ట్రంప్‌కు ఇరాన్‌ అల్టిమేటం.. 7 షరతులు | us iran war washington ready to negotiate as tehran sends 7 conditions | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ఇరాన్‌ అల్టిమేటం.. 7 షరతులు

Sep 20 2026 5:16 PM | Updated on Sep 20 2026 5:28 PM

us iran war washington ready to negotiate as tehran sends 7 conditions

ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపు దాలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ మరోసారి అమెరికాకు భారీ ఆఫర్‌ ఇచ్చింది. యుద్ధాన్ని ఆపాలంటే తమ వద్ద ఒక ప్లాన్‌ ఉందని తెలిపింది.. టెహ్రాన్‌ ప్రతిపాదించిన ఏడు షరతులను అంగీకరిస్తే వెంటనే యుద్ధం ముగిసిపోతుందని లేకపోతే అమెరికా వద్ద మరో ప్లాన్‌ ఏది లేదని స్పష్టం చేసింది.

ఇరాన్‌  సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ... ఈ విషయమై మాట్లాడుతూ అమెరికా ముందు తన ఇరాన్‌కు చెందిన ఏడు ప్రతిపాదనలను ఖతార్‌ మధ్యవర్తిత్వంతో అమెరికాకు చేరవేశాం. ప్రస్తుతం యుద్ధం మెుదలై ఏడు నెలలు కావస్తుందని ఇరాన్‌ షరతులపై ట్రంప్ స్పందన కోసం  ఎదురుచూస్తోన్నామన్నారు.

ఆయన మాట్లాడుతూ "ఏదైనా చర్చలు ప్రారంభించడానికి ఇరాన్ తన ఏడు షరతులను అమెరికా ప్రభుత్వానికి ప్రకటించింది. టెహ్రాన్ సందేశం స్పష్టంగా, నిస్సందేహంగా ఉంది. వాషింగ్టన్ తాను సృష్టించుకున్న చిక్కుముడి నుండి బయటపడాలనుకుంటే, అందులో మరింత చిక్కుకోకుండా ఉండాలంటే, ఇరాన్ హక్కులు, షరతులను అంగీకరించడం తప్ప దానికి మరో మార్గం లేదు," అని ఆయన ఆదివారం తెల్లవారుజామున Xలో పోస్ట్ చేశారు.

ఇరాన్ ప్రధాన డిమాండ్లు ?

మెుహ్సెన్‌ రెజాయీ ప్రకారం, ఇరాన్ ప్రతిపాదనల్లో ప్రధానంగా అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించడం, ఇరాన్‌కు చెందిన స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని తొలగించడం వంటి అంశాలు ఉన్నాయి. అదే విధంగా  యెమెన్‌కు చెందిన హౌతీలు, సౌదీ అరేబియా మధ్య కొనసాగుతున్న పోరాటానికి సైతం ముగింపు పలకాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సైనిక ఘర్షణలకు సమగ్ర ముగింపు రావాలన్నదే తమ ఉద్దేశమని రెజాయీ తెలిపారు.

ఖతార్ ద్వారా అమెరికాకు సందేశం.

ఇరాన్, అమెరికా మధ్య నేరుగా కాకుండా మధ్యవర్తి దేశం ఖతార్ ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇరాన్ షరతులను ఖతార్ అమెరికాకు చేరవేసిందని, ప్రస్తుతం వాషింగ్టన్ నుంచి అధికారిక స్పందన కోసం వేచి చూస్తున్నామని ఆయన చెప్పారు. “ఈ షరతులను అంగీకరించడం అమెరికా ప్రయోజనానికే” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమెరికా నుంచి మరోసారి దాడి జరిగే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు.

మరో అమెరికా దాడి జరిగే అవకాశం?
ఇరాన్ సైనిక అంచనాల ప్రకారం అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఇంకా చాలా ఎక్కువగానే ఉందని రెజాయీ పేర్కొన్నారు. అందుకే తమ దేశం కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోందని, ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడమే ప్రస్తుత లక్ష్యమని చెప్పారు.

 ట్రంప్ స్పందనపై సస్పెన్స్‌?

ఇరాన్ తన ఏడు షరతులను అమెరికా ముందుంచిన నేపథ్యంలో, వాషింగ్టన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవైపు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్ మరో అమెరికా దాడి జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధానికి నిజంగా ముగింపు పలికే దిశగా ఇరాన్-అమెరికా చర్చలు సాగుతాయా? లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement