ఒక్క ఏడాది.. ఆరు కొత్త పేర్లు.. పాండవుల అజ్ఞాతవాస కథ ఇదే! | Pandavas Agnatavasa Names Roles Virata Kingdom Mahabharatam | Sakshi
Sakshi News home page

ఒక్క ఏడాది.. ఆరు కొత్త పేర్లు.. పాండవుల అజ్ఞాతవాస కథ ఇదే!

Aug 31 2026 9:28 AM | Updated on Aug 31 2026 9:29 AM

Pandavas Agnatavasa Names Roles Virata Kingdom Mahabharatam

భారత విజ్ఞానం

మాయాజూదంలో పాండవులు ఓడిపోయిన తర్వాత ఒప్పందం ప్రకారం 12 ఏళ్ళు అరణ్య వాసం, ఏడాది పాటు అజ్ఞాతవాసం చేశారు. ఈ సమయంలో వారు పాండవులు అని ఎవరికైనా తెలిసినట్లయితే మరో 12 ఏళ్లు అరణ్యవాసం, మరో ఏడాది అజ్ఞాతవాసం చేయాలనే నిబంధన ఉంది. అందువల్ల తాము ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం పాండవులు మత్స్యదేశాధిపతి అయిన విరాటరాజు కొలువులో ఏడాది పాటు అజ్ఞాతవాసం చేసారు. ఆ సమయంలో పాండవులు విభిన్న పేర్లతో వారి వారి వృత్తులను నిర్వహించారు. వారి పేర్లు, నిర్వహించిన వృత్తులను ఇప్పుడు తెలుసుకుందాం.

  • ధర్మరాజు కంకు భట్టు పేరుతో యతి వేషంలో తనకున్న విద్యతో విరాట రాజుకు వినోదం కలిగించేవాడు.

  • భీముడు వలలుడు పేరుతో విరాట రాజు కొలువులో వివిధ రకాల రుచికరమైన వంటలు చేసి మెప్పించేవాడు.

  • అర్జునుడు బృహన్నలగా రూపం మార్చుకుని విరటుని కొలువులో యువతులకు నాట్యంలో శిక్షణ ఇచ్చేవాడు.

  • ఇక నకులుడు దామగ్రంథిగా పేరు మార్చుకుని విరటుని ఆస్థానం లో అశ్వశాల విధులు నిర్వహించాడు. అశ్వాలకు శిక్షణ ఇచ్చేవాడు.

  • సహదేవుని తంత్రీపాలుడనే పేరుతో పశువుల శాలకు అధిపతిగా ఉంటూ పశుపోషణ చేస్తూ గోపాలకుడిగా విధులు నిర్వహించాడు.

  • పాండవుల భార్య ద్రౌపది మాలిని పేరుతో విరాట రాజు భార్య సుధేష్ణ అంతఃపురం లో (సైరంధ్రి)గా మాలలు అల్లేలా... రాణిగారికి ప్రధాన పరిచారికగా విధులు నిర్వహించింది. (నేటి పరిభాషలో చె΄్పాలంటే మేకప్‌ ఉమన్‌గా అన్నమాట.

– సి. ఎన్‌. మూర్తి, సీనియర్‌ పాత్రికేయులు

ఇవి కూడా చదవండి: ఒక్క వృద్ధుడి నమ్మకం.. మొత్తం గ్రామం తలరాతనే మార్చింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement