విజయవాడ: గణాధిపతుల నిమజ్జనోత్సవం అంబరాన్నంటింది. ఊరూవాడా వేడుకై స్వామిని సాగనంపింది.
ఆడామగ, చిన్నాపెద్ద తేడా లేకుండా ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు.
డీజే శబ్దాలకు యువత కేరింతలు కొట్టింది.
విజయవాడ పరిధిలోని విగ్రహాలను ప్రకాశం బ్యారేజీ దిగువన నిమజ్జనానికి పెద్ద ఎత్తున తీసుకొచ్చారు.
వివిధ ట్రక్కులు, ట్రాక్టర్లపై నది సమీపానికి తీసుకొచ్చి.. క్రేన్ల సాయంతో కృష్ణమ్మ ఒడికి చేర్చారు.
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


