3 రోజుల బ్యాంకుల సమ్మె: ఎస్‌బీఐ గైడ్‌లైన్స్‌ | September 28-30 Bank Strike SBI Issues Advisory Check here | Sakshi
Sakshi News home page

3 రోజుల బ్యాంకుల సమ్మె: ఎస్‌బీఐ గైడ్‌లైన్స్‌

Sep 21 2026 2:50 PM | Updated on Sep 21 2026 3:38 PM

September 28-30 Bank Strike SBI Issues Advisory Check here

దేశవ్యాప్తంగా బ్యాంకులు మరోసారి సమ్మె బాట పట్టనున్నాయి.   సెప్టెంబర్ 28 నుండి 30, 2026 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె జరగనుంది. వారానికి ఐదు రోజుల పనిదినాల (5-Day Banking) అమలుతో పాటు మరికొన్ని డిమాండ్ల సాధన కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.ఈ నేపథ్యంలో సమ్మె ప్రభావంతో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ రంగ బ్యాంకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తమ కస్టమర్లకు కీలక సూచనలు జారీ చేసింది

సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీల్లో ఈ సమ్మె జరుగుతుంది. ఐదు రోజుల పాటు అంతరాయం  కలగనుంది. సెప్టెంబర్ 26 (శనివారం), సెప్టెంబర్ 27 (ఆదివారం) వారాంతపు సెలవులు కావడంతో, మొత్తంగా 5 రోజుల పాటు బ్రాంచ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమ్మె నేపథ్యంలో ముఖ్యమైన పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని, డిజిటల్ ఛానెల్స్‌ను ఉపయోగించుకోవాలని SBI కోరింది.

అయితే సమ్మెకాలంలో బ్రాంచ్‌లపై ఆధారపడే సేవలు, భౌతిక పత్రాలు అవసరమైన పనులు , చెక్కుల క్లియరెన్స్ వంటి ప్రక్రియలు ఆలస్యం కావచ్చు లేదా నిలిచిపోవచ్చు. కానీఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, YONO, UPI సేవలు యథావిధిగా పనిచేస్తాయి. ఏటీఎంలు సీఎస్పీలు, కస్టమర్ సర్వీస్ పాయింట్లు (CSPs) అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement