విశాఖపట్నం : నగరంలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారడంతో సందర్శకులు సాగరతీరానికి పోటెత్తారు. వారాంతపు సెలవు దినం కావడం, ఎండ వేడి నుంచి ఉపశమనం లభించడంతో నగరవాసులంతా కుటుంబ సమేతంగా బీచ్ రోడ్డులో వాలిపోయారు. ఎగసిపడుతున్న కెరటాల చెంతన కేరింతలు కొడుతూ, సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. దీంతో ఆర్కే బీచ్, రుషికొండ తీర ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి.
–ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


