జీబ్రా క్రాసింగ్ ఉప‌యోగించకుంటే ప‌దివేలు జ‌రిమానా! | Pedestrians Not Using-Zebra-Crossing-400 Dirhams-Fine-Abudhabi | Sakshi
Sakshi News home page

జీబ్రా క్రాసింగ్ ఉప‌యోగించకుంటే ప‌దివేలు జ‌రిమానా!

Sep 16 2026 11:47 PM | Updated on Sep 16 2026 11:47 PM

Pedestrians Not Using-Zebra-Crossing-400 Dirhams-Fine-Abudhabi

Photo Credit: Twitter

రోడ్డు దాటేట‌ప్పుడు ట్రాఫిక్ నియ‌మాల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని అబుదాబి పోలీసులు వాహ‌దారుల‌కు, పాదాచారుల‌కు గుర్తుచేశారు. ర‌హ‌దారి భ‌ద్ర‌త‌ను నిర్ధారించే చ‌ర్య‌ల్లో భాగంగా, సోష‌ల్ మీడియాలో పోలీసులు అవ‌గాహ‌న సందేశాన్ని విడుద‌ల చేశారు. నిర్ధేశిత ప్రాంతాల్లో ఉండే జీబ్రా క్రాసింగ్‌లను పాదాచారుల‌ను ఉప‌యోగించకుంటే వారికి ఇక‌నుంచి జ‌రిమానా విధిస్తామ‌ని పేర్కొన్నారు. 

యూఏఈ వ్యాప్తంగా, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించని లేదా నిర్దేశిత ప్రాంతానికి వెళ్లకుండా రోడ్లు దాటే పాదచారులకు 400 దిర్హమ్‌ల‌(భార‌త కరెన్సీలో రూ. 10వేలు) జరిమానా విధించబడుతుంది. ఇటువంటి ప్రవర్తనను అరికట్టి, సురక్షితమైన వాటిని ప్రోత్సహించడానికి ఎమిరేట్స్‌లోని అధికారులు అనేక హెచ్చరికలు జారీ చేశారు.

రోడ్లపై నడిచే పాదచారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని,  సిగ్న‌ళ్లు కూడళ్ల వద్ద వేగాన్ని తగ్గించాలని వాహ‌న‌దారుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇక పాదాచారుల‌ను ఉద్దేశించి పోలీసులు మాట్లాడుతూ.. నిర్దేశించిన క్రాస్‌వాక్‌లు, వంతెనలు, సొరంగాలను ఉపయోగించాలి. ముఖ్యంగా పాదాచారులు ట్రాఫిక్ లైట్ సంకేతాలను అనుసరించండి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement