యుద్ధం.. డ్రోన్ల దాడులు.. ఆర్థిక ఒత్తిళ్లు.. ఎన్ని సవాళ్లు ఎదురైనా రష్యాలో పుతిన్ రాజకీయ ఆధిపత్యానికి ఎదురులేకుండా పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో అధికార యునైటెడ్ రష్యా పార్టీ 57.5 శాతం ఓట్లతో దూసుకెళ్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంపై ప్రజల మద్దతును పరీక్షించుకునేందుకు జరిగిన ఈ ఎన్నికల్లోనూ పుతిన్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్షాలు వెనుకబడగా.. రష్యా రాజకీయాల్లో పుతిన్ పట్టు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కీలక రాజకీయ పరీక్ష ఎదురైంది. అయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పాక్షిక అధికారిక ఫలితాల ప్రకారం ఆ పార్టీకి 57.5 శాతం ఓట్లు లభించాయి. అయితే ఇవి తుది ఫలితాలు కావు. 450 మంది సభ్యులున్న రష్యా స్టేట్ డూమాలో మెజారిటీ సాధించే దిశగా అధికార పార్టీ ముందుకు సాగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ, ఎల్‌డీపీఆర్, న్యూ పీపుల్, జస్ట్ రష్యా పార్టీలు చాలా వెనుకబడి ఉన్నప్పటికీ పార్లమెంటులో స్థానాలు దక్కించుకునే అవకాశముంది.
సెప్టెంబర్ 18–20 మధ్య మూడు రోజుల పాటు పోలింగ్ జరిగింది. సెప్టెంబర్ 21 నాటికి వెలువడిన పాక్షిక ఫలితాల్లో యునైటెడ్ రష్యా 57.5 శాతం ఓట్లతో ముందంజలో ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే 2021 ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీకి 49.82 శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లోని 57.5 శాతం పాక్షిక ఫలితంతో పోలిస్తే దాదాపు 7.7 శాతం పాయింట్ల ఆధిక్యం కనిపిస్తోంది. ప్రతిపక్షాల పరిస్థితి ఇలా ఉంది. ప్రాథమిక లెక్కల్లో కమ్యూనిస్ట్ పార్టీ 13.67 శాతం, ఎల్‌డీపీఆర్ 9.27 శాతం, న్యూ పీపుల్ 7.96 శాతం, జస్ట్ రష్యా 5.16 శాతం ఓట్లతో ఉన్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఈ గణాంకాలు పాక్షిక లెక్కల ఆధారంగా వచ్చినవే.
BREAKING! 🇷🇺
Preliminary results. Putin and Medvedev's "United Russia" party is leading with 57% in the State Duma elections.
The other parties got from 1 to 7 percent of the votes.pic.twitter.com/SKQtov4R8A— Дepлorabлe Russian🔹 (@TeaTramRussia) September 20, 2026
పుతిన్ తన ప్రభుత్వ విధానాలకు, ఉక్రెయిన్ యుద్ధానికి ప్రజల మద్దతు ఉందా లేదా అన్నదానికి ఈ ఎన్నికలను పరీక్షగా అభివర్ణించారు. మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్.. యునైటెడ్ రష్యా గౌరవప్రదమైన ఫలితాన్ని సాధించిందని, దేశాన్ని పాలించే బాధ్యతను ప్రజలు మరోసారి ఆ పార్టీకి అప్పగించారని వ్యాఖ్యానించారు.
యుద్ధ వ్యతిరేక అభ్యర్థులకు అవకాశం నిరాకరణ
యుద్ధాన్ని వ్యతిరేకించే పలువురు అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఉదారవాద యాబ్లోకో పార్టీకి చెందిన నేతలు కూడా తమ స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై వ్యాఖ్యల నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలకు కోర్టులు సుదీర్ఘ జైలు శిక్షలు విధించడమే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. రష్యాలో సైన్యాన్ని అప్రతిష్ఠపరిచేలా మాట్లాడటం, అధికారులు తప్పుడు వార్తలుగా పరిగణించే సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి చర్యలకు సుదీర్ఘ జైలు శిక్షలు విధించే అవకాశం ఉంది.
సైబర్ దాడుల మధ్య ఓటింగ్
ఎన్నికల వ్యవస్థలపై పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగినట్లు రష్యా ఎన్నికల అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఓటింగ్ ప్రక్రియ చాలావరకు సజావుగా సాగిందని పేర్కొన్నారు. మాస్కో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రానికి పోలింగ్ శాతం దాదాపు 57కు చేరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడించాయి. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రష్యన్లు మధ్యాహ్నం 12 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని నిరసన తెలపాలని ప్రవాస ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో పొడవైన క్యూలు కనిపించినప్పటికీ.. ఈ నిరసన ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపిందన్నది స్పష్టంగా తెలియలేదు.
Ukraine launched its "largest ever" drone barrage against Moscow during the final day of Russia's parliamentary elections.
The attack — involving over 1,000 drones nationwide — struck a major Moscow oil refinery, sending heavy flames and smoke into the sky and leaving at least… pic.twitter.com/0G2gmmpopr— Fox News (@FoxNews) September 20, 2026
ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
రష్యా ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మాస్కోతో పాటు పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. మాస్కో ప్రాంతంలో ముగ్గురు, రష్యా ఆధీనంలోని ఉక్రెయిన్ ఖెర్సన్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించినట్లు తెలిపారు. మృతుల్లో ఎన్నికల అధికారి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకే ఈ దాడులు జరిగాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ఆరోపించారు. అయితే వాటి వల్ల ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగలేదని చెప్పారు.
ఇక, ఎన్నికల ఫలితాలను పుతిన్ ప్రభుత్వం తన విధానాలకు, ఉక్రెయిన్ యుద్ధానికి ప్రజల మద్దతు ఉందనడానికి నిదర్శనంగా చూపించే అవకాశం ఉంది. అయితే యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రజల ఆర్థిక ఆందోళనలు, ప్రతిపక్ష పార్టీలకు లభించే మద్దతు రష్యా రాజకీయ పరిణామాల్లో కీలకంగా మారనున్నాయి.
Ukraine launched MASSIVE ATTACK in attempt to DISRUPT Russia ELECTIONS — Russian MoD
1,951 DRONES and 8 FLAMINGO MISSILES shot down in 24 HOURS
MOSCOW WARNS RESPONSE IS COMING as STRIKES ON Kiev set to INTENSIFY pic.twitter.com/Fsm3mW3KG8— RT (@RT_com) September 20, 2026


