ఈ బాలుడు టోర్నెడో రాకను కనిపెడతాడు | 12-year-old is designing a new way to detect tornados | Sakshi
Sakshi News home page

ఈ బాలుడు టోర్నెడో రాకను కనిపెడతాడు

Sep 19 2026 4:44 AM | Updated on Sep 19 2026 4:44 AM

12-year-old is designing a new way to detect tornados

యంగ్‌ ఇన్వెంటర్‌

పిల్లలూ... మీరు సినిమాల్లో టోర్నెడో (సుడిగాలి) చూశారా? ఇళ్లను, కార్లను గాల్లోకి లేపేసే పెద్ద రాక్షసి అది. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ఏడాదికి 50 టోర్నెడోలు వస్తాయి. అక్కడే అనిరుధ్‌ రావ్‌ అనే 12 ఏళ్ల తెలుగు అబ్బాయి ఉంటున్నాడు. అతనికి నాలుగైదేళ్ల వయసులో నాష్‌ విల్లేలో ఉండగా, తన కళ్ల ముందే ఒక టోర్నెడో తన స్నేహితుడి ఇంటిని పూర్తిగా నాశనం చేయడం చూశాడు. 

ఆ చిన్న వయసులోనే అతని మనసులో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది – ‘మనమెందుకు టోర్నెడో రాకను ముందే పసిగట్టకూడదు?’ అని. అప్పట్నించి అతను పరిశోధిస్తూ ఇన్నాళ్లకు కనిపెట్టిన ఆవిష్కరణే 'Revere’. సాధారణంగా టోర్నెడో పుట్టే ముందు మన చెవులకు వినపడని ‘ఇన్‌ ఫ్రా సౌండ్‌’ అనే ప్రత్యేక శబ్దం వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. 

ఇప్పుడున్న పెద్ద రాడార్లు ఆ శబ్దం తమకు బాగా దగ్గరికి దగ్గరికి వచ్చాకే గుర్తిస్తాయి.సాధారణంగా ఇలా గుర్తించాక 13 నిమిషాలకు టోర్నెడో ఆ ప్రాంతానికి వస్తుంది. కానీ అనిరుధ్‌  సెన్సార్లు ఉన్న చిన్న డ్రోన్లను తయారు చేసి, టోర్నెడో పుట్టిన వెంటనే అవి ఆ శబ్దం దగ్గరికి తమకు తాముగా వెళ్లి దాని ఆచూకీని కనిపెట్టేలా చేశాడు. 

దీని వల్ల టోర్నెడో రాబోతున్నదని  40 నిమిషాలకు ముందే తెలిసిపోతుంది. అంటే అనిరుద్‌ వల్ల దొరికిన ఆ అదనపు 27 నిమిషాలు వందల కుటుంబాల ప్రాణాలను కాపాడతాయి. ఈ గొప్ప ఆలోచనకు గాను అనిరు«ద్‌కు అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘గ్లోరియా బారన్‌ ప్రైజ్‌ ఫర్‌ యంగ్‌ హీరోస్‌ 2025’ అవార్డు వచ్చింది. పిల్లలూ... చిన్న ప్రశ్నే పెద్ద ఆవిష్కరణకు మొదటి మెట్టు అని అనిరుధ్‌ నిరూపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement