మైన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు పిల్లల తల్లి తన అల్లుడితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తోందన్న ఆరోపణలు కుటుంబంలో కలకలం రేపాయి. ఖర్గ్‌జిత్ నగర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పిల్లలు తీవ్రంగా వ్యతిరేకించి గొడవకు దిగారు. చివరకు పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఘిరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఆ మహిళకు, కురావలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోనాయ్ అశోక్‌పూర్ గ్రామానికి చెందిన ఆమె అల్లుడికి మధ్య సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారని, కలిసి జీవించడంపై కూడా చర్చించుకున్నారని తెలిపారు. ఈ విషయం పిల్లలకు తెలియడంతో వారు తల్లి నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
గొడవ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ఖర్గ్‌జిత్ నగర్‌కు చేరుకున్నారు. అక్కడున్న వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. మహిళతో పాటు ఆమె అల్లుడిని కూడా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. వారిద్దరి మధ్య సంబంధం ఏమిటి? కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు.
అలీగఢ్‌లోనూ ఈ తరహా ఘటన
2025 ఏప్రిల్‌లో అలీగఢ్‌లోని మద్రక్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఓ యువతికి వివాహం జరగాల్సి ఉండగా, ఆమె తల్లి అనిత తన కాబోయే అల్లుడు రాహుల్‌తో సన్నిహితంగా ఉంటోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారని తెలిపారు. అనంతరం అనిత ఇంటి నుంచి నగదు, నగలు తీసుకుని రాహుల్‌తో వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. తన ఇష్టప్రకారమే రాహుల్‌తో వెళ్లానని అనిత పేర్కొన్నది.
ఇదీ చదవండి: పురస్కారాల ఎంపిక విధానంపై అనంత్ నాగ్ కీలక వ్యాఖ్యలు


