సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో మకూన్స్ ప్లే స్కూల్‌లో మూడేళ్ల బాలుడిని టీచర్, కేర్ టేకర్ దారుణంగా కొట్టిన ఉదంతంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. ఆ ప్లేస్కూల్ ప్రాంగణాన్ని తక్షణమే సీల్ చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) స్పందిస్తూ, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ద్వారా స్కూల్ సీలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఢిల్లీలో ఒక ప్లేస్కూలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రిళ్లు నిద్రపోకుండా, భయంతో వణికిపోతున్న తమ బిడ్డను చూసి అనుమానం వచ్చిన తల్లితండ్రులు ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. భయంతో గడిచిన 15 రోజులుగా సరిగ్గా స్నానం కూడా చేయలేకపోతున్నాడని, వాష్‌రూమ్‌లోకి వెళ్లడానికి భయపడుతున్నాడని బాలుడి తండ్రి వాపోయారు.
A three-and-a-half-year-old boy was allegedly physically and sexually assaulted and mentally harassed at a private playschool in northeast Delhi's Maujpur, with CCTV footage purportedly showing him being tied to a chair, kicked and held by his ears.
Police have registered a case… pic.twitter.com/TaLzjs8XNk— Hate Detector 🔍 (@HateDetectors) August 31, 2026
ఇదీ చదవండి: లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
Delhi Government has taken serious cognisance of the deeply disturbing incident reported from a play school in Maujpur.
On the directions of Chief Minister Smt. Rekha Gupta, the District Magistrate has initiated proceedings to seal the premises of the school. Police…— CMO Delhi (@CMODelhi) August 31, 2026
అంతేకాదు బాలుడిని ఆసుపత్రికి తీసుళ్లడంతో మరో ఘోరం బయటపడింది. బాలుడి రెండు చెవుల కర్ణభేరిలువాచినట్లు వైద్యులు తెలిపారు. అతని ముఖం, చేతులపై స్పష్టమైన గాయాల గుర్తులు కనిపించాయి. దీంతో తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. తమకేం తెలీదంటూ యాజమాన్యం బుకాయించడంతో తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీ కావాలని డిమాండ్‌చేశారు. అది ఇవ్వాలంటే రూ.1,500 చెల్లించాలని స్కూల్ యాజమాన్యం చెప్పింది. ఆ నగదు చెల్లించి ఫుటేజీ తెప్పించి ఆగస్ట్ 16, 17, 18 తేదీల దృశ్యాలను పరిశీలించగా అసలు సంగతి బయటపడింది. బాలుడిని చిన్న చైర్‌కు కట్టేసి మూడు గంటల వ్యవధిలో పలుమార్లు కొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇదేంటని స్కూలు యాజమాన్యాన్ని నిలదీస్తే పిల్లాడు బాగా అల్లరి చేస్తుంటే మందలించామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
#WATCH | Delhi | On play school Attendant arrested for allegedly abusing 3-year-old boy in Maujpur, Navneet Chaudhary, father of 3-year-old boy, says, “…The child had been troubled for several days… Then, suddenly, on 18 August, my son came home from school. As soon as he got… https://t.co/wu7RfIAjo0 pic.twitter.com/vmILhjfgcC
— ANI (@ANI) August 31, 2026
దీనిపై బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదుచేశారు. కేర్‌టేకర్‌ను అరెస్ట్‌చేసి స్కూల్ డైరెక్టర్ సునీతా బన్సల్, ప్రిన్సిపల్ నీలమ్, ఉపాధ్యాయులు సిమ్రాన్, పూజలపై కేసు నమోదుచేశారు. పోక్సో చట్టంతోపాటు భారతీయ న్యాయసంహిత సెక్షన్ల కింద కేసు వేసి దర్యాప్తు ఆరంభించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలమేరకు పాఠశాల ప్రాంగణాన్ని సీజ్‌చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఘటనలో అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించేందుకు పాఠశాల ప్రాంగణాన్ని పోలీసులు సీజ్‌చేశారు. పాఠశాల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను స్వాదీనంచేసుకున్నారు.
ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’


