ఒక వ్యక్తిని 'కరిష్మాటిక్' అని ఎప్పుడు పిలుస్తారంటే.. | Health Tips: The Charisma Code: How to Be the Most Interesting | Sakshi
Sakshi News home page

The Charisma Code: ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అంటే ఏమిటి?

Mar 21 2026 7:10 AM | Updated on Mar 21 2026 8:30 AM

Health Tips: The Charisma Code: How to Be the Most Interesting

చాలామంది కరిష్మా (Charisma) పుట్టుకతో వచ్చే వరం అనుకుంటారు, లేదా కేవలం సినిమా స్టార్లకు మాత్రమే ఉంటుందని భ్రమిస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, కరిష్మా అనేది నేర్చుకోగలిగే ఒక Behavioral Skill.

కరిష్మా అంటే అందంగా ఉండటం కాదు, ఎదుటివారిని 'అందంగా' ఫీలయ్యేలా చేయడం. మీరు ఒక గదిలోకి అడుగుపెట్టినప్పుడు, అక్కడ ఉన్న వాతావరణం మీ రాకతో పాజిటివ్‌గా మారితే... అదే కరిష్మా. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పక్కన ఉంటే మనకు తెలియని ఒక ఉత్సాహం, నమ్మకం కలుగుతాయి. దీనికి వెనుక ఉన్న సైన్స్ మరియు సైకాలజీని డీకోడ్ చేద్దాం.

The Charisma Trifecta
ఒక వ్యక్తిని మనం 'కరిష్మాటిక్' అని ఎప్పుడు అంటామంటే, వారిలో ఈ మూడు లక్షణాలు ఉన్నప్పుడు:

1. Presence: మీరు ఎవరితో ఉన్నారో, ఆ క్షణంలో పూర్తిగా వారితోనే ఉండటం. మీ మనసు ఎక్కడో ఉండి, మీరు అక్కడ ఉన్నట్లు నటిస్తే కరిష్మా మాయమైపోతుంది. మీ ఏకాగ్రతే మీ ఆకర్షణ.

2. Power: ఇది ఎదుటివారిని భయపెట్టే శక్తి కాదు. మీ జ్ఞానం, మీ హోదా, మీ ఆత్మవిశ్వాసం లేదా మీ శారీరక దృఢత్వం ద్వారా వచ్చే 'ప్రభావం'. లోకానికి మీరు ఏదో ఒకటి సాధించగలరనే నమ్మకం కలిగించడం.

3. Warmth: మీ శక్తిని ఎదుటివారి మేలు కోసం వాడతారనే భరోసా. మీరు ఎంత పవర్‌ఫుల్ అయినా, మీలో ఆత్మీయత లేకపోతే మిమ్మల్ని 'అహంకారి' అంటారు. శక్తికి ఆత్మీయత తోడైనప్పుడే అది 'కరిష్మా' అవుతుంది.

The Halo Effect
సైకాలజీలో Halo Effect అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక వ్యక్తిలో ఒక మంచి లక్షణం ఉంటే, మన మెదడు ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తి తెలివైనవాడు, నమ్మదగ్గవాడు అని భావిస్తుంది. ఉదాహరణకు, మంచి డ్రెస్సింగ్ లేదా మంచి నవ్వు. కరిష్మాటిక్ వ్యక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తమ బాడీ లాంగ్వేజ్‌ని, ప్రెజెన్స్‌ని అద్భుతంగా మెయింటైన్ చేస్తారు.

రియల్ కరిష్మా
మోటివేషన్ స్పీకర్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు "ఎప్పుడూ నవ్వుతూ ఉండు, బిగ్గరగా మాట్లాడు, అందరినీ పొగుడు" అని చెప్తుంది. ఇది ఒక్కోసారి Fake గా అనిపిస్తుంది. కానీ కరిష్మా అనేది లోపలి నుండి రావాలి. మీరు మీ గురించి మీరు గొప్పగా ఫీలైనప్పుడు, ఎదుటివారిలో మంచిని చూడగలిగినప్పుడు మీ కళ్ళలో ఒక మెరుపు వస్తుంది. అదే అసలైన ఆకర్షణ.

మీ చరిష్మా కోడ్‌ని అన్‌లాక్ చేయండి
Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీరు ఒక ఆకర్షణీయమైన లీడర్‌గా మారే మార్గం ఇది.

Step 1: అభద్రతా భావం, పరధ్యానం బ్రేక్ చేయండి
మీరు మాట్లాడేటప్పుడు ఫోన్ చూడటం లేదా మీ గురించి మీరు తక్కువగా ఊహించుకోవడం వంటి పాత అలవాట్లను 'Break' చేయండి. అభద్రతా భావం (Insecurity) ఉన్న చోట కరిష్మా ఉండదు.
Step 2: యాక్టివ్ ఎంగేజ్‌మెంట్
ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి చూసి మాట్లాడండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు వారిని ఎంత గౌరవిస్తారో మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా బిల్డ్ చేయండి. మీ నడకలో, నిలబడే తీరులో ఒక 'గ్రేస్' ఉండాలి.

Step 3: ప్రభావితం చేసే శక్తి
మీరు ఒక రూమ్‌లోకి వెళ్ళినప్పుడు మీ అవసరం అక్కడ ఉండాలి. మీ జ్ఞానంతో, మీ వినయంతో అందరినీ ఆకట్టుకోండి. మీరు లేని సమయంలో కూడా మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇదే 'Beyond' స్టేజ్.

మీ కరిష్మా చెకప్
ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.
1.    మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారికి మీరు ఇస్తున్న 'అటెన్షన్' ఎంత?
2.    మీలో Power and Warmth బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయా?
3.    మిమ్మల్ని కలిసిన తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా ఫీలవుతున్నాడా లేక ఇబ్బందిగా ఫీలవుతున్నాడా?

కరిష్మా అంటే ఎదుటివారిని గెలవడం!
బ్రో, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అంటే కేవలం అందంగా కనిపించడం కాదు, అద్భుతంగా ప్రవర్తించడం. మీరు మీ చుట్టూ ఉన్నవారిని ఎంతగా ప్రోత్సహిస్తారో, వారిని ఎంతగా అర్థం చేసుకుంటారో.. అదే మీ కరిష్మాను పెంచుతుంది. ఇది మీ ప్రొఫెషనల్ గ్రోత్ కి ఒక రాకెట్ ఇంజిన్ లాంటిది.

"Charisma is the ability to influence without logic."

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: కొత్త ఆలోచనలను మనసులో ఎలా నాటాలి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement