‘ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడను’ | Ysrcp Leader Ambati Rambabu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడను’

Sep 18 2026 12:51 PM | Updated on Sep 18 2026 1:14 PM

Ysrcp Leader Ambati Rambabu Fires On Chandrababu

సాక్షి, గుంటూరు: రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఈ నెల 20 తేదీన గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించనున్న సమావేశానికి ఏర్పాట్లను నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ నూరి ఫాతిమా, వనమా బాల వజ్రబాబు, మాజీ కార్పొరేటర్లు పరిశీలించారు.

ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 76 వార్డులు ఉన్నాయి. రేపు సమష్టిగా పార్టీ శ్రేణులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఐక్యంగా రాబోయే ఎన్నికలకు వెళ్తున్నాం. ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వైఎస్‌ జగన్‌ సంక్షేమ కార్యక్రమాలతో ఈ కూటమి సర్కార్‌ పోటీ పడలేకపోతోంది. రాబోయే ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకోం. పోలీసులతో కట్టడి చేసే ప్రయత్నం చేస్తే సహించం’’ అంటూ అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.

దొంగ ఓట్లు ఉండటానికి వీల్లేదు. రాబోయే ఎన్నికల్లో ఒకరు ఒక ఓటు మాత్రమే వేయాలి. రెండో ఓటు వేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన నేను భయపడను. చెప్పాలి అనుకున్నది మేము ధైర్యంగా చెప్తాము. తండ్రి కొడుకులు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ఆఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement