యుద్ధానికి మూల్యం చెల్లిస్తున్నారు  | Nobel laureate Narges Mohammadi tells Iranians paying the price for war | Sakshi
Sakshi News home page

యుద్ధానికి మూల్యం చెల్లిస్తున్నారు 

Sep 20 2026 4:42 AM | Updated on Sep 20 2026 4:42 AM

Nobel laureate Narges Mohammadi tells Iranians paying the price for war

ఇరాన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది 

వర్చువల్‌ ఇంటర్వ్యూలో నోబెల్‌ గ్రహీత నర్గీస్‌ వ్యాఖ్యలు 

దుబాయ్‌: అమెరికా ఆంక్షలు, ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న యుద్ధాలకు మూల్యాన్ని ఇరాన్‌ ప్రజలు చెల్లిస్తున్నారని ఆ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారిణి, నోబెల్‌ గ్రహీత నర్గీస్‌ మహ్మదీ(54) వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు, బలగాల అణచివేత కారణంగా సామాన్యులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు.

 ‘ఒక్కసారి ఇరాన్‌ వీధుల్లోకి వెళ్లి చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏమిటో మీకు అర్థమవుతుంది. వారిప్పుడు మేల్కొన్నారు. హక్కుల కోసం పోరాడాలని తీర్మానించుకున్నారు’ అని మహ్మదీ అన్నారు. ‘నేటి ఇరాన్‌ యువతలో హక్కుల పట్ల అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్పష్టత  ఉంది. వారే మాకు ఆశ, శ్వాస’అని ఆమె పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన నర్గీస్‌ మహ్మదీని ఇరాన్‌ ప్రభుత్వం జైలు నుంచి తాత్కాలికంగా విడుదల చేసింది. 

శుక్రవారం ఆమె అసోసియేటెడ్‌ ప్రెస్‌కు ఇచి్చన వర్చువల్‌ ఇంటర్వ్యూలో తన నిర్బంధానికి సంబంధించిన వివిధ అంశాలను ఆమె వివరించారు. బాల్యంతోపాటు జైలులో ఉన్న సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రాసిన ‘ఎ ఉమన్‌ నెవర్‌ స్టాప్స్‌ ఫైటింగ్‌’ పుస్తకం ఫ్రెంచి, జర్మన్, తదితర 9 భాషల్లో ఈ నెలలో విడుదల కానుంది. ఇంగ్లి‹Ù, పార్సీ ఎడిషన్లు వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. 

అమెరికాతో కొనసాగుతున్న యుద్ధం, ముదిరిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఇరాన్‌ ప్రజలు పలు రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారని, భారీ మూల్యం చెల్లిస్తున్నారని మహ్మదీ  పేర్కొన్నారు. తమ పాలకులపై ఇరాన్‌ వాసుల్లో నిశ్శబ్దంగా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందంటూ ఆమె ఇస్లాం డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించిన కారణంగా 22 ఏళ్ల మహ్సా అమీనిని అధికారులు నిర్బంధించడం, అనంతరం ఆమె ఆస్పత్రిలో చనిపోవడంతో మొదలైన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కొనసాగిన విషయాన్ని ప్రస్తావించారు. అమీనిని స్మరించుకుంటూ ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న నర్గీస్‌ మహ్మదీకి ఇరాన్‌ ప్రభుత్వం వివిధ ఆరోపణలు మోపి మొత్తం 44 ఏళ్ల జైలు శిక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement