డోర్నకల్ ఎమ్మెల్యే కారులో మంటలు.. తృటిలో తప్పిన ‍ప్రమాదం | Power bank Fire In Dornakal MLA Ramachandru Naik Car | Sakshi
Sakshi News home page

డోర్నకల్ ఎమ్మెల్యే కారులో మంటలు.. తృటిలో తప్పిన ‍ప్రమాదం

Sep 17 2026 12:01 PM | Updated on Sep 17 2026 12:01 PM

Power bank Fire In Dornakal MLA Ramachandru Naik Car

సాక్షి, మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్‌ ఒక్కసారిగా పేలడంతో కారు క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా చింతపల్లి గ్రామ పరిసరాల్లో చోటుచేసుకుంది.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొని జెండా ఆవిష్కరించేందుకు మహబూబాబాద్ కలెక్టరేట్‌కు ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ బయలుదేరారు. అయితే, చింతపల్లి వద్దకు రాగానే ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో ఒక్కసారిగా కేబిన్‌లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఎమ్మెల్యే, సిబ్బంది వెంటనే వాహనం నుంచి బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. అయితే, డ్రైవర్‌కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి.

భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం పెద్దదిగా మారలేదు. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిసి అధికారులు, స్థానికులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పవర్ బ్యాంక్‌ పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Video Credit: Telugu Scribe

ఇదీ చదవండి: మా ఆస్తులపై అసెంబ్లీలో చర్చకు సిద్దం: కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement