తెలియాలంటే, మన రియాక్షన్‌ను గమనించాలి.* Physical Signs: ట్రిగ్గర్ అయినప్పుడు ముందుగా మన బాడీ రియాక్ట్ అవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, దవడలు బిగుసుకుపోవడం లేదా కడుపులో కలత. ఇవి మొదలవ్వగానే, మీరు ఒక 'ట్రిగ్గర్ జోన్'లోకి వెళ్లారని అర్థం.* The Narrative: ఆ క్షణంలో మీ మైండ్ ఒక నెగటివ్ కథను అల్లుతుంది. "ఇతడు నన్ను తక్కువ చేస్తున్నాడు," "నాకు అన్యాయం జరుగుతోంది" అనే ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలే మిమ్మల్ని కోపంతో ఊగిపోయేలా చేస్తాయి.3. పది అంకెలు లెక్కపెడితే సరిపోదుమోటివేషనల్ స్పీకర్లు, ట్రైనర్స్... "కోపం వస్తే కళ్ళు మూసుకుని 10 వరకు లెక్కపెట్టు, అన్నీ మర్చిపో" అని చెప్తారు. ఇది కేవలం టెంపరరీ పరిష్కారం.కానీ మీలోని చీకటి కోణాలను (Shadows) మీరు అంగీకరించనంత వరకు ట్రిగ్గర్స్ మిమ్మల్ని శాసిస్తూనే ఉంటాయని సైకాలజీ చెప్తుంది. మీరు ఎవరిని ఎక్కువగా ద్వేషిస్తున్నారో, వారిలో మీకు నచ్చని లక్షణం మీలోనే ఎక్కడో దాగి ఉందేమో ఒక్కసారి ఆలోచించండి.4. ట్రిగ్గర్స్ ని అధిగమించడంGenius Matrix Hub ఫిలాసఫీ Break, Build, Beyond ప్రకారం, మీ ఎమోషనల్ రిమోట్ ని మీ చేతుల్లోకి తెచ్చుకోండి.Step 1: The Observer Stateట్రిగ్గర్ అయినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఆ క్షణంలో "నేను ఈ కోపానికి బానిసను కాదు, ఇది నా పాత గాయం" అని మిమ్మల్ని మీరు గమనించండి (Observer mode). ఆ క్షణికావేశాన్ని 'Break' చేయడమే మీరు చేయాల్సిన మొదటి పని.Step 2: Trigger Rewiringమీ ట్రిగ్గర్ను ఒక లెసన్‌లా మార్చుకోండి. "ఈ వ్యక్తి నన్ను ఎందుకు బాధపెట్టాడు?" అని కాకుండా, "నాలో ఏ భయం ఈ వ్యక్తి మాటతో బయటపడింది?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ విశ్లేషణ మీలో ఎమోషనల్ స్ట్రెంత్‌ని 'Build' చేస్తుంది.Step 3: Emotional Freedom ఒక్కసారి మీ ట్రిగ్గర్స్ మీకు అర్థమైతే, ఎవరూ మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు. విమర్శలు చేసినా, అవమానించినా మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇదే 'Beyond' స్టేజ్. ఇక్కడ మీరు మీ ఎమోషన్స్ కు మాస్టర్ గా ఉంటారు.5. మీ ఎమోషనల్ మ్యాప్ఈ రోజు ఒక చిన్న పని చేయండి.* ఈ వారం మీకు కోపం తెప్పించిన లేదా బాధపెట్టిన మూడు సందర్భాలను గుర్తు తెచ్చుకోండి.* ఆ సమయంలో మీ మనసులో మొదట వచ్చిన ఆలోచన ఏంటి? (అది భయమా? అవమానమా? తక్కువగా చూస్తున్నారనే ఫీలింగా?)* ఆ భావన మీ చిన్నప్పుడు ఎక్కడ మొదలైందో ఒక్కసారి ఆలోచించండి.కోపం ఒక హెచ్చరిక, ఆయుధం కాదు!బ్రో, కోపం లేదా బాధ అనేది ఒక తప్పుడు రియాక్షన్ కాదు, అది ఒక హెచ్చరిక. "నీ మనసులో ఎక్కడో గాయం ఉంది, దాన్ని నయం చేయి" అని అది మీకు చెప్తోంది. ఆ హెచ్చరికను విని, ఆ గాయాన్ని నయం చేసుకోండి.గుర్తుంచుకోండి, "Between stimulus and response there is a space. In that space is our power and our freedom." (Victor Frankl). ఆ స్పేస్‌లో మీరు గెలిస్తే, మీ వ్యక్తిత్వం అద్భుతంగా మారుతుంది.-సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
ఆఫీసులో పని ఒత్తిడి... కుటుంబ సభ్యులపై కోపం
రోజంతా ఆఫీసులో బాస్ మాటలు, డెడ్లైన్ల ఒత్తిడి.. ఈ కోపాన్నంతా లోపలే దాచుకుని సాయంత్రం ఇంటికి వస్తారు. తలుపు తీయగానే పిల్లలు ఏదో అడిగితేనో, భార్య చిన్న ప్రశ్న అడిగితేనో ఒక్కసారిగా పేలిపోతారు. మరుక్షణమే "ఎందుకు అంత కోప్పడ్డాను?" అని గిల్టీగా ఫీల్ అవుతారు. దీన్ని Displaced Aggression అంటారు. అంటే, ఆఫీసులో ఎవరినీ ఏమీ అనలేక, ఆ కోపాన్నిఇంట్లో చూపించడం. దీనివల్ల ఇంట్లో ప్రశాంతతే కాదు, కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయి.కుటుంబం మీదే ఎందుకు?ఆఫీసులో మీకు కోపం తెప్పించిన బాస్‌ను మీరు తిరిగి ఏమీ అనలేరు. ఎందుకంటే అది మీ కెరీర్‌కు ప్రమాదం. కానీ, ఆ కోపం ఎక్కడో ఒకచోట బయటకు రావాలి. అందుకే, అత్యంత సురక్షితమైన ప్రదేశం.. అంటే మీ ఇల్లు, మీ కుటుంబ సభ్యులు ఆ కోపానికి బలవుతారు. ఇది బలహీనత కాదు, ఒక రకమైన 'ఎమోషనల్ బ్లీడింగ్'.నా దగ్గరికి వచ్చిన రమేష్ (పేరు, వివరాలు మార్చాను) ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజర్. ఆఫీసులో పాలిటిక్స్ వల్ల అతను తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడు. ఇంటికి రాగానే అతని భార్య కబుర్లు చెప్పేది. కానీ అతను వినలేకపోయేవాడు. "నాకు ఆఫీసులో తలనొప్పి చాలదు అన్నట్టు, ఇంటికి రాగానే నీ నసేంటి" అని గట్టిగా అరిచేవాడు. ఆ మాటలు అతని భార్యను ఎంతగానో బాధించేవి. రమేష్ తన కోపాన్ని ఆఫీసులో వదిలేయకుండా, ఇంటికి కూడా తెచ్చుకోవడమే అసలైన సమస్య.కుటుంబానికి విముక్తి ఎలా? 1. Decompression Period: ఆఫీసు నుండి ఇంటికి వెళ్లిన వెంటనే కుటుంబంతో కలవకండి. ఒక 15-20 నిమిషాలు మీ కోసం కేటాయించండి. స్నానం చేయడం, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం, సంగీతం వినడం చేయండి. ఇది ఆఫీసు ఒత్తిడిని మీ మనసు నుండి తొలగిస్తుంది.2. Voice Out: మీ మనసులో ఆఫీసు పట్ల ఉన్న అసహనాన్ని ఇంట్లో చెప్పకండి. దానికి బదులు, ఇంటికి వచ్చే దారిలో ఒక మంచి ఫ్రెండ్‌తో మాట్లాడండి లేదా ఆఫీసులో జరిగిన కోపాన్ని ఒక డైరీలో రాసి పెట్టండి. అది మీలోని కోపాన్ని తగ్గించే 'వెంటిలేషన్' లా పనిచేస్తుంది.3. ఫోన్/మెయిల్ ఆఫ్ చేయండి: ఇంటి గుమ్మం తొక్కే ముందే మీ ఫోన్ లోని ఆఫీస్ యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటే, మీరు ఫిజికల్ గా ఇంట్లో ఉన్నా, మెంటల్ గా ఆఫీసులోనే ఉంటారు.4. "ఐ యామ్ స్ట్రెస్డ్" అని చెప్పండి: "ఈరోజు ఆఫీసులో చాలా ఒత్తిడి ఉంది, నాకు కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి" అని ఇంట్లో వాళ్లకు చెప్పడంలో తప్పులేదు. ఇది మీ కోపాన్ని అరిచే వరకు వెళ్ళకుండా ఆపుతుంది.5. కుటుంబమే మీ శక్తి: కోపం వస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి.. "ఈరోజు నేను కష్టపడి పనిచేసింది ఎవరి కోసం? నా కుటుంబం కోసమే కదా!" అప్పుడు ఆ కుటుంబ సభ్యుల మీద కోపం రాదు, ఒక రకమైన కృతజ్ఞత కలుగుతుంది.మీ కోసం ఒక చిన్న పరీక్ష...ఈ సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి: "నేను ఇప్పుడు నా ఆఫీసు కోపాన్ని నా వాళ్లకు బహుమతిగా ఇస్తున్నానా? లేక నా ప్రేమను ఇస్తున్నానా?"కెరీర్లో గెలవడం ఎంత ముఖ్యమో, మనసున్న మనుషుల ప్రేమను గెలుచుకోవడం అంతకంటే ముఖ్యం. గుర్తుంచుకోండి.. ఆఫీసు మీ శ్రమను అడుగుతుంది, కానీ కుటుంబం మీ చిరునవ్వును, మీ సమయాన్ని కోరుకుంటుంది. ఆఫీసు కోపాన్ని ఆఫీసులోనే వదిలేయండి, సంతోషాన్ని ఇంటికి తీసుకెళ్లండి.సైకాలజిస్ విశేష్కెరీర్ & మైండ్‌సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
రీల్స్ పిచ్చి వర్సెస్ చదువు..!
ఒకప్పుడు పిల్లలు ‘పెద్దయ్యాక కలెక్టర్ అవుతాను’ అనేవారు, కానీ నేడు ‘ఇన్ఫ్లూయెన్సర్ అవుతాను’ అంటున్నారు. చదువును పక్కన పెట్టి, గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తూ, నిరంతరం రీల్స్ షూటింగులతో బిజీగా ఉంటున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది కేవలం అలవాటు కాదు, ఒక తీవ్రమైన మానసిక పరిణామం. చేతిలో స్మార్ట్‌ఫోన్, కళ్ళల్లో రీల్స్ కలలు ఉన్న టీనేజర్లను సరిదిద్దడం నేటి తరం తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద సవాలు.మెదడులో డోపమైన్ యుద్ధంటీనేజర్ల మెదడులో ‘ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్’ (నిర్ణయాలు తీసుకునే భాగం) పూర్తిగా అభివృద్ధి చెందదు. కాని, ఆనందాన్ని వెతికే ‘రివార్డ్ సిస్టమ్’ చాలా వేగంగా పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా వీడియో గేమ్స్ ‘వేరియబుల్ రివార్డ్స్’ సూత్రంపై పనిచేస్తాయి. స్వైప్ చేసిన ప్రతిసారి, తర్వాతి వీడియోలో ఏముందో తెలియని ఆ కుతూహలం మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. చదువులో ఫలితం రావడానికి ఏడాది పడుతుంది కాని, రీల్‌కు లైక్స్ రావడానికి సెకన్లు చాలు. అందుకే ఈ ‘తక్షణ తృప్తి’ కోసం మళ్లీ మళ్లీ రీల్స్ చూస్తుంటారు, చేస్తుంటారు. చదువు వర్సెస్ వైరల్ ఫేమ్చాలామంది టీనేజర్లు చదువు మానేసి రీల్స్ చేయడం వెనుక ‘గుర్తింపు కాంక్ష’ ఉంటుంది. కాని, పదివేల మంది ఫాలోవర్లు ఉండటం వల్ల జీవితం సెటిల్ అయిపోదు. సోషల్ మీడియా అల్గారిథమ్స్ మారగానే ఆ గుర్తింపు కనుమరుగవుతుంది.నిరంతరం షూటింగులు, ఎడిటింగ్ ఆలోచనలతో ఉండటం వల్ల మెదడు ‘హైపర్–యాక్టివ్’ స్థితిలో ఉంటుంది. ఫలితంగా, నిశ్శబ్దంగా కూర్చుని చదువుకోవడం వారికి అసాధ్యంగా మారుతుంది.చదువును నిర్లక్ష్యం చేస్తూ, కేవలం ‘వైరల్’ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న టీనేజర్లను డీల్ చేయడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలు. వారిని మొండితనం వైపు నెట్టకుండా, తిరిగి పుస్తకాల వైపు మళ్లించడానికి ఉపయోగపడే ఐదు కౌన్సెలింగ్ చిట్కాలు మీకోసం.1. ‘వై నాట్’కి బదులుగా ‘హౌ’పిల్లలు రీల్స్ చేస్తామంటే ‘వద్దు, చేయకూడదు’ అని మొండిగా చెప్పకండి. అది వారిని తిరుగుబాటు వైపు నెడుతుంది. ‘నువ్వు కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకోవడం మంచిదే కాని, ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్ కావాలంటే నీకు కమ్యూనికేషన్ స్కిల్స్, స్క్రిప్ట్ రైటింగ్, అనలిటికల్ నాలెడ్జ్ ఉండాలి. అవి నీకు చదువు ద్వారానే వస్తాయి’ అని వారితో ఒక ప్రొఫెషనల్లాగా మాట్లాడండి. చదువును వారి ఎదుగుదలకు ఒక అడ్డంకిగా కాకుండా, ఒక సాధనంగా చూపించండి.2. ‘ఇన్స్టంట్ ఫేమ్’ వర్సెస్ ‘లాంగ్ టర్మ్ సెక్యూరిటీ’ టీనేజర్లకు భవిష్యత్తు గురించి స్పష్టత ఉండదు. అందుకే క్లాసులో వచ్చే మొదటి ర్యాంక్ కంటే రీల్స్‌కు వచ్చే లైక్స్ ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. ‘ఈ రోజు వైరల్ అయిన వీడియో రేపు ఉండదు. కాని, నువ్వు సంపాదించే డిగ్రీ లేదా నైపుణ్యం జీవితాంతం నీకు అన్నం పెడుతుంది’ అని సోషల్ మీడియా వెనుక ఉన్న ‘షెల్ఫ్ లైఫ్’ గురించి వివరించండి. ముఖ్యంగా ఫేడౌట్ అయిపోయిన పాత ఇన్ఫ్లూయెన్సర్ల ఉదాహరణలు చెప్పండి.3. ‘ప్రొడక్షన్ టైమ్’ ఫిక్స్ చేయండిపిల్లలు చదువు మధ్యలో రీల్స్ షూటింగ్ చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. వారానికి ఒక రోజు, రెండు గంటలు మాత్రమే షూటింగ్ సమయంగా కేటాయించండి. మిగిలిన ఆరు రోజులు చదువుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ‘నీ చదువు గ్రాఫ్ పడిపోతే, ఈ షూటింగ్ టైమ్ రద్దవుతుంది’ అనే పాజిటివ్ కండిషన్ పెట్టండి.4. అకడమిక్ రివార్డ్ సిస్టమ్వారికి నచ్చిన రీల్స్ చేసే హక్కును వారు ‘సంపాదించుకోవాలి’. ఉదాహరణకు ఒక చాప్టర్ పూర్తి చేస్తే 15 నిమిషాల ఎడిటింగ్ టైమ్. వీక్లీ టెస్ట్‌లో మంచి మార్కులు వస్తే, ఒక కొత్త రీల్ షూట్ చేసుకునే అవకాశం. ఇలా చేయడం వల్ల వారు చదువును ఒక శిక్షలా కాకుండా, తమకు నచ్చిన పనిని చేయడానికి ఒక మార్గంగా చూస్తారు.5. డిజిటల్ ఐడెంటిటీని గౌరవించండిపిల్లలకు గుర్తింపు కావాలి. ఇంట్లో ఆ గుర్తింపు దొరకనప్పుడు వారు బయట ప్రపంచాన్ని ఆశ్రయిస్తారు. అందుకే రీల్స్ చేస్తారు. ఆ విషయాన్ని గుర్తించండి. వారిని ఒక ‘క్రియేటర్’గా గౌరవిస్తూనే, ఒక ‘స్టూడెంట్’గా బాధ్యతలను గుర్తు చేయండి.నైవర్ మైండ్..!ప్రతిరోజూ మన మెదడులో దాదాపు 50 వేల నుంచి 70 వేల ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి. వీటిలో సుమారు 60 నుంచి 70 శాతం ప్రతికూలమైన ఆలోచనలే! కాబట్టి పరీక్షల సమయంలో తలెత్తే ప్రతికూల ఆలోచనలను పెద్దగా పట్టించుకోకండి. సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: ముసుగు వెయ్యొద్దు మనసు మీద..! లోపాలను దాచొద్దు..) -
మిమ్మల్ని నిరంతరం వెనక్కిలాగే శత్రువుని జయించాలంటే..!
మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు, "ఇది నీవల్ల కాదులే", "అందరూ చూసి నవ్వుతారు", "గతంలో కూడా ఇలాగే ఫెయిల్ అయ్యావుగా" అని మీ లోపల ఒక గొంతు వినిపిస్తుందా? ఆ గొంతుకనే సైకాలజీలో 'The Inner Critic' అంటారు. ఈ శత్రువు బయట ఎక్కడో లేడు, మీ మెదడులోనే ఉంటూ మిమ్మల్ని నిరంతరం వెనక్కి లాగుతుంటాడు.ఈ 'ఇన్నర్ క్రిటిక్' ఎక్కడి నుండి వస్తుంది?మనం పుట్టినప్పుడు ఈ విమర్శించే స్వభావంతో పుట్టము. మన చిన్నతనంలో మనపై ప్రభావం చూపిన వ్యక్తుల మాటలే మనకు పెద్దయ్యాక ఈ లోపలి గొంతుకగా మారతాయి.కండిషనింగ్: చిన్నప్పుడు మిమ్మల్ని అతిగా విమర్శించిన తల్లిదండ్రులు, టీచర్లు లేదా బంధువుల మాటలు మీ సబ్-కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయిపోతాయి.సర్వైవల్ మెకానిజం: మన మెదడు మనల్ని ప్రమాదాల నుండి రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఏదైనా కొత్త పని చేసినప్పుడు అవమానం జరుగుతుందేమో అన్న భయంతో, ఆ మెదడు ఈ 'ఇన్నర్ క్రిటిక్'ను వాడి మిమ్మల్ని ఆపేస్తుంది.ఇన్నర్ క్రిటిక్ రకాలు: మీది ఏ రకం?సైకాలజిస్ట్ Jay Earley ప్రకారం, ఈ అంతర్గత విమర్శకుడు రకరకాలుగా ఉంటాడు:The Perfectionist: "ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే అసలు చేయకు" అని ఒత్తిడి తెస్తాడు.The Taskmaster: "నువ్వు ఇంకా కష్టపడాలి, విశ్రాంతి తీసుకోవడం తప్పు" అని వేధిస్తుంటాడు.The Destroyer: "నువ్వు పుట్టడమే ఒక తప్పు, నువ్వు దేనికీ పనికిరావు" అని మీ ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తాడు.అణచివేస్తే అణిగిపోదు"నీ లోపలి గొంతును అణచివేయి, దాన్ని చంపేయ్" అని ట్రైనర్స్ చెప్తారు. కానీ సైకాలజీ ప్రకారం, మీరు దేన్నైతే అణచివేయాలని చూస్తారో, అది ఇంకా బలంగా తయారవుతుంది.మార్కెట్ విమర్శను ద్వేషించమంటుంది. సైకాలజీ ఆ గొంతు వెనుక ఉన్న 'భయాన్ని' అర్థం చేసుకోమంటుంది.విమర్శకుడిని స్నేహితుడిగా మార్చుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ గొంతును ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం.Step 1: గుర్తించి పేరు పెట్టండిఆ నెగటివ్ ఆలోచనలు రాగానే, అవి "మీవి" కాదని గుర్తించండి. "నేను ఫెయిల్ అవుతాను" అనడానికి బదులు, "నా లోపల ఉన్న విమర్శకుడు నేను ఫెయిల్ అవుతానని భయపడుతున్నాడు" అని అనండి. వీలైతే ఆ గొంతుకు ఒక పేరు పెట్టండి. ఉదాహరణకు: 'మిస్టర్ డౌట్'.దీనివల్ల ఆ గొంతుకు, మీ అసలు వ్యక్తిత్వానికి మధ్య ఒక దూరం ఏర్పడుతుంది (Cognitive Defusion). ఇదే పాత అలవాటును 'Break' చేయడం.Step 2: సెల్ఫ్-కంపాషన్మీ ప్రాణ మిత్రుడు ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు అతన్ని ఎలా ఓదారుస్తారో, మిమ్మల్ని మీరు అలాగే ఓదార్చుకోండి."పర్లేదు, తప్పులు అందరూ చేస్తారు, మళ్ళీ ప్రయత్నిద్దాం" అని మీతో మీరు మాట్లాడుకోండి. ఒక సపోర్టివ్ ఇన్నర్ వాయిస్‌ని 'Build' చేయండి.Step 3: పర్పస్ డ్రైవెన్ లైఫ్మీరు ఒక పెద్ద లక్ష్యం (Legacy) కోసం పని చేస్తున్నప్పుడు, ఈ చిన్న చిన్న విమర్శలు మీకు వినిపించవు. మీ లోపలి విమర్శకుడు చెప్పేది కేవలం ఒక అభిప్రాయం మాత్రమే, అది వాస్తవం కాదు అని తెలిసినప్పుడు మీరు 'Beyond' స్టేజ్‌లో ఉన్నట్లు.ఈ రోజు మీ విమర్శకుడు ఏం చెప్పాడు?ఒక పెన్ను, పేపర్ తీసుకోండి, ఈ ప్రశ్నలకు సమాధానం రాయండి. ఈ రోజు మీ గురించి మీరు అనుకున్న ఒక నెగటివ్ మాట ఏంటి?ఆ మాట వెనుక ఉన్న భయం ఏంటి? ఉదా: నలుగురు ఏమనుకుంటారో అన్న భయమా?అదే మాట మీ మిత్రుడు తన గురించి తాను అంటే, మీరు అతనికి ఏం సమాధానం చెప్తారు? ఆ సమాధానాన్నే మీకు మీరు చెప్పుకోండి.మీకు మీరే అతిపెద్ద సపోర్టర్ అవ్వాలి!బ్రో, ప్రపంచం మిమ్మల్ని విమర్శించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కనీసం మీ తల లోపల అయినా మీరు మీ వైపు ఉండాలి.మీ 'ఇన్నర్ క్రిటిక్'ను ఒక కఠినమైన యజమానిలా కాకుండా, మీ క్షేమం కోరే ఒక భయపడిన పిల్లాడిలా చూడండి. అతనికి ధైర్యం చెప్పి ముందుకు సాగండి.గుర్తుంచుకోండి, "You have been criticizing yourself for years and it hasn’t worked. Try approving of yourself and see what happens."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని ఎలా మెరుగుపరుచుకోవాలి..?) -
IQ Vs EQ: ఏది మిమ్మల్ని గెలిపిస్తుంది?
మన సమాజంలో తెలివితేటలు (IQ) ఉన్నవారిని మేధావులు అని తలకెత్తుకుంటాం. కానీ, విపరీతమైన కోపంతో ఎదుటివారిని తిట్టే మేధావిని, ఒత్తిడి తట్టుకోలేక కుంగిపోయే టాపర్‌ను మనం ఏమనాలి?ఇక్కడే Emotional Intelligence (భావోద్వేగ ప్రజ్ఞ) ప్రాముఖ్యత తెలుస్తుంది. IQ అనేది మీ తల (Head) కి సంబంధించింది అయితే, EQ అనేది మీ హృదయానికి (Heart) కి సంబంధించింది.IQ, EQ మధ్య తేడా ఏంటి?IQ (Intelligence Quotient): ఇది మీ లాజిక్, మెమరీ, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్. ఇది చాలా వరకు పుట్టుకతో వచ్చేది, పెద్దగా మార్చలేం.EQ (Emotional Quotient): ఇది మీ ఎమోషన్స్ ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎదుటివారి ఎమోషన్స్ కి ఎలా స్పందిస్తున్నారు అనే సామర్థ్యం. ఇది నేర్చుకోగలిగే స్కిల్.చాలా మంది సక్సెస్ ఫుల్ పీపుల్ లైఫ్ లో మనం గమనించే అతి ముఖ్యమైన అంశం EQ. స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్లందరూ జీవితంలో ఫస్ట్ రాకపోవడానికి, యావరేజ్ స్టూడెంట్స్ ప్రపంచాన్ని ఏలడానికి ప్రధాన కారణం ఈ EQ.The 5 Pillars of EQడేనియల్ గోల్మన్ (Daniel Goleman) ఈ కాన్సెప్ట్‌ను ప్రాచుర్యంలోకి తెస్తూ ఒక మాట చెప్పారు: "IQ మిమ్మల్ని ఉద్యోగంలో చేర్పించవచ్చు, కానీ EQ మిమ్మల్ని ఆ ఉద్యోగంలో ఎదిగేలా చేస్తుంది."గోల్మన్ ప్రకారం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో ఐదు ముఖ్యాంశాలు ఉంటాయి.Self-Awareness (స్వయం స్పృహ): మీకు ఎప్పుడు కోపం వస్తుంది? ఎప్పుడు భయం వేస్తుంది? ఆ సమయంలో మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? అని గమనించడం.Self-Regulation (స్వయం నియంత్రణ): ఎమోషన్స్ కలగడం సహజం, కానీ వాటికి బానిస అవ్వకూడదు. కోపం వచ్చినప్పుడు వెంటనే అరవకుండా, ఒక్క క్షణం ఆగి స్పందించడం.Motivation (ప్రేరణ): డబ్బు లేదా పొగడ్తల కోసం కాకుండా, మీలోని తృప్తి కోసం పని చేయడం. ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించే మొండితనం.Empathy (సహానుభూతి): ఎదుటివారి కళ్ళతో ప్రపంచాన్ని చూడటం. వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో వారి కోణంలో అర్థం చేసుకోవడం.Social Skills (సామాజిక నైపుణ్యం): గొడవలను పరిష్కరించడం, టీమ్ ని నడిపించడం, మనుషులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం.మోటివేషనల్ స్పీకర్ల పొరపాటుట్రైనర్స్ మనకు "కోపాన్ని అణచుకో, ఎప్పుడూ నవ్వుతూ ఉండు" అని పైపైన చిట్కాలు ఇస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, ఎమోషన్ ని అణచివేయడం (Suppression) అంటే ప్రెషర్ కుక్కర్ విజిల్ ఆపేసినట్లే—అది ఎప్పుడో ఒకప్పుడు పేలుతుంది.మార్కెట్ ఎమోషన్స్ ని దాచమంటుంది.సైకాలజీ ఎమోషన్స్ ని ఛానలైజ్ (Channelize) చేయమంటుంది.EQని ఎలా పెంచుకోవాలి?Genius Matrix మోడల్ ఉపయోగించి ఈ ఎమోషనల్ స్ట్రెంత్ ని బిల్డ్ చేద్దాం.Step 1: Break (రియాక్షన్ ని బ్రేక్ చేయండి)మీరు ఒక సంఘటనకు స్పందించే లోపు ఒక 'Gap' క్రియేట్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు వెంటనే తిరిగి తిట్టడం మీ పాత ప్రోగ్రామింగ్. ఆ ఆటోమేటిక్ రియాక్షన్ ని 'Break' చేసి, "నేను ఇప్పుడు ఎలా స్పందించాలి?" అని ఆలోచించండి.Step 2: Build (ఎమోషనల్ వొకాబులరీ)చాలామందికి తమకు ఏం అనిపిస్తుందో చెప్పడం రాదు. "నాకు బాధగా ఉంది" అనడానికి బదులు "నాకు కోపంగా ఉంది" అంటారు. మీ ఎమోషన్ కి సరైన పేరు పెట్టడం నేర్చుకోండి. మీ లోపల ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఫౌండేషన్ ని 'Build' చేయండి.Step 3: Beyond (స్టాయిక్ మైండ్‌సెట్)పరిస్థితులు ఎలా ఉన్నా, మీ ప్రశాంతతను ఎవరు చెడగొట్టలేనప్పుడు మీరు 'Beyond' స్టేజ్ లో ఉన్నట్లు. ఇతరుల ప్రవర్తన మీ మూడ్ ని శాసించకూడదు. అదే నిజమైన పర్సనాలిటీ గ్రోత్.మీ ఎమోషనల్ చెకప్ఈ రోజు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి.గత వారంలో మీరు ఎవరిపైనైనా విపరీతంగా అరిచారా? ఆ తర్వాత బాధపడ్డారా? (అక్కడ మీ EQ తక్కువగా ఉందని అర్థం).ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు అతిగా తింటారా? లేక అందరిపై విసుక్కుంటారా?ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు మీరు నిజంగా వారి బాధను ఫీలవుతున్నారా?స్మార్ట్ అవ్వడం కంటే స్ట్రాంగ్ అవ్వడం ముఖ్యం!బ్రో, IQ మిమ్మల్ని ఒక మంచి ఇంజనీర్ లేదా డాక్టర్ ని చేయవచ్చు, కానీ EQ మిమ్మల్ని ఒక మంచి లీడర్ ని, మంచి భర్తని/భార్యని, ఒక గొప్ప మనిషిని చేస్తుంది. తెలివితేటలు ఉన్నవాడు గెలుస్తాడేమో కానీ, భావోద్వేగ స్థిరత్వం ఉన్నవాడు మాత్రమే ఆ గెలుపును నిలబెట్టుకోగలడు.గుర్తుంచుకోండి, "Life is 10% what happens to you and 90% how you react to it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అద్దంలో కనిపించని అసలు రూపం) -
మీరు నిజంగా సిగ్గరులా లేక భయస్తులా?
మనలో చాలామంది నలుగురిలోకి వెళ్ళడానికి ఇష్టపడరు. కొత్త వారితో మాట్లాడాలంటే తడబడతారు. అప్పుడు వెంటనే ఒక ముద్ర వేసేసుకుంటారు: "నేను ఇంట్రోవర్ట్‌ని బ్రో, అందుకే ఎవరితోనూ కలవలేను." కానీ, ఇక్కడ ఒక పెద్ద సైకలాజికల్ మిస్టేక్ ఉంది. ఇంట్రోవర్షన్ (Introversion) అనేది ఒక వ్యక్తిత్వ రకం (Personality Type), కానీ సిగ్గు (Shyness) లేదా సామాజిక భయం (Social Anxiety) అనేది ఒక భావోద్వేగ సమస్య.మీరు నిజంగా ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? లేక నలుగురిలోకి వెళ్తే ఎక్కడ అవమానం జరుగుతుందో అని భయపడుతున్నారా? ఈ రెండింటి మధ్య తేడా తెలియకపోతే మీరు మీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ డెవలప్ చేసుకోలేరు.1. Introversion vs. Shynessఈ కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన Carl Jung దృష్టిలో...Introversion (అంతర్ముఖత్వం): ఇది మీ శక్తి (Energy) ఎక్కడి నుండి వస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఒక ఇంట్రోవర్ట్ ఒంటరిగా ఉన్నప్పుడు రీఛార్జ్ అవుతాడు. వారికి మనుషులంటే భయం ఉండదు, కానీ ఎక్కువ మంది మధ్య ఉంటే శక్తి హరించుకుపోతుంది. వారు క్వాలిటీ టైమ్‌ని కోరుకుంటారు.Shyness/Social Anxiety: ఇది 'జడ్జ్మెంట్' (Judgment) పట్ల ఉన్న భయం. "నేను మాట్లాడితే ఎవరైనా నవ్వుతారా?", "నేను సరిగ్గా కనిపిస్తున్నానా?" అనే ఆందోళన వల్ల మనుషులకు దూరంగా ఉండటం.తేడా గమనించండి: ఒక ఇంట్రోవర్ట్ పార్టీకి వెళ్లకూడదని నిర్ణయించుకుంటాడు (Choice). కానీ భయం ఉన్న వ్యక్తి పార్టీకి వెళ్లాలని ఉన్నా, అక్కడ అందరూ తననే చూస్తారేమో అన్న ఆందోళనతో 'ఆగిపోతాడు' (Fear).2. మోటివేషనల్ పొరపాటు: "Be an Extrovert"సో-కాల్డ్ ట్రైనర్లు చేసే అతిపెద్ద డ్యామేజ్ ఏంటంటే.. అందరూ ఎక్స్ట్రోవర్ట్లుగా మారిపోవాలని చెప్పడం."స్టేజ్ ఎక్కు, గట్టిగా అరువు, అందరితో కలిసిపో.. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు" అని చెప్తారు. ఇది మీ సహజ సిద్ధమైన వ్యక్తిత్వాన్ని చంపేయడమే.ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్తలు, రచయితలు, ఆలోచనాపరులు చాలామంది ఇంట్రోవర్ట్లే. మీరు ఎక్స్ట్రోవర్ట్గా మారాల్సిన అవసరం లేదు, మీలో ఉన్న 'భయాన్ని' పోగొట్టుకుంటే చాలు.నిజమైన వికాసం అంటే మీ స్వభావాన్ని మార్చుకోవడం కాదు, మీ స్వభావంలో ఉన్న అడ్డంకులను (భయాన్ని) తొలగించుకోవడం.3. Real Personality Development: బ్రేకింగ్ ది మిత్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ కన్ఫ్యూజన్ నుండి బయటపడటం ఎలా?Step 1: నిజాయితీగా ఒప్పుకోవడంమిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి: "నన్ను ఒక గదిలో ఉంచి, బయట జనం నన్ను అస్సలు జడ్జ్ చేయరు, అందరూ నన్ను పొగుడుతారు అని గ్యారెంటీ ఇస్తే.. అప్పుడు నేను బయటకు వెళ్తానా?"మీ సమాధానం 'అవును' అయితే.. మీరు ఇంట్రోవర్ట్ కాదు, మీరు భయపడుతున్నారు (Social Anxiety).మీ సమాధానం 'కాదు, అయినా నేను ఒంటరిగానే ఉంటాను' అయితే.. మీరు పక్కా ఇంట్రోవర్ట్.ఈ క్లారిటీ రావడమే పాత ముసుగుని 'Break' చేయడం.Step 2: సామర్థ్యాన్ని పెంచుకోవడంమీరు ఇంట్రోవర్ట్ అయినా సరే, సమాజంలో బ్రతకడానికి కమ్యూనికేషన్ అవసరం.కార్ల్ రోజర్స్ చెప్పినట్లు, 'Self-Acceptance' పెంచుకోండి. "నేను తక్కువ మాట్లాడతాను, అది నా బలం" అని నమ్మండి.భయం ఉంటే, చిన్న చిన్న సామాజిక పరిస్థితులను ఎదుర్కోవడం (Gradual Exposure) ప్రాక్టీస్ చేయండి. ఇది మీ లోపల కొత్త న్యూరల్ పాత్వేస్ని బిల్డ్ చేస్తుంది.Step 3: Introvert Powerఒక ఇంట్రోవర్ట్ తన ఏకాగ్రతను, లోతైన ఆలోచనా శక్తిని ఆయుధంగా మార్చుకున్నప్పుడు అతను అజేయుడు అవుతాడు. ఐన్ స్టీన్, బిల్ గేట్స్ వంటి వారు తమ ఇంట్రోవర్షన్ ని బలహీనతగా చూడలేదు, దాన్ని ఒక సూపర్‌పవర్‌గా మార్చుకున్నారు. అదే 'Beyond' స్టేజ్.4. మీ అసలు రంగు ఏంటి?ఈ రోజు ఒక పేపర్ మీద ఈ రెండు కాలమ్స్ రాయండి.నేను ఇష్టపూర్వకంగా ఒంటరిగా ఉన్న సందర్భాలు ఏవి? (ఉదా: బుక్ చదువుకోవడం, ఆలోచించుకోవడం)నేను భయం వల్ల వెనక్కి తగ్గిన సందర్భాలు ఏవి? (ఉదా: ఆఫీసు మీటింగ్‌లో పాయింట్ చెప్పకపోవడం, నచ్చిన అమ్మాయితో/అబ్బాయితో మాట్లాడలేకపోవడం)ఈ రెండో కాలమ్‌కి ఎక్కువ పాయింట్లు ఉంటే, మీరు ఇంట్రోవర్షన్ వెనుక మీ భయాన్ని దాచుకుంటున్నారు అని అర్థం.ముసుగు వెనుక దాక్కోకండి!బ్రో, ఇంట్రోవర్ట్ గా ఉండటం ఒక గొప్ప వరం. అది లోతైన వ్యక్తిత్వానికి నిదర్శనం. కానీ ఆ పదాన్ని ఒక సాకుగా వాడుకుని మీ ఎదుగుదలని ఆపుకోవద్దు. మీరు సిగ్గరి కాదు, మీరు భయస్తుడు కాదు.. మీరు కేవలం మీ శక్తిని లోపలికి మళ్లించుకునే వ్యక్తి మాత్రమే అని ప్రపంచానికి నిరూపించండి.ముసుగు తీసేయండి.. మీ మౌనంలో ఉన్న శక్తిని (Power of Silence) గుర్తించండి. అదే Real Personality Development.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066(చదవండి: The 'Ideal Self' Trap: ఎదుటివారిలా ఉండాలనుకోవడమే సమస్య!) -
ఫేక్ పర్సనాలిటీ వద్దు..మీరు మీలా ఉండండి..!
మనం రోజూ ఉదయం లేవగానే ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. అక్కడ ఒకరు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తారు, ఇంకొకరు ఖరీదైన కారులో తిరుగుతూ కనిపిస్తారు, మరొకరు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. వారిని చూడగానే "నేను కూడా వాళ్ళలాగే ఉండాలి" అనే ఆలోచన మొదలవుతుంది.మెల్లమెల్లగా మనం 'మనం'లా ఉండటం మానేసి, ఎవరోలా మారడానికి ప్రయత్నిస్తాం. సైకాలజీలో దీన్నే 'Ideal Self Trap' అంటారు. ఇది ఒక మానసిక జబ్బు లాంటిది, ఇది మీ అసలైన వ్యక్తిత్వాన్ని (Real Personality) చంపేస్తుంది.1. Real Self vs. Ideal Self: అసలు గొడవ ఎక్కడ?కార్ల్ రోజర్స్ సిద్ధాంతం ప్రకారం, ప్రతి వ్యక్తిలో రెండు రూపాలు ఉంటాయి. ఒకటి మనం ప్రస్తుతం ఉన్న రూపం (Real Self), రెండోది మనం ఎలా ఉండాలని కోరుకుంటామో ఆ రూపం (Ideal Self).Real Self (నిజమైన నేను): ప్రస్తుతం మీరు ఎవరు? మీ బలాలు ఏంటి? మీ బలహీనతలు ఏంటి? మీ సహజమైన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది ఇది.Ideal Self (ఆదర్శవంతమైన నేను): మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సమాజం మిమ్మల్ని ఎలా చూడాలని మీరు ఆశపడుతున్నారు? అనేది ఇది.ఈ రెండింటి మధ్య దూరం పెరిగినప్పుడు మనిషిలో 'Anxiety' (ఆందోళన) మరియు 'Self-Hatred' (తన్ను తాను అసహ్యించుకోవడం) మొదలవుతాయి.ఉదాహరణకు, మీరు సహజంగా మితభాషి (Introvert) అనుకుందాం. కానీ మీరు ఒక పాపులర్ మోటివేషనల్ స్పీకర్‌ను చూసి, అతనిలాగా గలగలా మాట్లాడాలని (Extrovert) ప్రయత్నిస్తే.. మీరు మీ 'Real Self'ను మోసం చేస్తున్నట్లే. ఈ గ్యాప్ పెరిగే కొద్దీ మీ పర్సనాలిటీ విచ్ఛిన్నమవుతుంది.2. మార్కెట్ మోటివేషన్ ఎలా ట్రాప్ చేస్తుంది?పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు, motivation స్పీకర్లు ఈ 'Ideal Self' ట్రాప్‌ను క్యాష్ చేసుకుంటారు. "నువ్వు వారిలా తయారవ్వచ్చు, వీరిలా గెలవొచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే నువ్వు ఒక సూపర్ హ్యూమన్ అవుతావు" అని చెప్తారు. అంటే వారు మీకు ఒక 'అద్దె వ్యక్తిత్వాన్ని' (Borrowed Personality) అమ్ముతున్నారు.సైకాలజీ ఏం చెప్తుందంటే.. "నువ్వు ఎవరిలాగో అవ్వాల్సిన అవసరం లేదు. నీలోని ఉత్తమ వెర్షన్‌గా మారితే చాలు."వేరొకరిని కాపీ కొట్టడం అంటే మీ ఒరిజినాలిటీని ఖననం చేయడమే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా, మార్కెట్ ఇచ్చే 'సక్సెస్ టిప్స్' మిమ్మల్ని ఒక ఫేక్ పర్సనాలిటీగా మారుస్తాయి.3. ఎదుటివారిలా ఉండాలనుకోవడం 'జబ్బు' ఎందుకు?ఇది జబ్బు అని ఎందుకు అంటున్నానంటే, దీనివల్ల మూడు ప్రమాదాలు ఉన్నాయి:Constant Comparison (నిరంతర పోలిక): మీరు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. దీనివల్ల మీ దగ్గర ఉన్నవి మీకు తక్కువగా అనిపిస్తాయి.Loss of Identity (గుర్తింపు కోల్పోవడం): మీకంటూ సొంత ఆలోచనలు ఉండవు. ఎదుటివారు దేన్ని సక్సెస్ అంటే దాన్నే మీరు కూడా సక్సెస్ అనుకుంటారు.Low Self-Esteem: మీరు 'Ideal Self'ను అందుకోలేనప్పుడు.. "నేను దేనికీ పనికిరాను" అనే భావన బలపడుతుంది.4. Real Personality Development: ట్రాప్ నుండి బయటపడటం ఎలా?Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, ఈ ట్రాప్ నుండి బయటపడి మీ లెగసీని ఎలా నిర్మించుకోవాలి?STEP 1: BREAK (ముసుగును తొలగించండి)ముందుగా మీరు ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో గుర్తించండి."నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నది నా అవసరం కోసమా? లేక పక్కింటి వ్యక్తిని చూసి గొప్పలు పోవడానికా?""నేను ఈ బట్టలు వేసుకుంటున్నది నాకు నచ్చిందా? లేక సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడానికా?"ఈ విశ్లేషణ మీలోని 'ఫేక్ ఐడియల్ సెల్ఫ్'ని బ్రేక్ చేస్తుంది.STEP 2: BUILD (కంగ్రూయెన్స్ - ఏకీకరణ)మీ 'Real Self'కు మరియు 'Ideal Self'కు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి. అంటే, అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకోకుండా.. మీ సహజ సిద్ధమైన నైపుణ్యాలను (Natural Talents) పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.* మీరు మంచి రచయిత అయితే, బలవంతంగా స్పీకర్ అవ్వాలని ట్రై చేయకండి. మీ రైటింగ్‌లోనే మీ పర్సనాలిటీని బిల్డ్ చేయండి.* Self-Acceptance (నిన్ను నీవు అంగీకరించడం) లేనిదే వికాసం మొదలవ్వదు.STEP 3: BEYOND (అథెంటిసిటీ)ఒక్కసారి మీరు ఎదుటివారిలా ఉండాలనే తాపత్రయం వదిలేస్తే, మీలో ఒక వింతైన ధైర్యం వస్తుంది. అదే అథెంటిసిటీ (Authenticity). ప్రపంచం ఎప్పుడూ 'ఒరిజినల్'కే విలువ ఇస్తుంది, 'కాపీ'కి కాదు. మీరు మీలా ఉంటూనే ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే 'Beyond' స్టేజ్.5. మీ కోసం చిన్న పరీక్షఈ రోజు మీరు ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి:నేను ఏ విషయంలో ఇతరులను చూసి అసూయ పడుతున్నాను? ఆ లక్షణం నిజంగా నా వ్యక్తిత్వానికి అవసరమా?నేను ఎవరి ముందైనా నటించకుండా ఉండగలుగుతున్నానా?నన్ను నేను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నది నా ఆనందం కోసమా? లేక లోకానికి నిరూపించుకోవడానికా?మీ సీటులో మీరు కూర్చోండి!బ్రో, ప్రపంచం ఒక పెద్ద నాటక రంగం అయితే, ఇక్కడ అందరూ హీరోలే అవ్వాలని చూస్తున్నారు. కానీ నిజమైన సక్సెస్ ఎక్కడ ఉందంటే.. మీకు కేటాయించిన పాత్రను (మీ రియల్ సెల్ఫ్) అద్భుతంగా పండించడంలోనే ఉంది.ఎదుటివారిలా ఉండాలనుకోవడం ఒక జబ్బు అయితే, దానికి మందు "మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం". మీలోని లోపాలను కూడా గౌరవించండి, అవే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి."Be a first-rate version of yourself, instead of a second-rate version of somebody else."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: Parenting or Programming: మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా?) -
మీ మైండ్ రిమోట్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది..!
మనం ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు అందులో కొన్ని సాఫ్ట్వేర్లు ముందే ఇన్స్టాల్ అయి ఉంటాయి (Pre-installed apps). మనం వాటిని వాడకపోయినా అవి మెమరీని ఆక్యుపై చేస్తూనే ఉంటాయి. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. మన తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్న సమాజం మన చిన్నతనంలో మన మనసులో కొన్ని 'ప్రోగ్రామ్స్' ఇన్స్టాల్ చేస్తారు.మనకు తెలియకుండానే మనం ఆ ప్రోగ్రామ్స్ ప్రకారమే ఆలోచిస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. దీనినే సైకాలజీలో 'Social & Parental Conditioning' అంటారు. మరి ఈ ప్రోగ్రామింగ్‌ను మార్చడం సాధ్యమేనా?1. పేరెంటింగ్ ఎలా ప్రోగ్రామింగ్‌గా మారుతుంది?సైకాలజీ ప్రకారం, తల్లిదండ్రుల ప్రవర్తన బిడ్డ మనసులో 'బిలీఫ్ సిస్టమ్' (Belief System) గా మారుతుంది. ఇది మూడు రకాలుగా జరుగుతుంది.Direct Commands: "నువ్వు ఎందుకూ పనికిరావు", "అమ్మాయిలు ఇలాగే ఉండాలి", "డబ్బు సంపాదించడం చాలా కష్టం". ఇలాంటి మాటలు పదే పదే విన్నప్పుడు అవి మెదడులో నిజాలుగా రికార్డ్ అయిపోతాయి.Observation: మీ నాన్న కోపం వచ్చినప్పుడు వస్తువులు విసిరేస్తే.. మీరు పెద్దయ్యాక మీకు తెలియకుండానే అదే చేస్తారు. ఎందుకంటే మీ మైండ్ "కోపాన్ని ఇలాగే వ్యక్తపరచాలి" అని ప్రోగ్రామ్ అయ్యింది.Emotional Anchoring: మీరు ఏదైనా సాధించినప్పుడు మాత్రమే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మెచ్చుకుంటే.. "నేను ఏదైనా సక్సెస్ సాధిస్తేనే నాకు విలువ ఉంటుంది" అనే ప్రోగ్రామ్ మీలో రన్ అవుతుంది. దీన్నే 'Conditional Love' అంటారు.2. మార్కెట్ మోటివేటర్ల పొరపాటు: "Update" vs "Format"సో-కాల్డ్ మోటివేషనల్ స్పీకర్లు "ఈ రోజు నుంచి కొత్తగా ఆలోచించు, సక్సెస్ అవుతావు" అని చెప్తారు. ఇది పాత సాఫ్ట్వేర్ మీద కొత్త స్టిక్కర్ వేసినట్లు ఉంటుంది.ట్రైనర్స్ బాహ్య ప్రవర్తనను మార్చమంటారు. సైకాలజీ అసలు ఆ సాఫ్ట్వేర్ కోడింగ్‌ను మార్చమంటుంది (Rewiring).మీరు లోపల "నేను దేనికీ పనికిరాను" అనే ప్రోగ్రామ్‌ను రన్ చేస్తూ, పైన "నేను గొప్పవాడిని" అని అరిస్తే.. ఆ రెండింటి మధ్య ఘర్షణ మొదలై మీలో ఒత్తిడి (Stress) పెరుగుతుంది తప్ప వ్యక్తిత్వం మారదు.3. మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా? (The Science of Change)దీనికి సైన్స్ ఇచ్చే సమాధానం.. ఎస్!ఖచ్చితంగా మార్చుకోవచ్చు! మన మెదడు ఒక రాయిలాంటిది కాదు, అది ఒక ప్లాస్టిక్ లాంటిది. మనం అనుకుంటే కొత్త న్యూరల్ పాత్‌వేస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పాత ప్రోగ్రామింగ్‌ను డిలీట్ చేసి కొత్త కోడింగ్ రాసుకోవచ్చు. దీన్నే Neuroplasticity అంటారు.4. Real Personality Development: రీ-ప్రోగ్రామింగ్ ప్రాసెస్Genius Matrix Model ఉపయోగించి మిమ్మల్ని మీరు ఎలా రీ-డిజైన్ చేసుకోవాలో చూద్దాం.STEP 1: BREAK (డీ-కోడింగ్)ముందుగా మీలో ఉన్న బగ్స్ (Bugs) ఏంటో గుర్తించాలి.* "నేను ఎందుకు భయపడుతున్నాను? ఇది నా భయమా లేక మా అమ్మ భయమా?"* "ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నానా లేక నా ప్రోగ్రామింగ్ తీసుకుంటోందా?"మీరు ఆలోచించే ప్రతి నెగటివ్ ఆలోచన వెనుక ఉన్న 'మూలాన్ని' వెతకండి. ఆ మూలాన్ని గుర్తించడమే పాత ప్రోగ్రామ్‌ను 'బ్రేక్' చేయడం.STEP 2: BUILD (రీ-కోడింగ్)ఇక్కడ మీరు కొత్త అలవాట్లను, కొత్త ఆలోచనా విధానాలను ఇన్స్టాల్ చేయాలి.* Cognitive Re-structuring: "నేను ఓడిపోతాను" అనే ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు, వెంటనే దాన్ని మ్యాన్యువల్ గా ఆపి.. "నేను నేర్చుకుంటున్నాను" అనే కొత్త లైన్ యాడ్ చేయాలి.* ఇది ఒక్క రోజులో జరగదు. పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల పాత ప్రోగ్రామ్ వీక్ అయి, కొత్త ప్రోగ్రామ్ స్ట్రాంగ్ అవుతుంది.STEP 3: BEYOND (మాస్టరీ)ఒక్కసారి మీరు మీ మైండ్ సాఫ్ట్‌వేర్‌ను కంట్రోల్ చేయడం నేర్చుకుంటే, మీరు కేవలం ఒక 'వ్యక్తి'గా మిగిలిపోరు. మీరు ఒక 'Creator' గా మారుతారు. మీ గతం మీ భవిష్యత్తును శాసించదు. మీరు మీ సొంత లెగసీని క్రియేట్ చేస్తారు.5. Self-Reflection: మీ కోడింగ్‌ని చెక్ చేసుకోండి. అందుకోసం ఈ రోజు ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయండి.* మీరు తరచుగా వాడే ఒక నెగటివ్ వాక్యాన్ని రాసుకోండి (ఉదా: "నాకు అదృష్టం లేదు").* ఈ మాట మీ మనసులోకి ఎప్పుడు వచ్చింది? మీ ఇంట్లో ఎవరైనా ఇలా అనేవారా?* ఈ మాట నిజమేనా? దీనికి వ్యతిరేకంగా జరిగిన మూడు సందర్భాలను గుర్తు తెచ్చుకోండి.* ఇప్పుడు ఆ పాత వాక్యాన్ని కొట్టేసి.. ఒక కొత్త పవర్ఫుల్ వాక్యాన్ని రాయండి.రిమోట్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది!బ్రో, మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ప్రోగ్రామ్ చేసి ఉండొచ్చు. అది వారి తప్పు కాదు, వారికి తెలిసింది వారు చేశారు. కానీ ఇప్పుడు మీరు పెద్దయ్యారు. మీ మైండ్ రిమోట్ కంట్రోల్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. పాత ప్రోగ్రామింగ్ ని సాకుగా చూపిస్తూ అలాగే ఉండిపోతారా? లేక దాన్ని రీ-రైట్ చేసి ఒక Real Personality గా ఎదుగుతారా? ఛాయిస్ మీదే!సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub www.psyvisesh.com8019 000066 -
రాత్రి నిద్రలో కూడా ఆఫీస్ ఆలోచనలేనా?
పగలు ఆఫీసులో ఎనిమిది గంటలు పని చేస్తే.. రాత్రి నిద్రలో మరో ఎనిమిది గంటలు మెదడు అదే పనిని చేస్తూనే ఉందా?. బెడ్ మీద పడుకున్నాక కూడా రేపటి మీటింగ్, బాస్ అడిగే ప్రశ్నలు, పూర్తికాని రిపోర్టులు కళ్ళ ముందు సినిమా రీళ్లలా తిరుగుతున్నాయా? అయితే మీరు 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా నిద్రలేమి, ఉదయాన్నే విపరీతమైన నీరసం మీ జీవితంలో భాగమైపోతున్నాయి.ఆలోచనలు ఎందుకు వస్తాయి? (The Zeigarnik Effect)మానసిక శాస్త్రంలో 'జైగార్నిక్ ఎఫెక్ట్' అనే ఒక సిద్ధాంతం ఉంది. మన మెదడు పూర్తి చేసిన పనుల కంటే, అసంపూర్తిగా వదిలేసిన పనులను (Unfinished Tasks) పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే శుక్రవారం వదిలేసిన ఫైలు ఆదివారం రాత్రి వరకు మిమ్మల్ని వెంటాడుతుంది. దీనివల్ల శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడు మాత్రం 'ఓవర్ టైమ్' పని చేస్తూనే ఉంటుంది.నా వద్దకు వచ్చిన రాకేష్ అనే టీమ్ లీడర్ అనుభవమే అందుకు ఉదాహరణ. అతను రాత్రి 2 గంటలకు కూడా మేలుకుని ఈమెయిల్స్ చెక్ చేసేవాడు. "మెయిల్ చెక్ చేయకపోతే ఏదో అపరాధం చేస్తున్నట్టు అనిపిస్తుంది" అని చెప్పేవాడు. ఫలితంగా అతనికి 'క్రానిక్ ఇన్సోమ్నియా' (దీర్ఘకాలిక నిద్రలేమి) మొదలైంది. మేము అతనికి 'డిజిటల్ కర్ఫ్యూ' మరియు 'బ్రెయిన్ డంప్' టెక్నిక్స్ నేర్పించాం. పక్షం రోజుల్లోనే అతని నిద్ర నాణ్యత పెరిగింది, ఆఫీసులో పనితీరు కూడా మెరుగైంది.ఆఫీస్ ఆలోచనల నుండి విముక్తి పొందే 5 మార్గాలుబ్రెయిన్ డంప్ (Brain Dump): ఆఫీసు వదిలే ముందే లేదా పడుకోవడానికి గంట ముందు, మీ మెదడులో ఉన్న పనులన్నింటినీ ఒక పేపర్ మీద రాయండి. "ఇదిగో, ఈ పనులన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి, రేపు చూసుకోవచ్చు" అని మీ మెదడుకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వండి. అప్పుడు అది పదే పదే గుర్తు చేయడం ఆపుతుంది.వర్క్-హోమ్ రిచ్యువల్ (Work-Home Ritual): ఆఫీసు నుండి ఇంటికి వచ్చే దారిలో ఒక నిర్దిష్టమైన పనిని అలవాటు చేసుకోండి. ఉదాహరణకు, ఆఫీసు ఐడి కార్డు తీసి బ్యాగులో పెట్టడం లేదా ఆఫీసు బట్టలు మార్చుకుని స్నానం చేయడం. ఇది మీ మెదడుకు "ఆఫీసు పని అయిపోయింది, ఇప్పుడు వ్యక్తిగత సమయం మొదలైంది" అని చెప్పే ఒక 'సైకలాజికల్ స్విచ్'.డిజిటల్ బౌండరీస్: పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టండి. ఆఫీసు వాట్సాప్ గ్రూపులను 'మ్యూట్' చేయండి. ఆ నీలి రంగు వెలుతురు (Blue light) మీ నిద్రకు అవసరమైన 'మెలటోనిన్' హార్మోన్‌ను దెబ్బతీస్తుంది.వర్రీ టైమ్ (Worry Time): మీకు ఆందోళన కలిగించే విషయాల గురించి ఆలోచించడానికి సాయంత్రం ఒక 15 నిమిషాల సమయాన్ని కేటాయించండి. ఆ సమయంలో మాత్రమే వాటి గురించి ఆలోచించండి. బెడ్ మీదకు వెళ్ళాక ఆలోచనలు వస్తే, "దీని గురించి ఆలోచించడానికి రేపు సాయంత్రం టైమ్ ఉంది కదా" అని వాయిదా వేయండి.మైండ్‌ఫుల్ బ్రీతింగ్: నిద్రపోయే ముందు 4-7-8 టెక్నిక్ (4 సెకన్లు శ్వాస తీసుకోవడం, 7 సెకన్లు ఆపడం, 8 సెకన్లు వదలడం) పాటించండి. ఇది మీ నాడీ వ్యవస్థను శాంతపరిచి, ఆలోచనల వేగాన్ని తగ్గిస్తుంది.Today's Taskఈ రాత్రి పడుకునే ముందు, రేపు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులను ఒక డైరీలో రాసి, ఆ డైరీని మూసి పక్కన పెట్టండి. మీ మెదడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో గమనించండి.మీరు నిద్రపోవడం అంటే పనిని నిర్లక్ష్యం చేయడం కాదు.. రేపటి పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం. గుర్రానికి విశ్రాంతి ఇస్తేనే అది రేపటి రేసులో పరిగెత్తగలదు. మీ మెదడు కూడా అంతే!- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్‌సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
గతకాలపు గాయాలకు మందు వేయాలి
మనిషి వ్యక్తిత్వం అనేది ఒక అందమైన శిల్పం అనుకుంటే, Early Childhood Trauma (బాల్యకాలపు గాయాలు) అనేది ఆ శిల్పం చెక్కేటప్పుడు రాయికి తగిలిన బలమైన దెబ్బలు. చాలామంది వ్యక్తిత్వ వికాసాన్ని కేవలం ఒక "అదనపు నైపుణ్యం"గా భావిస్తారు, కానీ సైకాలజీ ప్రకారం, మీ వర్తమాన ప్రవర్తన వెనుక మీ గతం తాలూకూ నీడలు ఉంటాయి. బాల్యంలో ఎదురయ్యే మానసిక గాయాలు మన వ్యక్తిత్వాన్ని ఎలా శాసిస్తాయో ఈ ఆర్టికల్‌లో లోతుగా చర్చిద్దాం.1. అసలు 'ట్రామా' (Trauma) అంటే ఏమిటి?ట్రామా అంటే ఒక పెద్ద ప్రమాదం జరగడం మాత్రమే కాదు. ఒక బిడ్డ తన మనసుతో తట్టుకోలేనంత ఒత్తిడికి లోనైనప్పుడు, ఆ అనుభవం మెదడులో ఒక లోతైన ముద్రగా మిగిలిపోతుంది.* ప్రతిరోజూ ఇంట్లో అరుపులు, తిట్లు వినడం.* ఆకలి వేసినప్పుడు లేదా భయం వేసినప్పుడు పట్టించుకునేవారు లేకపోవడం.* ప్రతి చిన్న విషయానికీ శిక్షించడం వల్ల కలిగే భయం.2. ట్రామా మన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చేస్తుంది?బాల్యకాల గాయాలు వ్యక్తిత్వాన్ని మూడు ప్రధాన మార్గాల్లో ప్రభావితం చేస్తాయి.A. Chronic Insecurityచిన్నప్పుడు తల్లిదండ్రుల నుండి సరైన భద్రత లభించని పిల్లలు పెద్దయ్యాక "Anxious Personality" కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ ఏదో కీడు జరుగుతుందని భయపడుతుంటారు. ఎదుటివారు తనను వదిలి వెళ్ళిపోతారేమో అనే భయంతో (Abandonment Fear) అతిగా ప్రవర్తిస్తారు.B. Emotional Detachmentకొంతమంది పిల్లలు తమ బాధను తట్టుకోలేక ఎమోషన్స్‌ను పూర్తిగా ఆపేస్తారు. వీరు పెద్దయ్యాక చాలా గంభీరంగా, ఎవరితోనూ త్వరగా కలవని "Avoidant Personality" గా మారుతారు. వీరికి ప్రేమను వ్యక్తం చేయడం లేదా ఇతరుల బాధను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.C. Hyper-vigilanceట్రామాకు గురైన వారి మెదడు ఎప్పుడూ 'అలర్ట్' మోడ్‌లో ఉంటుంది. ఎవరైనా చిన్న విమర్శ చేసినా దాన్ని తట్టుకోలేరు. చాలా త్వరగా కోపం తెచ్చుకోవడం లేదా విపరీతంగా బాధపడటం వీరి వ్యక్తిత్వంలో భాగమైపోతుంది.మోటివేషనల్ స్పీకర్లు ఇచ్చే "పాజిటివ్ థింకింగ్" చిట్కాలు ఈ గాయాలను తాకలేవు. "నీ గతాన్ని మర్చిపో, ఈరోజు నుంచి ధైర్యంగా ఉండు" అని చెప్తే సరిపోదు. నీ గతం నీ శరీరంలో, నీ నరాల్లో స్టోర్ అయ్యి ఉంది. దాన్ని అడ్రెస్ చేయకుండా పైన పూసే పూతలు పని చేయవు.ఉదాహరణకు, ఒక వ్యక్తికి స్టేజ్ ఫియర్ ఉందనుకోండి. మార్కెట్ ట్రైనర్ అతనికి స్పీకింగ్ టిప్స్ ఇస్తాడు. కానీ సైకాలజీ ఆ వ్యక్తి చిన్నప్పుడు స్కూల్ స్టేజ్ మీద ఏదైనా మర్చిపోయినప్పుడు క్లాస్ టీచర్ అందరిముందు కొట్టిన ఆ 'ట్రామా' గురించి మాట్లాడుతుంది. ఆ పాత జ్ఞాపకాన్ని హీల్ చేయకుండా కొత్త కాన్ఫిడెన్స్ రాదు.3. ట్రామాను అధిగమించి నిజమైన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలి?STEP 1: గుర్తించడంమీ ప్రవర్తనలో ఉన్న లోపాలు (ఉదా: విపరీతమైన కోపం, అభద్రత) మీ చిన్ననాటి ట్రామా నుండి వచ్చాయని గుర్తించడం. "నేను పుట్టుకతో ఇలాంటి వాడిని కాదు, నా పరిస్థితులు నన్ను ఇలా మార్చాయి" అని గ్రహించడమే సగం విజయం. మీ గతంలోని చేదు జ్ఞాపకాలను ఒకసారి వెలికితీసి చూడండి.STEP 2: రీ-పేరెంటింగ్మీ చిన్నతనంలో మీకు లభించని ప్రేమను, ధైర్యాన్ని ఇప్పుడు మీరే మీకు ఇచ్చుకోవాలి. దీన్నే 'Inner Child Healing' అంటారు.మీ మనసులోని ఆ గాయపడిన పిల్లాడిని ఇప్పుడున్న మీరు అక్కున చేర్చుకోవాలి. "నువ్వు సేఫ్ గా ఉన్నావు, నేనున్నాను" అని మిమ్మల్ని మీరు ఓదార్చుకోవాలి. సైకాలజీలో దీన్ని మెంటల్ రీ-వైరింగ్ అంటారు.STEP 3: ట్రాన్స్ఫార్మేషన్ఒక్కసారి ఆ గాయాల నుండి విముక్తి పొందితే, మీ వ్యక్తిత్వంలో ఒక అద్భుతమైన లోతు వస్తుంది. ట్రామాను జయించిన వ్యక్తిలో ఉండే Resilience (తిరిగి నిలబడే శక్తి) సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువగా ఉంటుంది. మీ బలహీనతే మీ అతిపెద్ద బలంగా మారుతుంది. అందుకోసం మూడు ప్రశ్నలను నిజాయితీగా మీకు మీరు వేసుకోండి.మీకు బాగా కోపం వచ్చినప్పుడు లేదా భయం వేసినప్పుడు.. ఆ ఫీలింగ్ మీకు పాత జ్ఞాపకాలను ఏమైనా గుర్తు చేస్తోందా? "నేను చిన్నప్పుడు కూడా ఇలాగే ఫీల్ అయ్యాను కదా!" అని ఎప్పుడైనా అనిపించిందా?మీ మనసులో ఎప్పుడూ విమర్శించే గొంతు ఎవరిది? అది మీ సొంత ఆలోచనా? లేక చిన్నప్పుడు మిమ్మల్ని తిట్టిన మీ నాన్నదో, టీచర్దో లేదా బంధువులదో గొంతుకనా?మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? అందరి నుండి దూరంగా వెళ్ళిపోతారా? లేక అందరిపై అరుస్తారా? ఈ ప్రవర్తన మీ రక్షణ కోసం మీరు చిన్నప్పుడే నేర్చుకున్న ముసుగు కాదా?నిజమైన వ్యక్తిత్వ వికాసం అంటే లోపల ఉన్న ముళ్ళను తీసివేసి, అక్కడ పూలను పూయించడం. ఈ ప్రయాణం కష్టంగా అనిపించినా, ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది.మన గతాన్ని మనం మార్చలేం కానీ, అది మన భవిష్యత్తును శాసించకుండా అడ్డుకోవచ్చు. మీ లోపల ఉన్న గాయాలను హీల్ చేసుకుని బయటకు వచ్చే "Authentic Personality" చాలా పవర్ఫుల్.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!) -
నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!
మనం ఒక భవనాన్ని చూసినప్పుడు దాని రంగులు, కిటికీలు కనిపిస్తాయి కానీ, భూమి లోపల ఉన్న పునాది కనిపించదు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. మీరు ఈరోజు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా, లేదా ఎంత భయపడుతున్నా.. దాని వెనుక మీ జీవితంలోని మొదటి 2,000 రోజులు (మొదటి ఐదేళ్లు) ఉన్నాయి.సైకాలజీలో ఒక ప్రసిద్ధ మాట ఉంది: "Give me a child until he is seven, and I will show you the man." అంటే, ఏడేళ్ల లోపు ఒక బిడ్డను నాకు ఇస్తే, అతను భవిష్యత్తులో ఎలాంటి వాడో నేను చెప్పగలను అని. ఎలిజబెత్ హర్లాక్ ఈ కాలాన్ని 'పునాది దశ' (Foundational Stage) అని పిలిచారు.నమ్మకం vs అపనమ్మకం (Trust vs Mistrust): పుట్టిన మొదటి ఏడాది బిడ్డ పుట్టిన మొదటి ఏడాదిలో నేర్చుకునే అత్యంత ముఖ్యమైన విషయం "ప్రపంచం సురక్షితమైనదా? కాదా?".సురక్షితమైన పునాది: బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి వెంటనే పాలు పట్టడం, దగ్గరకు తీసుకోవడం, ప్రేమగా నిమరడం చేస్తే.. ఆ బిడ్డ సబ్-కాన్షియస్ మైండ్‌లో "ఈ ప్రపంచం నమ్మదగినది. ఇక్కడ నా అవసరాలు తీరుతాయి" అనే నమ్మకం కలుగుతుంది. ఇది భవిష్యత్తులో ఆ వ్యక్తి ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి పునాది అవుతుంది.అభద్రతా భావం: అదే బిడ్డను పట్టించుకోకపోతే, ఆకలితో ఏడుస్తున్నా నిర్లక్ష్యం చేస్తే.. "ఎవరినీ నమ్మలేం, నా గురించి ఎవరూ పట్టించుకోరు" అనే అభద్రతా భావం మొదలవుతుంది. పెద్దయ్యాక ఇలాంటి వారు ఎవరినీ త్వరగా నమ్మలేరు (Trust issues).స్వయంప్రతిపత్తి (Autonomy): 2 నుండి 3 ఏళ్లుఈ దశలో బిడ్డ తన కాళ్లపై తాను నడవడం, తన చేత్తో తాను తినడం నేర్చుకుంటాడు. అంటే తనకంటూ ఒక 'ఇచ్ఛ' (Will) ఉందని గుర్తించే సమయం.పర్యవేక్షణ vs అణచివేత: బిడ్డ తనంతట తాను ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు (ఉదాహరణకు: గ్లాసుతో నీళ్లు తాగడం), తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం (Self-confidence) పెరుగుతుంది."వద్దు.. నువ్వు వొంపేస్తావు, నీకు రాదు" అని ప్రతిదానికీ అరిస్తే.. వారిలో సందేహం (Doubt), సిగ్గు (Shame) మొదలవుతాయి. "నేను ఏదీ సరిగ్గా చేయలేను" అనే నెగటివ్ సెల్ఫ్-ఇమేజ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది.చొరవ (Initiative): 4 నుండి 5 ఏళ్లుఈ వయస్సులో పిల్లలు చాలా ప్రశ్నలు వేస్తారు. ప్రతిదీ తెలుసుకోవాలని కుతూహల పడతారు. ప్రపంచాన్ని ఒక 'ప్లే గ్రౌండ్' లా చూస్తారు.సృజనాత్మకత: పిల్లల ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్తూ, వారి ఆటలను ప్రోత్సహిస్తే వారిలో నాయకత్వ లక్షణాలు (Leadership), సృజనాత్మకత (Creativity) పెరుగుతాయి.అపరాధభావం (Guilt): వారి ప్రశ్నలను విసుక్కుంటే, వారి ఆటలను అల్లరిగా భావించి శిక్షిస్తే.. "నేను ఏదో తప్పు చేస్తున్నాను" అనే గిల్ట్ ఫీలింగ్ వారిలో నాటుకుపోతుంది. పెద్దయ్యాక వీరు ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా భయపడతారు.సో-కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, మోటివేషనల్ స్పీకర్లు ఇచ్చే చిట్కాలు (ఉదాహరణకు: అద్దం ముందు నిలబడి గట్టిగా అరవడం) ఈ లోతైన పునాది గోడలను మార్చలేవు.ఎందుకంటే...మీరు 30 ఏళ్ల వయస్సులో "నేను కాన్ఫిడెంట్‌గా ఉండాలి" అని అనుకుంటున్నారు. కానీ మీ సబ్-కాన్షియస్ మైండ్‌లో 3 ఏళ్ల వయస్సులో పడ్డ "నువ్వు ఏదీ సరిగ్గా చేయలేవు" అనే ముద్ర అలాగే ఉంది. పైన మీరు ఎన్ని కోట్లు వేసుకున్నా, లోపల ఆ చిన్న పిల్లాడు ఇంకా భయపడుతూనే ఉంటాడు.Real Personality Development అంటే.. ఆ చిన్ననాటి ముద్రలను గుర్తించి, వాటిని రీ-ప్రోగ్రామ్ చేయడం, మీ ఇన్నర్ చైల్డ్ ను హీల్ చేయడం. కేవలం బాడీ లాంగ్వేజ్ మార్చడం కాదు.ఇదే నిజమైన వ్యక్తిత్వ వికాసం: Genius Matrix WayStep 1: Break (విశ్లేషించడం)మీరు ఇప్పుడు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా (ఉదాహరణకు: స్టేజ్ ఫియర్, రిలేషన్షిప్ సమస్యలు), దానికి మూలాలు మీ మొదటి ఐదేళ్లలో ఎక్కడ ఉన్నాయో వెతకండి."నన్ను చిన్నప్పుడు అతిగా కంట్రోల్ చేశారా?""నా అవసరాలను నా తల్లిదండ్రులు గుర్తించారా?"ఈ విశ్లేషణే మీ పాత వ్యక్తిత్వాన్ని 'బ్రేక్' చేస్తుంది.Step 2: Build (తిరిగి నిర్మించడం)మీ చిన్నతనంలో మీకు దక్కని ప్రోత్సాహాన్ని ఇప్పుడు మీరు మీకు ఇచ్చుకోవాలి. దీనినే 'Reparenting yourself' అంటారు. మీ అంతరాత్మతో మీరు మాట్లాడే తీరును మార్చుకోవాలి."నీకు చేతకాదు" అనే మాటను "నువ్వు నేర్చుకోగలవు" అనే మాటతో రీప్లేస్ చేయాలి.Step 3: Beyond (పరిమితులకు ఆవల)ఒక్కసారి మీ మూలాలు మీకు అర్థమైతే, పాత గాయాలు మీ వ్యక్తిత్వాన్ని శాసించవు. మీరు ఒక స్వేచ్ఛా జీవిగా మారుతారు. ఎదుటివారి సర్టిఫికేట్లతో సంబంధం లేకుండా మీ లెగసీని మీరు నిర్మించుకుంటారు.మొదటి ఐదేళ్లు మీ వ్యక్తిత్వానికి పునాది వేశాయి. అది మీ తప్పు కాదు. కానీ 25 లేదా 30 ఏళ్ల వయస్సులో కూడా అదే పాత భయాలతో బ్రతకడం మీ బాధ్యతారాహిత్యం అవుతుంది. మిమ్మల్ని మీరు రీ-డిజైన్ చేసుకోగలరు!ఎలిజబెత్ హర్లాక్ చెప్పినట్లు, వ్యక్తిత్వం అనేది 'డైనమిక్'. అంటే దాన్ని మార్చుకోవచ్చు. మీ పునాది గోడల్లో పగుళ్లు ఉన్నాయని తెలిస్తే, వాటిని సిమెంట్ వేసి పూడ్చవచ్చు. ఆ పునాదిని అర్థం చేసుకోవడమే Real Personality Development.Self-Reflection: ఈరోజు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మీ ఐదేళ్ల వయస్సును గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీరు ఎలా ఉండేవారు? మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎలా చూసేవారు? ఆ జ్ఞాపకాల్లోనే మీ వ్యక్తిత్వ రహస్యం దాగి ఉంది.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The DNA of You: 'పర్సనాలిటీ'కి పునాది ఎక్కడ పడుతుందంటే..!) -
'పర్సనాలిటీ'కి పునాది ఎక్కడ పడుతుందంటే..!
మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు.. "అచ్చం వాళ్ళ నాన్న లాగే కోపం", "వాళ్ళ అమ్మ లాగే తెలివైనది" అని అంటుంటాం. మరికొన్ని సార్లు, "వాళ్ళ ఇంట్లో అందరూ సాఫ్ట్.. ఈయన ఒక్కడే ఇంత మొండివాడు ఏంటి?" అని ఆశ్చర్యపోతుంటాం.అసలు ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా తయారవుతుంది? అది మనం పుట్టుకతో తెచ్చుకున్నదా? లేక పెరిగిన వాతావరణం నేర్పినదా?సైకాలజీలో దీనినే Nature vs Nurture (ప్రకృతి vs పెంపకం) అంటారు. డెవలప్మెంటల్ సైకాలజీ ప్రకారం, వ్యక్తిత్వం అనేది కేవలం ఒక రోజులో వచ్చేది కాదు. ఇది గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుండి మొదలై, మన ఎదుగుదల క్రమంలో రూపుదిద్దుకుంటుంది.1. అనువంశికత (Heredity): మీ పర్సనాలిటీ బ్లూప్రింట్మనం పుట్టినప్పుడే కొన్ని లక్షణాలను మన DNAలో మోసుకొస్తాం. మీ తల్లిదండ్రుల నుండి మీకు కేవలం కళ్ళ రంగు, ఎత్తు మాత్రమే కాదు.. మీ మెదడు పనితీరు, మీ ఎమోషనల్ టెంపరమెంట్ కూడా వస్తాయి.Temperament: కొందరు పిల్లలు పుట్టగానే చాలా ప్రశాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఇది వారి DNA లోనే ఉంటుంది. దీనినే 'బయోలాజికల్ ఫౌండేషన్' అంటారు.Intelligence: తెలివితేటలకు సంబంధించిన ప్రాథమిక సామర్థ్యం అనువంశికంగానే వస్తుంది. అయితే దాన్ని ఎలా వాడుకుంటాం అనేది తర్వాత మనం చేసే కృషిపై ఆధారపడి ఉంటుంది.Nervous System: మీ నాడీ వ్యవస్థ ఒత్తిడికి ఎలా స్పందిస్తుంది అనేది కూడా మీ జీన్స్‌లోనే ఉంటుంది. అందుకే కొందరు చిన్న శబ్దానికే ఉలిక్కిపడతారు, కొందరు ఎంత గొడవలో ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు.2. పరిసరాలు (Environment): శిల్పి చేతిలో ఉలిDNA మీకు ఒక పునాదిని ఇస్తే, మీ చుట్టూ ఉన్న పరిసరాలు ఆ పునాదిపై భవనాన్ని నిర్మిస్తాయి. పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వరకు ఉండే వాతావరణం అత్యంత కీలకం.Early Experiences: చిన్నప్పుడు మీకు లభించిన ప్రేమ, రక్షణ లేదా ఎదురైన అవమానాలు మీ 'సెల్ఫ్-కాన్సెప్ట్'ను డిజైన్ చేస్తాయి. ఒక బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి వెంటనే దగ్గరకు తీసుకుంటే, ఆ బిడ్డలో "ప్రపంచం సురక్షితమైనది" అనే నమ్మకం కలుగుతుంది. అదే నిర్లక్ష్యం చేస్తే, "నేను ఎవరికీ అక్కర్లేదు" అనే అభద్రతాభావం (Insecurity) మొదలవుతుంది.కుటుంబ నిర్మాణం: ఇంట్లో మీరు పెద్దవారా? చిన్నవారా? మీ తల్లిదండ్రుల మధ్య సంబంధం ఎలా ఉంది? ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని మలుస్తాయి.సాంస్కృతిక ప్రభావం: మన తెలుగు సంస్కృతిలో పెరిగిన వ్యక్తికి, పాశ్చాత్య దేశాల్లో పెరిగిన వ్యక్తికి విలువలు, ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది.3. మోటివేషనల్ స్పీకర్లు ఇక్కడ ఎందుకు విఫలమవుతారు?సో-కాల్డ్ మోటివేషనల్ స్పీకర్లు ఏం చెప్తారంటే.. "నీ గతం నీకు అనవసరం. నువ్వు ఈ క్షణం నుంచి మారిపోవచ్చు." ఇది వినడానికి బాగుంటుంది కానీ, సైంటిఫిక్ గా అసాధ్యం.ఎందుకంటే మీ మెదడులో పడ్డ ముద్రలు (Neural Pathways) చాలా బలంగా ఉంటాయి. మీ DNA మరియు మీ చిన్ననాటి చేదు అనుభవాలను (Trauma) పట్టించుకోకుండా, పైన "పాజిటివ్ థింకింగ్" అనే పెయింట్ వేస్తే.. లోపల ఉన్న తుప్పు పోదు.ఉదాహరణకు ఒక వ్యక్తికి చిన్నప్పుడు వాళ్ళ నాన్న అథారిటేటివ్‌గా ఉండి, ఎప్పుడూ భయపెడుతూ పెంచారనుకుందాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఆఫీసులో బాస్ దగ్గర మాట్లాడాలన్నా భయపడతాడు. ఒక మోటివేషనల్ ట్రైనర్ వచ్చి "ధైర్యంగా ఉండు" అని చెప్తే సరిపోదు. అక్కడ సమస్య బాస్ కాదు.. ఆ వ్యక్తి సబ్-కాన్షియస్ మైండ్‌లో ఉన్న 'తండ్రి' అనే అథారిటీ ఫిగర్ పట్ల ఉన్న భయం. ఆ 'DNA/Past'ను అడ్రెస్ చేయకుండా పర్సనాలిటీ మారదు.4. అసలైన వ్యక్తిత్వ వికాసంనా Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ DNA మరియు పర్యావరణ ప్రభావాలను మనం ఎలా డీల్ చేయాలి?Step 1: Break (గుర్తించడం, విడగొట్టడం)మీ వ్యక్తిత్వానికి పునాది ఎక్కడ పడిందో తెలుసుకోవడమే మొదటి మెట్టు. "నాకు ఎందుకు కోపం వస్తుంది? ఇది నా DNA లో ఉందా? లేక చిన్నప్పుడు నేను చూసిన మా నాన్న ప్రవర్తనా?" అని విశ్లేషించాలి. మీ గతాన్ని మీరు తవ్వాలి. ఆ పాత ముద్రలను, భయాలను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయాలి.Step 2: Build (సరైన నిర్మాణాన్ని నిర్మించడం)DNA ని మనం మార్చలేం కానీ, అది ఎలా ఎక్స్‌ప్రెస్ అవ్వాలి అనేదాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు (దీన్ని సైన్స్‌లో Epigenetics అంటారు).మీకు కోపం వచ్చే స్వభావం DNA లో ఉన్నా.. మెడిటేషన్ ద్వారా, మైండ్‌ఫుల్‌నెస్ ద్వారా దాన్ని నియంత్రించడం నేర్చుకోవచ్చు.పాత వాతావరణం మీకు నెగటివిటీని ఇచ్చి ఉంటే, ఇప్పుడు మీరు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసుకోవాలి.Step 3: Beyond (పరిమితులకు అతీతంగా)మీరు కేవలం మీ జీన్స్ కి లేదా మీ గతానికి బానిసలు కాదు. మీ 'DNA ఆఫ్ పర్సనాలిటీ'ని అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని మీ అభివృద్ధికి ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. ఒక బలహీనతను బలంతో ఎలా రీప్లేస్ చేయాలో తెలిసినప్పుడే మీరు ఒక 'జీనియస్' గా ఎదుగుతారు.5. ప్రాక్టీస్ కోసం ఒక చిన్న ఎక్సర్సైజ్మీ వ్యక్తిత్వానికి పునాది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈ మూడు ప్రశ్నలు వేసుకోండి.Heredity: నా అలవాట్లలో మా అమ్మ/నాన్న పోలికలు ఏమున్నాయి? (కోపం, ఆందోళన, తెలివితేటలు, మొండితనం?)Environment: నా చిన్నతనంలో నన్ను ఎక్కువగా బాధించిన లేదా ప్రభావితం చేసిన సంఘటన ఏది? అది ఇప్పటికీ నా నిర్ణయాలను ప్రభావితం చేస్తోందా?Realization: నేను ఇప్పటివరకు అనుకుంటున్న 'నేను' నిజమైన నేనేనా? లేక నా చుట్టూ ఉన్న పరిస్థితులు సృష్టించిన ప్రతిబింబమా?మన DNA మనకు ఒక Map ఇస్తుంది. కానీ ఎటు ప్రయాణం చేయాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మీ వ్యక్తిత్వానికి పునాది ఎక్కడ పడిందో తెలుసుకోవడం అంటే.. మిమ్మల్ని మీరు నిందించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు విముక్తి (Liberate) చేసుకోవడం.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ..
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, కోటు వేసుకున్న ఒక వ్యక్తి స్టేజ్ మీద అరుస్తూ, "నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు", "నీలో ఒక సింహం ఉంది", "ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి నేను తోపు అని చెప్పుకో" అంటూ డైలాగులు కొడుతుంటారు. వీటిని చూసి జనం ఇన్‌స్టంట్‌గా ఉత్తేజానికి లోనవుతారు. కానీ, ఆ వీడియో ముగిసిన అరగంటకే మళ్ళీ పాత భయాలు, పాత బలహీనతలు చుట్టుముడతాయి.ఎందుకు?ఎందుకంటే, మార్కెట్ అమ్ముతున్నది 'మోటివేషనల్ డ్రగ్'. కానీ మనకు కావాల్సింది రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్.మోటివేషన్ అనేది ఒక కప్పు కాఫీ లాంటిది. తాగినప్పుడు కిక్ ఇస్తుంది, ఆ తర్వాత నీరసం వచ్చేస్తుంది. కానీ వ్యక్తిత్వ వికాసం అనేది మన మనసులోని సాఫ్ట్‌వేర్‌ను రీ-రైట్ చేసే ఒక సుదీర్ఘ ప్రక్రియ.సో-కాల్డ్ ట్రైనర్స్ చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే... అందరికీ ఒకే మందు (One size fits all) ఇవ్వాలని చూడటం."ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండండి. నెగటివిటీని దరిచేరనీయకండి. అన్నీ మంచివే జరుగుతాయని నమ్మండి" అని చెప్తారు సో-కాల్డ్ ట్రైనర్స్. దీన్ని సైకాలజీలో 'Toxic Positivity' అంటారు.కోపం, భయం, అసూయ, బాధలాంటి నెగటివ్ ఎమోషన్స్ కూడా మనిషిలో ఒక భాగమే. వాటిని అణచివేస్తే అవి లోపల కుళ్ళిపోయి డిప్రెషన్ లేదా యాంగ్జైటీగా మారుతాయి.Real Personality Development అంటే నెగటివ్ ఎమోషన్స్‌ను అణచివేయడం కాదు, వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి. నాకు భయం వేస్తోంది అని ఒప్పుకోవడం బలహీనత కాదు, ఆ భయాన్ని జయించడానికి అది మొదటి మెట్టు."నీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా ఉన్నట్టు నటించు. అది చూసి లోకం నమ్ముతుంది, మెల్లగా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది" అంటారు ట్రైనర్స్.కానీ, ఇది మిమ్మల్ని 'Imposter Syndrome' కి గురి చేస్తుంది. లోపల డొల్లతనం ఉండి పైన మేకప్ వేసుకుంటే, ఎక్కడో ఒకచోట ఆ ముసుగు జారిపోతుందనే భయం మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తుంది.Real Personality Development అంటే నటించడం కాదు, 'అర్హత'ను (Competence) పెంచుకోవడం. మీరు ఒక పనిలో నిష్ణాతులు అయినప్పుడు, కాన్ఫిడెన్స్ అనేది ఒక బై-ప్రొడక్ట్‌లా దానంతట అదే వస్తుంది.సైకాలజీ ప్రకారం వ్యక్తిత్వం అంటే 'అలవాటు' కాదు, అది ఒక 'ఆర్గనైజేషన్'. వ్యక్తిత్వం అనేది కేవలం మనం నేర్చుకునే స్కిల్స్ కాదు. అది మన అనువంశికత (Heredity), పరిసరాల (Environment) సంక్లిష్టమైన కలయిక.మోటివేషనల్ స్పీకర్లు కేవలం ఈ క్షణం గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ సైకాలజీ మీ 'బాల్యం' (Childhood) గురించి మాట్లాడుతుంది.మీ పర్సనాలిటీకి పునాది మీ ఐదేళ్ల వయసులోనే పడిపోయింది. ఆ పునాదిలో ఉన్న పగుళ్లను (Trauma/Negative conditioning) పూడ్చకుండా పైన అంతస్తులు కడితే, ఆ భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చు.నేను డెవలప్ చేసిన నా "Genius Matrix" Break. Build. Beyond. మోడల్ ద్వారా ఈ సో-కాల్డ్ ట్రైనర్స్ ఎక్కడ విఫలమవుతున్నారో చూడండి:స్టెప్ 1: Break (పాత పునాదిని కూల్చడం)ట్రైనర్స్ డైరెక్ట్‌గా బిల్డింగ్ కట్టమంటారు. కానీ సైకాలజీ ప్రకారం, ముందు లోపల ఉన్న శిథిలాలను తొలగించాలి.చిన్నప్పుడు మీ నాన్న మిమ్మల్ని అందరిముందు తిట్టినప్పుడు "నేను దేనికీ పనికిరాను" అని మీ మనసులో పడ్డ ముద్రను చెరిపేయకుండా, పైన మీరు ఎన్ని "సక్సెస్ మంత్రాలు" చదివినా ఉపయోగం లేదు.మీ బలహీనతలు, మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడ మొదలయ్యాయో గుర్తించి, ఆ పాత సెల్ఫ్-ఇమేజ్ను బ్రేక్ చేయడమే అసలైన వికాసం.స్టెప్ 2: Build (లోపలి నుంచి బయటికి)ఇక్కడ మనం బాహ్య ప్రదర్శనపై కాకుండా, అంతర్గత విలువలపై దృష్టి పెడతాం.ఒక వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు (Real Self) అనేది కీలకం. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఒక "సక్సెస్ ఫుల్ పర్సన్" కనిపించాల్సిన అవసరం లేదు, ఒక "నిజాయితీ గల మనిషి" కనిపిస్తే చాలు.గొడవ జరిగినప్పుడు అరవకుండా ఉండటం 'కమ్యూనికేషన్ ట్రిక్' కాదు, అది మనసును కంట్రోల్ చేసే 'మెంటల్ స్ట్రెంత్'.స్టెప్ 3: Beyond (పరిమితుల ఆవల - లెగసీ నిర్మించడం)మార్కెట్ కోరుకునేది 'సక్సెస్'. సైకాలజీ కోరుకునేది 'సాటిస్ఫాక్షన్', 'గ్రోత్'.ఎదుటివారిని ఇంప్రెస్ చేయడం మానేసి, మీరు మీ కోసం బ్రతకడం మొదలుపెట్టినప్పుడు మీరు 'Beyond' స్టేజ్‌లోకి వెళ్తారు. ఇక్కడ మీ పర్సనాలిటీలో ఒక Depth ఉంటుంది. Abraham Maslow చెప్పిన 'Self-Actualization' అంటే ఇదే.ఉదాహరణకు ఒక వ్యక్తికి స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం (Stage Fear). "నువ్వు పులివి.. నువ్వు వెళ్ళి స్టేజ్ మీద ఊగిపో.. కేకలు వేయ్.. జనం చప్పట్లు కొడతారు" అంటాడు మోటివేషనల్ స్పీకర్. ఇది ఒకసారి వర్కౌట్ అవ్వొచ్చు, కానీ భయం పోదు.మరేం చేయాలి?ఆ వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు? విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడా? (Perfectionism). ఎదుటివారు ఏమనుకుంటారో అనే Social Anxiety ఉందా? తన దగ్గర సరైన కంటెంట్ లేదా? అనే అంశాలను పరిశీలించాలి.ముందుగా ఆ వ్యక్తి తనలోని లోపాలను అంగీకరించేలా చేయడం.చిన్న చిన్న గ్రూప్స్ ముందు మాట్లాడించి 'ఎక్స్పోజర్' ఇవ్వడం.స్టేజ్ మీద మాట్లాడటం అంటే 'తన్ను తాను నిరూపించుకోవడం' కాదు, 'సమాచారాన్ని పంచడం' అనే మైండ్‌సెట్ మార్పు తేవడం.ఇది Real Personality Development.చివరగా నేను చెప్పేది ఒక్కటే... పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక మోడల్లా నడవడం కాదు, ఒక నాయకుడిలా మాట్లాడటం కాదు.మీ మనసులో ప్రశాంతత ఉందా?మీరు ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉన్నారా?కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా నిలబడుతున్నారా?మీ తప్పులను మీరు ఒప్పుకోగలుగుతున్నారా?ఇవేవీ మార్కెట్లో లభించే రెండు రోజుల వర్క్‌షాప్‌లలో దొరకవు. వీటికి లోతైన ఆత్మపరిశీలన, శాస్త్రీయ దృక్పథం అవసరం.మనం ఈ Real Personality Development సిరీస్‌లో మాట్లాడబోయేది ఆ లోతైన సత్యాల గురించే.ఇక్కడ సో-కాల్డ్ మోటివేషన్ ఉండదు... కేవలం సైకలాజికల్ ట్రాన్స్ఫార్మేషన్ మాత్రమే ఉంటుంది.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!) -
మీరు అలసిపోయారా? విసిగిపోయారా?
"ఉదయం నిద్ర లేవగానే ఒళ్లంతా భారంగా ఉంటుంది.. ఆఫీసుకి వెళ్లాలనే ఉత్సాహం అస్సలు ఉండదు.. చేసే పని మీద ఏకాగ్రత కుదరదు.." ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా? అయితే మీరు కేవలం 'అలసిపోలేదు', మీరు 'బర్న్ అవుట్' (Burnout) కి గురవుతున్నారు. సాధారణ అలసట ఒక రాత్రి నిద్రతో పోతుంది, కానీ బర్న్ అవుట్ అనేది నిద్రపోయినా తగ్గని ఒక దీర్ఘకాలిక మానసిక నిస్సత్తువ.బర్న్ అవుట్ అంటే ఏమిటి?యంత్రం అతిగా వాడితే ఎలా వేడెక్కి ఆగిపోతుందో, మనిషి కూడా తన శక్తికి మించిన మానసిక ఒత్తిడిని నిరంతరం భరిస్తే 'బర్న్ అవుట్' అవుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని ఒక 'వృత్తిపరమైన రుగ్మత'గా గుర్తించింది. ఇది పని పట్ల విరక్తిని, అపనమ్మకాన్ని కలిగిస్తుంది.4 ముఖ్య సంకేతాలు...1. Emotional Exhaustion ( నిరంతర అలసట): రాత్రి 8 గంటలు పడుకున్నా, ఉదయం లేవగానే ఇంకా నిద్ర చాలలేదన్నట్టు, శక్తి లేనట్టు అనిపించడం. ఇది శారీరక అలసట కాదు, మానసిక శ్రమ వల్ల కలిగే నీరసం.2. Cynicism (నిరాశావాదం): ఒకప్పుడు ఇష్టంగా చేసిన పని ఇప్పుడు భారంగా అనిపించడం. సహోద్యోగుల మీద, క్లయింట్స్ మీద కారణం లేకుండా కోపం రావడం. "నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల ఉపయోగం ఏంటి?" అనే నైరాశ్యం.3. Reduced Productivity (తగ్గిన పనితీరు): ఎంత ప్రయత్నించినా పాత వేగంతో పని చేయలేకపోవడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గంటల తరబడి సమయం పట్టడం.4. శారీరక సమస్యలు: కారణం లేని తలనొప్పి, కడుపులో అసౌకర్యం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం. మనసు పడే ఒత్తిడిని శరీరం ఇలా బయటపెడుతుంది.నా వద్దకు వచ్చిన ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్ రాధ (పేరు మార్చాను) కథ ఇక్కడ చెప్పుకోవాలి. ఆమె 15 ఏళ్లుగా అద్భుతంగా పని చేస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా ఆమె ఆఫీసులో అందరితో గొడవ పడుతోంది. "నాకు ఈ జాబ్ వద్దు, నేను రాజీనామా చేస్తాను" అని ఏడుస్తూ చెప్పింది. వాస్తవానికి ఆమెకు పని చేతకాక కాదు, గత మూడేళ్లుగా సెలవు తీసుకోకుండా పని చేయడం వల్ల ఆమె మెదడు 'బర్న్ అవుట్' స్టేజ్ కి చేరుకుంది. ఆమెకు కావాల్సింది రాజీనామా కాదు, ఒక సుదీర్ఘమైన 'మెంటల్ బ్రేక్'.బయటపడటం ఇలా...* మీ శక్తికి మించిన బాధ్యతలను స్వీకరించడం ఆపండి. ప్రయారిటీలను సెట్ చేసుకోండి. 'నో' చెప్పడం నేర్చుకోండి.* ఆఫీస్ సమయం తర్వాత ల్యాప్‌టాప్, ఆఫీస్ వాట్సాప్ గ్రూపులకు దూరంగా ఉండండి. డిజిటల్ కనెక్షన్ కట్ చేయండి. మీ మెదడుకు 'ఆఫ్ టైమ్' ఇవ్వండి. * మీకు ఇష్టమైన పని (సంగీతం, పెయింటింగ్, లేదా నడక) కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించండి. హాబీలను పునరుద్ధరించండి. ఇది మీ మెదడుకు రీఛార్జ్ లా పనిచేస్తుంది.* విశ్రాంతిని ప్లాన్ చేయండి. సెలవు తీసుకోవడం అంటే సోమరితనం కాదు. అది మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి తీసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్.ఈ వారం మీ కోసం పరీక్ష...* మీకు ఇష్టమైన పనులు చేయడానికి కూడా ఇప్పుడు ఉత్సాహం ఉండటం లేదా?* ఆఫీసులో చిన్న పొరపాటు జరిగినా అతిగా స్పందిస్తున్నారా (Overreacting)?* ఒంటరిగా ఉండాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని అనిపిస్తోందా?పై మూడింటికి 'అవును' అని సమాధానం వస్తే, మీరు బర్న్ అవుట్ వైపు వెళ్తున్నారని అర్థం చేసుకోండి.గుర్తుంచుకోండి.. కాలిపోయిన కొవ్వొత్తి వెలుగునివ్వలేదు. మీరు ఇతరులకు, మీ కంపెనీకి ఉపయోగపడాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీలోని ఉత్సాహం ఆవిరి కాకముందే మేల్కొనండి. బర్న్ అవుట్ లేదా కెరీర్ ఒత్తిడి నుండి బయటపడటానికి కౌన్సెలింగ్ లేదా కోచింగ్ తీసుకోండి.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్‌సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
వర్క్-లైఫ్ బ్యాలెన్స్: సాధ్యమేనా? లేక అపోహనా?
"ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి పనులు గుర్తుకొస్తాయి.. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫైళ్లు కళ్లముందు కదులుతాయి." ఇదీ ఈ తరం ఉద్యోగి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. చాలామందికి 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' అనేది కేవలం పుస్తకాల్లో కనిపించే పదంలా, లేదా కార్పొరేట్ కంపెనీలు గోడల మీద తగిలించే పోస్టర్లా మాత్రమే మిగిలిపోయింది. అసలు ఈ బ్యాలెన్స్ సాధ్యమేనా? లేక అదో అందని ద్రాక్షా?బ్యాలెన్స్ అంటే 50-50 కాదు!చాలామంది 'బ్యాలెన్స్' అంటే 24 గంటలను సమానంగా ఆఫీసుకి, ఇంటికి పంచడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే సమయాన్ని పంచడం కాదు..'ప్రెజెన్స్' (ఉనికిని)పంచడం. అంటే ఆఫీసులో ఉన్నప్పుడు 100శాతంఅక్కడే ఉండటం, ఇంటికి వచ్చాక ఆఫీసు ఆలోచనల నుంచి 100శాతంబయటపడటం. అది లేనప్పుడే అసలైన ఒత్తిడి మొదలవుతుంది.నా దగ్గరికి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ మేనేజర్ కిరణ్ (పేరు మార్చాను) అనుభవమే దీనికి నిదర్శనం. కిరణ్రోజూ 12 గంటలు పని చేస్తాడు. "నా భార్యాపిల్లల కోసమే కదా ఇంత కష్టపడుతున్నాను" అంటాడు. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతని చేతిలో ఫోన్, మెదడులో ప్రాజెక్ట్ డెడ్ లైన్లు ఉంటాయి. పిల్లలు ఏదైనా అడిగితే చిరాకు పడతాడు. ఫలితంగా, అతను భౌతికంగా ఇంట్లోనే ఉన్నా, మానసికంగా ఎప్పుడో ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సమస్య 'సమయం' కాదు.. 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయలేకపోవడం.బ్యాలెన్స్ ఎందుకు దెబ్బతింటోంది?• డిజిటల్ కనెక్షన్:వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్ నోటిఫికేషన్లు ఆఫీసుని మన బెడ్రూమ్ దాకా తీసుకొచ్చాయి.• గిల్ట్ (అపరాధ భావం): "నేను ఆన్ లైన్ లో లేకపోతే పని ఆగిపోతుందేమో" లేదా "నా బాస్ ఏమనుకుంటారో" అన్న భయం.• ‘నో’చెప్పలేకపోవడం:మన శక్తికి మించిన బాధ్యతలను మొహమాటానికి ఒప్పుకోవడం.'బ్యాలెన్స్' సాధించడానికి 5 ప్రాక్టికల్ టిప్స్1. Mental Gateway:ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే దారిని ఒక వంతెనలా వాడుకోండి. ఆ ప్రయాణంలో సంగీతం వినడమో, లేదా ఆ రోజు జరిగిన పనుల గురించి ఆలోచనలను అక్కడే క్లోజ్ చేయడమో చేయండి. ఇంటి తలుపు తీసే ముందే ఆఫీసు టెన్షన్లను బయటే వదిలేయండి.2. Tech-Free Zone:రాత్రి భోజనం చేసేటప్పుడు లేదా పిల్లలతో ఆడుకునేటప్పుడు ఫోన్ ని పక్క గదిలో ఉంచండి. నోటిఫికేషన్ల శబ్దం మీ ప్రశాంతతను దోచుకోకుండా చూసుకోండి.3. Quality Vs Quantity:మీరు కుటుంబంతో ఎన్ని గంటలు ఉన్నారన్నది కాదు.. ఉన్న ఆ కాసేపు ఎంత quality time గడిపారన్నదే ముఖ్యం. రెండు గంటలు ఫోన్ పక్కన పెట్టుకుని కూర్చోవడం కంటే, ఫోన్ చూడకుండా 20 నిమిషాలు మీ భాగస్వామితో, పిల్లలతో మాట్లాడటం ఎంతో మేలు.4. Boundaries:పని వేళలు ముగిశాక, అత్యవసరమైతే తప్ప కాల్స్/మెయిల్స్ కి అటెండ్ అవ్వకూడదనే నియమాన్ని మీ బాస్ కి, కొలీగ్స్ కి సున్నితంగా చెప్పండి. మీ ప్రైవేట్ టైమ్ ని మీరు గౌరవిస్తేనే, ఇతరులు గౌరవిస్తారు.5. Self-Care:ఖాళీ గ్లాసుతో ఇతరుల దాహం తీర్చలేం. మీకు ఇష్టమైన హాబీని పాటించడం లేదా వ్యాయామం చేయడం వల్ల మీ 'ఎనర్జీ లెవల్స్' పెరుగుతాయి. అప్పుడు మీరు ఆఫీసులోనూ, ఇంట్లోనూ యాక్టివ్ గా ఉండగలరు.మీ కోసం ఒక సెల్ఫ్-చెక్గత వారం రోజుల్లో, మీరు ఏకాగ్రతతో మీ కుటుంబ సభ్యుల కళ్లలోకి చూస్తూ కనీసం 10 నిమిషాలు మాట్లాడారా? లేకపోతే, మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని అర్థం.గుర్తుంచుకోండి.. మీరు ఉద్యోగం మానేస్తే మీ సీటును భర్తీ చేయడానికి కంపెనీకి వారం రోజులు పట్టదు. కానీ మీ కుటుంబంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కెరీర్ లో ఎదగండి.. కానీ ఆ క్రమంలో మీ జీవితాన్ని కోల్పోకండి. అవసరమనిపిస్తే సైకాలజిస్ట్ లేదా కెరీర్ కోచ్ సహాయం తీసుకోండి.సైకాలజిస్ట్ విశేష్కెరీర్&మైండ్‌సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
జాబ్ స్ట్రెస్.. శత్రువే కాదు మిత్రుడు కూడా!
నేటి కార్పొరేట్ యుగంలో ’ఉద్యోగం’ అంటే కేవలం పని మాత్రమే కాదు, అదో నిరంతర యుద్ధం. ఉదయం అలారం మోగినప్పటి నుండి, ఆఫీసు డెడ్లైన్లు.. బాస్ నుంచి వచ్చే కాల్స్.. టార్గెట్లు.. పక్క సీటు సహోద్యోగితో పోటీ.. అర్ధరాత్రి బాస్ పంపే మెయిల్,,, అన్నీ కలిసి జాబ్ స్ట్రెస్. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగిని ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు వెంటాడే భూతం ఇది.అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఇది ఎప్పుడూ మనకు శత్రువేనా? అంటే కాదనే అంటాను. అది మిత్రుడిలా మనల్ని ముందుకు నడిపించగలదు, శత్రువులా మనల్ని కుంగదీయగలదు. ఆ తేడాను గుర్తించడమే ’ఉద్యోగ పర్వం’లో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం.శాస్త్రీయంగా ఒత్తిడి రెండు రకాలు.. 1. యూస్ట్రెస్ (పాజిటివ్ ఒత్తిడి): ఒక ప్రజెంటేషన్ ఇచ్చే ముందు కలిగే చిన్నపాటి భయం, ఒక కొత్త బాధ్యత తీసుకున్నప్పుడు వచ్చే ఉత్సాహం. ఇది మనల్ని ఏకాగ్రతతో పనిచేసేలా చేస్తుంది. ఇది మనకు ’మిత్రుడు’.2. డిస్ట్రెస్ (నెగటివ్ ఒత్తిడి): పని భారం మితిమీరినప్పుడు, భవిష్యత్తుపై అభద్రతాభావం కలిగినప్పుడు వచ్చేది. ఇది మన ఆరోగ్యాన్ని, పనితీరును దెబ్బతీస్తుంది. ఇది మన ’శత్రువు’.శత్రువుగా మారినప్పుడు సంకేతాలు..ఒత్తిడి మీ నియంత్రణ తప్పుతోందని చెప్పడానికి మీ శరీరం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది.· ఆఫీసు పేరు వింటేనే గుండెల్లో దడ మొదలవ్వడం.· ఆకలి మందగించడం లేదా ’స్ట్రెస్ ఈటింగ్’ (ఒత్తిడిలో ఎక్కువగా తినడం).· ఏకాగ్రత కుదరకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు.· చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం· ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినా పని గురించి ఆలోచిస్తూ కుటుంబానికి దూరం కావడం.· నిద్రలేమి, తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు· పని మీద ఆసక్తి తగ్గిపోవడం.రాజేష్ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్. అద్భుతమైన పనితీరు ఉన్నప్పటికీ, గత ఆరు నెలలుగా అతను తీవ్రమైన మెడనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నాడు. ఆఫీసులో చిన్న విషయాలకే చిరాకు పడటం, ఇంటికి వెళ్ళాక పిల్లలతో సరిగ్గా గడపలేకపోవడం అతన్ని మానసిక వేదనకు గురిచేసింది. రాజేష్ తన టీమ్ చేసే ప్రతి చిన్న పనిని తానే పర్యవేక్షించాలనుకోవడం (Micromanagement ). ‘నేను లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది‘ అనే అపోహే అతని ఒత్తిడికి ప్రధాన కారణం. కౌన్సెలింగ్‌లో అతనికి ’డెలిగేషన్’ (పనిని ఇతరులకు అప్పగించడం), ’మైండ్‌ఫుల్‌నెస్’ టెక్నిక్స్ నేర్పించాం. మూడు నెలల తర్వాత, రాజేష్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, అతని టీమ్ ఉత్పాదకత కూడా 30శాతం పెరిగింది.ఒత్తిడిని మిత్రుడిగా మార్చుకోవడానికి 5 సూత్రాలు..1. Circle of Control : మీరు మార్చగలిగే పనుల మీద (మీ పనితీరు, టైమ్ మేనేజ్మెంట్) దృష్టి పెట్టండి. మీరు మార్చలేని విషయాల గురించి (ఆర్థిక మాంద్యం, బాస్ మూడ్) చింతించడం మానేయండి.2. 2 మినిట్ బ్రీతింగ్: ఒత్తిడి పెరిగినప్పుడు 2 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇది మెదడులోని ’అమిగ్డాలా’ను శాంతపరిచి, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.3. డిజిటల్ డెటాక్స్: ఆఫీస్ సమయం ముగిశాక, కనీసం ఒక గంట పాటు ఫోన్‌ను పక్కన పెట్టండి. నోటిఫికేషన్ల మోత మీ మెదడును నిరంతరం అప్రమత్తంగా (Alert mode) ఉంచి ఒత్తిడిని పెంచుతుంది.4. శారీరక శ్రమ: కనీసం 20 నిమిషాల నడక మీ మెదడులో ’ఎండార్ఫిన్’లను విడుదల చేస్తుంది, ఇవి ఒత్తిడిని తగ్గించే సహజ సిద్ధమైన మందులు.5. Perfectionism వద్దు: అన్ని పనులూ 100శాతం పర్ఫెక్ట్గా ఉండాలనే పట్టుదల ఒత్తిడిని పెంచుతుంది. ’ఎక్సలెన్స్’ మీద దృష్టి పెట్టండి, పర్ఫెక్షన్ మీద కాదు.మీ కోసం చిన్న పరీక్ష.. ఈ క్రింది ప్రశ్నలకు ’అవును’ లేదా ’కాదు’ అని సమాధానం చెప్పుకోండి:· ఆదివారం సాయంత్రం నుంచే మీకు ఆఫీసు గురించి ఆందోళన మొదలవుతోందా?· పని ఒత్తిడి వల్ల మీ వ్యక్తిగత సంబంధాలు లేదా ఆరోగ్యం దెబ్బతింటున్నాయా?· విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మీరు అపరాధ భావన (Guilt) కి గురవుతున్నారా?పై ప్రశ్నల్లో రెండింటికి ’అవును’ అనే సమాధానం వస్తే, మీరు మీ ఒత్తిడిని శత్రువుగా మార్చుకున్నారని అర్థం. ఒత్తిడిని జయించడం అంటే పనిని వదిలేయడం కాదు, పని చేసే విధానాన్ని మార్చుకోవడం. గుర్తుంచుకోండి. మీ కెరీర్ కంటే మీ ఆరోగ్యం.. మీ చిరునవ్వు చాలా విలువైంది.సైకాలజిస్ట్ విశేష్కెరీర్ – మైండ్‌సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
నోటిఫికేషన్లతో కెరీర్ డేమేజ్
అర్ధరాత్రి సరిగ్గా 2:17 గంటలకు అర్చనకు టీమ్స్ నోటిఫికేషన్ వచ్చింది. కళ్లు తెరవాలనిపించలేదు. కానీ ఏం నోటిఫికేషన్ వచ్చిందో వెంటనే చెక్ చేయమని మెదడు అరుస్తోంది. మెదడే నెగ్గింది. అర్చన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసింది. ‘Tomorrow's Deck Updated’’ అని నోటిఫికేషన్ కనిపించింది. నిద్ర ఎగిరిపోయింది. ఇది కేవలం అర్చన కథ కాదు. ప్రతి నగరంలో, ప్రతి కంపెనీలో వేలాది మంది ప్రొఫెషనల్స్ ఇలా ఫోన్ నోటిఫికేషన్ శబ్దాలకు నిద్రను కోల్పోతున్నారు. చూడ్డానికి ఇది చిన్న డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ దాని ప్రభావం వృత్తి, వ్యక్తిత్వం, మానసిక ప్రశాంతత... ఇలా అన్నిటిపై పడుతుంది. ఫోన్ నోటిఫికేషన్లు మన జీవితం మీద చేస్తున్న దాడులు కేవలం శబ్దాల దాడులు కావు. అవి మైక్రో–బ్రెయిన్ హిట్స్. ప్రతి పింగ్ ఒక చిన్న ఒత్తిడి. ప్రతి చిన్న ఒత్తిడి ఒక పెద్ద డిస్టర్బెన్స్. ప్రతి డిస్టర్బెన్స్ చివరకు బర్న్ఔట్కు దారితీస్తుంది. సైన చెప్పే అసలు నిజం...మన మెదడు ఏ పని మీదైనా ఫోకస్ పెట్టగలిగే సమయం సుమారు 8 నుంచి 12 నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో దానికి విఘాతం కలిగితే తిరిగి ఫోకస్ రావడానికి 23 నిమిషాలు పడుతుందని బ్రెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ఉద్యోగులకు రోజుకు వచ్చే నోటిఫికేషన్ల సంఖ్య: వాట్సప్–120, ఈమెయిల్ అలర్ట్స్–40–100, టీమ్స్ 85–150, కేలండర్ పింగ్స్ 10–20. అంటే రోజుకు సగటున 250–300 విఘాతాలు. అంటే మీ ఎనిమిది పని గంటల సమయంలో ఐదు గంటలు పూర్తిగా ఫోకస్ లేకుండా వృథా అవుతున్నాయి. అందుకే చాలామంది ప్రొఫెషనల్స్ రోజంతా బిజీగా ఉన్నప్పటికీ రోజు చివర్లో ‘ఏం చేశాను?’ అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు. ఇది మీ మెదడుపై జరిగిన దాడి.అలసట కాదు, బ్రెయిన్ డామేజ్ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో బర్న్ఔట్ను occupational phenomenon’ జాబితాలో పెట్టింది. వర్క్ ప్లేస్ ఒత్తిడి వల్ల మెదడు ఎగ్జాస్ట్ అవుతోందని అర్థం. బర్న్ఔట్కు మూడు ప్రాథమిక లక్షణాలున్నాయి. ∙భావోద్వేగ అలసట. అంటే, ఉదయం లేచిన వెంటనే శక్తి లేకపోవడం. ‘ఇవాళ కూడా ఇదేనా...’ అనిపించడం. ∙పనిపట్ల విసుగు. ఎంతో ఇష్టంగా చేసిన పని కూడా ఇప్పుడు చిరాకు తెప్పించడం. ∙పనితీరు పడిపోవడం, సృజనాత్మకత క్షీణించడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో కూడా గందరగోళం.షాకింగ్ విషయం ఏమిటంటే నోటిఫికేషన్లు ఈ మూడు లక్షణాలను డైరెక్ట్‌గా పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. స్టాన్‌ఫర్డ్ న్యూరోసైన్స్ ల్యాబ్స్ స్టడీ ప్రకారం నోటిఫికేషన్ల వల్ల పనితీరు 17శాతం పడిపోతుంది. ‘ఒక్క నిమిషం...’తో కెరీర్ డ్యామేజ్నిరంతర నోటిఫికేషన్లతో ఫోకస్ కోల్పోవడం వల్ల జరిగే నష్టం మూడు దిశల్లో సాగుతుంది.1. నోటిఫికేషన్లు మీ డీప్ జోన్‌ను విచ్ఛిన్నం చేసి మిమ్మల్ని ఒక రియాక్షన్–మోడ్ ఉద్యోగిగా మార్చేస్తాయి. దీనివల్ల మీరు క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాంటి డీప్ వర్క్స్ సమర్థంగా చేయలేరు. దాంతో గుర్తింపు, పదోన్నతి, నాయకత్వ స్థానాలకు దూరమవుతారు. 2. ‘ఏం జరిగినా వెంటనే స్పందించాలి’ అనుకోవడం విధేయత కాదు, బర్న్ అవుట్ ప్రారంభదశ. దీనివల్ల భావోద్వేగ క్షీణత జరుగుతుంది. 3. మీరు రోజంతా బిజీగా ఉన్నా ప్రభావం శూన్యం కావడం మీ కెరీర్ గ్రోత్‌కు అత్యంత ప్రమాదకరం. మేనేజర్లు, హెచ్ఆర్, ఉన్నతాధికారులు దీన్ని గమనిస్తారు.ఇది కేవలం మీ తప్పా?ఇది కేవలం మీ తప్పు కానే కాదు, ఈనాటి వర్క్ ప్లేస్ సమస్య. ఈనాటి ఆఫీసుల్లో మీటింగ్స్ ఎక్కువ, మెసేజింగ్ యాప్స్ ఎక్కువ. డెడ్ లైన్లు నెత్తిమీద కూర్చుంటాయి. అందరూ ‘అర్జెన్సీ అడిక్షన్’లో చిక్కుకు పోయారు.పరిష్కారాలు... 1. రోజులో కనీసం రెండు గంటలు ‘నో నోటిఫికేషన్ జోన్’. ఆ సమయాన్ని మీ డీప్ వర్క్‌కు ఉపయోగించండి. 2. నోటిఫికేషన్ డైట్ పాటించండి. అంటే, వాట్సప్ గ్రూప్‌లను మ్యూట్ చేయండి. సోషల్ మీడియాను ఆఫ్ చేయండి. ఈమెయిల్స్ రోజుకు మూడుసార్లు మాత్రమే చెక్ చేయండి. 3. ప్రతి 90 నిమిషాల పని తర్వాత ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో కొద్దిగా నడవండి. లేదా నీళ్లు తాగండి. ఇది మీ కాగ్నిటివ్ ఎనర్జీని తిరిగి పెంచుతుంది. 4. మల్టీ టాస్కింగ్ అనేది మెదడుకు విషం లాంటిది. సింగిల్ టాస్క్ ఆక్సిజన్ లాంటిది. అందుకే ఒకసారి ఒకేపని అనే నిబంధన పెట్టుకుని పాటించండి. -సైకాలజిస్ట్ విశేష్‌ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com -
ఎమోషనల్ మగాడే అసలైన వాడు!
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకో ప్రశ్న. మీరెప్పుడైనా మనసారా ఏడ్చారా? మీ భయాలను ఓపెన్ గా చెప్పగలిగారా? మీ బలహీనతలను ఒప్పుకోగలిగారా? చాలామంది నుంచి ‘నో’ అనే సమాధానమే వస్తుందని తెలుసు. ఎందుకంటే మన సమాజంలో మగబిడ్డ పుట్టిన వెంటనే అతని చుట్టూ ఒక మేట్రిక్స్ నిర్మితమవుతుంది. మేట్రిక్స్ అంటే మరేదో అనుకోకండి, ఒక ఫ్రేమ్ వర్క్.‘‘నువ్వు మగపిల్లాడివి ఏడవకూడదు. ధైర్యంగా ఉండాలి. భయపడకూడదు. బాధపడకూడదు, తట్టుకోవాలి’’ అని పుట్టినప్పటినుంచీ చెప్తుంటారు. ఇలాంటి మాటలన్నీ కలిసి అతను ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ఒక ఫ్రేమ్ వర్క్ ను నిర్మిస్తాయి. అది కంటికి కనిపించని జైలులా మారుతుంది. దాని లోపల ఉన్నాడని కూడా తెలీదు. కానీ అతని డెసిషన్స్, ఎమోషన్స్, రిలేషన్షిప్స్ అన్నింటినీ అది నియంత్రిస్తుంటుంది.కానీ చాలామందికి అది తెలియదు. తెలిసిన వాళ్లు కూడా బయటకు రావడానికి భయపడతారు. కానీ నిజమేమిటంటే... దాన్ని బద్దలు కొట్టినప్పుడే మగాడు నిజమైన మనిషి అవుతాడు.1. BREAKమగాడు, మగతనం అనే మేట్రిక్స్‌ను బద్దలుకొట్టకపోతే పురుషుడు సంపూర్ణంగా జీవించలేడు. జస్ట్ మగాడిగా తన పాత్రను పోషిస్తుంటాడంతే. ఈ మేట్రిక్స్ మగాడి మనసుకు మూడు పెద్ద నష్టాలు చేస్తుంది:1. ఏమైనా జరిగినప్పుడు ‘ఇది చిన్నవిషయమే’ బాధపడకూడదు అనిపిస్తుంది. ఏడవాలనిపించినా... ‘అలా చేస్తే ఏమనుకుంటారో?’ ‘బలహీనంగా కనిపిస్తానేమో?’ అని ఏడుపును మనసులోనే నొక్కేసుకుంటారు. తమ ఎమోషన్స్ ను పూర్తి స్థాయిలో వ్యక్తం చేయలేరు. భావాలను చెప్పడం నేరం అనిపిస్తుంది.2. ఒక పురుషుడు ‘I need help’ అని ఓపెన్ గా అడగలేడు. ఎందుకంటే చిన్నప్పటినుంచీ అతనికి నీ పనులు నువ్వే చేసుకోవాలని చెప్పారు. అందుకే సహాయం అడగడానికి సిగ్గనిపిస్తుంది. 3. చుట్టూ జనాలు ఉన్నా, లోపల మాత్రం ఒంటరితనం పెరుగుతుంది. ఇది depression, anger issues, burnout, relationship breakdowns కి నేరుగా దారి తీస్తుంది.ఇది బలం కాదు బ్రో, ఇదో కనిపించని జైలు. ఇదే మగాడు అనే మేట్రిక్స్.2. BUILDఈ మేట్రిక్స్ నుంచి బయటపడినప్పుడు పురుషుడు తనను తానే తిరిగి నిర్మించుకుంటాడు. ఒక పురుషుడు మేట్రిక్స్‌ను ప్రశ్నించే రోజే అతని అసలు వ్యక్తిత్వం పుట్టే రోజు. అప్పుడే అతను మొదటిసారి తనతో నిజాయితీగా మాట్లాడడం మొదలుపెడతాడు.“నాకు కూడా బాధ ఉంటుంది.”“నాకు కూడా భయం ఉంటుంది.”“నాకు కూడా ప్రేమ, వినేవాళ్లు కావాలి.”అని ఒప్పుకోవడం మొదలుపెడతాడు. ఇది బలహీనత కాదు. ఇది అవగాహనా స్థాయి పెరగటం. దీనివల్ల మగాడిలో కొత్త వ్యక్తిత్వ నిర్మాణం మొదలవుతుంది.1. Emotion Awareness: ఏం ఫీల్ అవుతున్నాను? ఎందుకు? అని ప్రశ్నించుకుంటాడు. ఈ ప్రశ్న ఒక వ్యక్తిని బలంగా మారుస్తుంది, బలహీనంగా కాదు.2. Healthy Expression: బాధను చెప్పగలగడం అనేది మానసిక బలమని, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కాదని గుర్తిస్తాడు. 3. Boundaries: నేను మగాణ్ని కాబట్టి ప్రతి పని నేనే చేయాలి అనే మేట్రిక్స్ నుండి బయటపడతాడు. 4. Genuine Relationships: జస్ట్ మగాడనే పాత్రను పోషించడం కాకుండా, నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం వల్ల నటించే బంధాలు కాకుండా నిజమన బంధాలు మొదలవుతాయి.3. BEYONDమేట్రిక్స్ బద్దలైనప్పుడు మగాడు లిమిట్స్ దాటి వెళ్తాడు. మగతనం కొత్తరూపు తీసుకుంటుంది. ఈ కొత్త మగాడు Emotionally Intelligent. అతను మాట్లాడతాడు.అతను వింటాడు.అతను పంచుకుంటాడు.ఈ కొత్త పురుషుడు Strong + Softఅతని బలం అరవడం కాదు.అతని సున్నితత్వం బలహీనత కాదు.కొత్త మగాడు Balanced.అతను తనను తాను కోల్పోకుండా కుటుంబం, పని, సంబంధాలను నడపగలడు.కొత్త పురుషుడు Human. ఫీలింగ్స్, ఫియర్స్, నీడ్స్ అన్నీ అతని భాగమే అని అంగీకరిస్తాడు.అతను మగాడనే ఒక మూసలో కాకుండా పూర్తి మనిషిగా జీవిస్తాడు.Break the ‘Man’ Matrix.Build your true self.Go Beyond your limits.సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
దేశంలో మగాడికి కష్టమొచ్చింది!
హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ ఈనెలలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తనను వేధించిన కస్టమ్స్, అధికారులు పేర్లు 8-పేజీల సూయిసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ముంబయిలో టీసీఎస్ మేనేజర్ మానవ్ శర్మ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య వేధింపులతో ఆత్మాహుతి పాలయ్యాడు. ‘‘ఆడవాళ్ల బాధపై అందరూ ఉద్యమిస్తారు. పురుషుల కష్టం ఎవ్వరు చూడరు’’ అని తన చివరి వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. మరొక స్టార్టప్ టెకీ ఈ ఏడాది మార్చిలో మెంటల్ డిస్ట్రెస్ కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, స్టార్ట్-అప్ బిజినెస్‌లో నష్టాలతో బెంగళూరులో 12వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడుఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. వాస్తవాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. దేశంలో ప్రతి ఏడాది వేలాదిమంది పురుషులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. 2004లో 51,623 మంది వివాహిత పురుషులు ఆత్మహత్య చేసుకోగా, 2021 నాటికి ఈ సంఖ్య 81,063కి పెరిగింది.అదే సమయంలో వివాహిత మహిళల సంఖ్య మాత్రం 28,045 నుండి 28,680 వరకు మాత్రమే ఉంది. అంటే వివాహిత మహిళల సంఖ్య అలాగే ఉండగా, పురుషుల సంఖ్య 50శాతం పెరిగింది. ఇవి కేవలం గణాంకాలు కాదు, మన సమాజంలో పురుషుల మానసిక ఆరోగ్యం కూలిపోతుందనడానికి సంకేతం. దీనికి కారణాలు తెలుసుకుని, పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదట కారణాలు తెలుసుకుందాం.1. కుటుంబ సంబంధాల ఒత్తిడిఈ మధ్య మా క్లినిక్ కు కౌన్సెలింగ్ కు వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘‘సర్, నా జీతం సరిపోవడంలేదని నా భార్య తిట్టింది. మరోవైపు అమ్మ, తన మాట వినడంలేదని ఎత్తిపొడుస్తోంది. ఇద్దరినీ సంతోషపెట్టాలనుకున్నా, కానీ ఎవ్వరూ సంతోషంగా లేరు. చచ్చిపోవాలనిపిస్తుంది” అని వాపోయాడు.మగాడు కుటుంబానికి ‘రక్షకుడు’ అనే భావన బలంగా ఉంది. దీంతో పిల్లల భవిష్యత్తు, ఇంటి భారం, తల్లిదండ్రుల బాధ్యతలన్నీ పురుషులు మోస్తారు. వీటిలో విఫలమైనప్పుడు తీవ్రమైన అపరాధభావనకు, నిస్సహాయతకు, ఆత్మన్యూనతకు లోనవుతారు. ఇంటి సమస్యలు, భార్యతో విభేదాలు, వృత్తి ఒత్తిడి... ఇవన్నీ బయటకు చెప్పుకోలేని స్థితిలో, ఆ ఒత్తిడి ఆత్మహత్యవైపు నడిపించే ప్రమాదం ఉంది.2. మానసిక సమస్యలపై మౌనంమగాళ్లు ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి, సమస్యలను తనలోనే దాచుకోవాలనే సామాజిక కట్టుబాట్లు పురుషులకు అతిపెద్ద శత్రువులు. ఈ భావనను టాక్సిక్ మాస్క్యులినిటీ అంటారు. దీనివల్ల పురుషుడు తమ ఎమోషన్స్, బాధ, భయం, ఆందోళన వంటి వాటిని మనసులోనే తొక్కిపెడతాడు. డిప్రెషన్, యాంగ్జయిటీలాంటి సమస్యలున్నా సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లడాన్ని బలహీనతగా భావిస్తారు. ‘నేను బలహీనుడిని కాను’ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ అణచివేత చివరకు మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసి తీవ్ర నిర్ణయాలవైపుకు నెడుతుంది.3. ఆర్థిక ఒత్తిళ్లు... కరోనా తర్వాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది అప్పుల్లో కూరుకుపోయారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వారి గుర్తింపు ఉద్యోగం, సంపాదనతో ముడిపడి ఉండటమే దీనికి కారణం. అందరిముందూ తల దించుకోవాల్సిన పరిస్థితి, అవమాన భారం, భవిష్యత్తుపై అభద్రతాభావం వారిని నిరాశలోకి నెట్టేస్తాయి. ఇటీవల బెంగళూరులో ఒక టెకీ ఉద్యోగం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్త దీనికి నిదర్శనం.4. చట్టపరమైన ఒత్తిళ్లు...మరికొంతమంది పురుషులు వివాహ సంబంధిత చట్టాలు, కుటుంబ వివాదాలు, లేదా తప్పు ఆరోపణలు వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. “నేను తప్పు చేయలేదు, కానీ ఎవరూ నమ్మలేదు” అని కొద్ది నెలల క్రితం బెంగళూరులో ఒక టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు మన సమాజంలో మగాళ్ల బాధను ఎవరూ వినడం లేదనే భావనను పెంచుతున్నాయి.5. మత్తు పదార్థాలు... చాలామంది పురుషులు మద్యం లేదా డ్రగ్స్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తారు. కానీ అది ఒక్కరోజు సాంత్వన మాత్రమే. మరుసటి రోజు మళ్లీ అదే బాధ, అదే శూన్యత, మళ్లీ మద్యం. అలా అలా దానికి బానిసలవుతారు. ఈ విషవలయం చివరకు స్వీయ విధ్వంసానికి దారి తీస్తుంది.6. ఒంటరితనం... మహిళలకు కష్టమొస్తే వెంటనే ఎవరో ఒకరితో పంచుకుంటారు. కానీ పురుషులు మాత్రం మౌనంగా భరిస్తారు. కాఫీ లేదా స్క్రీన్‌తో మాట్లాడతారు. ఓసారి ఒక 42 ఏళ్ల వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ‘‘నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్లు అడిగేది... జీతం ఎంత? కారు కొత్తదా? అని. నిజంగా నా మనసులో ఏముందో విన్నవాడు లేడు’’ అని చెప్పాడు. అదీ పరిస్థితి.గణాంకాలు చెబుతున్నది ఏమిటి?• భారతదేశంలో మొత్తం ఆత్మహత్యలలో 70% కంటే ఎక్కువ పురుషులవి.• 18–45 ఏళ్ల మధ్య వయసు గలవారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. • వివాహిత మహిళల కంటే వివాహిత పురుషులు 1.8 రెట్లు ఎక్కువగా ప్రాణాలు తీసుకున్నారు.• కుటుంబ సమస్యలు పురుషుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా ఉంది.పరిష్కార దిశలు1. మానసిక సమస్యల గురించి మాట్లాడాలి. పురుషుడికి కూడా సహాయం అవసరం అవుతుందని అంగీకరించాలి.2. కౌన్సెలింగ్‌ను మొదటి అడుగుగా చూడాలి, చివరి ప్రయత్నంగా కాదు.3. ‘మగాడు ఏడవకూడదు’ అన్న మాట మార్చాలి. ఎమోషన్స్ కు జెండర్ తో సంబంధం లేదని గుర్తించాలి. 4. తండ్రులు, భర్తలు, సోదరులు మాట్లాడుకునే సపోర్ట్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. 5. మీడియా పురుషుల బాధను నాటకీయంగా కాకుండా, అవగాహనతో చూపించాలి.ఒక పురుషుడు చనిపోవడమంటే, ఒక తండ్రి, ఒక కుమారుడు నిశ్శబ్దంగా మాయమవ్వడం. ఒక కుటుంబం కష్టాల్లో, దు:ఖంలో పడటం. ఆత్మహత్యలు కేవలం వ్యక్తిగత వైఫల్యాలు కాదు, అవి సామాజిక వైఫల్యాలు. పురుషులు కూడా మనుషులే, వాళ్లకు కూడా అర్థం చేసుకునే హృదయం అవసరం.-సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్-జీనియస్ మ్యాట్రిక్స్ హబ్, 8019 000066, www.psyvisesh.com -
పిల్లలకు పాఠశాల కంటే వీడియో గేమ్స్ అంటే ఎందుకు ఇష్టం?
“మా బాబుకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకపోతే అరుపులు, కేకలు. ఇల్లంతా రచ్చరచ్చ చేసేస్తాడు. కానీ పుస్తకాలు తీస్తే బోలెడంత బద్ధకం. చదువంటే ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే. కానీ అదే వీడియో గేమ్ ఆడేటప్పుడు ఏమీ తినకుండా, తల ఊపకుండా గంటల తరబడి కూర్చుంటాడు!”ఇలాంటి మాటల్ని మీరు రోజూ వింటూనే అంటారు.దానికి మీరేం సలహా ఇస్తారు? “ఈ తరం పిల్లలు స్క్రీన్కు బానిసలైపోయారు.” “వీడియో గేమ్స్ బ్రెయిన్‌ను వదిలిపెట్టకుండా హైపర్ యాక్టివ్ చేస్తాయి.” “ఇది డిజిటల్ డెమెజ్.”"పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదు."కానీ, అసలు మర్మం ఎక్కడ ఉంది తెలుసా?వీడియో గేమ్స్ అనేవి సైకాలజీని వాడి డిజైన్ చేసిన అద్భుత ఇంజినీరింగ్.మొబైల్ గేమ్స్ ఆడే పిల్లవాడిని ఒకసారి గమనించండి… "ఈ లెవెల్‌ను కంప్లీట్ చేయాలి", "ఈ శత్రువును ఓడించాలి", "ఈ స్కోరు సాధించాలి" అని అతనికి స్పష్టమైన లక్ష్యం ఉంటుంది.అతను ప్రయత్నం చేస్తాడు. ఓడిపోతాడు. మళ్లీ ట్రై చేస్తాడు. మళ్లీ ఓడతాడు. చివరికి గెలుస్తాడు.విజయం పొందిన వెంటనే స్క్రీన్ మీద – "Congratulations!", "You’re a winner!", "Unlocked new powers!" అంటూ మెసేజ్ వస్తుంది.ఈ ఫీడ్‌బ్యాక్ అతని మెదడులో డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ కోసమే, అది ఇచ్చే హ్యాపీనెస్ కోసమే అతను మళ్ళీ మళ్ళీ మొబైల్ గేమ్స్ ఆడుతూనే ఉంటాడు.ఇప్పుడు చదువును పరిశీలిద్దాం. ఓ ఏడో తరగతి పిల్లాడు, మొఘలుల వంశవృక్షం చదవాల్సి ఉంది. అతనికి పాఠం ఎంత పెద్దదో తెలియదు. ఎక్కడ మొదలుపెట్టాలో కూడా స్పష్టత లేదు. పుస్తకంలోని ప్రశ్నల్లో ఏది పరీక్షల్లో వస్తుందో, ఏది గుర్తుంచుకోవాలో తెలియక కంగారు.పరీక్షలో సరైన సమాధానం రాసినా – ఫలితం ఎప్పుడు వస్తుందో తెలీదు. పరీక్షలు వస్తున్నాయంటే "నువ్వేమైనా చదువుతున్నావా?" అంటూ తల్లి, తండ్రి, టీచర్లు ఒత్తిడి పెడతారు. ఆ ఒత్తిడి అతని మెదడులో కోర్టిసాల్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇదే అసలు తేడా. వీడియో గేమ్ మోటివేట్ చేస్తుంది. చదువు భయం, ఒత్తిడితో నడుస్తుంది.మా Genius Matrix వర్క్‌షాప్‌లో పాల్గొన్న 8వ తరగతి విద్యార్థిని మిహిర ఏం చెప్పిందో తెలుసా? “సర్, నేను Minecraft ఆడేటప్పుడు ఎంత creative అవుతానో తెలుసా? నా మీద నాకే ఆశ్చర్యం. కానీ అదే స్కూల్లో డ్రాయింగ్ competition ఉంటే, ఒక్కసారిగా భయమేస్తుంది. గెలవకపోతే నన్ను తక్కువగా చూస్తారని.”ఇంకొక తండ్రి తన కొడుకును గురించి ఇలా చెప్పాడు... “డాక్టర్ గారు, మా వాడి PUBG స్టాటిస్టిక్స్ మామూలుగా ఉండవు. ప్లానింగ్, లీడర్షిప్, టీమ్ వర్క్ – అన్నీ బాగా చూస్తాడు. కానీ అదే క్లాస్‌లో ప్రాజెక్ట్ వచ్చిందంటే మౌనంగా పడుకుంటాడు. ఎందుకంటే అక్కడ creativityతో పని లేదు, కేవలం marks కోసం పని చేయాలి.”వీడియో గేమ్‌లో చిన్న ప్రయత్నానికే పెద్ద గుర్తింపు వస్తుంది. చదువులో మంచి ప్రయత్నం చేసినా మార్కులు రాకపోతే ఎవరూ పట్టించుకోరు. వీడియో గేమ్‌లో స్వాతంత్య్రం ఉంటుంది. చదువులో నిబంధనలు, డెడ్లైన్లు, ఫలితాలపై భయం ఉంటుంది.ఒకసారి నేను ఓ క్లాస్‌లో పిల్లల్ని అడిగాను: “మీరు ఎక్కువ టైం ఏమి చేస్తారు?” ఒకటి: “గేమ్స్ ఆడతాను.” రెండు: “యూట్యూబ్ చూస్తాను.” మూడు: “కంప్యూటర్ మీద క్రియేట్ చేస్తాను.” చదువు ఎప్పుడూ నాల్గవ ఆప్షన్లా ఉంటుంది.మనం ఏమి చేయాలి? వీడియో గేమ్‌లు నిషేధించడం సమస్యకు పరిష్కారం కాదు. స్మార్ట్‌ఫోన్ తీసేయడం వల్ల కూడా సమస్య తీరిపోదు. “నీకు concentration లేదు” అని తిట్టడం వల్ల అస్సలు ఉపయోగం ఉండదు.మరేం చేయాలంటారా?పిల్లలు ఏది concentrationతో చేస్తారో గమనించాలి. మన పాఠశాల, మన ఇంటి వాతావరణం కూడా వీడియో గేమ్‌లా మారాలి.🔹చిన్న లక్ష్యాలు ఇవ్వండి – చిన్న విజయం పొందిన ఆనందాన్ని అనుభవించాలి.🔹ప్రయత్నాన్ని గుర్తించండి – “శబాష్, నువ్వు మంచి ట్రై చేశావు” అనే మాట ఎంతో విలువైనది.🔹విఫలమైనా మళ్లీ ప్రయత్నించేందుకు అవకాశం ఇవ్వండి – శిక్షలు కాదు, శక్తినివ్వండి.🔹విజయం చూపించండి – మార్కులు కాకపోయినా, మెరుగుదల కనబడాలి.🔹పిల్లల మనసును మెప్పించే చదువు… అలాగే వాళ్లే కోరుకునే అభ్యాసం కావాలి.🔹మనం పిల్లల మీద ఒత్తిడి పెట్టడం తగ్గించాలి. వాళ్లలో ఉత్తేజాన్ని పెంచాలి. 🔹వీడియో గేమ్‌ల మాదిరిగానే – విద్య కూడా ఒక అడ్వెంచర్ అనిపించాలి.చదువు ఒక బాధగా, భారంగా కాదు… ఒక ప్రయాణంగా మారితే – పిల్లలు కూడా చదువును “ఆటలా” ఆస్వాదిస్తారు.మొత్తానికి సమస్య స్క్రీన్ కాదు. చదువులో ఆనందాన్ని మేళవించడమే సమాధానం.-సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
పిల్లల పరీక్షలు, పెద్దోళ్లకు అగ్నిపరీక్ష! ఈ విషయాలు గుర్తుంచుకోండి!
చెన్నైలో CBSE పరీక్షల సమయంలో స్కూల్ గోడ ఎక్కి, తమ పిల్లల కోసం తల్లిదండ్రులు చూస్తున్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసి మనమందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.ఇలాంటి ఘటనలు ఏ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి?🔹మన విద్యా వ్యవస్థ పిల్లలపై ఎంత ఒత్తిడిని పెడుతోంది?🔹తల్లిదండ్రుల ఆందోళన పిల్లల మనసుపై ఎలా ప్రభావం చూపుతోంది?🔹తల్లిదండ్రుల ప్రేమ వారికి బలాన్ని ఇస్తుందా, భయాన్ని పెంచుతుందా?ప్రతీ సంవత్సరం పరీక్షల సీజన్ వచ్చినప్పుడల్లా విద్యార్థుల కన్నా ఎక్కువగా ఒత్తిడిలో ఉంటున్న వారు తల్లిదండ్రులే. "తప్పక పాస్ అవ్వాలి!", "అగ్రశ్రేణి మార్కులు రావాలి!", "లేకపోతే భవిష్యత్తు అంధకారం!" – ఇవీ తల్లిదండ్రులలో నిండిపోయిన భయాలు. ర్యాంక్ కోసమే మన ప్రేమ అని పిల్లలకు అనిపించకూడదు.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి తల్లిదండ్రులు చేయకూడనిది...❌ హెలికాప్టర్ పేరెంటింగ్:ప్రతీ చిన్న విషయాన్ని తల్లిదండ్రులు గమని…పిల్లలను ఎలా ప్రోత్సహించాలి?✅ పరీక్ష ఫలితాలు ఆశించినంత రాలేదనుకోండి. పిల్లలు దిగులుగా ఉన్నప్పుడు, "నీ ప్రయత్నం గొప్పది, మార్కులు మాత్రమే జీవితానికి అద్దం కాదు" అని చెప్పండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచండి.✅ పిల్లలకు చదువు అంటే భయం కాకుండా ఆసక్తిగా ఉండేలా చేయండి. "ఏ విషయం నచ్చింది? ఏ ప్రశ్న ఆసక్తికరంగా అనిపించింది?" అని అడిగితే, పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే ప్రక్రియగా భావిస్తారు.✅ "నీ ఫ్రెండ్ అజయ్ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, నీవు ఎందుకు సాధించలేకపోతున్నావు?" అనే మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చతాయి. ప్రతి ఒక్కరికీ తన ప్రయాణం ఉంటుంది. అందుకే పోల్చడం మానండి.✅ తప్పిదాలను సహజంగా అంగీకరించండి. "ఈసారి ఏమి తప్పైంది? తర్వాత ఎలా మెరుగుపరచుకోవచ్చు?" అనే విధంగా ప్రశ్నించడం ద్వారా పిల్లలు సమస్యలను అర్థం చేసుకొని, మెరుగుపడటాన్ని నేర్చుకుంటారు.గుర్తుంచుకోవాల్సిన విషయాలు📌 పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు. అవి ఒక చిన్న అంచనా మాత్రమే.📌 పిల్లలకు భయం పోగొట్టండి. పరీక్షలు అంటే భయపడేలా కాకుండా, కొత్త విషయాలు నేర్చుకునే అనుభవంగా చూడమని ప్రేరేపించండి.📌 పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడితో విజయం సాధించడమే కాదు, ఆనందంగా ఎదగాలి.📌 గోడలు ఎక్కే తల్లిదండ్రులు కాకుండా, పిల్లలకు మార్గదర్శకంగా ఉండండి.పరీక్షల సమయం పిల్లలకు ఒత్తిడిగా కాకుండా, నేర్చుకునే మంచి అవకాశంగా మార్చే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల భవిష్యత్తును భయంతో నింపకుండా, ధైర్యంగా ముందుకు నడిపిద్దాం!మీకేమైనా కౌన్సెలింగ్ సహాయం కావాలంటే నన్ను సంప్రదించండి.-సైకాలజిస్ట్ విశేష్ -
బాలయ్య మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే..
మొన్న ఫేస్బుక్ బ్రౌజ్ చేసుంటే నందమూరి బాలకృష్ణ చేసిన ఒక ఉపన్యాసం కనిపించింది. ‘‘కాబట్టి పదవులకు నేను అలంకారమేమో కానీ, పదవులు నాకెప్పుడూ అలంకారం కాదు’’ అనే మాటలు వినిపించాయి. వెంటనే ‘‘మేం వేరు, మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు’’ అని గతంలో ఆయన మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. సరే ఈసారేం మాట్లాడాడో విందామని వీడియో చూసా. ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక మోడల్ గా ఉపయోగపడుతుందని విశ్లేషణ చేసి పోస్ట్ చేశా. రెండు నిమిషాల వీడియోతో మనస్తత్వాన్ని ఎలా విశ్లేషించగలరనే డౌట్ రావచ్చు. అలా రావడం సహజం కూడా. కానీ, ఆ రెండు నిమిషాలు మాట్లాడిన మాట్లాడిన ప్రతీ మాట వెనుక, ఆ మాటల ఎంపిక వెనుకనే అంతా దాగివుంది. ఈ ఉపన్యాసం, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని, ప్రపంచాన్ని చూడే కోణాన్ని అర్థం చేసుకునేందుకు ఆసక్తికరమైన అంశాలను అందిస్తుంది. ఈ ప్రసంగాన్ని సైకాలజికల్ అనాలిసిస్ చేస్తూ, అవసరమైన సందర్భాల్లో ఆయన గత ప్రవర్తనను ప్రస్తావిస్తూ విశ్లేషణను కొనసాగిద్దాం.👉కాబట్టి పదవులకు నేను అలంకారమేమో కానీ, పదవులు నీకెప్పుడూ అలంకారం కాదుఇది సాధారణంగా ఒక వ్యక్తి అనగల మాటేనా? కాదు. సాధారణంగా, ఎవరికైనా పద్మభూషణ్ లాంటి పురస్కారం వస్తే, వారు కృతజ్ఞతా భావంతో సమాజం, ప్రభుత్వం, తాము పనిచేసిన రంగం మీద అఫర్మేషన్ ఇచ్చే అవకాశముంది. కానీ బాలకృష్ణ, పదవులకు తానే అలంకారం అన్న మాట ద్వారా, తన ప్రాముఖ్యతను, ప్రత్యేకతను హైలైట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇదే వ్యక్తి గతంలో "మేము వేరు, మా బ్రీడ్ వేరు" అని చెప్పడం, ఆయనలో ఉన్న గ్రాండియోసిటీని (తాను సామాన్య ప్రజలకన్నా ఉన్నతుడని భావించడం) సూచిస్తుంది. ఇదంతా నార్సిసిస్టిక్ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ రకమైన అహంకార ధోరణులు, ప్రజాప్రతినిధుల్లో ప్రమాదకరమైన లక్షణాలు. 👉నా తండ్రి, గురువు, దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు..ఈ వ్యాఖ్యలో బాలకృష్ణ తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా తన తండ్రి ద్వారా నిర్వచించుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. ఆయన సాధించినదంతా తన తండ్రి వారసత్వానికి సంబంధించినదేనని చెప్పడం, తాను నేడు ఉన్న స్థాయికి కారణం తన స్వీయ ప్రతిభ కాదన్న భావన కలగవచ్చు. కానీ.. గతంలో ఇదే బాలకృష్ణ తండ్రిని ముఖ్యమంత్రిపదవి నుంచి దింపడంలో కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ వాఖ్యలు విరుద్ధంగా కనిపిస్తాయి. గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రిని పక్కన పెట్టిన వ్యక్తి, ఇప్పుడు ఆయనను దేవుడిగా కీర్తించడం, తన ఐడెంటిటీని ప్రజల్లో తిరిగి బలపర్చుకునేందుకు ఉద్దేశించిన చర్యగా అనిపిస్తుంది. 👉నాకు జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు, విశ్వానికే నటరూపం ఎలా ఉంటుందో చూపించిన దైవాంశ సంభూతుడు...ఇక్కడ తన తండ్రిని దేవుడితో పోలుస్తూనే, తాను ఆయన ప్రతిరూపమని చెప్పడం గమనార్హం. ఇక్కడ బాలకృష్ణ తన తండ్రి గొప్పతనాన్ని పొగుడుతూ, తాను కూడా అదే వారసత్వానికి చెందినవాడినని, తాను కూడా అంతే గొప్పవాడినని నిరూపించుకోవడానికి మాట్లాడడం కనిపిస్తోంది. ఇదే వ్యక్తి ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో తన అక్క ఇంటిముందు తొడ కొట్టడం, అభిమానులను కొట్టడం లాంటి చర్యలు చేసారు. ఇవన్నీ చూస్తే, ఆయన నిజమైన అహంకార రహిత వ్యక్తి కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. 👉షేక్స్పియర్ చెప్పినట్టు.. ఇదంతా ఒక నటనే. అంటే, పుట్టినవాడు గిట్టక తప్పదు.. ఇదొక ఆసక్తికరమైన వ్యాఖ్య. ఈ వాఖ్యలో బాలకృష్ణ జీవితాన్ని ఒక రంగస్థలంగా చూస్తూ, దానిలో తన పాత్ర ఒక ప్రత్యేకమైనదిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా, గొప్పతనం భావన (Grandiosity) కలిగిన వ్యక్తులు, ప్రపంచాన్ని ఒక నాటకంగా, తాము దానిలో ముఖ్య పాత్రధారులమని భావిస్తారు. అయితే, షేక్స్పియర్ చెప్పిన ఆలోచన మానవ సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఉద్దేశించినది, కానీ బాలకృష్ణ దాన్ని కేవలం తన ప్రాముఖ్యతను పెంచుకునేందుకు ఉపయోగించడం Selective Interpretation కు సంకేతం. 👉ఇదుగో ఇటువంటి పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్‌లు కానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే.. ఇక్కడ ఆయన, అవార్డులు తనని వెతుక్కుంటూ వచ్చాయని చెప్పడం, నార్సిసిజం యొక్క మరో స్పష్టమైన ఉదాహరణ. సాధారణంగా, నిజమైన అచీవర్స్ "ఈ అవార్డు నాకు లభించడం గౌరవంగా భావిస్తున్నాను" అనే విధంగా స్పందిస్తారు. కానీ బాలకృష్ణ తనకి అవార్డులు రావడం సహజమే అనే ధోరణిలో మాట్లాడడం, తనలోని గొప్పతనం తానే హైలైట్ చేసుకోవాలనే మానసిక స్థితిని సూచిస్తుంది. 👉రేపు మీలో ఎవరికైనా రావచ్చు భవిష్యత్తులో. స్టేజ్ మీద ఉన్న వారిలో ఎవరికైనా రావొచ్చు. ఈ మాట ఒక ఫేక్ హంబుల్‌నెస్ (False Humility) కి ఉదాహరణ. అవార్డు తానే పొందాడు, కానీ మరెవరైనా పొందవచ్చని చెప్పడం, పైకి వినసొంపుగా ఉన్నా, లోపల మాత్రం "మీకు రాదు, నేనే గొప్ప" అనే అహంకారాన్ని బలపరిచే ప్రయత్నమే. ఇదే వ్యక్తి తన అభిమానులను కొట్టినప్పుడు, అవకాశాల కోసం తమను తాము తక్కువగా చూడాల్సిన అవసరం లేదని చెప్పలేదు. ప్రజలను ఉపయోగించుకోవడం, అవసరమైనప్పుడు తమను సమానంగా చూడడం.. ఇది బాలకృష్ణ రాజకీయ మానసిక స్థితికి అద్దం పడుతుంది. 👉 ఈ ఉపన్యాసం మొత్తం బాలకృష్ణ వ్యక్తిత్వంలో పరస్పర విరుద్ధతలను (Contradictions) చూపిస్తోంది.తాను కష్టపడి సాధించానని చెబుతూనే, అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని చెప్పడం... గతంలో తండ్రికి వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని కొనసాగిస్తున్నానని చెప్పడం... గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు చేసి, ఇప్పుడు ప్రజలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పడం.. ఇవన్నీ పరస్పర విరుద్ధతలను చూపిస్తున్నాయి. అందుకే, ఈ ఉపన్యాసం పూర్తిగా నిజాయితీతో నిండినదిగా అనిపించదు. ఆయన ఉపన్యాస శైలిని, గత ప్రవర్తనను తులనాత్మకంగా పరిశీలిస్తే, తన రాజకీయం, సినిమా, నందమూరి వారసత్వాన్ని ప్రజల్లో మరింత బలపరిచేందుకు చేసిన ఎమోషనల్ స్ట్రాటజీగా చెప్పవచ్చు. అయితే...✔ ఇది క్లినికల్ డయాగ్నోసిస్ కాదు, కేవలం ఆయన ప్రవర్తన ఆధారంగా మానసిక విశ్లేషణ మాత్రమే.✔ ఏ వ్యక్తి అయినా ఒకటి లేదా రెండు లక్షణాలను కలిగి ఉండవచ్చు, కానీ మూడింటి కంటే ఎక్కువ తీవ్ర స్థాయిలో ఉంటే, అది వ్యక్తిత్వ రుగ్మతగా పరిగణించాలి.✔ రాజకీయ, సినీ ప్రపంచంలో ఉండే చాలా మందికి "Public Persona vs. Real Persona" మధ్య వ్యత్యాసం ఉంటుంది. ✔ బాలకృష్ణ ప్రవర్తనలో అతిశయమైన అహంకారం, నియంత్రించలేని కోపం, ఇంపల్సివ్ యాక్షన్స్, ఇతరులను మోసగించాలనే ధోరణి ఉన్నాయి. ఇవన్నీ తీవ్రంగా ఉంటే, అతనికి Narcissistic Personality Disorder (NPD) & Impulse Control Disorder (ICD) ఉన్నట్లు చెప్పొచ్చు.ఇది ఒక నటుడు, రాజకీయ నాయకుడిని విమర్శిస్తున్నట్టు కాకుండా, ఒక మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే కోణంగానే చూడాలి. ఒక అధ్యయన విషయంగా చూస్తే బాలకృష్ణ వ్యక్తిత్వం "Power & Narcissism" కి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు!:::PsyVishesh -
బాధ్యతల్లో బ్యాలెన్స్ లేకుంటే కాపురం కష్టమే!
రేఖది పల్లెటూరి నేపథ్యం. తండ్రిది వ్యవసాయం. తల్లి గృహిణి. పిల్లల పెంపకం బాధ్యత కూడా ఆమె మీదనే ఉండేది. అలాంటి వాతావరణంలో పుట్టి, పెరిగిన రేఖకు భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తయ్యాక ఆమెకు ఆనంద్‌తో పెళ్లయింది. ఆనంద్ ప్రభుత్వోద్యోగి. గృహిణిగా రేఖ సంతోషంగా బాధ్యతలను స్వీకరించింది. ఒక బిడ్డ పుట్టాక కూడా రేఖ తన పనులను హ్యాపీగా మేనేజ్ చేసుకునేది. రెండో బిడ్డ పుట్టాక కష్టమైంది. ఉదయాన్నే లేచి ఆనంద్‌కు బ్రేక్ఫస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల పనులు చూసుకోవడంతో చాలా అలసిపోయేది. ఆనంద్ తన పని ఒత్తిడిలో ఉండి ఇంటి పనుల్లో పెద్దగా సాయం చేసేవాడు కాదు. కనిపించని దూరం..భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ సమకూర్చే క్రమంలో రేఖ తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. ఎప్పుడైనా తన అవసరాల గురించి ఆమె మాట్లాడగానే ఆనంద్ వాటిని పట్టించుకునేవాడు కాదు. లేదంటే తన ఆఫీసు ఒత్తిడి గురించి చెప్పుకునేవాడు. దీంతో తన కష్టాన్ని ఆనంద్ గుర్తించడం లేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించసాగింది. క్రమేపీ వారిద్దరి మధ్య మానసికంగా దూరం పెరిగింది. ఇలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో కనిపిస్తుంది. బ్యాలెన్సింగ్ ప్రిన్సిపుల్స్..కుటుంబ జీవితం అనేది ఆటోమేటిక్‌గా సాఫీగా సాగిపోయే విషయం కాదు. క్రమం తప్పకుండా పరస్పర సహకారం, ఓపిక, కమ్యూనికేషన్ అవసరం. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా బలమైన బంధాన్ని కాపాడు కోవడం కోసం పాటించాల్సిన సూత్రాలివే. 1. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం⇒ పరిస్థితి ఎంత క్లిష్టమైనదైనా, భావాలను వ్యక్తపరచడంలో ఓపెన్‌గా ఉండాలి⇒ ఐ–సెంటెన్సెస్ వాడకం అంటే ‘నాకు ఇలా అనిపిస్తోంది’, ‘నేను ఇలా ఫీలవుతున్నాను’ అని చెబుతూ, దూషణలకు లేదా నిందలకు తావు లేకుండా కమ్యూనికేషన్ చేయండి. మీ ఆలోచనలను ఈ విధంగా పంచుకోవడం ద్వారా సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.2.బాధ్యతలను పంచుకోండి⇒ గృహభారాలు ఒక్కరిపై మాత్రమే ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ఏమి చేయాలో కూర్చుని మాట్లాడి నిర్ణయించు కోవాలి. చిన్న విషయాల్లో కూడా భాగస్వామ్యం ఉంటే, ఎదుటి వాళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది⇒ వారానికి ఒకసారి ఆ వారం ఎవరేం పనులు చేయాలనేది చర్చించుకోవడం ద్వారా బ్యాలెన్స్‌ను సాధించవచ్చు.3.తమ శ్రమను గుర్తించండి⇒ కుటుంబంలో ఎవరి శ్రమకైనా విలువ ఇవ్వడం అవసరం ⇒ భర్త తన పని ఒత్తిడిని, భార్య తన ఇంటి పనుల కష్టాన్ని పంచుకుంటే పరస్పర అవగాహన పెరుగుతుంది.⇒ వారానికి ఒకసారి ఓపెన్‌గా అభినందనలు లేదా కృతజ్ఞత వ్యక్తం చేయడం బంధాన్ని బలపరుస్తుంది.4. ప్రత్యేక సమయాన్ని కేటాయించండి⇒ పనుల మధ్య ఎప్పుడు తనతో మాట్లాడతాడో అన్న నిరీక్షణ భార్య/భర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది · వారానికి ఒకరోజు ప్రశాంతంగా కూర్చుని ఒకరి కష్టాన్ని మరొకరు వినండి · మనసు పంచుకునే ఈ చర్చలు బంధం బలపడటానికి దోహదపడతాయి. 5. ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేయడం నేర్చుకోండి⇒ గృహిణిగా స్త్రీ, పనిలో పురుషుడు ఇద్దరూ ఒత్తిడితో ఉంటారు ⇒ దీర్ఘ శ్వాస, ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ వంటి పద్ధతులు ఆందోళన తగ్గించడంలో సహాయపడతాయి ⇒ అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.6. సామాజిక ప్రమాణాలను పునఃపరిశీలించండి⇒ భార్యాభర్తలు తప్పనిసరిగా వారి వారి పాత్రల్లోనే ఉండాలి అనే ఆలోచనను మార్చుకోండి ⇒ ఇంటి పనులు లేదా పిల్లల సంరక్షణ విషయంలో భర్త సహాయాన్ని సగర్వంగా కోరండి ⇒ గృహిణి కష్టం కూడా సమాన గౌరవానికి అర్హమైనది.7. సానుకూల దృక్పథం ఏర్పరచుకోండి⇒ ఇతరులను తప్పు పట్టడం కంటే, కలిసి పనిచేయడం ద్వారా సమస్యలపై దృష్టి పెట్టండి⇒ ఒకరి కొకరు సహాయం చేసుకోవడం, ప్రశంసలు అందించుకోవడమనేది ప్రేమానుబంధాన్ని పెంచుతుంది. 8. స్వీయపరామర్శ⇒ తన బాధ్యతల్ని సరైన పద్ధతిలో నిర్వర్తించలేకపోతున్నానని భావించడంలో తప్పు లేదు. కానీ ఆలోచనను సానుకూలంగా మలచుకోవాలి ⇒ ‘నేను కుటుంబం కోసం ఇలా చేయగలిగాను’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి⇒ అవసరమైతే విశ్రాంతి తీసుకోండి. దానివల్ల మానసిక శక్తి పెరుగుతుంది. -
ప్రాణాలు తీసే అభిమానం సరికాదు!
పుష్ప-2 సినిమా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. కానీ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటం మనసును కలచివేస్తోంది.అసలెందుకిలా జరుగుతోంది? సినిమాల పట్ల ఇంత వేలంవెర్రి ఎందుకు? టికెట్ల ధరలు వేల రూపాయల్లో ఉండటమేంటి? అందుకు ప్రభుత్వాలు అనుమతించడమేంటి? వేలకు వేలు పెట్టి టికెట్లు కొనడమే కాకుండా, ప్రాణాలకు తెగించి మరీ బెనిఫిట్ షో చూడాలనే ఇంత పిచ్చి అభిమానం ఎందుకు ఏర్పడుతోంది? దీన్ని ఎలా నివారించాలి? అని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.మనదేశంలో సినీ పరిశ్రమ కేవలం వినోదంగా మాత్రమే కాకుండా ఒక మతంలా మారిపోయింది. సినిమా హీరోలను దేవుళ్లుగా భావించడం, వారి సినిమా అందరికంటే ముందుగా చూడటం గొప్పగా భావించే మైండ్ సెట్ గా మారిపోయింది.ఫ్యాన్స్ మానసిక స్థితిఅభిమానుల్లో చాలామంది తమ అభిమాన నటులతో మానసికంగా అనుబంధం ఏర్పరచుకుంటారు. వారితో మమేకమవుతారు. వారిలో తమను చూసుకుంటారు. అభిమాన హీరో సినిమా విజయాన్ని తమ విజయంగా భావిస్తారు. అది వారి వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లనుంచి తాత్కాలిక ఉపశమనాన్నిస్తుంది. అంటే సామాన్య వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విజయాన్ని తమ హీరో విజయంలో చూసుకుని సంతృప్తి చెందుతాడు. ముఖ్యంగా పిల్లలు ఆ హీరోలకు అనుకరిస్తారు. ఈ దుర్ఘటనలో గాయపడిన శ్రీతేజ్ తనను తాను పుష్పలా భావించుకునేవాడని, అతన్ని అందరూ పుష్ప అని పిలిచేవారని తండ్రి చెప్పడం మనం గుర్తించాలి.మరోవైపు మొదటి రోజు మొదటి షో చూడటం వల్ల వచ్చే థ్రిల్, ఎక్సయిట్మెంట్ మనలో ఆనందాన్ని కలిగించే డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా స్రవించేందుకు కారణమవుతుంది. దాంతో ఆ అనుభవం ఎక్సయిటింగ్ గా అనిపిస్తుంది. అందుకే ప్రతీ మూవీ మొదటిరోజు చూసేందుకు, అందుకోసం ఎన్ని వేల రూపాయలైనా ఖర్చుపెట్టేందుకు ఉర్రూతలూగుతుంటారు.మొదటిరోజు మొదటి షో చూసిన ఫ్యాన్స్ తమను తాము ప్రత్యేక వ్యక్తులుగా, ఇతరుల కంటే గొప్పగా భావిస్తుంటారు. అలా తమ గ్రూప్ లో ఒక గుర్తింపును పొందాలనుకునే కోరికను ఇది తెలియపరుస్తుంది. అంతేకాదు, ఫ్యాన్స్ గ్రూప్ లో ఉన్నవారిపై కనిపించని ఒత్తిడి ఉంటుంది. మొదటి రోజు మొదటి షోను మిస్ అవ్వకుండా చూడటం తప్పనిసరి బాధ్యతగా ఫీలవుతుంటారు. ఇది గుంపు ప్రవర్తన (Herd Behaviour)తో ముడిపడి ఉంటుంది.గుంపులో ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత బాధ్యతను కోల్పోతారు. అభిమానుల ఆసక్తి, ఉత్తేజం వేగంగా పాకిపోతుంది, చిన్న అవాంతరాలు కూడా పెద్ద సంఘటనలుగా మారతాయి. తొక్కిసలాట జరిగినప్పుడు భయాందోళనలు పెరిగి అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది ప్రమాదాలకు కారణమవుతుంద. సంధ్య ధియేటర్ వద్ద జరిగింది ఇదే.నిర్మాతల వ్యాపారాత్మక ధోరణి... బాహుబలితో మొదలైన పాన్ ఇండియా మూవీల హవా పుష్ప-2తో ఒక మేనియాగా మారింది. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వారిని ప్రోత్సహిస్తూ భారీగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్నాయి. ప్రజల భావోద్వేగాలను వీలైనంతగా సొమ్ము చేసుకునే కమర్షియల్ ఆపర్చునిజానికి ఇది నిలువెత్తు నిదర్శనం.వ్యాపారాత్మక ధోరణి తప్ప, అభిమానుల బలహీనతలను సొమ్మి చేసుకోవడం నిర్మాతల నైతికలోపంగా భావించవచ్చు. కానీ టికెట్ ధరలు విపరీతంగా పెంచడం సినిమాను సామాన్య ప్రజలకు దూరం చేస్తుందన్న విషయాన్ని వారు గుర్తించడం లేదు.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?మరోవైపు, భారీ రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌కు రావడం అల్లు అర్జున్ చేసిన తప్పని చెప్పక తప్పదు. ఆ సమయంలో తాను కనిపిస్తే తనను చూసేందుకు అభిమానులు ఎగబడతారని, తొక్కిసలాట జరగవచ్చని గుర్తించి ఉండాల్సింది. ఆయనా పని చేయలేదు. సరే ఆయన వచ్చారు. ధియేటర్ యాజమాన్యం, పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేకపోయారు. ఫలితంగా ఒక నిండుప్రాణం బలయ్యింది. అందరూ బాధ్యత తీసుకోవాలి.. • ఇలాంటి సంఘటనలు చూశాకైనా ఫ్యాన్స్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రాధాన్యతలను పునరాలోచించుకోవాలి. ప్రాణాలకంటే సినిమా ఎక్కువ కాదని గుర్తించి మసలు కోవాల్సిన అవసరం ఉంది. • పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు తమ అభిమానుల ఆలోచనలపై ప్రభావం చూపించగలగాలి. వాళ్ళ అభిమానులు జవాబుదారీతనం కలిగి ఉండేలా చేసే ప్రయత్నాలు చేయాలి.• నిర్మాతలు ఆర్థిక ప్రయోజనాలకు మించిన బాధ్యతను గుర్తించాలి, మెరుగైన వినోదం సరసమైన ధరలకు అందించేందుకు ప్రయత్నించాలి. • మీడియా కూడా సినిమా ప్రచార కార్యక్రమాల ప్రసారం విషయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.-సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం
అంజలి ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెరిగింది. తండ్రి ప్రధాన ఆదాయదారుడిగా ఉండగా, తల్లి ఇంటిని నిర్వహిస్తూ, పిల్లలను చూసుకునేవారు. ఇంట్లో ఎవరేం చేయాలనే విషయంలో స్పష్టత ఉండేది. ఈ వాతావరణంలో పుట్టి, పెరిగిన అంజలికి భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేశాక అంజలికి రాజుతో వివాహమైంది. రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండగా అంజలి హౌస్ వైఫ్ బాధ్యతలను ఆనందంగా స్వీకరించింది. ఇద్దరూ సంతోషంగా గడిపేవారు. ఒక బిడ్డ పుట్టాక బిడ్డను చూసుకుంటూ ఇంటిపనులు చేయడం అంజలికి కష్టంగా ఉండేది. ఇద్దరు బిడ్డలు పుట్టాక అది మరింత కష్టంగా మారింది. ఉదయాన్నే లేచి రాజుకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల కార్యకలాపాలను నిర్వహించడం, ఇంటి పనులు చూసుకోవడంతో చాలా అలిసిపోయేది. రాజు కొంత సహాయం చేసినప్పటికీ అది అంజలి ఆశించిన స్థాయిలో ఉండేది కాదు. దాంతో అంజలి చాలా ఒత్తిడిని అనుభవించేది. నిరంతర సమస్యలుక్రమక్రమంగా అంజలికి శారీరక శ్రమతో పాటు, మానసిక శ్రమ కూడా పెరిగింది. భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ మకూర్చే క్రమంలో అంజలి తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. తాను అనుభవిస్తున్న ఒత్తిడిని రాజుకు చెప్పడంలో ఇబ్బంది పడేది. ఆమె తన అవసరాలను చెప్పగానే, రాజు వాటిని నిర్లక్ష్యం చేసేవాడు లేదా తప్పుగా అర్థం చేసుకునేవాడు. లేదంటే తాను ఆఫీసులో ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నాడో చిట్టా విప్పవాడు. అలా మాట్లాడుతుంటే అంజలి మనసు చివుక్కుమనేది. ‘ఇదేంటి ఈ మనిషి నేను చెప్పేది వినడు, నా కష్టం పట్టించుకోడు’ అనిపించేది. కాలం గడిచేకొద్దీ, కుటుంబంకోసం రాజు కష్టపడుతున్నా, అదే కుటుంబంకోసం తాను పడుతున్న కష్టాన్ని గుర్తించడంలేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించింది. రాజును కేవలం భర్తగా కంటే రూమ్మేట్ గా చూడటం ప్రారంభించింది. మరోవైపు భార్యగా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని బాధపడేది. ఇది ఆమెను అపరాధభావనలోకి చెట్టింది. తనలో మరింత నిరాశను, అంతర్గత ఘర్షణను సృష్టించింది.ఇవన్నీ కలిసి అంజలి మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపాయి. ఆందోళన పెరిగింది. ఆత్మవిశ్వాసం తగ్గింది. నేను మంచి భార్యనైతే ఇలా ఆలోచించేదాన్ని కాదనే అపరాధభావం పెరిగి పెద్దదైంది. దాన్నుంచి బయటపడేందుకు ఇంటిపనుల కోసం మరింత సమయం వెచ్చించేంది. అది మళ్లీ ఆమె అలసటను, అసంతృప్తిని పెంచేది. దాంతో అప్పుడప్పుడూ రాజుపై అరిచేది, గొడవపడేది. అది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. చికిత్స లక్ష్యాలు... పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అంజలి కౌన్సెలింగ్ కోసం మా క్లినిక్ కు వచ్చింది. తన మానసిక స్థితిని పూర్తిగా వివరించింది. తన ఆందోళనను తగ్గించడంతోపాటు, రాజుతో తన బంధాన్ని బలపరిచేందుకు సహాయం చేయాలని కోరింది. మొదటి సెషన్ లో ఆమెతో మాట్లాడాక, రెండో సెషన్ కు రాజుతో పాటు రావాలని సూచించాను. రెండో సెషన్ లో వారిద్దరితో మాట్లాడాక కౌన్సెలింగ్ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. అంజలి, రాజులు పరస్పర అవసరాలను, భావాలను, ఆందోళనలను వ్యక్తపరచడానికి అవసరమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం. వైవాహిక బాధ్యతలు, భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా బంధాన్ని సరిదిద్దడం, సమాన భాగస్వామ్యాన్ని స్థాపించడం. కుటుంబ రోల్స్, బాధ్యతలు, భాగస్వామ్య భావనలను ప్రభావితం చేసే వ్యక్తిగత విలువలు, అంచనాలు, సామాజిక ప్రభావాలను అన్వేషించడం. •ఒత్తిడి, ఆందోళన, నిరాశను మేనేజ్ చేసేందుకు అవసరమైన స్కిల్స్ ను అభివృద్ధి చేయడం. చికిత్స సాగిన విధానంరాజు, అంజలి మధ్య బంధాన్ని, కమ్యూనికేషన్ ను మెరుగుపరిచేందుకు ప్రొటోకాల్ రూపొందించాను. అందులో మొదటిది I Sentences. అంజలి రాజును బ్లేమ్ చేయడం కాకుండా, తన భావాలను వ్యక్తం చేయడానికి ‘‘నేనిలా అనుకుంటున్నాను, నేనిలా ఫీలవుతున్నాను’’ అని ‘ఐ సెంటెన్సెస్’ ఉపయోగించడం ప్రారంభించింది. దాంతో రాజు తనను బ్లేమ్ చేస్తుందనే భావన లేకుండా ఓపెన్ గా వినడం మొదలుపెట్టాడు. రాజు అలా వినడం అంజలికి సంతృప్తినిచ్చింది. కుటుంబంలో ఏ పనులు ఎవరు చేయాలనే విషయంపై ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. వారానికోసారి ఈ అంశంపై ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అంగీకరించారు. ఇది అంజలిపై పని ఒత్తిడి భారాన్ని, ఒత్తిడికి లోనవుతున్నాననే భావనను అధిగమించడానికి ఉపయోగపడింది. వారానికోసారి ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, ఒకరి కష్టాన్ని మరొకరు శ్రద్ధగా ఆలకించడం, సహాయాన్ని ఆఫర్ చేయడం వారిద్దరి మధ్య బంధం, అనుబంధం పెరిగేందుకు సహాయపడింది. దీంతోపాటు మరికొన్ని థెరప్యూటిక్ టెక్నిక్స్ పాటించడం ద్వారా ఆరునెలల్లో వారి మధ్య బంధం బలపడింది. ఇప్పుడు ఇద్దరూ ప్రశాంతంగా, ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066ww.psyvisesh.com -
సోషల్ మీడియాతో తప్పని తిప్పలు
దేశంలోని ప్రతి టీనేజర్ రాత్రి నిద్రకు ముందు, ఉదయం నిద్ర లేవగానే చూసేది సోషల్ మీడియానే అంటే అతిశయోక్తి కాదేమో! ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్ చాట్, షేర్ చాట్, డిస్కార్డ్, వాట్సప్, టెలిగ్రామ్.. ఒకటా రెండా, అనేకానేక సోషల్ మీడియా యాప్‌లు యువత జీవితాలను చుట్టేస్తున్నాయి. సోషల్ మీడియా లేకుండా బతకడం లేదా దాన్ని తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. అయితే సోషల్ మీడియా కేవలం కమ్యూనికేషన్ సాధనంగా కాకుండా, టీనేజర్లు తమను తాము ఎలా చూసుకుంటున్నారనేదాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వారి బాడీ ఇమేజ్, సోషల్ లైఫ్, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. మానసిక ఆరోగ్య సమస్యలుసోషల్ మీడియా విపరీత వినియోగానికీ ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం వంటి సమస్యలకూ మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చూపించే లైఫ్‌స్టయిల్, ఐడియలైజ్డ్ ఇమేజ్‌లు టీనేజర్లలో అసంతృప్తికి, ఆత్మవిశ్వాసలోపానికి దారితీస్తాయి. ఇన్ఫ్లుయెన్సర్లు సృష్టించే స్టాండర్డ్లు అందుకోలేక తామెందుకూ పనికిరామనే భావనకు లోనవుతారు. సోషల్ మీడియాను ఎక్కువగా వాడే వారిలో తమ ఫ్రెండ్స్ గురించి అప్డేటెడ్గా ఉండాలన్న ఒత్తిడి ఉంటుంది. ఫ్రెండ్స్ పోస్టులు ఎప్పటికప్పుడు చూడకపోతే ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. అంతులేని సోషల్ మీడియా ఫీడ్స్ చూసి, లైకులు, కామెంట్స్ కోసం ఎదురుచూడటం వారి ఆత్మవిశ్వాసం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వీటితోపాటు ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్’ అనే సమస్య కూడా టీనేజర్ల మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బాడీ ఇమేజ్‌పై దుష్ప్రభావం..సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అందం, విజయానికి సంబంధించిన ఐడియలైజ్డ్ వర్షన్లను చూపడం వల్ల టీనేజర్లలో తమ శరీరం పట్ల ప్రతికూల ప్రభావం పడుతోంది. నాజూకుగా ఉండే ఫొటోలను పదేపదే చూడటం వల్ల కాస్తంత బొద్దుగా ఉన్న తాను బాలేనని అసంతృప్తికి లోనవుతున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. ‘ఫిట్‌స్పిరేషన్’,‘థిన్సిపిరేషన్’ వంటి కంటెంట్ల వల్ల టీనేజర్లు తక్కువ బరువు, ప్రత్యేకమైన శరీరాకృతికై తహతహలాడుతుంటారు. జీరోసైజ్ చేరుకోవాలని లేదా సిక్స్ ప్యాక్ సాధించాలని ప్రయత్నిస్తుంటారు. ఇది అనారోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రేరేపిస్తుంది.సామాజిక సంబంధాలకు దూరంగా.. సామాజిక సంబంధాలను ఎలా ఏర్పరచుకోవాలో, ఎలా నిర్వహించాలో సోషల్ మీడియా పూర్తిగా మార్చేస్తుంది. ఒకవైపు, తమలాంటి అభిరుచులున్న వ్యక్తులను కలుసుకునేందుకు, అభిప్రాయాలను పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. మరోవైపు, వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకోవడానికి అంతరాయం కలిగిస్తుంది. డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియాలపై విపరీతంగా ఆధారపడటం వల్ల అవసరమైన సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆన్లైన్లో చురుగ్గా ఉండే టీనేజర్లు కూడా వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కొత్తవారితో కలవాలంటే ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు సైబర్ బుల్లీయింగ్, ట్రోలింగ్ వల్ల అనేకమంది మానసిక సమస్యల పాలవుతున్నారు. మరోవైపు నిజమైన స్నేహానికి, ఆన్లైన్ కనెక్షన్ల సంఖ్యకు తేడా గుర్తించలేకపోతున్నారు. ఎంత ఎక్కువమంది ఆన్లైన్ స్నేహితులు లేదా ఫాలోయర్లు ఉంటే అంత గొప్పగా ఫీలవుతున్నారు. కానీ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వారెవ్వరూ తోడురాక ఒంటరితనానికి లోనవుతున్నారు. వీటన్నింటి నుంచీ తప్పించుకోవాలంటే సోషల్ మీడియాను పరిమితంగా వాడటం నేర్చుకోవాలి.మరేం చెయ్యాలి?👉 స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. విరామాలు తీసుకోండి ∙కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడండి 👉 రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి ∙సమతుల ఆహారం తీసుకోండి, సరిపడినంత నీటిని తాగండి ∙స్పష్టమైన లక్ష్యాలను సెట్ చేసుకోండి. దాన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించుకోండి 👉మీ ఆలోచనలు, భావాలు, అనుభవాలు రోజూ రాయండి. అలాగే ప్రతిరోజూ మీరు కృతజ్ఞత తెలపాల్సిన మూడు విషయాలను రాసుకోండి 👉ఏ తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టి పెట్టండి. ప్రతిరోజూ మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి 👉మీ గురించిన నెగటివ్ ఆలోచనలను సవాలు చేయండి. మీ పట్ల మీరు క్షమతో ఉండండి 👉మీ హాబీలపై సమయాన్ని పెంచండి. మీరు ఆస్వాదించే కార్యక్రమాల్లో పాల్గొనండి ∙ఇవన్నీ చేసినా మీరు ఒత్తిడికి లోనవుతుంటే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడానికి సందేహించకండి. -
ఇంటిమసీ లేకుంటే మంటలు తప్పవు
కవిత, నరేందర్ లకు పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ ఉద్యోగం. అన్యోన్యంగా ఉంటారు. ఇంటి బాధ్యతలు ఇద్దరూ పంచుకుంటారు. వీకెండ్ పార్టీలు, ఫ్యామిలీ మీట్స్, టూర్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు.కానీ నెలకో, రెణ్నెళ్లకోసారి గొడవ గ్యారంటీ. చిన్న మాట పట్టింపులతో మొదలై తిట్టుకుని, కొట్టుకునే వరకూ వెళ్తోంది. వీళ్ల గొడవలు చూసి పిల్లలు భయపడుతున్నారు. కలిసుండి ఇలా రోజూ కొట్టుకునేకంటే విడిపోవడమే బెటరని నిర్ణయించుకున్నారు. మ్యూచువల్ డైవోర్స్ కోసం లాయర్‌ను కూడా సంప్రదించారు. కోర్టుకు వెళ్లకముందు ఒకసారి మేరిటల్ కౌన్సెలింగ్ కు వెళ్లమని ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడని వచ్చారు.కవిత, నరేందర్ లతో కలివిడిగానూ, విడివిడిగానూ మాట్లాడాక వాళ్ల మధ్య physical intimacy (శారీరక సాన్నిహిత్యం) తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. కవిత శాలరీ ఎంతో కూడా నరేందర్ కు తెలియదు. అడిగినా చెప్పదు. ‘‘ఇంటి ఖర్చులకు నా షేర్ నేను ఇస్తున్నా కదా. నా శాలరీ గురించి నీకెందుకు? డామినేట్ చేయాలని చూస్తున్నావా?’’ అంటూ గొడవ పడుతుంది.నరేందర్ శాలరీ ఏం చేస్తున్నాడో కవితకు తెలియదు. శాలరీ అంతా ఏం చేస్తున్నావ్? అని అడిగితే ‘‘నేనేదో చేస్తున్నా నీకెందుకు? నీ శాలరీ గురించి నాకు చెప్పనప్పుడు, నా శాలరీ గురించి అడిగే రైట్ నీకు లేదు’’ అని గొడవపడతాడు.ఇలాంటి గొడవలు వాళ్లకు మామూలే. ఇన్ని గొడవల మధ్యా వాళ్లకున్న సుగుణమేంటంటే... పగలెన్ని గొడవలున్నా రాత్రికి ఒకటైతే అన్ని గొడవలూ సర్దుకుంటాయని బలంగా నమ్ముతారు, ఆచరిస్తారు. కానీ మేరిటల్ రిలేషన్షిప్ బలపడాలంటే, నిలబడాలంటే ఫిజికల్ ఇంటిమసీ ఒక్కటే చాలదని, ఇంకా చాలా కావాలని వాళ్లకు తెలియదు. అందువల్ల ఆ దిశగా వాళ్లెలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా చిన్నచిన్న విషయాలకే పెద్దపెద్ద గొవలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, విడాకుల ప్రయత్నాలు.జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇలా అనేకమందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. దంపతుల మధ్య శారీరక సాన్నిహిత్యం కూడా ఉంటుంది. కానీ బంధాలు బలపడాలంటే అదొక్కటే సరిపోదు. ఇంకా చాలా కావాలి. వాటిగురించి ఈరోజు తెలుసుకుందాం.Types of IntimacyPhysical Intimacy: చేతులు పట్టుకోవడం, ముద్దులు పెట్టుకకోవడం, హగ్ చేసుకోవడం వంటివి ఫిజికల్ ఇంటిమసీకి ఉదాహరణలు. అయితే కవిత దీన్ని బహిరంగంగా ప్రదర్శిస్తుంది, నరేందర్ కు అది నచ్చదు. ఫిజికల్ ఇంటిమసీ బెడ్రూమ్ కే పరిమితం కావాలనేది అతని ఫిలాసఫీ.Emotional Intimacy: ఆఫీస్ లో ఆరోజు ఏం జరిగింది? పని ఒత్తిడి ఎలా ఉంది? ఏమైనా ఆందోళనగా ఉందా? భయమేస్తుందా? ఇలాంటి ఎమోషనల్ విషయాలను మాట్లాడుకోండం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. కవిత, నరేందర్ ల మధ్య ఇది శూన్యం.Intellectual Intimacy: చదివిన పుస్తకాల గురించి, చూసిన సినిమాల గురించి మాట్లాడుకోవడం, వారి ఆలోచనలు, అనుభవాలు పంచుకోవడం, చర్చించుకోవడం ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. కవితకు ఫిక్షన్ బుక్స్ అంటే ప్రాణం, నరేందర్ కు అసలు బుక్స్ అంటేనే చిరాకు. ఎప్పుడూ టీవీలో ప్రవచనాలు వింటూ ఉంటాడు.Experiential Intimacy: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలిసి పనిచేయడం, సమయాన్ని గడపడం ముఖ్యం. కవిత, నరేందర్ ల మధ్య ఇది ఫర్వాలేదు. ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకుంటారు.Spiritual Intimacy: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను పార్టనర్ తో చర్చించడమే స్పిరిచ్యువల్ ఇంటిమసీ. నరేందర్ పరమ భక్తుడు, కవిత ఆర్జీవీ రామూయిజం ఫాలోయర్. ఇది చాలు కదా గొడవలు పడటానికి.ఆత్మీయతకు ఆటంకాలుప్రతి రిలేషన్ లోనూ విభేదాలుంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం. కోపం, చిరాకు, అపనమ్మకంతో పార్టనర్ నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఇంటిమసీని దెబ్బతీస్తుంది. మితిమీరిన పని, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల వల్ల కలిగే ఒత్తిడి కూడా దంపతుల మధ్య ఇంటిమసీని దూరం చేస్తుంది. పార్టనర్ తో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఇంటిమసీని పెంపొందించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా ఎక్స్ ప్రెస్ చేయలేకపోతే అది మీ ఇంటిమసీని దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు, కొంతమంది గతానుభవాలు, గాయాల వల్ల పార్టనర్ తో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే fear of intimacy అంటారు. కవితలో ఇది కనిపించింది.భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే అన్ని రకాల ఇంటిమసీలు ఉండేలా చూసుకోవడం అవసరం. కవిత, నరేందర్ లకు వారి ఇంటిమసీల మధ్య విభేదాలు వివరించడంతోపాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ఎక్సర్ సైజ్ లు చేయించాను. కొద్ది సెషనల్లోనే వారి మధ్య నిజమైన సాన్నిహిత్యం పెరిగింది. వారిప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు.ఇలా చేయండి... మీ జీవితంలోనూ సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. ఫిజికల్ ఇంటిమసీ అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకుని మాట్లాడుకోవడం, హగ్ చేసుకోవడం ఫిజికల్ ఇంటిమసీని పెంపొందిస్తాయి. మీ పార్టనర్ చెప్పే మాటలు వినడానికి, మీ ఆలోచనలు పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమయం పెంచుకోవడం ఎమోషనల్ ఇంటిమసీని పెంచుతుంది. భోజనం చేస్తున్నప్పుడు లేదా మీ పార్టనర్ తో కలిసి టీవీ చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్ దూరంగా ఉంచండి. ఇద్దరూ కలిసి కొత్త విషయాలను అనుభవించడం సరదాగా ఉంటుంది. అందుకే మీరిద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేయండి. కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం ఇంటలెక్చువల్ ఇంటిమసీని పెంపొందిస్తుంది.మీకు నమ్మకమున్నా లేకపోయినా పార్టనర్ విశ్వాసాలను గౌరవిస్తూ అప్పుడప్పుడూ స్పిరిచ్యువల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
అన్ని స్నేహాలూ గొప్పవి కావు
సారిక 28 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్. లీల తన చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చదువుకున్నారు. లీలపై సారికకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇటీవలి కాలంలో లీలతో మాట్లాడిన ప్రతిసారీ సారిక తీవ్ర ఎమోషనల్ స్ట్రెస్ ను అనుభవిస్తోంది. ఆ విషయం లీలతో చెప్పలేక, తన స్నేహాన్ని వదల్లేక, తనలో తానే బాధపడుతోంది.సారిక తన ఆఫీసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పుడు లీల ఆమెపై అసూయను వ్యక్తం చేసింది. ‘‘నువ్వెలా సక్సెసవుతున్నావో నాకు తెలియదా ఏంటి’’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ తన సమస్యల గురించే మాట్లాడుతూ ఉంటుంది. వాటిని పరిష్కరించుకునేందుకు సారికను ఉపయోగించుకుంటోంది. ఎప్పుడైనా పని ఒత్తిడిలో ఉంటి పట్టించుకోకపోతే ‘‘కాస్త సక్సెస్ రాగానే నీకు కళ్లు నెత్తికెక్కాయే. నన్నసలు పట్టించుకోవడం లేదు, నా మాటే వినడం లేదు’’ అంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతోంది. తాను ఎంత చేసినా లీల అలా మాట్లాడుతుండటంతో సారిక బాధపడుతోంది. లీలతో స్నేహం కొనసాగించాలా, వదిలేసుకోవాలో అర్థం కావడంలేదు.ఈ నేపథ్యంలో ‘కనెక్షన్ కార్నర్’ కాలమ్ తన దృష్టికి వచ్చింది. అన్ని ఆర్టికల్స్ చదివాక, తన సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీసుకు వచ్చి, తన సమస్య మొత్తం వివరించింది.‘‘నేనెంత పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నించినా నావల్ల కావడంలేదు సర్. లీలతో ఫ్రెండ్షిప్ టాక్సిక్ గా మారింది. నేను నిజంగానే తనతో సరిగా ఉండటంలేదేమోనని గిల్టీ ఫీలింగ్ వస్తోంది. నా మెంటల్ హెల్త్ దెబ్బతింటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.సారిక కష్టాలివీ... ⇒ లీలను కలిసిన ప్రతిసారీ తన సమస్యల చిట్టా విప్పుతుంది. వాటిని వినీవినీ సారిక మానసికంగా అలసిపోతుంది.⇒ సారిక సలహాలు పాటించకపోగా అవసరానికి తనకు సహాయపడటంలేదంటూ లీల పదే పదే మాట్లాడటం వల్ల సారిక అపరాధభావానికి లోనవుతోంది. అందువల్ల ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ⇒ సారిక తన ఆఫీసు విషయాలు లేదా తన సక్సెస్ గురించి చెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోకపోగా, అది ఎవరైనా సాధిస్తారంటూ తక్కువ చేసి మాట్లాడుతోంది. ⇒ సారిక సక్సెస్ పట్ల లీల ఆనందపడకపోగా అసూయను వ్యక్తం చేస్తోంది. అది సారికను నిరుత్సాహపరుస్తోంది. మొత్తంగా చెప్పాలంటే లీల టాక్సిక్ ఫ్రెండ్షిప్ వల్ల సారిక మానసికంగా బాధపడుతోంది. అందుకే లీలతో స్నేహాన్ని కొనసాగించాలా, వద్దా అనే ఆలోచనలో పడింది.టాక్సిక్ స్నేహాలను వదిలించుకోవాలి... ఒక వ్యక్తి సంతోషంగా జీవించడంలో స్నేహాలది ప్రధాన పాత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని స్నేహాలు విషపూరితంగా ఉంటాయి. వాటివల్ల లాభం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాంటి స్నేహాలను వీలైనంత దూరంగా ఉండటం లేదా త్వరగా వదిలించుకోవడం మంచిది. కొనసాగించక తప్పనిసరి పరిస్థితులుంటే ఆ మేరకు మనసును సిద్ధం చేసుకోవాలి. సారిక సమస్యను అర్థం చేసుకున్నాక ఆమెకు కౌన్సెలింగ్ ప్రారంభించాను. ⇒ ఏరోజుకారోజు తన ఫీలింగ్స్ ను డైరీలో రాయడం ద్వారా తన స్నేహాల్లో ఏవి సంతోషాన్నిస్తున్నాయో, ఏవి బాధపెడుతున్నాయో సారిక తెలుసుకుంది. ⇒ లీల కాల్ చేసిన ప్రతిసారీ పనులు పక్కన పెట్టి మరీ వెళ్లాల్సిన అవసరం లేదని సారిక తెలుసుకుంది. వారానికి ఒకసారి, 15 నిమిషాలు మాత్రమే కలవాలని నిర్ణయించుకుంది. ⇒ తన గిల్టీ ఫీలింగ్ ను అధిగమించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు నిర్దేశించిన ఎక్సర్సైజ్ లను ప్రాక్టీస్ చేసింది. ⇒ మెడిటేషన్ ద్వారా తన మానసిక స్థితిని అదుపులో ఉంచుకొనడం ప్రారంభించింది. ⇒ రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా ఆందోళనకు పగ్గాలు వేయగలిగింది. ⇒ తనను సమర్థించే, ప్రోత్సహించే స్నేహితుల సంఖ్యను పెంచుకుంది. ⇒ లీల మాటల్లోని నెగెటివిటీని అధిగమించడం నేర్చుకుంది. ⇒ రోజూ పాజిటివ్ అఫర్మేషన్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా భావోద్వేగాలపై అదుపు సాధించగలిగింది. అలా సారిక కేవలం నాలుగు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది. లీలతో స్నేహం తెంపేసుకోకుండానే, ఆమె మాటల్లోని నెగెటివిటీని పక్కన పెట్టేయడం నేర్చుకుంది. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉండి, తన కెరీర్ పై మరింత దృష్టి సారించి, మరింత సక్సెస్ సాధించగలిగింది. మీకూ అలాంటి స్నేహాలుంటే వీలైనంత వరకూ తగ్గించుకోండి. అది మీ మానసిక ఆరోగ్యానికి ముఖ్యం.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
ఛీ.. ఇంట్లో రోజూ గొడవలే
ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. రెండు వేర్వేరు కుటుంబాల్లో, నేపథ్యాల్లో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వారి మధ్య విభేదాలు సహజం. అయితే వాటిని ఎలా, ఎంత త్వరగా పరిష్కరించుకున్నానేదే వారి బంధంలోని సంతోషాన్ని నిర్ణయిస్తుంది. విభేదాలను పరిష్కరించుకోకుండా చిన్న చిన్న వాదనలను కూడా పెద్ద పెద్ద గొడవలుగా మార్చుకుంటే కుటుంబ జీవితాన్ని నరకంగా మారుతుంది. అలాంటి ఒక జంట గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రవి (32) ప్రియ (30)లకు ఐదేళ్ల కిందట పెళ్లయింది. రవి ఐటీ కన్సల్టెంట్, ప్రియ హెచ్ ఆర్ మేనేజర్. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ప్రేమ. తమ బిడ్డ కీర్తన అంటే ప్రాణం. ఇంటి పనులతో సహా బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. వారాంతాల్లో సినిమాలు, షికార్లు. అప్పుడప్పుడూ విహారయాత్రలు. సుఖంగా సంతోషంగా జరుగుతున్న కాపురం.కానీ గత కొద్ది నెలలుగా మారి మధ్య తరచూ గొడవలవుతున్నాయి. గత నెల జరిగిన గొడవ ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది. ఆ తర్వాత తమ ప్రవర్తనకు ఇద్దరూ సిగ్గుపడ్డారు. ఎలాంటి విభేదాలున్నా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప గొడవ పడకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ పెద్ద గొడవలయ్యాయి. ఇక తమ వల్ల కాదనుకుని కౌన్సెలింగ్ కు వచ్చారు. ఇద్దరితో విడివిడిగా, కలివిడిగా మాట్లాడాను.చిన్న చిన్న అసమ్మతులు, ఇంటి పనులు, బిడ్డ సంరక్షణ లేదా ఆర్థిక విషయాలు అతి త్వరగా తీవ్రమైన గొడవలుగా మారుతున్నాయని చెప్పారు. ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, మళ్లీ గొడవలు ఆపలేకపోతున్నామన్నారు. దీంతో ఎమోషనల్ గా దూరమవుతున్నామని, ఇంటిమసీ కోల్పోతున్నామని చెప్పారు. ఇలా జరగడం చాలా బాధగా ఉందన్నారు.ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ వల్ల ఒత్తిడి పెరిగిందని, మళ్లీ ఇంటికి వచ్చి పనిచేయాలంటే కష్టంగా ఉందని రవి చెప్పాడు. తనకు కూడా ఆఫీసులో చాలా వర్క్ ఉంటోందని, ఇంటికి వచ్చాక పాపతో సరిపోతుందని, మళ్లీ ఇంటి పని చేయాలంటే తన వల్ల కావట్లేదని ప్రియ చెప్పింది. అయినప్పటికీ తాను చేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేకపోగా, కూరలో ఉప్పు ఎక్కువైనా గొడవ పడుతున్నాడని చెప్పింది.ఇలాంటి విషయాలన్నీ కలిసి కుటుంబం కోసం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారనే వాదనలుగా మారాయి. అవి వ్యక్తిగత దూషణలుగా మారాయి. పెళ్లికి ముందు జరిగిన విషయాలనుంచి, పెళ్లి రోజు జరిగిన గొడవల వరకూ తవ్విపోసుకున్నారు. ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించారు. వాదనల తర్వాత రవి ఇంటినుంచి బయటకు వెళ్లిపోగా, ప్రియ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటుంది.వాదనలు వర్సెస్ తగాదాలుమనం మొదట్లో చెప్పినట్లు ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. ఆరోగ్యకరమైన వాదనలు పరిష్కారానికి దారితీస్తే, తగాదాలు భావోద్వేగ గాయాలను మిగుల్చుతాయి. అందుకే వాదనలకు, తగాదాలకు మధ్య తేడా తెలుసుకోవడం అవసరం. 👉 ఒక సమస్యను చర్చించడం, భావాలు, పరిష్కారాలను చర్చించడం, ఆరోపణలు చేయకపోవడం ఆరోగ్యకరమైన వాదనల లక్షణం. ఉదాహరణకు, రవి ఇంటి పనుల కారణంగా ఒత్తిడిగా అనిపిస్తే, ప్రియ వ్యక్తిత్వంపై దాడి చేయకుండా తన అభిప్రాయం చెప్తాడు. ఆరోగ్యకరమైన వాదనలు 👉 విభేదాల సమయంలో కూడా భాగస్వామి పట్ల గౌరవం తొలగిపోదు. భాగస్వామి వాదన వినడం, అది భిన్నమైనదైనా అంగీకరిస్తారు. 👉 ఇద్దరూ ఎమోషనల్ గా ఉన్నప్పుడు అది మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 👉 విధ్వంసకరమైన తగాదాల్లో సమస్యను గాలికి వదిలి వ్యక్తిగతంగా విమర్శిస్తారు. రవి, ప్రియల మధ్య జరుగుతున్నది ఇదే. 👉 తగాదాల్లో తరచుగా గతం నుండి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తారు. 👉 ఇద్దరూ గొంతు పెంచి అరచుకోవడం, ఒకరినొకరు అడ్డుకోవడం జరుగుతుంది. రవి తరచుగా వాదన మధ్యలో బయటకు వెళ్లిపోవడం ప్రియకు తనను పట్టించుకోవడం లేదనే అనుభూతిని కలిగించింది. కౌన్సెలింగ్ తో పరిష్కారం... రవి, ప్రియల సమస్య వాదనలు తగాదాలుగా మారడమే. అందుకే వారి మధ్య హెల్తీ కమ్యూనికేషన్ పెంపొందించేలా కౌన్సెలింగ్ సెషన్లు ప్లాన్ చేశాను. 👉 ఏ బంధంలోనైనా యాక్టివ్ లిజనింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కౌన్సెలింగ్ సమయంలో వారు ఒకరినొకరు అడ్డుకోవడం లేదా వ్యక్తిగత దాడులు చేయకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం నేర్చుకున్నారు.👉 ఉద్రిక్తత పెరిగినప్పుడు ఒక చిన్న విరామం తీసుకోవడానికి అంగీకరించారు. దీనివల్ల భావోద్వేగ నష్టం తగ్గుతుంది. వారి వాదనలు నిర్మాణాత్మకంగా మారాయి.👉 వాదనల్లో ఒకే సమస్యపై కేంద్రీకరించాలని, అనవసర విషయాలు తీసుకురాకూడదని తీర్మానించుకున్నారు. 👉 ఒకరి లవ్ లాంగ్వేజ్ ను మరొకరు అర్థం చేసుకున్నారు. తగాదా సమయంలో కూడా పరస్పర గౌరవంతో, ప్రేమతో వ్యవహరించడం నేర్చుకున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
ఏ బంధంలోనైనా గౌరవం ముఖ్యం
కనెక్షన్ లేదా రిలేషన్షిప్ అనగానే అందరికీ లవర్స్ లేదా కపుల్స్ గుర్తొస్తారు. వారి మధ్య వచ్చే సమస్యలే గుర్తొస్తాయి. కానీ స్నేహితులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో సంబంధం కూడా ముఖ్యం. అందుకే మన ‘కనెక్షన్ కార్నర్’లో ఇవన్నీ చర్చించుకుందాం.అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ మూవీ చూశారా? అందులో అన్నాదమ్ములిద్దరూ రోజూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ అన్నకు సమస్య వచ్చినప్పుడు తమ్ముడు అండగా నిలబడతాడు. అదే బంధాలకు ఉండే ప్రాధాన్యం. అయితే అన్ని సందర్భాల్లోనూ అలా సర్దుకుపోరు. కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య గొడవలు పెరిగి పెద్దవై పోలీస్ కేసుల వరకూ వెళ్లిన సందర్భాలు కూడా మనం వార్తల్లో చూస్తుంటాం. అలాంటి ఒక కేస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం.రోహిత్, సిద్ధార్థ్ అన్నదమ్ములు. 32 ఏళ్ల రోహిత్ స్వంత వ్యాపారం పెట్టి సక్సెస్ అయ్యాడు. 28 ఏళ్ల సిద్ధార్థ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా వారి రిలేషన్షిప్ బాగా దెబ్బతింది. తరచుగా వాదనలు, అపార్థాలు, సెటైర్లు.తానెంతో కష్టపడి వ్యాపారం మొదలుపెట్టి 32 ఏళ్లకే సక్సెస్ సాధించినా, తనను ‘డబ్బు మనిషి’ అంటున్నాడని సిద్ధార్థ్ పై రోహిత్ కు కోపం. మరోవైపు తక్కువ సంపాదిస్తున్నాడని రోహిత్ కు తానంటే చిన్నచూపని సిద్ధార్థ్ కు బాధ. అలా ఇద్దరూ తరచూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. అవి చిలికిచిలికి గాలివానగా మారి ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది.ఆ వయసుకొచ్చిన పిల్లలు కొట్టుకోవడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏం చేయాలో అర్థంకాక వారిద్దరినీ కౌన్సెలింగ్ కు వెళ్లమని అడిగారు. వాళ్లిద్దరూ అయిష్టంగానే వచ్చారు.పరస్పర గౌరవం లేకపోవడమే సమస్య... మొదటి సెషన్ లో వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడాను. పరస్పర గౌరవం లేకపోవడమే వారి సంఘర్షణకు మూలమని అర్థమైంది. అందుకే వారి విభేదాలు నిర్మాణాత్మకంగా కాకుండా వ్యక్తిగత దాడులుగా మారాయి. 👉 సోదరులిద్దరూ వారి కెరీర్ ఛాయిస్, వ్యక్తిగత నిర్ణయాలను తప్పుగా అంచనా వేసుకుంటూ, వారి పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు.👉 ఏ ఒక్కరూ మరొకరి దృక్పథాన్ని వినకపోగా ఒకరి ఐడియాకు మరొకరు అంతరాయం కలిగిస్తున్నారు లేదా తిరస్కరిస్తున్నారు. 👉వారి సంభాషణలు తరచుగా సర్కాస్టిక్ కామెంట్స్ (వ్యంగ్య వ్యాఖ్యలు), నెగెటివ్ జడ్జ్ మెంట్స్ (ప్రతికూల తీర్పులు) గా మారి విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.👉దీంతో వారిద్దరూ సరిగా కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. తన సోదరుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని అపార్థం చేసుకుంటున్నాడు. అతని వైఖరిని అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.శ్రద్ధగా వినడమే తొలి అడుగు... ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఎడమొహం పెడమొహంగా మారి విభేదాలను ఇంకా పెద్దవి చేసుకుంటారు. కానీ సోదరులిద్దరూ ఒకరి కెరీర్ ఛాయిస్, లైఫ్ స్టైల్, వాల్యూస్ ను అర్థం చేసుకోవడం, అభినందించడం అవసరం. ఆ మేరకు సెషన్స్ ప్లాన్ చేశాను. 👉ప్రారంభ సెషన్లలో ‘యాక్టివ్ లిజనింగ్’ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసాను. అంటే సోదరుడు మాట్లాడేటప్పుడు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా వినాలి. అతని దృక్పథంతో విభేదించినప్పటికీ, అతని భావోద్వేగాలను అంగీకరించాలి. విమర్శలకు బదులుగా నిర్మాణాత్మక సూచనలివ్వాలి. 👉తర్వాత ‘ఐ ఫీల్‘ స్టేట్మెంట్ టెక్నిక్‌ని ఇచ్చాను. అంటే సోదరుడిని నిందించడానికి బదులుగా ‘నాకిలా అనిపించింది’, ‘నేను బాధపడ్డాను’ అని తన అభిప్రాయాన్ని, భావోద్వేగాన్ని మాత్రమే వ్యక్తపరచాలి. ఈ టెక్నిక్ వారు వాదించుకోకుండా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడింది. 👉 ఫైనాన్షియల్ సక్సెస్ సాధించడమే రోహిత్ లక్ష్యమైతే, అకడమిక్ గా టాప్ లో ఉండటమే సిద్ధార్థ్ లక్ష్యం. ఒకరి ఎంపికను మరొకరు అర్థం చేసుకునేలా చర్చించుకునేలా ప్రోత్సహించాను. 👉 వారిద్దరూ ఒకరి ఛాయిస్ ను మరొకరు ఎలా చూశారో వివరిస్తూ మనసువిప్పి లెటర్లు రాసుకోమన్నాను. ఇది వారి అభిప్రాయాలను రీఫ్రేమ్ చేసి, ఒకరినొకరు అభినందించుకునేలా చేసింది.అలా పది సెషన్లలో రోహిత్, సిద్ధార్థ్ ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకున్నారు. సర్కాజం, క్రిటిసిజం లేకుండా ఎలా కమ్యూనికేట్ చేయవచ్చో నేర్చుకున్నారు. ఒకరి ఛాయిస్ ఏదైనా దాన్ని గౌరవించాలని, నచ్చకపోతే తన అభిప్రాయాన్ని నిర్మాణాత్మంగా వివరించాలని అర్థం చేసుకున్నారు. చక్కగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమ కెరీర్ ఛాయిస్ ఏదైనా కుటుంబానికి అండగా నిలబడటం, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం ముఖ్యమని అర్థం చేసుకుని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అది చూసి వారి తల్లిదండ్రులు సంతోషించారు.సోదరులనే కాదు, టీనేజ్, కపుల్, వర్క్ రిలేషన్షిప్స్ లో పరస్పర గౌరవానికి కీలక పాత్ర. గౌరవం ఉండటమే కాదు, ఉన్నట్లు కనిపించాలి. లేదంటే రోహిత్, సిద్ధార్థ్ లా అపార్థాలు, గొడవలు తప్పవు. అందుకే తీర్పులివ్వకుండా వినడం, కమ్యూనికేషన్ ను మెరుగుపరచుకోవడం, గౌరవప్రదమైన సరిహద్దులను సెట్ చేసుకోవడం, తీర్పులను రీఫ్రేమ్ చేసుకోవడం అవసరం.సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
ది మానిప్యులేటివ్ పార్టనర్
ప్రచారం పిచ్చో... డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆశనో తెలియదు కానీ.. ఈ మధ్యకాలంలో చాలామందికి రీల్స్ పిచ్చి పట్టుకుంది. కొన్నిసార్లు ఇది కాస్తా శ్రుతిమించి పోయి వ్యవసనంగానూ మారిపోతోంది. ఆఖరుకు ఇది దాంపత్య జీవితంలోనూ చిచ్చు పెట్టే స్థితికి చేరుకుంది. అయితే కర్ణాటకలోని ఉడుపికి సమీపంలోని కార్కడలో ఈ రీల్స్ పిచ్చి కాస్తా ఓ నిండుప్రాణం పోయేందుకు కారణమైంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...బీదర్‌లోని దోణగాపురకు చెందిన జయశ్రీ (31)కి రీల్స్ అంటే తెగ పిచ్చి. ఈమెకు కార్కడ సమీపంలోని గుండ్మిలో నివసించే కిరణ్ ఉపాధ్య (44)తో పెళ్లి అయ్యింది. కొంత కాలం సంసారం బాగానే నడిచింది కానీ.. జయశ్రీ నిత్యం రీల్స్ చేస్తూండటం కిరణ్‌కు ఏ మాత్రం నచ్చలేదు. అంతేకాదు... జయశ్రీ ఆన్లైన్ షాపింగ్ వ్యసనం విషయంలోనూ భార్య భర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు అవుతూండేవి. తనకు పెద్ద ఇల్లు కావాలని... లగ్జరీ కారు.. నగదు కావాలని... గుడులలో వంటలకు సాయంగా పనిచేస్తున్న భర్త కిరణ్‌ను వేధించేది. ఇది కాస్తా వారిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేందుకు కారణమైంది. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య రీల్స్ విషయమై వాదులాట మొదలైంది. ఈ క్రమంలోనే కిరణ్ కొడవలితో దాడి చేయడంతో జయశ్రీ మరణించింది. ఆ తరువాత బంధు మిత్రులకు ఫోన్ చేసి జయశ్రీ మొదటి అంతస్తులోంచి కిందకు పడిపోయిందని... స్పందన లేదని చెప్పాడు. వారి సలహాతో ఆంబులెన్స్‌కు ఫోన్ చేశాడు కూడా. అయితే జయశ్రీ ఆసుపత్రికి చేరే సమయానికి ప్రాణాలతో లేదని డాక్టర్లు ప్రకటించారు. అయితే... ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత కిరణ్ ప్రవర్తన తేడాగా ఉండటాన్ని చుట్టుపక్కల వాళ్లు గమనించారు. ఇంట్లో రక్తపు మరకల్ని తొలగించే ప్రయత్నం చేశాడు. అనుమానం కొద్దీ ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు కిరణ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. కిరణ్ ముందస్తు ప్రణాళికతోనే జయశ్రీని హత్య చేశాడని, గత గురువారమే మార్కెట్లో కొత్త కొడవలిని కొనుగోలు చేశాడని స్థానికులు చెబుతున్నారు. రజని హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్థగా పనిచేస్తోంది. గత కొద్దికాలంగా ఆమెకు అంతా గందరగోళంగా అనిపిస్తోంది. తాను చేస్తున్నది రైటా, తప్పా అనే సందేహం తరచూ వేధిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింది. నిరంతరం ఒత్తిడి, ఆందోళన ఫీలవుతోంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. ఒంటరితనం, భయం, నిస్సహాయత. దాంతో పేషంట్లను ట్రీట్ చేయడంలో కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా సారీ చెప్తోంది. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ కాబట్టి తనకు తానే వైద్యం చేసుకుంది. కానీ తగ్గడంలేదు. దాంతో ఇది శారీరకం కాదని, మానసికమని అర్థమై కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన సమస్య చెప్పింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పమని అడిగాను.అపనమ్మకం...రజనికి పెళ్లయి ఐదేళ్లయ్యింది. తన కొలీగ్ డాక్టర్ ఆనంద్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. రజని కొంచెం కలుపుగోలు మనిషి. అది ఆనంద్ కు నచ్చదు. ‘‘నీ పని నువ్వు చూసుకోక అందరితో అలా మాట్లాడతావెందుకు?’’ అని అడిగేవాడు. తరచూ రజనిపై కోప్పడేవాడు. ‘‘అందరితో బాగా నవ్వుతూ మాట్లాడతావ్. నాతో మాట్లాడాలంటే మాత్రం మొహం ముడుచుకుంటావ్. నీకంటికి నేను చేతకాని వాడిలా కనిపిస్తున్నా’’ అని దెప్పేవాడు. ‘‘అలాంటిదేం లేదు’’ అని చెప్పినా వినేవాడు కాదు. ‘‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్ ను కలువు’’ అని తరచూ అనేవాడు. కొన్నాళ్లకు రజని కూడా తన మానసిక స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ‘‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే ఆనంద్ ఎందుకలా అంటాడు’’ అని అనుకునేది.గ్యాస్ లైటింగ్... డాక్టర్ రజని చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్ కు గురవుతుందని అర్థమైంది. గ్యాస్ గురించి అందరికీ తెలుసు. కానీ గ్యాస్ లైటింగ్ అంటే ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ ను వెలిగించేది కాదు. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్ లో పెట్టుకోవడానికి కొందరు చేసే మేనిప్యులేషన్ ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక నుండి పుడుతుంది. తమ మాటే నెగ్గేలా, తమ దారికి అడ్డులేకుండా చేసుకోవడానికి అబద్ధాలు చెప్తారు, నిందలు వేస్తారు. తమ తప్పును కూడా భాగస్వామిపై తోసేసి తమ ప్రయోజనాలను కాపాడుకుంటారు. తనపై తనకు నమ్మకం కోల్పోయేలా చేస్తారు, చివరకు భాగస్వామి ఎమోషన్స్ పై కంట్రోల్ సాధిస్తారు. ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ ఆనంద్ అందులో మాస్టర్స్ డిగ్రీ సాధించాడని అర్థమైంది. కానీ తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్న విషయాన్ని రజని గుర్తించలేకపోతోంది. అదే ఈ సమస్యలో ఉండే అసలు సమస్య. తనను మేనిప్యులేట్ చేస్తున్నారనే విషయం బాధితులకు తెలియదు, అసలా దిశగా ఆలోచించలేరు. ఎవరైనా చెప్పినా నమ్మరు.థెరపీతో పరిష్కారం... అందుకే మొదట రజనికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆలోచనల్లోని లోపాలు గుర్తించేలా, వాటిని సవాల్ చేసేలా చేశాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. ఆనంద్ అలాగే చేస్తాడని చెప్పింది. తాను గ్యాస్ లైటింగ్ కు గురవుతున్నానని అర్థం చేసుకుంది. ఆ తర్వాత తన భద్రతకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాను. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్ సైజ్ లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్ ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ రజని తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆనంద్ మాటలను పట్టించుకోవడం మానేసింది. రజని ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న ఆనంద్ కూడా తన ప్రవర్తను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది.గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు⇒నువ్వు ప్రతిదానికీ ఓవర్ రియాక్ట్ అవుతున్నావ్. ⇒అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. ⇒నీకోసమే అలా చేశాను. ⇒నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?⇒నేను నీకు చెప్పాను, గుర్తులేదా? ⇒అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్. ⇒ నీపట్ల నాకెప్పుడూ నెగెటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగెటివ్ గా చూస్తున్నావ్.వాళ్ల మాటలు నమ్మొద్దు⇒గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు. ⇒గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా చేసే పనులపై దృష్టి పెట్టాలి. ⇒‘‘నీకు పిచ్చి’’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు. ⇒‘‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకూ గుర్తుందే అదే నిజమని గుర్తించాలి. ⇒గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్ కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు. ⇒గ్యాస్ లైటర్ తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి. ⇒మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి.సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
అంతరాలు పెరిగితే మొదటికే మోసం
హాయ్, హలో ఎలా ఉన్నారు? గుర్తున్నానా? లేదా రెండు వారాల గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోయారా? నిజాయితీగా మీ సమాధానం కామెంట్స్ లో చెప్పండి. సరే, ఈ రోజు టాపిక్ ఈ గ్యాప్ పైనే.మొన్నా మధ్య మా కౌన్సెలింగ్ సెంటర్ కు ఓ జంట వచ్చారు. ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం క్లయింట్ల పేర్లు చెప్పకూడదు కాబట్టి అరుణ, సాగర్ అనుకుందాం. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ కలిసి నెలకు నాలుగైదు లక్షలు సంసాదిస్తున్నారు. గచ్చిబౌలి లో ఫ్టాట్, మంచి కారు, వీకెండ్ పార్టీలు, మంత్లీ ట్రిప్స్, ఏడాదికోసారి ఇంటర్నేషనల్ టూర్. హ్యాపీ లైఫ్. ఇది అందరికీ కనిపించే విషయం.కానీ లోలోపల అగ్గి రగులుతోంది. ఇద్దరి మధ్యా వాదనలు పెరిగాయి. దూరం పెరిగింది. గత ఆరునెలలుగా తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం ఒక లాయర్ ను సజెస్ట్ చేయమని ఫ్రెండ్ ను అడిగారు. విడాకులకు అప్లయ్ చేశాక కూడా కౌన్సెలింగ్ కు వెళ్లాలని, దానికన్నా ముందే వెళ్లడం మంచిదని నా పేరు సజెస్ట్ చేశారు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు. మొదటి సెషన్ లో వారిద్దరితో విడివిడిగానూ, కలివిడిగానూ మాట్లాడి సమాచారం తీసుకున్నా. వారిద్దరూ విడిపోవడానికి కారణం ప్రేమ లేకపోవడం కాదని, పెరుగుతున్న దూరమని అర్థమైంది. ఒకే ఇంట్లో ఉంటున్నా, శారీరికంగా కలుస్తున్నా, ఎమోషనల్ గా, సైకలాజికల్ గా దూరమవుతున్నారని వారి మాటల ద్వారా తెలిసింది. కౌన్సెలింగ్, మేరిటల్ థెరపీ, రిలేషన్షిప్ ఎక్సర్ సైజ్ ల ద్వారా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగేలా చేశాను. దాంతో విడాకుల ఆలోచనకు స్వస్తి పలికి ఇద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో జంటల మధ్య ఏర్పడే వివిధ రకాల అంతరాలు, అదేనండీ గ్యాప్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.అంతరాలను అర్థం చేసుకోవడం...పగలెలా ఉన్నా రాత్రికి ఒక్కటైతే చాలు, అన్ని సమస్యలూ మాయమవుతాయని పెద్దలు చెప్తుంటారు. అది ఆ కాలంలో నడిచిందేమో కానీ, ఈ కాలంలో వర్కవుట్ కాదు. జంట మధ్య శారీరక దూరంతో పాటు, ఎమోషనల్, సైకలాజికల్, ఇంటలెక్చువల్, స్పిరిచ్యువల్ గ్యాప్స్ కూడా ఏర్పడవచ్చు. వాటికి సకాలంలో అడ్రస్ చేయకపోతే ఇద్దరి మధ్య కనిపించని అగాధం ఏర్పడుతుంది. అందుకే వాటి గురించి తెలుసుకుని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది.ఎమోషనల్ డిస్టెన్స్...జంటలు తమ ఆలోచనలు, భావాలు, అనుభవాలు, భావోద్వేగాలు పంచుకోవడం తగ్గించినప్పుడు, మానివేసినప్పుడు ఎమోషనల్ గ్యాప్ ఏర్పడుతుంది. ఉదాహరణకు, అరుణ తన కెరీర్ పడుతున్న స్ట్రెస్ గురించి సాగర్ కు చెప్పినప్పుడు, అది అందరికీ ఉండేదేగా, ప్రత్యేకం ఏముంది? అంటూ కొట్టిపడేశాడు. ఒకటి రెండు సార్లు అలా అనేసరికి తన ఒత్తిళ్ల గురించి చెప్పడం మానేసింది. తన కష్టాల్లో సాగర్ అండగా లేడని బాధపడటం మొదలుపెట్టింది. అది వారిద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ కు కారణమైంది.ఇంటలెక్చువల్ డిస్టెన్స్...తమకు ఎక్సయిట్మెంట్, ఇంటలెక్చువల్ స్టిములేషన్ కలిగించిన విషయాల గురించి మాట్లాడుకోవడం మానేసినప్పుడు ఇది జరుగుతుంది. అరుణకు యద్దనపూడి నవలలంటే ఇష్టం. సాగర్ నాన్ ఫిక్షన్ చదువుతాడు. అది అతనిష్టం. కానీ ఈ కాలంలో యద్దనపూడి నవలలు చదవడమేంటని అరుణను వెక్కిరిస్తాడు. దాంతో వారిద్దరి మధ్య ఇంటలెక్చువల్ షేరింగ్ పూర్తిగా ఆగిపోయింది. దూరం పెరిగింది.ఎక్స్ పీరియన్షియల్ డిస్టెన్స్... ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండకపోవడమే కాదు, జంట మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలా చేయనప్పుడు దూరం పెరుతుంది. అరుణ, సాగర్ బిజీ వర్క్ లో పడిపోయారు. కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం తగ్గిపోయింది. కలిసి వంట చేయడం సంగతి సరేసరి. ఎక్కువ సందర్భాల్లో స్విగ్గీ, జొమాటోలపైనే ఆధారపడుతున్నారు.స్పిరిచ్యువల్ డిస్టెన్స్... భాగస్వాముల నమ్మకాలు, ఆచారాలు ఏకోన్ముఖంగా లేనప్పుడు ఈ దూరం ఏర్పడుతుంది. అరుణకు ఓ గురువంటే అమితమైన భక్తి. సాగర్ నాస్తికుడు. ఆ గురువు మోసగాడని రోజూ విమర్థిస్తుంటాడు. కాలక్రమేణా, అది వారిద్దరి మధ్య నిశ్శబ్దానికి దారితీసింది.ఫిజికల్ డిస్టెన్స్... శారీరక దూరం అంటే సెక్స్ లేకపోవడం అని అర్థం కాదు, కానీ రోజువారీ పనుల్లో స్పర్శ, ఆప్యాయత లేకపోవడం. ఆప్యాయంగా అరుణ చేతులు పట్టుకోవడం, సున్నితంగా కౌగిలించుకోవడం సాగర్ పూర్తిగా మర్చి పోయాడు. దూరాలను తగ్గించుకోవాలి... అరుణ, సాగర్ లానే మీ మధ్య కూడా ఇలాంటి దూరాలు, అంతరాలు ఉన్నాయా? భయపడాల్సిన అవసరమేం లేదు. ఆ అంతరాలను తగ్గించుకోవడానికి మీరిద్దరూ ప్రయత్నం చేస్తే చాలు. అరుణ, సాగర్ లకు చెప్పిన కొన్ని టిప్స్ ఇప్పుడు మీకు కూడా చెప్తా. మీ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రతిరోజూ సమయాన్ని కేటాయించండి. గంటలు గంటలు అవసరం లేదు. కాఫీ తాగుతూ కూడా మాట్లాడుకోవచ్చు. అయితే ఆ సమయంలో మొబైల్ చూడకుండా పార్టనర్ చెప్పేది వినాలి. మీ మీ వ్యక్తిగత అభిరుచులను అలాగే ఉంచుకుంటూ, ఇద్దరికీ ఇష్టమైన ఇంటలెక్చువల్ అంశం కనుక్కోండి, తరచూ దాని గురించి చర్చించుకోండి. మీరిద్దరూ ఎంజాయ్ చేసే వనులకు తప్పనిసరిగా సమయాన్ని కేటాయించండి. ఇది కలిసి వంట చేయడం, నడవడం లేదా అడ్వంచర్ ట్రిప్ లాంటిది ఏదైనా కావచ్చు.ఒకరి ఆధ్యాత్మిక విశ్వాసాలను మరొకరు గౌరవించుకోండి. మీ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, కలిసి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయండి. శారీరక సాన్నిహిత్యం అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. దగ్గరగా కూర్చోవడం, చేతులు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం, కౌగలించుకోవడం లాంటి చిన్న చిన్న పనులు ఫిజికల్ ఇంటిమసీని పెంచుతాయి. కొన్ని జంటలు ఈ పనులన్నీ చేస్తున్నా గ్యాప్ పెరుగుతూనే ఉంటుంది. ఇరువురి మధ్య పరిష్కరించుకోని వైరుధ్యాలు, కనిపించని ఒత్తిళ్లు, కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్, ఫియర్ ఆఫ్ వల్నరబిలిటీ అందుకు కారణం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగేకంటే కౌన్సెలింగ్ సెంటర్ కు వెళ్లడం మంచిదని గుర్తించండి. విష్ యూ హ్యాపీ లైఫ్.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066Psy.vishesh@gmail.com -
‘డిజిటల్ డివైడ్’.. కాపురాలు కూలుతున్నాయి
రిషి, ప్రియ అందమైన జంట. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. రోజంతా పని చేయడం, సాయంత్రాలు కలిసి చాలా చాలా కబుర్లు చెప్పుకోవడం, వారాంతాల్లో సినిమాకో, షికారుకో వెళ్లడం, అక్కడే డిన్నర్ చేసి ఇంటికి రావడం.. ఎలాంటి సమస్యలూ లేకుండా పర్ఫెక్ట్ కపుల్ లా ఉండేవారు. అలాంటిది.. అనూహ్యంగా వాళ్ల కాపురంలో చిచ్చు రగిలింది. ఎలా అంటే..ప్రియ చురుకైన వ్యక్తి, ఫ్రెండ్స్ తో చాలా సరదాగా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా వారితో నిత్యం కనెక్ట్ అవుతుంది. వాళ్ల జీవితంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. తన విషయాలన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ వాళ్లతో చాట్ చేస్తుంది. రిషికి సోషల్ మీడియా అంటే కొంచెం చిరాకు. అన్ని విషయాలూ సోషల్ మీడియాలో అప్ డేట్ చేయాల్సిన అవసరం లేదంటాడు. ఈ విషయం తరచూ ప్రియకు చెప్తుంటాడు. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో, ఆమెపై చిరాకు పడుతుంటాడు.కాలంతో పాటు అప్ డేట్ కావాలని, ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటంలో తప్పేమీ లేదని ప్రియ వాదిస్తుంటుంది. ఈ విషయమై అప్పుడప్పుడూ ఇద్దరిమధ్యా వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ విధంగా వారి మధ్య "డిజిటల్ డివైడ్" ఏర్పడింది. వారి ఆన్ లైన్ అలవాట్లు, ఆఫ్ లైన్ జీవితంపై ప్రభావం చూపించడం మొదలైంది.అందమైన సినిమా...సోషల్ మీడియా అందమైన సినిమాలాంటిది. అందరూ తమ జీవితంలోని అందమైన, ఆకర్షణీయమైన భాగాన్ని మాత్రమే అక్కడ ప్రదర్శిస్తుంటారు. ప్రియ కూడా అంతే. తమ మధ్య ఎన్ని గొడవలున్నా, తాము సంతోషంగా గడిపిన ఫొటోలను చక్కగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది. అప్పుడప్పుడూ రీల్స్ కూడా. అయితే విషయం అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ పోస్టులు, ఫొటోలు చూసి, వారి జీవితంతో పోల్చుకుంటుంది. తాను వాళ్లంత ఆనందంగా లేనని బాధపడుతుంది. వారిపై అసూయ పడుతుంది. అది ఆమె జీవితంలో అసంతృప్తికి దారితీసింది. ఇవన్నీ అప్పుడప్పుడూ ఆన్ లైన్లో తన పాత స్నేహితుడితో పంచుకుంటోంది.విశ్వాస ఉల్లంఘనప్రియ తన స్నేహితుడితో సుదీర్ఘంగా చాట్ చేస్తున్న విషయం రిషికి తెలిసింది. ఇదేంటని అడిగాడు. సరదాగా చాట్ చేస్తున్నానే తప్ప మరేమీ లేదని ప్రియ చెప్పింది. ‘‘నీ జీవితం ఆనందంగా లేదని అతనితో చెప్తున్నావ్ కదా. నాతో జీవితం అంత బాధాకరంగా ఉందా?’’ అని నిలదీశాడు. అలాంటిదేం లేదని, అవన్నీ కాజువల్ కాన్వర్జేషన్స్ అని ప్రియ చెప్పినా సంతృప్తి చెందలేదు. అతనితో చాటింగ్ మానేయమన్నాడు. తమ మధ్య ఏమీ లేనప్పుడు మానేయాల్సిన అవసరమేముందని ప్రియ వాదించింది. ‘‘నన్ను అనుమానిస్తున్నావా?’’ అని ప్రశ్నించింది. అలాంటిదేం లేదని, అయినా సరే మానేయమని రిషి కోరాడు. అలా అలా ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. విడాకులు తీసుకోవాలని అనుకునేంతవరకూ వెళ్లారు. ఈ విషయం ఒక క్లోజ్ ఫ్రెండ్ దృష్టికి వచ్చింది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకున్నారంటూ ఆమె వారిద్దరికీ చీవాట్లు పెట్టింది. ఆమె సలహా మేరకు వారిద్దరూ కౌన్సెలింగ్ కు వచ్చారు.రెండువైపులా పదునున్న కత్తిసోషల్ మీడియా అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో ప్లస్, మైనస్ రెండూ ఉంటాయి. సోషల్ మీడియా రాకతో మనం దేశ విదేశాల్లోని బంధువులతో, స్నేహితులతో కనెక్షన్ ను కొనసాగించడం సులువైంది. పాత స్నేహితులు, కొలీగ్స్ తో మళ్లీ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మనం సాధించిన విజయాలను, అనుభవాలను అందరితో పంచుకోవచ్చు. జంటలు తమ జ్ఞాపకాలను పదిలపరచుకోవడం ద్వారా వారి బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.ఆన్లైన్ కమ్యూనిటీలు, సపోర్ట్ గ్రూప్‌ల ద్వారా మన జీవితంలో ఎదురైన ఛాలెంజ్ లను ఎదుర్కునేందుకు సహాయం, సలహాలు పొందవచ్చు. పార్టనర్ పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రశంలను వ్యక్తం చేయడం ద్వారా బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.మరోవైపు సోషల్ మీడియా వల్ల రిషి, ప్రియ జీవితాల్లో ఏర్పడినట్లే సవాళ్లు కూడా ఏర్పడవచ్చు. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ జీవితాలను మాత్రమే తరచూ చూడటం వల్ల అసూయ ఏర్పడుతుంది. తమ బంధం పట్ల అభద్రత, అసమర్థ భావాలకు దారితీస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని అతిగా పోస్ట్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. తరచూ ఇతరులతో పోల్చుకోవడం వల్ల అవాస్తవిక అంచనాలకు దారితీస్తుంది. సున్నితమైన విషయాలను చర్చించేటప్పుడు మనం పంపే మెజేజెస్ ను తప్పుగా అర్థం చేసుకుంటే అపార్థాలకు దారితీస్తుంది. ఒక వ్యక్తితో రోజూ చాట్ చేయడం వల్ల, మీకు తెలియకుండానే వారితో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది ఆఫ్ లైన్ జీవితంలోని భాగస్వామితో ఎమోషనల్ కనెక్షన్ ను తగ్గించవచ్చు.ఆన్ లైన్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిన వ్యక్తితో తరచూ మాట్లాడటం ఎక్కడికైనా దారితీసే ప్రమాదం ఉంది.సోషల్ మీడియా బ్యాలెన్స్...రిషి, ప్రియలకు సోషల్ మీడియా వల్ల వచ్చే లాభనష్టాలను వివరించాక, దాన్నెలా బ్యాలెన్ చేసుకోవాలో నేర్పించాను. సోషల్ మీడియా అలవాట్లు, బౌండరీస్, భయాల గురించి ఒకరితో ఒకరి ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడుకునేలా ప్రోత్సహించాను. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఏది పోస్ట్ చేయాలి, ఏది చేయకూడదనే విషయంపై ఒక అంగీకారానికి వచ్చేలా ఫెసిలిటేట్ చేశాను. తన ప్రయాణాలు లేదా అనుభవాల గురించి పోస్ట్ చేసేటప్పుడు రిషి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అదెందుకు అవసరమో ప్రియకు అర్థమయ్యేలా వివరించాను. ఆన్లైన్ లో కనపడేదంతా నిజం కాదని, అందువల్ల పోల్చుకోవడం మానేసి, తమ బంధాన్ని బలపరచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాను. అందుకు కావాల్సిన ఎక్సర్ సైజ్ లు చేయించాను. అప్పడప్పుడూ సోషల్ మీడియానుంచి పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యి పార్టనర్ తో గడపడం అవసరమని ప్రియకు అర్థమయ్యేలా చెప్పాను. అలా ఐదు సెషన్లలో రిషి ప్రియల మధ్య ఉన్న డిజిటల్ డివైడ్ ను పూడ్చేసి, వారిద్దరూ తమ జీవితాలను సంతోషంగా సాగించేందుకు అవసరమైన స్ట్రాటజీలను అందించాను.-సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
ఏ బంధంలోనైనా హద్దులు అవసరం
ప్రియకు 28 ఏళ్లు. ఒక అంతర్జాతీయ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తుంది. రోహిత్‌తో రెండేళ్ల కిందట పెళ్లయ్యింది. మొదట్లో అంతా బానే ఉంది. కాలం గడిచేకొద్దీ వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. తన డ్రెస్సింగ్ నుంచి ఫ్రెండ్స్ వరకూ అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. తన ప్రవర్తనను, స్నేహాలను కూడా నియంత్రించడం ప్రియకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు రోహిత్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. తానేం చేయాలో ప్రియకు అర్థంకాక కౌన్సెలింగ్ కు వచ్చింది.స్వేచ్ఛ వర్సెస్ సంప్రదాయంప్రేమంటే రెండు మనసుల కలయిక, పెళ్లంటే రెండు జీవితాల కలయిక. మనదేశంలో మాత్రం పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి పరిచయం లేకపోయినా, ప్రేమ లేకపోయినా, కనీస అవగాహన లేకపోయినా... కులం, మతం, జాతకం, ఆర్థిక స్థాయిలు కలిస్తే చాలు, పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ జంటపై ఉంటుంది. ఇప్పుడదే భారం ప్రియపై ఉంది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి.. కుటుంబ గౌరవానికి, సంప్రదాయానికి మధ్య పోరాటం నడుస్తోంది.కాలంతో పాటు మారని మనుషులు... సాంప్రదాయ పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన వివాహంలో.. భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్న రోజులొచ్చినా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే నడవాలనే భావజాలంలోనే ఉంటారు, ఉంటున్నారు. రోహిత్ ది కూడా అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్యా దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రియ తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్ కు వచ్చింది. ఆమె చెప్పినదంతా విన్నాక, వారికి ‘హెల్తీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని అర్థమైంది.టాక్సిక్ రిలేషన్స్ లక్షణాలు...• జంటలో ఒకరి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం• తరచుగా వ్యంగ్యం, నిందలు, అవమానాలు• ఫోన్ చెక్ చేయడం, ఫ్రెండ్స్, పేరెంట్స్‌కు దూరం చేయడం• పార్టనర్ ను సంప్రదించకుండానే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం• పార్టనర్ ను కంట్రోల్ చేయడానికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం• పార్టనర్ తెలివిని, నిర్ణయాలనూ చులకన చేయడం• ఎవరితో క్లోజ్‌గా ఉన్నా అసూయ పడటం, దూరం చేయడానికి ప్రయత్నించడం• ప్రతీ చిన్న విషయానికీ గొడవపడుతుండటంసరిహద్దుల అవసరం... ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలనీ, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలనీ అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్ ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు, మీ అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతీ జంటకూ హెల్తీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. • ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. • ‘‘నువ్వలా చేస్తున్నావు’’, ‘‘నువ్విలా అంటున్నావు’’ అని కాకుండా... ‘‘నేనిలా అనుకుంటున్నాను’’, ‘‘నేనిలా ఫీలవుతున్నాను’’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉదాహరణకు, ‘‘నేనే డ్రెస్ వేసుకోవాలో నువ్వు చెప్పినప్పుడు నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఇద్దరికీ నచ్చేదాని గురించి మాట్లాడుకుందామా?’’ అని చెప్పడం, ఇష్టంలేకుండా ఒప్పుకోవడం నుంచి మాట్లాడి పరిష్కరించుకోవడానికి దారితీస్తుంది. • ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. వారి స్వేచ్ఛకు, స్నేహాలకు విలువనివ్వడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. అది వారిని నచ్చిన పాటలు వినడం కావచ్చు, తన ఫ్రెండ్స్ తో మాట్లాడటం కావచ్చు. • మారుతున్న కాలంతో పాటు సంప్రదాయాల్లోనూ మార్పు వస్తుందని గుర్తించాలి. సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతుల్యత సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. • సరిహద్దులను సెట్ చేయడం సవాలే. మీ భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. • మీ హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి.ప్రియ, రోహిత్ లకు మూడు సెషన్లలో వీటిని వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్ సైజ్ లు చేయించాను. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా జీవిస్తున్నారు. అప్పుడప్పుడూ వాట్సప్ లో పలకరిస్తుంటారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
అన్ని బంధాలకూ మూలం బాల్యంలోనే!
హలో ఫ్రెండ్స్,గతవారం సారా గురించి మాట్లాడుకున్నాం కదా. బాల్యంలో పేరెంట్స్, గార్డియన్స్, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం జీవితానికి ఒక పునాదిలా పనిచేస్తుంది. ఆ తర్వాత వివిధ వ్యక్తులతో సాన్నిహిత్యం, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం, సంఘర్షణలను పరిష్కరించుకునే సామర్థ్యాకు బ్లూప్రింట్ లా ఉంటుంది. వీటినే అటాచ్మెంట్ స్టైల్స్ అంటారు. జీవితంలో బలమైన కనెక్షన్ లను నిర్మించుకోవాలంటే వీటిని అర్థం చేసుకోవడం అవసరం.నాలుగు రకాలు... Secure Attachment: బాల్యంలో అనేక అవసరాలు ఉంటాయి. అన్నీ పిల్లలు చేసుకోలేరు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అవసరం ఉంటుంది. ఆ అవసరాలను వెంటనే గుర్తించి, స్పందించి, సంరక్షించే పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లల్లో భద్రంగా ఉన్నామనే ఫీలింగ్ ఏర్పడుతుంది. అలా సెక్యూర్ అటాచ్మెంట్ స్టైల్ ఏర్పడుతుంది. వయసుతో పాటు అదీ పెరుగుతూ ఇతరులతో బంధాలను ఏర్పరచుకోవడంలో దిక్సూచిలా పనిచేస్తుంది. ఈ అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు తమకు ఏ కష్టం వచ్చినా తన జీవిత భాగస్వామి అందుబాటులో ఉంటారని నమ్ముతారు. తమ మనసులోని భావాలు ఎలాంటివైనా నేరుగా కమ్యూనికేట్ చేస్తారు. తన లైఫ్ పార్టనర్ తో సాన్నిహిత్యంగా, సుఖంగా ఉంటారు. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు.Anxious Attachment: బాల్యంలో పేరెంట్స్ లేదా గార్డియన్స్ అందుబాటులో లేకపోవడం, ఉన్నా పట్టించుకోకపోవడం, అవసరాలను గుర్తించకపోవడంతో... తనను ఎవరూ పట్టించుకోవడంలేదు, వదిలేస్తారనే భయం, ఆతృత ఏర్పడుతుంది. ఆ భయం వారి జీవితాంతం ఉంటుంది. అందుకే మనసులోని భావాలను నేరుగా చెప్పలేరు. చెప్తే తమను వదిలివేస్తారనే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. పార్టనర్ మౌనంగా ఉంటే అది తిరస్కారంగా భావిస్తారు. ‘నేనంటే ఇష్టంలేదా?’ అని పదే పదే అడుగుతారు. చాలా ఇష్టమని చెప్పినా సంతృప్తి చెందరు. వదిలేస్తారేమోనని భయపడుతుంటారు. దాంతో మరింత దగ్గరగా అతుక్కుపోతారు. మరోవైపు పార్టనర్ చర్యలను తప్పుగా అర్థం చేసుకుంటారు. అసూయ, అభద్రత వంటి వారిని కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడుతుంటారు. ఇలాంటివారికి భరోసా ఇవ్వడం పార్టనర్ కు తలకు మించిని భారమవుతుంది. సారా సమస్య ఇదేనని గుర్తొచ్చిందా?Avoidant Attachment: కొందరు పేరెంట్స్ పిల్లలను పట్టించుకోరు, దూరంగా పెడుతుంటారు. వాళ్లేం చేసినా నిరుత్సాహపరుస్తుంటారు. అందువల్ల పిల్లలు వారితో సాన్నిహిత్యంగా ఉండలేరు. ఎమోషన్స్ ను వ్యక్తం చేయలేరు. అలా వ్యక్తంచేయడం అసౌకర్యంగా భావిస్తారు. స్వతంత్రంగా ఉండలేరు. ఒంటరిగా ఫీలవుతుంటారు. అలా ఈ అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్నవారు ఏదీ ఓపెన్ గా మాట్లాడలేరు. మానసికంగా దూరంగా ఉంటారు. తరచూ పోట్లాడుతుంటారు. ఒంటరిగా ఫీలవుతుంటారు. వీరితో ఎలా వ్యవహరిస్తే ఏమవుతుందోనని పార్టనర్ గందరగోళానికి గురవుతారు.Disorganized Attachment: కొందరు పేరెంట్స్ లో తెలియని భయాలు ఉంటాయి. దాంతో వారి ప్రవర్తన ఎప్పడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లల్లో ఇలాంటి అటాచ్మెంట్ స్టైల్ అభివృద్ధి చెందుతుంది. వీరు ఇతరులతో సాన్నిహిత్యం కోరుకుంటారు. కానీ వాళ్లను విశ్వసించాలంటే తీవ్రమైన భయం. దాంతో వారి బంధాలు, అనుబంధాలు అస్థిరంగా ఉంటాయి. వారి భావోద్వేగ ప్రతిస్పందనలు అనూహ్యంగా ఉంటాయి. వీరికి ఎమోషనల్ సెక్యూరిటీ అందించడంలో పార్టనర్స్ ఇబ్బందులు పడుతుంటారు.మరేం చెయ్యాలి?సరే సర్. అటాచ్మెంట్ స్టైల్స్ రిలేషన్ షిప్ డైనమిక్స్ ను ప్రభావితం చేస్తాయంటున్నారు సరే, ఇప్పుడేం చెయ్యాలి? అని మీరు అనిపించవచ్చు. బాల్యంలో ఏర్పడిని అటాచ్మెంట్ స్టైల్స్ అలాగే శిలేసుకుని కూర్చోవు. వాటిపట్ల అవగాహన పెంచుకుని, మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తే మారతాయి. సైకాలజిస్ట్ సహాయంతో సురక్షితమైన అటాచ్మెంట్ స్టైల్ ను అభివృద్ధి చేసుకోవచ్చు. గతవారం సారా కేసులో జరిగింది ఇదే. అందుకోసం ముందుగా మీరేం చేయాలో చెప్తా.• మీ అటాచ్మెంట్ శైలిని గుర్తించడం అనేది హెల్తీ కనెక్షన్లను నిర్మించుకోవడంలో తొలి అడుగు. మీ శైలిని అర్థం చేసుకోవడం వల్ల మీ ప్రవర్తనకు మూల కారణాలను గుర్తించవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు సైకాలజిస్ట్ సహాయపడతారు. • మనం మొదటివారం చెప్పుకున్నట్లు అన్ని బంధాలూ మీ సెల్ఫ్ ఎస్టీమ్ పైనే ఆధారపడి ఉంటాయి. మీపై మీకు గౌరవం, విశ్వాసం ఉంటే ఇతరులపై ఆధారపడటం తగ్గిస్తుంది. సురక్షితమైన అనుబంధాన్ని సులభతరం చేస్తుంది• నిజాయితీతో కూడిన ఓపెన్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించడం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. రిలేషన్స్ లో వచ్చే సంఘర్షణలను సమర్థంగా పరిష్కరించుకునేందుకు, మీ అవసరాలను నేరుగా వ్యక్తీకరించేందుకు ఉపయోగపడుతుంది. • బంధాలలో ఏది ఓకేనో, ఏది నాట్ ఓకేనో స్పష్టమైన సరిహద్దులను సెట్ చేయడం మీ ఎమోషనల్ వెల్ బీయింగ్ ను కాపాడుతుంది. పరస్పరం గౌరవప్రదంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. • రిలాక్సేషన్ టెక్నిక్స్, మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్ వంటివి మీ భావోద్వేగ నియంత్రణను మెరుగుపరుస్తాయి. నెగెటివ్ ఎమోషన్స్ మీ సంబంధాలను దెబ్బతీయకుండా కాపాడతాయి. • బంధాలకు సంబంధించిన నెగెటివ్ ఆలోచనా విధానాలకు గుర్తించడానికి, వాటిని మార్చుకోవడానికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT) ఉపయోగపడుతుంది. మీ ఎమోషనల్ రెగ్యులేషన్ కు, సెల్ఫ్ కంపాషన్ పెంపొందించడానికి కోపింగ్ మెకానిజమ్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
వదిలేస్తారనే భయంతో పెళ్లికి దూరం..
సారా 28 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇంకా పెళ్లి కాలేదు. ఇప్సటికైనా పెళ్లి చేసుకోమని పేరెంట్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. పెళ్లంటే సారాకేం వ్యతిరేకత లేదు. కానీ భయం. ఎందుకంటే ఇప్పటివరకూ తాను ఐదుగురితో డేటింగ్ చేసింది. మొదట్లో అతను చూపించే కేర్, లవ్, అఫెక్షన్ అంతా బాగానే ఉంటుంది. అతని సాన్నిహిత్యంలో జీవితం భద్రంగా ఉంటుందని ఫీలవుతుంది. కానీ బంధం బలపడేకొద్దీ సారా ప్రవర్తన మారుతుంది. అతను తనను వదిలేస్తాడేమోననే భయం మొదలవుతుంది. దాంతో పొసెసివ్ గా మారుతుంది. అతని బిహేవియర్ మొత్తం తన కంట్రోల్ లో ఉండాలనుకుంటుంది. అలా లేకపోతే ఏమాత్రం ఆలోచించకుండా అతనికి దూరమవుతుంది. మళ్లీ అతను బ్రతిమలాడినా వెనక్కు వెళ్లదు. ఇలాగా ఐదుగురితో డేటింగ్ చేసి, పెళ్లి చేసుకుందామనుకుని, చివరకు వదిలేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెరగడంతో, అసలు తన బిహేవియర్ లో ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకునేందుకు కౌన్సెలింగ్ కు వచ్చింది.అప్పటి బాధ.. ఇప్పుడు భయం..సారా చెప్పింది విన్నాక, ఆమె బాల్యం, పెరిగిన వాతావరణం గురించి అడిగాను. పేరెంట్స్ ఇద్దరూ ఇంజినీర్లేనని, ఎప్పుడూ బిజీగా ఉంటేవారని, ముగ్గురం ఇంట్లోనే ఉన్నా ఒకరికొకరం దూరంగా ఉన్నట్లు ఉండేదని చెప్పింది. ఎమోషనల్ గా పేరెంట్స్ అందుబాటులో లేకపోవడం సారాలో అభద్రతా భావాన్ని కలిగించింది. ఆప్యాయత కోసం ఆమె మనసు ఆరాటపడేది. బాల్యంలో సారా తల్లిదండ్రులతో అనుభవించిన ఎమోషనల్ డిస్టెన్స్ ఆమెతో పెరిగి పెద్దదయ్యింది. ఇప్పుడు డేటింగ్ చేసినవాడు తనను వదిలివేస్తాడనే భయంగా మారింది. ఆ భయం పుష్-పుల్ డైనమిక్స్ గా వ్యక్తమవుతోంది. అంటే ఆప్యాయత కోసం దగ్గరవ్వడం, దూరమవుతారనే ఆందోళనతో దూరమవ్వడం. దీన్నే యాంగ్జయిటీ అటాచ్మెంట్ స్టైల్ అంటారు.బాల్యంలో పేరెంట్స్ వల్ల ఏర్పడే అటాచ్మెంట్ స్టైల్ కు ఆ తర్వాత జీవితంలో ఏర్పడే రిలేషన్షిప్స్ లో సంతృప్తికి సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది. సారా వంటి అటాచ్మెంట్ స్టైల్ ఉన్న వ్యక్తులు నమ్మకం, సాన్నిహిత్యం పోరాడతారు. వదిలివేస్తారనే భయం ఎమోషనల్ రోలర్ కోస్టర్ కు దారితీస్తుంది. చివరకు సారాలా ఏ బంధంలోనూ నిలబడలేరు. ఆరు నెలల్లో ఆందోళన దూరం... కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ (CBT): సారాతో మాట్లాడి ఆమె సమస్యను అర్థం చేసుకున్నాక థెరపీ ప్రారంభించాను. తనను వదిలివేస్తారనే నెగెటివ్ థాట్స్ ను గుర్తించడానికి, సవాలు చేయడానికి సీబీటీ పద్ధతులు ఆమెకు సహాయపడ్డాయి. ఉదాహరణకు ‘‘అతను నన్ను విడిచిపెడతాడు’’ అని ఆలోచించే బదులు, దాన్ని రీఫ్రేమ్ చేసి ‘‘ఈ రిలేషన్షిప్ పనిచేయకపోవచ్చు, అలాగని నేనేం ఒంటరిగా ఉండిపోను, హేండిల్ చేయగలను’’ అని ఆలోచించడం. ఎమోషనల్ రెగ్యులేషన్ స్కిల్స్: సారా తన ఎమోషన్స్ ను, ముఖ్యంగా వదిలివేస్తారనే యాంగ్జయిటీని మేనేజ్ చేసుకోవడానికి మైండ్‌ఫుల్‌నెస్ వంటి టెక్నిక్స్ నేర్పించాను. భయాన్ని హడావుడిగా డీల్ చేయకుండా, మాట్లాడి పరిష్కరించుకోవడం నేర్చుకుంది.ఆత్మగౌరవాన్ని పెంపొందించడం: సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ పెంపొందించే కార్యకలాపాలు ప్రోత్సహించాను. తన విలువ తాను తెలుసుకోవడం ద్వారా ఇతరుల అప్రూవల్ పై ఆధారపడటం తగ్గింది. సురక్షిత బంధానికి మార్గం: థెరపీ సాగేకొద్దీ సారా ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. తన అవసరాలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, ఆందోళనను సమర్థంగా నిర్వహించడం నేర్చుకుంది. సెల్ప్ అవేర్నెస్, ఎమెషనల్ కంట్రోల్ రావడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆరు నెలల తర్వాత సారా డేవిడ్‌ను కలుసుకుంది. క్రమక్రమంగా వారి బంధం బలపడింది. డేవిడ్ పర్సనల్ స్పేస్ ను గౌరవిస్తూ సారా తన అవసరాలను స్పష్టంగా చెప్పింది. తనను వదిలివేస్తాడనే యాంగ్జయిటీని అధిగమించగలిగింది. మూణ్నెళ్ల కిందట పెళ్లి కూడా చేసుకుంది. అఫ్కోర్స్, ఇద్దరూ వచ్చి పెళ్లికి పిలిచారు, వెళ్లి ఆశీర్వదించి వచ్చాను.సారా బాల్యంలో ఏర్పడిన అటాచ్మెంట్ స్టైల్, దానివల్లనే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అర్థం చేసుకోవడం ఈ కేసులో కీలకం. ఆ తర్వాతే థెరపీ. అందుకే వచ్చేవారం అటాచ్మెంట్ స్టైల్స్ గురించి, వాటి ప్రభావం గురించి మరితం వివరంగా తెలుసుకుందాం. అప్పటివరకూ హ్యాపీ వీకెండ్.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
నీ కోసం నువ్వు.. అన్ని బంధాలకూ మూలమిదే!
కనెక్షన్ కార్నర్‌కి పున: స్వాగతం.. బంధాలు, అనుబంధాల గురించి మనకు తరచూ చాలా చాలా కంప్లయింట్స్ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినడంలేదని, పేరెంట్స్ అర్థం చేసుకోవడంలేదని, భర్త పట్టించుకోవడంలేదని, భార్య మాట వినడం లేదని, కింది ఉద్యోగి గౌరవం ఇవ్వడంలేదని, పైఅధికారి వేధిస్తున్నాడని.. ఇలా రకరకాల కంప్లయింట్స్. వాటన్నింటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు అన్ని బంధాలకూ మూలమైన సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుకుందాం. కనెక్షన్ కార్నర్ అని పేరు పెట్టుకుని అందులో ‘సెల్ఫ్ లవ్’ గురించి ఎందుకబ్బా అని మీకు అనిపించవచ్చు. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల అవసరమైనట్లే ఇతరులతో బలమైన బంధాలు ఏర్పడాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అవసరం. అదెంత అవసరమో తెలియాలంటే, ‘మాయ’ గురించి తెలుసుకోవాల్సిందే.ప్రేమించలేని మాయ..మాయ 25 ఏళ్ల ఆర్టిస్ట్. చక్కగా బొమ్మలు వేస్తుంది, నగరంలో జరిగే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో తన బొమ్మలు ప్రదర్శిస్తుంది. అందరితోనూ కలివిడిగా ఉంటుంది. కానీ ప్రేమ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. ఏ ప్రేమా ఎక్కువకాలం నిలబడటం లేదు. దాంతో తనలో, తన ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందేమోనని ఆందోళన చెందుతోంది. మాయతో మాట్లాడిన తొలి సెషన్ లోనే తాను సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక బాధపడుతోందని గుర్తించాను. మాయ బాల్యంలో ఆత్మవిశ్వాసంతో ఉండేది. కానీ ఆర్టిస్టుగా మారాక తరచూ ఇతరులతో పోల్చుకోవడం, విమర్శలు ఎదుర్కోవడం, నిత్యం విమర్శించే లోగొంతుతో అంచెలంచలుగా తనపై, తన సామర్థ్యంపై విశ్వాసాన్ని కోల్పోయింది. దాంతో తనను విమర్శిస్తారేమో, తిరస్కరిస్తారేమోననే భయంతో ఇతరులకు దూరంగా ఉండటం మొదలు పెట్టింది.బలమైన కనెక్షన్ లను ఏర్పరచుకోవడం స్వీయ-ప్రేమ కీలకపాత్ర పోషిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. సెల్ప్ కంపాషన్ ఉన్న వ్యక్తులు ఇతరులను అర్థం చేసుకోగలరు, వారి తప్పులను క్షమించి సురక్షిత బంధాలను పెంచుకోగలరు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు సానుకూల సామాజిక సంబంధాలను ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువని మరో అధ్యయనంలో వెల్లడైంది.అంచెలంచెలుగా పెరిగిన ప్రేమ..కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీలో అసలు సమస్యను, దాని మూలాలను తెలుసుకోవడమే కీలకం. మాయ సమస్య, దాని కారణాలు అర్థమయ్యాక ఆమెలో సెల్ప్-లవ్ ను పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారించాను. 👉: కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ ద్వారా మాయలోని ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి సెల్ఫ్-కంపాషన్ తో భర్తీ చేసుకుంది. ఉదాహరణకు, "ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో స్థానం పొందలేకపోయానంటే నేను ఫెయిలయినట్టే" అని ఆలోచించే బదులు, "ఇది ఒక ఆర్టిస్టుగా నా విలువను నిర్వచించలేదు. ఈ అనుభవం నుండి నేర్చుకుంటా, మరింత మెరుగైన బొమ్మలు వేస్తాను " అని రీఫ్రేమ్ చేయడం నేర్చుకుంది.👉: థెరపీలో భాగంగా రోజూ తనలోని మూడు సానుకూల అంశాలను, సాధించిన విజయాలను, గ్రాటిట్యూడ్ చూపించాల్సిన విషయాలను గుర్తించి, తనను తాను అభినందించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఆమె సెల్ఫ్ ఇమేజ్ పెరగడానికి, ఆమె దృష్టి తన బలాలవైపు మళ్లించడానికి ఉపయోగపడింది. 👉: తన కనెక్షన్ లలో ఎక్కడ దేనికి ఎస్ చెప్పాలో, ఎక్కడ నో చెప్పాలో గుర్తించగలిగింది, నో చెప్పడం నేర్చుకుంది. అనవసరమైన పార్టీలకు, ఫంక్షన్లకు, రిక్వెస్టులకు నో చెప్పడం సాధన చేసింది. 👉: కొద్ది సెషన్లలోనే మాయలోని అంతర్గత విమర్శకురాలు గొంతు మూగబోయింది. ఆమెలో సెల్ఫ్-లవ్, సెల్ఫ్-కంపాషన్ పెరిగింది. ఈ కొత్త స్వీయ-ప్రేమ ఆమె తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగింది. తన అవసరాలను, కోరికలను స్పష్టంగా వ్యక్తీకరించగలిగింది. ఇది అర్ధవంతమైన కనెక్షన్లకు దారితీసింది.మీకోసం కొన్ని చిట్కాలు.. మంచి తోట పెరగాలంటే సారవంతమైన నేల కావాలన్నట్లే, మంచి బంధాలు కావాలంటే సెల్ఫ్-లవ్ అవసరమని తెలుసుకున్నాం కదా. మాయలానే మీలోనూ సెల్ఫ్-లవ్ తగ్గిందనకుంటే ఈ కింది అంశాలను ప్రాక్టీస్ చేయండి. 👉: ప్రతి ఒక్కరి మనసులో ఒక అంతర్గత విమర్శకుడు ఉంటాడు. వాడి మాటలకు తలూపకుండా ‘నా స్నేహితుడితో నేనిలా మాట్లాడగలనా?’ అని ప్రశ్నించుకోండి. మీ అంతర్గత విమర్శకుడిని సవాలు చేయండి. 👉: ప్రతీ ఒక్కరి జీవితంలో మంచి విషయాలు ఉంటాయి. వాటిని గుర్తించండి. ప్రతీరోజూ మీరు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను వ్రాయండి. 👉: "నో" అని చెప్పడం, మీ స్వంత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థం కాదు; ఇది ఆత్మగౌరవానికి అవసరం. ‘నో’ చెప్పడం ప్రాక్టీస్ చేయండి. 👉: శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం విలాసం కాదు -అవసరం. అందుకే మీకు సంతోషాన్నిచ్చే అంశాలకు రోజూ సమయాన్ని కేటాయించండి. 👉: మీ విజయాలను ఇతరులు గుర్తించే వరకు వేచి ఉండకండి. పెద్దవైనా, చిన్నవైనా సెలబ్రేట్ చేసుకోండి. అది మీ స్వీయ-విలువను బలపరుస్తుంది. 👉: ఎలాంటి తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టిపెట్టే మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, సెల్ఫ్-కంపాషన్ ను పెంచుతుంది. 👉: మనమందరం తప్పులు చేస్తాము. వాటినే తలచుకుంటూ నిందించుకోవడం మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. క్షమాపణ అనేది మీకు మీరు ఇచ్చే బహుమతి.👉: సెల్ఫ్-లవ్ ను పెంపొందించుకోవడం ఒక ప్రయాణం. అందుకోసం ఇతరుల సహాయం అవసరం పడొచ్చు. అందువల్ల క్లోజ్ ఫ్రెండ్ సహాయ తీసుకోండి. అవసరమైతే సైకాలజిస్ట్ ను సంప్రదించడానికి సంకోచించకండి. 👉: సెల్ఫ్-లవ్ గమ్యం కాదు, నిరంతర అభ్యాసం. ఈ చిట్కాలను మీ దినచర్యలో భాగంగా చేసుకుని రోజూ ప్రాక్టీస్ చేయండి. మీ సెల్ప్-లవ్ పెరుగుతుంది, మీ బంధాలు బలపడతాయి.సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
బంధాలే నిజమైన బలం
హాయ్ ఫ్రెండ్స్.. వెల్కమ్ టూ "కనెక్షన్ కార్నర్". ఇది మనం కలిసి ఒక కప్పు కాఫీ తాగుతూ మనసువిప్పి మాట్లాడుకునే ప్రాంతం. కాఫీ తాగుతూ ఏం మాట్లాడుకుంటాం? లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. దాన్లోని కష్టసుఖాలను పంచుకుంటాం. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ, భావాలను పంచుకుంటూ అనుబంధాన్ని పెంచుకుంటాం. ఇక్కడ కూడా అదే పని చేద్దాం. మన జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే రకరకాల మానవ సంబంధాల గురించి మాట్లాడుకుందాం.మానవ సంబంధాలు మనం పీల్చే ఆక్సిజన్ లాంటివి. గాలి పీల్చుకోవడానికి మనం ప్రత్యేకంగా ఎలాంటి ప్రయత్నమూ చేయం, కానీ ఆ గాలి మనం జీవించడానికి అత్యవసరం. బంధాలు కూడా అలాంటివే. మన శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం బాగుండాలంటే రిలేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని అనేక అధ్యయనాల్లో రుజువైంది.బంధాలే జీవితం..జీవితాన్ని విశాలమైన సముద్రంలా ఊహించుకోండి. సవాళ్లు, సంతోషాల కెరటాల మధ్య మనల్ని నిలబెట్టే లైఫ్ బోట్లే మన బంధాలు, బాంధవ్యాలు. మనం పుట్టిన క్షణంలో ఏడ్చే మొదటి ఏడుపు కనెక్షన్ కోసం తొలి పిలుపు. వెంటనే అమ్మ పాలు ఇస్తుంది, మన కడుపు నింపుతుంది. ఆ తర్వాత నాన్న మన అవసరాలన్నీ కనిపెట్టి తీరుస్తాడు. వయసు పెరిగే కొద్దీ ఈ కనెక్షన్ అవసరం తగ్గదు, కేవలం పరిణామం చెందుతుంది. ఆహారం, భద్రత వంటి ప్రాథమిక అంశాల తర్వాత వచ్చే ఆకలి ప్రేమ. ఇక్కడే బంధాలు, అనుబంధాలు మన జీవితాన్ని వెచ్చదనంతో నింపుతాయి.మానసిక ఆరోగ్యానికి కూడా కీలకం..మీ ఫ్రెండ్ తో మనసువిప్పి మాట్లాడితే మీ మనసెంత తేలికవుతుందో, మీ గుండెల్లో భారం ఎలా తగ్గిపోతుందో ఎప్పుడైనా గమనించారా? నేనేదో కవిత్వం చెప్తున్నా అనుకోకండి. డబ్బు లేదా కీర్తికంటే సన్నిహిత సంబంధాలే ప్రజలను జీవితకాలం సంతోషంగా ఉంచుతాయని... ఒకటికాదు రెండు కాదు 75 సంవత్సరాల పాటు జరిపిన ‘హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్మెంట్’లో కనుగొన్నారు. జీవితంలో అసంతృప్తుల నుంచి మానవ బంధాలే రక్షిస్తాయి.మనం స్నేహితులతో మాట్లాడినప్పుడు, మన మెదడు ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది, ఈ మాయా రసాయనం మన ఒత్తిడిని తగ్గించడమే కాదు, మనం ప్రేమించేలా చేస్తుంది. అందుకే దీన్ని "కడ్ల్ హార్మోన్" అని పిలుస్తారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, బలమైన సోషల్ నెట్‌వర్క్‌లు ఉన్న వ్యక్తులు నిరాశ, ఆందోళనతో బాధపడే అవకాశం తక్కువ. మన సంబంధాలు మానసిక ఆరోగ్యానికి విటమిన్ల లాంటివి, జీవితంలో ఎదురయ్యే తుఫానులను తట్టుకునేలా తయారుచేస్తాయి. ఆరోగ్యానికి బూస్టర్లు..మీ శరీరాన్ని తోటలా భావించండి. ఆ తోట పుష్పించడానికి సహాయపడే కాంతి, నీరే బంధాలు. బలమైన సామాజిక సంబంధాలు ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా మరియు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. ధూమపానం, ఊబకాయంలానే ఒంటరితనం కూడా ప్రాణాంతకం కావచ్చని ఒక అధ్యయనం కనుగొంది. తోటలో రకరకాల మొక్కలు, పువ్వులు ఉన్నట్లే... జీవితంలోనూ వివిధ రకాల సంబంధాలతో వర్ధిల్లుతాయి. స్నేహితులు రంగురంగుల పువ్వుల్లా ఆనందాన్నిస్తారు. కుటుంబసభ్యులు మర్రిచెట్లులా చల్లని నీడను అందిస్తారు. వృత్తిపరమైన కనెక్షన్ లు పొద్దుతిరుగుడు పువ్వుల్లా దిశను అందిస్తాయి. శృంగార బంధాలు గులాబీల్లా జీవితానికి అందాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తాయి.బంధాల తోటను సాగుచేద్దాం.. జీవితంలో కనెక్షన్లు ఎంత ముఖ్యమైనవో అర్థమైంది కదా. వాటిని ఎలా పెంచుకోవాలి? తోటను పెంచడానికి సంరక్షణ ఎంత అవసరమో బంధాన్ని కాపాడుకోవడానికి కూడా అంతే అవసరం. మట్టిని తేమగా ఉంచే నీరులాంటిది కమ్యూనికేషన్. సూర్యకాంతి లాంటిది సహానుభూతి. వివాదాలను పరిష్కరించుకోవడమంటే కలుపు మొక్కలను తీసివేయడం లాంటిది. ఆరోగ్యకరమైన తోటలాంటి బంధాలు పెరగాలంటే ఇవన్నీ అవసరం. కానీ బంధాలు, అనుబంధాలు కరువైన కుటుంబాల్లో పెరిగిన పిల్లలు బాల్యంలో బాధపడటమే కాదు, పెరిగి పెద్దయ్యాక కూడా ఆ సమస్యలను మోసుకెళ్తారు. విద్య, ఉద్యోగ, వైవాహిక జీవితాలను బాధామయం చేసుకుంటారు.అందుకే మనం "కనెక్షన్ కార్నర్"లో అన్ని రకాల బంధాల గురించి మాట్లాడుకుందాం. వాటిలో వచ్చే తప్పులను తెలుసుకుందాం, సరిదిద్దుకుందాం, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. మీరు ఆనందమయమైన కనెక్షన్ లను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడే చిట్కాలు, సలహాలు, శాస్త్రీయ సమాచారం అందించేందుకు నేను ఎదురుచూస్తుంటాను. వచ్చేవారం కలుసుకుందాం.మీ.. సైకాలజిస్ట్ విశేష్8019 000066psy.vishesh@gmail.com -
ఈ తరం తీరే వేరు! నేటి తరంలో ఆనందం తక్కువ.. ఎందుకంటే!
జీవితానికి అర్థం, పరమార్థం జీవించడమే, ఆనందంగా జీవించడమే. మనం ఉద్యోగం సాధించినా, ఇల్లు కట్టించినా, కారు కొన్నా, విదేశీ ప్రయాణం చేసినా, మరే పని చేసినా సరే.. లక్ష్యం ఆనందం. ఆనందాన్ని వెంబడించడమనేది శాశ్వతమైన మానవ ప్రయత్నం. అయితే కాలంతో పాటు దాన్ని సాధించే మార్గాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా ప్రతి 15 సంవత్సరాలను ఒక జనరేషన్గా పరిగణిస్తారు. జనరేషన్ జనరేషన్‌కూ ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి. 1965-80 మధ్య పుట్టిన జనరేషన్-ఎక్స్ వారికి ఆర్థిక భద్రత సాధించడం, పిల్లలు సాధించేలా చూడటం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించడమే లక్ష్యంగా ఉండేది. అందులోనే వారు ఆనందాన్ని పొందేవారు. 1981-1996 మధ్య పుట్టిన జనరేషన్-వై వారికి వ్యక్తిగత ఎదుగుదల, మంచి కుటుంబ జీవితం ఆనందాన్నిచ్చేవి. వారితో పోల్చినప్పుడు 1997-2012 మధ్య పుట్టిన జనరేషన్-జీ వారిలో ఆనందం తగ్గిందని, కేవలం మూడింట రెండు వంతుల మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని గాలప్ సర్వే కనుగొంది. యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కారణం తెలుసా? ఈ తరం వారికి ఆర్థిక భద్రత, వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా పని చేయడంలో ప్రయోజనం (sense of purpose) ముఖ్యం. ఆ క్లారిటీ ఉన్నప్పుడు, ఉన్నవారు మాత్రమే సంతోషంగా జీవిస్తున్నారు. నా పనికి ప్రయోజనం ఉందా? ఈ తరం వారికి కార్పొరేట్ నిచ్చెనలు ఎక్కడంపైనే, మెటీరియలిస్టిక్ విజయాలు సాధించడంపైనే దృష్టి ఉంటుందని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ అదంతా అబద్ధమని సర్వేలో తేలింది. పాత తరాలకు భిన్నంగా జనరేషన్-జీ వారు తమ పనికి, జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఈ తరం వారికి అందుబాటులో ఉన్న ఉద్యోగాలలో ఈ అంతర్గత ప్రేరణ లేదు. ఆఫీసుల్లో ఏ అంశంపైనైనా బహిరంగంగా మాట్లాడే స్వభావం, దాన్ని భరించలేని పాతకాలపు వర్క్ ప్లేస్ లు వారిలో అసంతృప్తిని పెంచుతున్నాయి. అంటే ఈ తరం వారికి భారీగా జీతాలు అందుకోవడం లేదా ప్రమోషన్లు పొందడం కంటే కూడా తాము చేస్తున్న పనివల్ల ఎవరికైనా, ఏదైనా ప్రయోజనం ఉందా? వారి జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నామా? అనేది చాలా ముఖ్యం. అలాంటి ప్రయోజనం ఉన్నప్పుడే పనిలో ఆనందాన్ని పొందుతున్నారు. ఈ మూడూ ఉంటేనే సంతోషం జనరేషన్-జీ ఆనందంలో ప్రయోజనంతోపాటు మరో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని గాలప్ అధ్యయనం గుర్తించింది. అవి.. రీఛార్జ్, రిలాక్సేషన్: హైపర్ కనెక్టివిటీ వల్ల ప్రపంచం నిరంతరం మేల్కొనే ఉంటుంది. అందువల్ల చాలామందికి నిద్ర కరువవుతోంది. తగినంత విశ్రాంతి, నిద్ర పొందడం ఆనందానికి మార్గమవుతోంది. బలమైన సామాజిక సంబంధాలు: సోషల్ మీడియా యుగంలో ఒక్కొక్కరికీ వేలల్లో, లక్షల్లో ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల ప్రేమ, మద్దతు పొందడం చాలా ముఖ్యం. వారితో సన్నిహిత సంబంధాలే సంతోషానికి మార్గాలవుతాయి. పోలికనుండి తప్పించుకోవడం: సోషల్ మీడియాలో లేదా మరెక్కడైనా నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. జనరేషన్-జీలో ఈ కంపేరిజన్ ట్రాప్ చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి అవగాహన పెంచుకోవడం, ప్రతీ వ్యక్తి ప్రత్యేకమని గుర్తించి ముందుకు సాగడం ఆనందం జీవనం కోసం అద్భుతమైన వ్యూహం. విద్యాసంస్థలు, కార్యాలయాలు ఈ అంశాలను గుర్తించి జనరేషన్-జీ దీర్ఘకాలిక ఆనందాన్ని సాధించడంలో మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
Valentine's Day: మన ప్రేమలు ఏడు రకాలు!
ప్రేమంటే ఏమిటంటే.. ఒక వ్యక్తిపై మనకు కలిగే బలమైన ఉద్వేగ, మానసిక స్పందనే ప్రేమ. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరిని చూసినప్పుడు అందరికీ ఇలాంటి ఫీలింగ్ కలిగే ఉంటుంది. అది చాలా సహజం. మనిషి అనేకానేక అవసరాల మీదుగా స్వీయజ్ఞానం వరకూ సాగుతుందని ప్రఖ్యాత సైకాలజిస్ట్ అబ్రహాం మాస్లో అంటారు. మొదట బతకడానికి కావాల్సిన తిండి, నీరు, నిద్ర, ఆ తర్వాత రక్షణ అవసరాలు, ఆ తర్వాత ప్రేమావసరాలు. దానిపైన ఆత్మగౌరవం, స్వీయజ్ఞానం. అంటే ప్రేమ ప్రతి మనిషికీ తప్పని మానసికావసరం. అయితే మాస్లో ప్రకారం సెక్స్ తర్వాత ప్రేమ రావాలి. కానీ మన దేశంతోపాటు, చాలా సమాజాల్లో ప్రేమ తర్వాతే సెక్స్. ఇక ప్రేమ చుట్టూ ఎన్నెన్నో కథలు, కలలు, కవితలు. ప్రేమ చుట్టూ తీసిన సినిమాలెన్నో, పాటలెన్నెన్నో. వీటన్నింటిని వింటూ, చూస్తూ, చదువుతూ పెరిగినవారిలో ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రేమ భావన పుట్టక మానదు. అది ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చాలా కష్టం. ప్రేమకు హార్మోన్స్, ఫెర్మోన్స్ కారణమని బయాలజీ చెప్తుండగా… భావసారూప్యత, ఆకర్షణ కారణాలని సైకాలజీ చెబుతుంది. కాదుకాదు సోషల్ కండిషనింగ్ కారణమని సోషియాలజీ అంటుంది. మూలాలేవైతేనేం సెక్స్ ఎలా తప్పని శారీరకావసరమో, ప్రేమ కూడా అలాగే ఒక తప్పని మానసికావసరం. ఎవరికైనా అలాంటి అవసరం ఎప్పుడూ కలగలేదంటే వారి అవసరాన్ని అణచివేసేంత సోషల్, మోరల్ కండిషనింగ్ వారిపై జరిగిందని అర్థం. ప్రేమ సిద్ధాంతం.. ప్రేమ గురించి రకరకాల సిద్ధాంతాలున్నాయి. అందులో ప్రఖ్యాత సైకాలజిస్ట్ రాబర్ట్ స్టెర్నబర్గ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఎక్కువ ఆమోదం పొందింది. ప్రేమలో passion, intimacy, commitment అనే మూడు అంశాలు ఉంటాయంటాడు స్టెర్నబర్గ్. వాటి ఆధారంగా ఏడు రకాల ప్రేమలున్నాయంటాడు. ఇష్టం: కేవలం ఇంటిమసీ మాత్రమే ఉండేది. ఇది స్నేహితుల మధ్య కూడా ఉంటుంది. వాంఛ: కేవలం ఒకరిపట్ల ఒకరికి ప్యాషన్ మాత్రమే ఉండేది. శూన్యప్రేమ: కేవలం నిబద్ధత మాత్రమే ఉండేది. పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత కొన్ని జంటలకు మిగిలేదిదే. రొమాంటిక్ లవ్: ఒకరికి పట్ల ఒకరికి తీవ్రమైన ఇష్టం, ఇద్దరిమధ్య సాన్నిహిత్యం ఉండేది. ఇందులో నిబద్ధత కనిపించదు. చాలామంది టీనేజ్ జంటల్లో కనిపించేది ఇలాంటి ప్రేమే. సహచర ప్రేమ: ఒకరిపట్ల ఒకరికి వాంఛ లోపించి.. కేవలం సాన్నిహిత్యం, నిబద్ధత మాత్రమే మిగిలిన ప్రేమ. పెళ్లయిన తర్వాత కొన్ని జంటల్లో మిగిలేది ఇలాంటి ప్రేమే. మూఢప్రేమ: ఇద్దరిమధ్య ఎలాంటి సాన్నిహిత్యం లేకపోయినా.. తీవ్రమైన భావావేశం, నిబద్ధత ఉండేది. సంపూర్ణ ప్రేమ: ఒకరిపట్ల మరొకరికి వాంఛ, ఇద్దరిమధ్య సాన్నిహిత్యం, ఒకరిపట్ల మరొకరికి నిబద్ధత ఉండేది. ప్రేమించుకుంటున్నామనుకునే చాలా జంటల్లో అరుదుగా కనిపించే ప్రేమ. ఒకసారి ప్రేమ పుడితే, ప్రేమలో పడితే జీవితాంతం ఆ వ్యక్తినే ప్రేమిస్తారనే, ప్రేమించాలనే అపోహ మనలో చాలామందికి ఉంది. ప్రేమనేది ఒక noun అనుకోవడం వల్ల వచ్చే సమస్యిది. కానీ ప్రేమ ఒక verb, అంటే ఒక ప్రక్రియ. ఒకసారి ప్రేమ పుట్టినా, ప్రేమలో పడ్డా.. దాన్ని నిలుపుకునేందుకు ఇద్దరూ నిరంతరం ప్రయత్నిస్తుండాల్సిందే. లేదంటే కొన్నాళ్లకు, కొన్నేళ్లకు ఒకరిపట్ల ఒకరికి passion దూరమై కేవలం సహచర ప్రేమ మాత్రమే మిగులుతుంది. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
ఈజీ మనీ వెంట పరుగెత్తి ఆత్మహత్య
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంకామ్ విద్యార్థి నవీన్ క్రిప్టో ట్రేడింగ్‌లో నాలుగు లక్షల రూపాయలు నష్టపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. జగిత్యాల జిల్లాకు చెందిన నవీన్ పేద కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి వడ్రంగి. బహూశా ఆ పేదరికం నుంచి త్వరగా బయటపడాలనే ఆలోచనే నవీన్‌ను క్రిప్టో ట్రేడింగ్ వైపు నడిపి ఉండవచ్చు. త్వరగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో నవీన్ క్రిప్టో ట్రేడింగ్ కోసం.. నవీన్ తన పేరుపై ఒకటి, తండ్రి పేరుపై ఒకటి క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. భారీగా పెట్టుబడి పెట్టి అప్పుల్లో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నా కానీ డబ్బు సరిపోలేదు. క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించలేకపోయాడు. చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువతను బుట్టలో వేసుకునేలా ఈజీ మనీ పేరుతో ఈ మధ్యకాలంలో చాలా రకాల స్కీములు వస్తున్నాయి. అవి యువతను సులువుగా ఆకర్షిస్తాయి. కానీ ఈజీ మనీ స్కీమ్‌లలో రిస్క్ కూడా అలాగే ఉంటుంది. ఈ విషయం తెలియని యువత నవీన్‌లా ఆ వలలో చిక్కుకుపోతారు. అప్పుల భారం నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తుంది. ముఖ్యంగా పేద కుటుంబాల నుంచి వచ్చినవారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుల భారం నుంచి తప్పించుకోలేమనే భయం వెంటాడుతుంది. తన కష్టం చెప్తే తల్లిదండ్రులు మరింత బాధపడతారని ఆ విషయం ఇంట్లో చెప్పలేరు. ఎగతాళి చేస్తారని స్నేహితులతో పంచుకోలేరు. క్రమక్రమంగా ఒంటరితనంతో బాధపడతారు. ఎటుచూసినా కష్టాలే కనిపిస్తాయి. పరిష్కారం గురించి ఆలోచించే శక్తిని కోల్పోతారు. గ్యాంబ్లింగ్ డిజార్డర్.. నవీన్ ప్రవర్తన గ్యాంబ్లింగ్ డిజార్డర్‌కు దగ్గరగా ఉంది. ఇది ఒక బిహేవియరల్ అడిక్షన్. జూదం ఆడకుండా ఉండలేకపోవడం దీని ప్రధాన లక్షణం. నిరంతరం జూదం గుర్తించి లేదా జూదానికి డబ్బు ఎలా సంపాదించాలనే దానిగురించి ఆలోచిస్తుంటారు. తమకు కావాల్సిన స్థాయి ఎక్సయిట్మెంట్ కోసం పెద్ద మొత్తంలో పందేలు వేస్తుంటారు. సమస్యలు వస్తున్నాయని తెలిసి ఆపేయాలని ప్రయత్నించినా ఆపలేకపోతారు. జూదంలాంటి వ్యాపారంలో వచ్చిన నష్టాలను మళ్లీ దానితోనే భర్తీ చేయాలని ప్రయత్నిస్తారు. ఆ విషయాన్ని దాచడానికి అబద్ధాలు చెప్తారు, విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నా.. జీవితంలో, కెరీర్లో సమస్యలు ఎదురవుతున్నా గుర్తించలేరు. వీటన్నింటివల్ల యాంగ్జయిటీ, డిప్రెషన్ లేదా ఇతర మానసిక రుగ్మతలకు లోనవుతారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో నవీన్‌లా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి? ఆత్మహత్య భావనలున్నవారు తమ బాధను మాటల్లో, చేతల్లో పరోక్షంగా వెల్లడిస్తూనే ఉంటారు. ఈ విషయాలను గమనించి, మద్దతుగా నిలవడం ద్వారా వారిని కాపాడుకోవచ్చు. • ఎవరితో మాట్లాడకపోవడం, ఒంటరిగా ఉండటం, పనితీరు క్షీణించడం వంటి మార్పులను గమనించాలి. • ఎవరైనా తరచూ నిస్సహాయ భావాన్ని వ్యక్తం చేసినా, బయటపడే మార్గం లేనట్లు మాట్లాడుతున్నా వారి బాధను అర్థం చేసుకోవాలి. • ఎవరైనా క్రమబద్ధీకరించని వ్యాపారం లేదా అప్పులు పేరుకుపోవడం వంటి ప్రమాదకర ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటే మద్దతుగా నిలవాలి. • తీవ్రమైన మానసిక కల్లోలం, తీవ్రమైన అపరాధం లేదా అవమానం గురించి మాట్లాడుతుంటే అర్థం చేసుకోవాలి. • ఎమరేమనుకుంటారో అని భయపడకుండా తమ సవాళ్లను చర్చించే వాతావరణాన్ని సృష్టించాలి. • ఆర్థిక కార్యకలాపాలలో ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడంలో ఫైనాన్షియల్ లిటరసీని ప్రోత్సహించాలి. • కష్టాలు, నష్టాల వల్ల వచ్చే మానసిక సమస్యల గురించి అవగాహన కల్పించాలి. కౌన్సెలింగ్ తీసుకునేలా ప్రోత్సహించాలి. • స్నేహితులు, కుటుంబం, సలహాదారులతో బలమైన మద్దతు వ్యవస్థలను రూపొందించాలి. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
ప్రముఖుల విడాకులు.. మానసిక కారణాలు..!
ప్రముఖుల రొమాన్సులు, వివాహాలే కాదు విడాకులు కూడా మీడియాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అందరూ దాని గురించి చర్చించుకుంటారు. గతంలో ఆమీర్ ఖాన్-కిరణ్ రావు, అర్జున్ రాంపాల్-మెహర్ జెసియా, సమంతా రూత్ ప్రభు-నాగ చైతన్య, తాజాగా సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు చర్చనీయాంశాలయ్యాయి. అసలు కారణాలు ఎవరికీ తెలియకున్నా ఎవరి కారణాలు వారు వెతుక్కున్నారు. అయితే ఈ విడాకులను గాసిప్ లెన్స్ ద్వారా కాకుండా సైకాలజీ లెన్స్ ద్వారా పరిశీలిస్తే, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు దొరుకుతాయి. ఫేమ్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి నిరంతరం ప్రజల దృష్టిలో ఉండటం ఏ సెలబ్రిటీ జీవితానికైనా కష్టమైన, నష్టం కలిగించే విషయం. వారు చేసే చిన్న పొరపాటు కూడా భూతద్దంలో చూస్తారు, ఘోరమైన తప్పిదంగా మీడియాలో ప్రొజెక్ట్ చేస్తారు. దీంతో ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను కాపాడుకోవడానికి వారు నిరంతరం ఒత్తిడి అనుభవిస్తారు. ఈ ఒత్తిడి ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందులను, విభేదాలను తీవ్రతరం చేస్తుంది. బంధం, అనుబంధం డీప్‌గా మారడానికి ఆటంకం కలిగిస్తుంది. పాపులారిటీతో పెరిగే అహంభావం కీర్తి, సంపద, నిరంతర పాపులారిటీ వ్యక్తిలో అహంభావాన్ని, తద్వారా నార్సిసిజంను పెంచుతాయి. అంటే తనను తాను ప్రేమించుకోవడం పెరిగిపోతుంది. ఫలితంగా భాగస్వామి పట్ల సహానుభూతి, రాజీపడే తత్వం తగ్గిపోతాయి. భాగస్వాములను పాపులారిటీలో తనతో పోటీపడే కాంపిటీటర్‌గా మారుస్తుంది. పరస్పర విశ్వాసం, సాన్నిహిత్యాన్ని దెబ్బతీస్తుంది. బిజీ జీవితంతో బలహీనపడే బంధాలు సెలబ్రిటీల జీవితం ఎడతెగని షెడ్యూల్లు, చాలాకాలం పాటు విడివిడిగా ఉండాల్సి రావడంతో పరస్సర భావోద్వేగ సంబంధాన్ని కొనసాగించడంలో, విశ్వాసాన్ని పెంపొందించడంలో సవాళ్లుగా మారతాయి. భౌతికంగా, మానసికంగా అధిగమించలేని దూరాలను సృష్టిస్తాయి. చివరికి ఒకరితో ఒకరు డిస్ కనెక్ట్ అవుతారు. ఆర్థిక భద్రత పెంచే స్వాతంత్య్ర భావం సెలబ్రిటీలకు ఉండే ఆర్థిక భద్రత ఒక గిఫ్ట్‌లా కనిపించినప్పటికీ, సాంప్రదాయిక నిబద్ధతలను చెరిపేసే స్వాతంత్య్ర భావాన్ని కూడా పెంపొందిస్తుంది. ఫలితంగా సెలబ్రిటీ జంటలు వారి కాపురంలో ఎదుర్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, సయోధ్యకోసం తక్కువ మొగ్గు చూపుతారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ల న్యాయ పోరాటంలో హైలైట్ కావడం గమనార్హం. అయితే ఇవన్నీ సాధారణ మానసిక కారణాలు మాత్రమే. ప్రతి సెలబ్రిటీ విడాకుల వెనుక దానివైన ప్రత్యేక కారణాలు ఉంటాయని గుర్తించడం చాలా ముఖ్యం. పాపులారిటీకే ప్రాధాన్యం ఇవ్వడం, వైవాహికేతర సంబంధాలు, మానసిక ఒత్తిళ్లు, అహంకారం, అననుకూలత లాంటి అనేక అంశాలు అనేకం ఉండవచ్చు. తెరపై మెరిసే తారల జీవితాల్లో కూడా మనకు తెలియని అనేకానేక చీకటి గాధలు, బాధలు ఉండవచ్చు. వాటిని పరిష్కరించుకునే క్రమంలో అహానికి పోకుండా, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మెరుగైన ఫలితం ఉండవచ్చు. --సైకాలజిస్ట్ విశేష్ ఫోన్ నెం: 8019 000066 psy.vishesh@gmail.com (చదవండి: పేరెంట్స్ నిర్లక్ష్యం చేస్తే Animal లా మారతారా? ) -
‘బట్’ అనే మాట ఉంది చూశారూ.. బహు కంత్రీది.. కానీ!
మనిషి మనసులోని భావాలను తెలుసుకోవడానికి భాషే మార్గం. ఆ భాషను సక్రమంగా, తెలివిగా ఉపయోగించేవాళ్లు, ఉపయోగించగలిగేవాళ్లు ఉన్నత స్థానాలకు చేరతారు. ఉపయోగించలేని వాళ్లు మామూలు మనుషులుగా మిగిలిపోతారు. భాషలో కొన్ని వేల, లక్షల పదాలుంటాయి. వాటిలో ఒక ప్రమాదకరమైన పదం ‘కానీ’. అదేంటీ... ‘కానీ’ అనే పదం ఎలా ప్రమాదకరం? అనే డౌట్ మీకు రావచ్చు. ' ఇంట్రస్టింగ్ కథనం మీకోసం.... ‘‘కానీ’’ ఒక కంత్రీ పదం.../ మీరు తెలివైనవారు, కానీ... ♦ మీ డ్రెస్ బాగుంది, కానీ (but)... ♦ మీరు బాగా పాడుతున్నారు, కానీ (but)... ♦ మీ హెయిర్ స్టైల్ బాగుంది, కానీ (but)... ♦ ఒక ఫ్రెండ్ గా మీరంటే చాలా ఇష్టం... కానీ (but)... ♦ మీ సెన్స్ ఆఫ్ హ్యూమరంటే ఇష్టం.. కానీ (but)... ♦ చంపడం, చంపించడం తప్పే... కానీ (but)... ఇలా ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు మీరెలా ఫీలవుతారు? ఆ సమయంలో మీ మనసులో ఏమనిపిస్తుంది? ఈ విషయంపై మీరెప్పుడూ పెద్దగా ఆలోచించి ఉండరు. కానీ ఆ ‘కానీ’ అనే ఒక్క పదం ఆ వ్యక్తి ఇంటెన్షన్ ను పట్టిస్తుంది. అతను లేదా ఆమె నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పకనే చెప్పేస్తుంది. ‘కానీ’ ఒక లాండ్ మైన్... ‘కానీ’' అనే పదం ఒక లాంగ్వేజ్ ల్యాండ్ మైన్ లాంటిది. ఎందుకంటే... ఈ పదం దానికి ముందు ఉన్న వాక్యాన్ని తిరస్కరిస్తుంది. ఆ వాక్యంలో అతి ముఖ్యమైన విషయం ఆ తర్వాత వస్తుందనీ, దాన్ని అంగీకరించాలనీ చెప్తుంది. ఉదాహరణకు... ‘‘మీ డ్రెస్ బాగుంది, కానీ రెడ్ అయితే ఇంకా బాగుండేది..’’ అని ఎవరైనా చెప్పారంటే, మీ మనసు డ్రెస్ బాగుందనే విషయాన్ని తిరస్కరిస్తుంది, రెడ్ అయితే బాగుంటుందనే విషయాన్నే అంగీకరిస్తుంది. అంటే... మీ డ్రెస్ బాగుంది అని చెప్పడం అబద్ధమన్నమాట. ఆ మాట చెప్పలేక, బాగుందని చెప్పి, 'కానీ' అని సన్నాయి నొక్కులు నొక్కుతారన్నమాట. అలా తమకు కావాల్సిన, తమకు నచ్చిన అభిప్రాయాన్ని మీ మనసుపై రుద్దుతారన్నమాట. మీరు, మీ మనసు ఆ మోసాన్ని గ్రహించలేరు. అలా 'కానీ' అనే ఈ చిన్న పదం దుర్వినియోగమవుతుంది. ఎవరెలా వాడతారంటే... అనుభవజ్ఞులైన కార్పొరేట్ మేనేజర్లు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చినప్పటికీ, ఆపై 'కానీ' జోడించడం ద్వారా ప్రభావాన్ని దెబ్బతీస్తారు. ♦ మొత్తం మీద మీ పనితీరు బాగుంది, కానీ మీరు టైం పాటించాలి. ♦ మీరు ఆ ప్రాజెక్ట్ బాగా హేండిల్ చేశారు, కానీ కొంచెం స్పీడ్ పెంచాలి. కపుల్స్ తమ జీవిత భాగస్వాములను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పి, ఆపై 'కానీ' అనడంతో మొత్తం నాశనం చేస్తారు. ♦ ఇలా నీతో ఉండటం చాలా బాగుంది, కానీ నువ్వు శుభ్రంగా కనిపించాలి. ♦ నువ్వన్నా, నీ మాటలన్నా నాకు చాలా ఇష్టం, కానీ చాలా ఎక్కువ మాట్లాడతావు. తల్లిదండ్రులు వారి 'BUTs' ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల పిల్లల్లో ప్రతికూల స్పందనల్ని ప్రేరేపిస్తారు. ♦ నీ చేతిరాత బాగుంది, కానీ ఇంకా మార్కులు రావాలి. ♦ నీ స్పెల్లింగ్ బాగుంది, కానీ చేతిరాత బాగోలేదు. ఇలా వారు మెచ్చుకుంటున్నా, ‘కానీ’ మొత్తం అర్థాన్ని మార్చేస్తుంది. మీ మనసు ఆ 'కానీ..' ముందు ఉన్న ప్రశంసను తిరస్కరించి, దాని తర్వాత ఉన్న నెగెటివ్ నే స్వీకరిస్తుంది. 'అయితే' అనే పదం కూడా దాదాపు ఇలాంటి ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తుంది. మరేం చెయ్యాలి? 'కానీ'ని 'అలాగే' అనే పదంతో భర్తీ చేయండి! ఇలా ఒక వారం రోజులు మీరు ప్రయత్నిస్తే... 'కానీ' బారినుంచి తప్పించుకోవచ్చు. ♦ ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, కానీ మీరు టీమ్ తో కలిసిపోవాలని కోరుకుంటున్నాను...’’ అనే వాక్యానికి బదులుగా ‘‘ఉద్యోగంలో మీ పనితీరు చాలా బాగుంది, అలాగే మీరు టీమ్ తో కలిసిపోవాలని ఉండాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పండి. ♦ ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, కానీ ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పడానికి బదులుగా ‘‘మీరు చెప్పే చాలా విషయాలతో అంగీకరిస్తున్నాను, అలాగే ఈ ప్రత్యేకమైన విషయాన్ని పరిశీలించమని కోరుతున్నా’’ అని చెప్పండి. అయితే ఈ 'అలాగే' వాడకంతో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు దీన్ని ఎక్కువగా నొక్కిచెప్పినా, దానిని ఉపయోగించటానికి ముందు, తరువాత పాజ్ చేసినా, ఇది 'కానీ'లాంటి దుష్ప్రభావాన్నే చూపిస్తుంది. ‘కానీ’ ఉపయోగించాల్సిన పద్ధతి వాస్తవానికి, 'కానీ' అనే పదం ఎదుటి వ్యక్తి ఆలోచనను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటే దాన్ని ఉపయోగించడంలో తప్పేమీ లేదు. అందువల్ల నెగెటివ్ విషయం స్థానంలో పాజిటివ్ ప్రత్యామ్నాయాన్ని నొక్కి చెప్పేటప్పుడు ఉపయోగించండి. ఉదాహరణకు... ♦ ‘‘మనం ఈ ప్రాజెక్టులో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నాము, కానీ మనం విజయం సాధించగలమని నాకు తెలుసు.’’ ♦ ‘‘మనం పూర్తిగా ఫెయిలయ్యాం, కానీ మన తప్పుల నుండి నేర్చుకొని ముందుకు సాగాలి.’’ ఇలా చెప్పినప్పుడు మనసు ఆ వాక్యాల్లోని మొదటి భాగాన్నిన తిరస్కరించి, ‘కానీ’ తర్వాతి భాగాన్ని స్వీకరిస్తుంది. మీరు చెప్పాలనుకున్నది నేరుగా వారి మనసును చేరుతుంది. కాబట్టి మీ 'కానీ' ఎక్కడుందో, ఎలా ఉపయోగిస్తున్నారో గమనించుకోండి. 'కానీ' ఉపయోగం గురించి బాగా తెలుసుకోవడం ద్వారా, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా, 'అలాగే' తో భర్తీ చేయడం ద్వారా మీరు కోరుకున్న ఫలితాలు సాధించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. -సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 -
న్యూఇయర్... నిర్ణయాలు అమలు చేయండిలా!
రాత్రంతా బాగా అల్లరిచేసి, ఆనందించి, పార్టీతో న్యూఇయర్‌కు స్వాగతం పలికి ఉంటారు. ఆ సందర్భంగా కొత్త నిర్ణయాలు కూడా తీసుకుని ఉంటారు కదా. మీరేకాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం నుంచి 50శాతం మంది కొత్త సంవత్సరం సందర్బంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అందులో మెజారిటీ.. రోజూ ఎక్సర్సైజ్ చేయాలి, బరువు తగ్గించాలి, సిగిరెట్లు మానెయ్యాలి, మద్యం మానెయ్యాలి లాంటివే ఉంటాయి. మరికొందరు పుస్తకాలు చదవడాన్నో లేదా సినిమాలు చూడడాన్నో లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం యువతలో ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఆ ఆసక్తి తగ్గుతుంది. కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకున్నవారిలో 75శాతం మంది మొదటివారం తమ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. కానీ, జనవరి చివరికి వచ్చేసరికి కేవలం 40 శాతం మాత్రమే తమ మాటపై నిలబడతారు. ఆర్నెళ్ల తిరిగేసరికి కమిట్మెంట్తో ఉండేది ఎంతమందో తెలుసా? కేవలం 19శాతం. ఆర్నెళ్ల తర్వాత అది మరింత తగ్గుతుంది. చివరకు కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ను నెరవేర్చుకుంటారని స్క్రాంటన్ యూనివర్సిటీ అధ్యయనం తెలుపుతోంది. అందులోనూ మహిళల సంఖ్య ఎక్కువని న్యూసైంటిస్ట్ సర్వేలో వెల్లడైంది. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా జరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా చాలామంది సైకాలజిస్ట్‌లు, యూనివర్శిటీలు అధ్యయనాలు చేశాయి. అవాస్తవిక లక్ష్యాలను లేదా చాలా లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని చేరుకోవడానికి సరైన ప్లాన్, మోటివేషన్ లేకపోవడం కారణమని స్క్రాంటన్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. మార్పు వచ్చేంతవరకూ వేచి చూసే ఓపిక లేకపోవడం, జరిగిన తప్పుల నుంచి నేర్చుకునే అలవాటు లేకపోవడం కారణాలని సైకాలజీ టుడే పత్రిక పేర్కొంది. ఎవరినో మెప్పించాలనే తప్ప, తనకు తానుగా నిర్దేశించుకోవడం వల్ల మనసు లోపలి నుంచి ఉత్సాహం, ప్రేరణ లేకపోవడం. ఇలా అనేకానేక కారణాలున్నాయి. అందుకే నెలకో, ఆర్నెళ్లకో అవి మన జీవితం నుంచి మాయమైపోతాయి. మళ్లీ పాత అలవాట్లే పునరావృతమవుతాయి. మళ్లీ కొత్త సంవత్సరానికి అవే పాత గోల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మరేం చెయ్యాలి? ఇలాగైతే ఎలా? న్యూ ఇయర్ రిజల్యూషన్స్ నెరవేర్చుకోవడానికి ఏదో ఒక మార్గం చూపాలి కదా అని సైకాలజిస్టులు, యూనివర్శిటీలు అధ్యయనాలు జరిపాయి. వాటి సారాంశాన్ని అర్థం చేసుకుని, ఆచరించడం ద్వారా మన లక్ష్యాలను చేరుకోవచ్చు. కొత్త సంవత్సరంలో స్మార్ట్ గోల్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చని అదే స్క్రాంటన్ యూనివర్శిటీ అధ్యయనం పేర్కొంది. అంటే specific, measurable, achievable, relevant, and time-bound గోల్స్ ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద గోల్స్‌ను చిన్న చిన్న స్టెప్స్‌గా మార్చుకోవాలని హెర్జింగ్ యూనివర్శిటీ పేర్కొంది. అంటే, 2024లో పది కిలోల బరువు తగ్గాలనుకుంటే దాన్ని నెలకో కిలోగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. కొత్త పుస్తకం రాయాలనుకుంటే రోజుకో ఐదు పేజీలు రాయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. పర్ఫెక్షన్ గురించి కాకుండా ప్రోగ్రెస్‌పై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మోటివేషన్ వస్తుందని సైకాలజీ టుడే మేగజైన్ తెలిపింది. అంటే, రోజుకో ఐదు పేజీల లక్ష్యంలో మూడు పేజీలు మాత్రమే రాసినా డీలా పడిపోకూడదు. ఆ చిన్న విజయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అకౌంటబిలిటీ పార్టనర్‌ను లేదా సపోర్ట్ సిస్టమ్‌ను పెట్టుకోవడం వల్ల కూడా ఫలితాలుంటాయి. అంటే మనం పెట్టుకున్న లక్ష్యాన్ని కుటుంబ సభ్యులకో, స్నేహితులకో చెప్పండి. వారానికి ఐదు రోజులు వాకింగ్ అని లక్ష్యంగా పెట్టుకుంటే, అలా వెళ్లనప్పుడు వారిని గుర్తుచేయమనండి. ఏ అలవాటూ ఒక్కరోజులో పోదని లేదా 21 రోజుల్లో రాదనీ గుర్తించండి. ఒక కొత్త అలవాటు కావాలంటే కనీసం 60 నుంచి 70 రోజులు ప్రాక్టీస్ చేయాలి. లక్ష్యసాధనలో తడబాటుపడ్డప్పుడు, తప్పులు చేసినప్పుడు చాలామంది డీలా పడిపోతారు. ఎలాగూ తప్పు చేశామని మళ్లీ పాత మార్గానికే వెళ్లిపోతారు. అలాక్కాకుండా లక్ష్యసాధనలో తప్పులు, తడబాట్లు సహజమని గుర్తించండి. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందడుగు వేయాలి లక్ష్యాలు ఎవరినో మెప్పించాలని కాకుండా మనకోసం మనం పెట్టుకున్నప్పుడు మనసులోంచి ప్రేరణ ఉంటుంది. అందువల్ల గోల్స్ ఎప్పుడూ మీ విలువలకు సరిపోయేవిగా ఉండాలి. ఇవన్నీ చేసినా మీ అడుగులు తడబడుతుంటే, ఫిబ్రవరి లేదా మార్చిలో సైకాలజిస్ట్‌ను కలవండి. మీ ఆలోచనలు, ప్రవర్తనలో అవసరమైన మార్పుల కోసం వారు సహాయం చేస్తారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066 psy.vishesh@gmail.com -
అనారోగ్యం లేదని డాక్టర్లు చెప్పినా నమ్మడం లేదా?
రామారావు శ్రీకాకుళం లోని ఒక గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అయనకు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. అతను గత కొద్ది నెలలుగా ఆరోగ్యం పాడై పోయిందని కుమిలిపోతూ ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. చెప్పిన పరీక్షలన్నీ చేయించాడు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ, తనకు ఏదో అయిపోతుందని భయపడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. మర్నాడు మధ్యాహ్నం వారి గ్రామానికి దూరంలో విషం తీసుకుని చనిపోయి కన్పించాడు. ఇది ఒక ఆత్మహత్య వార్తలా చదివేసి వదిలేస్తాం. కానీ ఇలాంటి వార్తలను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మనందరికీ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. డాక్టర్ ను కలుస్తాం, ఆయన చెప్పిన మందులు వాడతాం, ఉపశమనం రాగానే దాని గురించి మరిచిపోతాం. కానీ అనారోగ్యం ఉందనే భయంతో ఆస్పత్రుల చుట్టూ తిరగడం, ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని వైద్యులు తేల్చి చెప్పినా భయం వదలకపోవడం.. ఒక మానసిక రుగ్మతకు సంబంధించిన లక్షణాలు. దీన్ని illness anxiety disorder (ఐఏడీ) లేదా Hypochondriasis అంటారు. మనకు లభిస్తున్న సమాచారాన్ని బట్టి రామారావు కూడా ఐఏడీ తో బాధపడుతున్నాడని అంచనా వేయవచ్చు. దీని లక్షణాలు... • తీవ్రమైన అనారోగ్యం వస్తుందని లేదా ఉందని భయపడటం ప్రధాన లక్షణం. • చిన్న లక్షణం కనిపించగానే పెద్ద జబ్బు వచ్చిందని అనుకుంటారు. .ఉదాహరణకు దగ్గు రాగానే ఊపిరితిత్తుల కేన్సర్ ఉందేమోనని భయపడతారు. . • ఈ అనారోగ్యం కూడా ఒక్కోసారి ఒక్కొక్కటిగా అపోహ పడుతుంటారు. • తన జబ్బేమిటో తెలుసుకునేందుకు పదే పదే వైద్యులను కలుస్తుంటారు. • ఏ జబ్బూ లేదని డాక్టర్ చెప్పినా, పరీక్షల్లో తేలినా వారికి ఉపశమనం ఉండదు. ఈ డాక్టర్ సరిగా పరీక్షించలేదంటూ మరో డాక్టర్ దగ్గరకు వెళ్తారు. అలా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. • జబ్బు బారిన పడతామనే ఆందోళనతో కొందరు ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరినీ కలవకుండా ఇంటికే పరిమితమవుతారు. ఇది ఎవరికి, ఎందుకు వస్తుందో చెప్పలేం. సాధారణంగా యుక్తవయస్సులో ప్రారంభమై వయసుతో పాటు తీవ్రతరమవుతుంది. బాల్యంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడిన వారికి, లేదా ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందే తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగిన వారికి లేదా బాల్యంలో ఫిజికల్, ఎమోషనల్, సెక్సువల్ అబ్యూజ్ కు గురైన వారికి ఈ రుగ్మత వచ్చే అవకాశాలు ఎక్కువ. దీని ప్రభావం వల్ల నిరంతరం అనారోగ్యం గురించే ఆలోచిస్తూ, తమ జబ్బుకు పరిష్కారం దొరకలేదనే భయంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. అది యాంగ్జయిటీ డిజార్డర్ లేదా డిప్రెషన్ లాంటి మానసిక రుగ్మతలకు దారితీయవచ్చు. వాటివల్ల ఆత్మహత్య ఆలోచనలు పెరిగి, చివరకు బలవన్మరణానికి పాల్పడవచ్చు. రామారావు విషయంలో ఇదే జరిగి ఉండవచ్చు. అందువల్ల ఎవరైనా పదే పదే డాక్టర్లను సంప్రదిస్తున్నా, ఏ జబ్బూ లేదని చెప్పినా సమాధానపడకపోతే అది మానసిక సమస్యని గుర్తించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు సైకోథెరపీ ద్వారా అనారోగ్యం పట్ల ఉన్న భయాలను తొలగించుకునేందుకు సహాయపడతారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066 psy.vishesh@gmail.com -
టెక్కీ దారుణ హత్య.. హద్దుల్లేని ప్రేమ పరిణామాలు ఇలాగే ఉంటాయా?
చెన్నై శివారులోని తాలంబూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి నందినిని స్నేహితురాలు మహేశ్వరి అలియాస్ వెట్రిమారన్ దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. నందినిని ప్రేమించిన మహేశ్వరి ఆరునెలల కిందటే అబ్బాయిగా మారి వెట్రిమారన్‌గా పేరు మార్చుకుంది. తన కోసమే లింగమార్పిడి చేసుకున్న తనను నందిని దూరంగా పెడుతుందన్న కోపంతో హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్నేహితుడు లేదా స్నేహితురాలి కోసం లింగమార్పిడి చేసుకున్న తర్వాత తనను పట్టించుకోకపోవడం, వేరొకరితో సన్నిహతంగా ఉండటంతో దాడులు చేసిన ఘటనలు గతంలోనూ వార్తల్లో కనిపించాయి. ఈ నేపథ్యంలో లింగమార్పిడి చుట్టూ ఉన్న సామాజిక సంక్లిష్టతల గురించి, ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం చూపించే తిరస్కరణ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కొందరు వ్యక్తులు జెండర్ ఐడెంటిటీలో ఎందుకు గందరగోళ పడతారనేది సంక్లిష్టమైన ప్రశ్న. దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. జెండర్ ఐడెంటిటీకి జీన్స్ కు మధ్య సంబంధాలను అనేక అధ్యయనాలు గుర్తించాయి. అయితే నిర్దిష్టంగా ఏ జీన్స్ కారణమనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు చిన్ననాటి అనుభవాలు, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు ఒక వ్యక్తి జెండర్ ఐడెంటిటీకి దోహదపడతాయి. అంటే ఒక వ్యక్తి ట్రాన్స్ జెండర్‌గా మారడమనేది వారి ఎంచుకున్నది కాదనేది గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ‘మగ’ లేదా ‘ఆడ’ వర్గాల్లోనే కాకుండా మధ్యలో కూడా ఉండవచ్చు. వారి జెండర్ ఐడెంటిటీని గుర్తించడం, వారు గౌరవంగా జీవించడానికి సహకరించడం అవసరం. అలా జరగనప్పుడు, ఆ గుర్తింపు గౌరవం దొరకనప్పుడు తీవ్రంగా గందరగోళ పడతారు. మానసిక సమస్యలకు లోనవుతారు. తమ సమస్యలకు కారణమైన వారిపై దాడికి కూడా పాల్పడవచ్చు. ఒక వ్యక్తికి ఐడెంటిటీ అనేది ఎంత ముఖ్యమో తెలుసుకుంటే జెండర్ ఐడెంటిటీ ప్రాధాన్యం తెలుస్తుంది. ఉదాహరణకు నా పేరు విశేష్. నేను Psy.Vishesh అని రాస్తా. అంటే సైకాలజిస్ట్ గా నా ప్రొఫెషన్ తో ఐడెంటిఫై చేసుకుంటున్నా. నన్ను అలా పిలిస్తేనే నాకు ఇష్టం, మరోలా పిలిస్తే కష్టంగా ఉంటుంది. పేరు విషయంలోనూ ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు.. బాలికగా పుట్టిన వ్యక్తిలో పురుష భావనలు ఉంటే మనసులో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అలాంటి భావనలను సమాజమే కాదు కుటుంబం కూడా ఒప్పుకోదు. అలాంటి పరిస్థితుల్లో తనను పురుషుడిగా అంగీకరించిన స్నేహితురాలు దొరికితే అంతకంటే ఆనందం ఉండదు. ఆ స్నేహితురాలిని, ఆ స్నేహాన్ని శాశ్వతంగా తనది చేసుకోవాలనుకుంటారు. పురుషుడిగా మారితే నందిని తనను అంగీకరిస్తుందనే, పెళ్లిచేసుకుంటుందనే ఆశతో లేదా అపోహతో మహేశ్వరి లింగమార్పిడి చేయించుకుని వెట్రిమారన్‌గా మారింది. కానీ నందిని దూరంగా ఉంచడం మారన్ మనసులో కల్లోలం రేపి ఉండవచ్చు. తనకోసం, తన ప్రేమ కోసం, తనతో జీవితం గడపడంకోసం లింగమార్పిడి సైతం చేయించుకున్నా దూరంగా పెట్టడంతో నందినిపై కోపం ఏర్పడి ఉండవచ్చు. ఆ కోసం హద్దులు దాటి నందిని హత్యకు దారితీసి ఉండవచ్చు. కోరుకున్నది దక్కనప్పుడు అందరూ ఒకేరీతిలో స్పందించరు. కొందరు తీవ్ర డిప్రెషన్‌కు లోనైతే, మరికొందరు ఫ్రస్ట్రషన్, అగ్రెషన్ కు లోనవుతారు. కారణమైన వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటారు. అప్పటికే జెండర్ ఐడెంటిటీ సమస్యలో ఉన్నవారిలో ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్ర భావోద్వేగాలకు కారణమవుతాయి. అప్పటికే సమాజం నుంచి తిరస్కరణ ఎదుర్కొంటున్న వ్యక్తి మనసులో ప్రేమించిన వ్యక్తి తిరస్కరణ మరింత బలమైన గాయాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇలాంటి హింసాత్మక ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. నందిని హత్య నిస్సందేహంగా బాధాకరం. అయితే ఆ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం పోకడను మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జెండర్ ఐడెంటిటీ అనేది ఏ ఒక్కరి ఎంపిక కాదని, కొందరిలో అది భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆడ, మగలతో పాటు ట్రాన్స్ జెండర్స్‌కు కూడా గౌరవంగా జీవించే హక్కు ఉందని గుర్తించాలి. వారి సమస్యలను సహానుభూతితో అర్థం చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీ ద్వారా వారి సమస్యల పరిష్కారానికి వీలైన సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు తగ్గుతాయని అందరం అర్థం చేసుకోవాలి. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com 8019 000066


