సాక్షి, తిరుపతి: జిల్లాలోని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో కలకలం రేగింది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి రైల్వే స్టేషన్ పరిసరాల్లోని హైటెన్షన్ విద్యుత్ లైన్ పట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే, ఈ ఘటనతో రేణిగుంట స్టేషన్‌లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే, విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఆ వ్యక్తి అసోం రాష్ట్రానికి చెందినవాడిగా రైల్వే పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ఘటనకు గల కారణాలపై విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: నీకు నా మీద లవ్ తగ్గిపోయింది కదా...


