అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..! | Devotees get munch at this Kerala temple Goes Viral | Sakshi
Sakshi News home page

అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!

Aug 31 2026 9:28 AM | Updated on Aug 31 2026 9:32 AM

Devotees get munch at this Kerala temple Goes Viral

ఏ స్వామికైనా ప్రసాదం నారికేళం, అరటిపండ్లు వంటివి భక్తులు నివేదించడం చూశాం. అలాగే ఆలయంలో స్వామివారికి ప్రసాదంగా లడ్డూలు, చక్కెర పొంగలి, పరమాన్నం, పులిహోర, అటుకులు వంటివి నైవేద్యంగా పెడతారు. పురాతన ఆచారం, ఆలయం విశిష్టత అక్కడ కొలువైన స్వామి ఆధారంగా నైవేద్య సమర్పణ అనేది ఉంటుంది. ఆ తర్వాత దేవతకు సమర్పించిన ఆ నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తుంటారు. ఇది అత్యంత సర్వసాధారణం. దక్షిణాది వాళ్లు కార్తికేయ, సుబ్రమణ్యస్వామి, మరుగన్‌ వంటి పేర్లతో ఆరాధించే ఆ శరవణభవుడుకి అక్కడ ఏం సమర్పిస్తారో తెలిస్తే విస్తుపోతారు. అది కూడా ఓ చిన్నపిల్లవాడి కారణంగా ఆ పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం, ఆచారంగా మారడం విశేషం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందంటే..

కేరళలోని అలెప్పీలోని తెక్కన్ పళని సుబ్రహ్మణ్య స్వామి మహా క్షేత్రం అనే తలవాడి ఆలయం అత్యంత పురాతన ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది 300 ఏళ్ల నాటి పురాతన ఆలయం. ఇక్కడ కార్వికేయుడు బాలమురుగన్‌ రూపంలో భక్తుల పూజలందుకుంటున్నాడు. అయితే ఇక్కడ స్వామి వారికి మంచ్‌బార్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆఖరికి ఈ ఆలయానికి వచ్చే భక్తులు సైతం మంచ్‌ బార్‌లనే తీసుకొస్తుంటారు. అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి మొదలైందంటే..

ఆ బాలుడి కారణంగా..
స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. ఒక ముస్లిం బాలుడు ఆడుకుంటూ..ఆ ఆలయ గంటను మోగించడంతో అతని తల్లిదండ్రులు మందలించారు. ఆ రాత్రి అతనికి తీవ్ర జ్వరం రావడంతో, కలవరింతల్లో మురుగని నామస్మరణ చేశాడు. మరుసటి రోజు తల్లిదండ్రులు అతన్ని ఆలయానికి తీసుకురాగా, పూజారి ఏదైనా స్వామివారికి నివేదించండి అని చెప్పగా ఆ బాలుడు పట్టుబట్టి మరి తన వద్ద ఉన్న 'మంచ్' చాక్లెట్‌ను సమర్పించాడు. ఆనాటి నుంచి స్వామివారికి మంచ్‌ చాక్లెట్‌లు సమర్పించడం ఆచారంగా మారింది. 

అంతేగాదు స్వామివారికి పూలదండలకు బదులుగా మంచ్‌ చాక్లెట్ల దండనే సమర్పిస్తారు. ఆ కారణంగానే ఈ ఆలయానికి ‘మంచ్ మురుగన్’ ఆలయం అని పేరొచ్చింది. అయితే ఇటీవల ఈ ఆలయాన్ని రేహా అదానీ అనే కంటెంట్‌ క్రియేటర్‌ దర్శించుకుంది. అక్కడ స్వామివారికి మంచ్‌ చాక్లెట్లు సమర్పించడం చూసి ఆశ్చర్యంతో..ఆ స్వామివారి సందర్శనకు సంబంధించిన వీడియోని పంచుకుంది. అంతేగాదు తనకు ప్రసాదంగా పూజార్లు ఇచ్చిన మంచ్‌ చాక్లెట్‌ని చూపిస్తూ ఆనందంగా ఆస్వాదించింది. నెటిజన్లు కూడా తాము కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకున్నామని, అక్కడ మంచ్‌ చాక్లెట్లు చాలా రుచిగా ఉంటాయంటూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఆ అక్కా తమ్ముళ్లది విమాన బంధం..! ఇద్దరూ..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement