తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు ఉదయం శ్రీమలయప్ప స్వామి వారు తన ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి భక్తులకు దివ్య దర్శనమిస్తారు.
ఈ వాహన సేవలో స్వామివారు విశేషంగా రాజమన్నార్ (శ్రీకృష్ణుడు) అలంకారంలో తలపాగా, చేతిలో జాటి (కనుకోల) ధరించి నయనానందకరంగా దర్శనమివ్వడం ఒక ప్రత్యేకత.


