breaking news
BRICS Summit 2026
-
బ్రిక్స్‌తో మనకు లాభాలున్నాయండోయ్..!
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో మన దేశానికి పెద్దగా ఒరిగేదేం లేదని.. ఒకవేళ నిజంగా ప్రయోజనం ఉంటే అదేంటో చెప్పాలని కేంద్రానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సవాల్ విసిరారు. అయితే దీనికి బీజేపీ తీవ్రంగా స్పందించింది. అదే టైంలో.. కాంగ్రెస్ నుంచే కౌంటర్ రియాక్షన్ వచ్చింది. చిదంబరం వేసిన ప్రశ్నలకు సొంత పార్టీకే చెందిన మరో సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బదులిచ్చారు. ఆ ప్రయోజనాలు ఇవేనంటూ వివరించారు. ఈ వేదిక భారత్ దౌత్యపరమైన ప్రభావాన్ని, ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురాగల సామర్థ్యాన్ని చాటుతుందని పేర్కొన్నారు.‘గ్లోబల్ సౌత్‌కు కీలక వేదిక’ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ముందు మాట్లాడిన థరూర్.. గ్లోబల్ సౌత్‌కు బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదిక అని చెప్పారు. విస్తరించిన బ్రిక్స్‌లో 11 దేశాలు ఉన్నాయని, ఇవి ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయని వివరించారు. ఇలాంటి దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం చిన్న విషయం కాదన్నారు.‘ప్రపంచ వేదికపై భారత్ దౌత్య బలం’బ్రిక్స్ సదస్సుకు పలువురు దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు హాజరవుతుండటం భారత్‌కు ప్రతిష్టాత్మక విషయమని థరూర్ అన్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత్ ‘డిప్లొమాటిక్ కన్వీనింగ్ పవర్’ను చూపిస్తుందని పేర్కొన్నారు. అయితే బ్రిక్స్‌లో అన్నీ సానుకూల అంశాలే లేవని కూడా స్పష్టం చేశారు.ఇదీ సవాల్.. ఏకాభిప్రాయం కష్టమే!విభిన్న దేశాలు, విభిన్న ప్రయోజనాలు ఉన్నందున కీలక అంతర్జాతీయ అంశాలపై ఏకాభిప్రాయం సాధించడం బ్రిక్స్‌లో పెద్ద సవాలని థరూర్ అన్నారు. మేలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరాన్-యూఏఈ మధ్య విభేదాల కారణంగా ఉమ్మడి ప్రకటన వెలువడలేదని గుర్తుచేశారు. దీంతో భారత్ చైర్ ప్రకటనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా సదస్సులోనూ అలాంటి పరిస్థితి వస్తే అది బ్రిక్స్ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందన్నారు.చిదంబరం ఏమన్నారు?ఇటీవల చిదంబరం మాట్లాడుతూ.. గత రెండు, మూడు బ్రిక్స్ సదస్సుల నుంచి భారత్‌కు వచ్చిన స్పష్టమైన ప్రయోజనాలు తనకు కనిపించలేదన్నారు. బ్రిక్స్‌తో పాటు ఎస్సీఓ, జీ20, క్వాడ్‌లో భారత్ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. వాటి నుంచి దేశానికి వస్తున్న స్పష్టమైన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.వాణిజ్య లోటుపైనా థరూర్ ఆందోళనమరోవైపు బ్రిక్స్ దేశాలతో భారత్ వాణిజ్యం పెరుగుతున్నప్పటికీ.. అది పూర్తిగా భారత్‌కు అనుకూలంగా లేదని థరూర్ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులు తగ్గుతుండగా.. దిగుమతులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. అంటే బ్రిక్స్ వేదిక భారత్‌కు దౌత్యపరంగా ప్రాధాన్యమైనదే అయినప్పటికీ.. వాణిజ్యపరంగా మరింత సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నది థరూర్ వ్యాఖ్యల సారాంశం.ఇదీ చదవండి: పార్టీ కంటే పిల్లనిచ్చిన మామే ఎక్కువయ్యాడా? -
జిన్‌పింగ్ భారత్ పర్యటనపై సస్పెన్స్.. చైనా వ్యూహం ఇదేనా?
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు బీజింగ్ చివరి నిమిషంలో అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అందరి చూపూ మోదీ-జిన్‌పింగ్ భేటీపై పడింది. అసలు ఇంత కీలకమైన పర్యటనను చైనా చివరి వరకు ఎందుకు సస్పెన్స్‌లో పెట్టింది? ఇదే ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.2019లో మహాబలిపురం అనధికారిక సమావేశం తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. గాల్వాన్ ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలు ఇటీవల క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, జిన్‌పింగ్ పర్యటనకు కేవలం 48 గంటల ముందే అధికారిక ప్రకటన రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.చివరి నిమిషం వరకు ఎందుకు?జిన్‌పింగ్ పర్యటనను ఆలస్యంగా ప్రకటించడం వెనుక ఎలాంటి అనిశ్చితి లేదని.. ఇది చైనా అనుసరించే దౌత్య వ్యూహంలో భాగమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సదస్సుకు ముందు జరిగే చర్చల్లో తనకు గరిష్ఠ స్థాయి వెసులుబాటు ఉండేలా బీజింగ్ వ్యవహరించిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. బ్రిక్స్ డిక్లరేషన్, సదస్సు అజెండా, మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ వంటి కీలక అంశాలపై చివరి వరకు చర్చలు కొనసాగించేందుకు ఈ సస్పెన్స్ చైనాకు ఉపయోగపడిందనే విశ్లేషణలు ఉన్నాయి.NOW:🇨🇳🤝🇮🇳 Chinese President Xi Jinping is coming to India for the first time post Covid for BRICS summit. pic.twitter.com/8CkwJ8MeLu— RealWestern (@RealWestern2003) September 11, 2026భేటీలో ఏం జరుగుతుంది?అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మోదీ-జిన్‌పింగ్ భేటీలో సరిహద్దు పరిస్థితి, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గాల్వాన్ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోలేదు. దీంతో ఈ సమావేశంలో ఇరువురు నేతలు ఇచ్చే సంకేతాలు అత్యంత కీలకం కానున్నాయి.బ్రిక్స్ వేదికగా చైనా మరో వ్యూహంబ్రిక్స్లో ఇప్పుడు 11 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ద్వారా గ్లోబల్ సౌత్‌లో తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా కీలక దేశాల నేతలు పాల్గొంటున్న నేపథ్యంలో జిన్‌పింగ్ హాజరు చైనా దౌత్యానికి కూడా కీలకమే. అందుకే చివరి నిమిషం వరకు సస్పెన్స్.. ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడినట్టు తెలుస్తోంది. జిన్‌పింగ్ భారత్ పర్యటన వెనుక అసలు ఫోకస్ బ్రిక్స్ సదస్సేనా? లేక మోదీతో కీలక ద్వైపాక్షిక డీల్‌కు రంగం సిద్ధమైందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్ -
భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్ పర్యటన సాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్ సదస్సులో కీలకంగా మారనున్నాయి.మోదీ–పుతిన్ భేటీలో కీలక అంశాలుపుతిన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది.President Putin arrives in New Delhi:Government Il-96 landed at the base of the air force of the Republic of Palam.(3:54 am, Delhi time)NEW DELHI, September 11. /TASS/. Russian President Vladimir Putin arrived in India, in the capital of which New Delhi the BRICS summit… https://t.co/K9ZBz6ZsHk pic.twitter.com/tnM4Q7pHIM— ⏳Towhee 🌏☮️ (@amborin) September 10, 2026రక్షణ రంగంలో బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్‌కు మిగిలిన ఎస్–400 వ్యవస్థల సరఫరా, సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి. భారత్‌లో కొత్త సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం.ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్పింగ్పుతిన్ మాత్రమే కాదు బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా హాజరుకానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం.. బ్రిక్స్‌కు సవాల్ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సదస్సుకు కీలక సవాల్‌గా మారాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో అమెరికా వాణిజ్య, సుంకాల విధానాలు కూడా బ్రిక్స్ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది.విస్తరించిన బ్రిక్స్.. పెరిగిన ప్రాధాన్యంబ్రిక్స్లో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారం, ఇంధనం, విపత్తుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది.రెండు రోజులపాటు కీలక భేటీలుభారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ నేతలు రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, మానవతా సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది.బ్రిక్స్ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది. పుతిన్‌తో మోదీ భేటీ, ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా.. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ పరిణామాలు, వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పుతిన్–మోదీ భేటీతోపాటు భారత్ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: మిస్టర్ సింగ్.. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ల్యాండ్ -
రేపటి నుంచే బ్రిక్స్ సదస్సు
న్యూఢిల్లీ: భారత్ అతిథ్యం ఇవ్వనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శనివారం, ఆదివారం జరిగే ఈ సదస్సుకు చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తదితరులు హాజరు కాబోతున్నారు. షీ జిన్‌పింగ్ భారత్‌లో అడుగుపెడుతుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పె రుగుతున్న ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా విధిస్తున్న సుంకాల ప్రతికూల ప్రభావాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండు రోజుల బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై కూటమి సదస్సులో చర్చించబోతున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా ఇందులో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం కూడా భాగస్వామ్య దేశాలుగా మారాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతి నిధ్యం వహిస్తోంది. 11 ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో బలమైన కూటమిగా ఆవిర్భవించింది. భారత్ బ్రిక్స్‌లో వ్యవస్థాపక సభ్య దేశం. 2012, 2016, 2021లో కూటమికి సారథ్యం వహించింది. ఇప్పుడు నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఈసారి ‘సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం’అనే ఇతివృత్తంతో బ్రిక్స్ సదస్సు శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7.30 గంటలకు ప్రధాని మోదీ ఏర్పాటు చేసే విందుతో మొదటి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. రెండో రోజు ఆదివారం పలు సమావేశాలు, చర్చలు జరుగుతాయి. ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’విడుదలతో సదస్సు ముగుస్తుంది. నేడే పుతిన్ రాక రష్యా అధినేత పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున భారత్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఆయన మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని రష్యా ప్రతినిధి యురీ ఉషకోవ్ తెలిపారు. శుక్రవారం వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో పుతిన్ ప్రసంగించనున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3.30 గంటలకు పుతిన్‌తో, సాయంత్రం 6.15 గంటలకు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ అవుతారు. జిన్‌పింగ్, మోదీ ప్రత్యేక భేటీ! ఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. సదస్సు సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకు జిన్‌పింగ్, నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారని సమాచారం. జిన్‌పింగ్ భారత పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. రెండు ఆసియా అగ్రరాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి జరుగుతున్న ప్రయత్నంగా పేర్కొంటున్నారు. జిన్‌పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. బ్రిక్స్‌కు అంతా సిద్ధం: మోదీ బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్‌ను సైతం షేర్ చేశారు.


