source: X
ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ 2026 విజేతగా నేపాల్ జట్టు అవతరించింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో ఈ జట్టు యూఏఈపై 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, రెండో సారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్, ఓపెనర్ ఆసిఫ్ షేక్ (102) సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.
నేపాల్ ఇన్నింగ్స్‌లో గుల్సన్ ఝా (52) అర్ద సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ అర్జున్ కుమాల్ (43), రోహిత్ పౌడెల్ (40) కూడా ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. యూఏఈ బౌలర్లలో ఇబ్రార్ అహ్మద్ 4 వికెట్లతో రాణించగా.. ఖుజైమా తన్వీర్ 2, హైదర్ అలీ, అదీబ్ ఉస్మానీ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో యూఏఈ పెద్దగా పోరాడలేకపోయింది. 49.1 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ చోప్రా చివరి వరకు క్రీజ్‌లో నిలబడి సెంచరీ (100 నాటౌట్) పూర్తి చేసుకున్నాడు. మధ్యలో రాహుల్ సోహైబ్ ఖాన్ (52), ఖుజైమా తన్వీర్ (15)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు.
అయితే వీరితో పాటు ఆతర్వాత వచ్చిన ఆటగాళ్లు కూడా తర్వాత పెవిలియన్ బాట పట్టడంతో యూఏఈ ఓటమిపాలైంది. ఈ జట్టు పతనంలో నేపాల్ బౌలర్లంతా తలో చేయి వేశారు. కరణ్ 3 వికెట్లతో సత్తా చాటగా.. లలిత్ రాజ్‌బంషి 2, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్, రోహిత్ పౌడెల్, గుల్సన్ ఝా, బషీర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
కాగా, ఈ టోర్నీలో యూఏఈ, నేపాల్‌తో పాటు ఒమన్, కువైట్, ఖతార్, సింగపూర్, హాంగ్‌కాంగ్, మలేషియా, సౌదీ అరేబియా, బహ్రెయిన్ జటుల పోటీ పడ్డాయి. ఈ టోర్నీ తొలి ఎడిషన్ 2023లో జరగ్గా, అప్పుడు కూడా నేపాలే విజేతగా అవతరించింది. 2024 ఎడిషన్‌లో యూఏఈ ఛాంపియన్‌గా నిలిచింది.
ఇదీ చదవండి: క్రికెటర్ శ్రీశాంత్ ఇంట తీవ్ర విషాదం


