‘నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా’ : కేజ్రీవాల్‌ ట్వీట్‌ వైరల్‌ | Arvind Kejriwal heads to Goa, says will make big announcement today | Sakshi
Sakshi News home page

‘నేనో పెద్ద ప్రకటన చేయబోతున్నా’ : కేజ్రీవాల్‌ ట్వీట్‌ వైరల్‌

Sep 12 2026 1:06 PM | Updated on Sep 12 2026 1:24 PM

Arvind Kejriwal heads to Goa, says will make big announcement today

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ శనివారం సంచలన  ప్రకటన  చేశారు.  గోవాకు వెడుతున్నా.. పెద్ద ప్రకటన రానుంది అంటూ ట్వీట్‌ చేశారు. 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌  చేయనున్న కీలక ప్రకటన  ఏమిటా అన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది.  కేజ్రీవాల్ రాకకు ముందు, స్థానికంగా, ఆప్‌ గోవా ఫార్వార్డ్ పార్టీ (GFP)లకు సంబంధించిన హోర్డింగ్‌లు దర్శనమివ్వడంతో  ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

తాను గోవా పర్యటనకు వెళ్తున్నట్లు వెల్లడిండిన కేజ్రీవాల్‌ దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు. రానున్న గోవా ఎన్నికల నేపథ్యంలోఈ ట్వీట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇది ఇలా ఉంటే "మిమ్మల్ని మూడవసారి మోసం చేయనివ్వకండి" అనే  స్లోగన్స్‌తో స్థానికంగా వెలసిన హోర్డింగ్‌లలో రెండు పార్టీల చిహ్నాలు ఉన్నాయి. 2027 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్,  విజయ్ సర్దేశాయి నేతృత్వంలోని GFP మధ్య ఎన్నికల పూర్వ పొత్తు ఉండవచ్చనే చర్చకు ఇది ఆజ్యం పోసింది.ఆదివారం జరగనున్న విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగించనున్నారని, ఆ సందర్భంగా రెండు పార్టీల మధ్య పొత్తును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెందిన ఒక సీనియర్ నేత తెలిపారు.  అంతేకాదు  ఈ పొత్తును బీజేపీ,కాంగ్రెస్ రెండింటికీ ప్రత్యామ్నాయంగా  ఉండబోతోందని కూడా పేర్కొన్నారు.

అలాగే శ్రీ గురుసాహిబ్ జీ సదా మనకు తోడుగా ఉంటూ, ప్రతి అడుగులోనూ మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అంటూ మరో ట్వీట్‌ చేశారు కేజ్రీవాల్‌. 

ఇదీ చదవండి: కలకలం : భార్య, ముగ్గురు కుమార్తెల్ని హత్య చేసి పరార్‌

కాగా గోవా శాసనసభ ఎన్నికలు 2027 మార్చిలోపు జరగాల్సి ఉంది. ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన ఆప్‌ అధినేత గోవాలొ అధికారి పీఠాన్ని దక్కించుకోవాలని పథక రచన  చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే కొన్ని హామీలను గుప్పించారు కూడా. గోవాలో ఆద్మీ పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోగా E20 పెట్రోల్ బ్యాన్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒక వేళ తాము ఈ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైతే రాజికీయాలనుంచి తప్పుకుంటానని  కూడా ప్రకటించారు.  E20 పెట్రోల్‌ కారణంగా వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనీ,  E20 వల్లే చక్కెర ధరలూ పెరుగుతున్నాయని ఆరోపిస్తున్న ఆప్‌ E20పై  జాతీయ ప్రచారాన్ని కూడా చేపట్టింది.

ఇదీ చదవండి : నటి అమీషా తల్లి డైమండ్‌ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement