ఆ తోరణం సైనిక స్థావరం  | Proposed 250-foot arch will be used as military complex Says Donald Trump | Sakshi
Sakshi News home page

ఆ తోరణం సైనిక స్థావరం 

Sep 21 2026 5:32 AM | Updated on Sep 21 2026 5:32 AM

Proposed 250-foot arch will be used as military complex Says Donald Trump

డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్య

వాషింగ్టన్‌: రాజధాని వాషింగ్టన్‌ డీసీలో లింకన్‌ మెమోరియల్, ఆర్లింగ్టన్‌ నేషనల్‌ సెమెట్రీ మధ్య తాను నిర్మించాలనుకుంటున్న భారీ తోరణం ఒక అత్యున్నత శ్రేణి సైనిక స్థావరంగానూ ఉపయోగపడనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఇక్కడ మందుగుండు సామగ్రిని నిల్వ చేయడంతోపాటు డ్రోన్లు నిల్వ చేయవచ్చని, స్నైపర్‌లను మొహరించవచ్చని ఆయన వెల్లడించారు. 

అధ్యక్షుని అధికారిక భవనంతోపాటు వాషింగ్టన్‌ డీసీ నగరాన్ని సుందరీకరించడానికి తాను చేపట్టిన ప్రాజెక్టులు రక్షణ అవసరాలను సైతం తీరుస్తాయని ట్రంప్‌ చాలా రోజులుగా వాదిస్తున్న విషయం తెల్సిందే.

 వైట్‌హౌస్‌ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన బాల్‌రూమ్‌ను ‘సైనిక సముదాయం’గా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఇది అవసరమని ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అమెరికా సైన్యం అభ్యర్థన మేరకు 250 అడుగుల ఎత్తయిన స్మారక తోరణాన్ని సైనిక సముదాయంగా/విజయ తోరణంగా మార్చడానికి తాను అంగీకరించినట్లు ట్రంప్‌ ఆదివారం సోషల్‌ మీడియా పోస్టులో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement