ఏపీ సరిహద్దులు దాటిన రెడ్ బుక్ అరాచకం | Red Book Politics In AP, Journalist Dhanya Rajendran Questions Takedown Request Sent To X, Check Posts Inside | Sakshi
Sakshi News home page

ఏపీ సరిహద్దులు దాటిన రెడ్ బుక్ అరాచకం

Sep 18 2026 10:49 AM | Updated on Sep 18 2026 1:34 PM

Red Book Politics AP Police Compliant Over Journalist Dhanya Posts

సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్‌ పాలనలో రెడ్ బుక్ అరాచకం ఏపీ సరిహద్దులు దాటింది. ఏకంగా జాతీయ స్థాయి జర్నలిస్టులకూ రెడ్‌బుక్ ఆగడాలు తప్పడం లేదు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు ధన్య రాజేంద్రన్‌ వరకూ రెడ్‌బుక్‌ వేధింపులు వెళ్తడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

పలు వార్తలు, వీడియోలకు సంబంధించి ఆమె పోస్టులను తొలగించాలంటూ ఎఫ్‌బీఐ పేరుతో ఎక్స్‌కు ఏపీ పోలీసుల ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసుల తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, గుంటూరులో ఎఫ్‌బీఐ ఎప్పుడు పెట్టారంటూ ప్రముఖుల విమర్శలు కురిపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై పీవీ రమేష్ సహా పలువురు రిటైర్డ్ ఆఫీసర్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఇదీ చదవండి: కరువు ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్‌ జగన్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement