స్పీకర్‌కు హోంమంత్రి పదవి.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు | AIMIM MLA Says Speaker Prasad Will Be the Next Home Minister | Sakshi
Sakshi News home page

స్పీకర్‌కు హోంమంత్రి పదవి.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Sep 18 2026 12:32 PM | Updated on Sep 18 2026 12:50 PM

AIMIM MLA Says Speaker Prasad Will Be the Next Home Minister

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి ‘కాబోయే హోంమంత్రి మీరే అవుతారని మాకు సమాచారం ఉంది.. అందుకే శాంతి భద్రతల విషయం మీకు చెబుతున్నాం’ అంటూ  ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాలా ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తుల్లో పోలీసులంటే భయం లేకుండా పోయిందని, నేరాలను అరికట్టాలంటే కఠినంగా శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్‌ నగరంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించిందని బలాలా పేర్కొన్నారు. నేరస్తులకు చట్టం, శిక్షలంటే భయం లేకపోవడం వల్లే నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడితేనే వాటిని నియంత్రించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో స్పీకర్‌ను ఉద్దేశించి బలాలా చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో ఆసక్తికరంగా మారాయి. ‘కాబోయే హోంమంత్రి మీరే అవుతారని మాకు సమాచారం ఉంది.. అందుకే మీకు చెబుతున్నాం స్పీకర్‌ గారు’ అని అన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని ఆయన కోరారు. నగరంలో నేరాల నియంత్రణకు పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు, నేరస్తుల్లో చట్టంపై భయాన్ని కలిగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బలాలా సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. స్పీకర్‌కు హోంమంత్రి పదవి ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హోంశాఖ.. సీఎం రేవంత్‌ రెడ్డి వద్దే ఉంది. 

Video Credit: Telugu Scribe

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement