ఈ రాశి వారు శుభవార్త వింటారు.. ఆస్తి వివాదాల పరిష్కారం.. | Today horoscope telugu 20-03-2026 Daily horoscope | Sakshi
Sakshi News home page

Today Horoscope Telugu: ఈ రాశి వారు శుభవార్త వింటారు.. ఆస్తి వివాదాల పరిష్కారం..

Mar 20 2026 6:54 AM | Updated on Mar 20 2026 7:00 AM

Today horoscope telugu 20-03-2026 Daily horoscope

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.విదియ తె.4.21 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి తదియ, నక్షత్రం: రేవతి తె.4.19 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి అశ్విని, వర్జ్యం: సా.4.45 నుండి 6.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.32 నుండి 9.20 వరకు, తదుపరి ప.12.32 నుండి 1.20 వరకు, అమృత ఘడియలు: రా.1.51 నుండి 3.24 వరకు

సూర్యోదయం :    6.08
సూర్యాస్తమయం     :  6.06
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: పనులు కొన్ని మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం: కుటుంబంలో శుభకార్యాలు. విలువైన సమాచారం. ఆప్తులతో సఖ్యత. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కీలక పరిణామాలు.

మిథునం: కొత్త ఉద్యోగాలు పొందుతారు. వేడుకల్లో పాల్గొంటారు. దైవదర్శనాలు. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాల  పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.

సింహం: మిత్రులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళస్థితి.

కన్య: విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. శుభవార్తా శ్రవణం. వాహనాలు, భూములు కొంటారు. విందువినోదాలు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి.

తుల: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందులువినోదాలు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి.‡ ఉద్యోగాలలో ఉన్నతి. వాహనసౌఖ్యం.

వృశ్చికం: ప్రయాణాలు వాయిదా. శ్రమ మరింత పెరుగుతుంది. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఇంటాబయటా సమస్యలు. వ్యాపార, ఉద్యోగాల్లో చికాకులు ఎదురవుతాయి.

మకరం: కొన్ని పనులు విజయవంతంగా సాగుతాయి. నూతన ఉద్యోగలాభం. భూవివాదాలు పరిష్కారం. దైవదర్శనాలు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కాస్త నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో మార్పులు సంభవం.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.  శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement