బ్రిక్స్‌ సదస్సు: భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌ | BRICS Summit 2026: Chinese President Xi Jinping arrives in Delhi | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌ సదస్సు: భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌

Sep 12 2026 12:00 PM | Updated on Sep 12 2026 12:14 PM

BRICS Summit 2026: Chinese President Xi Jinping arrives in Delhi

సాక్షి, న్యూఢిల్లీ: బ్రిక్స్‌ శిఖరాగ సదస్సు-2026లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పిన్‌ ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన భారత అధికారులు స్వాగతం పలికారు. బ్రిక్స్‌లో భాగంగా.. సాయంత్రం జిన్‌పింగ్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. 

పాలమ్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయిన ఎయిర్‌ చైనా ప్రత్యేక విమానంలో జిన్‌పింగ్‌తో పాటు సుమారు 400 మందితో కూడిన భారీ బృందం భారత్‌కు వచ్చింది. భారత అధికారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో సాదర స్వాగతం పలికారు. మోదీతో జరిగే ద్వైపాక్షిక భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇరు దేశాల సంబంధాల మెరుగుదలతో పాటు వాస్తవాధీన రేఖ (LAC) పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.

గాల్వాన్‌ ఘటన నేపథ్యంలో.. దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌కు రావడం గమనార్హం. ఆ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ భారత్‌ మండపం వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సు ఇవాళ మధ్యాహ్నాం 2గం.లకు ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు ఆ సమావేశాలు జరగనున్నాయి. 

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనకు ముందు బీజింగ్‌ కీలక సందేశం ఇచ్చింది. రెండు దేశాలు పరస్పర విశ్వాసాన్ని పెంచుకుని, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చైనా పేర్కొంది. భారత్‌–చైనా సంబంధాలు సుస్థిరంగా, ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడం ఇరు దేశాల ప్రయోజనాలకు మాత్రమే కాకుండా ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కూడా కీలకమని స్పష్టం చేసింది.

ఇటు చైనా, భారత్‌ కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నట్లు భారత్‌లో చైనా రాయబారి షూ ఫెంగ్‌హాంగ్‌ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మార్గదర్శకత్వంలో ఇరు దేశాలు పరస్పర విభేదాలను సరిగ్గా పరిష్కరించుకుంటూ.. సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఇరాన్‌ అధ్యక్షుడి చేతిలో చెయ్యేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement