తమిళనాడు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అనూహ్యంగా టీవీకే ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. డీఎంకేను దాటి దూసుపోతుంది. తమిళనాడులో టీవీకే ముందంజ ఉండగా, రెండో స్థానంలో డీఎంకే, మూడో స్థానానికి అన్నాడీఎంకే పరిమితమైంది. తమిళనాడులో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. లీడింగ్‌లో టీవీకే విజయ్ పార్టీ దూసుకుపోతుంది.
విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. టీవీకే విజయ్‌కు తమిళ ఓటర్లు జైకొట్టారు. హంగ్ వస్తే టీవీకే-అన్నాడీఎంకే జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు, ముందస్తుగా అప్రమత్తమైన విజయ్ పార్టీ.. తమ కాబోయే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ‘రిసార్ట్ పాలిటిక్స్’కు తెరతీసిన సంగతి తెలిసిందే. మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో సుమారు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ ఏర్పాట్లు చేసింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విజయం సాధించిన అభ్యర్థులంతా క్షణం కూడా ఆలస్యం చేయకుండా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ‘గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దు’ అని అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.


