ఒంగోలు : ఆషాఢ మాస కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం ఒంగోలులో సుబ్రహ్మణ్యస్వామి వేల్ కావడి ఉత్సవాలు (Vel Kavadi Festival) భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
దీక్ష చేపట్టిన భక్తులు శరీరానికి ఈటెలు గుచ్చుకుని,కేరళ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ కావడి మోశారు.
స్కందగిరితో సహా పలు ఆలయాల్లో స్వామివారికి విశేష అభిషేకాలు,పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.
- స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు


