breaking news
Devotion
-
ఘనమైన ఆసనం
గణేష్ వేడుకలలో ప్రధానంగా కనిపించేది అలంకరణ. గణనాథుడి ప్రతిమతోపాటు ఆసనం, బ్యాక్‌గ్రౌండ్, చుట్టూ రంగురంగుల పువ్వులు, కాంతులీనే లైట్లు... కనువిందు చేస్తుంటాయి. మండపాల వద్ద సరే, ఇళ్లలోనూ ఈ విధమైన అలంకరణ సందడి కనిపించాలంటే..?ఎక్కువ హంగామా లేకుండా అలంకరణ ఆకట్టుకునేలా ఉండేలా భిన్నమైన ఆసనాల స్టాండ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈవెంట్ ప్లానర్స్ వీటిని మరింత అందంగా రూపుకట్టి మన ముందుకు తీసుకు వస్తున్నారు. ముత్యాలు, రత్నాలు, జరీ, వెల్వెట్, మిర్రర్ వర్క్ వంటి వాటితో రూపొందించే ఈ ఆసనాలు చిన్న వినాయక విగ్రహాలకు చక్కగా అమరుతున్నాయి. ముఖ్యంగా తక్కువ స్థలంలో పూజ చేసుకునే వారికి ఇవి ఉపయుక్తం కూడా. అందమైన పువ్వులు... ఆర్టిఫిషియల్ రోజాలు, మల్లెలు, చామంతులు, పచ్చని ఆకులతో తయారు చేసిన ఆసనం వినాయకుడి చుట్టూ పూల వేదికలా కనిపిస్తుంది. పండుగ తర్వాత ఈ ఆసనం సెట్‌ను స్టోర్ చేసుకుంటే ఇతర పూజ లు లేదా ఇంటి అలంకరణ ల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆసనాలు కానుక గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.స్థలానికి తగ్గట్టు ... ఫ్లాట్లు, అపార్ట్మెంట్లలో స్థలం పరిమితంగా ఉంటుంది. అందుకు తగినట్టు అలంకరణ చేయాలన్నా అందరికీ కుదరదు. అందుకని, చిన్న సైజు ఆసనాలు మార్కెట్లోకి వచ్చాయి. టేబుల్, షెల్ఫ్ లేదా చిన్న పూజా స్థలంలో కూడా వీటిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.సంప్రదాయం.. ఆధునికత... గోల్డ్ లేదా కాపర్ ఫినిష్‌తో ఉండే ఆర్టిఫిషియల్ ఆసనాలు గణేషుడి ప్రతిమకు రాజసాన్ని జోడిస్తాయి. మరోవైపు వుడ్, జూట్, పేస్టెల్ పూలతో రూపొందించిన ఆసనాలు మినిమల్ హోమ్ డెకార్‌ను ఇష్టపడేవారికి నచ్చుతాయి. అయితే ఆసనం ఎంచుకునేటప్పుడు విగ్రహం పరిమాణానికి తగిన సైజు ఉండేలా చూసుకోవాలి. ప్రతిమ ఎంత అందంగా ఉన్నా, దానికి తగిన ఆసనం ఆ అలంకరణకు మరింత ప్రత్యేకతను, ఇంటికి స్పెషల్ లుక్ తీసుకొస్తుంది.సులభంగా అలంకరణ కృష్ణాష్టమి, గణేష్ చతుర్ధి, వరలక్ష్మి.. వంటి సంప్రదాయ వేడుకలలో ప్రతిమలకు ఈ డెకార్ ఆసనాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి పూర్తిగా చేతితో తయారు చేసినవి. సులభంగా అమర్చుకోవచ్చు, విడదీసి స్టోర్ చేసుకోవచ్చు. పండగ శోభ కోసం తయారు చేసిన ఈ అలంకరణలలో పూసలు, లేసులు, కుందన్స్, మఖమల్ క్లాత్‌తోపాటు ఖరీదైన స్టోన్స్ కూడా ఉపయోగించి డిజైన్ చేస్తున్నాం. – లక్ష్మి సింగ్లా, డెకార్ క్రియేషన్స్ – నిర్మలారెడ్డిచదవండి: చింతలు దూరం చేసే.. ఉత్తరాల గణపయ్య! -
గాడ్జెట్ల గల్లీలో బప్పా ఎంట్రీ!
ఇంటికి గణపయ్య వచ్చారంటే పండగ కళ రావాల్సిందే! ఇప్పుడు ఆ కళను కాస్త స్మార్ట్‌గా పెంచే చిట్టి గాడ్జెట్లు ఇవిగో... దరలో చిన్నవి, పండుగ పనిలో మాత్రం పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి.బప్పా మండపంలో బీట్ అదిరిపోవాల్సిందే! పిల్లల వినాయక మండపం అంటే పూజలతో పాటు ఆటలు, పాటలు, సందడి కూడా ఉండాల్సిందే! మరి ఆ చిన్నారుల సందడికి పెద్ద సౌండ్ సిస్టమ్ ఎందుకు? తక్కువ ఖర్చులో ఈ చిన్న బ్లూటూత్ స్పీకర్ చాలు! 10 వాట్ల సౌండ్‌తో భక్తి పాటలు, గణేశ్ పాటలు, పిల్లల ఫేవరెట్ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. మ్యూజిక్కు తగ్గట్టు రంగురంగుల డిస్కో లైట్లు మెరుస్తూ ఉంటే... చిన్న మండపమే మినీ డ్యాన్స్ ఫ్లోర్లా మారిపోతుంది! ఫోన్‌తో బ్లూటూత్ ద్వారా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. చిన్న సైజులో ఉండటంతో పిల్లలు నిర్వహించే చిన్న వినాయక మండపాలకు ఇది బాగా సరిపోతుంది. పైగా పెద్ద స్పీకర్లు, ఖరీదైన సౌండ్ సిస్టమ్‌లకు అయ్యే ఖర్చు కూడా ఉండదు. ధర కేవలం రూ.500 మాత్రమే!గణపయ్యకు... మేకప్ రెడీ!గణపయ్యను తీసుకొచ్చాక... ఆయన మండపం అలంకరణే అతిపెద్ద టాస్క్! పూలు, లైట్లు, అలంకరణ సామాన్లు అంటూ మార్కెట్ చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా... గణపయ్య వెనుక ఈ మండపం పెట్టేస్తే పూజా స్థలానికే ఓ పండగ లుక్ వచ్చేస్తుంది. కాగితంతో తయారైన ఈ పర్యావరణహిత అలంకరణను 9 నుంచి 16 అంగుళాల విగ్రహాలకు సరిపడేలా రూపొందించారు. కొద్ది నిమిషాల్లోనే కుటుంబంతో కలిసి దీన్ని తయారు చేసుకోవచ్చు కాబట్టి... పిల్లలకు ఫన్, పెద్దలకు డెకరేషన్ బాధ్యత రెండూ ఒకేసారి! వాడిన తర్వాత మడిచి దాచుకోవచ్చు, పైగా వినాయక చవితి తర్వాతి పండుగల్లో మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ధర సుమారు రూ. 800.మంత్రాల మినీ మాస్టర్!గణపయ్యపై విపరీతమైన ప్రేమ ఉంది. కానీ మంత్రాలు రావా? పూజ చేయడం కూడా రాదా? పర్లేదు... ఇకపై పూజ చేయటానికి పూజారి కోసం వెతకాల్సిన పనిలేకుండా. ఈ చిన్న మంత్ర బాక్స్ పనిచేస్తుంది. ఇందులో 35 రకాల ముందే నిక్షిప్తమైన మంత్రాలు ఉండటంతో పూజ, ధ్యానం, జపం... ఏ సందర్భానికైనా వినొచ్చు. పెద్ద స్పీకర్ సెటప్ అవసరం లేదు. చిన్న సైజులోనే పూజ గదిలో చక్కగా సరిపోతుంది. బ్యాటరీ లేదా చార్జింగ్ టెన్షన్ లేకుండా నేరుగా విద్యుత్ సాకెట్‌కు అమర్చుకుని ఉపయోగించవచ్చు. కొన్ని క్షణాల్లోనే మనసు భక్తిమయంగా మారిపోయేలా, కావాల్సిన మంత్రాన్ని , శబ్దాన్ని మనకు నచ్చిన స్థాయిలో సర్దుకోవచ్చు. ధర రూ.300. -
దూర్వాంకుర మహిమ
కౌండిన్య మహర్షి గణేశుని పరమభక్తుడు. ఆయన తన ఆశ్రమంలోని గణేశ ప్రతిమకు దూర్వాంకురాలతో నిత్యం పూజించేవాడు. ఆయన భార్య ఆశ్రయ ఒకనాడు ‘స్వామీ! మీరు దూర్వాంకురాలతో గణేశుని ఎల్లప్పుడూ పూజిస్తుంటారు కదా, దూర్వాంకురాలు అంత మహిమాన్వితమైనవా?’ అని అడిగింది. కౌండిన్యుడు ఆమెకు దూర్వాంకుర మహిమ గురించి అనేక పురాణగాథలు చెప్పాడు. కౌండిన్యుడు చెప్పిన గాథలను ఆలకించినప్పటికీ ఆశ్రయకు దూర్వాంకుర మహిమ పట్ల మనసులో సంశయాలు తొలగిపోలేదు. కౌండిన్యుడు తన భార్య మనోగతాన్ని గ్రహించాడు. ఆమె సంశయాలు తొలగిపోవాలంటే, దూర్వాంకుర మహిమ ఎంతటితో ఆమెకు స్వయంగా తెలిసిరావాలి అని భావించాడు.కౌండిన్యుడు ఆమె చేతికి ఒక దూర్వాంకురాన్ని ఇచ్చి, ‘దేవీ! నువ్వు ఈ దూర్వాంకురాన్ని తీసుకుని ఇంద్రుడి వద్దకు వెళ్లు. దీనికి సరిసమానమైన స్వర్ణాన్ని నేను అడిగినట్లు అతడికి చెప్పుడు. ఈ దూర్వాంకురం కంటే ఏమాత్రం ఎక్కువ గాని, తక్కువ గాని స్వర్ణాన్ని స్వీకరించకు’ అని చెప్పాడు.భర్త ఆదేశంతో ఆశ్రయ దేవేంద్రుడి వద్దకు వెళ్లి, భర్త తనకు ఇచ్చిన దూర్వాంకురాన్ని అతడికి ఇచ్చి, ‘దేవేంద్రా! ఈ దూర్వాంకురానికి సరిసమానమైన స్వర్ణాన్ని తీసుకురమ్మని నా భర్త నీ వద్దకు పంపాడు. దీని కంటే నాకు లేశమైనా ఎక్కువా వద్దు, తక్కువా వద్దు’ అని పలికింది.‘సాధ్వీమణీ! ఈమాత్రం దానికి నువ్వు ఇక్కడి వరకు రావాలా? నీ భర్త ఆదేశమై సందేశాన్ని పంపితే, సాక్షాత్తూ స్వర్గాన్ని పంపమన్నా పంపుతాను కదా’ అని, ఒక దేవదూతను పిలిచి, ‘ఈ సాధ్వీమణిని కుబేరుని వద్దకు తీసుకుపోయి, ఈమెకు ఈ దూర్వాంకుర సమానమైన స్వర్ణాన్ని ఇవ్వమని నా ఆజ్ఞగా చెప్పు’ అని పంపాడు.దేవదూత ఆశ్రయను తీసుకుని కుబేరుడి వద్దకు వెళ్లి, దేవేంద్రుడి సందేశాన్ని చెప్పాడు. ‘దూర్వాంకుర సమానమైన స్వర్ణాన్ని కోరడానికి ఇంతదూరం వచ్చిన కౌండిన్య పత్నికి ఏమైనా మతిభ్రమణం కలిగిందా? ఈమెను నా వద్దకు పంపిన దేవేంద్రుడు ఏమైనా మాయలో పడ్డాడా?’ అని అనుకుని, కొద్దిసేపు ఆలోచించాడు కుబేరుడు.కేవలం దూర్వాంకుర పరిమాణంలోని స్వర్ణాన్ని మాత్రమే ఇచ్చి పంపిస్తే, ధనాధిపతి అయిన తన పరువు ఏం కావాలని భావించి, ఆశ్రయ ముందు అనేక మణుగుల బంగారం ఉంచాడు. ఆమెకు కాస్త ఆశ పుట్టినా, భర్త పట్ల భయం వల్ల ‘నా భర్త ఆదేశం మేరకు దూర్వాంకుర పరిమాణంలోని స్వర్ణమే చాలు. అంతకు ఎక్కువా వద్దు, తక్కువా వద్దు’ అని పలికింది.కుబేరుడు ఒక చిన్న త్రాసు తెప్పించి, ఒకవైపు దూర్వాంకురాన్ని ఉంచి మరోవైపు బంగారాన్ని వేయడం మొదలుపెట్టాడు. ఎంత బంగారం వేసినా, చాలడం లేదు. కుబేరుడు ఒక పెద్ద త్రాసు తెప్పించి బంగారం వేసినా, ఫలితం లేకపోయింది. ఈసారి మరింత భారీ తక్కెడను తెచ్చి, అందులో తన యావత్ సంపదను వేసినా, అదంతా దూర్వాంకురానికి సమానం కాలేదు. సర్వాలంకార భూషిత అయిన తన భార్యను తక్కెడలో కూర్చోబెట్టాడు, చివరకు తాను కూడా స్వయంగా కూర్చున్నాడు. అయినా దూర్వాంకురం ఉంచిన వైపు తక్కెడ పాత్ర వీసమంతైనా పైకి లేవలేదు. దిక్కుతోచని కుబేరుడు తన సాటి దిక్పాలకులకు, త్రిమూర్తులకు కబురు పెట్టాడు. వారందరూ తమ తమ సమస్త సంపదలను తీసుకువచ్చినా, ఫలితం కనిపించలేదు. వారందరికీ ఇదేదో పెనుమాయగా అనిపించింది.ఇదేదో కౌండిన్యుడినే అడిగి తెలుసుకోవాలని భావించి, దేవతలందరూ కలసి కౌండిన్యుడి వద్దకు వెళ్లారు. ‘మహానుభావా! పూర్వపుణ్యం వల్ల నీ దర్శనభాగ్యం లభించింది. నీ ధర్మపత్ని మా అహంకారాన్ని సర్వం హరించింది. మాకు దూర్వాంకుర మహిమ తెలియదు. త్రిలోకాలు కూడా దీని మహిమకు సాటిరావు. నువ్వు భక్తిగా గణేశుడి మస్తకాన్ని అలంకరించిన ఈ దూర్వాంకుర మహిమను ఎవరు తెలుసుకోగలరు? సమస్త యజ్ఞ, దాన, తపో, వ్రత, స్వాధ్యాయములలో ఏదీ దూర్వాంకుర సమర్పణకు సరిసాటి కాదు. శ్రీగణేశుని అనునిత్యం ఆరాధించే నీ మహిమను మాత్రం ఎవరు తెలుసుకోగలరు?’ అని కౌండిన్యుడిని కొనియాడారు. అనంతరం వినాయకుడిని వేనోళ్ల స్తుతించి, తమ తమ లోకాలకు తిరిగి వెళ్లిపోయారు.ఈ సంఘటనతో ఆశ్రయకు తన భర్త గణనాథుని అర్చనకు ఉపయోగించే దూర్వాంకుర మహిమ పూర్తిగా అవగతమైంది. ‘స్వామీ! మీ మాటలను శంకించాను, మన్నించండి.’ అని పలికింది. ఆమె కూడా భర్తతో కలసి దూర్వాంకురాలతో శ్రీగణేశుని భక్తితో అర్చించడం ప్రారంభించింది. ప్రతిరోజూ ఆ దంపతులు ప్రాతఃకాలంలో దూర్వాంకురాలతో గణపతిని అర్చించసాగారు. కొన్నాళ్లకు గణేశుడు వారికి మోక్షాన్ని అనుగ్రహించాడు.∙సాంఖ్యాయన -
శ్రీనాథ విరచిత వినాయక దండకం
జయ జయ జగదేక రక్షామణీ!దేవ చూడామణీ శ్రేణి శోణ ప్రభాజాల బాలా తప స్మేర పాదారవిందా!ముకుందప్రియా! యిందుధారీ!కటస్యంది దానాంబుధారా ధునీ ధోరణీ గాహ కౌతూహలాయత్త మత్త ద్విరేఫాంగనా గాన సంగీత రంగీకృతస్వాంత!దంతావ ళాస్యా! నమస్యా! త్రిలోకైక వశ్యా! యవశ్యాయ శైలాత్మజా ధర్మసంతాన!సంతాన కల్పద్రు పుష్పావతంసా! యసారోరు సంసార మాయాంధకారా హృతిప్రక్రియా భాస్కరా!కోటిభాస్వన్నిరాఘాట దేహ ప్రభాభాస్వరా! దేవ! హేరంబ! లంబోదరా! యేక దంతా! మహాకాయ! సంతప్త కార్తస్వరాభా!విశాలాక్ష మౌంజీధరా! నాగ యజ్ఞోపవీతా సమన్విత కృష్ణాజినా!యాఖువాహా! కుఠారాయుధా! విఘ్నరాజా! గణాధ్యక్ష!కారుణ్య లీలా కటాక్షంబునన్ మమ్ము వీక్షించి రక్షింపుమీ!క్షీర వారాళి నీ మందరక్ష్మాధర స్వామి కవ్వంబుగా, నీ భుజంగాధినాథుండు సూత్రంబుగా, గచ్ఛపాధీశుడాధార పీఠంబుగా, సర్వదివ్వౌషధీ వల్లులన్ వైచి, నానా పదార్థంబుల న్వెన్నలం బంచుకో గోరి యున్నార, మిక్కార్య మే విఘ్నముం బొందకుండంగ, నే విక్రియం జెంద కిష్టార్థ సంసిద్ధులం గైకొనుం గాక నీ యాజ్ఞ సర్వేశ సర్వాత్మకా!నిర్వికల్పా! నిరీహా! నిరాంతక! నిశ్శంక! యోంకార మూర్తీ! నమస్తే! నమస్తే! నమఃఇవీ చదవండి: వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు -
వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు
(శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి)ప్రతి ఏడాది వచ్చే వినాయకచవితి పర్వదిన శుభసందర్భంగా ప్రతి గృహంలోను, సంస్థల్లోనూ ప్రత్యేకంగా పూజాదికార్యక్రమాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పూజలో ఉపయోగించే పూజాద్రవ్యాలతో పాటుగా, స్వామివారిని పూజించే పత్రిది కూడా ప్రథమస్థానం. అందువల్ల ఈ పూజకు సమకూర్చుకోవలసిన అన్ని రకాల పూజాద్రవ్యాలు, పత్రి తదితరాలన్నీ మీకోసారి జ్ఞప్తికి తీసుకురావాలని ఈ క్రింద ఇస్తున్నాం. ఇవి నూతన గృహస్థులకు మరింత ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం.పూజా ద్రవ్యములు: వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.పూజా వస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడాకుల తోరణాలు, దేవునికి తగిన పీఠము.నైవేద్యం: ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి రకానికి 21 చొప్పున.పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు, ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడంæ శుభఫలదాయకం.గణేశుని పూజ (పూజకు ఏర్పాట్లు)ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃదీపారాధన: (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘పరిశుద్ధి: (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిఃపుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమఃశ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తువిఘ్నేశ్వరుని వ్రతకల్పముశ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘అగజానన పద్మార్కం గజానన మహర్నిశంఅనేక దన్తం భక్తానాం ఏకదన్త ముపాస్మహే ‘‘శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాఃశ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకఃలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననఃవక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజఃషోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపిఃవిద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ఆచమనంఓం కేశవాయ స్వాహానారాయణాయ స్వాహామాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి.గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమః వామనాయ నమఃశ్రీధరాయ నమః హృషీకేశాయ నమఃపద్మనాభాయ నమః దామోదరాయ నమఃసంకర్షణాయ నమః వాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమఃపురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమఃనారసింహాయ నమః అచ్యుతాయ నమఃజనార్దనాయ నమః ఉపేంద్రాయ నమఃహరయే నమః శ్రీ కృష్ణాయ నమః(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాఃయేతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)ప్రాణాయామంఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జపఃఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య .............. ప్రదేశే .............. – ............. నదీ మధ్యప్రదేశే (మీ ప్రస్తుత నివాస ప్రాంతం ఏ జీవనదుల మధ్య వున్నదో ఆ నదుల పేర్లు చెప్పుకోండి) స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, ఇందువాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధన కనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘(కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)తదంగ కలశపూజాం కరిష్యేః(మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితఃమూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాఃకుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణఃఅంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాఃగంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ!నర్మదే సింధు కావేరీ జలేస్మిం సన్నిధింకురు ‘‘అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి)శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను)గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాంఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పతఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాదనంఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)కుంకుమం సమర్పయామిగంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను)స్వామికి పుష్పాలతో పూజ (ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి (పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)దీపం దర్శయామి (దీపమును చూపవలెను)నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడి చేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను).ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహాశ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి(గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)వరసిద్ధి వినాయక పూజా ప్రారంభంస్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా ఃతావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురుధ్యానం: స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...) ప్రాణ ప్రతిష్ఠ: (స్వామి వారికి ప్రాణం పోయుట)ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః‘ పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత‘ మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘‘ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘పాద్యమ్: స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి)శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం ‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘అర్ఘ్యమ్: స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ఆచమనీయమ్: స్వామివారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనా«థం నమోస్తుతే‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానమ్ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ క్రింది చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘ శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సరస్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.) వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలనుగాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘గంధం: (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి.అక్షతలు: (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘సిందూరం: శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘మాల్యం: శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘ పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు).సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘అధాంగ పూజ: (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)గణేశాయ నమః పాదౌ పూజయామి‘ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘కామారిసూనవే నమః జంఘే పూజయామి‘అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘హేరంబాయ నమః కటిం పూజయామి‘లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘గణనాథాయ నమః హృదయం పూజయామి‘స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ఏకవింశతి పత్ర పూజఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజా సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి)⇒ ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)⇒ ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక)⇒ ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు)⇒ ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు)⇒ ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు)⇒ ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)⇒ ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి)⇒ ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి)⇒ ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)⇒ ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు)⇒ ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)⇒ ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ)⇒ ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు)⇒ ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం)⇒ ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు)⇒ ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)⇒ ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)⇒ ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు)⇒ ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)⇒ ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్ది)ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు)ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘ (21 రకముల ఆకులను కలిపి వేసి నమస్కారము చేయవలెను)ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!అఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామిశ్రీ గణపతి అష్టోత్తర శతనామావళిఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమఃఓం మహోదరాయ నమఃఓం మహోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళస్వరూపాయ నమఃఓం ప్రమధాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాటత్పయే నమఃఓం శ్రీపతయే నమఃఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బలాయ నమఃఓం బలోత్థితాయ నమఃఓం భవాత్మజాయ నమఃఓం పురాణ పురుషాయ నమఃఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చామీకరప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపన్యాసాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వనేత్రే నమఃఓం సర్వసిద్ధిప్రదాయ నమఃఓం సర్వసిద్ధయే నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం అక్షోభ్యాయ నమఃఓం కుంజరాసుర భంజనాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థ పనసప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం బ్రహ్మవిద్యాధిపాయ నమఃఓం విష్ణవే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం జితమన్మథాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం జ్యాయనే నమఃఓం యక్షకిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యే నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం దివ్యాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్తదేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విఘాతకారిణే నమఃఓం విశ్వక్‌దృశే నమఃఓం విశ్వరక్షాకృతే నమఃఓం కళ్యాణ గురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం అపరాజితే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమఃశ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.బిల్వం : శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి.ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు)దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమా సుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి‘‘నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి)ఓమ్ భూర్భువస్సువః ‘ ఓం తత్సవితుర్వరేణ్యంభర్గోదేవస్య ధీమహి ‘ ధియోయనః ప్రచోదయాత్ ‘‘(పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి)ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘ సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘(అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘శ్రీ గణేష ప్రార్థనతొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‘తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా!తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ ∙∙ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్నిటలాక్షు నగ్రసుతునకుపటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా!ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః నీరాజనమ్ : (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాష్ట్ర్య యాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి)మంత్రపుష్పమ్ : (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి)గణాధిప నమస్తేస్తుఉమాపుత్రా విఘ్ననాశన‘వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ఏకదంతైక వదన తథా మూషికవాహన‘కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘తన్నోదంతిః ప్రచోదయాత్‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.ఆత్మప్రదక్షిణ నమస్కారమ్ : (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు)ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే‘పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవఃత్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామిప్రార్థన(పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి)నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమఃప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘సాష్టాంగ నమస్కారమ్ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితంమయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతిసుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు.(నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశంమయా‘ దాసోయమితి మాంమత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి).(ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి)అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు.విఘ్నేశ్వరుని కథా ప్రారంభం(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను.పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనగా, అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా యుదరమందు నివసించియుండమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను.కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపిస్తుండగా, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అనిన పిదప, విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చెను. కావున శివునొసంగు’’ అనెను.ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసురగర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళెను. పిదప శివుడు నంది నెక్కి కైలాసమునకు వేగంగా బయలుదేరెను.వినాయకోత్పత్తికైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని చెప్పెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలముతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళెను. అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియసంభాషణములు ముచ్చటించుకొనుచుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చెను. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టి, అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను. విఘ్నేశాధిపత్యముఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరిరి. గజాననుడు తాను పెద్దవాడు గనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరెను. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు.సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో, వారికి యీ ఆధిపత్యం ఇచ్చెదను’’ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనము ఎక్కి వాయు వేగముగా వెళ్ళెను. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయయు తెలిపి రక్షింపవే’’ యని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను.‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణములు చేయుచూ కైలాసమున వుండెను. ఆ మంత్ర ప్రభావముతో∙అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించెను. ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుచూ, కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వుము’’ అని ప్రార్థించెను. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు.ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారము చేయబోగా ఉదరము భూమికి ఆని, చేతులు భూమికి అందవయ్యే, ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వెలసివున్న చంద్రుడు జూచి వికటంబుగ నవ్వెను. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలు కూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయి అతడు మృతుండయ్యెను. పార్వతి శోకించుచు చంద్రుని జూచి,‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’’ అని శపించెను. చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమైంది.ఋషీపత్నులకు నీలాపనిందలుఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడెను. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య(స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి సప్త ఋషులను సమాధానపరచెను. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీవిచ్చిన శాపము వలన లోకములకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపమునకు ఉపశమనము చెప్పెను. అంత బ్రహ్మాదులు సంతోషించి తమ గృహములకేగి, భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖముగా ఉండిరి.శమంతకోపాఖ్యానముయదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్న దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచిౖయె ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీ కృష్ణునకు తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఈ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణించెను. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకము సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వెళ్ళివుండెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుచూ తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు భావించిరి. అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి.ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను.కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః(తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.)అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను.ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనమొనర్చుకొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగెను. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవా! ఆర్తజనరక్షకా! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను.ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొనిరి. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన (కుమార్తె) సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను.శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను. ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు.సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయెను, ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్వుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద్వ యుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను.బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను.ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను.శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ బాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు, నివేదన మొనరింపవలెనని, సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను.అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను. భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను.ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖముగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపాఖ్యానములో శ్రీకృష్ణపరమ్మాత వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానమును అనగా అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయములతో శిరమున అక్షతలు ధరించిన యెడల చవితి చంద్రుని చూచిననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మహా భక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచుండెను.‘‘మంగళం మహత్’’ చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.– కథ సమాప్తం –పునఃపూజ ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి)విఘ్నేశ్వరుని మంగళహారతులుశ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం!నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘సురుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిçపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ‘‘ జయ ‘‘పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మి దానిమ్మపువ్వు గరిక మాచీపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ‘‘ జయ ‘‘పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ‘‘ జయ ‘‘దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ‘‘ జయ ‘‘మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ‘‘ జయ ‘‘ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ‘‘ జయ ‘‘వాయనదానముశ్లో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా!(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్.(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం)ఇదీ చదవండి: శ్రీనాథ విరచిత వినాయక దండకం -
విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు
మొట్టమొదటి పూజలందుకోవలసిన దైవం.. వినాయకుడేవిఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడుఆది దంపతులకు మానసపుత్రుడు.. ఓంకార స్వరూపుడు...జ్ఞానానికి, వివేకానికి ప్రతీక.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు..కార్యసిద్ధిని ప్రసాదించే సిద్ధివినాయకుడు..భక్తుల కోరికలను ఆలకించే మన గణపయ్య!ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా, విజయవంతంగా సాగాలంటే విఘ్ననాయకుడైన శ్రీగణేశుని అనుగ్రహం కావాల్సిందే. అందుకే దైవారాధనలో, పూజా కార్యక్రమాల్లో, సర్వశుభకార్యాల ప్రారంభంలో తొలి పూజలందుకునే దైవం వినాయకుడే.విఘ్నేశ్వరుని ఆరాధన కేవలం విఘ్నాలను తొలగించమని కోరడం మాత్రమే కాదు. మనలోని అజ్ఞానం, అహంకారం, అసహనం, తొందరపాటు వంటి అంతర్గత విఘ్నాలను తొలగించి, మంచి ఆలోచన, వివేకం, ఏకాగ్రత, ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించడం కూడా.పసుపు గణపతి – పవిత్రతకు ప్రతీకపార్వతీమాత చేతుల మీదుగా పసుపు ముద్దతో అవతరించి, మన ఇళ్లలో ‘‘పసుపు గణపతి’’గా తొలి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్ననివారకుడే కాక, విద్య, బుద్ధి, జ్ఞానాలను ప్రసాదించే జ్ఞానప్రదాతగా కూడా ఆరాధించబడుతున్నాడు.అందుకే, ‘కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ... ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!’ అంటూ మనం గణేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం.వినాయక చవితి – భక్తి, ఆనందాల పర్వదినంభాద్రపద శుద్ధ చవితి అనగానే ప్రతి ఇంటా వినాయక చవితి పండుగ సందడి కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తుంది. పండుగల ద్వారా మనం కేవలం ఆచారాలను మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను కూడా తరువాత తరాలకు అందిస్తాం. అందుకే పిల్లలను పూజలో భాగస్వాములను చేసి, గణపతి తత్వాన్ని వారికి పరిచయం చేయడం, వినాయకుని కథ చదివించడం లేదా చదివి వినిపించడం ఎంతో ముఖ్యం.వినాయక వ్రతం – మనలోని మంచి గుణాలకు నాంది సకల విఘ్నాలకు అధిపతియైన విఘ్నేశ్వరుడిని భాద్రపద శుద్ధ చవితి పర్వదినాన కుటుంబసమేతంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏడాది పొడవునా విజయవంతంగా సాగాలని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని స్వామిని ప్రార్థిస్తాం.అయితే భక్తితో కొలుస్తూ మనం కోరేది కేవలం కోరికల నెరవేర్పు మాత్రమే కాదు, మంచి ఆలోచన ఇవ్వమని.. వివేకంతో నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వమని.. ఎదురయ్యే విఘ్నాలను ధైర్యంగా అధిగమించే శక్తి ఇవ్వమని.. కుటుంబంలో సుఖశాంతులు కలిగించమని.. సమాజంలో ఐకమత్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని.. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.ఇదే వినాయకవ్రతంలో అంతర్లీనంగా ఉన్న పరమార్థం.విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. బుద్ధిని ప్రసాదించే బుద్ధిప్రదాత..విజయాన్ని అందించే సిద్ధివినాయకుడు.. మంగళాలను చేకూర్చే మంగళమూర్తి..శ్రీ గణనాథుని కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ... శ్రీ గణేశాయ నమః! శ్రీ సిద్ధివినాయకాయ నమః! శ్రీ విఘ్నేశ్వరాయ నమఃఇదీ చదవండి: వినాయక పూజకు సన్నద్ధత -
వినాయక పూజకు సన్నద్ధత
వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంటికీ భక్తిశ్రద్ధలతో నిండే పర్వదినం. పూజకు ముందుగా ఇంటిని శుభ్రపరుచుకోవడం, పూజా వేదికను సిద్ధం చేసుకోవడం, పూజకు అవసరమైన ద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్యాలు సమకూర్చుకోవడం మన సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి, పరిశుభ్రమైన వస్త్రాన్ని ధరించి పూజకు సిద్ధమవుతాం. ఇంటి ప్రధాన గుమ్మాన్ని మామిడి తోరణాలతో, పుష్పాలతో అలంకరించి, పూజా మండపాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతాం. మండపం పైభాగంలో పాలవెల్లి ద్రాక్షలు చేసి మండపం లోపల స్వస్తిక్, పద్మం వంటి శుభచిహ్నాలను లిఖించి, హరిద్రా గణపతి (పసుపు గణపతి), మట్టి వినాయక ప్రతిమలను భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి, దీపారాధనతో స్వామివారిని ఆహ్వానిస్తాం. పూజ ప్రారంభానికి ముందే అవసరమైన పూజాద్రవ్యాలు, పత్రి, పుష్పాలు, నైవేద్య సామగ్రితో పాటు పిండివంటలు, ప్రసాదాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం వల్ల పూజను ప్రశాంతంగా, ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్ణంగా నిర్వహించుకోవచ్చు. పూజకు చేసే సన్నద్ధత శరీరానికే కాదు.. మనసుకూ.... పరిశుభ్రమైన ఇంటితో పాటు పవిత్రమైన మనసుతో గణనాథుని ఆరాధించినప్పుడే పూజ పరిపూర్ణమవుతుంది. భక్తిశ్రద్ధలతో గణనాథుని కొలిచి, ఆయన అనుగ్రహంతో ప్రతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రారంభిద్దాం..ఇదీ చదవండి: విఘ్నాలను తొలగించి.. విజయానికి మార్గం చూపే గణనాథుడు -
పాండురాజుకు ఆ శాపం ఎందుకు వచ్చింది?
పాండురాజుకు మృగవధ వలన శాపం తగిలింది. ‘ఎవరికీ అపకారం చేయక, ప్రకృతి సహజమైన సుఖాన్ని పొందుతున్న సమయంలో, విచక్షణా రహితంగా మమ్ములను బాణహతికి గురిచేసావు. కాబట్టి నీవు కూడా నీ చివరి క్షణాలలో మావంటి బాధనే అనుభవించి మరణిస్తావు!’ అని శపించింది ఆ మృగమిథునం.మృగమిథునం పాండురాజుకు ఇచ్చిన ఈ శాపంతో మహాభారత కథ రెండవ అతిపెద్ద మలుపు తిరిగింది. శంతనుడి రెండవ భార్య అయిన సత్యవతికి పుట్టిన ఇద్దరు కొడుకులు– చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు– పుత్రహీనులుగా మరణించగా, వారి భార్యలైన అంబిక, అంబాలికలకు, దేవరన్యాయం పద్ధతిన వ్యాసమహర్షి వలన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు సంతానంగా కలగడం అన్నది మహాభారత కథలోఅంతకు ముందు చోటుచేసుకున్న మొదటి ముఖ్యమైన మలుపు.అయితే ఆ ముగ్గరిలో రాజు కాగలిగి, రాజ్యాధికారం చేపట్టగలిగిన లక్షణాలున్న పాండురాజుకు, మృగమిథున శాపం తగిలి, తన భార్యలైన కుంతి, మాద్రిల ద్వారా తన సంతానాన్ని నేరుగా కురువంశానికి అందించలేకపోవడం అన్న విచిత్ర స్థితి దాపురించి, తన అంశతో సంతానాన్ని ఇవ్వగలగడం అన్నది విధివశాన లేకుండాపోయింది.క. ఎట్టి విశిష్ట కులంబునబుట్టియు, సదసద్వివేకములు గల్గియు, మున్గట్టిన కర్మఫలంబులునెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్?‘పూర్వం చేసిన దుష్కర్మల ఫలం వెంటాడుతుంది. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, వివేకవంతుడైనప్పటికీ, అతడిని కొన్ని క్షణాలు విచక్షణను పోగొట్టుకునేలా చేసి, పాపకార్యం మళ్ళీ చేసేలా అది చేస్తుంది. అలా సంక్రమించిన పాపకార్య ఫలం ఒక జన్మలో కాకుంటే, ఆ తరువాత మరొక జన్మలో భోగింపక– అనగా అనుభవించకుండా తప్పించుకోవడం ఎంతటి వానికైనా సాధ్యంకాదు’ అని పై సందర్భానికి అనుగుణంగా నన్నయ భట్టారకుడు ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వంలో సర్వకాలీనమైన ఆధ్యాత్మిక సత్యాన్ని సూక్తీకరించి చెప్పాడు.– భట్టు వెంకటరావు -
దైవాన్ని ప్రేమించాలంటే.. ముందు మనిషిని ప్రేమించాలా?
సృష్టికర్త దృష్టిలో మనుషులందరూ ఒకే కుటుంబం. జాతి, వర్ణం, భాష, దేశం, సంపద అనే భేదాలు మనుషులు నిర్మించుకున్న కృత్రిమ గోడలే తప్ప గొప్పతనానికి కొలమానాలు కావు. నిజమైన శ్రేష్ఠత కేవలం సత్ప్రవర్తన, దైవభీతి, పరోపకారంలోనే ఉంది. దివ్య బోధనల్లో ద్వేషానికి తావులేదు, ప్రేమ ఉంది; అహంకారానికి ఆస్కారం లేదు, వినయం ఉంది. ఈ ఉదాత్తమైన సూత్రాలే ధార్మిక మానవతా దృక్పథానికి మూలస్తంభాలు.ఈ మానవీయ దృక్పథానికి శిఖరాగ్రం ఏమిటంటే, ఒక నిరపరాధి ప్రాణాన్ని కాపాడటం సమస్త మానవాళిని రక్షించడంతో సమానమని చాటిచెప్పడమే. ధర్మం మనుషుల మధ్య గోడలు కట్టదు, హృదయాలను కలుపుతుంది. దేవుని ప్రేమను కోరుకునే హృదయమేదైనా మొదట సృష్టిని ప్రేమించడం నేర్చుకోవాలి. మానవత్వం లేని మతం ఊపిరి లేని శరీరమైతే, నైతిక మూల్యాలతో వికసించిన మానవత్వమే ఈ భూమిపై దైవకరుణకు సజీవ సాక్ష్యం.ఈ సత్యం ఆచరణలోకి వచ్చినప్పుడే ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం చేకూరుతుంది. అందుకే ధర్మం అంటే కేవలం ఆచారాలు, ప్రార్థనలకే పరిమితం కాదు; అది మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలిపే జీవన విధానం. నిజమైన ధార్మికత మనిషిని కేవలం ఆరాధనలకే పరిమితం చేయదు; ఆకలితో ఉన్న వారిని, అనాథలను, బలహీనులను ఆడుకునేలా తీర్చిదిద్దుతుంది. స్వార్థానికి అతీతంగా, చివరకు తమకు వ్యతిరేకమైనా సరే న్యాయం వైపే నిలబడే సత్యసంధతను నూరిపోస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
సంతానం.. క్షేమం కోసం పోలాల అమావాస్య పూజ
సంతానం లేనివారు సంతానం కలిగే వరకు పరితపిస్తూనే ఉంటే, సంతానం ఉన్నవారు తమ పిల్లలకు ఎటువంటి అంటువ్యాధులు, రోగాలు రాకుండా ఉండాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చేసే వ్రతమే పొలాల అమావాస్య వ్రతం. శ్రావణ బహుళ అమావాస్య నాడు చేసే ఈ వ్రతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఉద్దేశంతో... ఒక్కోవిధంగా చేస్తారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో పశువులను పూజిస్తే మరికొన్ని తాలలో కంద మొక్కను పూజించి, కలగలపు పులుసు చేసుకుని తింటారు.రేపు పోలాల అమావాస్య సందర్భంగా ఆ వ్రత విధానం ...పూజకు పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పూలు, పండ్లు. దీపారాధన కుందులు, నూనె/నెయ్యి, వత్తులు, అగరు బత్తీలు, కర్పూరం సిద్ధం చేసుకోవాలి. మరీ ముఖ్యమైనవి: కంద మొక్క (లేదా కంద పిలక), తోరాలు (పసుపు రాసి, పసుపు కొమ్ములు కట్టిన దారాలు). నైవేద్యం: పూర్ణం బూరెలు, 9 రకాల కూరగాయలతో చేసిన కలగాయ కూర/పులుసు. పూజ చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసి, ముగ్గులు వేసి, పీటపై ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్నిపరచాలి. దానిపై కంద మొక్కను ఉంచి మంగళగౌరీ దేవి లేదా పోలేరమ్మ తల్లిగా భావించాలి.గణపతి ప్రార్థన: ఏ పూజ అయినా విఘ్నాలు లేకుండా సాగడానికి ముందుగా వినాయకుడిని మనసు లో స్మరించుకోవాలి.‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ‘దీపారాధన: దీపాలను వెలిగించి, దానికి పసుపు, కుంకుమలు పెట్టాలి. ‘ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా’ అంటూ మూడుసార్లు నీటిని తీసుకోవాలి. ప్రధాన పూజ – తోర పూజ కంద మొక్కకు పసుపు, కుంకుమలు పెట్టి, పూలతో అలంకరించాలి. అమ్మవారిని షోడశోపచారాలతో (ధ్యానం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ నమస్కారాలు) పూజించాలి. తోర పూజ: పసుపు కొమ్ములు కట్టిన తోరాలను (దారాలను) అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించాలి. తోరం కట్టుకునేటప్పుడు ‘పోలాయ నమస్తుభ్యం సర్వ సౌభాగ్యదాయిని... పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం బధ్నామి తవ తోరకమ్’ అని భక్తి శ్రద్ధలతో చదువుతూ తోరం కట్టుకోవాలి. ‘నైవేద్యం: తయారు చేసుకున్న పూర్ణం బూరెలు, కలగాయ (ఇరుగు పొరుగు ఇళ్లనుంచి సేకరించిన లేదా స్వయంగా సమకూర్చుకున్న రకరకాల కూరగాయలతో చేసిన పులుసు)ను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పోలాల అమావాస్య వ్రత కథ. (ఈ కథను కూడా ఒక్కో ్ర΄ాంతంలో ఒక్కో విధంగా చెప్పుకుంటారు. అధిక ప్రాచుర్యం పొందిన కథలలో ఇదొకటి) పూజ పూర్తయిన తర్వాత చేతిలో అక్షతలు, పూలు పట్టుకుని ఈ కింది కథను భక్తితో చదువుకోవాలి లేదా వినాలి. వ్రతకథ: పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. వారందరికీ వివాహాలై, పిల్లలు కలిగారు. అయితే అందరికంటే చిన్నవాడి భార్యకు పుట్టిన పిల్లలందరూ పుట్టిన వెంటనే చనిపోతుండేవారు. ప్రతి ఏటా శ్రావణ లేదా భాద్రపద అమావాస్య రోజున పెద్దకోడళ్లు అందరూ కలిసి ఎంతో వైభవంగా పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించేవారు. కానీ చిన్నకోడలికి పిల్లలు చనిపోతుండటం వల్ల, ఆమెను సూతకం (మైల) కారణంతో పూజకు రానిచ్చేవారు కాదు. ఒక సంవత్సరం అమావాస్య నాడే చిన్నకోడలికి మళ్లీ బాబు పుట్టాడు, కానీ ఆ బాబు కూడా వెంటనే చనిపోయాడు. ఆ దుఃఖాన్ని భరించలేక, పూజకు ఆటంకం కలుగుతుందనే భయంతో ఆమె ఆ చనిపోయిన బిడ్డను ఎవరికీ చెప్పకుండా గదిలో ఒక చాట కింద దాచిపెట్టింది. తోడికోడళ్లు పూజ ముగించుకుని, కందమొక్కకు కట్టిన తోరాలను చిన్నకోడలికి ఇవ్వడానికి వచ్చారు. ఆమె తోరాన్ని తీసుకుని, మనసులో ఎంతో బాధపడుతూ గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లిని మనసారా ప్రార్థించింది. అనంతరం చిన్నకోడలు చనిపోయిన తన బిడ్డను ఎత్తుకుని ఎవరికీ తెలియకుండా ఊరి చివర ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్లి, దేవత పాదాల చెంత బిడ్డను ఉంచి బోరున విలపించింది. ఆమె నిష్కల్మషమైన భక్తికి, మాతృత్వపు వేదనకు కరిగిపోయిన పోలేరమ్మ తల్లి ప్రత్యక్షమైంది. తన అమృత హస్తంతో ఆ చనిపోయిన బాలుడిని తాకగానే, ఆ బిడ్డ ప్రాణాలతో లేచి బోసినవ్వులు నవ్వాడు. అంతేకాకుండా, గతంలో చనిపోయిన ఆమె మిగతా పిల్లలందరినీ కూడా అమ్మవారు బతికించి ఆమెకు అప్పగించింది. తన పిల్లలందరితో కలిసి చిన్నకోడలు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె భక్తిని చూసి ఊరివారంతా ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి సంతాన రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని నిష్టగా చేయడం ప్రారంభించారు. ఉద్యాపన లేదా ముగింపుకథ పూర్తయిన తర్వాత చేతిలోని అక్షతలను తలపై వేసుకోవాలి. పూజించిన తోరాలను తీసుకుని తల్లి తన పిల్లల కుడి చేతికి కట్టాలి. ఆ తర్వాత ముత్తయిదువులకు వాయనాలు (తాంబూలం, బూరెలు) ఇచ్చి, పెద్దల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. దీనితో వ్రతం సంపూర్ణమవుతుంది. ఆ తర్వాత యథాశక్తి దాన ధర్మాలు చేయాలి. పూజించిన కంద మొక్కను ఏం చేయాలి?ఈ వ్రతంలో పూజించిన కంద మొక్కను ΄ోలాల అమావాస్య మరుసటి రోజు ఇంటి ఆవరణలో కానీ, పూల కుండీల్లో కానీ నాటాలి. ప్రతిరోజూ నీళ్లు ΄ోస్తూ మొక్కను సంరక్షించాలి. కొద్ది రోజులకు ఈ మొక్క పక్కనే మరికొన్ని పిలకలు వస్తాయి. అలా రావడం శుభసూచకం. కంద మొక్కకు పిలకలు వస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అప్పటికే సంతానం ఉన్నవారికి వారి సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుందని ప్రతీతి. – పి.సాయికృష్ణ ప్రణతి(చదవండి: అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!) -
గంధము పూయరుగా!
భగవంతునికి చేసే షోడశోపచారాలలో తొమ్మిదవ ఉపచారం చందన సమర్పణం. ఓ దేవదేవా! మంచి సువాసన కలిగిన, మనోహరమైన ఈ శ్రీగంధాన్ని ప్రీతితో స్వీకరించమంటూ భగవంతునికి చందనం సమర్పిస్తాం.సృష్టిలో ఉన్న వృక్ష జాతులలో గంధపు చెట్టుది ప్రత్యేక స్థానం. పూజలు, వ్రతాలు, నోములు, పేరంటాలు, పెండ్లిండ్లలో చందనం అందించడం తప్పనిసరి. పేరంటాలలో ముత్తైదువులకు గంధాన్ని కంఠ భాగంలో అలంకరిస్తారు. యోగశాస్త్రం ప్రకారం కంఠ భాగంలో విశుద్ధి చక్రం ఉంటుంది. అక్కడ రెండు వేళ్ళతో చందనం రాయడం వల్ల విశుద్ధి చక్రం ఉత్తేజితమౌతుంది. నుదుటి భాగంలో గంధం రాయడం వల్ల మెదడు చల్లబడుతుంది. కోపావేశం ఉపశమిస్తుంది. శాంతి లభిస్తుంది.గంధం పూయడం వలన మనస్సుకు ఏకాగ్రత కుదురుతుంది. లలాట ప్రదేశంలో గంధం, కస్తూరి వంటి వాటితో బొట్టు పెట్టుకొంటే కనుబొమల మధ్యన ఉన్న జ్ఞాననాడులకు స్ఫూర్తి కలుగుతుంది. సంకల్ప శక్తి దృఢమవుతుంది. ఆయుర్వేద శాస్త్ర రీత్యా స్త్రీలు గంధం పూసుకోవడం వల్ల ఋతుక్రమం చక్కబడి ఆరోగ్యకరమైన అండోత్పత్తి జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అనారోగ్యం, అంటువ్యాధులు, చర్మరోగాలు నివారించబడతాయి. గర్భవతులకు గంధం పూయడం వారి కడుపులోని బిడ్డకు ఆరోగ్యకరం. శుభకార్యాలలో అతిథులనుచందన తాంబూలాలతో గౌరవించడం మన ఆచారం.దేవతలకు కూడా...సింహాద్రి అప్పన్నకు ఏడాది పొడవునా చందనం అలంకరిస్తూ ఆయన రౌద్రాన్ని శాంతింపజేస్తూంటారు. అక్షయ తదియనాడు ప్రతి ఏటా ఆయనకు చందనోత్సవం జరుపుతారు. అమ్మవారికి కూడా చందనమంటే ఎంతో ప్రీతి. అందుకే ఆమెను చందన ద్రవ దిగ్ధాంగీ’(శరీరానికంతటికీ చందన ద్రవం అలదుకొన్నది) అని వర్షిస్తారు.ఇక శ్రీకృష్ణ పరమాత్మ అయితే సదా చందన చర్చిత నీల కళేబరుడు. ఆంజనేయునికీ సింధూరం, గంధం ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు. తిరుమల వంటి దివ్యక్షేత్రాలలో శ్రీగంధ కైంకర్యం నిత్యం జరిగే పూజా విధిలో భాగం. అందుకోసం అక్కడ ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పరచబడింది. గంధ పరిమళం వ్యాపించి ఉన్న ్రపాంతంలో సానుకూల శక్తి, దైవిక అనుభూతి ఉంటుందన్న విశ్వాసం, ఆ పవిత్ర వాతావరణంలో జరిగే కార్యక్రమాలు విజయవంతం అవుతాయనే నమ్మకమూ భక్తులలో దృఢంగా ఉన్నాయి.జ్వర తీవ్రత తగ్గడానికి తల కణతలకు గంధం రాయడం ఒక వైద్యం. చందనలేపనం ముఖ కాంతిని పెంచుతుంది. గంధం మంచి సౌందర్య సాధనం కూడా! ΄ûడర్లు, సబ్బులు, అగరుబత్తి, అత్తరు వంటి వాటి తయారీలో గంధం వాడతారు కదా!పరమశివుని అభిషేక ద్రవ్యాలలో గంధం కూడా ఒకటి. మొత్తానికి ఆరోగ్యం, ఆహ్లాదం, అందం, ఆనందం, ఆధ్యాత్మికత కలబోసిన సంప్రదాయంగా చందన లేపనాన్ని చెప్పవచ్చు.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
వాక్పతి: వ్యాసుని మహాభారత రచనలో గణపతి మహిమ!
‘తొండము నేకదంతము’... ప్రార్థనా పద్యంలో ‘విద్యల కెల్ల నొజ్జయై’ అని వాక్కుల కధిపతిగా, విద్యా బుద్ధుల ప్రదాతగా వినాయకుని కీర్తించటం ఉంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెపుతుండగా గణపతి రాశాడని చెబుతారు.అంటే గణపతి వ్యాసుని ఎదురుగా కూర్చుని రాస్తూవుంటే... వ్యాసుడు ఆశువుగా చెబుతున్నాడని పైకి తోచే అర్థం. కాని, వ్యాసుడు ఏకాక్షర గణపతిని ఉపాసించి సర్వ విద్యల సారం గ్రహించి, సమస్త ఛందస్సులలోని భాషా చాతుర్యమంతా అవగతం చేసుకుని మహాభారతాన్ని రచించాడని ఇందులోని అంతరార్థం అని గణేశ పురాణం చెబుతుంది. వ్యాసుడు మహా భారతం, మహా భాగవతాలనే కాక అష్టాదశ పురాణాలను, అష్టాదశ ఉప పురాణాలను కూడా రచించాడు. ఆ ఉప పురాణాలలో ఒకటి గణేశ పురాణం.రచన ధారళంగా సాగాలన్నా, భాషాదోషాలు లేకుండా, ఎక్కడా కుంటుపడకుండా భాష ప్రవహించాలన్నా, మంచి ఆలోచనలు రావాలన్నా గణపతి పూజ అవశ్యం అని పెద్దల మాట. అలనాటి వ్యాసుని నుంచి నేటి పండిత శ్రేష్ఠుల వరకు అందరికీ గణపతి ఆరాధ్య దైవం, వాక్పతి. విద్యాదాత.దేవతలు కూడా విధిగా పూజించవలసిన దైవం గణపతి. దేవతలు క్షీర సాగర మథనాన్ని గణపతి పూజ చేయకుండా ప్రారంభించటం వల్లనే మధ్యలో విఘ్నం కలిగిందనీ, అప్పుడు స్వయంగా మహా విష్ణువే దేవతలచేత గణపతి పూజ చేయించటం వల్ల ఆ కార్యం నిర్విఘ్నంగా జరిగిందనీ గణేశ పురాణం తెలియజేస్తోంది.– డా. చెంగల్వ రామలక్ష్మిఇవి కూడా చదవండి: హిమధీర -
నిర్మల హృదయమే గర్భగుడి
ఒక చిన్న పల్లెటూరి చివరన, ఒక పాత పూరి గుడిసెలో రామయ్య అనే వృద్ధ మట్టి శిల్పి ఉండేవాడు. వయసు పైబడినా ఆయన చేతుల్లో ఏదో ఇంద్రజాలం ఉండేది. ఆయన చేసే మట్టి విగ్రహాలు ప్రాణం ఉన్నట్టుగా ఉండేవి. కానీ రామయ్యకు అహంకారం అంటే ఏమిటో తెలియదు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ భగవంతుడి స్వరూపం గా భావించి, ఎంతో వినయంగా నమస్కరించేవాడు. ఆ ఊరిలోనే భుజంగరావు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. దర్పం, అహంకారం ఆయనకు ఆభరణాలు. తన ఇంట్లో కొత్తగా కట్టించిన పెద్ద పూజామందిరంలో ప్రతిష్టించడానికి ఒక అద్భుతమైన వినాయకుడి విగ్రహం కావాలని రామయ్య దగ్గరకు వచ్చాడు.రామయ్య శిల్పం చెక్కుతుండగా చూసి భుజంగరావు ‘రామయ్యా! నా హోదాకు తగ్గట్టు గా ఈ విగ్రహం ఉండాలి. రంగులు, అలంకరణలు అత్యంత ఖరీదైనవిగా ఉండాలి. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ నా విగ్రహం చూసి ఊరంతా నోరెళ్లబెట్టాలి!’ అన్నాడు. రామయ్య చేతులు జోడించి, వినయంగా తలవంచి... ‘అలాగే బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అన్నాడు. మరుసటి రోజు, రామయ్య విగ్రహాన్ని తయారు చేస్తుండగా... రాజీ అనే ఎనిమిదేళ్ల పేద బాలిక అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో కేవలం ఒక రూపాయి నాణెం ఉంది. ఎంతో ఆశగా రామయ్య వైపు చూస్తూ...‘తాతా! మా అమ్మకు ఒంట్లో అస్సలు బాగోలేదు. మా ఇంట్లో పూజ చేసుకుని, అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుకోవడానికి ఒక చిన్న వినాయకుడి బొమ్మ ఇస్తావా.’ అని అడిగింది. అప్పుడే అక్కడకు వచ్చిన భుజంగరావు అది చూసి ఈసడించుకుంటూ... ‘ఏయ్ పిల్లా! పక్కకు పో. నా పెద్ద విగ్రహం పని పాడు చేయకు. అయినా ఈ నాణేనికి మట్టి కూడా రాదు’ అని గద్దించాడు. కానీ రామయ్య మనస్సు కరిగింది. ఆ అమ్మాయి అమాయకత్వంలో, నిష్కపటమైన ప్రేమలో ఆయనకు సాక్షాత్ ఆ దేవుడే కనిపించాడు. రామయ్య ఎంతో భక్తితో తను చేసిన ఒక చిన్న ముద్దుల వినాయకుడి విగ్రహాన్ని ఆ బాలిక చేతిలో పెట్టాడు. ఆ చిన్నారి కళ్లలో కనిపించిన ఆనందం రామయ్య హృదయాన్ని నింపేసింది.కొన్ని రోజులకు భుజంగరావు పురమాయించిన పెద్ద విగ్రహం తయారైంది. అది నిజంగానే ఎంతో భవ్యంగా, రంగురంగుల ఆభరణాలతో మెరిసిపోతోంది. భుజంగరావు కూలీలతో కలిసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. కానీ విచిత్రం! నలుగురు బలాఢ్యులైన మనుషులు ఆ విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నించినా కనీసం అంగుళం కూడా కదపలేకపోయారు.భుజంగరావు కోపంతో ఊగిపోతూ... ‘రామయ్యా! ఏంటిది? ఇందులో ఏమైనా ఇనుము, రాళ్ళు పెట్టి చేశావా? ఎందుకు ఇంత బరువుగా ఉంది?’ అని గద్దించాడు.రామయ్య ఏమాత్రం కలత చెందకుండా, ఎంతో వినమ్రంగా చేతులు జోడించి ‘అహంకారం’, ‘హోదా’ అనే బరువులు కూడా ఇందులో చేరాయి స్వామీ! అహంకారం ఎప్పుడూ మోయలేనంత బరువుగానే ఉంటుంది. ఆ బరువును దేవుడు కూడా ఇష్టపడడు’’ అన్నాడు. ఆ మాటలు భుజంగరావు గుండెల్లో తూటాల్లా పేలాయి. అదే సమయంలో పక్కనే ఉన్న చిన్న గుడిసెలో రాజీ అనే చిన్నారి... రామయ్య ఇచ్చిన చిన్న విగ్రహాన్ని ఎంతో సులువుగా చేతుల్లో పట్టుకుని, భక్తితో పూజ చేయడం ఆయన కంట పడింది. ఆయనలోని గర్వం కరిగిపోయింది. కళ్లల్లో నీళ్లతో, ‘నన్ను క్షమించు రామయ్యా! ఈ రోజు నుంచి నా అహంకారాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను’ నమస్కరించి అన్నాడు. ఆశ్చర్యకరంగా... మరుక్షణమే ఆ విగ్రహం ఎంతో తేలిక గా మారిపోయింది. భుజంగరావుకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. దైవత్వం అనేది బాహ్య ఆడంబరాలలో, డబ్బులో లేదు. అది అంతరంగంలోని వినయం, నిష్కపటత్వం, భక్తిలోనే ఉంటుందని గ్రహించాడు.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
సంకష్టహర చతుర్థి వ్రతం.. తన జీవితాన్నే మార్చేసింది!
పూర్వం హైహయ వంశానికి చెందిన కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతడు అమిత బలసంపన్నుడు, ధర్మపరాయణుడు. అతడి భార్య సుగంధి. సంపదలకు లోటు లేకున్నా, వారికి సంతానమే లేదు. సంతాన ప్రాప్తికి వారు చేయని వ్రత, దాన, యజ్ఞ యాగాలు లేవు. ఎన్ని చేసినా, పురాకృత పాపఫలితంగా వారికి సంతానం కలగలేదు.సంతాన రాహిత్యంతో రాజదంపతులు నిరాశలో కూరుకుపోయారు. రాజ్యాన్ని, సంపదను అమాత్యులకు విడిచి, తపోనిష్ఠతో కాలం గడపడానికి అడవులకు బయలుదేరారు. అడవులలో వారు కఠిన నియమాలను పాటిస్తూ, తపోనిష్ఠలో కాలం గడపసాగారు. కేవలం చెట్ల నుంచి రాలిన ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుండటంతో కృశించిపోయారు. వారు ధ్యానంలో ఉన్నప్పుడు వారి శరీరాలను క్రిమి కీటకాదులు తినేయసాగాయి. కొన్నాళ్లకు రాజదంపతులు శల్యావశిష్టులుగా మిగిలారు.ఒకనాడు గగనమార్గాన పోతున్న త్రిలోక సంచారి నారద మహర్షి కృతవీర్య దంపతుల పరిస్థితిని గమనించాడు. ఆయన వెంటనే పితృలోకానికి చేరుకుని, అక్కడ కృతవీర్యుడి తండ్రి వద్దకు వెళ్లి, ‘మర్త్యలోకంలో నీ కొడుకు, కోడలు సంతానం కోసం అలమటిస్తూ, తపశ్చర్యలో నిమగ్నులై, శల్యావశిష్టులుగా మిగిలారు. వారి పరిస్థితి నేడో రేపో అన్నట్లుగా ఉంది.’ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు.దారిలో నారదుడికి ఒక దారుణ దృశ్యం కనబడింది. భృంశ మహర్షి తల్లిదండ్రులు, బంధువులు కుంభీపాక నరకంలో అధోముఖులై వేలాడుతూ, యమభటుల దండనలకు తాళలేక హాహాకారాలు చేస్తున్నారు. ఈ దృశ్యం చూసి, నారదుడు విచలితుడయ్యాడు. వెంటనే, భృంశుడి వద్దకు వెళ్లాడు. ‘మహర్షీ! నువ్వు సాక్షాత్తు సర్వజ్ఞుడవు. సాక్షాత్తు గణేశ సమానుడవు. కపిలాది మహర్షులు నీ దర్శనం కోరి వస్తుంటారు. అలాంటి నీ తల్లిదండ్రులు, బంధువులు నరకంలో యమబాధలు అనుభవిస్తుండటం బాధ కలిగిస్తోంది. నీ పూర్వుల నరక విమోచనం కోసం చేయదగిన పరిహారం ఏదైనా ఉంటే, నువ్వు ఉపేక్షించక దానిని వెంటనే ఆచరించు’ అని పలికాడు.నారదుడి ద్వారా తన పితరుల బాధలు తెలుసుకున్న భృంశుడు చింతాక్రాంతుడై, కొద్దిసేపు ఆలోచించాడు. తాను ఏళ్లతరబడి ఆచరిస్తూ వచ్చిన సంకష్టహర చతుర్థి వ్రతఫలంలో ఒకరోజు వ్రతఫలాన్ని ససంకల్పితంగా తన పితరులకు ధారపోశాడు. అతడు తన వ్రతఫలాన్ని ధారపోసిన వెంటనే భృంశుడి పితరులందరూ నరక కూపం నుంచి విముక్తి పొందారు. దేవతలు తీసుకువచ్చిన దివ్యవిమానంలో వారందరూ స్వర్గానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, నారదుడి ద్వారా తన కుమారుడి పరిస్థితి తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి బ్రహ్మలోకానికి వెళ్లి, ‘బ్రహ్మదేవా! నా కుమారుడు కృతవీర్యుడు సంతానం లేకపోవడం వల్ల తపోనిష్ఠలో శల్యావశిష్టుడిగా మిగిలాడు. నా కుమారుడి సంతానలేమికి కారణమేమిటి? అతడి పురాకృత పాపకర్మ నశించడానికి తగిన తరుణోపాయమేది? నువ్వే చెప్పాలి’ అని అడిగాడు.‘నీకు నీ తనయుడి పూర్వజన్మ విశేషాలు చెబుతాను, విను. నీ రాజ్యంలోనే సామ అనే దుష్టుడు ఉండేవాడు. అతడు నిష్కారణంగా పన్నెండుమంది బ్రాహ్మణులను వధించి, వారి మృతదేహాలను ఒక కొండగుహలో పారవేశాడు. ఒకనాడు అతడికి పొద్దుగూకే వరకు ఎక్కడా తిండి, నీళ్లు దొరకలేదు. అలసి సొలసి పొద్దు గూకిన తర్వాత ఇంటికి చేరుకున్న మరుక్షణమే, తన కొడుకును ‘గణేశా! గణేశా!’ అని పిలిచాడు. కొడుకుతో కలసి భోజనం చేశాడు. సామకు తెలియకున్నా, ఆరోజు మాఘ కృష్ణ చతుర్థి. మరికొన్నాళ్లకు అదే తిథినాడు సామ కాలధర్మం చెందాడు. సంకష్టహర చతుర్థినాడు తెలియక చేసిన పుణ్యఫలితంగా మరణానంతరం స్వర్గానికి చేరుకున్నాడు. ఆ పుణ్యశేషం వల్లనే నీకు కొడుకుగా పుట్టాడు. పురాకృత పాపకర్మ మిగిలి ఉండటం వల్ల అతడికి సంతానం కలగలేదు’ అని బ్రహ్మదేవుడు చెప్పాడు.‘విరించీ! పాపాకర్మ పరిహారానికి తరుణోపాయమేమిటో నువ్వే చెప్పు’ అడిగాడు కృతవీర్యుడి తండ్రి.‘సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమానుసారం ఆచరిస్తే, అతడికి పాప విముక్తి కలుగుతుంది’ అని చెప్పి, వ్రత విధానాన్ని వివరించాడు బ్రహ్మదేవుడు.బ్రహ్మదేవుడి ద్వారా సంకష్టహర వ్రత విధానాన్ని తెలుసుకున్న అతడు తన కొడుకు వద్దకు చేరుకుని, ‘కృతవీర్యా! పురాకృత పాపకర్మ ఫలితంగానే నీకు సంతానం కలగలేదు. సంకష్టహర చతుర్థివ్రతం ఆచరించినట్లయితే, నీకు పాపవిమోచనం కలిగి, సంతానం కలుగుతుంది’ అని చెప్పి, బ్రహ్మదేవుడు చెప్పిన వ్రత విధానాన్ని బోధించాడు.కృతవీర్యుడు పత్నీసహితంగా నియమానుసారంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. అతడి పాపకర్మ నశించింది. కొన్నాళ్లకు కృతవీర్యుడి భార్య సుగంధి గర్భం దాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. అయితే, అతడికి చేతులు లేవు. పెరిగి పెద్దయ్యాక అతడు తీవ్ర తపస్సుతో దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని, సహస్రబాహువులు పొందాడు. సహస్రబాహు అర్జునుడిగా, కార్తవీర్యార్జునుడిగా పేరు పొందాడు.- సాంఖ్యాయనఇవి చదవండి: ఒకనాటి ఆదివారం -
మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది!
మన శరీరంలోని కాలేయం, గుండె, ఊపిరి తిత్తులు, కళ్ళు, పళ్ళు వంటివేవైనా... కొంత చెడి పోయినా బాగు చేయించుకోవటానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అన్నీ బాగుండి, ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నవారు శరీర విలువను గ్రహించక, జీవిత విలువను తెలుసుకోలేక, ఎలా జీవించాలో అలా జీవించక వెళ్ళిపోతున్నారు. మహారాజ్ జగత్ సింగ్జీ ఒక కథ చెబుతారు:ఒక వృద్ధుడు అడవిలో కట్టెలను కొట్టి, ఆ కట్టెలను కాల్చి, వచ్చిన బొగ్గును అమ్మి జీవించేవాడు. ఒకసారి అడవిలో దారితప్పిన రాజును రక్షించి, రాజనగరుకు క్షేమంగా చేర్చాడు. ఆ రాజు సంతోషించి అతనికి చందన వృక్షాలు గల అందమైన తోటను కానుకగా ఇచ్చాడు. ఆ వృక్షాల ప్రత్యేక విలువ ఆ వృద్ధునికి తెలీదు. ఆ చెట్లను కొట్టాడు, కట్టెలను కాల్చాడు, వచ్చిన బొగ్గులను అమ్మాడు, వచ్చిన కొంత డబ్బుతో ఏ పూటకు ఆ పూట గడిపాడు, దరిద్రునిగనే నిలచిపోయాడు.కొద్ది రోజుల తర్వాత రాజు వచ్చి, అతని దారిద్య్రాన్ని చూసి, విషయాన్నంతా అడిగి తెలుసుకున్నాడు. ఒక చిన్న కట్టె ఏమైనా మిగిలి ఉందా? అని ప్రశ్నించాడు. ఏదో ఒక మూలన పడివున్న బారెడు కట్టెను తెచ్చాడు వృద్ధుడు. సరే, దీన్ని ఇలాగే బజారుకు తీసుకెళ్ళి, అమ్మి పైకాన్ని తీసుకురా అన్నాడు రాజు. అది మామూలు కట్టె కాదని, చందన వృక్షపు ముక్క అని తెలిసిన వ్యక్తి వందల రూపాయలను ఇచ్చి దాన్ని కొన్నాడు.ఆ వృద్ధుడు ఆశ్చర్యంతో రాజుగారికి ఆ డబ్బును చూపించాడు. ‘ఇప్పుడు నీకు తెలిసిందా, నేను నీకు కానుకగా ఇచ్చిన తోట ఎన్ని కోట్ల విలువైనదో? నీవు అజ్ఞానంతో అమూల్యమైన సంపదను కోల్పోయావు’ అన్నాడు రాజు. (పుట 58, ఆత్మజ్ఞానము– సర్దార్ బహదుర్ జగత్ సింగ్జీ; రాధాస్వామి సత్సంగ్ బియాస్).భగవంతుడు లేక ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ మానవ దేహం రాజు గారు ఇచ్చిన చందన వృక్ష తోటకంటె ఎన్నో వందల రెట్లు విలువైనదే. ‘శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం’ అని శాస్త్రాలు ఘోషిస్తాయి. ఈ శరీర మూలంగానే జ్ఞానాన్ని ఆర్జించాలి. ఆ తర్వాత ‘పరోపకారార్థ మిదం శరీరం’ అని గుర్తెరిగి జీవించాలి.– రాచమడుగు శ్రీనివాసులు -
కృష్ణుడి గురించి ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి!
అసంఖ్యాకమైన భగవదావతారాలలో అతి విశిష్టమైనదీ, పరిపూర్ణమైనదీ కృష్ణావతారం. భావో ద్రేకాలు అధికమైన భక్తులకు శ్రీకృష్ణుడు మహానందాంగనా డింభకుడిగా, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యంగా, అందమైన అల్లరి చేష్టల నవనీత చోరుడిగానే ముందు మనసుకు వచ్చి మురిపిస్తాడు కానీ ఆయన జగద్గురువు. యోగేశ్వరుడు. దేవదేవుడు. భూభారం తగ్గించటమే లక్ష్యంగా ఆయన ఎత్తిన కృష్ణావతారంలో ఆజన్మాంతం దుష్టశిక్షణా, సాధురక్షణా, ధర్మ సంస్థాపనా, జగదోద్ధరణా జరిగాయి. అన్ని అద్భుత ఘనకార్యాలు మరే అవతారంలోనూ కనబడవు. ఆ ‘భాగవత’మంతా పఠిస్తేనే చాలు, ‘బాగవుతాం’ అన్నారు పెద్దలు.పుట్టిన మూడో నెలలో పూతనను మట్టుపెట్టడంతో ఆరంభించి, పసితనంలోనే ఆయన వల్ల మట్టిలో కలిసిన మహాబలులూ, మాయావులూ అయిన రాక్షసులకు లెక్క లేదు. ఏడేళ్ల వయస్సులో ఏకంగా కొండనే ఎత్తి, ఏడు రోజులు చిటికెన వేలుమీద స్థిరంగా నిలిపి ఉంచి, ప్రజారక్షణ చేసి, ఇంద్రుడికే సవాలు విసిరిన లీలాబాలుడికి ఎవరు సాటి? ఎందరు దుష్టులను దునుమాడినా, ఆయన ఎవరినీ ద్వేషించలేదు. ఆయన చేత వధించబడిన దుష్టులు ఆఖరికి సద్గతులే పొందారు.కృష్ణావతారం నొక్కి వక్కాణించే సూత్రం ‘గోవిందుడు అందరివాడు’ అని. కామోత్కంఠతో గానీ, స్నేహంతో గానీ, చనువుతో గానీ, భక్తితో గానీ బాంధవ్యంతో గానీ, ప్రేమతో గానీ, చివరకు ఆయనపట్ల అమితమైన అకారణ ద్వేషంతో గానీ, ఆయన మీద మనసు లగ్నం చేయగలిగిన వాళ్ళందరికీ ఆయన శ్రేయస్సును ప్రసాదిస్తాడనేందుకు గోపికలూ, కుచేలుడూ, గోపాలకులూ, నారదాదులూ, యాదవులూ, పాండవ పరివారమూ, కంస–శిశుపాల–సాల్వ–కేశి–పౌండ్రక–దంత వక్త్ర– నరకాసురాదుల వృత్తాంతాలు తనువు పులకరింపజేసే తార్కాణాలు.కార్య విజయాలనూ, జీవన సాఫల్యాన్నీ కాంక్షించే వారికి, సకల శాస్త్రవేత్తా, ధర్మమూర్తీ అయిన భీష్మాచార్యుడు నిర్ద్వంద్వంగా నిర్దేశించిన, ‘యతః ధర్మః తతః కృష్ణః, యతః కృష్ణః తతః జయః!’ (ఎక్కడ ధర్మం ఉంటే, అక్కడ కృష్ణుడుంటాడు. ఎక్కడ కృష్ణుడుంటే, అక్కడ విజయం ఉంటుంది) అన్న సూచన అందరికీ నిత్యస్మరణీయం, అనుసరణీయం.– ఎం. మారుతి శాస్త్రి -
దైవబలమే గొప్పదా? ఈ శతకాలు ఏం చెబుతున్నాయంటే!
మానవుడు ఏమి తలచినా చివరకు దైవనిర్ణయం ప్రకారమే జరుగుతుంది.. మనకు ఏం జరిగినా దేవుడు మంచే చేస్తాడని దైవం మీద నమ్మకం వుండాలి. అందుకు ఉదాహరణగా శతకనీతిలో ఏం చెప్పారో చూద్దాం...‘యధా కందుక పాతేనో త్పత త్యార్య :పతన్న పి...అంటే.. పురుషకారం కన్నా దైవమే గొప్పదంటాడు భర్తృహరి.కింద పడ్డ బంతి పైకి ఎలా ఎగురుతుందో దైవాన్ని నమ్మినవాడు హీన స్థితి పొందినా ఉన్న స్థితిని పొందుతాడుదీనినే దైవబలం అంటారు.లోకంలో అన్నిటికన్నా దైవమే బలీయమైనది అని అంటూ ‘మతిమతాం చ విలోక్య దరిద్రతాం’.. బుద్ధిమంతులు దారిద్రాన్ని అనుభవించారు అని అంటారు.మరో పద్యం ద్వారా అన్నింటికీ దైవమే శరణం అని అంటారు..‘దైవబలమే గాని తనబల్మి కాదయ్యా‘ అని తేల్చి చెప్పేసాడు వేమన.‘దైవము లేనిది యే కార్యము సాగదు సుమతీ ఎన్ని సాధనములున్నన్ ‘అన్నారు, సుమతి శతకం లో ‘ఈ జగమందు, దా మనుజుడెంత మహాత్ముడెయైన దైవ మా తేజము తప్పజూచునెడ ద్రిమ్మరి కోల్పోడు నెట్లనిన’ అంటూ మహారాజుకుమారుడైన రామచంద్రుడి వనవాసం ప్రస్తావన తెస్తాడు భాస్కర శతకంలో ‘మహాత్ముడైన దాసాంద్ర విభూతి బాసి యొక విíహీనుని గోల్చియుంట’అంటూ అదే శతకంలో చక్రవర్తి సత్య హరిశ్చంద్రుడు కాటికాపరి అయి వీరబాహుణ్ణి సేవించే ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తాడు. చివరగా ‘దైవే దుర్బలతాంగతే తృణమపి ్రపాయేణ వజ్రాయతే ‘ అన్న సుభాషితం మన భ్రమలను తొలగిస్తుంది.– డా. కందాళ సత్య నారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ఇవి కూడా చదవండి: బాలుని మింగిన మొసలి! శివభక్తికి నిదర్శనం! అసలే జరిగిందంటే? -
బాలుని మింగిన మొసలి! శివభక్తికి నిదర్శనం! అసలేం జరిగిందంటే?
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో వెలసిన చారిత్రాత్మక అవినాశిలింగేశ్వర ఆలయం అవినాశి అప్పర్ ఆలయం అని కూడా పిలువబడుతుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్భుతమైన శిల్పం 63 మంది శైవ నాయనార్లలో ఒకరైన సుందరమూర్తి నాయనార్ జీవితంలో జరిగిన అత్యంత ప్రసిద్ధమైన పౌరాణిక అద్భుతాన్ని కళ్లకు కడుతుంది.సుందరార్ శివభక్తులలో అగ్రగణ్యుడు, తేవారం అనే పవిత్ర తమిళ శైవ కీర్తనల సంకలన కర్త. ఈ శిల్పఘట్టాన్ని తమిళంలో ముదలై వాయి పిళ్ళై అని పిలుస్తారు, మొసలి నోటిలోని బాలుడని దీని అర్థం. ఎనిమిదవ శతాబ్దంలో సుందరార్ అవినాశి గ్రామం గుండా వెళ్తుండగా ఒకే వీధిలోని రెండు ఇళ్లలో పరస్పర విరుద్ధమైన వాతావరణాన్ని గమనించారు. ఒక ఇంట్లో ఒక బాలుడికి ఎంతో వైభవంగా ఉపనయన వేడుక జరుగుతుండగా ఎదురింట్లో ఉన్న తల్లిదండ్రులు మాత్రం తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. దాని వెనుక ఉన్న కారణాన్ని విచారించగా 3 ఏండ్లక్రితం ఆ ఇద్దరు బాలురు స్థానిక తామరై కుళం అనే తామరచెరువులో స్నానానికి వెళ్లినప్పుడు ఒక బాలుడిని పెద్ద మొసలి మింగేసింది.ఈ రోజు బతికి ఉన్న బాలుడి ఉపనయన వేడుకలు చూసి తమ కొడుకు కూడా ఉంటే ఇలాగే వేడుక చేసుకునేవారమని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న అపారమైన వేదనను, దు:ఖాన్ని చూసి సుందరార్ హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆయన ఆ చెరువు ఒడ్డుకు చేరుకుని అవినాశిలింగేశ్వరుడిని అంటే పరమశివుడిని సంపూర్ణ భక్తితో ధ్యానిస్తూ పది పవిత్ర తమిళ శ్లోకాలతో కూడిన ఎట్రానై మరక్కేనే అనే ప్రసిద్ధ దేవార పదిగమ్ను ఆలపించారు.ఇలా భక్తి పారవశ్యంలో ఆలపించిన కీర్తనల ద్వారానే శివుడిని మెప్పించి అద్భుతాలు సాధించడం నాయనార్ల చరిత్రలో పలుమార్లు కనిపించే ఒక విశిష్టలక్షణం. సుందరార్ అనన్య భక్తికి ఆర్తికి మెచ్చిన పరమశివుడు ప్రదర్శించాడు. సుందరార్ ప్రార్థన పూర్తికాగానే ఎండిపోయిన ఆ చెరువులోకి నీరు అమాంతంగా ప్రవహించడం ప్రారంభమై నిండింది.ఆ చెరువులో నుండి ఒక పెద్ద మొసలి పైకి తేలింది. యమధర్మరాజు స్వయంగా ఆ బాలుడి ఆత్మను తిరిగి ప్రవేశపెట్టగా ఆ మెుసలి తన నోటి నుండి ఆ బాలుడిని సురక్షితంగా బయటకు పడవేసింది. కాలం గడిచినా శివానుగ్రహంతో ఆ బాలుడు చనిపోకుండా సరిగ్గా ఉపనయన వయస్సున్న 8 ఏళ్ల బాలుడిగా ఎటువంటి గాయాలు లేకుండా నమస్కరిస్తూ బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ శిల్పంలో ముసలి నోటి నుండి బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటకు వస్తున్న భక్తిరస పూరిత అద్భుత దృశ్యాన్ని నాటి శిల్పులు అత్యంత నైపుణ్యంతో చెక్కారు. శైవ సిద్ధాంతంలో భక్తికి శక్తికి భగవంతుని అపరిమిత కరుణకు ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ కథ తమిళ శైవసాహిత్యంలో పెరియపురాణం అనే గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. ఇది నాయనార్ల జీవిత చరిత్రలను వర్ణించే ప్రామాణిక కావ్యం. ఈ నాటికీ అవినాశిలింగేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం పంగుణి అశ్విని నక్షత్రం రోజున ఈ ముదలై వాయి పిళ్ళై అద్భుతాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు విశేషంగా పాల్గొంటారు.– జి.బి. విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ఇవి కూడా చదవండి: విద్యార్థిని తీర్చిదిద్దే అసలైన శిల్పి గురువే! -
విద్యార్థిని తీర్చిదిద్దే అసలైన శిల్పి గురువే!
మాతృదేవోభవ, పితృదేవోభవ అన్న సూక్తి తర్వాత మన సంస్కృతి స్థానం కల్పించింది ఆచార్యుడికే! కన్నవారు జన్మనిస్తే... ఆ జన్మకు సార్థకతను, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. సమాజమనే తోటను సుభిక్షంగా ఉంచే తోటమాలి ఉపాధ్యాయుడు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మించబడుతుందని నమ్మిన దేశం మనది. అటువంటి గురు పరంపరకు కృతజ్ఞతలు చెప్పుకునే పవిత్రమైన రోజే ‘గురు పూజోత్సవం’.భారతదేశ ప్రథమ ఉపరాష్ట్రపతి, ద్వితీయ రాష్ట్రపతి, జగద్గురువుగా కీర్తించబడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని (సెప్టెంబరు 5) మనం ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకుంటాం. ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, దేశ అత్యున్నత పదవిని అధిష్టించినా, ఆయన హృదయం ఎప్పుడూ విద్యాబోధన వైపే నిలిచింది. అందుకే, తన పుట్టినరోజును వేడుకగా కాకుండా, దేశంలోని ఉపాధ్యాయులందరినీ గౌరవించే రోజుగా జరపాలని ఆయన కోరారు. ఆనాటి నుండి నేటివరకు ఈ రోజును మనం ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నాం.సమాజ శిల్పి:కాలం మారుతున్నా, సాంకేతికత పెరుగుతున్నా గురువు పాత్రను పూరించే శక్తి దేనికీ లేదు. ఒక ఉత్తమ గురువు నిర్వర్తించే విధులు కేవలం నాలుగు గోడలకే పరిమితం కావు: కేవలం పుస్తకాల్లోని అక్షరాలను పాఠాలుగా నూరిపోయడం కాదు, లోకజ్ఞానాన్ని అందిస్తూ విద్యార్థిలోని సృజనాత్మకతకు పదును పెట్టడం గురువు ప్రథమ కర్తవ్యం.నైతిక విలువల రూపశిల్పి: విద్యార్థులలో క్రమశిక్షణ, సత్యం, కరుణ, పెద్దల పట్ల గౌరవం వంటి సంస్కారాన్ని నూరిపోసి వారిని సన్మార్గంలో నడిపించే పక్షపాత రహిత మార్గదర్శి గురువు. తరగతి గదిలో ప్రతిభావంతులతో పాటు వెనుకబడిన విద్యార్థులను కూడా సమానంగా ఆదరిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం గురువుకే చెల్లింది.స్ఫూర్తి ప్రదాత: విద్యార్థుల భయాన్ని పోగొట్టి, వారిలో దాగివున్న ప్రత్యేక నైపుణ్యాలను (కళలు, క్రీడలు, నాయకత్వం) గుర్తించిప్రోత్సహించడం ద్వారా గురువు తాను స్ఫూర్తి ప్రదాతగా నిలవడమే కాదు, తన శిష్యులను కూడా పదిమందికీ స్ఫూర్తిని ఇచ్చే మార్గదర్శకులుగా తీర్చిదిద్దుతాడు.గురు ఋణం తీర్చుకుందాంఈనాటి విద్యార్థులే రేపటి దేశ పౌరులు. వారిని ఉత్తమ పౌరులుగా మార్చే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే. కేవలం సెప్టెంబరు 5వ తేదీన పూలమాలలు వేసి సన్మానించడమే కాదు, జీవితాంతం గురువులను గౌరవించడం, వారు చూపిన సన్మార్గంలో నడవడం ద్వారానే మనం గురు ఋణాన్ని తీర్చుకోగలం. సమాజ నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉపాధ్యాయ లోకానికి వందనాలు సమర్పిస్తూ... ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.– డా. డి.ఎల్. అనూరాధ -
బాప్తిస్మం అంటే ఏమిటి? అసలు అర్థం ఇదే!
విశ్వవ్యాప్తంగా రెండు వేల సంవత్సరాల నుండి ఉన్న క్రైస్తవ సమాజానికి మౌలికమైన రెండు సంస్కారాలను యేసు ప్రభువు సూచించారు. ఒకటి పరిశుద్ధ సమభాక్తము. రెండు పరిశుద్ధ బాప్తిస్మం. దీనిని వేదాంత పండితులు దివ్యస్నానం అన్నారు. ఒకసారి జరిగిన వేదాంత సమావేశంలోని పెద్దలు బాప్తిస్మమునకు ప్రతినామంగా దివ్యస్నానమును నిశ్చయించారు. దీనిని కేథలిక్ సంఘం వారు జ్ఞానస్నానమంటారు.వాస్తవంగా బాప్తిజోమ్ అనే గ్రీకు భాషలోని పదం, తెలుగు భాషలో బాప్తిస్మం లేదా జ్ఞానస్నానం అంటారు. ఇంకా కొన్ని ్ర΄÷టెస్టెంట్ సంఘాల గురువుల సమావేశాల్లో ఇంకా అదనంగా ఏడు సంస్కారాలు/సాంప్రదాయాలు నిర్ణయించారు. అప్పటి ఉమ్మడి తెలుగు ప్రాంతాలైన చిత్తూరు మొదలు అదిలాబాద్ ప్రాంతానికి క్రీ.శ. 1842 నుండి మాత్రమే క్రైస్తవ విశ్వాసం ప్రవేశించిందన్నది బైబిలు గురువుల అభి్రపాయ సారాంశం.నీకొదేము సంభాషణ:ఒకసారి యూదుల అధికారిౖయెన నీకొదేమను పరిసయ్యడు, అతడు రాత్రియందు యేసు ప్రభువు వద్దకు వచ్చాడు. ఆయన తో – బోధకుడా... నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని తెలుసు. దేవుడు మీకు తోడై యుంటేనే గానీ నీవు చేస్తున్న సూచక క్రియలను ఎవరునూ చేయలేరన్నాడు. ప్రభువు వానితో ‘‘ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేరని మీతో నిశ్చయంగా చెబుతున్నాను’’ అని అన్నారు.అందుకు నీకొదేము ‘‘ముసలివాడైన మనుష్యుడేలాగు రెండవసారి గర్భం నుండి జన్మింపగలడ’’ని ఆయనతో అన్నాడు. యేసుప్రభువు ఈ విధంగా అన్నాడు. ‘‘ఒకడు నీటి మూలంగానూ, ఆత్మ మూలంగానూ జన్మిస్తేనే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాన’’ని అన్నాడు.పునీత అగస్టీన్ ఈ బాప్తిస్మం అనే ప్రక్రియను బాహ్యంగానూ అంతరంగంలోనూ జరిగే ప్రక్రియ అన్నారు. దీనినే ప్రక్షాళన, కడగబడటం అంటారు. బా΄్తోమ్ (గ్రీకు) అనగా శుద్ధి చేసుకోవటం.సర్వశక్తిమంతుడైన భగవంతునిపై భక్తితో శరణాగతి కలిగి యుండటం. యూదులు దేవాలయంలోనికి ప్రవేశించే ముందు ప్రథమభాగంలో పాప పరిహారార్థం బలులు అర్పణ చేసి గంగాళంలోని నీళ్ళతో శుభ్రపరచుకొని ప్రవేశిస్తారు.ఇవి కూడా చదవండి: ఒక్క ప్రశ్న.. మారిపోయిన ఓ యువకుడి జీవితం!భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతిలో గ్రామ ప్రాంత దేవాలయంలోనికి ప్రవేశించే ముందు చెరువులో స్నానం చేసి, చెరువుగట్టు సమీపంలో వున్న దేవాలయంలోనికి ప్రవేశిస్తారు. అంతరంగ శుద్ధీకరణ అనేది ఒక్కసారే జరగాలి. అది పైనుండి జరిగే క్రియ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల అభిషేకం జరగాలి. ఎందుచేత అంటే ఏక దేవుని నామమున, ఏకత్వం అయిన త్రిత్వదేవునిచే జరిగే ఆత్మప్రక్షాళన. బాప్తిస్మం, సమబాప్తం ఈ రెండు సూత్రాలు క్రైస్తవ సమాజానికి, సంఘానికి పునాది. (ఫౌండేషన్). దైవకార్యార్థ సేవ (మిషన్), అనగా 1. బోధన (టీచింగ్), 2. ప్రబోధ (ప్రీచింగ్), 3. స్వస్థత (హీలింగ్) (టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్).ఆ దినములలో (క్రీ.శ. తొలిదశ) బాప్తిస్మమిచ్చు యోహాను పరలోక రాజ్యం సమీపించి ఉంది. మారు మనస్సు పొందుడని ప్రకటిస్తున్నప్పుడు యూదులందరూ పాపాలను ఒప్పుకొని బాప్తిస్మం పొందారు. ఆ సమయంలో బాప్తిస్మం పొందటానికి యేసుప్రభువు గలిలయ నుండి యోర్దాను దగ్గర వున్న యోహాను దగ్గరకు వచ్చాడు. అప్పుడు యోహాను ‘‘నేను మీ చేత బాప్తిస్మం పొందవలసినవాడనై వుండగా మీరు నా దగ్గరకు వచ్చితిరా?’’ అని ఆయనను నివారింప జూశాడు. కానీ ప్రభువు ‘‘ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగున నెరవేర్చుట మనకు తగియున్నది కావున ఆయనను జరిగించమ’’న్నాడు. కనుక ఆయన అలాగు చేశాడు.యేసు ప్రభువు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు రాగా ఆకాశంనుంచి దేవుని ఆత్మ పావురంలా యేసుప్రభువు దగ్గరకు రావడం చూశాడు యోహాను. ‘‘ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనలో నేనానందిస్తున్నానన్న’’ శబ్దం ఆకాశం నుండి వచ్చింది. (పరి. ముత్త 3:13:17).గురువు/ప్రీస్ట్/పాస్టరు నీటిలో ముంచి తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ పేరిట వారికి బాప్తిస్మం/దివ్యస్నానం ఇవ్వటం, మారు మనస్సు పొందినవారికి త్రియేక దేవుని నామం పేరిట పరి. బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుంది. శరీరానికి, ఆత్మకు, ఆత్మకు, శరీరానికి జరిగే పోరాటంలో జయించిన వారే తమను తాము జయించినవారు. యేసుక్రీస్తు వారు అన్ని విషయాలలో మనవలె జీవించాడు. ఒక్క పాపం విషయంలో తప్ప. అటువంటి బాధ్యత పునీతులు, తమను తాము జయించుకున్నవారే పరలోక రాజ్యానికి అర్హులు. అది యేసు వారు దైవకుమారుడైనందుననే లోకాన్ని జయించాడు. తనను తాను రిక్తునిగా చేసుకుని తండ్రియైన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. అటువంటి ధన్యత, భాగ్యం మనకనుగ్రహించును గాక. ఆమెన్!– కోట బిపిన్ చంద్రపాల్నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
ఒక్క ప్రశ్న.. మారిపోయిన ఓ యువకుడి జీవితం!
మహోపాధ్యాయ మహాప్రవక్త ‘‘ఈ రోజుల్లో కాస్త కోపం వస్తే చాలు, విరుచుకుపడే మాష్టార్లను చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో... ఒక అమాయకపు పల్లెటూరి మనిషి, మసీదు పవిత్రత తెలియక లోపల మూత్రవిసర్జన చేస్తే, చుట్టూ ఉన్నవాళ్ళు కర్రలెత్తారు. కానీ ఆ మమహనీయులు ఏమన్నారో తెలుసా? ‘‘ఆగండి... అతడిని పూర్తి చేయనివ్వండి.’’ అదీ సహనం అంటే! ఆ తర్వాత అతడిని దగ్గరకు పిలిచి, ప్రేమగా చెప్పి, ఒక బకెడు నీళ్లతో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించారు.‘‘తప్పు చేశావు!’’ అని గద్దించడం కాదండీ, ‘‘ఏది ఒప్పో’’ తలనిమిరి చెప్పడం గురువు లక్షణం. అలాగే ఒక కుర్రాడు వచ్చి, నాయనా... నాకు వ్యభిచారం చేయడానికి అనుమతివ్వు అని అడిగితే... ఏ సమాజమైనా ఏం చేస్తుంది? కానీ ప్రవక్త గారు నవ్వారు. కూర్చోబెట్టుకున్నారు. ‘‘రా నాయనా... ఇది నీ తల్లికో, నీ చెల్లికో ఇతరులు చేస్తే ఒప్పుకుంటావా?’’ అని అడిగారు. ఆ ఒక్క ప్రశ్న ఆ కుర్రాడి గుండెల్లో నాటుకుపోయింది. మనసు మారిపోయింది. విమర్శించడం కాదు, ఆలోచింపజేయడం! అదీ ఆయన శైలి.ఖురాన్ అంటుంది: ‘‘ఆయనే మీకు జ్ఞానాన్ని, విచక్షణను, సరికొత్త విషయాలను నేర్పించే గురువు’’ అని. అందుకే ఇస్లాంలో గురువు స్థానం సామాన్యమైనది కాదు. హజ్రత్ అలీ ఒక మాటంటారు ‘‘నాకు ఒక్క ఒక్క అక్షరం నేర్పినా, నేను జీవితాంతం అతనికి బానిసనే!’’ ఎంత గొప్ప మాటండీ ఇది! ఈ రోజుల్లో గురువులకు ఆ గౌరవం దక్కుతోందా? మనం చనిపోయాక కూడా మనతో వచ్చేది రెండే రెండు... ఒకటి మనం చేసిన మంచి, రెండు మన గురువు మనకు నేర్పిన జ్ఞానం. దాన్నే ‘సదఖాయె జారియా’ అన్నారు.అంటే తరగని పుణ్యం! ఒక్క మాటలో చెప్పాలంటే... గురువు అంటే కేవలం పుస్తకాల్లోని పాఠాలు అప్పజెప్పే టేప్ రికార్డర్ కాదండీ... ఒక మనిషిలోని అజ్ఞానాన్ని తుడిచేసి, అతనిలో నిద్రపోతున్న మంచితనాన్ని నిద్రలేపే ఒక ‘అద్భుతమైన శిల్పి’. ఆ శిల్ప కళను ప్రపంచానికి ఆచరించి చూపించిన ఆ మహా ఉపాధ్యాయుడికి మేలును ఎలా మర్చిపోగలం! ఏమంటారు? ఆలోచించండి మరి!– ముహమ్మద్ ముజాహిద్ఇవి చదవండి: జన్మాష్టమి రోజు ఈ పనులు చేయడం వెనుక ఇంత అర్థముందా? -
జన్మాష్టమి రోజు ఈ పనులు చేయడం వెనుక ఇంత అర్థముందా?
శ్రీకృష్ణుడు భువిపై అవతరించిన పర్వదినాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమిగా భక్తులు ప్రతియేటా జరుపుకుంటారు. శ్రావణమాసం కృష్ణపక్షం – అష్టమి తిథిన దేవాది దేవుడు ఆవిర్భవించాడు. నేటి ఉత్తరప్రదేశ్ లోని మధురలో దేవకీ వసుదేవుల అష్టమ సంతానంగా కంసుని కారాగృహంలో భగవానుని ఆవిర్భావం జరిగింది. ఈ శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా... భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుని జన్మవృత్తాంతాన్ని రేఖామాత్రంగానూ, ఆ తర్వాత ఆ పర్వదినాన ఆచరించ వలసిన విధులనూ తెలుసుకుందాం...పూర్వం దానవ రాజుల అకృత్యాలతో భూమాత తల్లడిల్లింది. తన ఇబ్బందులను వినిపించేందుకు బ్రహ్మదేవుని చెంతకు భూమాత చేరింది. భూలోక పరిస్థితులను విన్న బ్రహ్మ తాను కూడా కలత చెంది క్షీరసాగరంలో శయనించిన విష్ణువును దేవతలందరితో కలసి వెళ్లి స్తుతిస్తారు. వీరి మొర ఆలకించిన దేవాదిదేవుడు త్వరలోనే వారి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తానన్న తన దివ్య సందేశాన్ని బ్రహ్మ ద్వారా తెలియజేస్తాడు. తదనంతరం శ్రీ మహావిష్ణువు సూచన మేరకు దేవతలందరూ తమకు నిర్దేశించిన రీతిలో యదువంశంలో జన్మిస్తారు. ఆ తర్వాత శ్రీ కృష్ణుడు తానే స్వయంగా దేవకీ దేవి అష్టమ గర్భాన కృష్ణునిగా అవతరించాడు.ధర్మాచరణంధర్మ స్థాపన కొరకు దేవాది దేవుడి శ్రీ కృష్ణ అవతారం చాలా ప్రముఖమైనది. క్రూరుడు అయిన కంసుడిని వధించి యదువంశాన్ని రక్షించాడు. బాల్యలీలల ద్వారా పూతనను సంహరించాడు. గోవర్ధనగిరి అనే పర్వతాన్ని చిటికన వేలితో ఏడురోజులపాటు ఎత్తి యాదవులందరిని కాపాడాడు. కాలియుడనే విష సర్పం గర్వాన్ని అణిచివేసి పడగలపై నృత్యం చేశాడు జరాసంధుడు, శిశుపాలుడు వంటి ఎందరో దానవులను మట్టుబెట్టారు. కుచేలుడు, కుంతీదేవి, ద్రౌపది వంటి వారెందరికో తన కృపను ఇచ్చాడు. మహాభారత యుద్ధంలో పాండవులకు ఎల్లవేళలా రక్షణ ఇచ్చి చివరకు అర్జునుడికి రథ సారధి అయ్యాడు. యుద్ధభూమిలో కర్తవ్య నిర్వహణకు సందేహించిన అర్జునుడికి జీవితసత్యాలతో భగవద్గీత బోధించాడు. ఈ గ్రంథం సర్వమానవాళికి గొప్ప మార్గదర్శం.జన్మాష్టమి రోజు చేయాల్సినవిభగవానుడికి చేరువయ్యేందుకు భక్తులు ఉపవాసం చేస్తారు. అర్ధరాత్రి కృష్ణుడి జన్మ సమయం వరకు భజనలు, కీర్తనలు చేస్తూ శ్రీ కృష్ణుని లీలలను శ్రవణం చేస్తారు. కృష్ణుడి విగ్రహానికి అభిషేకం నిర్వహిస్తారు, అటుకులు, వెన్న, మిఠాయిలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఉట్టి కొట్టడం, సాంస్కృతిక ప్రదర్శనలు, కృష్ణ అలంకరణ వంటివి కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఇలా దేవాదిదేవుడి జన్మదినం సర్వమానవాళికి శుభం కలిగించే మహోత్సవంగా జరుపుతారు.– దేవిశెట్టి శ్రీనివాస్భగవంతుడనే పదానికి స్వాగతం కృష్ణా...ప్రపంచంలోని మతాలన్నీ ఆయా సంస్కృతులు, భాషానుసారం భగవంతుణ్ణి వివిధ నామాలతో సంబోధిస్తుంటాయి. ఆ నామాలన్నీ నిస్సందేహంగా భగవంతుణ్ణి ఉద్దేశిస్తూ తెలుపబడినవే, కాని అవి భగవంతుని అనంతమైన గుణాల్లో ఒక్కోగుణాన్ని ప్రత్యేకంగా ఉద్దేశిస్తూ తెలుపబడినవి.‘భగవంతుడు’ అనే పదానికి అత్యంత సరళమైన ఒక నిర్వచనం. అంటే, ‘ఎవరినుంచైతే సర్వం ఆవిర్భవిస్తుందో వారే’ అని అర్థం. (శ్రీమద్భాగవతం 1.1.1)విశేషమైన ప్రామాణిక వైదిక వాఙ్మయాన్ని పరిశీలిస్తే, ‘భగవంతుడు’ అన్న పదానికి వేదవ్యాసుల తండ్రియైన పరాశరముని ఒకచక్కటి నిర్వచనాన్ని అందించారు.ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసఃశ్రియఃజ్ఞాన వైరాగ్యయోశ్చైవషణ్ణాం భగవతీంగన‘‘జ్ఞాన, బల, ఐశ్వర్య, కీర్తి, సౌందర్య, వైరాగ్యాలనే ఆరు విభూతుల నిధనమే దేవాదిదేవుడైన భగవంతుడు.’’ (విష్ణు పురాణం 6.5.47) జన్మాష్టమి అంటే శ్రీ కృష్ణుడు అవతరించిన దివ్యతిథి. పరమపూజ్యశ్రీ శ్రీల ప్రభుపాదుల వారి విశేష కృషి ఫలితంగా నేడు జన్మాష్టమి మహోత్సవం ప్రపంచమంతటా జరుపుకుంటోంది. ప్రతి ఒక్కరూ ఈ జన్మాష్టమి రోజున మీకు సమీపంలోని మందిరాన్ని సందర్శించి, పవిత్ర భగవన్నామాలను జపిస్తూ ఉత్సవాల్లో భాగస్తులై శ్రీ కృష్ణుడిని మీ జీవితాల్లోనికి స్వాగతించండి. హరే కృష్ణ!– శ్రీ మాన్ సత్య గౌర చంద్ర దాస, అధ్యక్షులు, హరేకృష్ణ మూమెంట్, హైదరాబాద్ఇవి కూడా చదవండి: అన్నదాన మహిమ! -
అన్నదాన మహిమ!
‘అన్నదానాత్పరం నాస్తి దానమన్యదిలాతలే.’ ఈ భూలోకంలో అన్నదానం కంటె గొప్ప దానం మరొకటి లేదు. నిత్యం అన్నదానం చేసే ఓ వ్యక్తి తన మరణానికి ముందు తన కుమారుణ్ణి పిలిచి, తాను చేసినట్లే అన్నదానం చేయాలని కోరాడు. తన దగ్గర అంతగా డబ్బులేని ఆ కుమా రుడు తన సమస్యను నారాయణునికి నివేదించడానికి బదరీకి బయలుదేరాడు.దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు నిండా పండ్లు ఉన్నాయి. వాటిని ఎవరూ ముట్టుకున్న జాడ కనిపించలేదు. ఒక పాము ఎవరు ఎంత కొట్టినా తనకు చావు రావడంలేదని చెప్పింది. ఒక పొలం యజమాని తన పండిన పంట తనకు దక్కడం లేదని వాపోయాడు. తమ సమస్యలను బదరీ నారాయణునికి నివేదించమని కోరారు. దారిలో ఆకలితో ఒక బోయవాని ఇంటికి వెళితే బోయవాడు తన కోసం ఉంచుకున్న దుంపలను ఆ బాటసారికి ఇచ్చాడు. అతడి భార్యాపిల్లలు తమ దుంపలను ఇవ్వడానికి నిరాకరించారు. తెల్లవారే టప్పటికి ఓ పులి బోయవాణ్ణి, అతడి కుటుంబాన్ని చంపిన దృశ్యం చూశాడు.బదరీ వెళ్లి నారాయణునితో ముందుగా ఇతరుల సమస్యలే నివేదించాడు. అందుకా నారాయణుడు పూర్వ జన్మలో ఒక వేదపండితుడు ఎవరికీ వేద పాఠం చెప్పకుండా చనిపోయి ఈ జన్మలో ప్రయోజనం లేని పండ్ల చెట్టయి పుట్టాడనీ, ఇప్పుడు ఎవరికైనా వేదం చెబితే అతడి సమస్య తీరుతుందనీ చెప్పాడు. పాము పూర్వజన్మలో పెద్ద ఆస్తిగల పిసినారి అనీ, ఇప్పుడు తన మణి మాణిక్యాలకు కాపలా కాస్తూ పడివున్నదనీ, వాటిని ఎవరికైనా దానం చేస్తే సమస్య తీరుతుందనీ చెప్పాడు. పొలం యజమాని తన ముగ్గురు కూతుళ్ళకు కన్యాశుల్కం తీసుకున్నాడనీ, ఇప్పుడు నాలుగో కుమార్తెకు కన్యా శుల్కం తీసుకోకుండా పెళ్లి చేస్తే అతడి పంట చేతికి వస్తుందనీ చెప్పాడు. ఇక బోయవాని ఉదంతం తెలుసుకోవాలంటే ఇప్పుడే కాశీరాజుకు జన్మించిన కుమారుని వద్దకు వెళ్ళమన్నాడు.బాటసారి ఆ పసిబాలుని దగ్గరకు వెళ్లగా ‘నీకు ఆకలి వేసినప్పుడు దుంపలను ఆహారంగా ఇచ్చిన బోయవాడిని నేనే! తమవంతు ఆహారాన్ని పెట్టని నా భార్య, బిడ్డలు ఈ జన్మలో పందిపిల్లలుగా పుట్టారు’ అని చెప్పాడు. దీంతో అన్నదాన మహిమ అర్థమైన బాటసారి నారాయణుడు చెప్పిన పరిష్కార మార్గాలు రైతు, పాము, మామిడి చెట్టుకు చెప్పాడు. దీంతో, రైతు తన కుమార్తెను బాటసారికిచ్చి పెండ్లి చేశాడు. పాము తన సంపదనంతా అతడికే ఇచ్చింది. మామిడి చెట్టు రూపంలోని పండితుడు వేద పాఠం చెప్పాడు. అందరి సమస్యలను పరిష్కరించిన బాటసారి ధనం, విద్య, భార్యతో తల్లిని చేరి అన్నదానం ప్రారంభించి ధన్యుడయ్యాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ఒక్క ఏడాది.. ఆరు కొత్త పేర్లు.. పాండవుల అజ్ఞాతవాస కథ ఇదే!
మాయాజూదంలో పాండవులు ఓడిపోయిన తర్వాత ఒప్పందం ప్రకారం 12 ఏళ్ళు అరణ్య వాసం, ఏడాది పాటు అజ్ఞాతవాసం చేశారు. ఈ సమయంలో వారు పాండవులు అని ఎవరికైనా తెలిసినట్లయితే మరో 12 ఏళ్లు అరణ్యవాసం, మరో ఏడాది అజ్ఞాతవాసం చేయాలనే నిబంధన ఉంది. అందువల్ల తాము ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం పాండవులు మత్స్యదేశాధిపతి అయిన విరాటరాజు కొలువులో ఏడాది పాటు అజ్ఞాతవాసం చేసారు. ఆ సమయంలో పాండవులు విభిన్న పేర్లతో వారి వారి వృత్తులను నిర్వహించారు. వారి పేర్లు, నిర్వహించిన వృత్తులను ఇప్పుడు తెలుసుకుందాం.ధర్మరాజు కంకు భట్టు పేరుతో యతి వేషంలో తనకున్న విద్యతో విరాట రాజుకు వినోదం కలిగించేవాడు.భీముడు వలలుడు పేరుతో విరాట రాజు కొలువులో వివిధ రకాల రుచికరమైన వంటలు చేసి మెప్పించేవాడు.అర్జునుడు బృహన్నలగా రూపం మార్చుకుని విరటుని కొలువులో యువతులకు నాట్యంలో శిక్షణ ఇచ్చేవాడు.ఇక నకులుడు దామగ్రంథిగా పేరు మార్చుకుని విరటుని ఆస్థానం లో అశ్వశాల విధులు నిర్వహించాడు. అశ్వాలకు శిక్షణ ఇచ్చేవాడు.సహదేవుని తంత్రీపాలుడనే పేరుతో పశువుల శాలకు అధిపతిగా ఉంటూ పశుపోషణ చేస్తూ గోపాలకుడిగా విధులు నిర్వహించాడు.పాండవుల భార్య ద్రౌపది మాలిని పేరుతో విరాట రాజు భార్య సుధేష్ణ అంతఃపురం లో (సైరంధ్రి)గా మాలలు అల్లేలా... రాణిగారికి ప్రధాన పరిచారికగా విధులు నిర్వహించింది. (నేటి పరిభాషలో చె΄్పాలంటే మేకప్ ఉమన్‌గా అన్నమాట.– సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులుఇవి కూడా చదవండి: ఒక్క వృద్ధుడి నమ్మకం.. మొత్తం గ్రామం తలరాతనే మార్చింది! -
ఒక్క వృద్ధుడి నమ్మకం.. మొత్తం గ్రామం తలరాతనే మార్చింది!
రామాపురం గ్రామం నిత్యం ΄ాడిపంటలతో సస్యశామలంగా ఉండేది. ఒక్కసారిగా ఊరిని కరవు కబళించింది. భూములు బీటలు వారాయి. పశువులు ఆవురావురంటూ ఆకలి కేకలు వేశాయి. నిండు బావులు అడుగంటాయి. కరవును ఎదుర్కోలేక గ్రామస్తులు వలసలు మొదలుపెట్టారు. అది గమనించిన ఓ బ్రాహ్మణుడు ఊరికి ఉత్తర దిక్కున ఉన్న రావిచెట్టు కింద ఉన్న నారాయణుడి శిలకు పూజలు చేయమని చెబుతాడు.ఆయన మాటలు విని గ్రామస్తులు ఉన్నంతలో నారాయణుడిని ఆరాధిస్తారు. ప్రతిరోజు పూజలు చేస్తారు. ఫలితం మాత్రం కనిపించదు. రోజులు గడుస్తున్నా.. గడ్డుకాలం గ్రామాన్ని వీడలేదు. అలసిన గ్రామ ప్రజలు పూజలను మొక్కుబడిగా మమ అనిపిస్తారు. కరువు అలవాటు కావడంతో కొందరు ఇళ్లకే పరిమితమవుతారు. భగవంతుడు ఉన్నాడా అనే సందేహంతో మళ్లీ వలసలు కొనసాగించారు.కానీ అదే గ్రామం లోని ఓ వృద్ధుడు బ్రహ్మయ్య మాత్రం పూజలు కొనసాగిస్తూనే ఉంటాడు. అలసట లేకుండా వర్షాలు పడతాయని ప్రతిరోజూ నారాయణు డిని ్ర΄ార్థిస్తూనే ఉంటాడు. తన భక్తిపై నమ్మకంతో పూజకు వెళ్లే క్రమంలో తాటాకుతో అల్లిన గొడుగును వెంట తీసుకువెళతాడు. అది చూసి గ్రామప్రజలు నవ్వేవారు. కానీ ఆయన మాత్రం బ్రాహ్మణుడు చెప్పిన నాటి నుంచి ప్రతిరోజూ నారాయణుడిని కొలుస్తూనే ఉన్నాడు. అలా కాలం గడుస్తుంటుంది.రోజూలానే బ్రహ్మయ్య నారాయణుడి సేవకు వెళ్లి పూలను శ్రీహరికి సమర్పించి వెనుతిరుగుతాడు. ఉన్నఫళంగా ఆకాశం మేఘావృతం అవుతుంది. క్షణాల్లో కారుమబ్బులు కమ్ముకొని చినుకులు పడడం మొదలవుతాయి. దీనిని గమనించిన వైకుంఠంలోని లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువును ఇలా అడుగుతుంది... స్వామీ, గ్రామంలోని ప్రజలందరూ కలసి ఎన్నో రోజులు పూజించారు. కానీ.. మీరు బ్రహ్మయ్య భక్తికి మాత్రమే కరుణించడంలో ఆంతర్యం ఏమిటి? అని.అప్పుడు శ్రీమహావిష్ణువు ‘‘భగవంతుడు ఎప్పటికైనా కరుణిస్తాడని బ్రహ్మయ్య నమ్మడమే ఇందులోని ఆంతర్యం. బ్రహ్మయ్య అందరిలా కార్యాచరణ చేసి ఆగలేదు. ఆయన శ్రద్ధాభక్తికి నేను తన్మయం పొందాను. ముఖ్యంగా వర్షం పడుతుందన్న నమ్మకంతో రోజూ గొడుగు కూడా తెచ్చుకునేవాడు. ఆ నమ్మకానికి నేను కట్టుబడి ఉండకపోతే ఆ రావిచెట్టు కింద ఉంది నిజంగానే శిలే అనుకుంటాడు’’ అని బదులిచ్చాడు. భగవంతుడిని పూజించడం అంటే కార్యసాధన చేసి విజయం వరించే వరకూ నిలవడం అని గ్రామస్తులు గ్రహిస్తారు.– పంతాడి లోకరాజు, సాక్షి, మంగళగిరిఇవి కూడా చదవండి: ఒక్కరోజు భోజనం.. ఆరు నెలలు నిద్ర! కుంభకర్ణుడికి ఈ వరం ఎలా? -
ఒక్కరోజు భోజనం.. ఆరు నెలలు నిద్ర! కుంభకర్ణుడికి ఈ వరం ఎలా?
రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ గురించి తపస్సు చేశారు. ‘ఏ వరమూ లేకుండానే కావరంతో వీడు పెట్టే బాధలు భరించరానివిగా ఉన్నాయి. ఇక వరములిస్తే లోకాలు తట్టుకోగలవా దేవా? కనుక, ఏ వరాలూ కుంభకర్ణుడికి ఇవ్వవలదు’ అని బ్రహ్మదేవుడిని ప్రార్థించారు దేవతలు.కుంభకర్ణుడిపై కారుణ్యత్వము మాని, అతడిని మాయావివశుడిని జేసి, ఏదో ఒక చిన్న వరాన్ని ప్రసాదిస్తే లోకాలకు శుభం జరుగుతుంది అన్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ‘సకల జీవుల రసనలపై నిలిచి నాట్య మాడే నీవు, ఈ కుంభకర్ణుడి రసనపై ఇప్పుడు నిలిచి, నీ చాతుర్యంతో వ్యర్థ ప్రలాపాలను పలికించి, లోకాలకు హాని కలిగించే వరం ఏదీ అతడు కోరుకోకుండా చేయుము!’ అని సరస్వతీదేవిని ఆదేశించాడు. అలాగేనంది ఆమె.అప్పుడు బ్రహ్మ, తపస్సులో ఉన్న కుంభకర్ణుడి ముందు ప్రత్యక్షమై ‘కుంభకర్ణా! నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. బ్రహ్మ చెప్పినట్లుగా సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై చేరి, ఆ క్షణం కుంభ కర్ణుడి చేత ‘ఆరుమాసాలు సుఖనిద్ర, ఒకరోజు భోజనం’ ప్రసాదించమని అడిగించింది. ‘నిజమే, అదే మేలు. నీవు కోరిన ప్రకారమే సుఖ నిద్రలో ఉండు’ అని కుంభకర్ణుడికి వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. కుంభకర్ణుడు వెంటనే నిద్రలోకి జారు కున్నాడు. దేవతలు సంతోషించారు.‘ఉత్తర రామాయణం’ కావ్యం, ద్వితీయాశ్వాసంలోని ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని, ఆ కావ్యకర్తయైన కంకంటి పాపరాజు ఇలా వ్యాఖ్యానించాడు: క. పౌరుషంబునకు దైవం/ బారయ ఫలకారి యందు రాదైవంబే/ వైరస్యము వహించిన/ నేరూపున పురుషుడొందు నిష్టార్థంబుల్. మనిషి కోరుకునే కోరికలను, ఆ కోరికలు సఫలం కావాలని చేసే ప్రయత్నాలను దైవం ఫలవంతం చేస్తాడు. అటువంటిది, ఆ దైవమే, చేసే ప్రయత్నాలపట్ల విముఖు డైతే, ఆ వ్యక్తి తన కోరికలను ఎలా తీర్చుకుంటాడు? తీర్చుకోలేడు. ఆ పరిస్థితి రాకుండా ధర్మయుక్తమైన జీవితం గడుపుతూ, దైవం పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండటం మనిషి చేయవలసిన పని.– భట్టు వెంకటరావుఇవి చదవండి: కుటుంబం: సామాజిక సౌధానికి పునాది -
ఇంద్రపదవి అడిగిన రజి.. దేవతలు చెప్పిన మాటతో కథే మారిపోయింది!
పురూరవుడి కొడుకు ఆయువుకు నహుషుడు, క్షుత్రవృద్ధుడు, రంభుడు తర్వాత మహా బలసంపన్నుడైన రజి అనే కొడుకు కలిగాడు. రజికి ఐదువందల మంది కొడుకులు కలిగారు. రజి తన రాజ్యాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో దేవ దానవుల నడుమ భీకర సంగ్రామం జరిగింది. రోజులు గడుస్తున్న కొద్ది పోరు మరింత ఘోరంగా పరిణమిస్తోందే తప్ప, జయాపజయాలు ఎటూ తేలడం లేదు. ఎటూ తోచక ఉభయపక్షాలవారు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, ‘బ్రహ్మదేవా! ఈ పోరులో అంతిమ విజయం ఎవరికి దక్కుతుందో నువ్వే చెప్పాలి’ అని అడిగారు.అప్పుడు బ్రహ్మదేవుడు, ‘నాయనలారా! రజి మహారాజు మీలో ఎవరి పక్షం వహిస్తే, పోరులో విజయం వారినే వరిస్తుంది’ అని చెప్పాడు.వెంటనే మొదట దానవులు రజి మహారాజు వద్దకు వెళ్లారు. రజి వారిని సాదరంగా ఆహ్వానించి, వచ్చిన పనేమిటో చెప్పమన్నాడు.‘మహారాజా! మాకు, దేవతలకు సంగ్రామం జరుగుతోంది. నువ్వు మా పక్షాన యుద్ధంలో పాల్గొనాలని మా కోరిక’ అని చెప్పారు దానవులు.‘మీ తరఫున యుద్ధం చేయాలంటే, నాదొక్కటే షరతు. యుద్ధం ముగిశాక నాకు ఇంద్రపదవి ఇస్తామని మాట ఇవ్వండి’ అన్నాడు రజి మహారాజు.దానవులు తమలో తాము తర్జన భర్జనలు పడి, ‘రాజా! ఇప్పుడు మాట ఇచ్చి, తర్వాత కాదనడం ధర్మం కాదు. అంత్య నిష్ఠురం కంటే ఆది నిష్ఠురమే మంచిది. మా లోకానికి రాజు ప్రహ్లాదుడు. ఆయనకు ఇంద్ర పదవి దక్కాలనే మేమంతా దేవతలతో యుద్ధానికి సిద్ధపడ్డాం. కాబట్టి నీకు ఇంద్రపదవిని ఇవ్వలేము. మరింకేదైనా కోరుకుంటే తప్పక ఇస్తాము’ అని చెప్పారు.‘ఇంద్ర పదవి తప్ప మరేదీ నాకు సమ్మతం కాదు’ తెగేసి చెప్పాడు రజి మహారాజు.చేసేది లేక దానవులు వెళ్లిపోయారు.దానవులు వెళ్లిపోయిన కొద్దసేపటికే దేవతలందరూ రజి మహారాజు వద్దకు వచ్చారు. యుద్ధంలో తమ పక్షాన పాల్గొనాలని అభ్యర్థించారు.దానవులతో చెప్పినట్లే, ‘యుద్ధం ముగిశాక నాకు ఇంద్ర పదవి ఇవ్వడానికి అంగీకరిస్తేనే మీ తరఫున యుద్ధంలో పాల్గొంటాను’ అని కరాఖండిగా చెప్పాడు.దేవతలు ఎక్కువగా ఆలోచించకుండా, రజి మహారాజు షరతుకు తమ సమ్మతి తెలిపారు.రజి మహారాజు తన సేనలను వెంటబెట్టుకుని దేవతల తరఫున యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధరంగంలో వీరవిహారం చేస్తూ, శత్రువులు కని విని ఎరుగని దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. అనాయాసంగానే అశేష దానవ వాహినిని పరాజితులను చేశాడు. అతడి అస్త్రాల ధాటికి మరణించిన వారు మరణించగా, మిగిలిన దానవులు పలాయనం చిత్తగించారు. రజి మహారాజు సాయంతో దేవతలు విజేతలయ్యారు.యుద్ధం ముగిశాక దేవేంద్రుడు రజి మహారాజు పాదాల ముందు మోకరిల్లి, ‘మహానుభావా! ఆర్తుడనైన నాకు అభయప్రదానం చేసి, స్వర్గలోకాన్ని కాపాడావు. అభయప్రదాతవు గనుక నువ్వు నాకు సాక్షాత్తు పితృసమానుడవు. ముల్లోకాలకూ ఆరాధ్యుడవైన పురుషోత్తముడవు నువ్వు. నన్ను నీ పుత్రుడిగా స్వీకరించు’ అని ప్రార్థించాడు.దేవేంద్రుడి ప్రణుతి వాక్యాలలోని అంతరార్థాన్ని గ్రహించిన రజి మహారాజు చిరునవ్వు చిందించాడు. ‘శరణు కోరినవాడు పగవాడైనా తిరస్కరించడం వీరధర్మం కాదు. నర్మగర్భంగా, నయంగా మాట్లాడి నువ్వు నా మనసు చూరగొన్నావు. నీ మనోగతం నాకు అవగతమైంది. నీ స్వర్గాన్ని నీకు పునర్దత్తం చేస్తున్నాను’ అని పలికి, తనకు దేవతలు ఇచ్చిన ఇంద్రపదవిని తిరిగి దేవేంద్రుడికే కట్టబెట్టి, నిజ నివాసానికి బయలుదేరాడు.రజి మహారాజు తన నివాసానికి చేరుకునేలోగానే, నారద మహర్షి అతడి ఐదువందల మంది కొడుకులను రెచ్చగొట్టాడు. ‘మీ తండ్రికి ఇంద్రపదవి ఇస్తామని మాట ఇచ్చి, మాయోపాయంతో దేవేంద్రుడు తిరిగి ఆ పదవిని దక్కించుకున్నాడు’ అని నూరిపోశాడు.నారదుడి మాటలతో రెచ్చిపోయిన రజి మహారాజు కొడుకులు మూకుమ్మడిగా స్వర్గంపైకి దండయాత్రకు వెళ్లారు. తమ తండ్రి సాధించిన ఇంద్రపదవి వారసత్వ పరంపరగా తమకే దక్కాలంటూ ఇంద్రుడితో వాదించారు. అతడు కాదనడంతో, అతడిని సింహాసనం పైనుంచి ఈడ్చి పడేసి, స్వర్గం నుంచి తరిమి కొట్టి, స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు.పురావిశేషం..ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ఈ ప్రదేశంలో 1844లో నేలను తవ్వుతుండగా, రాతి శివలింగం కనిపించింది. శివలింగాన్ని వెలికి తీసి, పూజలు జరిపిన స్థానికులు ఆలయాన్ని నిర్మించారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఈ ఆలయ ప్రాంగణం సిపాయిల రహస్య సమావేశాలకు వేదికగా ఉండేది. నాటి సిపాయిల దళాన్ని ‘బ్లాక్ ప్లటూన్’గా ‘కాలీ పల్టన్’గా పిలుచుకునేవారు. ఏటా శ్రావణ మాసంలో కావడి యాత్రికులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. అప్పట్లో ఆలయం కొంత దెబ్బతింటే, 1968లో ఇప్పుడు ఉన్న విధంగా పునర్నిర్మంచారు.- సాంఖ్యాయనఇవి కూడా చదవండి: ఉగాండాలో మొదలైన బయింబా ఫెస్టివల్.. ప్రత్యేకతలేంటో తెలుసా? -
ప్రేమ, సేవ, సత్యం.. ఆధ్యాత్మిక వికాసానికి ఇవే మెట్లు!
ఆధ్యాత్మిక వికాసం పట్ల ఆకర్షితులైన ఆలోచనపరుల ఆసక్తులు ఉన్నతంగా ఉంటుంటాయి. సకల సృష్టిపట్ల వారు ప్రేమతో వ్యవహరిస్తారు. సద్భక్త్యాసక్తితో తన చుట్టూ ఉన్న సాటివారిని, దూరస్తులైన సామాన్యు లనూ ఒకేలా ప్రేమిస్తారు.సామాజిక సేవ సంబంధిత పరిచర్యలకు తమ విలువైన సమయం కేటాయించడం, సత్క్రియలను చేతలలో చూపడం, మేలైన సాహిత్యం చదవడం, గాత్ర సంగీతం వినడం, సేంద్రియ తోటల పెంపకం, కొత్త భాషలు నేర్చుకోవడం, చిన్న పిల్లలకు తగు శ్రద్ధతో ఓపిక సహనం కలిగి అర్థవంతమైన రీతిలో పాఠాలు బోధించడం, బాధితులను ఓదార్చి వారిలో ధైర్యం నూరిపోయడం, పరిసరాల పరిశుభ్రతకు పూనుకొని పర్యావరణాన్ని కాపాడుకొనే ప్రయత్నాలు చేయడం, బృందపని సారథ్య సామార్థ్యం పట్ల అవగాహన పెంచడం వంటి అలవాట్లు, పనులు వీరిలో కనిపిస్తాయి.సత్యాన్ని ప్రేమించే అన్వేషకులు ఆత్మ సంబంధ జీవముతో వర్ధిల్లుతుంటారు. సత్య సంబంధ ఆత్మజ్ఞానం ఆత్మకు ఆహారం. ఇట్టి ఆహారం వలన జీవింపజేసేది, మనిషి ఉనికిని కాపాడుతుండేది ఆత్మే కాబట్టి ఆత్మ అభ్యున్నతి పట్ల శ్రద్ధ అవసరం. తెలిసిన కొద్దిపాటి సత్యంతోనే ఎదగడం ప్రారంభిస్తే, అనగా అట్టి సత్యానికి లోబడి జీవిస్తేనే మరింతగా సత్యములోనికి అడుగులు పడే అవకాశం మెండుగా ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక వికాసం వైపుగా ఒక్కో మెట్టు ఎక్కగలిగితే ఆధ్యాత్మిక భావ దారిద్య్రం నుండి విడిపించబడతాము.– జేతమ్ఇవి చదవండి: ధైర్యం వదిలేస్తే ఏం జరుగుతుంది? -
శ్రావణ పూర్ణిమకు అంతటి విశిష్టత ఎందుకు?
దైవారాధనకు అన్ని రోజులూ అనువైనవే. కానీ కొన్ని రోజులు మరీ అనువైనవని భావించటం ఆస్తికులకు ఒక ముచ్చట. అందుకే ఇన్ని పండగలు! ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక ప్రమాణాలకూ, ఇంద్రియాలకూ అందదు. దాన్ని మనిషి తన మనసు ద్వారా భావించి, చింతన చేసి, గ్రహించ వలసిందే.ఆ మనసును నియంత్రించే అధిష్ఠాన దేవత చంద్రుడు. అందుకే నిండు పున్నమి దినాలన్నీ మనసును ఉత్తేజితం చేస్తాయి. కాబట్టి, పున్నమి దినాలన్నీ ఆధ్యాత్మిక చింతనకూ, సాధనలకూ, కార్యకలాపాలకూ అనుకూలమైన పర్వదినాలుగా పరిగణిస్తారు. అందునా శ్రావణ, కార్తీక పూర్ణిమలు మరీ విశిష్టాలు. శివారాధనకు శ్రావణ పూర్ణిమ ఎంతో ప్రశస్తం.శ్రావణ పూర్ణిమ అనగానే మూడు విశేషాలు మనసుకు వస్తాయి. ఇది ‘రాఖీ’ పూర్ణిమ. రక్షాబంధనాల పూర్ణిమ. సోదరులూ, తత్సమానులైన వారి క్షేమాన్నీ, సర్వతోసమృద్ధినీ ఆకాంక్షిస్తూ, సోదరీమణులూ (తత్సమానురాళ్ళూ) అనురాగంతో, ఆత్మీయతతో వారి చేతికి రక్షాబంధనాలు కట్టే వేడుక అనేక శతాబ్దాలుగా వస్తున్నది.ఈ పూర్ణిమ హయగ్రీవ అవతార తిథి. బ్రహ్మ చేసిన సత్రయాగంలో విష్ణుమూర్తి వేదమయుడైన హయగ్రీవు డిగా అవతరించి, తనఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వేదవాణిని ప్రకటించాడని భాగవతం చెప్తుంది. జ్ఞాన సర్వస్వ మైన వేదాలను వినిపించిన జ్ఞానానందమయుడూ, నిర్మల స్ఫటికాకారుడూ, సకల విద్యలకూ ఆధారమూ అయిన హయగ్రీవుడి అవతార తిథి కాబట్టి శ్రావణ పూర్ణిమ, వేదాధ్యయన ఆరంభానికీ (‘ఉపాకర్మ’), వేద శ్రవణానికీ సముచితమైన ముహూర్తం. అందుకే, వేద విద్యార్థులూ, అధ్యాపకులూ, ఇతరులూ కూడా, శిథిలమై జీర్ణమైన దశలో ఉన్న యజ్ఞోపవీతాలను మార్చుకొనే ‘జంధ్యాల పూర్ణిమ’ కూడా ఇదే. ఇప్పటివరకూ వర్షాల వల్ల కుంటు పడిన ‘వానాకాలపు’ చదువులకు చురుకు పెంచి, ఈ పూర్ణిమ నుండి ఇక చదువులో శ్రద్ధనూ, వేగాన్నీ పెంచుకొంటే, అది వేద విద్యార్థులకూ, లౌకిక విద్యల విద్యార్థులకూ అందరికీ ప్రయోజనకరమే.– ఎం. మారుతి శాస్త్రిఇవి కూడా చదవండి: రక్షాబంధన్‌కి అంత మహత్తు ఉందా? ఆ పండుగ కోసమే ఆ దేవత.. -
రక్షాబంధన్‌కి అంత మహత్తు ఉందా? ఆ పండుగ కోసమే ఆ దేవత..
అన్నా చెల్లెళ్ల పండుగగా చెప్పే ఈ రక్షాబంధన్ పండుగ వెనుక ఎన్నోపౌరాణిక గాథలు, ఆసక్తికర చరిత్ర దాగుంది. ఇది కేవలం హిందువుల పండుగ మాత్రమే కాదు. సర్వమత ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం కూడా. ఈ పండుగ కోసమే దేవతను సైతం సృష్టించాడు ఆ బొజ్జ గణపయ్య. అంతేకాదండోయ్ ఈ రాఖీని కేవలం అన్నా చెల్లి, అక్కా తమ్ముడు మాత్రమే కాదు తమ రక్షణ ఇచ్చే వ్యక్తి ఎవ్వరికైనా కట్టొచ్చట. అలాగే భార్య తన భర్తకి కూడా కట్టొచ్చట రాఖీ. ఇదేంటని అని ఆశ్చర్యపోకండి. దాని వెనుకున్న ఆసక్తికర కథలు గురించి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా సవివరంగా తెలుసుకుందామా.!.రాఖీ ఎలా ఉండేదో తెలుసా..!వాస్తవానికి రాఖీలో ఒక తాయెత్తు ఉండేది, ప్రస్తుతం ఆధునిక డిజైన్ల హంగులతో వివిధ రకాలుగా మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అప్పట్లో ఒక సాధారణ దారంకి పసుపు రాసి ముడులు వేసి, దేవుని ముందు ఉంచి.. మంత్రాలతో శక్తిమంతం చేసేవారు. ఆ తర్వాత సోదరీమణులు తమ అపారమైన ప్రేమకు ప్రతిగా సోదరులకు కట్టేవారు. అందుకే దీనిని 'రక్షాబంధన్' అని పిలుస్తున్నారట. చూడటానికి సాధారణ దారమే అయినా..బంధం గొప్పతనం తెలిపేదని అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. ఆ నేపథ్యంలో సోదరుడి కోసం మిఠాయిలు చేసి మరి నోటిని తీపి చేసి..దీర్ఘాయువుతో చల్లగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించేవారట సోదరీమణులు. అందుకు ప్రతిగా సోదరులు వారికి బహుమతులు ఇచ్చి మరి రక్షగా ఉంటానని వాగ్దానం చేసేవారట. ఐక్యతకు చిహ్నంగా..అస్సాం, సిల్హెట్ ప్రాంతాలలో ఆధిపత్యం చెలాయించే ముస్లిం జనాభాను, హిందూ మెజారిటీ ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాల నుంచి వేరు చేయాలని బ్రిటీష్ వాళ్లు కుట్ర పన్నారు. ఈ ఘటన 1905లో చోటు చేసుకుంది. ఆ విభజన కాస్తా సరిగ్గా రక్షాబంధన్ రోజు కావడంతో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పండుగను ఉపయోగించుకుని అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందుకోసం ఠాగూర్ వారి కుట్రను భగ్నం చేసేలా ఐక్యతకు ప్రతీగా ఒకరికొకరు రాఖీ కట్టకోవాలంటూ వేలాది ప్రజలను గంగానది ఒడ్డుకు ఆహ్వానించారు. ఆ రోజు ఆయన సాధారణ దారాన్ని రెండు వర్గాల మధ్య ఐక్యతకు, సంఘీభావానికి చిహ్నంగా చాలా చాకచక్యంగా ఉపయోగించారు.భార్య.. భర్తకు రాఖీ కట్టే ఆచారం అప్పటి నుంచే..ఒకానొకప్పుడు దేవతులు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు. అది చూసి భయంతో బృహస్పతి వద్దకు రాగా, ఆయన తక్షణమే భార్య సచి దేవితో చేతికి ఓ రక్ష లేదా గొలుసులాంటి దాన్ని పౌర్ణమి నాటి రాత్రి కట్టించుకోమని సూచించారు. కట్టుకునే మందుకు శ్రావణ పౌర్ణమి రోజున దేవుడు ముందు ఉంచి మంత్రాలతో శక్తిమంతం చేయాలని కూడా చెప్పారట. దాంతో ఇంద్రుడు గురువు చెప్పినట్లు తూచా తప్పకుండా చేసి రాక్షసులపై విజయం సాధించినట్లు పురాణ వచనం. అలా ఆ నాటి నుంచే పురుషులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు భార్యలు వాళ్ల మణికట్టుకు ఈ రక్షను కట్టడం ఆచారంగా మారిందట. ఆ రోజునే సంతోషిమాత..గణేశుడు, అతని సోదరి మానస ప్రతి ఏడాది రక్షాబంధన్ పండుగను జరుపుకునేవారట. గణేశుడుకి సిద్ధి (అద్భుతమైన) బుద్ధి (విజయం) అనే భార్యలున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆ ఇద్దరు భార్యల ద్వారా శుభ (పవిత్రమైన), లాభ (లాభం) అనే ఇద్దరు కుమారులు కలిగినట్లు పురాణాలు చెబుతున్నాయి.అయితే గణేశుడు తన సోదరిని ఎల్లప్పుడూ గొప్ప ఆతిథ్యంతో స్వాగతించేవాడు. అలాగే మానస తన ప్రియమైన సోదరుడి వినాయకుడు కోసం ఎల్లప్పుడూ పుష్కలంగా మిఠాయిలు, బహుమతులు తీసుకువచ్చేది. పైగా రాఖీ కట్టే వేడుక అత్యంత వైభవంగా జరిగేది. దాంతో శుభ, లాభ్లు చాలా బాధపడేవారట. వారికి సోదరి లేకపోవడం వల్ల, ఈ వేడుకను జరుపుకోలేకపోతున్నాం అని ఆవేదన చెందేవారట. ఒక రోజు, ఆ బాలురు వినాయకుడి వద్దకు వెళ్లి, తమకు ఒక సోదరిని ప్రసాదించమని కోరారట. సరిగ్గా ఆ సమయానికి నారద మహర్షి కూడా గణేశుడిని దర్శించుకోవడానికి రావడంతో, ఆయన కూడా కుమారుల కోరికను మన్నించమని ఒప్పించారట. చివరికి, అందరి పట్టుదల మేరకు, గణేశుడు తన భార్యల శరీరాల నుంచి వెలువడిన రెండు జ్వాలల ద్వారా ఒక కుమార్తెను సృష్టించాడట. అలా సంతోషిమాత ఆవిర్భావం జరిగిందట. వినాయకుడి కుమార్తె అయిన సంతోషిమాత అందరి కోర్కెలను తీర్చే కల్పవల్లి, సంతృప్తికి అధిష్టాన దేవతగా ప్రకటించాడట. అలా ఈ పండుగ కోసం ఒక దేవత ఆవిర్భావించడమే గాక పండుకు ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని కూడా చాటుతోంది. అంతేగాదు ఇది కేవలం పండుగ మాత్రమే కాదు మన ఐక్యతకు, సత్సంబంధాలకు ప్రతీకగా మారి సర్వమత సౌబ్రాతత్వాన్ని చాటే విశిష్టమైన పండుగగా అలరారోతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పండుగలో భాగమయ్యేలా సోదరుడు లేదా మీకు రక్షగా ఉండే వ్యక్తులతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోండి మరి..!. View this post on Instagram A post shared by Kidsstoppress | Parenting (@kidsstoppress) (చదవండి: హై‘టెక్’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్ప్రైజ్లో మాత్రం..) -
ధైర్యం వదిలేస్తే ఏం జరుగుతుంది?
వేమన ధైర్యాన్ని మనిషి అసలైన ఆభరణంగా చెప్పాడు.పద్యం... ధైర్యమే పురుషునకు భూషణంబురా ధైర్యహీనునకు దైవమైన తోడురాడురా వేమనాఅర్థం: ధైర్యమే మగవాడికి అసలైన అలంకారం. ధైర్యం లేనివాడికి దేవుడే వచ్చినా సహాయం చేయడు.మరొక పద్యంలో... ధైర్యము గలవానికి ధరణిలో సుఖమురా ధైర్యము లేనికి దరిద్రమే గతిరాధైర్యం ఉన్నవాడికి ఈ లోకంలో సుఖం దొరుకుతుంది. ధైర్యం లేనివాడికి దరిద్రమే దిక్కు.భాస్కర శతకంలో..ధైర్యము గలవాడె ధన్యుడీ లోకానధైర్యమున జయమెల్ల దక్కునురాధైర్యమే లేనిచో దైవమే వచ్చిన కార్యము సాగదురా భావం.. ధైర్యం ఉన్నవాడే ఈ లోకంలో ధన్యుడు. ధైర్యంతోనే అన్ని పనుల్లో జయం వస్తుంది. ధైర్యం లేకపోతే దేవుడే వచ్చినా పని జరగదు.సుమతీ శతకం...బద్దెన సుమతీ శతకంలో ధైర్యాన్ని నేరుగా మగతనంతో పోల్చాడు.‘ధైర్యము విడువకుము ధరణిలో నరుడుధైర్యమున జయమెల్ల దక్కునురా సుమతీధైర్యమే మగతనంబురా సుమతీ‘ మనిషి ఎప్పుడూ ధైర్యాన్ని వదలకూడదు. ధైర్యంతోనే అన్నీ సాధించవచ్చు. ధైర్యమే అసలైన మగతనం.మరొక చోట...ధైర్యము లేనివానికి దైవము తోడుపడడు సుమతీ అని అంటాడు ధీరుని లక్షణాన్ని, గొప్పతనాన్ని ప్రస్తావిస్తాడు, పద్యంలో ధీరులెప్పుడూ న్యాయ మార్గాన్ని వదలరు అని అంటాడు భర్తృహరి.చివరిగా...ధైర్యం అనే అంశాన్ని మంచి పనులకే ముడి పెట్టాలి.. చెడ్డపనులకు చేసే ప్రయత్నం లో చూపిన తెగువ ధైర్యం కాదు. ధర్మం కోసం యుద్ధం చేసినందుకే శ్రీ కష్ణుడు, శ్రీరాముడు, పాండవులు, శివాజీ, ఝాన్సీ భాయి, అల్లూరి సీతారామరాజు... ఎందరో స్వతంత్ర సమర యోధులు ‘దైర్యవంతులు’గా శాశ్వత కీర్తి సంపాదించారు.– డా. కందాళ సత్యనారాయణ మూర్తిఇవి కూడా చదవండి: నిజమైన మార్పు ఎక్కడ మొదలవుతుంది? -
నిజమైన మార్పు ఎక్కడ మొదలవుతుంది?
మనలోని నిజమైన మార్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మనిషి జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ‘‘నేను ఎలా ఉన్నాను? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నా ప్రవర్తనలో మార్పు అవసరమా? నా కుటుంబం గురించి నేను ఎంత తెలుసుకుంటున్నాను? నా పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటున్నానా?’’ అనే ప్రశ్నలు మనల్ని మనం పరిశీలించుకునేలా చేస్తాయి. అయితే ఇతరుల గురించి తెలుసుకోవడానికి చూపించే ఆసక్తిలో కొంతైనా మన అంతరంగాన్ని తెలుసుకోవడానికి చూపిస్తున్నామా?ఆత్మపరిశీలనకు ఇదే మొదటి మెట్టు. మనిషి బయట ప్రపంచాన్ని జయించాలనుకుంటాడు. తన చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవాలనుకుంటాడు. తన భవిష్యత్తును మార్చుకోవాలని కోరుకుంటాడు. కానీ తనలోని ఆలోచనలు, భావోద్వేగాలు, బలహీనతలు, అహంకారం, అసూయ, భయం, అసహనం వంటి వాటిని పరిశీలించుకోవడం మాత్రం చాలాసార్లు మరిచిపోతాడు. శ్రీమతి నిర్మలా దేవి 1988 జూలై 27న చేసిన ఒక ఆధ్యాత్మిక బోధనలో, మనిషి తనను తాను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ప్రశ్నల రూపంలో గుర్తుచేస్తారు. ‘‘మీరు ఎలా ఉన్నారు? మీరు నిజంగా పురోగమిస్తున్నారా? లేక మీ వ్యవహారం, ఇతర విషయాల గురించి చింతిస్తున్నారా? మీ ఉన్నతి గురించి చింతిస్తున్నారా? దేశం గురించి చింతిస్తున్నారా? మీ ఉన్నతి గురించి చింతిస్తున్నారా? ఒకవేళ మీ ఉన్నతి గురించి చింతిస్తుంటే, దాని గురించి మీరు ఏం చేస్తున్నారు?’’ అనే ఆలోచన మనిషిని అంతర్ముఖుడిని చేస్తుంది.మనల్ని మనం తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ప్రపంచంలో మనం ఎన్నో విషయాలను తెలుసుకుంటాం. విజ్ఞానం పెరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అభివద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటాం. సమాజంలో మంచి పేరు సం΄ాదించాలనుకుంటాం. కానీ మనిషి తన మనస్సును అర్థం చేసుకోలేకపోతే, ఈ బాహ్య విజయాలన్నీ సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేవు. మన కో΄ానికి కారణం ఏమిటి? మనలో అసూయ ఎందుకు కలుగుతోంది? ఎందుకు చిన్న విషయాలకే మనశ్శాంతిని కోల్పోతున్నాం? ఎందుకు ఇతరుల తప్పులను సులభంగా చూస్తాం కానీ మన తప్పులను అంగీకరించడానికి ఇబ్బంది పడతాం? ఈ ప్రశ్నలకు సమాధానాలు బయట ప్రపంచంలో దొరకవు. మనలోకి మనం చూసినప్పుడే వాటి మూలాలను గుర్తించగలం.– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులుమనిషి బయట ప్రపంచాన్ని జయించాలనుకుంటాడు. తన చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవాలనుకుంటాడు. తన భవిష్యత్తును మార్చుకోవాలని కోరుకుంటాడు. కానీ తనలోని ఆలోచనలు, భావోద్వేగాలు, బలహీనతలు, అహంకారం, అసూయ, భయం, అసహనం వంటి వాటిని పరిశీలించుకోవడం మాత్రం చాలాసార్లు మరిచిపోతాడు.- శ్రీ మాతాజీ నిర్మలాదేవిఇవి చదవండి: రాఖీ కడితే దుష్టశక్తులు దూరమవుతాయా? -
రాఖీ కడితే దుష్టశక్తులు దూరమవుతాయా?
భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత ఉంది. శివకేశవులను స్మరిస్తూ వారి శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పర్వదినాన్ని పాటించడం, సంప్రదాయాలను ఆచరించడం అవసరం. అయితే శ్రావణ పూర్ణిమ పేరు చెప్పగానే అన్నింటికన్నా ముందుగా గుర్తుకొచ్చేది రక్షాబంధన పర్వమే.భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, భూత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.పూర్వం దేవతలకు, రాక్షసులకు తరచు యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది.రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణకోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తోడ్ గఢ్ మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమాయూన్కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీ సోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు.నారీపూర్ణిమ:మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నారీ పూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి సముద్రంలోకి నారికేళాలను అంటే కొబ్బరికాయలను వదులుతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నారియల్ పూర్ణిమగా) వ్యవహారంలోకి వచ్చింది.జంధ్యాల పున్నమి పాల్కురికి సోమనాథకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమి అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమనాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.హయగ్రీవ జయంతి:ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధాపరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది సాధ్యపడదని, మరేదైనా వరం కోరుకోవలసిందని అమ్మవారు చెప్పింది. అప్పుడు హయగ్రీవుడు తనలాగే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది.ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి ధనుస్సు అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది.దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి ఆ దుష్ట రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీశక్తి మహిమ ను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని, శివశక్తిని ఈ కథ తెలియజెబుతుంది. అందుకే శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.జంధ్యాల పౌర్ణమి: సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యాన్నే ’యజ్ఞోపవీతం’ అని అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం.ఇలా శ్రావణపూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది. ఈ రోజున పరమేశ్వరుడిని పంచామృతాలతో లేదా ఆవునేతితో లేదా ఆవుపాలతో అభిషేకించి, రుద్రనమక చమకాలతో ఆరాధించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో అపమృత్యు దోషాలు, భయాలు తొలగి, చక్కటి ఆరోగ్యం, తేజస్సు కలుగుతాయి.ఉపాకర్మఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనినే ముంజ అంటారు. ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు ఈ మంజను తీసి వేస్తారు. అందుకే ముంజ విడుపు అని కూడా ఈ కార్యక్రమానికి పేరు. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ’జంధ్యాల పూర్ణిమ’ కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. – డి.వరలక్ష్మిఇవి కూడా చదవండి: శివుడు శరభుడిగా ఎందుకు మారాడు? -
జాగృత శక్తి! ఆరు చక్రాల రహస్యమేంటి?
రాజయోగలో యమ, నియమ, ఆసనాదులను గూర్చి చెబుతారు. అందులోనే కుండలిని గూర్చి ఉంటుంది. ప్రతి మనిషిలో ఆరు చక్రాలుంటాయనీ, ఆ చక్రాల్లో అట్టడుగున ఉన్న మూలాధార చక్రంలో కుండలిని ఉంటుందనీ, యోగాభ్యాసం ద్వారా దాన్ని క్రమంగా పైనున్న చక్రాలకు తీసుకపోవాలనీ చెబుతారు. యోగాన్ని అత్యంత శ్రద్ధతో అభ్యసించిన విశ్వమాత కృష్ణాబాయి ఇలా చెబుతారు:కుండలిని మూలాధార చక్రములో నిద్రాణమై ఉంటుంది. అప్పుడా వ్యక్తి దృక్పథం కేవలం భౌతికంగా ఉంటుంది. ఒక మహాత్ముని సంపర్కం వల్ల ఆ కుండలిని జాగృతమై దాని పై కేంద్రానికి చేరుతుంది. ఆ వ్యక్తికి అప్పుడు ధార్మిక జీవనం గడపాలనే ఆకాంక్ష కలుగుతుంది. కుండలిని పై కేంద్రానికి చేరుతుంది. అతడు అంత కంతకూ సత్సంగం, దేవాలయ సందర్శనను కోరుతాడు. కుండలిని ‘అనాహత’ అను నాల్గవ కేంద్రాన్ని చేరుతుంది. అప్పుడా వ్యక్తి గురువును తన ఆత్మీయునిగా భావిస్తాడు. అతని దృష్టిని ఆ భావన విస్తరింప చేస్తుంది.ఆ శక్తి (కుండలిని) విశుద్ధమనే అయిదవ చక్రాన్ని చేరినపుడు గురువు అవ్యక్త స్థితిని తెలుసుకుంటాడు. గురువుని గూర్చి, లేక ఆ భగవంతుని స్థితిని గూర్చి అధికంగా మాట్లాడుతాడు. తర్వాత కుండలిని పై చక్రమైన ఆజ్ఞాచక్రాన్ని చేరుతుంది. అప్పుడు ఆ సాధకునకు భగవద్దర్శనమై అతని మనస్సు క్రమంగా అవ్యక్తస్థితి వైపు ఆకర్షితమవుతుంది. అక్కడే అతనికి కొన్ని సిద్ధులు అబ్బుతాయి. అతడు వాటికి లోబడితే పతనమవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.బయటి నుండి గురువు సాధకుణ్ణి ఈ కేంద్రం వరకు మాత్రమే ప్రేరేపించగలడు. దీని తరువాత హృదయంలో ఉన్న గురువునుండి మార్గదర్శనం వస్తుంది (పుటలు 81, 82 – విశ్వమాత కృష్ణాబాయి – ఆనందా శ్రమం, కేరళం). ఆమె అంతవరకే చెప్పి తన గురువైన రామదాసు కృపవల్ల తనకు ఆజ్ఞా చక్రం నుండి కుండలిని అధికమైన వేగంతో మెరుపును మించిన కాంతితోను పైకి పోయిందనీ, తనకు అనిర్వచనీయమైన ఆనందం కలిగిందనీ అంతకుమించి ఇక ఏమీ చెప్పజాలననీ అంటారు.– రాచమడుగు శ్రీనివాసులు -
ధర్మవాక్కు..! అతడి మరణాన్ని ముందే చెప్పిన అయోధ్య రాజు!
పూర్వం అయోధ్యను అనరణ్యమహారాజు పాలించేవాడు. ఆ రోజులలో రావణుడు తనకు యక్ష కిన్నర కింపురుషాదులలో ఎవరి వలననూ మరణం కలగకుండా బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు. ఆ బలంతో రాజులందరినీ పరాజితులను చేసి, అవమానపరచి ఆనందిస్తున్నాడు. అది తెలిసి, ముందుగానే లొంగిపోయి ప్రాణం రక్షించుకున్నారు కొందరు.అయోధ్యను పాలించిన అనరణ్యమహారాజు మాత్రం రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ‘పూటకొకమాటు ఆకలిదప్పులతో అల్లాడే నరుల సేనను నా సైన్యం వేసే శరసమూహజ్వాలల దాహాన్ని తీర్చడానికి తెచ్చావా?’ అని హాస్యమాడాడు రావణుడు. ఇరువురికీ ముఖాముఖి జరిగిన యుద్ధంలో చివరన సారథిని కూల్చి, అనరణ్యమహారాజును రథహీనుడిని చేసి నేలమీద పడేట్లు చేశాడు. ‘మృత్యువు కూడా నా దగ్గరకు రావడానికి భయపడుతుంది. అలాంటిది నువ్వెంత? ఓడిపోయానని ఒప్పుకో, వదిలేస్తాను!’ అన్నాడు. ఒప్పుకోకుండా రావణుడి చేతిలో వీరమణం పొందాడు. అయితే, మరణానికి ముందు, ‘ఎప్పటికైనా నా వంశంలో పుట్టిన వీరుడి చేతిలోనే నీవు మరణం పొందుతావు!’ అన్నాడు. ఆ మాటలకు నవ్విన రావణుడితో అనరణ్యమహారాజు ఇంకా ఇలా అన్నాడని కంకంటి పాపరాజు రచించిన ‘శ్రీమదుత్తర రామాయణం’ తృతీయాశ్వాసంలోని ఈ క్రింది పద్యం చెబుతోంది:చ. పురుషుడు కర్మసంగమున బొందు సుఖంబులు దుఃఖ మెవ్వరెవ్వరికి విరోధముల్ సలుపు వా రిది దైవవశంబు దీనగాతరతవహింప నే గనక దానమఖాధ్యయనాది కర్మముల్వొరసితి నేని బల్కు పొలివోవక నట్లగుగాక యంచనన్.‘మనిషి చేసే పనులను బట్టి సుఖదుఃఖాలు ఉంటాయి. ఎవరూ ఎవరికీ విరోధులు కారు. దైవం జరిపించే విధంగా జరిగేవే అన్నీ. నేనే గనుక దానధర్మాధ్యయనాది పుణ్యకర్మలను నిష్ఠగా చేసినవాడనైతే నా మాట అక్షరం పొల్లుపోకుండా జరుగుతుంది!’ అన్నట్లుగానే రావణుడి మరణం అయోధ్యను పాలించిన శ్రీరాముడి వలన జరిగింది. ధర్మబద్ధమైన జీవనం సాగించే వ్యక్తికి కష్టం కలిగి మాట్లాడే మాట తప్పక జరుగుతుందని దీనివలన అర్థమౌతుంది.– భట్టు వెంకటరావు -
శ్రీలంకలో ఘనంగా పెరహెర వేడుకలు.. ఎందుకు జరుపుతారంటే?
సంస్కృతి, ఆధ్యాత్మికతతో ముడిపడినటువంటి ‘కాండీ ఎసల పెరహెర వేడుకలు’ శ్రీలంకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18 నుంచి 28 వరకు సాగే ఈ వేడుకలను మొత్తం 10 రాత్రులు, 11 రోజులు పాటు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలు, అలంకరణలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో తుది ఘట్టమైన ‘రాందోళి పెరహెర’ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.కాండీ ఎసల పెరహెర ఉత్సవాల తేదీలు ప్రతి సంవత్సరం మారుతున్నప్పటికీ, ఈ పండుగ నిర్వహణ ఎప్పుడూ ఒకేలా సాగుతుంది. ఈ సంబరాలు ప్రధానంగా మూడు ఘట్టాలుగా కొనసాగుతాయి.ఉత్సవాల్లో ప్రారంభ క్రతువు కప్ సిటువీమ. ఈ వేడుకలు శ్రీ దళదా మాలిగావా (బుద్ధుని పవిత్ర దంత అవశేషం ఉన్న దేవాలయం) ప్రాంగణంలో ప్రారంభమవుతాయి. ఉత్సవ ప్రారంభానికి సూచికగా ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్ర వృక్షాన్ని నాటుతారు. ఇది ప్రధానంగా మతపరమైన ఆచారం అయినప్పటికీ, పెరహెర సీజన్ కు ఇది అధికారిక ప్రారంభ ఘట్టంగా నిలుస్తుంది.ఉత్సవాల్లో రెండో ఘట్టం కుంభాల్ పెరహెర. పండుగ మొదటి ఐదు రాత్రులను ‘కుంభాల్ పెరహెర’ అని పిలుస్తారు. ఈ ప్రారంభ ఊరేగింపులు పరిమాణంలో కాస్త చిన్నవిగా, సంప్రదాయబద్ధంగా సాగుతాయి. ఎక్కువ రద్దీ లేకుండా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా ఆస్వాదించడానికి ఇవి చక్కటి అవకాశం. ఈ రాత్రులలో సంప్రదాయ కాండియన్ నృత్యకారులు, కొరడా ఝళిపించే ప్రదర్శకులు, మేళతాళాల వాయిద్యకారులు, అలంకరించిన ఏనుగులు, దివిటీలు పట్టిన సేవకులు పాల్గొంటారు.మూడో ఘట్టం రాందోళి పెరహెర. అంటే మహా ఊరేగింపులు. ఆఖరి ఐదు రాత్రులను ‘రాందోళి పెరహెర’ అని పిలుస్తారు. పండుగ మొత్తంలోనే అత్యంత అద్భుతంగా, వైభవంగా సాగే రాత్రులు ఇవే! ఈ ఊరేగింపులు జరిగేటప్పుడు కాండీ నగర వీథులు వేలాదిమంది భక్తులతో, పర్యాటకులతో నిండిపోతాయి. వందలాది మంది నృత్యకారులు, కళాకారులు, వాద్యకారుల బృందాలు, రాత్రి ఆకాశాన్ని కాంతులతో నింపే అగ్ని విన్యాసకులు, విద్యుత్ దీపాలతో ప్రకాశించే వస్త్రాలు ధరించిన గజరాజులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి కాండీ పెరహెరకే అత్యంత ముఖ్యమైన ఘట్టాలు కావడంతో అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.ఈ ఉత్సవాల్లో చివరి ఊరేగింపు రాత్రి వేకువ జామున జరిగే వేడుక దహవల్ పెరహెర. ఇందులో భాగంగా మహావలి నది ఒడ్డున జరిగే ‘దియా–కెపీమ’ అంటే ‘జలఖండన’ కార్యక్రమంతో ఎసల పెరహెర ముగుస్తుంది. ఇందులో భాగంగా నదీ జలాలను లాంఛనప్రాయంగా ఖండించినట్లు నీళ్లల్లో కత్తులను తాటిస్తారు. ఈ క్రతువును వీక్షించేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు.శ్రీలంకలో జరిగే ప్రసిద్ధ ‘కాండీ ఎసల పెరహెర’ ఉత్సవం కేవలం ఒక సాంస్కృతిక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. గౌతమ బుద్ధుని పవిత్ర దంత అవశేషానికి అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరవం అర్పిస్తూ, దేశానికి సమృద్ధిగా, సమయానుకూల వర్షాలు, ప్రజలకు శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ చారిత్రాత్మక వేడుక శ్రీలంక బౌద్ధ సంస్కృతి విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతోంది.- రమా జంబుల -
పూర్వజన్మ పాపం.. రాజును వెంటాడిన వ్యాధి!
పూర్వం సౌరాష్ట్ర రాజ్యాన్ని సోమకాంతుడు సర్వసుభిక్షంగా పరిపాలించేవాడు. అతడి భార్య సుధర్మ. ఆ దంపతులకు హేమకంఠుడు అనే పుత్రుడు కలిగాడు. హేమకంఠుడు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి, సకల విద్యలూ అభ్యసించి, యువరాజు అయ్యాడు.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! సర్వసౌఖ్యాలూ అనుభవిస్తూ, సమస్త వైభోగాలతో తులతూగుతూ ఉన్న సోమకాంతుడు జన్మాంతర పాపఫలితంగా కుష్టువ్యాధి బారిన పడ్డాడు. శరీరమంతా వ్రణాలు ఏర్పడి, నిరంతరం చీము కారుతూ, దుర్గంధభూయిష్టంగా మారింది. వ్యాధి నివారణ కోసం సోమకాంతుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలించలేదు. చివరకు సోమకాంతుడు వానప్రస్థానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. సమస్త పరివారాన్నీ పిలిచి, తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అతడి నిర్ణయానికి అంతఃపుర కాంతలు, అమాత్యులు, భృత్యులు పెద్దపెట్టున రోదించారు. తాము కూడా వానప్రస్థానికి వస్తామని అన్నారు. సోమకాంతుడు వారికి నచ్చజెబుతూ, ‘నా కుమారుడు హేమకంఠుడికి రాజ్యాన్ని అప్పగిస్తున్నాను. అతడికి పట్టాభిషేకం చేయండి. మీరంతా నన్ను సేవించుకున్నట్లే, అతడిని సేవించండి’ అని పలికాడు.మహారాణి సుధర్మ ‘భర్తను అనుసరించడమే పతివ్రతా ధర్మం’ అని చెప్పి, సోమకాంతుడితో పాటు తాను కూడా వానప్రస్థానికి సిద్ధపడింది. కొద్దిమంది పరివారం వెంటరాగా రాజ దంపతులు వానప్రస్థానికి బయలుదేరారు. సోమకాంతుడు, సుధర్మ తమ పరివారం వెంటరాగా అడవుల్లో అక్కడక్కడా మజిలీలతో కొన్నాళ్ల ప్రయాణం తర్వాత వారంతా ఒక దుర్గమారణ్యానికి చేరుకున్నారు. అక్కడ ఒక సరోవరం కనిపించింది. రాజ పరివారం ఆ సరోవరంలో స్నానాలు చేసి, అందులోని నీళ్లు తాగి, అక్కడి చెట్ల నుంచి కోసుకున్న పండ్లు ఆరగించి, వాటి నీడలో సేదదీరసాగారు. సోమకాంతుడి కోరికపై అతడి పరివారం అడవిలోని కందమూలాలు, తామరతూళ్లు సేకరించుకుని రావడానికి వెళ్లారు.కొద్దిసేపటికి దివ్యతేజస్సు ఉట్టిపడుతున్న ఒక బాలకుడు కలశం చేతపట్టుకుని సరోవరం వద్దకు వచ్చాడు. సుధర్మ అతడిని చూసి ముచ్చట పడింది. అతడి వద్దకు వెళ్లి, ‘అబ్బాయి! నువ్వు ఎవరివి? నీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని ప్రశ్నించింది.‘అమ్మా! నా పేరు చ్యవనుడు. నా తండ్రి భృగుమహర్షి, తల్లి పులోమ. ఆశ్రమానికి నీళ్లు తీసుకువెళ్లడానికి ఇక్కడకు వచ్చాను. ఇంతకీ మీరెవరు? మీ సేవలు పొందుతున్న ఆ పురుషుడు ఎవరు? ఆయన శరీరమంతా వ్రణాలతో నిండి ఉందేమి?’ అని అడిగాడు.సుధర్మ దుఃఖాశ్రువులతో తమ వృత్తాంతమంతా అతడికి చెప్పింది. చ్యవనుడు సరోవరంలోని నీళ్లు తీసుకుని, ఆశ్రమానికి వెళ్లిపోయాడు. నీటికుండతో ఆశ్రమానికి చేరుకున్న కొడుకు ముఖం దిగులుగా ఉండటం గమనించాడు భృగుమహర్షి.‘కుమారా! ఎందుకలా దిగులుగా ఉన్నావు? కారణమేమిటి?’ అని అడిగాడు.అప్పుడు చ్యవనుడు తండ్రికి రాజదంపతులైన సోమకాంతుడు, సుధర్మల వృత్తాంతం చెప్పాడు.‘రాజదంపతులను, వారి పరివారాన్ని మన ఆశ్రమానికి పిలుచుకునిరా! నేను ఆహ్వానిస్తున్నానని చెప్పు’ అని కొడుకును తిరిగి అడవికి పంపాడు. చ్యవనుడు వచ్చి పిలవడంతో సోమకాంతుడు, సుధర్మ దంపతులు పరివారంతో పాటు భృగు ఆశ్రమానికి చేరుకున్నారు. భృగు మహర్షికి వారంతా నమస్కరించారు. భృగు మహర్షి వారికి షడ్రసోపేతమైన విందుతో ఆతిథ్యమిచ్చి, వారి విశ్రాంతికి తగిన ఏర్పాట్లు చేయించాడు. సోమకాంతుడు భృగుమహర్షి వద్ద తన బాధ చెప్పుకున్నాడు. భృగుమహర్షి దివ్యదృష్టితో చూసి, ‘రాజా! ఇదంతా పూర్వజన్మ పాపం వల్ల సంప్రాప్తించిన బాధ’ అని చెప్పి, అతడి పూర్వజన్మ వృత్తాంతమంతా తెలిపాడు. సోమకాంతుడు అంతా విని కూడా, మనసులో ఒక క్షణం భృగుమహర్షిని సందేహించాడు. వెంటనే అతడి శరీరం నుంచి పక్షులు పుట్టుకొచ్చి, వాడి ముక్కులతో అతడి దేహంపై వ్రణాలను పొడవసాగాయి. ‘మహర్షీ! మీరే నన్ను కాపాడాలి’ అంటూ ఆర్తనాదాలు చేశాడు.‘రాజా! నువ్వు నన్ను సంశయించావు. అందుకు ఫలితమే ఇది’ అంటూ భృగువు ఒక్క హుంకారం చేయడంతో ఆ పక్షులన్నీ మాయమయ్యాయి. ‘నీ వ్యాధినివారణకు తరుణోపాయం చెబుతాను విను. నువ్వు గణేశపురాణ శ్రవణం చేసినట్లయితే, పాప విమోచన జరిగి, వ్యాధి నుంచి బయటపడగలవు’ అని చెప్పాడు. గణేశ స్తోత్రాన్ని పఠించి, మంత్రజలాన్ని సోమకాంతుడిపై ప్రోక్షించాడు. వెంటనే సోమకాంతుడి ముక్కు నుంచి ఒక క్రిమిలాంటి నల్లని పురుషుడు బయటపడ్డాడు. చూస్తుండగానే అతడు పర్వతమంత పెరిగాడు. తనను తాను ‘పాప పురుషుడు’ అని చెప్పుకున్న ఆ భీకరాకారుడిని భృగుమహర్షి తన తపోబలంతో భస్మీపటలం చేశాడు. సోమకాంతుడి ప్రార్థన మేరకు భృగుమహర్షి అతడికి గణేశపురాణం చెప్పి, కొద్దిరోజుల్లోనే అతడికి రోగవిముక్తి కలిగించాడు.- సాంఖ్యాయనపురావిశేషం..శ్రావణ పూర్ణిమను దేశవ్యాప్తంగా చాలా చోట్ల రాఖీ పండుగ జరుపుకొంటారు. ఇదేరోజు బలరామ జయంతి కూడా. దేశంలో కొద్దిసంఖ్యలో మాత్రమే ఉన్న బలరామ ఆలయాల్లోను, శ్రీకృష్ణ దేవాలయాల్లోను శ్రావణ పూర్ణిమ రోజున బలరామ జయంతి వేడుకలు కూడా ఘనంగా జరుపుతారు. ఒడిశాలోని ఢంకనాల్, కేంద్రపడా జిల్లాల్లోను, పశ్చిమబెంగాల్లో ని ఖొయిరాసోల్, కోల్కతాలలోను, కేరళలోని నెన్మినిలోను, ఉత్తరప్రదేశ్‌లోని గోవర్ధన్లోను, గుజరాత్‌లోని చిత్రసానిలోను బలరాముడికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. -
ఓనం కేరళం! పండుగలో పిల్లలకు మోస్ట్ ఫేవరెట్ ఏంటో తెలుసా?
పిల్లలూ... ఇప్పుడు కేరళంలో ఓనమ్ పండగ సీజన్. మనకు దసరా, సంక్రాంతి ఎలాగో... కేరళ వాళ్లకు ‘ఓనమ్’ అలా అన్నమాట. ఇది వాళ్ల పెద్ద పండుగ. పూర్వం కేరళను ‘మహాబలి’ అనే ఒక మంచి రాజు పాలించేవాడట. ఆయనంటే ప్రజలందరికీ చాలా ఇష్టం.ఆ రాజు ఏటా ఒకసారి ఆకాశం నుంచి భూమికి వచ్చి, తన ప్రజలందరూ ఎలా ఉన్నారో చూసి వెళ్తాడని అక్కడి వాళ్ల నమ్మకం. ఆ రాజుగారికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పడానికే ఈ ఓనమ్ పండుగ చేసుకుంటారు. ఈ పండుగకు పిల్లలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు! పది రోజుల పాటు రోజూ పొద్దున్నే లేచి, తోటల్లో కలర్‌ఫుల్ పూలను కోసుకొస్తారు. ఇంటి ముందు ‘పూకళం’ అంటే పూలతో పెద్ద పెద్ద ముగ్గులు భలే అందంగా పెడతారు. పట్టు లంగాలు, తెల్లటి సాంప్రదాయ బట్టలు వేసుకుని దేవదూతల్లా రెడీ అవుతారు.ఈ పండుగలో పిల్లలకు మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఏంటో తెలుసా? ‘పులికలి’ అనే టైగర్ డ్యాన్స్! కొందరు మనుషులు ఒంటికి పులి లాగా రంగులు వేసుకుని, డప్పుల చప్పుళ్లకు వీధుల్లో డాన్స్ చేస్తుంటే పిల్లలు తెగ నవ్వుకుంటారు. అలాగే నదుల్లో పెద్ద పెద్ద పడవ పందాలు జరుగుతుంటే చూసి చప్పట్లు కొడతారు. ఇక పండగ రోజు అరిటాకులో పాయసం, బోలెడు వంటకాలతో కడుపునిండా విందు భోజనం తింటారు. మరి ఈసారి ఓనమ్ పండుగకు మీరు కూడా ఇంట్లో పూల ముగ్గులు వేసి ఎంజాయ్ చేస్తారా!ఇవి కూడా చదవండి: 'జుడో' పోటీ..! బలం కంటే తెలివితో ప్రత్యర్థిని ఓడించగలమా? -
మోయకూడని బరువు..
ఒక వ్యక్తి, ఒక ముని వద్దకు వచ్చాడు. ‘అయ్యా! ఈ భారాన్ని, భయాన్ని నేను భరించ లేకపోతున్నాను. నాకు విముక్తి ప్రసాదించండి’ అని ఆవేదన చెందాడు. ముని అతనితో ‘సరే, నీకు దారి చెబుతాను. దానికి ముందు, ఈ దారిలో ఉన్న రెండు పెద్ద రాళ్లను నీ రెండు చేతుల్లో పట్టుకుని, ఈ తోట చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి రా’ అన్నాడు.అతను రెండు చేతుల్లో రాళ్లను ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. మొదటి చుట్టులోనే చేతులు వణికి పోయాయి. రెండో చుట్టులో నరాలు ఉబ్బిపోయాయి. మూడో చుట్టులో నొప్పితో అరిచాడు. నాలుగో చుట్టులో ‘గురుదేవా, నా వల్ల కావడం లేదు. చేతులు పడిపోతున్నాయి, నా ప్రాణం పోతోంది’ అన్నాడు. ముని ప్రశాంతంగా, ‘అయితే, ఆ రాళ్లను కింద పడేయ్’ అన్నాడు. అతను వెంటనే ఆ రెండు రాళ్లను కింద పడేశాడు. మరుక్షణమే, అతని చేతుల్లో భారం తగ్గి, శరీరమూ మనస్సూ తేలికపడినట్లు అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.‘రాళ్లను పట్టుకుని నొప్పితో అరిచిందీ నువ్వే, వాటిని కింద పడేసి ప్రశాంతతను పొందిందీ నువ్వే. రాళ్లు నిన్ను బలవంతం చేసి నీ చేతులకు అతుక్కున్నాయా? నువ్వే వాటిని పట్టుకున్నావు కదా. అలాగే నీ గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు కూడా. గడిచిపోయిన కాలం ఎప్పుడో ముగిసిపోయింది, రాబోయే కాలం ఇంకా రాలేదు. రాళ్లను కింద పడేయడానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు కదా? అలాగే నిన్ను గాయపరిచే జ్ఞాపకాలను, అనవసరమైన భారాన్ని మనస్సు నుంచి వదిలేయడం నీ చేతుల్లోనే ఉంది’ అని వివరించాడు ముని.– యామిజాల జగదీశ్ -
తలకిందుల తామర.. ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ!
అనంతపురం ప్రాంతంలోని కంబదూరు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తి విశ్వాసాలకు మాత్రమే కాకుండా ప్రాచీన దక్షిణ భారత వాస్తు, శిల్పకళా వైభవానికీ విశిష్టమైన ప్రతీక. ఆలయ నిర్మాణంలో కనిపించే రాతి స్తంభాలు, మండపాలు గర్భగృహం పైభాగం విమాన నిర్మాణం, అద్భుతమైన శిల్పాలు ఆ కాలం నాటి శిల్పుల అసాధారణ ప్రతిభకు నిదర్శనాలు.ఈ ఆలయ వాస్తుశైలిలో విమాన నిర్మాణం ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. గర్భగృహం పైన నిర్మించిన విమానం దక్షిణ భారత దేవాలయ వాస్తు సంప్రదాయానికి అనుగుణంగా గర్భగృహానికి దైవిక ప్రాధాన్యతను ప్రస్ఫుటం చేస్తుంది. విమానం కేవలం ఆలయ పైకప్పు కాదు. అది గర్భగృహంలోని మూలవిరాట్టుపైన నిలిచే పవిత్ర నిర్మాణం. భూమి నుంచి పైకి ఎదిగే దాని నిర్మాణం దేవాలయ వాస్తులో భౌతిక లోకం నుంచి దైవిక లోకం వైపు ఎదుగుదలకు ప్రతీక.కంబదూరు ఆలయ విమాన నిర్మాణంలో కనిపించే రాతి అమరికలు, అలంకార అంశాలు దక్షిణ భారత మధ్యయుగ దేవాలయ వాస్తు పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. గర్భగృహం పైన విమానం, దాని పైభాగంలో శిఖర నిర్మాణం ఉండటం వల్ల ఆలయానికి నిలువైన సౌందర్యం ఏర్పడుతుంది. విమానంలోని ప్రతిస్థాయి, అలంకార భాగం ప్రధాన గర్భగృహాన్ని మరింత గంభీరంగా చూపించే విధంగా రూపొందించబడింది.ఈ ఆలయానికి మరో విశేషం దాని అద్భుతమైన రాతి శిల్పాలు. ఆలయ స్తంభాలు మండపాలు, ఇతర నిర్మాణ భాగాలపై దేవతారూపాలు నర్తకీమణులు యోధులు జంతువులు, పుష్పలతా అలంకరణలు కనిపిస్తాయి. కొన్ని శిల్పాలు ఆ కాలం నాటి సామాజిక జీవితం వస్త్రధారణ ఆభరణాలు యుద్ధ సంప్రదాయాలు, కళాసంస్కృతికి సంబంధించిన దృశ్యాలను మన కళ్లముందు ఉంచినట్లుగా అనిపిస్తాయి. ముఖమండపం, స్తంభాలపై కనిపించే సూక్ష్మమైన చెక్కడాలు ముఖ్యంగా ఆకట్టుకుంటాయి. గట్టి రాతిలో అంత సున్నితమైన శరీర భంగిమలు ముఖ కవళికలు వస్త్రమడతలు, ఆభరణాలను చెక్కడం శిల్పుల అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకంగా చెప్పుకోవలసిన కళాఅంశాలలో తలకిందుల తామరపుష్పం ఒకటి. మండపం పైకప్పు మధ్యభాగంలో రాతిలో చెక్కబడిన ఈ తామరపుష్పం పైనుంచి కిందికి వికసించినట్లుగా కనిపిస్తుంది. పుష్పదళాలను పొరలుగానూ, సమచతురంగా చెక్కిన తీరు శిల్పి అపూర్వమైన సౌందర్య దృష్టికి నిదర్శనం. భారతీయ దేవాలయ కళలో తామర పవిత్రత సృష్టిసౌందర్యం దైవత్వానికి ముఖ్యమైన ప్రతీక. ఆలయ పైకప్పు మధ్యలో తలకిందులుగా కనిపించే తామరను వాస్తు అలంకరణలో భాగంగా చూడవచ్చు. దాని నిర్దిష్ట తాత్విక అర్థం గురించి ప్రాచీన శాసన ఆధారం లభించక΄ోతే దానికి ఇచ్చే ఇతర అర్థాలను స్థానిక సంప్రదాయాలు, కళావ్యాఖ్యానాలుగా మాత్రమే పరిగణించాలి.విమానగోపురం గర్భగృహాన్ని దైవిక కేంద్రంగా ప్రకటిస్తే మండపంలోని తలక్రిందుల తామర ఆ నిర్మాణానికి కళాత్మక కిరీటంలా కనిపిస్తుంది. బయట నుంచి ఆకాశాన్ని తాకేలా పైకి ఎదిగే విమానం, లోపల పైకప్పు నుంచి కిందికి వికసించినట్లుగా కనిపించే తామర అనే రెండు రూపాలు ఆలయ వాస్తులో ఒక అద్భుతమైన దృశ్య సమన్వయాన్ని సృష్టిస్తాయి.– జి.బి.విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్నిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్ -
ఈర్ష్య : పక్కవాడి విజయం ఎందుకు నచ్చదు?
ఈర్ష్య అనేది కోరిక నుండి పుడుతుంది. ఇతరుల సంతోషాన్ని, ఎదుగుదలను చూసి అది ఇంకా పెరుగుతుంది. కానీ సత్పురుషులకు జ్ఞానం, వివేకం వల్ల ఆ ఈర్ష్య నశిస్తుంది. ఈర్ష్య అసూయ.. ఈ రెండు అవలక్షణాల వలన మానవుడు సర్వం కోల్పోతాడు.. శతక కవులు ఇదే విషయాలను ఎంతో స్పష్టంగా సెలవిచ్చారు.వేమన శతకం... ‘ఈర్ష్య గలవాని కెన్నడుసంతోషము లేదు నిజము సుమ్ము కుమారాఈర్ష్య గలవాడు పరులనుఈర్ష్యతో చూచుచుండు నెప్పుడు కుమారా‘అర్థం: ఈర్ష్య ఉన్నవాడికి ఎప్పుడూ సంతోషం ఉండదు. వాడు ఇతరులను ఎప్పుడూ ఈర్ష్యతోనే చూస్తూ ఉంటాడు.మరో పద్యంలో... ‘తనకు లేని దొరులకున్నతన మనసున రోత పుట్టి తనువు కశించున్ఇన లేకున్నను చీకటిపనికొచ్చునా ఈర్ష్య పరుల బాధించురా’అర్థం: తనకు లేనిది ఇతరులకు ఉంటే మనసులో అసూయ పుట్టి, శరీరం కృశించిపోతుంది. సూర్యుడు లేకుండా చీకటి ఎలా పనికిరాదో, ఈర్ష్య కూడా అలాగే ఇతరులను బాధిస్తుంది.ఇక సుమతి శతకంలో బద్దెన ఏమి చెప్పారంటే‘అసూయ గలవాని నెదుటఅసమానపు ధనము కురిసిన నది చూడకఅసహ్యించుకొను వాడుఅసమానుడు గాడె సుమతీ అనవుడు కుమారా‘ ఈర్ష్య గలవాడి ముందు కోట్లు కురిసినా వాడు చూడడు. పైగా అసహ్యించుకుంటాడు. అటువంటివాడు అసమానుడు సుమతీ.దాశరథి శతకం...‘అసూయ చేతను నరుడువసుధను కృశించుచుండు వనరుహనేత్రీఅసూయను వీడిన నరుడువసుధను సుఖియించు చుండు వరముగ కుమారా‘ ఈర్ష్య చేత మనిషి ఈ లోకంలో కృశించిపోతాడు. ఈర్ష్యను వదిలిన మనిషి సుఖంగా ఉంటాడు.పరగుణ పరమాణూనాం పర్వతీకరణం క్షణాత్స్వగుణ మేరుమాత్రాణాం కూపీకరణం క్షణాత్యత్ కుర్వన్తి సతాం సన్తః తదస్మాభిః కిం ఉచ్యతేఅసూయా కలుషాః కేచిత్ నిర్దుష్టం గుణం ఏవ హి తాత్పర్యం: ఈర్ష్యతో నిండిన కొందరు దుష్టులు, ఇతరుల చిన్న లో΄ాన్ని కూడా పర్వతంలా పెద్దది చేసి చూపిస్తారు. అదే సజ్జనులు తమలోని మేరు పర్వతం అంత గొప్ప గుణాన్ని బావి అంత చిన్నదిగా చేసేస్తారు. అంటే ఈర్ష్య ఎంతటి అవగుణమో అర్థం అవుతోంది కదా!– డా. కందాళ సత్య నారాయణ మూర్తినిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్ -
ప్రపంచాన్నీ ఆకట్టుకున్న ‘నమస్తే’! ఆంతర్యం ఏంటో తెలుసా?
భారతీయ సంప్రదాయంలో ఎదుటి వ్యక్తిని కలవగానే ముందుగా చేసే పని ‘నమస్కారం’. ఇది కేవలం ఒక పలకరింపు మాత్రమే కాదు, మన సంస్కృతిలో భాగమైన గౌరవానికి, ఆత్మీయతకు ప్రతీక. గుడిలో భగవంతుడిని దర్శించుకున్నా, ఇంట్లో పెద్దలను కలిసినా రెండు చేతులు జోడించి నమస్కరించడం మన ఆనవాయితీ. అసలు ఇలా రెండు చేతులూ ఎందుకు జోడించాలి..? దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం..‘నమస్తే’ అనే పదంలో దాగిన ఆంతర్యం..సంస్కృత పదాలైన ‘నమః‘, ‘తే’ కలయికతో ‘నమస్తే’ ఏర్పడింది. ‘నమః’ అంటే నాలోని అహంకారాన్ని వదిలిపెట్టడం, ‘తే‘ అంటే మీకు. అంటే.. ‘నా అహాన్ని విడిచిపెట్టి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను‘ అని అర్థం. హిందూ ధర్మం ప్రకారం ప్రతి జీవిలోనూ దైవాంశ ఉంటుంది. అందుకే ఎదుటి వ్యక్తికి నమస్కరించడం ద్వారా, వారిలో కొలువై ఉన్న పరమాత్మను స్మరించుకుంటున్నామని మన శాస్త్రాలు చెబుతున్నాయి.రెండు చేతులు ఎందుకు జోడించాలి..?ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. కుడి చేయి సానుకూల సూర్య శక్తికి, ఎడమ చేయి గ్రహించే చంద్ర శక్తికి ప్రతీకలు. ఈ రెండు చేతులను ఏకం చేసినప్పుడు శరీరంలోని నాడులు సమతుల్యమై, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. చేతులు జోడించే భంగిమ ఎదుటివారి పట్ల మనకు ఉన్న వినమ్రతను, శరణాగతి భావాన్ని సూచిస్తుంది. ఇది బంధాల్లో ఆత్మీయతను పెంచుతుంది.నమస్కరించే సరైన విధానం..శాస్త్రాల ప్రకారం, రెండు చేతులను ఛాతీకి దగ్గరగా ఉంచి, తలను కొద్దిగా వంచి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల మనసులో వినయం ఇనుమడిస్తుంది. దేవుడికి లేదా వయసులో పెద్దవారికి నమస్కరించేటప్పుడు కళ్లు మూసుకుని భక్తి శ్రద్ధలతో ప్రణామం చేయడం అత్యంత మంగళకరం.నమస్కారం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు..నమస్కారం చేయడం వెనుక కేవలం ఆధ్యాత్మిక కోణమే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయి. రెండు చేతుల వేళ్ల చివర్లు ఒకదానికొకటి తాకినప్పుడు చేతుల్లోని ఒత్తిడి బిందువులు ఉత్తేజితం అవుతాయి. అలా ఆక్యుప్రెషర్.. జరిగి నేరుగా కళ్లు, చెవులు, మెదడుకు అనుసంధానమై ఉంటాయి. దీనివల్ల నమస్కరించిన వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుందని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది.నమస్కారంలో ఎలాంటి భౌతిక స్పర్శ ఉండదు కాబట్టి, అంటువ్యాధులు వ్యాపించే అవకాశం చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా నమస్కారానికి ఎంతో గుర్తింపు ఉంది. నేడు యోగాతో పాటు భారతీయ సంస్కృతికి ఉన్న ఆదరణ వల్ల, విదేశీయులు సైతం భౌతిక దూరం పాటిస్తూనే గౌరవాన్ని వ్యక్తం చేసే ఈ ‘నమస్తే’ సంప్రదాయాన్ని ఎంతో ఆసక్తిగా, భక్తితో పాటిస్తున్నారు. మన సంప్రదాయాలను గౌరవిద్దాం, భావితరాలకు అందిద్దాం..– పసుపులేటి శ్రీలక్ష్మినిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్ -
'మిలాద్-ఉన్-నబీ'.. విలువల ఆచరణకు పిలుపు!
ఏడవ శతాబ్దపు అరేబియా ద్వీపకల్పం అనైతికత, అన్యాయం, అజ్ఞానాల చీకట్లలో మగ్గుతున్న కాలమది. బలహీనుడి ఆర్తనాదం అరణ్యరోదనగానే మిగిలి΄ోతున్న రోజుల్లో, ఆడపిల్ల పుట్టడమే మహాపాపంగా భావించి ప్రాణాలతోనే మట్టిలో పాతిపెట్టే కిరాతక సంస్కృతి రాజ్యమేలేది. మానవత్వానికి స్థానం లేని ఆ కఠిన పరిస్థితుల్లో, ముహమ్మద్ ప్రవక్త (స) ఒక దయాసముద్రుడిగా, విమోచకుడిగా లోకానికి పరిచయమయ్యారు. ఆయన రాకతో కేవలం ఒక్రపాంతంలోనే కాక, విశ్వవ్యాప్తంగా నూతన మానవతా శకం ఆరంభమైంది.సమతాభావం – సామాజిక విప్లవంప్రవక్త తెచ్చిన మార్పు కేవలం మతపరమైన సరిహద్దులకు పరిమితం కాలేదు. మానవులందరూ ఒక్కటేనని, దేవుని దృష్టిలో అందరూ సమానులేనని ఆయన చాటారు. రంగు, జాతి, వర్గ భేదాలు మనుషుల శ్రేష్ఠతకు కొలమానాలు కావని, కేవలం నైతికత, పవిత్ర హృదయమే శ్రేష్ఠమైనవని స్పష్టం చేశారు. బానిసలను సొంత సోదరులుగా చూడాలని, వారి విముక్తికి కృషి చేయడమే నిజమైన పుణ్యమని బోధించి సమాజంలో సమతాభావాన్ని నింపారు.స్త్రీ గౌరవం – ఆర్థిక న్యాయంస్త్రీల పట్ల ఆయన చూపిన కరుణ సమాజంలో ఒక అపూర్వ విప్లవాన్ని తెచ్చింది. మహిళను భోగవస్తువుగా చూసే కాలంలో ఆమెకు ఆస్తి, వివాహం, గౌరవప్రదమైన జీవిత హక్కులను అందించారు. స్త్రీ స్థానాన్ని అత్యున్నత శిఖరానికి చేర్చారు. మదీనాలో భిన్న మతాలు, తెగల మధ్య ఆయన కుదుర్చుకున్న ఒప్పందం ప్రపంచానికే తొలి సమానత్వ ప్రతిపాదనగా నిలిచింది. బలహీనులను పీల్చి పిప్పిచేసే వడ్డీ వ్యాపారాన్ని నిరసిస్తూ, జకాత్ వంటి దానధర్మాల ద్వారా పేదలకు సంపదలో భాగం కల్పించే సన్మార్గాన్ని చూపారు.క్షమాగుణం – సార్వజనీన హక్కులుఆయన చివరి హజ్ ప్రసంగం మానవ హక్కుల ప్రకటనకు సజీవ సాక్ష్యం. మనుషుల ప్రాణాలు, గౌరవ మర్యాదలు పవిత్రమైనవని, వాటిని భంగపరచే హక్కు ఎవరికీ లేదని చాటిచెప్పారు. హింస కంటే క్షమాగుణమే గొప్పదని తన జీవితం ద్వారా నిరూపించారు. శత్రువులను సైతం ప్రేమానురాగాలతో గెలుచుకోవచ్చనే మధురమైన సత్యాన్ని ఆచరణలో చూపించి, ద్వేషం ఉన్నచోట ప్రేమను నాటారు.ఆంతరంగిక పరిపక్వత – ఆత్మజ్ఞానంబాహ్య ప్రపంచంలో సమాజ శ్రేయస్సుకు పునాదులు వేసిన ప్రవక్త బోధనలు, అంతరంగంలో మనిషి తనను తాను తెలుసుకునే ఆత్మజ్ఞాన దిశగా కూడా మార్గం సుగమం చేస్తాయి. మనిషి తన అహంకారాన్ని, స్వార్థాన్ని వీడినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతుందని ఆయన జీవితం చాటిచెప్పింది. బాహ్యంగా ఆడంబర పూజలు చేయడం కంటే హృదయ శుద్ధి కలిగి ఉండటం, ఇతరుల పట్ల దయతో మెలగడమే దైవ సామీ΄్యానికి నిజమైన మార్గమని ఆయన తత్త్వం వెల్లడిస్తుంది. మనోవికారాలను జయించి, ఆత్మనిగ్రహాన్ని సాధించడమే అత్యుత్తమమైన సమరమని బోధించడం ద్వారా మానవ చైతన్యానికి నూతన అర్థాన్ని ఇచ్చారు.నైతిక సత్యం – నిత్యచైతన్యంప్రవక్త ప్రబోధించిన శాంతి కేవలం యుద్ధాలు లేక΄ోవడం మాత్రమే కాదు, అది వ్యక్తి మనస్సు నుండి ప్రారంభమై విశ్వమంతటా విస్తరించే ఒక నిరంతర చైతన్యం. ఏ యుగంలోనైనా నైతికతను కోల్పోయిన నమూనాలు కూలి΄ోక తప్పదని, కేవలం సత్యం, కరుణ ప్రాతిపదికగా నిర్మితమైన సమాజమే శాశ్వతంగా నిలుస్తుందని ఆయన జీవితం స్పష్టం చేస్తుంది. విజ్ఞానం, సాంకేతికత ఎంత పెరిగినా నైతిక పునాదులు లేని నాగరికత వినాశనానికే దారితీస్తుందనే తాత్విక హెచ్చరిక ఆయన సందేశంలో అంతర్లీనంగా ఉంది. ఈ కాలాతీతమైన సత్యాన్ని గ్రహించినప్పుడే మనం అంతర్గత ప్రశాంతతను సాధించగలుగుతాము.నేటి సమాజం... ఆచరణాత్మక మార్గంసాంకేతికంగా ఎంతో ఎదిగినా, మానవీయ విలువల లేమితో అశాంతిని ఎదుర్కొంటున్న నేటి ఆధునిక ప్రపంచానికి ప్రవక్త చూపిన దయ, నైతికత, శాంతి మార్గాలు ఎంతగానో అత్యవసరం. మన హృదయాలలో ఆత్మీయతను పెంచుకుని, తోటి మనుషుల పట్ల కరుణ చూపడమే ఆధ్యాత్మికతకు అసలైన పరమార్థం.మీలాదున్నబీ సందర్భంగా కేవలం సంబరాలకే పరిమితం కాకుండా... ఆయన చూపిన కరుణను, సమతాభావాన్ని, సామాజిక బాధ్యతను మన నిత్య జీవితంలో ఆచరించి చూపడమే ఈ సమాజానికి మనం అందించే అత్యున్నతమైన కానుక. అప్పుడే ప్రవక్త దివ్య సందేశానికి పరిపూర్ణమైన సార్థకత చేకూరుతుంది!– మదీహా అర్జుమంద్నిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్ -
తప్పులను మన్నించే పుణ్యోత్సవం..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అత్యంత పవిత్రంగా నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాలు 2026 ఆగస్టు 23 నుండి ఆగస్టు 25 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ముందు రోజు, అనగా ఆగస్టు 22న అంకురార్పణతో వేడుకలు ప్రారంభమవుతాయి.ఏడాది పొడవునా ఆలయంలో జరిగే పూజలు, అర్చనలు, వివిధ ఉత్సవాల్లో వైష్ణవ ఆగమశాస్త్రాల ప్రకారం భక్తులు, అర్చకులు లేదా సిబ్బంది వల్ల తెలియకుండా ఏవైనా లోపాలు (దోషాలు) జరిగి ఉంటే, వాటి నివారణ కోసం ఈ ’దోష నివారణోత్సవం’ లేదా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ పవిత్రతను కాపాడటం ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశం.చారిత్రక నేపథ్యంతిరుమల ఆలయ శాసనాల ప్రకారం, ఈ పవిత్రోత్సవాలను మొదటిసారిగా క్రీ.శ. 1463లో సాళువ నరసింహరాయల కాలంలో సాళువ మల్లయ్యదేవ రాజా ప్రారంభించారు. కాలక్రమేణా నిలిచిపోయిన ఈ సంప్రదాయాన్ని టీటీడీ మళ్లీ 1962 నుండి పునరుద్ధరించి ప్రతి ఏటా శ్రావణ మాసంలో నిర్వహిస్తోంది. అయితే కొన్ని మార్పు చేర్పులతో... ఈ ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి.పవిత్రోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది:ఆగస్టు 22: సహస్రదీపాలంకార సేవ రద్దు.ఆగస్టు 23 నుండి 25 వరకు: కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. ఆగస్టు 25: అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు. ఆగస్టు 26: కల్యాణోత్సవ సేవ రద్దు.మూడు రోజుల కార్యక్రమ వివరాలుఈ మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు స్వామివార్కి ’స్నపన తిరుమంజనం’ (విశేష అభిషేకం) నిర్వహిస్తారు.ఆగస్టు 23 (మొదటి రోజు): పవిత్రాల ప్రతిష్ఠ24 (రెండవ రోజు): పవిత్ర సమర్పణ (అర్చకులు శ్రీ మలయప్పస్వామి వారిని, ఇతర ఉపదేవతలను ఐదు రంగుల పట్టు దారాలతో చేసిన పవిత్రాలతో అలంకరిస్తారు).25 (మూడో రోజు): మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి వీధి ఉత్సవం: ఈ మూడు రోజుల్లోనూ ప్రతి సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు విశేష ఆభరణాలతో తిరుమల నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.నిర్వహణ : డి.వి.ఆర్. భాస్కర్ -
తల్లి ప్రేమకు, విశ్వాసానికి ప్రతీకగా సెయింట్ హెలెనా
రోమన్ కతోలికుల ఉనికికే ప్రాణం పోసిన మహామహిళ సెయింట్ హెలెనా. రోమ్ మొదటి క్రిస్టియన్ చక్రవర్తి ‘కాన్స్టాంటైన్ ద గ్రేట్’ను కన్న వీరమాత. అది రోమా సామ్రాజ్యం మహా వైభవోపేతంగా ఉన్న కాలం! సాధారణ కుటుంబంలో హెలెనా జన్మించింది. చిన్ననాటి నుంచే భయ భక్తుల్లో పెరగబట్టి ఆమెకు పెద్దల పట్ల వినయం, సమాజం పట్ల దయ, దేవునిపై విశ్వాసం అనే సద్గుణాలు అలవడ్డాయి. ‘రోమన్ కేథలిక్కులు’ అనే పేరులో రోమన్ పదం చేరడానికి కారకులు ఈ తల్లీకొడుకులు. ఇదెలా జరిగింది?ఒకానొకపుడు క్రైస్తవుల్ని నానాహింసల పాలు చేసిందీ, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నదీ ఈ రోమన్ పాలకులే. కానీ పేదరికం అనుభవించినా గొప్ప విశ్వాసకురాలైన తల్లి ఉద్బోధనల వల్ల, కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతానికి అనుకూలంగా మారాడు. ఈ నేపథ్యంలో రోమన్ దేశంలో చిన్నగా కదలిక ప్రారంభమైంది. ‘యేసు ప్రభువు నడిచిన పవిత్ర స్థలాలను దర్శించాలి; ఆయన ప్రేమను ప్రపంచానికి గుర్తు చేయాలి’ అని హెలెనా యెరూషలేముకు పవిత్ర యాత్ర చేసింది. అక్కడ యేసు ప్రభువు శిలువ వేయబడిన స్థలాన్ని వెతికింది. సంప్రదాయం ప్రకారం, ఆమె అక్కడ శిలువకు సంబంధించిన పవిత్ర అవశేషాలను కనుగొన్నట్లు చెబుతారు.ఆమె ఆ పవిత్ర స్థలాలను గౌరవంగా సంరక్షించి, అక్కడ ప్రార్థనా మందిరాల నిర్మాణానికి సహాయం చేసింది. ముఖ్యంగా యెరూషలేములోని ‘చర్చ్ ఒఫ్ ద హోలీ సెపుల్చెర్’ నిర్మాణానికి ఆమె సహకారం అందించింది. దేవుని ప్రేమను పంచిన హెలెనా క్రీ.శ. 330లో మరణించినా, ఆమె పేరు మాత్రం శతాబ్దాల తరువాత కూడా విశ్వాసం, త్యాగం, తల్లి ప్రేమకు ప్రతీకగా నిలిచిపోయాయి.– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు -
నమ్మిన దైవమే గట్టెక్కించే దారి చూపుతుంది..
హిరణ్యకశిపుడు ఒక రోజు ఆలోచనలో పడ్డాడు. ‘అమరుల తల్లి కంటె మా అమ్మ పెద్దది. త్రిలోక రాజ్య భోగములు నాకు దక్కాలి గాని ఆ భోగాలకు అమరులెట్లా అర్హులౌతారు? ఉగ్రతపంతో కానివి లేవు కాబట్టి తపోనిష్ఠతో బ్రహ్మను మెప్పించి, ముల్లోకాధిపత్యాన్ని నేను దక్కించుకుంటాను!’ అని నిశ్చయించుకున్నాడు.తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అతడి ఉగ్రతపస్సుకు దేవేంద్రుడు భయపడ్డాడు. దేవగురువైన బృహస్పతిని చెంతకు పిలిపించుకుని, ‘తండ్రి ఒక్కడే. తల్లులు మాత్రం మాకు వేరు. జగత్సామ్రాజ్య పూజ్యనీయత తనకు దక్కాలని దైతేయుడైన హిరణ్యకశిపుడు, బ్రహ్మదేవుడి నుండి వరం పొందాలని ఉగ్రతపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు జగములు తల్లడిల్లే పరిస్థితి వస్తున్నది కాబట్టి వేరే మార్గం కనపడక అడిగినది వరంగా ఇచ్చేస్తాడు బ్రహ్మదేవుడు. అది తప్పిపోయే మార్గం చెప్పండి, గురుదేవా!’ అని ప్రాధేయపడ్డాడు.సురేంద్రుడి భయాన్ని అర్థం చేసుకున్న బృహస్పతి ‘భయపడవలసింది లేదు. విష్ణుద్వేషం, నిరంతర దోషం, శ్రుతిధర్మ విరోధం, సుజన నిరోధం లక్షణాలుగా కలిగిన అసురులను శ్రీహరి క్షమించడు. కనుక నారాయణ మంత్రాన్ని నిత్యం పారాయణం చెయ్యి!’ అని చెప్పి ఆ మంత్ర మహత్యాన్ని గురించి ఇలా వివరించాడని ఎఱ<న శ్రీనృసింహపురాణంలో చెప్పాడు.క. తను నెబ్భంగి దలంతురుజను లాభంగిన తలంచు సరసీరుహలోచనుడును వారల గావునననిశంబు కృతార్థమతులు హరిపద భక్తుల్.‘తనను ఎంత గాఢమైన భక్తితత్పరతతో పూజిస్తారోఅంతే గాఢమైన తలపుతో వారిని శ్రీహరి రక్షిస్తాడు. అందువలననే శ్రీహరిని భక్తితో కొలిచేవారికి కలగని సుఖములు లేవు!’ అని కర్తవ్యాన్ని బోధించి సురేంద్రుడి కలతను, కష్టాన్ని తీర్చాడు బృహస్పతి. తాను ఎదుర్కొనలేని ఆపదలో చిక్కుకున్న వేళ, వ్యర్థంగా కలత చెందడం మాని నమ్మిన దైవాన్ని శరణు వేడితే, ఆ ఆపద నుంచి గట్టెక్కే మార్గం కనపడుతుందని పై సన్నివేశం విదితం చేస్తుంది.– భట్టు వెంకటరావు -
పుండరీకుడి వృత్తాంతం: తపస్సుకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు!
పూర్వం పుండరీకుడు అనే మహారాజు ఒకనాడు వేటకు వెళ్లాడు. అడవిలో యథేచ్ఛగా జంతువులను వేటాడుతూ, కపిల మహర్షి ఆశ్రమ పరిసరాలకు చేరుకున్నాడు. అప్పటికి మిట్టమధ్యాహ్నమైంది. వేటలో పుండరీకుడు బాగా అలసిపోయాడు. కపిలుడి ఆశ్రమానికి చేరువలో ఒక సరోవరం కనిపించింది.పుండరీకుడు ఆ సరోవరంలో నీళ్లు తాగి, దప్పిక తీర్చుకున్నాడు. ఇంతలోనే ఒక లేడికూన ఆ సమీపంలోనే పరుగుతీస్తూ కనిపించింది. వేట ఉత్సాహం తగ్గని పుండరీకుడు వెంటనే, విల్లంబులు అందుకుని, దానిని గురిచూసి బాణం విడిచాడు. బాణం తగిలిన లేడికూన గాయపడి, ఒక్క పరుగున కపిల మహర్షి ఆశ్రమ ప్రాంగణానికి చేరుకుని, అక్కడ ప్రాణాలు విడిచింది.ఆ దృశ్యం చూసిన కపిలుడు ఉగ్రుడయ్యాడు. ‘ఎవడా మూర్ఖుడు? ఆశ్రమ పరిసరాల్లో ఇంతటి హింసకు పాల్పడినవాడు’ అని బిగ్గరగా అరిచాడు. ఇంతలో లేడిని తరుముతూ పుండరీకుడు అక్కడకు చేరుకున్నాడు. కపిలుడి ఉగ్రరూపం చూసి, భయంతో గడగడ వణుకుతూ, ‘మునివర్యా! నా అపరాధాన్ని మన్నించండి’ అంటూ కాళ్ల మీద పడ్డాడు.కపిలుడు కొంత శాంతించాడు. పుండరీకుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు.కపిలుడు తీక్షణంగా పుండరీకుని చూశాడు. ‘క్షణభంగురమైన తుచ్ఛ శరీరంపై ఆశలు పెట్టుకుని, ఇంతటి పాపానికి ఒడిగట్టావే, దీనికి కారణమేమిటి? నీ విలాసం కోసం ఒక లేడికూన నిండుప్రాణాన్ని బలిగొనడం ఏమి న్యాయం?’ అని పలికి, పుండరీకుడికి వైరాగ్యబోధ చేశాడు.కపిలుడి మాటలకు పుండరీకుడు పశ్చాత్తాపంతో దహించుకుపోయాడు. పాపిష్టి దేహాన్ని ఇక్కడే త్యాగం చేయడం మంచిదని తలచి, తన తల నరుక్కుని, ఆత్మాహుతి చేసుకోవడానికి ఒర నుంచి కత్తి దూశాడు. కపిలుడు అతడి ప్రయత్నాన్ని నివారించాడు. పుండరీకుడికి హితబోధ చేశాడు.‘మోక్షేతి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం’ అని పలికి, ‘రాజా! మానవునకు మోక్షమే పరమావధి. మోక్షాన్ని ఆపేక్షించే మానవుడు పూర్వదానఫలం వల్ల కలిగే సంపదలు క్షణికమైనవని, పరహింసాపరాయణత్వం పాపహేతువని తెలుసుకుని, గురువును ఆశ్రయించాలి. గురువు ద్వారానే తత్త్వాన్ని తెలుసుకుని, ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించాలి’ అని బోధించి, రాజధానికి వెళ్లి రమ్మని చెప్పి సాగనంపాడు.రాజధానికి తిరిగి వెళ్లినా, పుండరీకుడి మనసు మనసులో లేదు. తన శరాఘాతంలో మరణించిన లేడికూన, ఆ తర్వాత కపిల మహర్షి చేసిన ఉద్బోధ అతడి మనసులో మెదలసాగాయి. రాజ్యపాలనపై దృష్టిపెట్టడం అతడి దుస్సాధ్యంగా మారింది. వ్యాకులచిత్తుడైన పుండరీకుడు తన రాణికి, మంత్రులకు సైతం చెప్పకుండా, అన్నీ విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరాడు.కొద్దిరోజుల్లోనే పుండరీకుడు కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు.కపిలుడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన వెంటనే, అతడికి నమస్కరించాడు.‘మహర్షీ! నా రాజ్యాన్ని, సర్వసంపదలను విడిచిపెట్టి మీ చెంతకు వచ్చాను. నన్ను శిష్యుడిగా స్వీకరించి, అనుగ్రహించండి’ అని ప్రార్థించాడు.కపిలుడు అతడిని కన్నెత్తి చూడక, పన్నెత్తి పలుకరించక తృణీకరించాడు.అయినా, పుండరీకుడు అక్కడి నుంచి వెనుదిరగలేదు. ఆశ్రమ ప్రాంగణంలోనే కూర్చుని, ధ్యానం చేయడం ప్రారంభించాడు. పద్నాలుగు రోజులు అలాగే అన్నపానాదులు లేకుండా, ధ్యానంలో ఉన్నాడు. అతడి పరిస్థితి చూసి, కపిలుడి మనసు కరిగింది.శిష్య సమేతంగా పుండరీకుడి వద్దకు వెళ్లి, అతడిని పలకరించాడు.పుండరీకుడు కన్నీళ్లతో కపిలుడికి నమస్కరించాడు. తనను అనుగ్రహించాలని ప్రార్థించాడు.కపిలుడు అతడికి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను బోధించాడు.పుండరీకుడు కపిలుడినే గురువుగా భావించి, అతడు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ, చిరకాలం తపస్సు కొనసాగించాడు.పుండరీకుడి తపస్సుకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు అతడికి ప్రత్యక్షమయ్యాడు.పుండరీకుడు కోరుకున్నట్లుగానే అతడికి మోక్షాన్ని అనుగ్రహించాడు.- సాంఖ్యాయనపురావిశేషం..శ్రావణమాసంలో దేశవ్యాప్తంగా చాలాచోట్ల శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఇవి చాలామందికి తెలిసిన ఆచారాలే! కొంకణ ప్రాంతంలో శ్రావణమాసంలో ‘చుడీపూజ’ పేరుతో గాజుల పూజ చేస్తారు. తులసికోట వద్ద గాజులు, పువ్వులు, పండ్లు ఉంచి పూజ జరిపి, మహిళలకు ఫలతాంబూలాలతో పాటు గాజులను కూడా పంచిపెడతారు. శ్రావణమాసంలో శుక్రవారం, ఆదివారం రోజుల్లో తులసికోటకు, సూర్యుడిని పూజించి, మహిళలకు గాజులు కానుకగా ఇస్తారు. ఇవే రోజుల్లో కొందరు ‘దేవీసాధన’ పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. -
పూజ వేరు.. విన్నపం వేరు..
కతోలికులు మరియ మాత ముందు కూర్చొని, మూడు దేవరహస్యాలతో 15 ఘట్టాలతో కూడుకొన్న జపదండ చెబుతారు. క్రీస్తు ప్రభు గురించి, తండ్రి దేవునికి సంబంధించి, ఆత్మ దేవునికి సంబంధించిన రహస్యాలే అవి. ఆ యా ఘట్టాలన్నీ కొత్త నిబంధనా సంఘటనలే. దేవునికీ తమకూ మధ్యవర్తిగా ఆమెను నిలబెట్టి, ఆ ప్రభునికి ‘మా బాధలూ గాథలూ చేరవేయవమ్మా మా మరియమ్మా’ అని వేడుకొంటారు. పూజ వేరు, విన్నపం వేరు.బైబిల్లో ఆమెకు ఎదురైన చిన్న సంఘటనల్లోని మాటల్నే జపంగా మార్చుకొని పదే పదే ఉచ్ఛరించడం వల్ల ఆమె కేవేవో పూజలు జరుగుతున్నాయనుకోకూడదు. ఈ విషయమై ఇటీవల విశ్వ కాపరి, పోప్ లియో ప్రత్యేకమైన సందేశం ఇచ్చిన సంగతి మరువగూడదు. శిలువపై మరణించబోతున్న యేసు ప్రభువు, తన తల్లి బాధ్యత ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. మరియ మాత ఓ చిన్న ఇంట్లో నివసించేది. ఆమె ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేది. అందరినీ ప్రేమతో చూసుకునేది. తన చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదించేది. పేదలకు సహాయం చేసేది. యేసు చెప్పిన మాటలను ప్రజలకు గుర్తు చేసేది.ఓ రోజు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, ‘మరియమ్మా! దేవుడు నిన్ను తన దగ్గరకు పిలుస్తున్నాడు’ అని చెప్పాడు. కొంతకాలానికి ఆమె భూలోక జీవితాన్ని ముగించింది. యేసు శిష్యులు ఆమెను ఎంతో గౌరవంగా సమాధి చేశారు. కొన్ని రోజుల తర్వాత వారు సమాధి దగ్గరకు వెళ్లి చూడగా, అక్కడ మరియ మాత శరీరం కనిపించలేదు. దేవుడు ఆమెను శరీరంతో సహా పరలోకానికి తీసుకువెళ్లాడని వారు విశ్వసించారు. ఆమెకు తిన్నగా మోక్షాన్ని ఆరోపించారు. ఇది ‘మోక్షారోపణ’. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరియ మాత మోక్షారోపణ పండుగ జరుపుకొంటారు. అమె ఎంతో ధన్యురాలని పిలుస్తారు. (లూకా 1:48)– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (ఆగస్టు 15న మరియా మోక్షారోపణ పండుగ) -
బయటి అందం కాదు.. అంతరంగ పవిత్రతే అసలైన అందం!
ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, మనిషి అన్వేషణ మాత్రం ఒకటే–శాంతి, ఆనందం, పరిపూర్ణత. ధనం, హోదా, సాంకేతిక విజ్ఞానం, సామాజిక గుర్తింపుం ఇవన్నీ జీవితాన్ని సౌకర్యవంతం చేయగలవేమో గానీ, అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచలేవు. మనసులో కలత, అసంతృప్తి, భయం, అసూయ, కోపం, అహంకారం వంటి భావాలు తొలగినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది.ఆ అంతరంగ శాంతికి, ఆత్మసాక్షాత్కారానికి, దైవానుభూతికి మూలం పవిత్రత అని భారతీయ ఋషులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. సహజయోగ వ్యవస్థాపకురాలు పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి 1985 ఆగస్టు 4న ఇచ్చిన సందేశంలో ఈ సత్యాన్ని అత్యంత సరళంగా వివరించారు. ఆమె మాటల్లో ‘‘పవిత్రత కుండలినిని బలపరుస్తుంది.’’ ఈ ఒక్క వాక్యంలోనే ఆధ్యాత్మిక జీవిత సారాంశం దాగి ఉంది.కుండలిని అంటే ఏమిటి?భారతీయ యోగశాస్త్రం ప్రకారం ప్రతి మనిషిలో జన్మతః ఒక దివ్యశక్తి నిద్రాణంగా ఉంటుంది. అదే కుండలిని. ఇది కేవలం ఒక తాత్విక భావన కాదు; ప్రతి మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక పరిణామ శక్తికి ప్రతీక. ఈ శక్తి జాగృతమైతే మనిషి తన అసలైన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఆలోచనలు నిర్మలమవుతాయి. కోపం, భయం, ద్వేషం క్రమంగా తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, క్షమాగుణం సహజంగా వికసిస్తాయి. అయితే ఈ దివ్యశక్తి వికసించడానికి అత్యంత అవసరమైన నేల పవిత్రత. మురికినీటిలో తామర పువ్వు వికసించదు. అలాగే కలుషితమైన మనస్సులో దైవచైతన్యం పూర్తిగా వికసించదు.నేటి సమాజం – పరుగు...ప్రస్తుత కాలంలో వ్యక్తి విలువను అతని వ్యక్తిత్వంతో కాకుండా, అతని బాహ్య రూపం, వస్త్రధారణ, ఆస్తి, సామాజిక మాధ్యమాల్లోని ్రపాచుర్యం ఆధారంగా కొలిచే పరిస్థితి ఏర్పడుతోంది. అందంగా కనిపించడానికి గంటల సమయం వెచ్చిస్తాం. ఇతరుల ప్రశంసలు పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మన గురించి నలుగురు ఏమనుకుంటారో అనే ఆందోళనలోనే జీవితాన్ని గడిపేస్తాం.కానీ ఈ ప్రయాసలన్నీ బాహ్య ప్రపంచానికే పరిమితం. అవి మనసును శాశ్వతంగా తృప్తిపరచవు. అంతేకాదు, అనవసరమైన పోలికలు, అసూయ, అహంకారం, నిరాశలకు కూడా కారణమవుతాయి. ఈ పరిస్థితిలో మనిషి తనలోని సహజ శక్తిని బయట ప్రపంచం కోసం ఖర్చు చేస్తూ, తన ఆత్మసంపదను కోల్పోతాడు. శ్రీ మాతాజీ అందుకే హెచ్చరిస్తారు–‘‘ఇతరులను ఆకర్షించడానికి మీ శక్తిని వృథా చేయకండి. సాధువులలాగే జీవించండి.’’– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులునిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
క్రీస్తు మరణం.. సువార్తకు కేంద్రబిందువు!
ఘనమైన సువార్త నిర్వచనం ఇలా ఉంది. దీన్నే పౌలు సువార్త నిర్వచనం అంటారు కూడా.‘...నేను ఏ సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. సమాధి చేయబడెను. మూడవ దినమున లేపబడెను’ 1కొరింధీ 15:1–4.క్రీస్తు మరణ సువార్తను మించిన సువార్త లేదన్నది బైబిలు ఉన్నత బోధ. దేవదేవుని గొప్పతనం అంతా ఇక్కడనే కనిపిస్తుంది. ఈ సర్వ లోకానికి భిన్నమైన వైవిధ్యమైన ఆశ్చర్యకర తలంపులు దేవునివి. దేవుడు ఏది సువార్త అంటాడో అదే సువార్త. ఎందుకంటే క్రీస్తు మరణం దేవదేవుని స్వకీయ సంకల్పంలో నుండే వెలుగులోకి వచ్చింది.ఉన్నది ఉన్నట్టుగా సువార్తను ప్రకటించక సువార్తకు జ్ఞానం, స్వస్థత, సాక్ష్యాలు, ఇప్పటి భక్తుల చరిత్రలు, అభిషేకారాధన వంటివి అనేకనేకం కలుపుతూ సువార్త శక్తిని హరిస్తున్నారు. పెద్ద పాలకుండలోని చిక్కనైన పాలలో చిన్నపాటి బిందువు లాంటి విషపు చుక్కవేస్తే రంగు రుచి వాసన కోల్పోతూ ఆ పాలన్నీ విరిగినట్టే. సత్య వాక్యమను రక్షణ సువార్తకు అలా ఏది చేర్చినా అది తన శక్తి ప్రభావ మహిమలను వెనువెంటనే కోల్పోతుంది. సువార్తకు మరింత రుచి, సువాసన అన్న ఆలోచనలు చేసేవాళ్ళు తక్షణమే అవి విడనాడాలి.సిలువ వేయబడిన క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానం అయి ఉండగా కొత్తగా సువార్తకు జ్ఞానం అద్దడం దేనికీ? ఆత్మ స్వస్థతకు పాప రోగనివారణకు క్రీస్తు మరణిస్తే భౌతిక భావాలతో సువార్త స్వస్థత మహాసభలు దేనికీ? క్రీస్తు మరణ సువార్తకు ఏదీ కలుప కూడదు అనునదే అపొస్తలుల బోధలసారం.సూచక క్రియలకు మించిన సూచక క్రియ క్రీస్తు ప్రేమకు కేంద్రమైన సిలువ. జ్ఞానానికి మించిన జ్ఞానం సిలువ వేయబడిన క్రీస్తులో కనబడుతుంది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవుతుంది. సర్వ సంపూర్ణత క్రీస్తు బలియాగంలో ఒదిగి నిక్షిప్తమై ఉంది. ఇందు లేనిదంటూ ఏదీ లేదు. అలాగని సువార్తను మరుగు చేసేలా ఇందు ఒదిగిన అంశాల చుట్టూ సువార్త పేర్చడం కాక సువార్తకు ఏది కలుపక యథార్థమైన సువార్తను యధాతథంగానే ప్రకటించబద్దులము.సువార్తకు ఎలాంటి ఆధారం ఏ ఊతం అవసరం లేదు. అది ఒంటరిగానే నిలబడి వ్యవహారం చక్కబెట్టగలదు. పరమ పరిశుద్ధ సువార్తను అంతే çపరిశుద్ధంగా... అంతే స్వచ్ఛంగా వెల్లడి చేయుట ద్వారా దేవుని మెప్పు అధికంగా పొందగలుగుతాం. ప్రకటనార్హమైనదిగా ఉంటూ వెళ్ళు ప్రకటించు అనదగ్గ క్రీస్తు సువార్తను అనుభవపూర్వకంగా రుచి చూస్తే మాత్రం దీనికి వేరే ఏది జతగా కలుపకూడదనేది ఇట్టే అర్థమవుతుంది.మానవాళి ఆత్మలను రక్షించే శక్తిగల సత్యసువార్త గొప్పతనం ఏమంటే నేరుగా అది వచ్చి అపొస్తలుల చేతిలో పడడం. వీరిపై క్రీస్తు ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగానే వీరు ఆయన సువార్తకు న్యాయం చేసారు. సువార్తకు ఏదీ కలుపక క్రీస్తు మరణ సువార్తను ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటించే విషయమై మనం అపొస్తలులను అభినందించక తప్పదు. ఎట్టి పరిస్థితులలోనూ క్రీస్తు మరణ సువార్తకు ఆయన జన్మను సైతం పౌలు కలుపకపోవడం గమనించదగ్గది. ఇట్టి అపొస్తలుల బోధకు, సువార్తకు విధేయులమై తలవంచుటే రక్షణ భాగ్యం. – జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
గౌరవం అంటే?
ప్రతి మనిషి, ప్రతి కుటుంబం గౌరవం నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోనే ఉంటారు... గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. అసలు గౌరవం అంటే ఏమిటీ, గౌరవం ఎలా పొందాలో, ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం... ఉన్నారుగా మనకు మార్గదర్శులు.. శతక రచయితలు...కులములోన నొకడు గుణవంతుడుండెకులము వెలయు వాని గుణము చేతవెలయు వనములో న మలయజంబున్నట్లువిశ్వదాభిరామ వినుర వేమఅడవిలో గంధం చెట్టుంటే దాని సువాసన అడవి అంతటికి పాకుతుంది.. అలాగే వంశంలో గుణవంతుడైన కొడుకు ఉంటే ఆ వంశానికి కీర్తి గౌరవం లభిస్తాయి... అంటూ వేమనే పై పద్యానికి వ్యతిరేకం కూడా చె΄్పారు.కులములోన నొకడు గుణహీనుడుండెనాకులము చెడును వాని గుణము వలన చెఱుకుతుద ఎన్ను పుట్టినచెఱుకున తీపెల్ల జెరుచు సిద్ధము సుమతీ అంటాడు బద్దెన కవి వేమన గౌరవం కులం ధనం వల్ల రాదు అన్నాడుకులము గొప్పది కాదురాకులమున గౌరవమ్ము లేదు కొంపలు కూలన్నడవడి గొప్పది సుమ్మీనడవడి గలవాడు పూజ్యుడగు వేమాఅర్థం: కులం వల్ల గౌరవం రాదు. మంచి నడవడి ఉన్నవాడే లోకంలో పూజ్యుడు.ఎంగిలి మెతుకులు తిన్ననుసంగతి గలవాడు గౌరవమున బ్రతుకునుసంగతి లేని ధనికుడుకంగారు పడును లోకమందు వేమాపేదవాడైనా మంచి నడవడి ఉంటే గౌరవంగా బతుకుతాడు. నడవడి లేని ధనికుడు లోకంలో చులకన అవుతాడు. గౌరవం మాట, మర్యాద, దానం వల్ల వస్తుందన్నాడు బద్దెన.– డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లా బెంగళూరుకు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధ నంది కొండల పాదభాగాన ఉన్న నంది గ్రామం చరిత్ర కళా వైభవం ప్రకృతి సౌందర్యం మూడింటినీ ఒకే చోట కలిపిన అరుదైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలోనే కర్ణాటకలో అత్యంత ప్రాచీనమైన శైవ ఆలయ సముదాయాలలో ఒకటైన భోగనందీశ్వర, అరుణాచలేశ్వర జంట దేవాలయాలు ఉన్నాయి.నోలంబవాది ద్రావిడ శిల్పశైలికి తొలి నిదర్శనాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ఆలయ సముదాయం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్రను తనలో దాచుకుంది. నంది కొండల నుండి దిగివచ్చే సహజ జలవాహినులు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చడం వల్ల ప్రాచీన కాలం నుంచే ఇది పవిత్ర తీర్థక్షేత్రంగా అభివృద్ధి చెందింది.ఈ ఆలయ నిర్మాణం తొమ్మిదవ శతాబ్దం మొదట్లో ప్రారంభమై దాదాపు వంద సంవత్సరాలకు పైగా కొనసాగింది. ఈ ఆలయ సముదాయం నిర్మాణంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. దక్షిణాన ఉన్న అరుణాచలేశ్వర ఆలయం పరమశివుని బాల్య దశను సూచిస్తే ఉత్తరాన ఉన్న భోగనందీశ్వర ఆలయం యవ్వన దశను సూచిస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న చిన్న ఉమా మహేశ్వర ఆలయం శివపార్వతుల దాంపత్య జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మూడు ఆలయాలను వరుసగా దర్శించడం ద్వారా శివుని జీవనయాత్రను ప్రతీకాత్మకంగా అనుభవించినట్లవుతుందని స్థానిక విశ్వాసం.రెండు ప్రధాన ఆలయాల గర్భగృహాలు ఎతై ్తన వేదికలపై నిర్మించబడ్డాయి. ప్రతి గర్భగృహంలో శివలింగం ప్రతిష్ఠించబడింది. ఈ రెండు ఆలయాలకు విడివిడిగా నంది మండపాలు ఉండటం అత్యంత అరుదైన విశేషం. సాధారణంగా శివాలయాలలో ఒకే నంది విగ్రహం ప్రధాన గర్భగృహానికి ఎదురుగా ఉంటుంది. అయితే ఇక్కడ రెండు నంది విగ్రహాలు తమ తమ గర్భగృహాలకు అనుగుణంగా సరిగ్గా అమర్చబడి ఉండటం ఆలయ నిర్మాణ శైలిలో అసాధారణ లక్షణంగా భావించబడుతుంది.ఈ ఆలయ సముదాయంలోని సభామండపం శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి స్తంభంపైనా దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు నర్తకులు యాళులు ఏనుగులు గుర్రాలు హంసలు మకరాలు పూలతీగలు పురాణ దృశ్యాలు అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం. ఒక స్తంభంపై పదితలలు పది జతల చేతులతో కైలాసాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తున్న రావణాసురుని శిల్పం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. జుట్టు ముడులు ఆభరణాలు గాజులు వేళ్లగోళ్లు వస్త్ర మడతలు వరకు ఎంతో సూక్ష్మంగా చెక్కిన తీరు అప్పటి శిల్పుల ప్రతిభకు నిదర్శనం. మండపంలోని కొన్ని స్తంభాలపై తమిళ శాసనాలు చెక్కబడి ఉన్నాయి.ఆలయ గోడలు, గవాక్షాలు, ద్వారబంధాలు, పైకప్పు అంచులు అన్నిచోట్లా శిల్పకళ నిండి ఉంటుంది. ప్రధానంగా శైవ క్షేత్రమైనా నరసింహుడు లక్ష్మీదేవి దుర్గాదేవి సూర్యుడు అగ్నిదేవుడు గణపతి సుబ్రహ్మణ్యుడు సప్తమాతృకలు, భైరవుడు చండేశ్వరుడు వంటి అనేక దేవతా రూపాలు ఇక్కడ దర్శనమిస్తాయి. శైవ వైష్ణవ శాక్త సంప్రదాయాల సమన్వయాన్ని ఈ శిల్పాలు ప్రతిబింబిస్తాయి. ఆలయ ద్వారపాలకుల విగ్రహాలు గంభీరమైన భంగిమలో నిలిచి సందర్శకులను ఆకట్టుకుంటాయి.– జి.బి. విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
శ్రావణంలో ఇవి చేస్తే శుభఫలితాలు!
మామూలు సమయాలలో ఎలా ఉన్నా శ్రావణమాసం రాగానే ఇంచుమించు ప్రతి భక్తుడి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం ధూపదీప నైవేద్యాలతో, చందన సుగంధాలతో, చిరుగంటల సవ్వడితో... కర్పూర నీరాజనపు పరిమళాలతో... కాళ్లకు పసుపు, నొసట కుంకుమ ధరించిన ముత్తైదువల పట్టుచీరల రెపరెపలతో వీధులన్నింటా ఒక పవిత్రమైన వాతావరణం నెలకొంటుంది. అంత గొప్ప శుభమాసం నేడే ప్రారంభమైంది. ఇక ఈ మాసమంతా ఎన్నో పండుగలు, పర్వదినాలు, వివాహాది శుభముహూర్తాలతో సందడి చేయనుంది.సనాతన ధర్మంలో (హిందూ) చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది, ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసంగా శ్రావణమాసానికి పేరు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు విశిష్ట ఫలం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.శివారాధనకు ఎంతో విశిష్టతశ్రావణమాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఈ వ్రతాన్ని చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రిపూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలం ఉంటుందని శాస్త్రోక్తి.మంగళ గౌరీ వ్రతంశ్రావణ మాసం లో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అనీ పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీ కృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రతీతి..వరలక్ష్మీ వ్రతంశ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే ముత్తయిదువులకు వాయనాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి.విశిష్టతలుశుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని ప్రతీతి.శుక్ల పక్ష పౌర్ణమిరాఖీ పౌర్ణమిగా జరుపుకునే శ్రావణ పున్నమి రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ చేస్తారు. వేదాభ్యాసాన్ని ప్రారంభిస్తారు.ఇక ఆ తర్వాత వచ్చే కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య పర్వాలు కూడా శ్రావణమాసంలోనే వస్తాయి. కృష్ణాష్టమి, ΄÷లాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలను ఆచరిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రోక్తి.– పూర్ణిమాస్వాతినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
దీక్ష.. గురువు పెట్టిన పరీక్ష!
అస్మృతిః క్లేశజాతస్య దీక్షాయాః ఆది లక్షణమ్’ ఒక పని చేసేటప్పడు దీక్ష ముఖ్యం. ఎలాంటి బాధలు గుర్తుకురాకుండా ఉండటమే దీక్షకు ప్రధాన లక్షణం. ఏ పనినైనా చేసి లక్ష్యాన్ని సాధించాలని అనుకొన్నప్పుడు అందులో ఉండే కష్టనష్టాలు గుర్తుకు రాకూడదు. గుర్తొస్తే పట్టుదల పలచబడి లక్ష్యం సాధించలేరు. ఏకాగ్రత ఉన్నప్పుడే లక్ష్య సాధన సాధ్యమవుతుంది.కారు నడిపే సమయంలో డ్రైవరు మనసు పరిపరివిధాల పోకుండా ముందు రోడ్డువైపే ఏకాగ్రతతో ఉంటుంది. లేకపోతే ప్రమాదాలేర్పడతాయి. అందుకే డ్రైవరు కారు వేగం పరిమి తిని, సమయాన్ని, ట్రాఫిక్ రూల్సును, సిగ్నల్స్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ముందుచూపు సడల కుండా దీక్షతో నడుపుతాడు. అప్పుడే వాహనం క్షేమంగా గమ్యం చేరుతుంది.ఒక శిల్పాచార్యుడికి ఇద్దరు శిష్యులుండేవారు. మొదటివాడు కష్టపడి చాలాసేపు శిల్పాలు చెక్కుతూనే ఉండే వాడు. రెండోవాడికెప్పుడూ ఆటల ధ్యాసే. గురువుగారు వచ్చేసరికి పని చేస్తూండటం, తర్వాత వదిలివేయటం అలవాటు. ఒకరోజు ఇద్దర్నీ పిలిచి ఫలానా కొండల్లో ఫలానా రాయి ఉంది, వెతికి తీసుకురండని పంపాడు. ఇద్దరు అలాగే వెళ్ళి శిలను గుర్తించి తెచ్చారు. మొదటివాడు పండ్లు, పూలు, మూలికలు కూడా తెచ్చాడు.‘ఇవన్నీ ఎందుకురా?’ అని గురువడిగితే ‘స్వామీ! నా తల్లికి పండ్లు, చెల్లికి పూలు, మా అమ్మమ్మ చికిత్సకు మూలికలు తెచ్చా’నన్నాడు మొదటి శిష్యుడు. రెండవవాడిని ‘ఏరా! మీ తలిదండ్రులకు సుస్తీగా ఉందికదా! మరి నీవెందుకు మూలికలు తేలేదు’ అని గురువడిగాడు. ‘స్వామీ! నేను శిలను మాత్రమే వెతికాను. ఇతర ఆలోచనలేవీ నాకు లేవు’ అన్నాడు. పనిలో ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉంటే కార్యసిద్ధి కల్గుతుంది.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
నా భార్యకు రెండేళ్లుగా అవే ఆలోచనలు.. గంటల కొద్దీ అక్కడే!
నా భార్యకు 35 ఏళ్లు. ఆమెకు గత రెండేళ్ల నుండి పూజలు, భక్తి విపరీతంగా పెరిగిపోయాయి. పెళ్లయిన కొత్తలో ఏదో కొంతసేపు దేవుడి గదిలో గడిపేది. ఈమధ్య రోజంతా పూజల్లోనే ఉంటుంది. రోజుకు మూడుసార్లు తలస్నానం చేయటం, బాత్రూంలో గంటకు పైగా గడపటం, గదులన్నీ మాటిమాటికీ శుభ్రం చేయటం చేస్తుంది. దీనివల్ల ఇంట్లో పనులన్నీ చాలా ఆలస్యం అవుతున్నాయి. పిల్లలకు, నాకు కూడా ఆఫీసు సమయానికి క్యారేజీ కట్టలేకపోతోంది. అదేమని అడిగితే అలా చేయకపోతే కుటుంబానికి అరిష్టం కలుగుతుందని, దేవుడికి కోపం వస్తుందని చెబుతుంది. వీటిని కంట్రోల్ చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని చెబుతుంది. ఆమె చేయడమే కాదు, నన్ను, పిల్లలను కూడా తనలాగే చేయమని ఒత్తిడి చేస్తోంది. మాకేం చెయ్యాలో తెలియటం లేదు. ఇలా అతిగా పూజలు చేయటం కూడా ఏదైనా జబ్బంటారా?– రామసుబ్రహ్మణ్యం, మహబూబ్ నగర్ మీ బాధ నాకు అర్థం అయింది. పూజలు చేయడం, భక్తి భావం ఉండటం తప్పుకాదు. చాలామంది రోజూ వారివారి నమ్మకాల ప్రకారం దేవుడికి దండం పెట్టుకోవడం, కొంతసేపు పూజ చేయడం మామూలే! కానీ మీ భార్య లాగా, రోజులో ఎక్కువ సమయం పూజలు చేయడం, దేవుడి గదిలోనే రోజంతా గడపటం, ఇంటిని, వంటను సరిగా పట్టించుకోకపోవడం, పిల్లలకు, మీకు సమయానికి వండి పెట్టి స్కూలుకు, ఆఫీసుకు సమయానికి పంపక పోవటం... ఇవన్నీ ఆమెలోని ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి. అయితే వీటిని తగ్గించుకోవాలని ప్రయత్నం చేసినా సాధ్యం కావడం లేదని, ఒకవేళ అలా చేయలేకపోతే, కుటుంబానికి ఏదైనా కీడు జరుగుతుందన్న భయంతో ఇలా చేస్తున్నట్లు ఆమె చెబుతోందంటున్నారు. ఇలా ఏదైనా ఒక పనిని పదేపదే చేస్తూ, మిగతా పనులను నిర్లక్ష్యం చేయడం, వద్దనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోవడం లాంటి లక్షణాలన్నీ‘‘అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)’’ అనే మానసిక రుగ్మతకు లోనైన వారిలో ఉంటాయి. ఇది కూడా ఒక మానసిక రుగ్మతే! మెదడులోని సెరటోనిన్ అనే ఒక ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యత తేడా వచ్చినప్పుడు, ఈ జబ్బు లక్షణాలు బయటపడతాయి. కొందరిలో వారసత్వంగా కూడా ఈ సమస్య రావచ్చు. ఇలాంటి వారికి మానసిక వైద్యశాస్త్రంలో మంచి చికిత్స ఉంది. కొన్ని మందుల ద్వారాను, ‘‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’అనే ప్రత్యేక మానసిక చికిత్స ద్వారానూ వీరిని ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడేయవచ్చు. ఏదైనా అతి మంచిది కాదు, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని మన పెద్దలు అన్నది అక్షరాలా నిజం. మీరు వెంటనే మీ భార్యని దగ్గర్లోని మంచి సైకియాట్రిస్టుకు చూపించి తగిన చికిత్స చేయించండి. ఆమెలో తప్పకుండా మార్పు వచ్చి మళ్లీ పూర్వస్థితికి వస్తుంది. మీరంతా మనశ్శాంతిగా ఉంటారు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
వర్షాకాలంలో తులసి మొక్కను ఇలా పెంచడమే మంచిది..
తులసి మొక్కకు వర్షాకాలం అనుకూలమైన సమయం. వాతావరణంలో తేమ, చల్లదనం ఉండటంతోపాటు మొక్క వేగంగా కొత్త ఆకులు, కొమ్మలు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే, అధిక వర్షం, నీరు నిలిచిపోవడం, సూర్యరశ్మి తగ్గడంతో తులసి మొక్క బలహీనపడుతుంది. అయితే, ఇంట్లో తులసి మొక్కను పచ్చగా, ఆరోగ్యంగా, దట్టంగా పెంచుకోవాలంటే ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.సూచనలు.. జాగ్రత్తలు..తులసి మొక్కను దట్టంగా పెంచడానికి పైభాగంలో పెరుగుతున్న చివరి కొనలను అప్పుడప్పుడు చేతితో స్వల్పంగా తెంచేయాలి. దీంతో కిందివైపు కొత్త కొమ్మలు రావడం ప్రారంభిస్తాయి. మొక్క ఒకే కాడలా పైకి పెరగకుండా గుబురుగా మారుతుంది.తులసి చెట్టు పువ్వులు కాసినప్పుడు వాటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించవచ్చు. ఇలా చేయడంతో కొత్త ఆకులు, కొమ్మల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అయితే విత్తనాలకై కొన్ని పువ్వులను తెంచకుండా ఉంచితే చాలు.వర్షాకాలంలో ఈ చెట్టుకి నీరు ఎక్కువగా అందడం పెద్ద సమస్యగా మారవచ్చు. దీంతో కుండీలో నీరు నిలిచి చెట్టువేర్లకు సరైన ఆక్సిజన్ ఆందక చెట్టు కాడ నల్లగా మారుతుంది. మట్టి తడిగా ఉన్నట్లయితే మళ్లీ నీరు పోయాల్సిన అవసరం ఏమాత్రం లేదు.నీరు పోసే ముందు మట్టిని వేలితో తాకి చూడాలి. పై పొర పొడిగా అనిపిస్తేనే నీరు అందించాలి. అలాగే పోసిన నీరు నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు కుండీ అడుగున చిన్న చిన్న రంధ్రాలు తప్పనిసరిగా ఉండాలి. నీరు ఎక్కువసేపు నిలిచిపోతే తులసి వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.తులసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి తగినంత వెలుతురు అవసరం. అలాగే ప్రతిరోజూ కొన్ని గంటలు(4-6) సూర్యరశ్మి తగిలేలా చూడాలి. అయితే వర్షాకాలంలో ఆకాశం నల్లని మబ్బులతో కూడుకుని ఉండటంతో.. సూర్యకిరణాలు నేరుగా అందకపోవచ్చు. వాటికి బదులుగా మొక్కకు వీలైనంత ఎక్కువ సహజ వెలుతురు అందే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. దీంతో ఆకుల రంగు బాగుండటంతోపాటు కొత్త కొమ్మలు, మొక్క పెరుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది.తులసికి కేవలం ఎరువు వేయడమే కాకుండా.. కుండీలోని మట్టి ఎక్కువ నీరును పిల్చేదిగా ఉండకూడదు. అయితే, ఆ మట్టిలో తక్కువగా ఇసుక, కుళ్లిన సేంద్రియ ఎరువును కలపవచ్చు. దీంతో మట్టి మరీ బరువుగా మారకుండా ఉండటంతో వేర్లకు గాలి బాగా అందుతుంది.తులసి మొక్క పెరుగుతున్నప్పుడు పోషకాలు కూడా అవసరం. అప్పుడప్పుడు కొద్దిమొత్తంలో వర్మీకంపోస్(Vermicompost) లేదా బాగా కుళ్లిన సేంద్రియ ఎరువును మట్టిలో కలపవచ్చు. ఎరువును ఎక్కువగా వేయడంతో ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉంటుంది. దాంతో మొక్కకు తగిన మోతాదులో ఎరువును వేయడమే మంచిది.వర్షాకాలంలో తేమ పెరగడంతో తులసి ఆకులు, కాండంపై చిన్న చిన్న పురుగులు లేదా ఫంగస్ సమస్యలు తరచూ వస్తూంటాయి. అందుకు వారానికి ఒకటి, రెండుసార్లు ఆకులు, కాండాన్ని పరిశీలించాలి. ఆకులపై పురుగులు కనిపిస్తే వేప నూనె ఆధారిత స్ప్రే వంటి సహజ నియంత్రణ పద్ధతులను ఉపయోగించవచ్చు.తులసికి పూలగుత్తులు రావడం సహజమే. అయితే మొక్కను మరింత దట్టంగా, ఆకులతో నిండుగా పెంచుకోవాలనుకుంటే.. ఎక్కువగా ఉన్న పాత పుష్ప గుత్తులను ఎప్పటికప్పుడు తొలగించడం ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఎండిపోయిన, దెబ్బతిని పసుపు రంగులోకి మారిన ఆకులను కూడా తొలగిస్తూ ఉండాలి.వర్షాకాలంలో తులసి సంరక్షణ అంటే.. కేవలం నీరు, ఎరువు ఇవ్వడమేకాదు, సరైన వెలుతురు, పరిమిత నీరు, మంచి నాణ్యతగల మట్టి(ఎర్రమట్టి), ఎప్పటికప్పుడు పించింగ్, సమతుల్యమైన పోషణ వంటి కీలకమైన జాగ్రత్తలతో మొక్క మరింత ఆరోగ్యంగా, దట్టంగా పెరిగే అవకాశం ఉంటుంది.భారతీయ కుటుంబాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. పూజా స్థలంలో, ఇంటి ఆవరణలో పెంచుకునే తులసిని ప్రేమగా సంరక్షించడం ప్రతీ కుటుంబంలో ఒక మంచి సంప్రదాయం. అయితే, వర్షాకాలంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ పేరుతో ఎక్కువ నీరు పోయకుండా ఉండటమే మరో ముఖ్యమైన జాగ్రత్త. -
అసలు సన్యాసం అంటే 'నేను–నాది’ని వదలడమే!
'జటిలో ముణ్డీలుంచిత కేశఃకాషాయాంబర బహుకృత వేషఃపశ్యన్నపి చ న పశ్యతి మూఢఃఉదర నిమిత్తం బహుకృత వేషః'ఇది శంకర భగవత్పాదుల వారి ‘భజగోవిందం’లోని ఒక శ్లోకం. జడలు కట్టిన వెంట్రుకలతో ఒకడు, జుట్టులేక ముండనము చేయించుకున్నవాడు ఒకడు, వ్రేలా డుతూ ఉండే వెంట్రుకలు కలవాడు ఒకడు, కాషాయ రంగు బట్టలను ధరించినవాడు ఒకడు– నిజానికి వీళ్ళంతా ఉదర పోషణకు మాత్రమే వివిధ వేషములను వేస్తారు (భజగోవిందం; వ్యాఖ్య స్వామి చిన్మయానంద).శంకరాచార్యుల కాలం నాటికే సన్యాసులు అలా ఉండేవారంటే ఆశ్చర్యం కల్గుతుంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు సాధన కొరకు జీవించాలి కాబట్టి ఏదో కొంత భిక్షాన్నాన్ని, దాన్ని పవిత్రమైన ‘మధుకరి’గా భావించి యాచించేవారు. కానీ ఈనాడు ఆధ్యాత్మిక సాధన ఏదీ లేకపోయినా, కేవలం కాషాయ వస్త్రాలను ధరించి, సన్యాసులుగా అవతారమెత్తి యాచిస్తున్నారు చాలామంది.కేరళలోని ఆనందాశ్రమానికి చెందిన విశ్వమాత కృష్ణాబాయి ఏ యువకుడైనా తనకు సన్యాస దీక్షను ఇమ్మని అడిగితే, మందలిస్తూ ఇలా చెప్పేది: ‘సన్యాసం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. నీవెందరో సన్నాసులను చూస్తున్నావు. వారు పొందినదేమిటి? గృహాన్ని, బంధువులను వదలటం, కాషాయ వస్త్రాలను ధరించటమే సన్యాసం కాదు. నేను, నాది అన్న భావాన్ని వదలటం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా దీనిని నీవు చేయవచ్చు. నీ వైపునుండి అవసరమైన ఒకే ఒక విషయం నీ శాశ్వత స్వరూపాన్ని సాక్షాత్కరించుకొనవలెననే తీవ్రమైన ఆకాంక్ష.ఈ ఆకాంక్షతో రామనామాన్ని స్వీకరించి, నీ ఇరుగు పొరుగు వారినీ, నీ ప్రదేశంలో నున్నవారినీ రాముని రూపాలుగా సేవించు. పవిత్రమూ, సర్వశక్తిమంతమైన రామ నామాన్ని నిరంతరం నీ నాలుక మీద నాట్యం చేయ నివ్వు’ (పుటలు– 41–42; విశ్వమాత కృష్ణాబాయి– స్వామి సచ్చిదానంద – ఆనందాశ్రమము).– రాచమడుగు శ్రీనివాసులు -
నకులుడు... అశ్వశిక్షణలో మేటి
పాండవుల పేర్లు చెప్పగానే అందరూ వారు అయిదుగురూ కుంతీపుత్రులే అనుకుంటారు. అయితే పాండురాజు మొదటి భార్య అయిన కుంతికి దూర్వాస మహర్షి చేసిన మంత్రోపదేశ ప్రభావంతో యమధర్మరాజు అనుగ్రహంతో ధర్మరాజు, వాయుదేవుడి వల్ల భీముడు, ఇంద్రుని వల్ల అర్జునుడు జన్మించగా... రెండోభార్య అయిన మాద్రికి అశ్వినీదేవతల అనుగ్రహంతో నకుల సహదేవులు జన్మించారు.నకులుడు అంటే చాలా అందగాడు అని అర్థం. అందుకే నకులుడిని అపర మన్మధుడు అని కూడా అంటారు. నకులుడు కత్తియుద్ధంలో గొప్పవీరుడు. గుర్రాలపోషణలో ఎంతో నైపుణ్యం కలిగినవాడు. పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు విరాటరాజు కొలువులో ‘దామగ్రంథి’ అనే పేరుతో గుర్రాల శిక్షకుడిగా పనిచేశాడు.కురుక్షేత్ర యుద్ధంలో పాండవ సైన్యంలోని ఏడు అక్షౌహిణుల సైన్యంలో ఒకదానికి నాయకత్వం వహించి యుద్ధంలో పాల్గొన్నాడు. మొదటిరోజు యుద్ధంలో దుశ్శాసనుడితో తలపడి ఓడించినప్పటికీ అన్న భీమసేనుని ప్రతిజ్ఞ వల్ల చంపకుండా వదిలేసాడు. 11వ రోజు యుద్ధంలో తన మేనమామ శల్యుడి రథాన్ని నాశనం చేసి 14వ రోజున యుద్ధంలో ఓడించాడు.15వ రోజు దుర్యోధనుడితోనూ, 16వ రోజున కర్ణునితోనూ యుద్ధం చేశాడు. 17వ రోజున శకుని కుమారుడు వృకాసురుని, 18వ రోజున కర్ణుని కుమారులైన సుసేనుడు, చిత్రసేనుడు, సత్యసేనులను సంహరించాడు. యుద్ధానంతరం ధర్మరాజు ఉత్తర మధ్రదేశానికి నకులుడిని రాజుగా నియమించాడు. కృష్ణుని అవతారం పరిసమాప్తి కావడంతో, సోదరులతోపాటు రాజ్యాన్ని, సంపదలను పరిత్యజించి హిమాలయాలకు వెళ్లి అక్కడనుండి స్వర్గంవైపు న కులుడు కూడా పయనమయ్యాడు. – సి.ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులుపర్వంచుక్కల అమావాస్య!ఆషాఢ బహుళ అమావాస్యకే ‘చుక్కల అమావాస్య’ అని,‘దీప అమావాస్య’ అనీ పేర్లున్నాయి. ఈ రోజుకున్న విశిష్టతలు, ఆచారాలు... పితృతర్పణాలు: ఈ రోజున పితృలోకంలోని పూర్వీకులు భూలోకానికి వచ్చి, తమకు తర్పణలు ఇచ్చే సంతానాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకం. అందువల్ల ఈ రోజు∙పితృదేవతలకు తర్పణాలు, పిండప్రదానాలు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయని శాస్త్రోక్తి.గృహిణులు, నూత్న వధువులు పిండిదీపాలు వెలిగించి, గౌరమ్మ ను పూజించి ముత్తైదువులకు వాయనాలు ఇస్తారు. దీనివల్ల సుమంగళీత్వం, కుటుంబంలో సుఖశాంతులు ్రపాప్తిస్తాయని విశ్వాసం. ఈ రోజు సాయంత్రం ఇళ్లలో, దేవాలయాలలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం వల్ల వ్యాధులు, ప్రతికూల శక్తులు, తొలగిపోతాయని ప్రతీతి. ఆషాఢ అమావాస్య నాడు పేదలకు అన్నదానం చేయడం విశేష ఫలప్రదం. (12, బుధవారం చుక్కల అమావాస్య) -
అచ్యుతం కేశవం: అదొక చిన్న పల్లెటూరు.. ఆ ఊర్లో వాళ్ళందరూ..
అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి శ్రీకృష్ణుడి గుడి కట్టారు. అదే ఊరికి చెందిన ఆవు పాలను అమ్మే ఓ మహిళ శ్రీకృష్ణుడి భక్తురాలిగా మారింది. తన మంచి చెడ్డలు, కష్ట సుఖాలు కృష్ణుడికి చెప్పుకునేది. తన భర్త కాలమయ్యాక ఆమెకు భక్తి మరింత ఎక్కువయ్యింది.ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. అతడు అప్పుడప్పుడూ ఫోనులో మాట్లాడటం చేస్తుండేవాడు. అక్కడే అమెరికాలో ఉన్న కన్నడ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇండియా కి రావడం తగ్గించాడు. కాగా ఆ ఊరి వాళ్ళు నెలనెలా కంతులవారీగా డబ్బును ΄÷డుపు చేసేవారు. అలా సమకూరిన డబ్బుతో రెండేళ్ళ కొకసారి తీర్థయాత్రలు చేసేవారు.ఆ తీర్థయాత్రల్లో ఓ సారి ఆమెకు ఒక కన్నడ వృద్ధురాలు పరిచయమయ్యింది. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ఆ వృద్ధురాలు ఉడిపి కృష్ణుడి గురించి, స్వామి మహత్యాల గురించి విశేషంగా వర్ణించింది. అక్కడ బాలకృష్ణుడి రూపంలో స్వామి దర్శనమిస్తాడని, ఆయనను నేరుగా కాకుండా నవరంధ్ర కిటికీ ద్వారా దర్శించాలని చెప్పింది.అప్పటినుంచి ఆ పాలమ్మే మహిళకు ఉడిపి కృష్ణుడిని చూడాలని కోరిక మొదలయ్యింది. ఊరి వారు చేసే తీర్థయాద్రల్లో ఎన్నో గుడులూ గోపురాలు చూసింది కానీ ఉడిపి గుడికెళ్ళడం కుదరలేదు. ‘కృష్ణా... కరుణించవా’ అని స్వామిని వేడుకునేది. ‘ఉడిపి కృష్ణుని చూడని కళ్ళు కళ్ళేనా’ అని మదనపడేది. వయసు అరవై దాటింది. స్వామిని చూడకుండానే కాలం గడిచిపోతుందేమోనని భయం పట్టుకుంది. అదే విషయం ఊర్లో వాళ్ళందరికీ చెప్పి బాధపడేది.3హఠాత్తుగా ఒకరోజు రాత్రి కొడుకు ఫోన్ చేసి, తనకు కూతురు పుట్టిందని, ఆరవ నెలలో అన్న్రపాశన అనీ, తన భార్య కుటుంబీకులకు ఉడిపిలో అన్న్రపాశన చేసే సంప్రదాయం ఉంది కాబట్టి తాము ఇండియా వస్తున్నామని, తమతోపాటు నువ్వు కూడా ఉడిపి వస్తే బాగుంటుందని అమ్మను కోరాడు. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఊరంతా చెప్పుకుని పొంగిపోయింది.ఇండియాకి వచ్చిన కొడుకు, కోడలుతో మొదటిసారిగా విమానం ఎక్కింది. అది ఉడిపికి దగ్గరగా ఉండే షిమాగో వరకు వెళ్ళే విమానం. ఆమె తనతోపాటు చిన్న సంచి కూడా తీసుకు వచ్చింది. అందులో హుండీలో వేయడానికి డబ్బు దాచి ఉంది. తను పెంచే ఆవులకు దూడలు పుట్టిన ప్రతిసారీ అమ్మే జున్ను ద్వారా వచ్చిన డబ్బులవి.మనవరాలిని ఆడించుకుంటూ ‘అచ్యుతం కేశవం’ అనే పాట పాడుకుంటూ ఆమె ఉడిపి గుడిలోకి ఆధ్యాత్మికానందంతో అడుగు పెట్టింది.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
దైవకార్యాన్ని అర్థం చేసుకోవాలి
దాసియైన మంధర మాటలు విని, కైకేయి దశరథుడిని కోరిన రెండు వరములతో, శ్రీరాముడికి జరగవలసిన పట్టాభిషేక కార్యక్రమం అకస్మాత్తుగా ఆగిపోయింది. అదేకాక, శ్రీరాముడు పదు నాలుగేళ్ళు వనవాసం చేయవలసిన విషమ పరిస్థితి ఏర్పడింది. శ్రీరాముడికి బహిప్రాణంలా ఉండే లక్ష్మణుడు ఈ హఠాత్పరిణామానికి తట్టుకోలేక దుఃఖంలో మునిగిపోయాడు.‘చేతిలోకి వచ్చి స్వంతమయింది కదా అని భావించిన సంపద అంతలోనే పోవడం, అడవుల పాలవడం– ఇవి దైవనిర్ణయా లుగా జరుగుతాయే తప్ప మనుషుల వశంలో ఉండి జరిగేవి కావు తమ్ముడా!’ అని లక్ష్మణుడిని సమాధానపరిచాడు శ్రీరాముడు. తండ్రి మీద కూడా కోపంతో ఉన్న లక్ష్మణుడితో ఇంకా ఇలా చెప్పాడని ‘గోపీనాథ రామాయణము’ తెలిపింది.మనుషుల జీవితాలలో లాభాలాభములను, సుఖదుఃఖములను, భయక్రోధములను, భవాభవంబులను ఏది కలుగజేస్తుందో అది దైవం అనబడుతుంది. విశ్వామిత్రాది తపోధనులు– జితేంద్రియులు అయ్యుండి కూడా– దైవంచే పీడితులగుచూ శక్తిమంతాలైన వారి నియమాలను విడిచిపెట్టినవారై కామక్రోధాసక్తులగుట తెలిసినదే కదా! ఈ లోకంలో కావలసినదిగా భావించబడే కార్యాన్ని కాకుండాచేసి, ఊహించని కార్యాన్ని, సంకల్పించని పరిణామాన్ని జరిగేటట్లుగా చేయడమే దైవకార్యంగా భావించి మనిషి సమాధానపడాలి. అటువంటి వివేకం కలిగిన బుద్ధితో, క్రోధాది ఇంద్రియ భావములను అదుపులో పెట్టుకుని ఆలోచించినపుడు అకస్మాత్తుగా తప్పిపోయిననా పట్టాభిషేక కార్యం గురించిన శోకం నాలో జనించదు.తే. నాకు జూడ బ్రజాపాలనము కంటెనవ్విపినవాస మధికోదయంబు గానననఘ లక్ష్మీవిపర్యయమందు నీవుమది విషాదంబు విడువుము మమత దక్కి. పట్టాభిషేకం చేయించుకుని ప్రజాపాలనం గురించిన పనులలో పడడం కంటె, అడవికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడపడంలోనే నాకు ఎక్కువ ఆనందం లభిస్తుంది. కాబట్టి రాజ్యా ధికారం అనే లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోయిందనే శోకాన్ని విడిచిపెట్టు. ప్రశాంతంగా ఉండు – అని చెప్పి శ్రీరాముడు లక్ష్మణుడిని శాంతపరిచాడు.– భట్టు వెంకటరావు -
దొంగలున్నారు జాగ్రత్త!
దొంగలు ధనాన్ని దోచుకు వెళ్తారు. ధనమంటే నగదు మాత్రమే కాదు. ధన కనక వస్తు వాహనాల రూపంలో ఉండే విలువైన వస్తువులన్నింటికీ దొంగల వల్ల ప్రమాదమే. కొందరు ధనం లాగేస్తారు. కొందరు వాహనాలను చాకచక్యంగా దొంగిలిస్తారు. కొందరు కొత్త తరం దొంగలు బ్యాంకు ఖాతాల్లో ధనాన్ని చప్పుడు లేకుండా లాగి వేయగల బుద్ధిశాలులు! అయితే జీవితంలో విలువైనవి వస్తు రూపంలో ఉండనివి కూడా చాలా ఉన్నాయి. శీలమూ, సౌందర్యమూ, మేధస్సూ, ధర్మబుద్ధీ, సిగ్గూ, లజ్జా, వినయమూ, సహనమూ, ఆ మాటకొస్తే ప్రాణమూ– ఇవన్నీ రూకలలో వెలగట్టలేని నిధులే. వీటిని తస్కరించటంలో విశేషమైన కౌశల్యం కల దొంగలున్నారు (అంటాడు, మహాభారతంలో విదురుడు).జరా రూపం హరతి హి, ధైర్యం ఆశా. ముసలితనం అనే దొంగ, సౌందర్యం అనే ధనాన్ని, ఎంత జాగ్రత్తగా కాపాడుకొన్నా, తరలించుకు పోగలడు. అలాగే దురాశ అనే దొంగ, మనిషి ధీరత్వాన్నీ, ‘పెద్దమనిషి’తనాన్నీ నొక్కేయగలదు. ఆశలో చిక్కుకొన్నవాడు లేకితనానికీ, చవకబారుతనానికీ దిగజారి, నగుబాటు పాలవటం లోకంలో మామూలే కదా! మృత్యుః ప్రాణాన్ హరతి, ధర్మచర్యాం అసూయా. మృత్యువు, తనకు అనుకూలమైన సమయం వచ్చేదాకా వేచి ఉండి, అందరూ చూస్తుండగానే, ప్రాణాలను హరించుకుపోతుంది. ధర్మాత్ముడి ధర్మ బద్ధత అనే సంపదను, అసూయ అపహరించేస్తుంది. దుర్యోధనుడిని చూడండి.క్రోధః శ్రియం, శీలం అనార్యసేవా. క్రోధం అనే దొంగ మనసులో చొరబడితే, మనిషి వివేకం కోల్పోయి, పంతాలనీ పోట్లాటలనీ, కక్షలనీ కోర్టులనీ, తన సంపదను ఆ దొంగవాడికి సమర్పించుకొంటాడు. అలాగే దుష్టసాంగత్యం అనే చోరుడు, శీలాన్ని దోపిడీ చేసి, నిప్పులాంటి మనిషిని నికృష్టుడిగా మిగులుస్తాడు. కామం అన్న పిశాచి దొంగ, మనిషిలో సిగ్గునూ, లజ్జనూ కాజేసి, ఖాళీ చేస్తాడు. అందరికంటె ప్రమాదకరమైన పెద్ద దొంగ ‘అభిమానం’– అంటే అహంకారం. అది సర్వాన్నీ దోచుకు వెళ్ళగల దోపిడీ దొంగ. సర్వం ఏవ అభిమానః (హరతి), సందేహం లేదు. – ఎం. మారుతి శాస్త్రి -
శుక్రవారం పవిత్రత వెనుక అసలు కారణం ఇదే!
వారం రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా, జీవన విధానంగా చూస్తే శుక్రవారం (జుమా)ప్రాధాన్యత అత్యంత విశిష్టమైనది. సూర్యుడు ఉదయించే రోజుల్లోకెల్లా అత్యుత్తమమైన దినంగా దీనికి గుర్తింపు ఉంది.ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం మానవాళికి, విశ్వానికి సంబంధించిన అనేక చారిత్రక ఘట్టాలు ఈ రోజుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ దినాన్ని ఆరాధనలకు, దైవ కారుణ్యాన్ని పొందడానికి ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తారు.దైవప్రవక్త ప్రబోధించిన హదీసుల ప్రకారం మానవజాతికి మూలపురుషుడైన ఆది మానవుడు (ఆదం సృష్టించబడింది, ఆయనకు అత్యున్నతమైన స్థానం లభించింది ఈ శుక్రవారం రోజే. అంతేకాదు, మానవాళికి సన్మార్గం వైపు దృష్టి సారించడానికి, కయామత్ (ప్రళయ దినం) సంభవించడానికి కూడా ఈ రోజే వేదిక కానుంది. ఈ విశిష్టమైన విషయాలను గుర్తుచేసుకోవడం ద్వారా మానవుడు క్రమశిక్షణతో, సత్కార్యాలు చేస్తూ దైవ కారుణ్యాన్ని పొందాలనేది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.ఈ రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు (సున్నత్లు)శుక్రవారం రోజున శారీరక శుభ్రతతో పాటు మానసిక ప్రశాంతతకుప్రాధాన్యతనిచ్చేలా కొన్ని ఆచారాలు సూచించబడ్డాయి.ఉదయపుప్రార్థనల్లో ప్రత్యేకతశుక్రవారం ఉదయం చేసే ఫజ్ర్ నమాజులో ప్రవక్త ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు.స్నానం (గుస్ల్) పరిమళాలుఈ రోజున ్ర΄ûఢవయస్కులైన ప్రతి ఒక్కరూ శుభ్రంగా స్నానం చేయడం అత్యంత అవసరం. అలాగే మిస్వాక్ (దంతధావనం) ఉపయోగించడం, అందుబాటులో ఉన్న మంచి సుగంధ ద్రవ్యాలను (అత్తర్) ధరించడం ఎంతో శ్రేయస్కరం. ఇది మనస్సుకు ఉల్లాసాన్ని ఇచ్చి, ఆరాధనలో ఏకాగ్రతను పెంచుతుంది.మసీదుకు త్వరగా వెళ్లడంజుమాప్రార్థన కోసం మసీదుకు ముందే చేరుకోవడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. ఎవరు ఎంత త్వరగా మసీదుకు చేరుకుంటే అంత గొప్ప దానధర్మాలు చేసిన ఫలితం లభిస్తుందని కథనాలు తెలుపుతున్నాయి.ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా వినడంఇమామ్ ప్రసంగిస్తున్న సమయంలో అత్యంత నిశ్శబ్దంగా, శ్రద్ధగా వినాలి. ఆ సమయంలో పక్కవారితో మాట్లాడటం, చివరికి ‘అల్లరి చేయకు’ అని అనడం కూడా ఆ క్షణపు ఏకాగ్రతను పాడుచేస్తుందని హెచ్చరించారు.ఆ ప్రత్యేకమైన ఘడియశుక్రవారం రోజున ఒక ప్రత్యేకమైన స్వల్ప సమయం ఉంటుంది. ఆ సమయంలో దైవాన్ని మనస్ఫూర్తిగా ఏ మంచి కోరిక కోరినా అది నెరవేరుతుందని, అల్లాహ్ తన దాసులప్రార్థనలను స్వీకరిస్తాడని ప్రవక్త తెలిపారు.ప్రవక్తపై దరూద్ పంపడంఈ రోజున దైవప్రవక్తపై అధికంగా దరూద్ షరీఫ్ చదవడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయి. భక్తులు పంపే ఈ దరూద్ ఆయనకు చేరవేయబడతాయని ఇస్లామిక్ గ్రంథాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం అనేది కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కాదు... మనలోని ప్రతికూల ఆలోచనలను వదిలి, శారీరకంగా, మానసికంగా దైవానికి దగ్గరయ్యే ఒక పవిత్రమైన సమయం. ప్రశాంతతను, పుణ్యఫలాలను ప్రసాదించే ఈ రోజును ప్రతి ఒక్కరూ సత్కార్యాలతో సద్వినియోగం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక మార్గం.– ముహమ్మద్ ముజాహిద్ -
లింగరూపం కాదు... యోగిగా దర్శనమిచ్చే శివక్షేత్రం ఇది!
సాధారణంగా శైవాలయాలలో పరమశివుడు లింగరూపంలో ఆరాధించబడతాడు. అయితే హేమావతి సిద్ధేశ్వర ఆలయంలో మాత్రం పరమశివుడు అత్యంత అరుదుగా దైవరూపంలో సిద్ధయోగిగా ఆసీనుడై దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి అపూర్వమైన విశిష్టతను కల్పించింది. భారతదేశంలోని అతి కొద్ది శైవాలయాలలో మాత్రమే కనిపించే ఈ రూపం శివుని యోగేశ్వర తత్త్వాన్ని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, భిక్షాటన స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ క్షేత్రం ఎక్కడ ఉందో, ఆ శిల్ప విశేషాలేమిటో తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పూర్వపు అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని హేమావతి గ్రామంలో ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత విశిష్టమైన శైవక్షేత్రాలలో ఒకటి. అద్భుతమైన నోళంబ శిల్పకళతో, ఆధ్యాత్మిక మహిమతో, అరుదైన శివస్వరూపంతో ఈ ఆలయం భారతీయ దేవాలయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.హేమావతి ఆలయ సముదాయం ఒక విశాలమైన చారిత్రక దేవాలయ సముదాయం. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయంతో పాటు దొడ్డేశ్వర ఆలయం మల్లేశ్వర ఆలయం విరూపాక్ష ఆలయం జైన బసదులు నందిమండపాలు వీరగల్లులు నాగశిలలు శాసనాలతోపాటుఅనేక శిల్ప సంపదలు దర్శనమిస్తాయి. ఇక్కడ లభించిన శాసనాలు నోళంబుల రాజకీయచరిత్ర వారి దానధర్మాలు ఆలయ నిర్వహణ సామాజిక జీవన విధానం, ఆ కాలపు సంస్కృతిపై సమాచారాన్ని అందిస్తున్నాయి.ఆలయ నిర్మాణం నోళంబ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. గర్భగుడి అంతరాలయం మహామండపం స్తంభాలు ద్వారబంధాలు మరియు గోపుర భాగాలు అత్యంత సూక్ష్మమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. స్తంభాలపై శివపార్వతి గణపతి కుమారస్వామి నంది భైరవుడు సప్తమాతృకలు యక్ష యక్షిణులు గంధర్వులు అప్సరసలు నర్తకులు సంగీత విద్వాంసులు పురాణ ఘట్టాలు పుష్పలతలు మకరాలు గజసింహాలు యాళులు, ఇతర అలంకార రూపాలు అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు నోళంబ కళాకారుల సృజనాత్మకతకు నిదర్శనాలుగా నిలిచాయి.గర్భగుడిలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తులో పశ్చిమాభిముఖంగా ఆసీనుడై దర్శనమిస్తుంది. చతుర్భుజుడైన స్వామివారి ఒక చేతిలో అభయముద్ర, మరొక చేతిలో త్రిశూలం ఇంకొక చేతిలో డమరుకం మరొక చేతిలో భిక్షాపాత్ర ఉన్నాయి. తలపై జటాజూటం, నుదుటిపై తృతీయ నేత్రం మెడలో పుర్రెల మాల చెవులలో కుండలాలు, యోగాసన భంగిమ శిల్పుల అసాధారణ ప్రతిభను ప్రతిఫలింపజేస్తాయి. ఈ విగ్రహం శివుని యోగేశ్వర స్వరూపాన్ని సిద్ధి వైరాగ్యం జ్ఞానం, లోకక్షేమ భావనలను ఏకకాలంలో ప్రతిబింబించే అపూర్వ కళాఖండంగా నిలిచింది. హేమావతి ఆలయం భారత పురావస్తు సర్వే శాఖ పరిరక్షణలో ఉన్న జాతీయ ప్రాముఖ్యత గల స్మారక కట్టడంగా గుర్తింపు ΄÷ందింది. ఆలయ ప్రాంగణంలో లభించిన శిల్పాలు శాసనాలు, నంది విగ్రహాలు శిలాఖండాలు, పురాతన అవశేషాలు సంరక్షించబడి చరిత్ర పరిశోధకులకు పురావస్తు శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు విలువైన ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి.ఈ క్షేత్రంలో మహాశివరాత్రి, కార్తీకమాస ఉత్సవాలు, ఇతర శైవ పర్వదినాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యోగసాధనం, ధ్యానం, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను అందిస్తుంది.హేమావతి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు. ఇది నోళంబుల రాజకీయ వైభవానికి భారతీయ శిల్పకళా సంపదకు శైవ తత్త్వానికి, దక్షిణ భారత చారిత్రక వారసత్వానికి చిరస్థాయి చిహ్నం. లింగరూపానికి భిన్నంగా మానవ రూపంలో సిద్ధయోగిగా పరమశివుడు కొలువై, భారతదేశంలోని విశిష్ట శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శాశ్వత కీర్తిని ΄÷ందిన ఈ అరుదైన క్షేత్రాన్ని సందర్శించి తీరవలసిందే!– జి.బి. విశ్వనాథ, ఎం.ఎ. హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ -
క్రీస్తు ఏలుబడి.. రక్షణకు మార్గం ఇదే!
సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము చాటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి’ – (యెషయా 52:7)సమాధానపరుస్తూ ఇద్దరి మధ్య శాంతి సమాధానాలకు ఏకీభావానికి కృషి చేసేవారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఉగ్రత భరించుట కష్టమని ఇక తప్పక దేవునితో సమాధానపడమని విధేయంగా లోబడమని చెప్పుటను మించిన సువర్తమాన హెచ్చరికతో కూడిన బోధ వాక్యం మరొకటి ఏముంది? ఇలా రక్షణ సమాచారం అధికారికంగా అందుబాటులో ఉంచడం మేలైన విషయం. సకల యుగాలలో రాజైన అద్వితీయ సత్యదేవుడు ఇప్పుడైతే ఎలా ఏలుచున్నాడో అన్నది ఒక్కింత పరీశీలనగా చూస్తే, దేవుడు క్రీస్తు ద్వారా ఏలుచున్నాడు అన్నది అర్థమవుతూ ఉంది.యెహోవా ఇల్లుగా యెహోవా నామ ఘనత కొరకు సొలొమోను కంటె గొప్పవాడైన క్రీస్తు ఎంతో కష్టపడి ఇష్టంగా తన విలువైన రక్తం వెచ్చించి కట్టిన ఆత్మ సంబంధ మందిరమే క్రీస్తు సంఘం. దేవ దేవుని సంకల్పాన్ని గౌరవిస్తూ దేవుని సంకల్పమైన సంఘాన్ని గుర్తించి గౌరవించుట ద్వారా మనలను మనం గౌరవించుకున్నట్టే. ప్రభువైన క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉండి పాలించుటే దేవుని పాలన. ‘సీయోను – నీ దేవుడు ఏలుచున్నాడు’ అనుటలోని అర్థం పరమార్థం ఇదే. ఇప్పుడు సీయోను అనగా క్రీస్తు ప్రభువు వారి ప్రియమైన సంఘం అనగా అద్వితీయ సత్య దేవుని నివాస కేంద్రం. దేవుడు ఏలుబడి లేని చోటు అనేది ఆత్మ సంబంధమైన అనేకనేక కష్ట నష్టాలకు నెలవు కాబట్టే. . . దేవుని దగ్గరకొచ్చి దేవుని ఏలుబడికి తలవంచి ఒదిగి జీవించడం హెచ్చయిన ఘనమైన ఆశీర్వాదాలకు కారణమనేది ఆధ్యాత్మిక పండితుల అనుభవం సారం. గ్రంథ రాజపు విలువైన బోధలకు తలవంచుట మినహా మరో మార్గం లేదు.క్రీస్తు సంఘమా, సర్వ జనాంగమా నిన్ను దేవుని పక్షాన క్రీస్తు ఏలుచున్నాడు అంటూ చెప్పువాని పాదములు సుందరమైనవి. పర్వతముల మీద స్థిర నివాసం, రాజస నడక అత్యున్నత స్థితిని, హోదాను చాటుతుంది. రాజులు, రాజ వంశీయులు, సాహసికులు ఎత్తయిన పర్వతముల మీదనే నివసిస్తూ నడుస్తారు. క్రీస్తు సువార్తను ప్రకటించుటను మించిన సాహసకార్యం మరొకటి లేదు. రాజులమైన భక్తులమైన మేము కాదు, నీ దేవుడు నిన్ను ఏలుచున్నాడు అన్న సాహసోపేత సువార్త ప్రకటనతోనే వారి పాదములు ఎంతో సుందరములయ్యాయి.ఆత్మ సంబంధంగా చూస్తే యేసు సజీవుడగుసర్వోన్నతుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అను బండ మీద అనగా ఇట్టి విశ్వాసం మీద సంఘం కట్టబడింది. దీన్ని మించిన ఎత్తయిన స్థావరం మరొకటి లేదు. ఈ ఎత్తయిన ఘనమైన చోట నుండి సంఘం అనగా రాజులైన యాజక సమూహం సువార్త ప్రకటిస్తుంటే ఇహ లోక పాప సంబంధమైన మలిన మట్టి వారి పాదాలకు తాకక అంటక ఉన్నందున వారి పాదములు సుందరములు. ఎందుకంటే వారు ఎత్తయిన పర్వతం మీద బండ మీద వేసిన పునాది మీద అనగా యేసు అసాధారణ బోధల మీద వారు వారి జీవితాలను కట్టుకొని హుందాగా ఠీవిగా రాజసంతో నిలబడి ఉన్నారు. సంఘమా నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పగల సంసిద్ధులు, సాహసికులు ఎవరై ఉంటారు? దేవుని ఏలుబడికి ఎప్పుడూ విధేయులై ఉన్నవారే ఇలా చెప్పగలుగుతారు.– జేతమ్ -
నాయకుడు ఎలా ఉండాలంటే..?
రామాయణంలో వాల్మీకి రాజు ఏమి చెయ్యాలో చెప్పాడు.‘ప్రజాసుఖే సుఖం రాజ్ఞా ప్రజానాం చ హితే హితనాత్మప్రియం హితం రాజ్ఞాప్రజానం తు ప్రియం’... ఎంతో చక్కటి భావన.. రాజు తనకిష్టమైనది కాదు ప్రజలకిష్టమైనది చెయ్యాలి. మహాభారతంలో భీష్ముడు చెప్పిన పది ముఖ్య లక్షణాలు నేటి ఆధునిక పాఠ్య పుస్తకాలలో ప్రధానాంశాలుగా చోటు చేసుకున్నాయంటే అతిశయోక్తి లేదు.నాయకుడు/రాజు ఎలా ఉండాలి అనే విషయంలో మన నీతి కవులు చెప్పిన ముఖ్యమైన పద్యాలు ఇవే:రాజు, నాయకుడి బాధ్యతను, స్థానబలాన్ని నొక్కి చెప్పాడు వేమన.చేకొనుచును తనకు జేరి సాగినంతలోజెడిన ప్రజల రక్షసేయకున్నతనదుసాగుటేమి తనతనువదియేమివిశ్వదాభిరామ వినుర వేమభావం: తనను నమ్మి ఆశ్రయించిన ప్రజలను, చెడిపోయిన సమయంలో రక్షించని నాయకుడి అధికారం, జీవితం వ్యర్థం. ప్రజా రక్షణే నిజమైన నాయకత్వం.మరొకటి – శత్రువు పట్ల కూడా ఔదార్యం ఉండాలి..చంపదగిన యట్టి శత్రువు తన చేతజిక్కెనేని కీడు సేయ రాదుపొసగ మేలు జేసి పొమ్మనుటే చాలు!విశ్వదాభిరామ వినర వేమభావం: నాయకుడు క్షమాగుణం కలిగి ఉండాలి. చేతిలో చిక్కిన శత్రువును కూడా క్షమించి మేలు చేసి పంపాలి.దీనికి ఒక మంచి ఉదాహరణ.. పురుషోత్తముడనే రాజు యుద్ధం లో అలెగ్జాండర్‌ను క్షమించి వదిలి వేయుట.బద్దెన రాజు/నాయకుడి ధర్మం, ప్రజాపాలన గురించి చాలా స్పష్టంగా చెప్పాడు.రాజు హద్దు దాటితే:నరపతులు మేఱ దప్పిన,దిరమొప్పగ విధవ యింట దీర్పరి యైనన్,గరణము వైదికుడైనను,మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!భావం: రాజు ధర్మం తప్పి ప్రవర్తిస్తే, విధవ ఇంట పెత్తనం చేసినా, వైదికుడు కరణం చేసినా – అవి ప్రాణాంతకం అవుతాయి తప్ప మంచిది కాదు. నాయకుడు ధర్మం తప్పకూడదు.మంచి రాజు లక్షణం ఏమిటంటేదగ్గర కొండెము సెప్పెడు పెగ్గడ పలుకులకు రాజు ప్రియుడైమరిత నెగ్గు ప్రజ కాచరించు బగ్గులకై కల్పతరువు బోదచుట సుమతీకొండెగాళ్ల మాటలు విని ప్రజలకు అన్యాయం చేసే రాజు, బొగ్గుల కోసం కల్పతరువును నరికినంత తెలివితక్కువవాడు. నాయకుడు నిజానిజాలు పరిశీలించాలి.మాటకు బ్రాణము సత్యముకోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్బోటికి బ్రాణము మానముచీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీఒక రాజ్యం/కోటకు బలమైన సైన్యమే ప్రాణం. నాయకుడు రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.ఇక భర్తృహరి ఏమి చెప్పాడంటే... శ్లోకం: విపది ధైర్యమథాభ్యుదయే క్షమాసదసి వాక్పటుతా యుధి విక్రమః ’యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌప్రకృతిసిద్ధమిదం హి మహాత్మానామ్’భావం: ‘కష్టాల్లో ధైర్యంగా ఉండటం, విజయ సమయంలో క్షమ కలిగి ఉండటం, సభలో వాక్పటిమ, యుద్ధంలో పరాక్రమం, కీర్తిపై ఆసక్తి, శాస్త్రశ్రవణంలో వ్యసనం – ఇవన్నీ మహనీయులైన నాయకుల సహజ గుణాలు.మరొక ముఖ్యమైన భావం‘ప్రజలను పశువుల వత్సంలా ప్రేమగా పోషిస్తే, భూమి కల్పలతలా అనేక ఫలితాలను ఇస్తుంది‘. ఇది కేవలం రాజులకే కాదు, నాయకత్వం వహించే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.భాస్కర శతకంలో నేరుగా ‘నాయకుడు అనే పద్యం ప్రసిద్ధంగా లభించలేదు. కానీ భాస్కరుడు కూడా నీతి, ధర్మం, వినయం గురించి చెప్పాడు.నాయకుడు అహంకారం లేకుండా, విద్యావంతుడై, దానగుణం కలిగి, ప్రజాహితం కోసం పనిచేయాలి. ‘అధికారం వచ్చినా వినయంగా ఉండాలి‘ అనేది భాస్కరుడి ప్రధాన సందేశం.దేశానికి రాజు కాని, సంస్థకి అధిపతి కాని ఎన్నో సమస్యలను ఎదుర్కొని అడుగు వెయ్యాలి... బాహ్య పరిస్థితి.. లోలోపల పరిస్థితి... అన్నింటిని మించి అనిశ్చిత వాతవరణంలో దేశ భద్రత, ప్రజల సంక్షేమం, బాగోగులు, ఆర్థికంగా నిలబడ్డం... ఇలా ఎన్నో సవాళ్ళు.. ప్రజాఅభిమానాన్ని చూరగోనె ప్రయత్నం.. సత్సంబంధాలు తో బాటు సజావుగా సాఫీగా ఉండాలి పరిపాలన... ఎన్నో మంచి అలవాట్లతో నీతిగా అందించాలి పరిపాలన. అందుకు మంచి నాయకుడు కావాలి. ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలతో నడుం కట్టి అడుగు ముందుకెయ్యాలి.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
మోక్షాన్ని ప్రసాదించే ముక్తినాథ్
భారతీయ సంస్కృతిలో తీర్థయాత్ర కేవలం ఒక పర్యటన కాదు. అది మనస్సును, ఆత్మను పరమాత్మతో అనుసంధానించే పవిత్రసాధన. యాత్రలకి వెళ్ళేముందు, ఆయా క్షేత్రాల వెనుకనున్న పురాణగాథల్ని తెలుసుకుని వెళితే, ఆ ప్రదేశాలలోని పవిత్ర స్థలాల ఉనికి,ప్రాముఖ్యతను ప్రత్యక్షంగా చూడటం చేత, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సనాతన ధర్మ పురాణ, ఇతిహాసాల పట్ల దృఢ విశ్వాసం ఏర్పడుతుంది. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించటం అదృష్టం. అటువంటి క్షేత్రాలలో నేపాల్‌లోని ముక్తి క్షేత్రం (ముక్తినాథ్) వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య క్షేత్రాలలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలో రాణీ΄ûవా గ్రామంలో సముద్రమట్టానికి సుమారు 3,710 మీటర్ల ఎత్తులో (12,470 అడుగులు) హిమాలయాల్లోని అన్నపూర్ణ పర్వత శ్రేణుల మధ్య ఈ ఆలయం ఉన్నది. అష్టాదశ పురాణాల్లో ఒకటైన స్కాంద పురాణంలోని హిమవత్ఖండంలో, ముక్తిక్షేత్రం వెనుక ఉన్న వృత్తాంతం అత్యంత రమణీయంగా చెప్పబడింది.పూర్వం రాక్షసరాజు జలంధరుడు బ్రహ్మ మొదలైన వారినుంచి, తపఃఫలంగా వరాలు పొంది, ఆ అహంకారంతో ముల్లోకాలను పీడించాడు. దేవతలు మొరపెట్టుకున్నా అతనినేమీ చేయలేకపోయారు. కారణం, అతని భార్యయైన బృంద (తులసి) నిరుపమానమైన పాతివ్రత్య శక్తి, అతనికి చావు లేకుండా చేసింది. ఆమె పరమ ధార్మికురాలు. లోకకల్యాణం కోసం, పరమశివుడు, జలంధరుడిని వధించేందుకు వీలుగా, శ్రీమహావిష్ణువు జలంధరుడి వేషంలో బృంద వద్దకు వెళ్ళి, ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు. జలంధరుడి మరణ వార్త విన్న బృంద, తీవ్రమనస్తాపంతో, శ్రీమహావిష్ణువును భూమిపై పాషాణ రూపాన్ని పొందాలని శపిస్తుంది.బృంద ఇచ్చిన శాపాన్ని భగవంతుడు శిరసావహించాడు (శాప ప్రభావం వలన విష్ణువు నేపాల్‌లోని కాళీగండకీ నదీ తీరంలో నల్లని సాలగ్రామ శిలలుగా అవతరించాడు. పెద్ద పెద్ద సాలగ్రామ శిలలు నదీ తీరం వెంబడి ఇప్పటికీ విష్ణుస్వరూపంలో దర్శనమిస్తాయి.రాతి రూపం నుండి, శాప విముక్తి కోసం విష్ణుమూర్తి ఈ ప్రదేశంలో వేలాది సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు ముగిశాక స్వామికి ముక్తి లభించింది. భగవంతుడికే ముక్తిని ప్రసాదించిన క్షేత్రం కాబట్టి ఈ పవిత్ర ప్రదేశానికి ముక్తిక్షేత్రం అనే పేరు వచ్చింది.చతుర్ముఖ (బ్రహ్మ) బృందాదేవికి మోక్షాన్ని ప్రసాదించి, భూమిపై తులసి రూపంలో సేవింపబడుతూ, గండకీ నది ప్రవహిస్తుందని వరమిచ్చాడు. అంతేగాక, శ్రీమహావిష్ణువు గండకీ నదిలో లభించే సాలగ్రామ శిలల రూపంలో యుగయుగాలపాటు, భక్తులకు దర్శనమిస్తాడని ప్రకటించారు.ఇక్కడ లభించే సాలగ్రామ శిలలకు మరలప్రాణ ప్రతిష్ఠ అవసరం లేకుండానే పూజించవచ్చని చెబుతారు. సాలగ్రామ ఆరాధన ఇంటికి ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రసాదిస్తుందని విశ్వాసం. ఇక ముక్తినాథ్ ఆలయం చిన్నదైనా,ప్రాంగణం చాలా పెద్దది. ఆలయం ముందు పాపకుండం, పుణ్యకుండం అని రెండు కొలనులుంటాయి.ఈ కుండాల్లోని అతిశీతలమైన జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, దేవాలయం వెనుక వలయాకారంలో ఉన్న 108 గోముఖ జలధారల్లో స్నానమాచరించి, శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామి దర్శనం చేసుకుంటారు. గోముఖాల నుండి వచ్చే హిమాలయ తీర్థం సర్వపాపాల్ని హరిస్తుందని పురాణ కథనం.సనాతన ధర్మానికి చెందిన భక్తులు, ముక్తినాథుని మోక్షప్రదమైన దివ్యక్షేత్రంగా భావిస్తే, బౌద్ధులు దీనిని ‘చుమిగ్ గ్యాత్సా’ (వంద జలధారల స్థలం) గా భావించి అత్యంత పవిత్రమైన తీర్థంగా పూజిస్తారు. ఆవిధంగా ఈ క్షేత్రం, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆలయ సేవా కార్యక్రమాలలో హిందూ అర్చకులతోపాటు, బౌద్ధ సన్యాసినులు సన్యాసులు కూడా పాల్గొనటం విశేషం. భిన్నమైన ఆరాధన పద్ధతులున్నప్పటికీ, ఒకే మూర్తిని, పవిత్రస్థలాన్ని పరస్పర గౌరవ విశ్వాసాలతో ఆరాధించటం ముక్తినాథ్ ప్రత్యేకత.ముక్తినాథ్ ఎలా చేరుకోవాలి?గోరఖ్‌పూర్ నుంచి సునోలి సరిహద్దు దాటి నేపాల్‌లోకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. సునోలి నుండి పోఖ్రా మీదుగా సుమారుగా 300 కి.మీ. రోడ్డుమార్గంలో ప్రయాణించి ‘జోమ్సోమ్’ చేరి, అక్కడి నుండి సుమారుగా 38 కి.మీ. దూరం వెళ్ళి, అక్కడినుంచి మెట్ల మార్గంలో (300 మెట్లు) కానీ, గుర్రాలు, డోలీలలో కానీ ప్రయాణించి ముక్తినాథ్ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ పర్వతప్రాంతం అధిక ఎత్తులో ఉండటంతో, ఆక్సిజన్ తక్కువగా వుంటుంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి.ఈ క్షేత్రానికి సులువుగా, త్వరగా చేరాలనుకుంటే, ఢిల్లీ నుండి ఖాట్మండుకి విమానంలో వెళ్ళి, అక్కడి నుండి జోమ్సోమ్కి విమానంలో చేరుకోవచ్చు.ముక్తినాథ్ క్షేత్రానికి అతిదగ్గరలో ‘జ్వాలామాయి’ ఆలయం శక్తీక్షేత్రం వుంది. బ్రహ్మదేవుడు ముక్తిక్షేత్రంలో ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం నుండి విష్ణుమూర్తి జలరూపంలో 108 ముక్తి ధారలుగానూ, శివుడు అగ్ని రూపంలో, నిరంతరం వెలిగే జ్వాలగా, ఉండిపోయారు. అందుకే జ్వాలామయి ఆలయంలో నీటి బుగ్గపై అగ్నిజ్వాల వెలగడం మనకు కనిపిస్తుంది. ముక్తినాథ్ ఆలయప్రాంగణం, భక్తిని, ప్రకృతిని, పవిత్రతను ఒకేకాలంలో ఆస్వాదించే అపూర్వ క్షేత్రం. ఒకవైపు నీలగిరి, మరొకవైపు ధవళగిరి పర్వతాలు మంచుతో కప్పబడి ఆహ్లాదాన్ని అందిస్తాయి.– దావూలూరి రామకృష్ణ శర్మ, ఆధ్యాత్మిక పర్యాటకులు -
జ్ఞానం పంచితేనే పెరిగే సంపద
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహైతేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిఃతైత్తిరీయోపనిషత్తులోని శాంతి మంత్రం ఇది. పూర్వం విద్యాభ్యాసానికి ముందు ప్రతి దినం గురు శిష్యులు ముక్తకంఠంతో ఈ శ్లోకాన్ని పఠించేవారు. ‘మనం కలిసి మెలిసి ఉందాము. కలిసి మెలిసి ఫలితాలను అనుభవిద్దాము. కలిసి పనులను చేస్తూ తేజో పూర్ణుల మవుదాము. మనలో మనకు వైషమ్యాలు ఉండకుండు గాక. శాంతితో విలసిల్లుదాము’ అని చేసే ఉత్తమ ప్రార్థన ఇది.ఈ ప్రార్థన గురుశిష్యు లిరువురి మనస్సులో నిక్షిప్తమై ఉండేది. ఇరువురు కలిసి విజ్ఞాన కృషి సలపాలి. కలిసి విజ్ఞాన ఫలం పొందాలి. గురు శిష్యుల మధ్య విబేధాలు లేకుండా శాంతియుతంగా విజ్ఞానార్జన చేయాలి అనే సమభావన; గురువును శిష్యుడు, శిష్యుని గురువు పరస్పరం గౌరవించుకునే ఉన్నత భావన ప్రాచీన విద్యావిధానంలో కనిపిస్తుంది. అప్పుడు విద్య అంటే గురు శిష్యు లిద్దరు కలిసి చేసే నిత్య సత్య శోధనా యత్నం.విద్య నిరంతర ప్రవాహం. పరంపరా గతంగా విస్తరించేది. గురువు నుండి శిష్యుడు నేర్చుకున్న విద్య, సంస్కారం తర్వాత మళ్ళీ తన శిష్యులకు అందజేస్తాడు. ఆ శిష్యుల నుండి తరవాతి వారికి అలా అందుతూనే ఉంటుంది. ఇది నిరంతర జ్ఞానగంగా ప్రవాహం. ఇచ్చే కొద్దీ పెరిగే సంపద జ్ఞాన సంపద. ఆనాడు గురు శిష్య సంబంధాలు ఎంత ఆదర్శంగా ఉండేవో, జ్ఞానార్జన ఎలా సాగేదో ఈ శ్లోకం చెబుతోంది.– డా. చెంగల్వ రామలక్ష్మి -
సీతగా అలరించనున్న సాయిపల్లవి జపమాల ఎందుకు ధరిస్తుందంటే..!
తమిళ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో సాయిపల్లవి ఒకరు. ఆమె ప్రముఖ బాలీవుడ్ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణం' చిత్రంలో సీతాదేవి పాత్రను పోషించనున్నారు. తెరపైనే కాకుండా, నిజ జీవితంలో కూడా ఆమె తన నిరాడంబరమైన వ్యక్తిత్వం, సంప్రదాయబద్ధమైన జీవనశైలితో అశేష అభిమానులను సొంత చేసుకుందామె. అయితే ఆమె కనిపించినప్పుడు అందర్నీ ఆకర్షించే వస్తువు 'జప మాల'. సాధారణంగా దీన్ని ఆమె కుడి చేతికి చుట్టుకుని కనిపిస్తుంటారామె. ఇది ఆమెకు అధ్యాత్మికత పట్ల ఉన్న భక్తి విశ్వాసాన్ని, ఆసక్తిని సూచిస్తోంది. ఆఖరికి ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 'రామాయణం: ప్రథమ సంకల్ప' కార్యక్రమంలో కూడా, కాంచీవరం చీర, బంగారు ఆభరణాల తోపాటు ఎడమచేతికి జపమాల ధరించి కనిపించారు. ఈ నేపథ్యంలో జపమాల ప్రాముఖ్యత, ఎందుకు ధరిస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఎందుకు ధరిస్తారంటే..ఈ ముద్దుగుమ్మ సాయిపల్లవి సాధారణంగా గంధపు చెక్క (చందనం)తో చేసిన జప మాలను ధరిస్తుంటుంది. ఇది కేవలం అలంకరణ మాత్రం కాదట, మనిషిని నిలకడగా, సదా స్పృహతో, దైవంతో అనుసంధానమయ్యేలా చేస్తుందట. జప మాలలో ఉండే 108 పూసలు యాదృచ్ఛికం కాదని, ఆ సంఖ్యకు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. సనాతన ధర్మంలో 108 సంఖ్య అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది సృష్టి సంపూర్ణతను, ఆధ్యాత్మిక పరిపూర్ణతను సూచిస్తుంది. సాంప్రదాయం ప్రకారం, ఒక మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఏకాగ్రత, భక్తి, అంతర్గత పరివర్తన కలుగుతాయి. అలాగే 108 సంఖ్యను 108 ఉపనిషత్తులు, దేవతల 108 నామాలు, జీవాత్మకు, పరమాత్మకు మధ్య ఉండే అనుసంధానంతో ముడిపెట్టి చూస్తారు ఆధ్యాత్మికవేత్తలు. చాలా మంది జపం చేసేటప్పుడు చేతిలో మాలను తిప్పుతూ ఉంటారు. ధరించడానికి వివిధ రకాల జపమాలలు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అత్యంత సాధారణమైన జపమాల రకాలలో తులసి, రుద్రాక్ష, గంధపు చెక్క, స్ఫటికం (క్రిస్టల్) మాలలు ఉంటాయి. ఇవేగాక తామర గింజలు, పసుపు లేక ఎరుపు గంధపు పూసలతో కూడా మాలలను తయారు చేస్తారు. అయితే ప్రతి ఒక్క మాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందట. అందరూ అన్నింటిని ధరించడం సాధ్యం కాదని అంటున్నారు. ఇక్కడ మాల అనేది కేవలం అలంకరణ కోసం ఎంచుకునే వస్తువు కాదట. ఇది ఒక దైవం, మంత్రం లేదా నిర్దిష్ట సాధనతో ముడిపడి ఉంటుందని చెబుతున్నారు. ఏవేవి ఎందుకోసం అంటే..శివ మంత్ర సాధన చేస్తుంటే, సాధారణంగా రుద్రాక్షకు ప్రాధాన్యత ఇస్తారు. విష్ణు లేదా కృష్ణ భక్తికి తులసి మాల ఎక్కువగా వాడతారు. ప్రశాంతత, స్పష్టత కోసం స్పటికమాలను ఉపయోగిస్తారట. కొన్ని మాలలు సంప్రదాయబద్ధంగా నిర్దిష్ట దేవుళ్లకు లేదా గ్రహాలకు అనుగుణంగా ఉంటాయి. అలాగే చాలామంది రుద్రక్షను ఎంచుకుంటారు. దీన్ని రక్షణ, స్థిరత్వం, క్రమశిక్షణతో కూడిన అంతర్గత జీవితాన్ని కోరుకునే వారు ఎంచుకుంటారని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు. ఎవరు ధరించవచ్చంటే..రత్నాల వలె, మాలను ఎల్లప్పుడూ ధరించరని అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. కొందరు కేవలం జపం చేసేటప్పుడు మాత్రమే ధరిస్తే, మరికొందరు అప్పుడప్పుడు ధరిస్తారు. ఉదాహరణకు, సాయి పల్లవి సినిమా సెట్లలో తప్ప, మిగతా సమయాల్లో జపమాలతోనే కనిపిస్తుంటారామె. మరికొందరు నిద్రపోయేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, మలవిసర్జన సమయాల్లోనూ తీసివేసి..మిగతా సమయంలో ధరిస్తుంటారు. నిరంతరం జపమాలను ధరించడం అనేది స్మరణ చుట్టూ అల్లుకున్న జీవనశైలికి అంకితం. అలాగే ఆధ్యాత్మిక చైతన్యం తమకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారని అర్థం. చివరగా ఇది ఫ్యాషన్ కోసం కాదని, భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉన్న సాంప్రదాయక అంశంగా పేర్కొన్నారు ఆధ్యాత్మిక నిపుణులు.(చదవండి: ఉద్యోగం కోల్పోవడం, మూడుసార్లు వ్యాపారంలో నష్టం..చివరికి ఏకంగా రూ. 100 కోట్లు..) -
అలంకారం శరీరానికా? వ్యక్తిత్వానికా?
అలంకారాలు అంటే కళ్ళు జిగేలుమనిపించేలా కనిపించడం కాదండోయ్ ఇక్కడ.. అలాగే తళుక్కుమనే ఆభరణాలు బంగారం, వెండి గూర్చి కూడా కాదు... మనిషికి సహజంగా ఉండవలిసిన నిజమైన అలంకారం ఆభరణాలు గూర్చి శతకాల్లో చెప్పిన బంగారు మాటలు నెమరువేసుకుందాం.ఈ మాటలవిలువ ఏ మూటలతో లెక్క కట్టలేం...భర్తృహరి రాసిన సంస్కృత శతకానికి ఎంతో దగ్గరగా స్వేచ్ఛానువాదం చేసిన ఏనుగు లక్ష్మణకవి ఒక పద్యంలో...‘అమరుజెవి శాస్త్రమున గుండలముగాదువలయమున నొప్ప, దీవి చే వెలయుబాణియురుదయాడ్యుల మేను పరోపకారకలన రాణించు గంధంబు వలనకాదు’.కుండలాలు, బంగారు కడియాలు, గంధం – ఇవన్నీ అలంకారాలు కావుట. ధర్మశాస్త్ర శ్రవణమే చెవులకు అలంకారం. నిరంతరం దానం చేసిన చేసిన చేతులకు మిలమిల మెరిసే కడియాలు ఆభరణం కాదు. దయాగుణం కలవారికి సుగంధద్రవ్యాలు /గంధపు పూత అలంకారం కాదు.ఇంకా లోతులోకి వెళ్తే సత్పురుషులకు వారి గుణాలే అలంకారాలు. బాహ్యంగా తళుకులు, మెరుపులు అక్కర్లేదు..ఇదే కవి మరో పద్యంలో‘కరమున నిత్యదానం, ముఖంబన సూనత వాణి, ఔదలంగురుచరణాభివాదన, ముకుంఠిత వీర్యం దోర్యుగంబునన్వరహదయంబునన్ విశదవర్తన, మంచిత వీనులన్సురుచిరభూషణంబు లివి శూరులకు సిరి లేనియప్పుడున్’....ఐశ్వర్యం లేనప్పుడు మహాత్ములకు సహజ అలంకారాలు ఏమి ఉండాలో చెప్తూన్నాడు, ఏనుగు లక్ష్మణ కవి. అవి ఏమిటంటేదానం, సత్యాన్ని పలకడం, గురువు గారికి నమస్కరించే గుణం, ఎదురు లేని పరాక్రమం, మంచి ప్రవర్తన శాస్త్ర శ్రవణం... ఇవన్నీ... కంకణాలు, కిరీటం, కుండాలాలు బయట తాత్కాలిక సౌందర్యన్నే కలిగిస్తాయ్. స్థిరమైన శాశ్వతమైన అంతరమైన సౌందర్యం కలగాలంటే సద్గుణాలుండాలి.‘నిజమైన ఆభరణాలు, అలంకారాలు’ గురించి శతక కవులు బంగారాన్ని కాదు, గుణాలనే ఆభరణాలు అని అన్నారు.వేమన గారు బాహ్య అలంకారాలను ఖండించి, అంతరంగ శుద్ధినే అసలైన అలంకారం అన్నారు.పసిడి కుండలములు చెవులకుపసిడి హారములు మెడకు భాసిల్లును గానిమంచి మాటలు లేకున్నపశువుతో సమానమగును పార్థివా వేమాఅర్థం: చెవులకు బంగారు కమ్మలు, మెడకు హారాలు ఉన్నా, నోట మంచి మాటలు లేకుంటే పశువుతో సమానం.మరో పద్యం చూడండిఅంగడి సరుకుల వలెనాఅలంకారములెల్ల కొనగ అందుబాటగునాసంగతి తెలిసిన వానికేసద్గుణమే అలంకారము సర్వజ్ఞా వేమాఅర్థం: అంగడిలో దొరికేవి ఆభరణాలు కావు. సద్గుణాలే నిజమైన అలంకారం.బద్దెన కవి విద్య, వినయమే నిజమైన ఆభరణాలు అన్నారు.విద్య భూషణము పురుషునకువిద్యయె కీర్తిని తెచ్చు విశ్వమందునవిద్య లేని మనుజుండుపశువు కంటెను హీనమగును పార్థివా సుమతీఅర్థం: విద్యయే మనిషికి అసలైన ఆభరణం. విద్యే కీర్తిని తెస్తుంది. విద్య లేనివాడు పశువు కంటే హీనుడు.‘సత్యము భూషణము సతికిసత్యము భూషణము నరునకు సర్వజనులకున్సత్యము లేని నరుండుమత్యువుతో సమానమగును మేదిని సుమతీ‘అర్థం: స్త్రీకైనా, పురుషుడికైనా సత్యమే అసలైన ఆభరణం. భాస్కరుడు అదే బాణిలో వెళ్ళాడు భాస్కరుడు శీలము, దానమే ఆభరణాలు అన్నారు.‘దానము శీలము సత్యముమానము విద్యయును నీతి మర్యాదయునుమేనికి భూషణములు సుమ్మీమేలైన గుణములు గలిగెనేని భాస్కరా‘అర్థం: దానం, మంచి నడవడి, సత్యం, గౌరవం, విద్య, నీతి, మర్యాద – ఇవే శరీరానికి నిజమైన ఆభరణాలు.భర్తృహరి గారు కూడా గుణాలనే ఆభరణాలు అన్నారు.రత్నములు కావు భూషణరత్నములు సద్గుణములె సుమ్మీ రత్నములురత్నములు లేకపోయినరాజిల్లును సద్గుణముల రమణీయముగన్’దీనికి అర్థం అక్కర్లేదు.వినయము విద్యకు భూషణవినయము లేని విద్య విషముతో సమము సుమ్మీవినయ విద్యలు గల్గినవనరులెల్ల వచ్చు జగతిన.బాహ్య అందం కోసం సాధన చేసినా ఫలితాలు తాత్కాలికం.. కనుమరుగు అయిపోతాయి... బదులుగా నిజమైన అలంకారాలు, ఆభరణాలు గుణాలు రూపంలో ఉంటే అవి సద్వినియోగం చేస్తే ఫలితాలు శాశ్వతం, లోక ప్రయోజనం, విశ్వ కళ్యాణం అవుతుంది.– డా. కందాళ సత్యనారాయణ మూర్తి నిర్వహణ: డి.వి.ఆర్. -
ప్రార్థనతో బలపడే విశ్వాసం!
‘దేవుని ఇశ్రాయేలు’గా చెప్పబడే క్రీస్తు ప్రభువు సంఘ సభ్యులు అపొస్తలుల బోధకు లోబడి క్రీస్తునందు క్రీస్తును బట్టి దేవునియందు ఆనందించుటలో సిద్ధహస్తులు. యేసు దేవుని కుమారుడు అంటే దేవుని పక్షాన ఏలుబడి చేసే ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్ధం. ఆ రారాజైన క్రీస్తును బట్టే ఆత్మసంబంధ ఇజ్రేలీయులుగా క్రైస్తవులు పిలువబడుతున్నారు. క్రీస్తు సంబంధులు, క్రైౖస్తవులు అనే పదాలకు ఆత్మ సంబంధ ఇజ్రేలీయులు అనేది ఒక గొప్ప పర్యాయపదం. ఆత్మ సంబంధ హృదయ పరిపాలకుడుగా ఉన్న క్రీస్తు ప్రేమను బట్టి ఎలా ఆనందించాలో ఎందుకు ఆనందించాలో చూద్దాం.ఇక సాహసించక తప్పదనేలా దేవుని సంకల్పం బహు బలంగా ఉంది. అంతరాయాలకు, అడ్డుకట్టలకు, అభ్యంతరాలకు ఎలాంటి తావులేదు. ఇజ్రేలీయులకు వాగ్దానం చేసిన మెస్సీయాను ఈ భూమి మీద ప్రవేశపెట్టే వేళలలో దుస్సాహసాలకు పాల్పడుతూ దేవుని సంకల్ప చిత్తానికి ఆయన సత్యానికి అడ్డొచ్చే ప్రతి ఒక్కరూ దేవుని శత్రువులుగా ముద్రవేయించుకొని దేవుని ఉగ్రతకు బలై చరిత్రలో కలిసిపోయారు. తన ప్రేమను క్రీస్తు ద్వారా వెల్లడి చేయుటకు దేవుడు ఎన్నో సాహసకార్యాలకు పూనుకొన్నాడు. అదేవిధంగా మానవాళి అనుభవానికొచ్చి అలరించుటకు క్రీస్తుప్రేమ కూడా అనేకనేక అడ్డు ఆటంకాలకు ఎదురొడ్డి నిలిచింది. ఇప్పుడైతే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపువారెవరును లేరు.- ''క్రీస్తు లేకుంటే దేవునికి సంకల్పమే లేదు. క్రీస్తు కేంద్రంగానే సర్వంలో సర్వమూ చేయబడింది అనుటకు తగిన మూలాధారం ఇదే. మొత్తం దేవుని సంకల్పంలో కేంద్రకం క్రీస్తుబలి. కారణం చూస్తే యేసును నలగగొట్టడం యెహోవా దేవునికి ఇష్టమైంది. క్రీస్తుబలి దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే తన స్వకీయ సంకల్ప ప్రకారంగా ఈ బలిని రూపొందించినది ఆ దేవదేవుడే. అంతకంటె ముఖ్య కారణం, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించడం. మానవాళికి తన సొంత కుమారుని అనుగ్రహించుట ద్వారా ఇలా తన కుమారుని బలియాగం ద్వారా తన ప్రేమను వైవిధ్యంగా చేతలలో ఈ లోకానికి చాటి చెప్పాడు.''క్రీస్తునందు ఆనందిస్తూ ఎర్ర సముద్రం, ఎరికో గోడలు, వంటి ఉపద్రవాలు, శ్రమలు, బాధలకు తలవంచక కేవలం క్రీస్తును బట్టి మాత్రమే ఎదురునిలిస్తే అవి ఏవైనా వినయ వినమ్రతలతో దారి ఇచ్చుకోక తప్పదు. యేసు తన తండ్రియైన దేవదేవుని సంకల్పప్రకారంగా మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం మరణించాల్సి వచ్చింది. ఆయన అత్యంత క్రూరంగా ఘోరంగా సిలువలో బలి అయ్యాడు. నీ చిత్తమే సిద్ధించును గాక అంటూ సాహసించి మరీ మరణానికి ఎదురుగా వెళ్ళాడు.ఇందువలననే యేసు తన తండ్రి సంకల్ప చిత్తానికి విధేయంగా తలవంచాడు. మానవాళిని ప్రేమించి ప్రేమతో సాహసించి తన నిండు యవ్వన్రపాయాన్ని బలిగా పెట్టాడు. ఇట్టి యేసు సాహసోపేత ప్రేమను బట్టి ఆనందించండి అనునదే పరిశుద్ధులైన అపొస్తలుల బోధగా సంఘాలలో ఉపదేశక్రమ సత్యారాధనలలో నిత్యమూ చెప్పబడుతూ ఉంటుంది. వారపు ప్రప్రథమదినమను ఆదివారంనాడు సంఘము ఇలా క్రీస్తు సాహసాలను ప్రకటిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. సాహసించి క్రీస్తు సాహసాలను క్రీస్తు సంఘం ప్రకటిస్తూ ఉంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే యెడతెగక ్రపార్థన చేయాలి. ్రపార్ధన చేయుట ద్వారానే క్రీస్తుద్వారా దేవునితో సత్సంబంధ సహవాస బాంధవ్యాలు బలపడి దృఢపడతాయి. అప్పుడే ప్రతి ఒక్కరూ సాహసోపేత దైవిక ప్రేమను బట్టి ఎంతగానో సంతోషించే వీలుంటుంది.– జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్ -
నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు..
సమాజంలో మనిషి ఒంటరిగా జీవించలేడు. అనుక్షణం పరిచయాలు, సంబంధాలు, స్నేహాలతోనే అతని జీవితం ముడిపడి ఉంటుంది. అయితే, మనం ఎవరితో కలుస్తున్నాం, ఎవరితో కాలాన్ని గడుపుతున్నామనే అంశమే మన ఆలోచనలను, ప్రవర్తనను, అంతిమంగా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఇస్లామిక్ ధర్మం మంచి సాంగత్యాన్ని ఎంచుకోవడానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.పెద్దలు అంటారు ‘‘నువ్వు ఎలాంటివాడవో చెప్పాలంటే, నీ మిత్రులెవరో చూపించు’’ అని. ఇది కేవలం లౌకిక సత్యం మాత్రమే కాదు, దివ్యఖుర్ ఆన్ హదీసుల ఆత్మకూడా ఇదే!అత్తరు తావి కావాలి!చెడు ప్రభావం మనిషిపై ఒక్కసారిగా పడదు. కొవ్వొత్తి వెలుగు మాయమైనట్లు, అది నిశ్శబ్దంగా మనలోని మంచి గుణాలను హరిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు మంచి, చెడు సాంగత్యాల ప్రభావాన్ని ఎంతగానో హృదయానికి హత్తుకునేలా వివరించారు: ‘‘మంచి మిత్రుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారి (అత్తరు అమ్మే వ్యక్తి) లాంటివాడు; అత్తరు వ్యాపారి దగ్గర ఉంటే అతడు నీకు సుగంధాన్ని బహుమతిగా ఇస్తాడు, లేదా నీవు కొనుగోలు చేస్తావు... కనీసం ఆ సువాసననైనా ఆస్వాదిస్తావు.’’ (సహీహ్ అల్–బుఖారీ)చెడు అలవాట్లు, భావాలు ఉన్నవారి మధ్య గడిపితే ఎంతటి గట్టి మనస్కుడైనా ఏదో ఒక రోజు తప్పుదోవ పట్టే ముప్పు ఉంటుంది. అదే నైతిక విలువలు, దైవభీతి ఉన్నవారి సరసన ఉంటే మనలో నిశ్శబ్దంగా నైతిక పరిమళాలు వికసిస్తాయి.సత్యవంతుల సహవాసం‘‘ఓ విశ్వసించిన వారలారా! అల్లాహ్‌కు భయపడండి, సత్యవంతులతో (సజ్జనులతో) ఉండండి.’’ (దివ్య ఖుర్ఆన్ 9:119) మనిషి జీవన శైలి అతని మిత్రుని ప్రభావంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మనిషి తన స్నేహితుడి మార్గంలోనే ఉంటాడు. కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి‘ (అబూ దావూద్) అని హెచ్చరించారు.రేపటి పశ్చాత్తాపం వద్దు!తాత్కాలిక లౌకిక ప్రయోజనాల కోసం లేదా వ్యసనాల కోసం చేసే స్నేహాలు పరలోకంలో తీరని నష్టాన్ని మిగులుస్తాయి. ఆనాటి పశ్చాత్తాపాన్ని దివ్య ఖుర్ ఆన్ ఇలా కళ్లకు కడుతోంది: ‘‘ఆ రోజు పాపాత్ముడు తన చేతులను కొరుక్కుంటూ... ’అయ్యో! నేను ఫలానా వ్యక్తిని నా మిత్రుడిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది!’ అని వా΄ోతాడు.’’ (దివ్యఖుర్ ఆన్ 25:27–28)అందుకే స్నేహంలో కొన్ని కీలకమైన నియమాలు పాటించాలి:1. మితమైన స్నేహం: ఆత్మీయతలో సమతుల్యత ఉండాలి. రహస్యాలను, గతంలో చేసిన ΄÷రపాట్లను ఇతరుల ముందు విప్పకూడదు. తప్పులకు దేవుని సమక్షంలో పశ్చాత్తాపపడాలి (తౌబా చేయాలి) తప్ప, పబ్లిక్‌లో పరచడం వల్ల భవిష్యత్తులో అది బలహీనతగా మారుతుంది.2. గృహ రక్షణ: మన అంతరంగ వలయం లోకి ధర్మనిష్ఠ గలవారినే రానివ్వాలి. రకరకాల అలవాట్లు ఉన్న సాధారణ పరిచయస్తులను ఇంటి పరిధికి దూరంగా ఉంచడం వల్ల కుటుంబంలో, పిల్లలలో మంచి సంస్కారం నిలుస్తుంది.అద్దం లాంటి మిత్రుడుసచ్ఛీలుడైన మిత్రుడు ‘అద్దం’ లాంటివాడు. అద్దం ముఖంపై ఉన్న మచ్చను ఏ అసూయా లేకుండా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే నిజమైన మిత్రుడు మనలో లోపం ఉన్నప్పుడు దయతో, రహస్యంగా సరిదిద్దుతాడు. అటువంటి సద్విమర్శను అహంకారం విడిచి వినయంతో స్వీకరించడమే ఆత్మవికాసానికి తొలిమెట్టు.విశాల ప్రపంచంలో వేలాది పరిచయాలు ఉండవచ్చు. కానీ మనల్ని దైవ మార్గంలో నిలబెట్టే, మన ప్రవర్తనను సన్మార్గంలో నడిపించే కొద్దిమంది ‘సజ్జనుల’ సాంగత్యమే మన నిజమైన సంపద. మన చుట్టూ ఉన్నవారిని ఒకసారి పరిశీలించుకుందాం... వారు మనల్ని వెలుగు వైపు నడిపిస్తున్నారా, లేదా అంధకారం వైపు గుంజుతున్నారా?– ముహమ్మద్ ముజాహిద్నిర్వహణ: డి.వి.ఆర్. -
అంతర్ముఖ చిత్తం.. పరివర్తనకు మార్గం!
ప్రపంచాన్ని జయించాలనే తపనతో మానవుడు వేల సంవత్సరాలుగా నిరంతరం ముందుకు సాగుతున్నాడు. ప్రకృతిని అధ్యయనం చేశాడు. సముద్రాలను దాటాడు. ఆకాశాన్ని చేరుకున్నాడు. విజ్ఞానశాస్త్రంలో, సాంకేతిక రంగంలో, వైద్యరంగంలో అనేక అద్భుత విజయాలను సాధించాడు. అయితే ఒక ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉంది– తనను తాను నిజంగా తెలుసుకున్నాడా?ప్రకృతి పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే, జీవరాశులన్నీ తమ అవసరాలకు అనుగుణంగా బాహ్య ప్రపంచాన్ని అన్వేషిస్తూ అభివృద్ధి చెందాయి. నీటిలో జీవించిన చేపలు భూమిపై జీవించేందుకు ప్రయత్నించాయి. సర్పాలు చురుకుదనాన్ని పెంపొందించుకున్నాయి. జంతువులు పరిసరాలను బాగా ఎదుర్కొనేందుకు తమ శరీర నిర్మాణాన్ని మార్చుకున్నాయి. ఈ పరిణామమంతా బాహ్య ప్రపంచానికి అనుగుణంగా జరిగిన మార్పులే.మానవుడు కూడా ఇదే మార్గంలో నడిచాడు. ఆహారం కోసం అన్వేషించాడు. నివాసం నిర్మించుకున్నాడు. సంపదను కూడబెట్టాడు. అధికారాన్ని సంపాదించాడు. విజ్ఞానాన్ని పెంచుకున్నాడు. కానీ ఈ అన్వేషణ అంతా బాహ్య ప్రపంచం వరకే పరిమితమైంది. భౌతిక ప్రగతి ఎంత జరిగినా, అంతరంగంలో ప్రశాంతత, సంతృప్తి, ఆనందం లభించకపోతే జీవితం అసంపూర్ణంగానే మిగులుతుంది.ఇక్కడే ఆధ్యాత్మిక పరిణామం ప్రారంభమవుతుంది. మన దృష్టి బాహ్య ప్రపంచం నుండి అంతరంగం వైపు మళ్లినప్పుడే నిజమైన పరివర్తన సంభవిస్తుంది. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవడం, మన ఆలోచనలను పరిశీలించడం, మనస్సును ప్రశాంతంగా ఉంచడం, స్వీయ అవగాహనను పెంపొందించుకోవడంఇవే ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు.ఒక అందమైన ఇంటిని నిర్మించిన తర్వాత దాని వెలుపల నిలబడి చూస్తూ ఉంటే, ఆ ఇంటి సౌకర్యాన్ని అనుభవించలేం. లోపలికి అడుగుపెట్టినప్పుడే ఆ ఇంటి అసలు విలువ తెలుస్తుంది. అలాగే, ఎంతటి బలమైన కోటను నిర్మించినా దాని లోపలికి వెళ్లకపోతే అది రక్షణను ఇవ్వదు. ఇదే సూత్రం మన జీవితానికీ వర్తిస్తుంది. బాహ్య ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించినా, మన అంతరంగంలోకి ప్రయాణించకపోతే శాశ్వతమైన ఆనందాన్ని పొందలేం.నేటి సమాజంలో సాంకేతిక సౌకర్యాలు విస్తరించిన కొద్దీ మానసిక ఒత్తిడి, ఆందోళన, అసంతృప్తి కూడా పెరుగుతున్నాయి. సమాచారం విపరీతంగా పెరిగింది కానీ జ్ఞానం తగ్గుతోంది. పరిచయాలు పెరిగాయి కానీ ఆత్మీయత తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో మనిషికి అత్యవసరమైనది అంతర్ముఖత. కొద్దిసేపైనా మనతో మనం గడపడం, మౌనాన్ని ఆస్వాదించడం, ధ్యానం ద్వారా మనస్సును పరిశుభ్రం చేసుకోవడం నేటి కాలంలో అత్యంత అవసరం.శ్రీ మాతాజీ నిర్మలాదేవి బోధించిన సహజయోగం కూడా ఇదే సందేశాన్ని అందిస్తుంది. మనలో సహజంగా ఉన్న ఆత్మచైతన్యాన్ని మేల్కొలిపి, మన చిత్తాన్ని అంతర్ముఖంగా మార్చినప్పుడే నిజమైన శాంతి, సమతుల్యత, ఆనందం లభిస్తాయని ఆమె బోధించారు. ఇది ఏ ఒక్క మతానికి పరిమితమైన మార్గం కాదు; మానవుని అంతరంగ వికాసానికి సంబంధించిన విశ్వజనీన సత్యం.ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మనలో మార్పు రావాలి. సమాజంలో శాంతి నెలకొనాలంటే ముందు మన హృదయంలో శాంతి నెలకొనాలి. బాహ్య విజయాల కంటే అంతరంగ విజయం గొప్పది. మన చిత్తం బయట ప్రపంచంలో ఎంత విహరించినా, చివరికి తన అసలు గమ్యం తనలోనే ఉందని గ్రహించినప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది.అంతర్ముఖత అనేది ప్రపంచాన్ని వదిలేయడం కాదు; ప్రపంచాన్ని మరింత స్పష్టంగా, సమతుల్యంగా, ప్రేమతో చూడగల స్థితికి చేరుకోవడం. అదే మానవ పరిణామంలో అత్యున్నత దశ.– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులునిర్వహణ: డి.వి.ఆర్. -
హనుమ విగ్రహం... రాతిలో చెక్కిన భక్తి తత్వం
చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని హనుమంతుడి శిల్పం విజయనగర శిల్పకళా వైభవానికి అద్భుతమైన నిదర్శనం. ఈ శిల్పం రామాయణంలోని సుందరకాండలో చోటుచేసుకున్న అత్యంత కీలకమైన ఘట్టాన్ని రాతిలో సజీవంగా ఆవిష్కరిస్తుంది. సీతాదేవిని దర్శించి ఆమెకు శ్రీరాముని ఉంగరాన్ని అందజేసిన అనంతరం హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఈ వార్త రావణునికి చేరడంతో అతడు తన కుమారుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి పంపించాడు. దేవతలను సైతం జయించిన మహా యోధుడైన ఇంద్రజిత్తు సాధారణ ఆయుధాలతో హనుమంతుడిని జయించలేనని గ్రహించి బ్రహ్మదేవుని అనుగ్రహంతో పొందిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడికి బ్రహ్మదేవుని వరప్రభావం వల్ల బ్రహ్మాస్త్రం శాశ్వతంగా హాని చేయలేకపోయినా బ్రహ్మాస్త్ర మహిమను గౌరవిస్తూ ఆయన కొంతసమయం దానికి లొంగిపోయాడు. తరువాత రాక్షసులు జనపనార తాళ్లు, నాగపాశాలతో ఆయనను అదనంగా బంధించిన వెంటనే బ్రహ్మాస్త్ర ప్రభావం దానంతట అదే తొలగిపోయిందని సుందరకాండ వివరించింది. అందువల్ల హనుమంతుడు నిజంగా ఓడిపోలేదు. వ్యూహాత్మకంగా రావణుని సభలో ప్రవేశించి అతనికి శ్రీరాముని సందేశాన్ని నేరుగా తెలియజేయాలనే సంకల్పంతోనే బంధితుడిగా ఉన్నాడు.చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని శిల్పంలో హనుమంతుడు పాముల వంటి బంధనాలతో చుట్టబడి నిలిచిన రూపంలో కనిపిస్తాడు. తన శరీరాన్ని బంధించినప్పటికీ తన మనోధైర్యాన్ని ఎవరూ బంధించలేరనే భావాన్ని అద్భుతంగా వ్యక్తీకరించాడు శిల్పి. కండరాలలో కనిపించే ఉద్రిక్తత, ముఖంలో కనిపించే ప్రశాంతత, కళ్లలో ప్రతిఫలించే ఆత్మవిశ్వాసం భక్తి, అపార శక్తి ఈ శిల్పానికి అసాధారణమైన జీవం పోశాయి. బాహ్యంగా బంధితుడిగా కనిపిస్తున్న హనుమంతుడు అంతర్గతంగా అజేయుడని ఈ శిల్పం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది శిల్పకళ మాత్రమే కాదు రాతిలో చెక్కిన ఒక తాత్విక సందేశం కూడా.చింతల వెంకటరమణస్వామి ఆలయంలోని ఈ శిల్పం విజయనగర శిల్పుల అసాధారణ ప్రతిభను ప్రతిబింబిస్తుంది. కఠినమైన గ్రానైట్ రాయిలో శరీర నిర్మాణం కండరాల బలం పాముల చుట్టుకొలత వస్త్రాల మడతలు ముఖ కవళికలు వంటి సూక్ష్మ అంశాలను సైతం అత్యంత సహజంగా చెక్కడం వారి కళానైపుణ్యానికి నిదర్శనం. విజయనగర శిల్పకళలో శిల్పాలు అలంకారాలు మాత్రమే కాకుండా పురాణాలను ప్రజలకు బోధించే దృశ్య గ్రంథాలుగా కూడా రూపొందించబడ్డాయి. నిరక్షరాస్యులు కూడా ఈ శిల్పాలను చూసి రామాయణం మహాభారతం, పురాణాల్లోని కథలను సులభంగా అర్థం చేసుకునే విధంగా వాటిని రూపొందించారు.ఈ హనుమంతుడి శిల్పం భక్తునికి గొప్ప జీవిత సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో కష్టాలు బంధనలు అవమానాలు ఎదురైనా ధర్మాన్ని విడువకుండా భక్తిని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా లభిస్తుందని ఇది బోధిస్తుంది. బాహ్య బంధనలు ఎంత బలంగా ఉన్నా దైవభక్తి ధైర్యం, జ్ఞానం, సంయమనం ఉన్న వ్యక్తిని ఎవ్వరూ శాశ్వతంగా బంధించలేరనే శాశ్వత సత్యాన్ని ఈ శిల్పం ప్రతిధ్వనిస్తుంది. అందుకే చింతల వెంకట రమణస్వామి ఆలయంలోని హనుమంతుడి శిల్పం కేవలం ఒక కళాఖండం మాత్రమే కాదు భారతీయ ధర్మం భక్తి తత్వం, విజయనగర శిల్పకళా వైభవం కలిసిన ఒక చిరస్మరణీయ వారసత్వ సంపదగా నేటికీ భక్తులను పరిశోధకులను, కళాభిమానులను సమానంగా ఆకర్షిస్తోంది.– జిబి విశ్వనాథ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, అనంతపురంనిర్వహణ: డి.వి.ఆర్. -
యక్షిణి దేవతలు.. నిజమా? భ్రమలా?
మన పురాణాలలో, మంత్ర శాస్త్రాలలో 'యక్షిణి' అనే పేరు వినబడగానే ఒక వింతైన ఉత్సుకత, భయం మనలో కలుగుతాయి. అసలు యక్షిణులు ఎవరు? వారు దేవతలా లేక దెయ్యాలా? అత్యంత శక్తివంతమైన యక్షిణి సాధనల ద్వారా మనుషులు కోరుకున్నవన్నీ సాధించవచ్చా? నిధులు, నిక్షేపాలను కాపాడేది వీరేనా? తరతరాలుగా సమాజంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, పురాణాల వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక సత్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! -
సహజమైనదే చేయాలి!
ఒక జెన్ గురువును ఓ కుటుంబం ఇంటికి ఆహ్వానించింది. ఆయన కోసం అద్భుతమైన విందు సిద్ధం చేశారు. సరిగ్గా పన్నెండు గంటలకు గురువు గారు వచ్చారు. ఇంట్లో ఉన్నవారంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భోజనం వడ్డించారు. ఎంతో శ్రద్ధతో వండిన వంటకాలను గురువుగారు బాగా ఆస్వాదిస్తూ తిన్నారు. చివరగా చేయి కడుక్కునే సమయంలో, ‘అన్నీ శాకాహారమే వండారేం? చిన్న చేప ముక్క అయినా కలిపి ఉంటే బాగుండేది కదా!’ అన్నారు.ఆహ్వానించిన వారు ఆలోచనలో పడ్డారు. ‘మీరు మాంసాహారం తినరని అనుకున్నాం’ అని నమ్రతగా చెప్పారు. గురువు తల పట్టుకున్నారు. ‘మీ ముందస్తు అంచనాల్లో నన్ను పెట్టి బంధించకండి. నాకు ఊపిరి ఆడదు’ అన్నారు. ‘మాకు అర్థం కాలేదు గురుదేవా! ఇతర మనుషులకు, జంతువులకు, చివరికి చెట్టు చేమలకు కూడా హాని చేయకూడదు అని జెన్ సిద్ధాంతం చెప్తోంది కదా?’ అని అడిగారు.‘అవును, దానికి నేను ఇప్పుడు చేప తినాలి... తినకూడదు అనుకోవడానికి సంబంధం ఏమిటి? మనం మనలాగే ఉండాలి. మనకు ఏది సహజమో అదే చేయాలి. అనవసరమైన నటనలు వద్దు. వదులుకోవాలనే ఆలోచన బలంగా ఉంటే, కాలక్రమేణా అనవసరమైన విషయాల నుండి బయట పడవచ్చు. ఇది నా అనుభవం కూడా. బలవంతంగా శాకాహారం మాత్రమే తింటూ లోపల బాధ పడటం కంటే, ఆశ కలిగినప్పుడు మాంసాహారం తినేసి, ఆ క్షణంలో జీవించడమే అసలైన జెన్. వదులు కోవాలనే సంకల్పం దృఢంగా ఉంటే చాలు, మిగిలినది సహజంగా దానికదే జరుగుతుంది’ అన్నారు గురువుగారు.– యామిజాల జగదీశ్ -
చిద్రూపమే జగత్తు!
దీర్ఘతముడనే ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు. తండ్రికి సపర్యలు చేయడం వారి దినచర్య. కాలం తీరి కొన్నాళ్ళకు దీర్ఘతముడు మరణించాడు. విధిగా నిర్వర్తించాల్సిన ఉత్తరకర్మలన్నిటినీ పెద్దకొడుకు భక్తితో నిర్వర్తించాడు. అంతా సజావుగా జరిగాక, తమ్ముడి కోసం చూడగా, అతడు ఆశ్రమంలో కనిపించలేదు. అడవిలో వెదికాడు. ఒక పెద్ద చెట్టు మొదట్లో కూర్చుని శోకిస్తూ కనిపించాడు తమ్ముడు. అన్న హృదయం ద్రవించింది. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఆప్యాయంగా తల నిమిరి ఇలా చెప్పాడు:‘పూర్వం వైరోచనుడనే ఒక రాజు ఉండేవాడు. దీర్ఘకాలం వసుధను పాలించాడు. ప్రపంచంలో లభించే అన్ని సుఖాలను తృప్తి తీరా అనుభవించాడు. ఒకనాడు రాజప్రాసాదపు మేడపై నిలబడి ఆలోచిస్తూ ‘ముల్లోకాలలో అద్భుత కారణంబును, సకల భోగాలకు ఆలవాలము అయిన ఈ భూమిలో, సౌఖ్యాలు అస్థిరములైనవే! అనుభవించే పదార్థాన్నే మళ్ళీ మళ్ళీ అనుభవించి, దినదినమూ భ్రాంతుడనై తిరుగుతూ ఉండడమేగా ఇక్కడ ఎన్నాళ్ళైనా! రాత్రి, పగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆగేవి కావు. చెప్పిందే చెప్పడం అన్నట్లుగా కాలం చర్వితచర్వణం. ఈ సుఖాలన్నీ ప్రాజ్ఞుల దృష్టిలో అల్పాలే’ అని తలచి బాల్యంలో తన తండ్రి చెప్పిన మాటలను మననం చేసుకున్నాడు.తే. కణగి యెల్ల చోట గలది చిద్రూపంబుఅదియ నీవు నేను నఖిలములునుఇదియ నిశ్చితార్థ మిది దప్ప మఱి లేదుసర్వశాస్త్రసార సంగ్రహంబు.‘ఈ విశ్వంలోని ప్రతి అణువు చిత్తమనే చేతనతో నిండి ఉంది. చేతనతో నిండినదైన చిద్రూపమే నీవు, నేను, అది, ఇది, ఇలలో అన్నీ. అదే నిశ్చయం. అది తప్ప మరొకటి లేదు. సర్వ విజ్ఞాన, వేదాంత శాస్త్రములు బోధించేది కూడా అదే! ఆ సత్యాన్ని గ్రహించిన చిత్తానికి చింత ఉండదు. అది తెలుసు కుని నీవు కూడా స్వస్థత చెందిన అంతరంగాన్ని పొందు’ అని అన్న చెప్పిన మాటలను ఆలకించాడు తమ్ముడు. శోకోపశమనం పొందాడు.– భట్టు వెంకటరావు -
శంకరుల బాట..
ఆదిశంకరుల రచనలైన కనకధారాస్తోత్రమ్, దక్షిణామూర్తి స్తోత్రమ్, గుర్వష్టకమ్, నిర్వాణ షట్కమ్, భజగోవిందం, సౌందర్యలహరి – దేన్ని చదివినా, వినినా మనసు ఆనందంతో నిండి పోతుంది. వాటి అర్థాన్ని గ్రహించి, తదనుగుణంగా జీవిస్తే మన జీవితాలే ధన్యమవుతాయనిపిస్తుంది. శంకరులవారి అన్నపూర్ణా స్తోత్రాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాడుతుంటే ఆనందం, ఆరోగ్యం పుష్కలంగా లభిస్తాయని పెద్దలంటారు. అందులో చివరి శ్లోకం మరీ ముఖ్యమైనది:‘‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే / జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః / బాంధవా శ్శివ భక్తశ్చ స్వదేశో భువనత్రయమ్!!ఇందులో ఆది శంకరులవారు జ్ఞాన, వైరాగ్యాలను కాంక్షించటమేకాక తన తల్లి పార్వతీదేవి అనీ, తండ్రి మహేశ్వరుడనీ, శివ భక్తులందరు తన బంధువులనీ, మూడు లోకాలూ తనకు స్వదేశమనీ ప్రకటిస్తారు. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా ఇతరులు తీసికొని ఆచరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు.మరి మనం ఆది శంకరుల అనుచరులం అని చెప్పుకొంటే సరిపోతుందా? ఆయన వలె మనమూ జ్ఞాన, వైరాగ్యాలనే కోరుకోవాలిగానీ ధన ధాన్యాలను, సంపదలను కాదు. లోకాలనన్నిటినీ, లోకులందర్నీ సృష్టించిన ప్రకృతి, పురుషులు మన తల్లి తండ్రులని, జీవులన్నీ మన బంధువులని, ముల్లోకాలూ స్వదేశమని గ్రహించి జీవిస్తే ఆధ్యాత్మిక శిఖరాన్ని ఆదిశంకరులవారు ఎలా అధిరోహించారో మనమూ అధిరోహించవచ్చు. – రాచమడుగు శ్రీనివాసులు -
'దేవశయని ఏకాదశి' ప్రాశస్త్యం..! ఆ రోజు ఏం చేయాలంటే..
శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర కాలమే చాతుర్మాసం. ప్రతి ఏడాది ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశిని దేవశయని ఏకాదశి(తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి) అంటారు. దీని అర్థం. దేవ్' అనగా దేవుడు, 'శయని' అనగా నిద్రించుట. విష్ణుమూర్తి క్షీరాసాగరంలో యోగనిద్రకు ఉపక్రమించే రోజే ఈ దేవశయని ఏకాదశి. ఈ ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు గల నాలుగు నెలల కాలం చాతుర్మాసంగా పరిగణిస్తారు. అంటే ఈ నాలుగు మాసాల్లో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా, సృష్టి బాధ్యతలను పరమశివుడు చూసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మాసం ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మశుద్ధికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, మొదటి పుట్టువెంట్రుకలు తీయించడం వంటి శుభకార్యాలు చేయరు. అయితే, భక్తి, దానధర్మాలతో కూడిన కొన్ని పనులు చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున విష్ణువుని ఎలా ఆరాధించాలంటే..విష్ణు అనుగ్రహం కలగాలంటే..మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే, సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని, ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. అంతేగాదు మహాసాధ్వి సతీ సక్కుభాయి, ఈ వ్రతాన్నే ఆచరించి, మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు..ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు, దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం, శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి, భోజనం చేయాలి. తినకూడనవి..ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి, పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి, సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు, సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ, పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే, తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు, మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.(చదవండి: వైభవంగా జగదాంబిక బోనాలు..అక్కడే తొలి బంగారు బోనం..!) -
మహాత్ముల చేష్టలు..
బాలోన్మత్త పిశాచవత్ సిద్ధానాం రీతిః మహాత్ములయిన సిద్ధపురుషుల పద్ధతంతా విపరీ తంగా ఉంటుంది. పిల్ల చేష్టలు చేస్తారు. పిశాచం పట్టిన వాళ్ళలాగా వింతగా ప్రవర్తిస్తారు. పిచ్చివాళ్ళలాగా సంచరిస్తారు. వాళ్ళ చూపులు, పనులు వంటివన్నీ పైకి అలాగే కనిపిస్తాయి. అలాంటి మహనీయుల గొప్పతనాన్ని మహాత్ములే గుర్తిస్తారు. సామాన్యులకు తెలియదు.గౌతమ మహర్షి మహామహితాత్ముడు. గొప్ప సిద్ధుడు. శ్రీవిద్యోపసనా దురంధరుడు. ముద్రోపాసనను, శైవ సిద్ధాంతాన్ని మనకందించిన పుణ్యమూర్తి. పెద్ద పెద్ద పండితులు, చక్రవర్తులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. నిత్యం వేదపారా యణం, ఉపాసన, యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, సంద్గ్రంథ పారాయణాలు జరిగేవి.ఒక ఉన్మత్తుడు ఆశ్రమంలోనే ఉంటూ అందరికీ తపో, ధ్యాన భంగం చేస్తూ ఉండేవాడు. గౌతముడు మాత్రం ఆ పిచ్చివాణ్ణి దగ్గరకు పిలిచి ఆదరించేవాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిచ్చివాణ్ణి తిట్టేవారు. ఇలా ఉండగా ఒక రోజున పండితులు, రాజు గౌతముని సన్మానించటానికి, పూజా సామగ్రిని, కానుకలను తీసుకొనివస్తే ఆ పిచ్చివాడు ఆ సామగ్రినంతటినీ చిందరవందర చేసి అందరిచేత తన్నులు తిన్నాడు. అందుకు గౌతముడు చాలా బాధపడ్డాడు. పాపం పిచ్చివాడిలాగా తిరిగే అవధూత మరణించాడు. ఇది చూచి గౌతముడు కూడా ప్రాణం వదిలేశాడు. అది తెలిసి శుక్రాచార్యులు కూడా ప్రాణత్యాగం చేశారు.ఆ విషాదం చూచి భరించలేక దేవతలందరూ జగన్మాతను ప్రార్థించారు. శ్రీమాత వాళ్ళ ప్రార్థన విని గౌతముని బ్రతికించింది. గౌతముడు మంత్రజలం చల్లి అవధూతను బ్రతికించాడు. శుక్రాచార్యుని సైతం బ్రతికించాడు. అక్కడి వాళ్ళతో గౌతముడు ‘ఈయనను పిచ్చివాడనుకొంటున్నారు మీరు. ఇది భ్రమ తప్ప నిజం కాదు. ఈయనొక మహాయోగి. అవధూత! నా పూర్వజన్మలో నా గురుదేవుడు. ఈయన ఇంతవరకు మీ విషయంలో చేసిన వింతచేష్టలు మిమ్మల్ని అనుగ్రహించటానికే. కానీ ఈ యధార్థం మీకు తెలియదు’ అని చెప్పాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
స్వయం గురువుగా తయారు కావాలి..
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీగురవే నమః...గురు మంత్రంలో చివరి మంత్రం చెప్పేటప్పుడు‘గురుః సాక్షాత్ పరబ్రహ్మ’ అని అంటారు. అంటే పరబ్రహ్మయే. మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ఆ శక్తియే మీ ద్వారా ప్రవహిస్తుంది. కనుక అప్పుడు మీరు పరబ్రహ్మ సాధనంగా మారతారు. మీలో స్వయం గురుతత్వ స్థితిని పెంపొందించుకుంటారు.ఆదిగురువు అవతరమూర్తులందరూ పంచభూతాలపై ఆధిపత్యం కలిగివుంటారు. వారి ద్వారానే బ్రహ్మ వ్యక్తీకరింపడ్డాడు. ఈ ఆదిగురువు ముగ్గురి ద్వారా అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా వ్యక్తీకరింపబడ్డాడు. ఆయన నాలుగు తలలుగల బ్రహ్మలా జన్మించాడు. మనకు పైకి కనబడే ఈ ముగ్గురు కాకుండా నాల్గవ తల శ్రీ గణేశునిది. ఈ విధంగా దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గణేశ రూపంతో, శక్తులతో ఆది గురువయ్యాడు. గురువు కు వుండాల్సిన ఉత్తమ గుణాలు చాలా వున్నాయి. ఆ గుణాలన్నీ గురువులో వ్యక్తమవ్వాలి. ఈ గుణాలకు యజమాని శివుడు. శివ తత్వం అంటే గురుతత్వమే. అలా ఈ గుణాలన్నీ మీ ద్వారా ప్రస్పుటమవ్వాలి, ప్రకాశించాలి.అప్పుడు మీరు విరాటశక్తిలో ఒకరైపోతారు. ఇతరులకు ధర్మాన్ని బోధించగలుగుతారు. ఆత్మగా మారుతారు. ఆ విధంగా నిజమైన గురువుగా మారుతారు.ఒక గురువుగా మీరు మీ నిత్య జీవితంలో అనేక విషయాలకు అతీతంగా వుండగలగాలి. అదే మీరు చేరుకోవలసిన ఉన్నత స్థితి.‘‘యధా రాజా తధా ప్రజా’’ అన్నట్లుగా మీరు స్వయం గురువుగా తయారయిన్నప్పుడే ఇతరులకు గురువుగా మారి ఓ ప్రతీకగా, ఆదర్శ్ర΄ాయంగా నిలబడి నడిపించగలరు.. ఇక్కడ మన అర్థం చేసుకోవలసిన విషయమేమంటే – సమాజంలో మనం చూస్తున్న గురువులను, తమను తాము గురువులుగా చెప్పుకునే గురువులు మనకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలుగుతున్నారా అన్నది. తమలో గురు తత్వం లేని గురువు కూడా ఇతరులకు గురువు కావాలనుకుంటారు. తాను స్వయంగురువుగా వ్యక్తీకరింపబడిన వ్యక్తి ఇతరులకు గురువు కావాలని ఎన్నడూ అనుకోడు.మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మగా రూపొందండి. ఎప్పుడు మీరు ఆత్మగా రూపొందుతారో అప్పుడు మీకు మీరు గురువు కాగలగుతారు. అదే స్వయం గురుతత్వం.గురువు ప్రప్రధమంగా మనల్ని భగవంతుడినితో అనుసంధాన పరచడానికి ప్రయత్నిస్తాడు. అంటే దానర్థం ఆయన మీ కుండలినీ శక్తిని జాగృత పరిచి, సర్వవ్యాపిత శక్తితో మిమ్మల్ని అనుసంధానం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.గురువుకి మించిన తత్వం లేదుగురువును మించిన తపస్సు లేదుగురువుని మించిన జ్ఞానం లేదుఅటువంటి గురుదేవునికి నమస్కరిస్తున్నాను అని గురుగీత స్తోత్రంలోని ఒక శ్లోకంలో గురువుకి వున్న ఉన్నత స్థాయి గురించి చెప్పారు.– డాక్టర్ ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులు, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)శ్రీ మాతాజీ నిర్మలాదేవినిర్వహణ: డి.వి.ఆర్. -
దేవతలు కట్టిన కోవెల!
విష్ణుమూర్తి... సౌమ్యనాథస్వామిగా అవతరించి, చిరుమందహాసంతో, అభయహస్తంతో దర్శనమిస్తూ ..కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం నందలూరు సౌమ్యనాథాలయం. విశాలమైన ప్రాంగణంలో... నాలుగు రాజగోపురాల మధ్య ఉన్న ఈ ఆలయం పది ఎకరాల విస్తీర్ణంలో, పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి నిర్మించడం విశేషం.ఈ ఆలయంలోని 108 స్తంభాలపైనా భాగవతం చిత్రించి ఉండటం మరో విశేషం. 11 శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయాన్ని దేవతలే కట్టించారని పురాణాలు చెపుతున్నాయి. స్వయంగా నారదమహర్షి సౌమ్యనాథస్వామి మూలవిరాట్టును ప్రతిష్టించారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది.స్వామి పాదాలపై సూర్యకిరణాలు...గర్భగుడికీ ఆలయ ప్రధాన ద్వారానికీ మధ్య 120 గజాల దూరం ఉన్నా.. ద్వారం నుంచి మూలవిరాట్టు రూపం చాల స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో స్వామి పాదాలపైన సూర్యకిరణాలు పడటమూ ఇక్కడ చూడొచ్చు.స్వామిపై అన్నమయ్య కీర్తనలు...తాళ్లపాకకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని ఒకప్పుడు అన్నమాచార్యులు రోజు దర్శించుకునేవాడనీ, స్వామిపైన పదహారు కీర్తనలు కూడా రాశాడనీ అంటారు. ఇక్కడ స్వామికి ప్రతిరోజు నిర్వహించే పూజలు ఒకెత్తయితే, ఆషాఢమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముక్కోటి ఏకాదశి నాడు చేసే లక్షతులసీ అర్చన మరొకెత్తు. ఇవే కాకుండా శ్రావణ, ధనుర్మాసాల్లో నిర్వహించే ఉత్సవాలు చూసేందుకు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన భక్తులకు ఎక్కువగా చూస్తారు.వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవాలు...ఈనెల 21, మంగళవారం అంకుర్పారణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. బుధవారం ధ్వజారోహణం జరిగింది. 26న గరుడసేవ, 28న కళ్యాణోత్సవం, 29న రథోత్సవం, 30న చక్రస్నానం, 31న పుష్పయాగం నిర్వహించనున్నారు. స్వామివారు రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఐదవరోజున గరుడోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను స్వయంగా టీటీడీ దేవస్థానం వారే నిర్వహించడం సంప్రదాయం.– రామమోహన్ మోడపోతుల, సాక్షి, రాజంపేట, వైఎస్సార్ కడప జిల్లానిర్వహణ: డి.వి.ఆర్. -
క్రీస్తునందున్న యాత్రికులు, పరదేశులు
క్రీస్తు సిలువ మరణాన్ని బట్టి కొట్టివేయబడిన ధర్మశాస్త్రమను పాతనిబంధన దృష్టిలో నుండి చూస్తే, ఇశ్రాయేలు జనాంగం పూర్తి రక్షణ కొరకు మెస్సీయా రానేవచ్చాడు. క్రొత్తనిబంధన దృష్టికోణంలో నుండి చూస్తే పాపులను రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు అనగా యావత్తూ అన్య జనాంగాన్ని రక్షించుటకు క్రీస్తు ప్రత్యేకంగా రావడం జరిగింది.గురి కలిగిన క్రైస్తవుల గూర్చి ఎప్పుడూ ఘనంగానే చెప్పవచ్చు. ప్రభువైన క్రీస్తు ద్వారా అంది వచ్చిన క్రొత్త నిబంధన చట్టప్రకారం చూసినా, నేడు అమలులో ఉన్న అపొస్తలుల బోధను అనుసరించి చూసినా, ఈ భూమి మీద ఉన్న క్రైౖస్తవులు అనబడే క్రీస్తు సంబంధులు పరదేశులు, యాత్రికులుగా చెప్పబడుతున్నారు.‘నశించిన ఇశ్రాయేలు ఇంటివారైన గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను’ అన్న యాత్ర జీవితం మెస్సీయాది.గొఱ్ఱెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకే వచ్చానని నిశ్చయముగా చెప్పుకున్న ఆయన, ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తోడుకొని రావాలి అన్నది కూడా మొత్తానికి ఆయన స్పష్టం చేయడం అంతా విదితమే. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనను రోజు రోజూకు భక్షిస్తూ ఆయన్ను స్థిరంగా ఒక్కచోట నిలబడనివ్వని కారణం చేత ఉన్నతమైన ఉరుకులు పరుగుల జీవితం ఆయనది. తాను పుట్టినవేళ సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో పడుకొన్న శిశువైన యేసుగా పెరిగి పెద్దవాడై తనను తాను రిక్తుడిగా చేసుకొనినందున ఆయనకు ఇల్లు వాకిలి లేకున్నా రోజూ నిలువ నీడలేని సంకట పరిస్థితి. రాత్రివేళ ఎక్కడో ఒకచోట తలదాచుకొని పగలు ఉన్నంత వరకు అవిశ్రాంతంగా దేవుని పనిచేయడం ఒక్క క్రీస్తుకే చెల్లింది.దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను చాటుతూ ఆ రాజ్యం ఇప్పుడు మీ చేరువలోకే వచ్చిందంటూ యేసు సామాన్యుల చెంత సామాన్యుడుగా కలిసిపోతూ సత్యాన్ని వివరాణాత్మకంగా మనస్సుకు హత్తుకొనేలా బోధించాడు. ఇశ్రాయేలు దేశపు ప్రతి ఇంటి గడపను, ప్రతి బాధితుడను దాటిపోని క్షేత్రస్థాయి విస్తృత పర్యటనలు చేస్తూ యేసు తనదైన దైవిక ప్రేమను బట్టి మానవాళిని తన దివ్య వాక్కులతో బోధలతో అలరించడం విశేషం. ధనికులు, పండితులు వద్దకే కాకుండా అట్టడుగు వర్గాలను ఆకట్టుకొనేలా కూడా యేసు ప్రభువు నేరుగా వారి ఇళ్ళవద్దకు వెళ్ళి పరామర్శలు చేస్తూ వాగ్దాన సంబంధ దేవుడు సత్యవంతుడని స్థాపిస్తూ ఆయన ఎంతో నమ్మదగినవాడని ప్రచారం చేసాడు.దేవుని ఉనికి, స్పృహ లేకుండా పోతున్న రోజుల్లో సత్యవంతుడైన వానిని మనం ఎరుగవలెనని మనకు వివేకం అనుగ్రహించాడు కూడా. ఇట్టి విధానంలో ఈ క్రమంలో ఆయన యాత్రజీవితం విజయవంతం కాకుండా ఎలా ఉంటుంది? నేను పరదేశినైన పరసంబంధుడను, ఈ భూమిమీద యాత్రికుడను అన్నది యేసు ఉన్నత జీవితపాఠం గొప్పగా చాటుతుండడం విశేషమనే చెప్పాలి.– జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్. -
కోపాన్ని వదలండి..
రెండు పదాల ఈ చిన్న సలహా పాటించకపోతే జీవితం ఎన్నో మలుపులతో కలచి వేస్తుంది, సంతోషాన్ని కబళిస్తుంది.. తాత్కాలికం, క్షణికం అయినా కోపం శాశ్వతంగా బంధాల్ని తెంపివేస్తుంది..స్నేహన్ని చెడగొడుతుంది, చుట్టరికాలు చెడిపోతాయ్.. మనుషుల్ని దూరం చేస్తుంది. మమతల్ని చంపివేస్తుంది. ఆరోగ్యం మటు మాయం అయిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కోపం వలన వచ్చే కష్టనష్టాలు బేరీజు వేసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే కోపం గూర్చి ఎన్నో శతకాల్లో నిక్కచ్చిగా, స్పష్టంగా చెప్పారు... కోప్పడకుండా చదవండి.‘తన కోపమే తన శత్రువుతన శాంతియె తనకు రక్ష దయ చుట్టంబౌదన సంతోషమే స్వర్గముతన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’ఎన్నో సందర్భాలలో ఈ పద్యం వింటాం.. వేరే వివరణ అవసరం లేదు. కోపమే శత్రువు, శాంతమే రక్ష.. సంతోషం స్వర్గం బాధే నరకం... అన్నీ మనలోనే ఉన్నాయి ఈ పద్యంలోనే దయా గుణాన్ని అంటే ఇబ్బంది ఉంటే ఆదుకునే వాడే చుట్టం అని చె΄్తాడు. అందుకునే కాబోలు ‘అక్కరకు రాని చుట్టము... గ్రక్కున విడువంగ వలయు ‘ అని సలహా ఇస్తాడు బద్దెన కవి.వేమన కోపం గురించి అత్యధికంగా చెప్పాడుకోపము దుఃఖమునకు మూలము కోపము శత్రుభయంకరము కోపము కీర్తి నశింపజేయురా కోపము వదలిన సుఖియైతివిరా వేమా!అర్థం: కోపమే దుఃఖానికి మూలం. కోపం వల్ల శత్రువులు పెరుగుతారు. కీర్తి నాశనమవుతుంది. కోపం వదిలితేనే సుఖపడతావు.మరో పద్యం..కోపము వచ్చినప్పుడు కుయుక్తుల వచ్చురా కోపము వచ్చినప్పుడు కూటమి చెడురా కోపము వచ్చినప్పుడు కులమెల్ల చెడురా కోపము వదలరా వేమా!సుమతి శాంతంగా ఉండమని చెప్పాడుకోపము పాపమునకు మూలము కోపము దుఃఖమునకు మూలము కోపము అధోగతికి మూలము కోపము వదలి సుఖముండుము సుమతీ!అర్థం: కోపమే అన్ని పాపాలకు, దుఃఖాలకు, అధోగతికి కారణం. అందుకే కోపం వదిలి సుఖంగా ఉండు. భర్తృహరి సుభాషిత శతకం – ఏనుగు లక్ష్మణకవి చేసిన అనువాదంపద్యంక్షమయా భూషితః పురుషః క్రోధేన భూషితో నరః నీచోపచారైః నరకం వ్రజేత్ ఉత్తమో నరకాత్ పరమ్తెలుగు అనువాదంఓర్పుతో భూషితుడైన నరుడు ఉత్తముడు కోపముతో నుండు నరుడు నీచుడునీచుడు నరకమునకు పోవును ఉత్తముడు స్వర్గమునకు పోవునుకోపము కామము లోభము మదము మాత్సర్యము ఈ పంచ మహాపాములు దహించును వీనిని జయించినవాడే మానవుడు శ్రీరామ నీ దాసుడైతిని దాశరథీ!నీతి శతకంలో పద్యంకోపాత్ భవతి మూర్ఖత్వం మూర్ఖత్వాద్ వినశ్యతి వినాశాత్ నరకం యాతి తస్మాత్ కోపం వివర్జయేత్అంటే...కోపం వల్ల మూర్ఖత్వం వస్తుంది. మూర్ఖత్వం వల్ల నాశనం. నాశనం వల్ల నరకం. అందుకే కోపాన్ని వదలిపెట్టాలి. శతక రచయితలు భావ యుక్తంగా చెప్తే, త్యాగరాజుల వారు రాగయుక్తంగా ‘శాంతము లేక సౌఖ్యము లేద’న్నారు. చివరిగా చెప్పినంత సులువుగా కోపాన్ని వదులుకోగలమా..మాటకు మాట తూటాలాగా వదిలితే శాంతి ఎక్కడ.. శాంతం లేనిదే శాంతి.. సహనం, శాంతం ఉంటే కోపాన్ని దూరం చేసుకోవచ్చు... డాక్టర్లు కూడా ఆరోగ్యం బాగుండాలంటే కోపం వద్దు.. ఈ దిçశలో బయలు దేరితే మన ఆరోగ్యదశ బాగుంటుంది.. ఆ ప్రయత్నంలో అడుగులేద్దాం.– డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. -
వర్షాల కోసం ‘ఇస్తిస్ఖా’... నమాజు
వర్షాలు పడక పొలాలు ఎండిపోతే, చెరువులు తడారిపోతే రైతు గుండె గొంతుకలోకి వస్తుంది. వాన చుక్క కోసం ఊరంతా ఆకాశం వైపు దీనంగా చూస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మహమ్మద్ ప్రవక్త (స) కాలంలో ఏం చేసేవారో తెలుసా?ఊరి ప్రజలందరినీ ఒక చోటికి తీసుకెళ్లి వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయించేవారు. దాన్నే ‘నమాజ్–ఎ–ఇస్తిస్ఖా’ అంటారు. తప్పులు పెరిగితే తడారిపోయే నేల! మనిషి చేసే పనులకి, ప్రకృతి మారే తీరుకి దగ్గర సంబంధం ఉంటుంది. వ్యాపారంలో మోసాలు ఎక్కువైనప్పుడు, సమాజంలో పేదలకు ఇవ్వాల్సిన దానధర్మాలు (జకాత్) సరిగ్గా చేయనప్పుడు వర్షాలు ఆగిపోతాయని ప్రవక్త చె΄్పారు. కరువు రావడం అనేది కేవలం వాతావరణం మారడం వల్ల మాత్రమే కాదు, మనుషుల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని చెప్పే ఒక హెచ్చరిక.‘ఒకవేళ ఈ భూమి మీద మూగజీవాలు లేకపోతే, అస్సలు వర్షాలే పడవు’ అని ప్రవక్త చెప్పిన మాటలు మన అహంకారాన్ని ఆలోచనలో పడేస్తాయి. ఆడంబరం లేదు... కేవలం వినయం మాత్రమే! వర్షం కోసం వేడుకునేందుకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆడంబరాలు ఉండేవి కావు. చాలా సాధారణ బట్టలు వేసుకుని, భయభక్తులతో, వినయంగా ఊరి బయట ఉన్న ఈద్గాహ్ మైదానానికి వెళ్లేవారు. పండుగ నమాజ్ లాగే రెండు రకాతుల నమాజ్ చదివిన తర్వాత, ప్రవక్త చేతులను చాలా ఎత్తుకి ఎత్తి అల్లాహ్‌ను వేడుకునేవారు.సాధారణంగా దేవుడిని కోరుకునేటప్పుడు అరచేతులు ఆకాశం వైపు ఉంచుతారు. కానీ వర్షం కోసం అడిగేటప్పుడు అరచేతులు నేల వైపు, చేతుల వెనుక భాగం ఆకాశం వైపు ఉంచేవారు. అలాగే వేసుకున్న దుప్పటిని కూడా తిరగేసేవారు. మన కష్టాల కాలం మారి, మంచి రోజులు రావాలని కోరుకోవడానికి ఇది ఒక పద్ధతి. ‘ప్రభూ! నీ దాసులకు, మూగజీవాలకు నీళ్లు ప్రసాదించు... నీ కరుణను పంచు... ఎండిపోయిన ఈ భూమికి మళ్లీ ప్రాణం పోయ్!’ఇస్తిస్ఖా ప్రార్థన సారాంశం చిన్న చీమ... గొప్ప పాఠం! ఒకసారి ఒక ప్రవక్త వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తూ, మార్గమధ్యంలో ఒక చిన్న చీమను చూశారట. ఆ చీమ తన కాళ్లను ఆకాశం వైపు ఎత్తి వర్షం కోసం వేడుకుంటోంది. అది చూసిన ప్రవక్త తన అనుచరులతో... ‘మనం వెనక్కి వెళ్లిపోదాం, ఆ చిన్న చీమ చేసిన ప్రార్థనను ఆలకించి దేవుడు మనకు వర్షం కురిపిస్తున్నాడు’ అన్నారట.దేవుడి దయ కేవలం మనుషులకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవికీ సమానంగా లభిస్తుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వాన చినుకుల్లో పరవశం! ప్రార్థన ముగియగానే ఆకాశంలో దట్టమైన మేఘాలు పట్టి, ఉరుములు మెరుపులతో వర్షం పడేది. వాన పడటం ప్రారంభం కాగానే ప్రవక్త తన చొక్కాను కాస్త పక్కకి జరిపి, ఆ మొదటి వాన చుక్కలు తన ఒంటిమీద పడేలా నిలబడేవారు. ‘ఇది దేవుడి దగ్గర నుంచి ఇప్పుడే వస్తున్న కొత్త వర్షం’ అని సంతోషపడేవారు. నిజమైన పశ్చాత్తాపంతో, వినయంతో ప్రార్థిస్తే ఎండిపోయిన భూములైనా, మనుషుల మనస్సులైనా మళ్లీ చిగురిస్తాయనడానికి ఇస్తిస్ఖా ప్రార్థనే నిదర్శనం.– డా. అబ్దుర్రహీం బిన్ ముహమ్మద్ బిన్ మౌలానానిర్వహణ: డి.వి.ఆర్. -
తొలి పర్వం..
సంవత్సరంలో సాధారణంగా 24 ఏకాదశులు వస్తాయి (అధిక మాసం వస్తే 26). అయితే ఆషాఢ శుక్ల ఏకాదశికి ‘తొలి ఏకాదశి‘ అనే విశిష్ట నామం వచ్చింది. దక్షిణాయనం ప్రారంభం అయ్యాక వచ్చే మొదటి ఏకాదశి కనుక మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి అంటే ప్రారంభ ఏకాదశి అని చెప్పవచ్చు.ఈ ఏకాదశిని ఇంకా... దేవశయన ఏకాదశి, హరిశయనీ ఏకాదశి, పద్మ ఏకాదశి, ఆషాఢ శుక్ల ఏకాదశి .. అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) నాడు మేల్కొంటారని ఆగమాలు, పురాణాలు వివరిస్తాయి.ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి నాడు విధిగా పారణ చేసినవాడు సర్వపాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతాడని పద్మ పురాణం తెలియజేస్తుంది. గాయత్రీ మంత్రం కంటే గొప్ప మంత్రం లేదు. తల్లి కంటే గొప్ప దైవం లేదు. కాశీ కంటే గొప్ప తీర్థం లేదు. ఏకాదశి వ్రతం కంటే గొప్ప వ్రతం లేదు అని స్కందపురాణం చెబుతోంది. భవిష్య పురాణం ప్రకారం చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది.ఈ నాలుగు నెలలు జపం, ధ్యానం, దానం, విష్ణు ఆరాధన, పురాణ పారాయణం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంది.తొలి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం అత్యంత శ్రేయస్కరమని సంప్రదాయం.భీష్ముడు యుధిష్ఠిరునికి ఏకాదశి మహిమను వివరిస్తూ, ఉపవాసం, దానం, విష్ణుభక్తి ప్రాముఖ్యతను బోధించాడు. అతని ఉపదేశాలే తరువాత అనేక ధర్మగ్రంథాలకు ఆధారమయ్యాయి. గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభువు ప్రతి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ రామానుజులు ఏకాదశి ఆచరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మధుమేహం, గర్భధారణ, దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు.. ‘ఓం నమో నారాయణాయ’భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి అనగా తొలి ఏకాదశిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని, ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.తొలి ఏకాదశి రోజున చేయవలసినవి- బ్రహ్మముహూర్తంలో లేవాలి.- స్నానం చేసి విష్ణుపూజ చేయాలి.- ఓం నమో నారాయణాయ అనే నామ మంత్రాన్ని జపించాలి.- విష్ణు సహస్రనామం చదవాలి.- భగవద్గీత పారాయణం చేయాలి.- తులసి దళాలతో శ్రీమహావిష్ణువును అర్చించాలి.- ద్వాదశి రోజున అన్నదానం చేయాలి. విధిగా పారణ చేయాలి.చేయకూడనివి- కోపం, అసత్యం, పరనింద, మద్యపానం, మాంసాహారం, వ్యర్థ వాదనలు, అధిక నిద్రను త్యజించాలని శాస్త్రాలు చెబుతాయి.తొలి ఏకాదశి చెప్పే సందేశంతొలి ఏకాదశి మనకు కేవలం ఆహారాన్ని తగ్గించడం మాత్రమే కాదు, అహంకారం, కోపం, లోభం, అసూయ వంటి అంతరంగ దోషాలను తగ్గించుకోవాలని బోధిస్తుంది. భగవంతునికి దగ్గర కావడానికి ముందు మన మనస్సును పవిత్రం చేసుకోవాలనే సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తుంది. తొలి ఏకాదశి అనేది ఒక పండుగ మాత్రమే కాదు; అది భక్తి, నియమం, ఆత్మపరిశీలన, ధర్మాచరణ, ప్రకృతితో సమన్వయ జీవన విధానానికి శ్రీకారం చుట్టే మహోన్నత దినం. పద్మ పురాణం, స్కంద పురాణం, భవిష్య పురాణం వంటి శాస్త్రాలు దీనిని అత్యున్నత వ్రతాలలో ఒకటిగా కొనియాడాయి.– మద్దికుంట శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రంనిర్వహణ: డి.వి.ఆర్. -
అశాశ్వతత్వం..
ఒక పల్లెటూరి శివారులో ఒక వృద్ధుడు నివసించేవాడు. కొన్ని నెలల క్రితం అతడి భార్య చని పోయింది. భార్య చనిపోయి నెలలు గడిచినా, ఆమె జ్ఞాపకాలు అతడి హృదయాన్ని విడిచిపెట్టేవి కాదు. ఒకరోజు, భారమైన మనసుతో దేవాలయానికి వెళ్లాడు. పూజారి ‘ప్రాణులన్నీ అశాశ్వతములే.ఈ ధర్మాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే దుఃఖం తగ్గుతుంది. మనసు ఉపశమిస్తుంది!’ అన్నాడు. ఆ మాటలు అతని హృదయంలో ఆలోచనను రేకెత్తించాయి. ఇంటికి తిరిగి వచ్చి, భార్య ఇష్టపడే తోటలో కూర్చున్నాడు. అక్కడ ఒక వాడిపోయిన పువ్వు అతడి కనుల ముందే రాలి నేలపై పడింది. అతడు దాన్ని చేతిలోకి తీసుకుని మృదువుగా పలికాడు: ‘నువ్వు వచ్చావు, వెళ్లిపోయావు. కానీ నీ సువాసన మాత్రం మిగిలింది.’ఆ తరువాత అతడు ప్రతిరోజూ అశాశ్వత ధర్మం గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతని హృదయం తేలికైంది. భార్యను కోల్పోయిన బాధ తగ్గలేదు కానీ ఆమెను ప్రేమించిన శాంతి పెరిగింది. ‘అశాశ్వతత్వాన్ని అంగీకరించడం అంటే విడిచిపెట్టడం కాదు, మనసును విముక్తి చేయడం! అనుకున్నాడు. మహా భారతం, శాంతిపర్వంలోని ఈ పద్యం అతడికి జ్ఞాపకానికి వచ్చింది.'కం. భూతము లనిత్యములు, నీవీ తెరువెప్పుడును విం దహీన ధృతిన్ నీచేతోగతి నలవఱపుముభూతానిత్యత్వ మదియ పుచ్చును వగలన్'‘ప్రాణులన్నీ అశాశ్వతములే. ఈ ధర్మాన్ని గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నావు. కనుక, ధైర్యం నిండిన మనస్సుతో, ప్రాణములు అశాశ్వతాలనే ధర్మాన్ని అభ్యసించడం మొదలుపెట్టు.ఆ జ్ఞానమే అన్ని దుఃఖాలను పోగొట్టి మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది!’ అని తనవంటి వారి గురించే చెప్పినట్లున్న పై పద్యం భావాన్ని స్ఫురణకు తెచ్చుకున్నపుడు అతడిలోని దుఃఖం పూర్తిగా ఉపశమించి, మనసుశాంతిని పొందింది.– భట్టు వెంకటరావు -
గోవర్ధన తీర్థం: ఒకానొకప్పుడు జాబాలి అనే..
ఒకానొకప్పుడు జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు ఉండేవాడు. వ్యవసాయంలో పొలం దున్నడానికి నాగలికి జోడెద్దులను కట్టేవాడు. అతడు ఎడ్లను సరిగా చూసుకునేవాడు కాదు సరికదా, నీరసించిన ఆ ఎడ్లు వడి వడిగా పొలం దున్నలేకపోతే, చీటికి మాటికి వాటిని మునికోలతో కొడుతూ, పొడుస్తూ హింసించేవాడు. పాపం! నోరులేని ఆ మూగజీవాలు అతడు పెట్టే బాధలకు భరిస్తూ, లోలోన దుఃఖిస్తూనే పనిచేస్తుండేవి.ఒకనాడు గోమాత అయిన కామధేనువు ఆ ఎద్దుల బాధను చూసింది. వాటి బాధలకు కలత చెందింది. ఆమె నందీశ్వరుడి వద్దకు వెళ్లి, ఆ ఎద్దులు పడే బాధలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కామధేనువు ద్వారా అంతా విన్న నందీశ్వరుడు ఆ వృషభాలపై జాలి చెందాడు. తన ప్రభువైన పరమశివుని వద్దకు వెళ్లి, జాబాలి వద్దనున్న ఎద్దులు పడే బాధలు చెప్పాడు. ‘నందీ! నువ్వేమీ దిగులు చెందకు. ఈ విషయంలో నువ్వు తలచినది జరిగేలా వరమిస్తున్నాను. నీకు ఇష్టమైన రీతిలో నీ కోరిక నెరవేర్చుకో’ అన్నాడు పరమశివుడు.నందీశ్వరుడు వెంటనే ముల్లోకాలలో ఉన్న గోజాతిని సమావేశపరచాడు. ‘మీరెవ్వరూ ఇక్కడి నుంచి మరెక్కడికీ పోవద్దు. మీరు ఎవ్వరికీ కనిపించవద్దు’ అని ఆదేశించాడు.రోజులు గడుస్తున్నా, గోజాతి కనిపించకపోవడంతో ముల్లోకాలలోనూ గగ్గోలు మొదలైంది. దేవతలందరూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, మొరపెట్టుకున్నారు.‘బ్రహ్మదేవా! ఏమైందో ఏమో గోజాతి అంతా ఒక్కసారిగా మాయమైంది. ముల్లోకాలలోనూ ఒక గోవూ కనిపించడం లేదు. గోవులు లేకుండా ముల్లోకాలలో జనులు జీవించడమెలా?’ అని వాపోయారు.‘దేవతలారా! ఇందులో నేను చేయగలిగినదేమీ లేదు. మీరంతా పశుపతి అయిన పరమశివుని వద్దకు వెళ్లి ప్రార్థించండి. అతడే తరుణోపాయం చెప్పగలడు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.దేవతలంతా కైలాసానికి చేరుకున్నారు. పరమశివుని స్తుతించి, ముల్లోకాలలోనూ గోగణాలు కనిపించకుండా పోయిన సంగతిని విన్నవించుకున్నారు.‘గోగణాల సంగతి నాకేం తెలుసు? నా వాహనం నందీశ్వరుడిని అడగండి’ అని చిద్విలాసంగా చెప్పాడు పరమశివుడు.దేవతలు నందీశ్వరుడి వద్దకు వెళ్లారు.‘నందీశ్వరా! పరోపకారీ! దయచూపి, మాకు గోప్రదానం చేసి, లోకాలను రక్షించు’ అని వేడుకున్నారు.‘దేవతలారా! గోసంతతికి చెందిన వృషభాలను జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు బాధలు పెడుతున్నాడు. అందుకు ప్రతిగానే నేను గోగణాలను నా ఆశ్రయంలో ఉంచాను. మీరందరూ గోమతీ తీరానికి వెళ్లి, అక్కడ గోసవన యాగం చేయండి. గోహింసను పాపంగా ప్రకటించండి. అక్కడకు ముల్లోకాలకు చెందిన గోవులన్నీ వచ్చి, మిమ్మల్ని సంతుష్టులను చేస్తాయి’ అని పలికాడు.నందీశ్వరుడు చెప్పినట్లే దేవతలు గోమతీ తీరంలో గోసవన యాగం ప్రారంభించారు. యాగం మొదలైన కొద్దిసేపటిలోనే ముల్లోకాల గోగణాలన్నీ లెక్కకు మిక్కిలిగా అక్కడకు చేరుకున్నాయి. నేల ఈనినట్లు గోమతీ తీరమంతా ఎటు చూసినా గోగణాలతో కళకళలాడింది. దేవతలు, మానవులు ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. గోవులు తిరిగి కనిపించడంతో వారంతా పరమానందం చెందారు.దేవతలు చేపట్టిన గోసవన యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. నాటి నుంచి ముల్లోకాలలోను గోవులకు పూజ్యత హెచ్చింది. దేవతలు గోసవన యాగం చేపట్టిన ప్రదేశం గోవర్ధన తీర్థంగా ప్రసిద్ధి పొందింది.పురావిశేషం..ఈశాన్య రాష్ట్రాల్లోని అరుదైన పురాతన దేవాలయాల్లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని మహాబలి ఆలయం ఒకటి. దీనిని క్రీస్తుశకం 1725లో నాటి రాజు గరీబ్ నివాజ్ నిర్మించాడు. అతడిని స్థానికంగా ‘మహారాజా పామ్హీబా’ అని పిలుస్తారు. అప్పట్లో మణిపూర్‌లోని సన్యాసి శాంతిదాస్ గోసాయి బోధనలకు ఆకర్షితుడైన గరీబ్ నివాజ్, ఆయన వద్ద రాముడిని ఆరాధించే ‘రామానంది’ మతాన్ని స్వీకరించాడు. రామదూత హనుమంతుడు మూలవిరాట్టుగా ‘మహాబలి’ ఆలయాన్ని ఇంఫాల్ నది ఒడ్డున నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం బెంగాలీ ‘దో–చాలా’ శైలిలో ఉంటుంది. ఆలయ గర్భగుడిలోని హనుమంతుడి విగ్రహం నృత్యభంగిమలో ఉండటం విశేషం. గరీబ్ నివాజ్ మరణానంతరం మణిపూర్‌లో రామానంది మతం కనుమరుగై, గౌడీయ వైష్ణవం ప్రాబల్యం పుంజుకుంది. ఈ ఆలయంలో ఏటా హనుమజ్జయంతి, దీపావళి, హోలీ వేడుకలు విశేషంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
ప్రతిభకు పట్టం
భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్‌గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్ఆర్ నాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్లకు విలువైన పాఠం.– డా. బాలాజీ దీక్షితులు పి.వి. -
మానవీయతే ఇస్లాం హృదయం
ఇస్లాం ధర్మం కేవలం కొన్ని ఆరాధనల సమాహారం కాదు; అది పరస్పర ప్రేమ, కరుణ, మాన వీయ విలువలతో కూడిన సంపూర్ణ జీవన విధానం. ‘భూమిపై ఉన్నవారి పట్ల మీరు దయ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు (సృష్టికర్త) మీ పట్ల దయ చూపుతాడు’ అనే ప్రవక్త (స) వారి బోధన ఇస్లామీయ మానవీయ దృక్పథానికి అద్దం పడుతుంది.ఒకరి కష్టాన్ని చూసి చలించి పోవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథలను ఆదరించడం, తోటి మనిషిని చిరునవ్వుతో పలకరించడం కూడా ఇస్లాంలో పుణ్యకార్యం (సదఖా)గా పరిగణించబడుతుంది. నిజమైన విశ్వాసం అనేది తోటి మనుషులకు మేలు చేయడంలోనే దాగి ఉందనేది ఇస్లాం అంతరార్థం. తన పొరుగువాడు ఆకలితో అలమటిస్తుంటే, తాను మాత్రం తృప్తిగా భుజించేవాడు నిజమైన విశ్వాసి కాదనే హెచ్చరిక సమాజం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుంది.హృదయాలను ముక్కలు చేయడం కాదు, గాయపడిన హృద యాలను ఆప్యాయతతో కలపడమే ఇస్లాం నేర్పిన జీవన విధానం. మనుషుల మధ్య ద్వేషాన్ని తుడిచేసి, క్షమా గుణాన్ని, సహనాన్ని అలవర్చుకున్నప్పుడే ఒక మనిషి సృష్టికర్తకు అత్యంత ప్రియమైనవాడిగా మారతాడు. సృష్టిలోని ప్రాణులన్నిటినీ ప్రేమిస్తేనే దైవాన్ని ప్రేమించినవారమవుతామనే ఉదాత్త సందేశం ఇస్లామీయ జీవన విధానంలో ప్రతిధ్వనిస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
ప్రత్యామ్నాయంలేని ప్రేమ యాత్రలు
దేవుని వరమైన మెస్సీయాను, ఆ మెస్సీయ అనబడే క్రీస్తుకు ప్రత్యామ్నాయంగా ఎవరిని ఊహించనైనా ఊహించలేము. ప్రేమకు ప్రతిరూపం అయినా ఆయన ప్రేమయాత్రలకు కూడా ప్రత్యామ్నాయాలు కనుగొనలేము. యేసు జీవితాన్ని ఆయన ప్రేమ సంబంధ పాదయాత్రలను వేరు చేసి ఎన్నడూ చూడలేము. తల్లిదండ్రులకు లోబడుతూ పెద్దలైన మనుష్యులు దయయందును, దేవుని దయయందును వర్ధిల్లిన బాల్యజీవితం యేసుది.బాలయేసు కార్టూన్ చిత్రాలలో ఆయన పాత్ర తీరుతెన్నులు ఆకాశంలో విహరించక పిల్లలను నైతిక విలువలతో అలరించడమే కాక పెద్దల పర్యవేక్షణలో సత్ప్రవర్తనతో మెలిగేలా ్రపోత్సహించడం విశేషం. అన్ని భాషల్లోని నవలా నాయకులు లేదా సినిమా, టీవీ కథానాయకుల (ప్రోటోగనిస్ట్స్) పాత్రల సృష్టిలో, ఈనాటి నేటి ఏఐ ఆధారిత వీడియోల ముఖ్య ప్రధాన పాత్రలలో వాటి ఉన్నతమైన వైవిధ్య విధాన రూపకల్పనలలో, మరి ముఖ్యంగా ‘హీరోహోదా’ కోసం యేసు జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన బోధలు, మాటలను పోరాటపటిమ స్ఫూర్తిని వాడుతూ డబ్బు చేసుకుంటున్న నిర్మాతలకు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి కొదువలేదు.వ్యక్తి పూజకు చోటిచ్చేలా సంతోషానందాలు ఇవే అనుకొనే భ్రమలలోనే అమాయక యువత చిక్కుకొని తమ విలువైన సమయం వెచ్చిస్తూ వినోదం కొనుక్కొనే వేళలలోనే ఇట్టి నయా ప్రేక్షకులను తెరనాయకులు థియేటర్లలో ఆకస్మికంగా వారిని దర్శించడం కంటె కూడా... బాధితులను, రోగులను, బీదలను, వృద్ధులను, నిరుపేద విద్యార్థులను ఆదుకొనేలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరామర్శించటం ఆదరించడం నిజమైన నాయకుల సహజ స్వాభావిక దైవిక లక్షణంగా అది ఎంచదగ్గదే. మేలైన రీతులలో వారిని గుర్తించదగ్గదే. ఎక్కడో మారుమూల పల్లెలతో పాటుగానే, నిలువనీడ లేనివారై ΄÷ట్ట చేతపట్టుకొని వచ్చి నగరాలను నిర్మించే వలస కార్మిక శ్రమజీవులు ఎక్కడున్నా వారి గుడారాల చెంతనే వారిని పరామర్శిస్తూ వారికి న్యాయసంబంధ సేవలందించడం క్షేత్రస్థాయి పర్యటనే.నిజానికి బీదలు, రోగులు, ఖైదీలను దైవిక ప్రేమతో పరామర్శించి వారికి ధైర్యం నూరిపోస్తే ఇలా క్రియరూపాన ఆ గొప్పదైన ప్రేమను అంతటా కనబరిస్తే మీరు నన్నే ప్రేమించినట్టు అని యేసే స్వయంగా చెప్పడం విశేషం. గొప్ప గొప్ప నాయకులకే చెల్లును పాదయాత్రలు అంటూ అవి వారికే పరిమితం చేయక ఇలా ఎవరికి వారు అనుకోక వ్యక్తుల మేలు కోరి వ్యక్తిగతంగా దూర భారాలను లెక్కచేయక యేసును బట్టి యేసు ప్రేమతో యేసు మెప్పు పొందేలా ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చు.భవిష్యద్దర్శనం వాస్తవంలోనే నిలబెట్టి గెలిపిస్తుంది. కలల్లో ఊహల్లో సంచరిస్తూ గాల్లోతేలియాడడం కాక నేలమీదనే హుందాగా నిలబడడం నాయకత్వం. నడక నాయకత్వ లక్షణం కూడానూ. సకాలంలో స్పందించేలా నేరుగా వచ్చి అతి దగ్గరగా సమస్యలను వాటి ప్రభావ విపత్తులను చూసేలా వాటి పరిష్కారం కొరకు అవిశ్రాంతంగా కృషి చేసేలా ఇలా సామాన్య జనంబాట పడుతూ దీనజనుల పరామర్శకు, బాధితుల ఓదార్పుకు నాయకుడనేవాడు తన పాదాలను నమ్ముకోవడం ఎప్పుడూ ఉత్తమమే. ఇలాంటి వీరే యేసువలె విజయ సృష్టికర్తలుగా, తిరుగులేని నాయకులుగా చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకోగలుగుతారు.– జేతమ్ -
ప్రకృతి గుండె చప్పుడు విందాం
మన్హా.. పదేళ్ల పసిపాప. ఆమెకు అడవి అంటే కేవలం చెట్లు కాదు, అది ఆమె ప్రాణ స్నేహితురాలు. తన చిన్నారి చేతులతో అల్లిన వెదురు బుట్టలో సేకరించిన విత్తనాలను తీసుకుని ఆమె అరణ్యంలోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ ఆమె రాకను గమనించిన పక్షులు, ఒకదానికొకటి వార్తను పంచుకుంటూ ఆమె చుట్టూ వందలాదిగా చేరేవి. అవి ఆమె భుజాల మీద, తల మీద వాలుతూ ఒక అపురూపమైన ఆత్మీయతను పంచేవి. మన్హా విత్తనాలను నేలపై చల్లుతుంటే, అవి ముత్యాలను ఏరుకున్నట్లు గింజలను ఏరుకుంటూ చేసే ఆ ‘కిలకిలలు’ ఆమె ప్రపంచానికి సంగీతం.కానీ ఆ రోజు, ఆమె అడుగుల చప్పుడు తప్ప అడవిలో మరే శబ్దమూ లేదు. ఆకాశం నీలి రంగును కోల్పోయి, ఏదో తెల్లని పొగమంచులాంటి దుమ్ముతో నిండిపోయింది. ఆమె పరుగు పరుగున తన అభిమాన రావి చెట్టు దగ్గరకు వెళ్లింది. వందలాది ఏళ్ల చరిత్ర కలిగిన ఆ వృక్షం, ఇప్పుడు ఒక అస్థిపంజరంలా కనిపిస్తోంది. దాని ఆకులన్నీ రాలిపోయి, ఆ కొమ్మలు ఆకాశం వైపు చూస్తూ, ‘నన్ను కాపాడండి’ అని అర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. ‘నా స్నేహితులు ఏమయ్యారు? ఆ చిన్న పిచ్చుకమ్మ ఏది? నీలి రంగు రెక్కల పిట్ట ఏమైంది?’ అని మన్హా ఆ చెట్టును తాకుతూ వెక్కి వెక్కి ఏడ్చింది.అక్కడే ఒక బండరాయిపై కూర్చున్న వృద్ధ కాపరి, తన చిరిగిన కంబళిని సరిచేసుకుంటూ కన్నీరు నిండిన కళ్లతో అన్నాడు.. ‘అమ్మాయి.. అవి ఇక రావు. ఈ గాలిలో విషం ఉంది. మనం చేస్తున్న గనుల తవ్వకాలు, ఆ యంత్రాల కర్కశపు శబ్దాలు, పర్వతాలను పగులగొడుతున్న బాంబుల మోతలు.. ఆ సున్నితమైన జీవాలు భరించ లేకపోయాయి. చెట్టుప్రాణం పోయింది, పిట్ట రెక్క విరిగిపోయింది. మనిషి తన కడుపు నింపుకోవడానికి ఈ అడవి తల్లి కడుపును కోసేస్తున్నాడు’.మన్హాకు ఆ మాటలు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె చేతిలోని విత్తనాలు నేలపై జారిపోయాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడే అడవి, ఇప్పుడు ఒక ఎండిన ఎడారిలా ఆమె కళ్ల ముందు కనిపిస్తోంది.ఈ చిత్రం కేవలం ఒక ఊరుకో, ఒక అడవికో పరిమితం కాదు. భూమికి ఒక వైపున, మంచు ఖండాలు కన్నీరులా కరిగి సముద్రంలో కలిసిపోతున్నాయి. బంగారం, బొగ్గు, చమురు.. ఇవి మనిషికి సంపద కావచ్చు, కానీ ప్రకృతికి అవిప్రాణాధారాలు. మనిషి తన స్వార్థంతో ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుంటే, భూమి ఇప్పుడు అల్లాడిపోతోంది. ఊపిరి అందని నగరాలు, పంటల్లేని పొలాలు, అకాల వరదలు, అంతుచిక్కని వ్యాధులు.. ఇవన్నీ భూమి తల్లి పెడుతున్న కేకలు! కానీ.. ఈ విషాదంలోనూ ఒక చిన్న ఆశ మిగిలి ఉంది.మరుసటి రోజు కూడా మన్హా నిరాశ చెందలేదు. తన కళ్లను తుడుచుకుని, మళ్లీ బుట్ట నిండా విత్తనాలు నింపుకుని అడవికి వెళ్ళింది. పక్షులు లేవని ఆమెకు తెలుసు, కానీ అవి వస్తాయన్న నమ్మకం ఆమెది. అకస్మాత్తుగా, ఎండిపోయిన ఒక కొమ్మ చివర నుండి ఒక సన్నని గొంతు వినిపించింది. అది ఆమెకు బాగా తెలిసిన ఆ చిన్న పిచ్చుక! అది నీరసంగా ఉన్నా, మన్హా వైపు చూస్తూ రెక్కలు ఆడిస్తోంది.ఆ ఒక్క పక్షి మన్హాకు ఒక గొప్ప సత్యాన్ని బోధించింది: ‘నువ్వు ఒక్క అడుగు ముందుకేసి ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టు, నేను మళ్లీప్రాణం పోసుకుంటాను.‘ మన్హా నాటుతున్న ఆ చిన్న విత్తనం రేపు ఒక మహావృక్షం కావాలి. మనందరిలోనూ ఆ మన్హా మేల్కొనాలి. లేదంటే, ప్రకృతి లేని ప్రపంచంలో మనిషి కూడా ఒక శిలాజంలా మిగిలి పోవాల్సి వస్తుంది.– ముహమ్మద్ ముజాహిద్ -
వారాహి గుప్త నవరాత్రులంటే ఏమిటి?
నేటి ఆధునిక సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు కుటుంబ కలహాలు, అనారోగ్యం. వాటితోపాటు న్యాయపరమైన, ఆర్థిక పరమైన ఇబ్బందులు, శత్రు బాధలు సర్వసాధారణం అయిపోయాయి. ఇటువంటి సమస్యలు వారాహి దేవి ఆరాధనతో తొలగిపోతాయని, ముఖ్యంగా వారాహి దేవిని ఆరాధిస్తే శత్రు బాధలు తొలగిపోతాయని, మన ససమ్యలన్నింటికీ అమ్మ అద్భుతమైన పరిష్కారం చూపెడుతుందనీ నమ్మకం. శక్తి దేవతల ఆరాధనకు ప్రసిద్ధి చెందిన విశిష్టమైన కాలం ఆషాఢ నవరాత్రులు. ఈ ఏడాది వారాహి గుప్త నవరాత్రులు బుధవారంప్రారంభం అయ్యాయి. ఈ నవరాత్రుల్లో ఆచరించాల్సిన విధివిధానాలేమిటో తెలుసుకుందాం.తెలుగు పంచాంగం ప్రకారం వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి, నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది జూలై 15, బుధవారం ప్రారంభమయ్యాయి. 23, గురువారం వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ పవిత్ర దినాలలో శ్రీ వారాహి అమ్మని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మ అనుగ్రహంతో కష్టాలనుంచి, చిక్కుల నుంచి బయట పడవచ్చునని శక్తి ఉపాసకులు చెబుతారు.గుప్త నవరాత్రులంటే ఏమిటి? ’గుప్త’ అంటే రహస్యం. ఈ నవరాత్రులలో అమ్మవారిని రహస్యంగా, నిష్టతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే వారాహి నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రులని కూడా అంటారు.వారాహి దేవి ఎవరు?లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని అభివర్ణిస్తారు. సప్త మాతృకలలో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారు అత్యంత శక్తిమంతమైన రూపం. ఈమె పరమేశ్వరుడి అనుగ్రహంతో అంధకాసుర సంహారం కోసం అవతరించినట్లు దేవీ పురాణం చెబుతోంది.పూజా విధానంవారాహి గుప్త నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు. ప్రతిరోజు సూర్యాస్తమయం తరువాత రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య వారాహి దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని దేవి పురాణం చెబుతోంది. సూర్యాస్తమయం తరువాత శుచిగా స్నానం ఆచరించి అమ్మవారి రూపాన్ని ప్రతిష్టించి మనసులో సంకల్పం చెప్పుకుని 9 రోజుల దీక్ష తీసుకోవాలి. వారాహి అమ్మ వారి విగ్రహం లేదా పటాన్ని పీఠంపై ప్రతిష్టించాలి.నైవేద్యాలు... దాన ధర్మాలుప్రతిరోజు ఒకే సమయానికి పూజ చేయాలి. అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. వారాహి అమ్మవారికి నైవేద్యంగా తీపి పదార్థాలు, పానకం, శనగలు, పాయసం వంటివి సమర్పించవచ్చు. ముఖ్యంగా బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. తర్వాత ప్రశాంతమైన మనస్సుతో వారాహి మూల మంత్రాలు జపించాలి. వారాహి అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేయాలి. చివర్లో ధూప దీప నైవేద్యాల తర్వాత హారతిచ్చి పూజను ముగించాలి. అలాగే ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతారు.పూజాఫలం ఏమిటి? భక్తిశ్రద్ధలతో వారాహి గుప్త నవరాత్రుల వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని విశ్వాసం. అంతేకాదు, వారాహి దేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయడం వలన మనం చేసే పనుల్లో అభివద్ధి కలిగి, సమాజంలో కీర్తి, గుర్తింపు పొందవచ్చు. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయ కేతనం ఎగుర వేయాలంటే వారాహి దేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు చెబుతున్నారు.రూపం ఉగ్రం... మానసం శాంతంవారాహి దేవి ఉగ్రంగా కనబడినప్పటికి తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ఈ ఆషాఢంలో వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, దృష్టి దోషాలు తొలగిపోతాయని, శత్రు పీడలు ఉండవని భక్తుల విశ్వాసం.క్షేత్ర పాలికగా వారాహీ దేవిసాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్ర పాలకుడిగా పరమశివుడు ఉండడం మనకు తెలుసు. కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహిదేవి అవతరించి ఉంది. కాశీ పట్టణంలో అమ్మవారు నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే ఆరు చేతులు శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. కాశీకి మాత్రమే కాదు తంజావూరులో బహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహిదేవియే క్షేత్రపాలిక. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవీ ఉపాసకులు అంటారు.ఈ వారాహి నవరాత్రులలో మనం కూడా వారాహి దేవిని 9 రోజులపాటు పూజించి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు పొందుదాం.– ఎం. శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం -
జగన్నాయకుడి జనయాత్ర
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, పూజనీయమైన హిందూ పండుగలలో ఒకటి జగన్నాథ రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఆలయంలో కొలువై ఉన్న మూలమూర్తులు ముగ్గురూ ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తులను కలుసుకోవడానికి వెళతారు. ఈ రథయాత్రలో పాల్గొనడం, దానిని వీక్షించడం అనంతమైన పుణ్యఫలాలను చేకూరుస్తుందని ఆ గ్రంథాలు నొక్కి చెబుతున్నాయి.జగన్నాథ రథయాత్ర కేవలం పూరీకే పరిమితం కాదు. నేడు ఇది ఒక ప్రపంచవ్యాప్త వేడుకగా మారింది. పూరీ ప్రధాన కేంద్రం అయినప్పటికీ, ఈ ఉత్సవం ఇప్పుడు భారతదేశంలోని అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, లండన్, న్యూయార్క్, టొరంటో, సిడ్నీ వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇతర నగరాలలో కూడా జరుపుకుంటారు.రథయాత్ర రోజు తెల్లవారుజాము నుండి పూరీ నగరం మొత్తం భక్తిజనంతో నిండి΄ోతుంది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ముందుగా దేవతా విగ్రహాలను పహండి అనే ఆచారంతో గుడి నుండి బయటకు తీసుకువచ్చి రథాలపై అధిష్టింపజేస్తారు. అప్పుడు శంఖారావాలు, మేళాలు, జయజయ ధ్వానాలతో ఆప్రాంతమంతా మారుమోగుతుంది.ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన రథం ఉంటుంది. జగన్నాథుని రథం పేరు నందిఘోష. ఇది ఎరుపు, పసుపు రంగులలో ఉంటుంది. దీనికి 16 పెద్ద చక్రాలు ఉంటాయి. బలభద్రుని రథం పేరు తాళధ్వజ. ఇది ఆకుపచ్చ, ఎరుపు రంగుల లో ఉంటుంది. దీనికి 14 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు దర్పదలన లేదా దేవదలన. ఇది నలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. దీనికి 12 చక్రాలు ఉంటాయి. ఈ రథాలు చూడటానికి ఎంతో వైభవంగా ఉంటాయి.జగన్నాథ రథయాత్ర మనకు నేర్పే గొప్ప పాఠం సమానత్వం, కరుణ, భక్తి. జగన్నాథుడు భక్తులను కలుసుకోవడానికి స్వయంగా గుడి నుండి బయటకు వస్తారు. రాజు కూడా బంగారు చీపురుతో సేవ చేస్తారు. అందరూ కలిసి ఒకే తాడు లాగుతారు. ఇక్కడ చిన్న పెద్ద, పేద గొప్ప అనే తేడా ఉండదు. అందరూ ‘జై జగన్నాథ్’ అనే ఒక్క నామంతో ఒక్కటవుతారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత సమ్మిళితమైన హిందూ ఉత్సవం. రథాలను లాగడంప్రారంభించే ముందు ఒక అత్యంత ముఖ్యమైన ఆచారం జరుగుతుంది. దానిపేరు ఛేరా పహారా. జగన్నాథుని ముఖ్యసేవకుడిగా భావించే పూరీ గజపతిరాజు ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. రాజు బంగారు చీపురును చేతిలో పట్టుకుని చం దనం నీటిని చల్లుతూ మూడు రథాల వేదికలను స్వయంగా ఊడుస్తారు. తర్వాత రథాల చుట్టూ ప్రదక్షిణ చేసి దీపం వెలిగిస్తారు. ఛేరా పహారా తర్వాత ప్రధాన పండా ‘జై జగన్నాథ్’ అని గట్టిగా నినాదం ఇస్తారు. వెంటనే వేలాదిమంది భక్తులు తాళ్లను పట్టుకుని రథాలను లాగడం మొదలుపెడతారు. మొదట బలభద్రుని రథం, తర్వాత సుభద్రాదేవి రథం, చివరగా జగన్నాథుని నందిఘోష రథం కదులుతుంది.ఈ రథాలు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వెళతాయి. ఇది జగన్నాథుని మేనత్తగారి ఇల్లని నమ్ముతారు. అక్కడ తొమ్మిది రోజుల పాటు దేవతలు విడిది చేస్తారు. ఈ తొమ్మిది రోజులు భక్తులు స్వామిని అక్కడే దర్శించుకుంటారు. గుండిచా ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు.తొమ్మిది రోజుల తర్వాత దేవతలు తిరిగి తమ ప్రధాన ఆలయానికి వస్తారు. ఈ తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర అంటారు. బహుదా యాత్ర తర్వాత 11వ రోజు సునావేశం అనే వేడుక జరుగుతుంది. ఈ రోజు దేవతలను బంగారు ఆభరణాలు, బంగారు కిరీటాలు, బంగారు చేతులు, బంగారు కాళ్ళతో అలంకరిస్తారు. చివరగా 12వ రోజు నీలాద్రి విజయం అనే ఆచారంతో దేవతలు తిరిగి గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. దానితో రథయాత్ర ముగుస్తుంది. – కుందా శ్రీ కృష్ణ శాస్త్రి -
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా..
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా మంచి ప్రవర్తనతో, దైవచింతనతో జీవితం గడపాలనుకొనేవారు శుద్ధమైన ఆహారమే తీసుకోవాలి. ప్రేమ, దయ, దాక్షిణ్యం, కోపం లేకుండటం, ఉపకార బుద్ధి, ఇతరుల సుఖదుఃఖాలను తనవిగా భావించే గుణం వంటి గుణాలన్నీ సాత్త్విక గుణాలు. ఇవి శుద్ధమైన ఆహారం తీసుకోవటం వల్లనే కలుగుతాయి. దేశ కాల ప్రాంతాలకు అనుకూలంగా భోజనం చేయాలని శాస్త్ర వచనం.భీష్మాచార్యులవారు అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యమీద పడుకొన్నాడు. వైకుంఠ గమనానికి వేచి ఉన్నాడు. ఆయన చేసిన బోధలను పాండవులందరూ శ్రద్ధగా విన్నారు. ఆ సమయంలో దూరం నుండి వింటున్న ద్రౌపదీ దేవి నవ్వింది. తన మాటలు విని నవ్వినందుకు భీష్ముని మనస్సు బాధపడింది. కారణం తెలియగోరాడు. ద్రౌపది వినయంగా విన్నవించింది. ‘అయ్యా! మీరు మాకెప్పడూ ధర్మ ప్రబోధం చేయవలసినవారే. ఇప్పుడు నా నవ్వుకు కారణం మాత్రం వేరే ఉంది. మరేమీ లేదు. ఆనాడు నిండు కౌరవసభలో అందరూ చూస్తుండగా దుశ్శాసనుడు నాకు వస్త్రాపహరణం చేశాడు. అప్పుడా సభలో మీరు కూడా ఉన్నారు. కాని ఇది అకృత్యమని మీరెవరికీ బుద్ధి చెప్పలేదు. పోనీ ఆ దుష్కృత్యాన్ని చూడలేక అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళనూ లేదు. అదీ కాకపోతే రెండు కళ్ళు మూసుకొనవచ్చు కదా! అదీ చేయలేదు మీరు. అలాంటి మీకిప్పుడు ఈ ధర్మప్రబోధం చేయాలనే బుద్ధి యెలా పొడమింది? అని సందేహం కలిగి నవ్వాను’.‘అమ్మా! ద్రౌపదీదేవీ! నీకు సందేహం రావలసినదే తల్లీ! నిన్న మొన్నటివరకు నేను కౌరవుల పక్షంలోనే ఉన్నాను కదా! వారి ఉప్పు తిన్నవాడనయ్యాను. వారి ఆహార ప్రభావం వల్ల వాళ్ళ మాటలే చెవికెక్కాయి. నేను గాంగేయుడను. తిరిగి నా తల్లి గంగతోనే పవిత్రుడను కావాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు తన బాణంతో పాతాళం నుంచి పరమ పవిత్రమైన గంగాజలాన్ని పైకి తెప్పించాడు. దాని ప్రభావంతో లోగడ కోల్పోయిన సాత్త్విక భావన తిరిగి వచ్చింది తల్లీ!’ అని చెప్పాడు. ‘ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః సత్త్వ శుద్ధౌ ధ్రువామతిః’- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
రేపటి నుంచే 'వారాహి గుప్త నవరాత్రులు'.. పూర్తి పూజా విధానం ఇదిగో
సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు రేపటి నుంచి (జూలై 15, బుధవారం) వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటి నుంచి ప్రారంభమై జూలై 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా సాగనున్నాయి.లలితా త్రిపురసుందరి దేవి మహా సైన్యాధిపతి అయిన వారాహి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు నిష్ఠతో, గుప్తంగా ఆరాధిస్తే సమస్త నరఘోషలు, శత్రుపీడలు, అప్పుల బాధలు తొలగిపోతాయని దేవీ భాగవతం చెబుతోంది. భక్తులు ఈ పవిత్ర దినాలలో ప్రతిరోజూ పూజ గదిని శుభ్రం చేసుకుని, ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి, అమ్మవారి మూల మంత్రాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన బెల్లం పానకం, శనగలు, పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
వారాహి దేవి పూజలో ఈ రహస్య నియమాలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహం ఖాయం
-
అనుగ్రహం అవసరం!
సురాసురులు కలిసి కష్టించి, ఎన్నెన్నో మహత్తరమైన అవరోధాలనూ, విఘ్నాలనూ అధిగమించి, ఎట్టకేలకు అమృతం సాధించారు. ధన్వంతరి అందించిన అమృత కలశాన్ని తటాలున అందుకొని, అసురులు అన్యాయంగా స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికప్పుడు శ్రీహరి మోహినీ అవతారాన్ని ఎత్తి, వాళ్ళను కామ మోహితులను చేశాడు. ఆ మోహంతో వాళ్ళు అందరికీ అమృతం పంచే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆమె దాన్ని ఎలా పంచినా, తాము అడ్డుపడమని ఒప్పందం చేసుకొన్నారు.మోహిని అమృతాన్ని మొదట దేవతల పంక్తికి పంచటం పూర్తయేసరికి, పాత్ర ఖాళీ అయిపోయింది. ఆమె అంతర్ధానమై పోయింది. రాక్షసులకు ఏమీ మిగలలేదు. రాహువు అనే రాక్షసుడు మాత్రం, మారువేషంలో దేవతల పంక్తిలో చేరి, అమృతం పుచ్చుకొన్నాడు. సూర్యచంద్రులు ఇది గమనించి చెప్పగానే, సుదర్శన చక్రం రివ్వున వచ్చి, పుచ్చుకొన్న అమృతం నాలుక దాటకుండానే, రాహువు తలను నరికి వేసింది. అమృత ప్రభావం వల్ల అతడి తల సజీవంగా మిగిలిపోయింది. అమృత స్పర్శ లేని మొండెం పతనమై నశించింది. (అప్పటి నుంచి ‘రాహువు తల’ అనేది ప్రత్యేకంగా లేదు. రాహువు అంటేనే రాహువు తల. కాబట్టి ‘రాహు మస్తకం’ అని చెప్పనక్కర్లేదు. చెప్తే అది, ‘సీతా ఫలం పండు’, ‘పేపరు కాగితం’ అన్నట్టు పునరుక్తి అవుతుంది!)దేవాసురులు ఒకే పరిస్థితులలో, ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, ఒకే సాధన సామగ్రితో, ఒకే విధమైన శ్రమను, ఒకే సంకల్పంతో చేశారు. కానీ వాళ్ళకు లభించిన ఫలంలో మాత్రం తేడాలు వచ్చాయి. ఏవం సురాసుర గణాః సమ దేశ, కాల,/ హేతు–అర్థ, కర్మ, మతయః–అపి, ఫలే వికల్పాః. ఎలాంటి తేడాలు? తత్ర అమృతం సురగణాః ఫలం–అంజనా–ఆపుః, నదైత్యాః – అక్కడ సురగణాలు అమృతం అనే ఫలాన్ని సులభంగా పొందారు, దైత్యులు పొందలేదు. కారణమేమిటి? పాద పంకజ రజ–ఆశ్రయాత్– శ్రీహరి పదకమలాల ధూళిని (దేవతలు) ఆశ్ర యించి, సేవించటం వల్ల. హరి విముఖులు కనక అసురుల శ్రమ నిష్ఫలమైంది. శ్రమకు దైవానుగ్రహం తోడయి తేనే ఫల ప్రాప్తి ఉంటుంది, అంటుంది భాగవతం.– ఎం.మారుతి శాస్త్రి -
మార్గదర్శకమైన యాత్ర
ఒకడు మంచిగా ప్రవర్తించాలంటే, ఈ సమాజానికి ఉన్నత విధానాలలో మేలు చేయాలంటే, ఏదో ఒకచోట ఎక్కడో ఒక సందర్భంలో యేసును అనుకరించి అనుసరించక తప్పదు అనేంతగా యేసు జీవితాన్ని అసాధారణరీతిలో స్ఫూర్తివంతంగా సర్వమానవాళి ముందుపెట్టాడు ఆ మహాదేవుడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే, నిరంతరం అనుక్షణం తండ్రియైన దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవునికి అనుకూలంగా ఆమోదయోగ్యంగా జీవించినందు వల్లే యేసు జీవితం యావత్తూ అంగీకరించబడి మానవాళికి గొప్ప మార్గదర్శకంగా ఉందన టంలో ఎలాంటి సందేహం లేదు.యేసు ఒక్క ఆధ్యాత్మికరంగానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు. అన్ని రంగాల వారికి యేసు ఒక గొప్ప అరుదైన స్ఫూర్తిదాయకం. ప్రజాసేవకు అంకితమై సమర్పణ జీవితంతో నిరంతరం ప్రజల గూర్చే ఆలోచిస్తూ ప్రజలకు మేలు చేయాలనే తెగింపుగల నాయకులకు, పోరాట యోధులకు యేసే గొప్ప దిక్సూచి. అబద్దపు వాగ్దానాలు చేయక, ఊసరవెల్లి వేషాలు వేయక, అసత్య ప్రచారాల జోలికిపోక నమ్మకమైన నీతివంతమైన రాజకీయాలు చేసే వారికి కూడా యేసే ఆదర్శం. రాజకీయ నాయకులు లేదా పార్టీలు ఎన్నికల ప్రచారం ద్వారా ప్రజలను ఆకట్టుకుని విజయం సాధించితీరాలనే తపనతో అట్టి గురి కలిగి చేసే పాదయాత్రలను పర్యటనలను కూడా జైత్రయాత్రగా అభివర్ణిస్తారు.ఆధ్యాత్మిక నాయకులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు, ఆరోగ్య పరిరక్షకులు, న్యాయవాదులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకులు, రచయితలు, కళాకారులు, చిత్రకారులు, దర్శకులు, జవానులు, కిసానులు, వ్యాపారవేత్తలు, భవిష్యద్దర్శకులు (విజనరీస్), వ్యక్తిత్వవికాస నిపుణులు, మార్గదర్శకులు, పరిశోధకులు, బోధకులు, జ్ఞానులు, వద్ధులు, చివరకు శత్రువులు ఇట్టి వారు ఎవరైనా ఎంతటి వారైనా యేసును, ఆయన జీవిత స్ఫూర్తిని ప్రత్యక్షంగా వెంటాడక తప్పదు. లేకుంటే వారికి మేలైన సారవంతమైన జీవితమే లేదు. వారి ఉనికే ప్రశ్నార్ధకం కూడా? తమకు తెలియకుండానే యేసును పరోక్షంగా అనుసరించేవారు ఎందరెందరో ఉన్నారనేది లెక్కేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదే గొప్పదైన యేసు జైత్రయాత్ర సంబంధిత జయ జీవితం.– జేతమ్ -
అత్యంత విశిష్టమైన ఏకాదశి
హిందూ సంప్రదాయంలో ఏకాదశిది ఎంతో విశిష్ట స్థానం. వాటిలో జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని మరింత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుతోపాటు మహాలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ఉపవాసం, పూజలు, జపం, దానం వంటి ధార్మిక కార్యాలను ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు పేర్కొంటాయి.ఈ వ్రతం వేలాదిమందికి అన్నదానం చేసినంత ఫలాన్నిస్తుందని ప్రతీతి. తులసిని‘హరిప్రియ’గా పిలుస్తారు. అంటే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మొక్క. అందుకే తులసి లేకుండా విష్ణుపూజ అసంపూర్ణమని సంప్రదాయం చెబుతోంది. యోగిని ఏకాదశి రోజున తులసిని భక్తితో పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, సానుకూల వాతావరణం పెరుగుతాయని విశ్వాసం. -
యద్భావం తద్భవతి: మనసులో మంచి భావనలు ఉంటే అంతా..
‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’ ప్రాపంచిక బంధాలలో చిక్కుకోవడానికిగానీ, వాటినుండి విడుదల పొందడానికి కానీ; మన సు ఖానికిగానీ, దుఃఖానికి కానీ; అభ్యున్నతికిగానీ, పతనానికి కానీ – ఇలా దేనికైనా మన మనసు, అందులో ఎగిసిపడే ఆలోచనలే కారణాలని చెబుతూ శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరోజు తమ శిష్యులకు మనిషి మనసులోని కోరికలు, ఆశలు అతనిని ఎలా పతనం చేస్తాయో వివరించడానికి ఈ కథను చెప్పారు.ఒక వర్తకుడు వ్యా΄ార నిమిత్తం తన గ్రామం నుండి పట్టణానికి నడిచి వెడుతున్నాడు. ఆ కాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పటిలాగా రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు కాబట్టి తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం దాకా నడిచేసరికి బాగా అలసిపోయాడు. మరొక నాలుగైదు గంటలు నడిస్తే కానీ గమ్యం చేరలేడు. కనుక ఎక్కడైనా తగిన చోటు దొరికితే కాసేపు ఆగి బడలిక తీర్చుకొందామనుకొన్నాడు. అతని అదృష్టం కొద్దీ ఒక పెద్ద చెట్టు, దాని చుట్టూ అరుగు కనిపించాయి. పరమానందంగా ఆ చెట్టు నీడన ఆ అరుగుపై కాళ్ళు చాచి పడుకొన్నాడు.చల్లగా వీస్తున్న గాలి అతని మార్గాయాసాన్ని కాస్త ఉపశమింపజేసింది. అప్పుడతనికి తన దాహం తెలిసింది. ‘తాగడానికి నీరు లభిస్తే ఎంత బాగుంటుందో’ అనుకొన్నాడు. వెంటనే అతని పక్కన ఒక ΄ాత్రలో చల్లని నీరు ప్రత్యక్షమైంది. ఆశ్చర్యపోతూ అమృత తుల్యంగా ఉన్న ఆ నీటిని తాగి దాహం తీర్చుకొన్నాడు. దాహం తీరగానే అతని మనసు భోజనం పైకి మళ్ళింది. ‘బాగా ఆకలి వేస్తోంది. తినడానికి మంచి భోజనం లభిస్తే బాగుండు’ అని అనుకుంటూండగానే అతని ఎదుట పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించబడిన విందు భోజనం అరిటాకులో సిద్ధంగా కన్పించింది.ఎంతో సంబరంగా కడుపునిండా భోంచేశాడు. కాసేపు కునుకు తీస్తేగానీ భుక్తాయాసం తీరి నడక ముందుకు సాగదు. ఈ అరుగు పైన మెత్తటి పరుపు, తలగడ అమరితే బాగుండు అని మనసులో అనుకొన్నాడో లేదో తక్షణం అతని ఎదుట హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. దానిపై పడుకొని ‘ఇప్పుడెవరైనా నా కాళ్ళు పడితే బ్రహ్మాండంగా నిద్ర పోవచ్చు’ అని అనుకొన్న మరుక్షణం ఇద్దరు అపురూపమైన అందగత్తెలు అతని కాళ్ళు పట్టడం మొదలు పెట్టారు. తాను ఏ చెట్టు నీడన కూర్చున్నాడో అది కల్పవృక్షమనీ, అతడు మనసులో ఏది కోరుకొన్నా దానిని వెంటనే ప్రసాదిస్తుందనీ అతనికి తెలియదు.ఇప్పుడు అతనికి ఒక అనుమానం మొదలైంది. ‘ఈ అడవిలో నేను గనుక గాఢంగా నిద్రపోతే, ఒంటరిగా, నిరాయుధుడుగా ఉన్న నన్ను ఏ పెద్దపులో వచ్చి చూసిందంటే నా గతి ఏమౌతుందో’ అనుకొంటూండగానే ఎక్కణ్ణుంచో గాండ్రుమంటూ ఒక పెద్దపులి వచ్చి, అతనిపై భీకరంగా దాడిచేసి చంపేసింది. అంతటితో ఆతని కోరికలన్నీ అంతమైపోయాయి. ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు మన మనసులో మంచి భావనలు ఉంటే మనకు మంచే జరుగుతుంది. లేకపోతే మన గతి అథోగతే అన్నది శ్రీ రామకృష్ణులు ఈ కథ ద్వారా మనకు అందించిన సందేశం.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రినిర్వహణ : డి.వి.ఆర్ -
ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి..
మనం మాట్లాడే మాటల శబ్దాలు మనపైన, ప్రకృతిపైన ప్రభావం చూపుతాయి. అవే శబ్దాలు వేద మంత్రాలకు సంబంధించినవైతే మరింత గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి. అశుద్ధమైన మాటలు వినడం, చెడు దృశ్యాలు చూడటం వంటివి మనసుపై చెడు ప్రభావం చూపుతాయి. ప్రియమైన మాటలు మాట్లాడితే సకల ప్రాణులూ ఆనందిస్తాయి. ఎప్పుడూ హిత, మిత, స్మిత, సత్య వచనాలే పలకాలి. వినయ పూర్వక సత్య వచనాలు పలకడం ద్వారానే బంధువులు, స్నేహితులు దగ్గర అవుతారు. అలా మాట్లాడ గలిగే వారు సంఘంలో రాణిస్తారు.తైత్తిరీయారణ్యకం ‘మనో వాక్కాయ కర్మాణి శుధ్యన్తామ్’ అని చెప్పింది. అంటే మనస్సు, మాట, పనులను (త్రికరణములు) పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇతరుల మనసులు గాయపరుస్తూ, బాధించేలా మాట్లాడకూడదు. అలా చేయడం కూడా హింసే అన్నారు గాంధీజీ. మాట్లాడగలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి. ‘మధుర భాషణమున మర్యాదప్రాప్తించు’ అన్నారు పెద్దలు. మంచి మాట ఆభరణమే కాదు, దివ్యశక్తి కూడా! దానిని మనం మితంగా, జాగ్రత్తగా వినియోగించాలి. రఘువంశపు రాజులందరూ ‘సత్యాయ మిత భాషిణాం’ అని కాళిదాస మహాకవి అన్నారు. అంటే సత్య సంరక్షణార్థం ఆ రాజులు మిత భాషిత్వాన్ని పాటించారని అర్థం.మనిషికి నాలుక ముందు పుట్టి తర్వాత దంతాలు ఏర్పడుతాయి. కానీ నాలుక కంటే వెనుక పుట్టిన దంతాలే ముందుగా ఎందుకు ఊడిపోతాయి అనే ప్రశ్నకు శ్రీ రామకృష్ణ పరమహంస చక్కని వివరణ ఇచ్చారు. ‘దంతాలు కఠినంగా ఉంటాయి. వాటికి వినయంతో కూడిన మెత్తదనం లేదు. నాలుక మృదువుగా అణకువతో ఉండి త్వరగా బయటకు కనపడదు. అందుకే రెండు పలు వరుసల మధ్య అది సురక్షితంగా ఉంటుంది’ అన్నారాయన. వినయంతో మిత భాషులైనవారు సురక్షితంగా ఉంటారు. కఠినాత్ములు, పరుష వాక్కు గల వారు త్వరగా రాలిపోతారని అర్థం చేసుకోవాలి.మన మాటల వలన జనించే శబ్దం చాలా శక్తిమంతమైనది. అవి వినేవారి మనస్సు పైన, దేహం పైనా అపరిమిత ప్రభావాన్ని చూపుతుంది. దుఃఖిస్తున్న వారి పట్ల దయతో సాంత్వన వచనాలు పలికితే వారి శోకం ఉపశమిస్తుంది. ఎవరి పట్లనైనా పరుష పదాలతో కఠినంగా మాట్లాడితే అవతలి వారు కోపోద్రిక్తులై పరిస్థితి విషమిస్తుంది. అందువల్ల వీలైనంత మేరకు మధురంగా... హితంగా.. మితంగా మాట్లాడటమే మంచిదని పెద్దలు చెప్పారు.మాట్లాడ గలిగే శక్తి ఉంది కదా అని దుర్భాషలాడ రాదు. చెడు మాటలు మాట్లాడుతూ వాక్శక్తిని దుర్వినియోగం చేయరాదు. అలా మాట్లాడితే ముందు నోరు, తద్వారా, మనస్సు మైలపడతాయి. కనుక చక్కగా, జనరంజకంగా మాట్లాడటం సాధన చేయాలి.– డాక్టర్ పాణ్యం వసుంధరనిర్వహణ డి.వి.ఆర్ -
ఆలయంలో దాగిన మహానిధి.. తాకితే సర్వనాశనమేనా?
నిధి.. అనంతమైన సంపద.. కొన్ని శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న రహస్యం! భారతదేశంలో నిధులు అనగానే మనకు కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడ నాగబంధం ఉన్న ఓ గది తలుపులను ఇప్పటికీ తెరవలేదు. అయితే.. అంతకంటే మర్మంగా ఉన్న ఓ ఆలయం మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఉందనే విషయం మీకు తెలుసా? కర్ణాటకలో.. దట్టమైన పశ్చిమ కనుమల నడుమ.. ఉడుపి జిల్లా కొల్లూరులో కొలువుదీరిన మూకాంబిక అమ్మవారి ఆలయ గర్భంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిధులు ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు. అయితే.. టెక్నాలజీతో ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకున్న ఈ రోజుల్లో కూడా.. సైన్స్ సమాధానం చెప్పలేకపోతున్న ఓ మిస్టరీ ఆ ఆలయం..! మూకాంబికా ఆలయంలో నిధుల గురించి చూద్దాం..ఎన్ని శతాబ్దాలు గడిచినా.. ఎంతగా అధునాతన టెక్నాలజీ వచ్చినా.. కొల్లూరు మూకాంబిక ఆలయ సర్ప ముద్ర వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ వీడలేదు. ఆ పాము ఆకారం కింద నిజంగానే వేల కోట్ల రూపాయలు విలువ చేసే నిధి ఉందా? దాన్ని ఇప్పటికీ ఆ దైవిక సర్పం కాపాడుతోందా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో చూడండి.. -
ఆ విధంగా నా త్రివిధ సాధన..
కృష్ణాబాయికి స్వామి రామదాసు ‘ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ’ అనే మంత్రాన్ని ఉపదేశించారు. రామనామం సుధామధురం. ఎందరెందరినో మహనీయులుగా తీర్చిదిద్దిన మంత్రం అది. కృష్ణాబాయి కూడా ఎంతో శ్రద్ధగా ఆ మహత్తర నామాన్ని జపించటం ప్రారంభించింది. కానీ ‘చంచలం హి మనః కృష్ణా!’ అని అర్జునుడు చెప్పాడు కదా, కృష్ణాబాయి మనసు ఎక్కడెక్కడికో పరుగులు తీసింది. సమస్యను గుర్తించిన కృష్ణాబాయి స్వామి రామదాసున్న ఆశ్రమానికి పరుగెత్తింది.అప్పుడాయన ఆమెతో, ‘ఇందులో విచారించవలసినది ఏముంది? పరిభ్రమించుటే మనసు పని. దానికిష్ట మొచ్చినచోట దాన్ని పోనిమ్ము. అదంతా స్వయంగా రాముడే అని భావించు. రాముడు అనంతుడు. సమస్తమైన ప్రాణులూ, వస్తువులూ రాముని నుండి వచ్చి, రామునిలో చరించి, రామునిలో లీనమవుతాయి. అందువల్ల మనస్సు ఎక్కడికి పోయినా, సర్వమూ రాముడే అని భావించు. నీవు ఎవ్వరికి సేవ చేసినా అది రాముని సేవయనీ, రాముని పూజయనీ భావించు. ఈ అభ్యాసం విశ్వరూపుడయిన రామునితో నీ ఏకత్వాన్ని అనుభవించటానికి తేలికగా వీలు కలుగచేస్తుంది’ అని బోధించారు.గురువుగారి సలహాను కృష్ణాబాయి ఆ క్షణం నుండే పాటించింది. దాని వల్ల సాధారణ మనిషియైన కృష్ణా బాయి విశ్వమాత కృష్ణాబాయిగా ఎదిగింది. ఆమె తన అనుభవాన్ని ఇలా చెప్పింది: ‘ఆ విధంగా నా త్రివిధ సాధన – నోటితో రామమంత్రాన్ని ఉచ్చరించటం; ప్రతి ప్రాణినీ, ప్రతి వస్తువునూ సాక్షాత్ రామునిగానే భావించటం; చేతులతో చేసిన పని అంతా రాముని పనిగానూ, రాముని సేవగానూ భావించటం – ఏక కాలంలో మొదలైంది. నా దృష్టిలో పప్పా (రామదాసు), రాముడు అభిన్నం. ఈ అభ్యాసంతో నా మనస్సు నిశ్చలమైనాకు తెలియకుండగనే నా హృదయం ప్రశాంత మయమైంది’ (పుటలు 10–11; విశ్వమాత కృష్ణాబాయి, ఆనందా శ్రమము, కేరళ). – రాచమడుగు శ్రీనివాసులు -
సంశయాత్ములు
జ్ఞానం, శ్రద్ధ లేని సంశయాత్ముడు నశించిపోతాడని భగవద్గీత చెబుతుంది. సంశయాలతో సతమతమయ్యేవారు ఏ పనిలోనూ విజయం సాధించలేరు. అదేపనిగా అనేక సందేహాలతో మనసు నింపుకున్నవారు మనోదౌర్బల్యం కలిగి కర్తవ్య హీనులవుతారు.భయం, నిరాశ, నిష్క్రి యత్వం, ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతుంటే మనిషిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. జీవితానందం సన్నగిల్లుతుంది. ఇటువంటి వారు ఎప్పుడూ ఏదో అపజయం, ఉపద్రవం జరగబోతోందేమోనన్న చెడు భావనలతో భయపడిపోతుంటారు. రేపు ఏం జరుగుతుందోనని నేటి ఆనంద క్షణాలను అనుభవించలేరు.ఏ పనైనా పూర్తి చేయలేమేమోననే సందేహంతోనే వీరు మొదలుపెడతారు. విద్యార్థులుగానీ, ఉద్యోగా ర్థులుగానీ తమ మీద తమకు స్థిర నమ్మకం లేకపోతే గెలుపు సాధించలేరు. ఏదైనా చేయగలము అనే విశ్వాసం ఉంటే సగం విజయం సాధించినట్లే! యుద్ధానికి వెళుతున్న సైన్యం విజయం తమదే అనే నమ్మకంతో వెళితే విజయం వరిస్తుంది.భగవద్గీత మానవులకు జీవన సమరంలో ఆత్మ విశ్వాసాన్ని కలుగజేసి ఆనందంగా జీవించటానికి మార్గం చూపిస్తుంది. హృదయ దౌర్బల్యం ప్రతివారికీ ఏదో ఒక సందర్భంలో కలుగక మానదు. శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయుడు, అర్జునుడు ఏదో ఒక సందర్భంలో హృదయ దౌర్బల్యం అనుభవించినవారే. కానీ, దానినుండి బైట పడి ఘనులైన విధం మనకు పాఠం లాంటిది. – డా. చెంగల్వ రామలక్ష్మి -
విచిత్రమైన ఆలయం.. ఎలుకలే దేవుడికి అతిథులు!
ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన ఆలయం ఇదే. కొన్ని ప్రదేశాల గురించి వినగానే సర్ప్రైజ్ ఫీల్ అవుతాం కదా... కర్ణీ మాతా ర్యాట్ టెంపుల్ అలాంటి డెస్టినేషనే. తొలిసారి విజిట్ చేసే వాళ్లకి ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. వేలాది ఎలుకల మధ్య కూడా ఈ ఆలయ వాతావరణం చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. భక్తి, విశ్వాసం, ఆచారం అన్నీ కలిసి ఒక వినూత్నమైన అనుభూతిని ఇస్తుంది.ఆలయం బయటి నుంచి సింపుల్‌గా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లగానే బ్యూటిఫుల్ మార్బుల్ ఫ్లోర్స్, సిల్వర్ డోర్లు, ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఎలుకలు వాటికి నచ్చినట్టు తిరుగుతూ ఉన్నా కూడా భక్తులు ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు.సందర్శనీయ ప్రదేశాలుఆలయ సందర్శన ట్రిప్‌లో కర్ణీ మాతా ఆలయం అనేది ప్రధాన ఆకర్షణ. అయితే దగ్గర్లోనే బికనేర్ కోట గురించి కథలు వింటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్లిపోతాం. లాల్గర్ ప్యాలెస్ కు వెళ్తే రాజుల కాలం నాటి వైభవం ఏంటో తెలుసుకోవచ్చు. గజ్నేర్ సరస్సు, దగ్గర సాయంత్రం సమయంలో ప్రశాంతంగా ఉంటుంది.ఏం తినాలి?వరల్డ్ ఫేమస్ బికనేరీ భూజియా స్పైసీ, క్రిస్పీ, టేస్టీగా అందరికీ నచ్చేలా ఉంటుంది. దాల్ భాటి చూర్మా, ఆథెంటిక్ రాజస్థాని ఫ్లేవర్‌ని అందిస్తుంది. ఘేవర్ స్వీట్, సాఫ్ట్ టెక్చర్‌తో మీల్ కంప్లీట్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. లోకల్ చాయ్ తాగితే జర్నీ ఇంకా మెమొరబుల్‌గా ఉంటుంది.ఎప్పుడు వెళ్లాలి?అక్టోబర్ నుంచి మార్చి వరకు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సీజన్ లో ప్రయాణం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. స్థానికులు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతారు. ఆలయం ఆచారాల గురించి తెలుసుకుంటూ స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తే ఈ ప్రయాణం అద్భుతమైన జర్నీగా మిగిలిపోతుంది. ఇక్కడ ప్రతీ మూమెంట్ ఒక కొత్త మెమొరీని క్రియేట్ చేస్తుంది.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి జైపూర్‌కు ఫ్లైట్ జర్నీకి సుమారు 3 గంటలు పడుతుంది. అక్కడి నుంచి బికనేర్‌కి ట్రైన్ లేదా రోడ్ జర్నీకి సుమారు 5–6 గంటలు పడుతుంది. డైరెక్ట్ ట్రైన్స్ కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రోడ్ జర్నీలో ఎడారి అందాలు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఈ ట్రిప్ పూర్తి అయ్యాక జ్ఞాపకాలు మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. డిఫరెంట్ ట్రెడిషన్స్‌ని దగ్గరగా చూడటానికి ఇది మంచి అవకాశం అని భావించవచ్చు. జర్నీ అయిపోయిన తరువాత కూడా ఈ పీస్ఫుల్ ఫీలింగ్ మనసులో చాలా రోజులు ఉంటుంది. -
గోధుమ రంగు గుట్ట కాదు.. బంగారు గుట్ట అని పిలుస్తాం!
తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే దారిలో ఒక గుట్టపైన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పాదం ఉంది. స్వామివారు నారాయణవనంలో పద్మావతిని పెళ్ళాడి స్థిర నివాసం కోసం బయలుదేరాడు. దారిలో పుత్తూరు పట్టణం పక్కనున్న గుట్టమీద కాలు పెట్టాడని, అది స్వామిని మోయలేక కదిలిందని చెబుతారు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు స్వామి. మరికొన్ని చోట్ల కూడా పాదం మోపి చివరిగా శేషాచలం కొండలపైన కొలువైనాడని భక్తుల నమ్మకం.ఆ గుట్ట మీదున్న స్వామిపాదాన్ని చూద్దామని తమిళనాడుకు చెందిన కొందరు యువతీ యువకులు జట్టుగా బయలుదేరారు. ఆ బృందానికి ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్నారు. గుట్టపైకి వెళ్ళే దారి చూపడానికి ఒక స్థానికుడిని మాట్లాడుకున్నారు. నామం పెట్టుకుని, చేతిలో కర్ర, తలకి టోపీ, చలువ కళ్ళద్దాలు తొడిగి చెప్పులు లేకుండా ఆ బృందం బయలుదేరింది. గుట్ట ఎక్కుతున్న వారిని చూసి అక్కడి గ్రామాల ప్రజలు ‘ఈ పిల్లోళ్ళకి ఎంత భక్తి, ఎంత భక్తి’ అని పొగడ్తల వర్షం కురిపించారు.కొద్దిదూరం నడిచాక గుట్ట మీద ఉన్న గడ్డిని చూసి ఒక మెడికో అమ్మాయి ‘‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాము, కానీ ఇక్కడేమిటి, అంతా గోధుమ రంగులో ఉంది’’ అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె చూసింది పూరికప్పు వేసుకోవడానికి ఉపయోగించే బోద గడ్డి అది. ఎండకి బాగా ఎండి అది గోధుమ రంగులోకి మారి ఉంది.దారి చూపే స్థానికుడు ఆమె మాటలకు చిన్న నవ్వు నవ్వాడు. ‘‘మేము దీన్ని గోధుమ రంగు గుట్ట అని పిలవం, బంగారు గుట్ట అని పిలుస్తాం’’ అని చెప్పాడు. పక్కనే ఉన్న బృందనాయకుడు మనం ఈ గుట్టమీదున్న గడ్డిని చూసి గోధుమ రంగు గుట్ట అనుకుంటున్నాము, దాన్నే భక్తి భావంతో, ఆశావాద దృక్పథంతో ఉన్న ఇక్కడి వారు బంగారు గుట్టగా భావిస్తున్నారు. మన దృక్పథాన్ని పునః పరిశీలించుకోవాల్సి ఉందని వివరించాడు.మాటల్లోనే గుట్ట మీదకు చేరుకున్నారు. అక్కడున్న ఏనుగు పాదాలు, గుర్రపు పాదాల అడుగులు చూసి ఆశ్చర్యపోయారు. స్వామి పాదం పక్కనే ఉన్న దొనలో కాళ్ళు చేతులు కడుక్కుని పూజలు చేసి గోవిందలు పలుకుతూ వెనుదిరిగారు.దిగుతూ ఉంటే భక్తి పారవశ్యంతో ఉన్న ఆ మెడికో అమ్మాయికి గుట్ట మీదున్న గడ్డి అందంగా, బంగారు రంగులో కనిపించింది. ఏదైనా చూసే మనసును బట్టి ఉంటుంది ఈ ప్రపంచం అని తెలుసుకుంది ఆ అమ్మాయి. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
అమర్నాథ్ యాత్రకు.. ఇలా వెళ్లాలి..!
ప్రకృతి నడిబొడ్డున, హిమాలయాల గుండెల్లో వెలిసిన ఆ పరమశివుని సాక్షాత్కారం.. అమర్నాథ్ యాత్రకు సమయం ఆసన్నమైంది!. మంచు లింగ రూపంలో దర్శనమిచ్చే ఆ జ్యోతిర్లింగాన్ని కళ్లారా చూడాలని, జన్మ ధన్యం చేసుకోవాలని దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది యాత్ర జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమై.. ఆగస్టు 28వ తేదీ వరకు, అంటే మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. శ్రీ అమర్నాథ్జీ ష్రైన్ బోర్డు ప్రకటన ప్రకారం.. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ.. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తున, మైనస్ డిగ్రీల చలిలో, ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని కొండదారుల్లో సాగే ఈ ప్రయాణం.. భక్తితో పాటు ఒక పెద్ద సాహసమే..! ముఖ్యంగా మొదటిసారి వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అమర్నాథ్ యాత్రకు ఉన్న రెండు మార్గాల రహస్యం ఏంటి? వంటి వివరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.పర్మిట్ లేకపోతే నో ఎంట్రీ! అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి సూత్రం.. రిజిస్ట్రేషన్ అండ్ పర్మిట్. చెల్లుబాటు అయ్యే యాత్రా పర్మిట్ లేకుండా.. Shrine బోర్డు ఎవరినీ కూడా ఒక్క అడుగు ముందుకు వేయనివ్వదు. ఆఖరి నిమిషం వరకు ఆగకుండా, కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే మీ స్లాట్లను బుక్ చేసుకోవాలి. మీ పర్మిట్ పత్రాలను ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.ఆరోగ్య పరీక్షఈ యాత్రలో అత్యంత కీలకమైంది ఆరోగ్య పరీక్ష. ఈ యాత్ర సముద్ర మట్టానికి 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో సాగుతుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఆథరైజ్డ్ డాక్టర్ల నుంచి కంపల్సరీగా హెల్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, బీపీ ఉన్నవారు వైద్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాతే యాత్రకు సిద్ధమవ్వాలి. యాత్రకు రెండు వారాల ముందు నుంచే రోజుకు 40 నిమిషాలు నడక, యోగా అలవాటు చేసుకుంటే కొండల్లో నడవడం చాలా సులభం అవుతుంది.పహల్గాం, బాల్టాల్ మార్గాలు..అమర్నాథ్ గుహను చేరుకోవడానికి భక్తులకు రెండు ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది.. పహల్గాం మార్గం. ఇది కొంచెం దూరంగా ఉన్నప్పటికీ.. ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. ఈ మార్గంలో ఎత్తు అనేది క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి, మన శరీరం అక్కడి వాతావరణానికి, ఆక్సిజన్ స్థాయిలకి దశలవారీగా అలవాటు పడుతుంది. అందుకే మొదటిసారి యాత్రకు వెళ్లేవారికి ఈ మార్గమే బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక రెండోది.. బాల్టాల్ మార్గం. తక్కువ సమయంలో, కేవలం ఒకే రోజులో దర్శనం పూర్తి చేసుకొని తిరిగి రావాలనుకునేవారికి ఇది అనుకూలమైనది. కానీ.. ఈ మార్గంలో కొండలు చాలా నిటారుగా, ప్రమాదకరంగా ఉంటాయి. శారీరకంగా, మానసికంగా వంద శాతం ఫిట్నెస్ ఉన్నవారు మాత్రమే బాల్టాల్ రూట్‌ను తట్టుకోగలరు.హిమాలయాల వెదర్ హిమాలయాల్లో వాతావరణం ఎప్పుడు మారుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు మంచు తుఫాన్ వస్తుందో ఊహించడం అసాధ్యం. అందుకే వాతావరణాన్ని అస్సలు తేలికగా తీసుకోవద్దు. మీ బ్యాగ్‌లో థర్మల్ ఇన్సల్స్, వెచ్చని జాకెట్, వాటర్‌ప్రూఫ్ రెయిన్‌కోట్, ఉన్ని టోపీ, గ్లవుజులు, గట్టి గ్రిప్ ఉండే ట్రెక్కింగ్ షూస్ తప్పనిసరిగా ఉండాలి. ఇక మీ ట్రావెల్ బ్యాగ్‌ని ఎంత వీలైతే అంత లైట్ వెయిట్‌గా ఉంచుకోవడం మంచిది. అత్యవసర వస్తువులైన.. ఆధార్ కార్డ్, యాత్రా పర్మిట్, పవర్ బ్యాంక్, టార్చ్ లైట్, వాటర్ బాటిల్, ఇన్స్టంట్ ఎనర్జీని అందజేసే డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ బార్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, రోజువారీ మందులు, హ్యాండ్ శానిటైజర్ మాత్రమే వెంట తీసుకెళ్లాలి.తొందరపాటు వద్దు.. ప్రాణమే ముఖ్యం!అమర్నాథ్ దారిలో వేగంగా వెళ్లాలనే తొందరపాటు అస్సలు పనికిరాదు. శ్వాస తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది అనిపించినా, తల తిరిగినా, తలనొప్పి వచ్చినా.. ఏమాత్రం మొహమాటపడకుండా దారి పొడవునా ఉండే మెడికల్ క్యాంపుల వద్దకు వెళ్లి వైద్య బృందాన్ని సంప్రదించాలి. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలతో వచ్చేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. నడవలేని భక్తుల కోసం అక్కడ నిర్ణీత రుసుముతో పోనీ, డోలీ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే సమయం లేనివారి కోసం హెలికాప్టర్ సర్వీసులు కూడా ఉన్నాయి. యాత్ర పొడవునా నున్వాన్, బాల్టాల్, శేషనాగ్, పంచతరణి బేస్ క్యాంపుల వద్ద తాత్కాలిక టెంట్లు, లంగర్లలో ఉచిత భోజనం, తాగునీటి సౌకర్యం లభిస్తుంది. మన ఇండియన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలు అడుగడుగునా భక్తులకు రక్షణగా పహారా కాస్తూనే ఉంటాయి.అవును.. అమర్నాథ్ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు.. అది ఒక ఆధ్యాత్మిక సాధన. Shrine Board చెప్పిన నిబంధనలు పాటిస్తూ.. సరైన ప్రణాళిక, ఆరోగ్య జాగ్రత్తలతో ముందడుగు వేస్తే.. ఆ భోలానాథుడి పవిత్ర దర్శనం యాత్రికుల జీవితంలో ఒక మధురానుభూతిగా మిగిలిపోవడం ఖాయం. (చదవండి: 'వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు..! రథయాత్ర ఎప్పుడంటే..) -
'వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు..! ఎప్పుడంటే..
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఆధ్యాత్మిక ఉత్సవం. జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవీలకు అంకితమైన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఏటా ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ తిథి నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రను శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. ఈ ఆధ్యాత్మిక రథ యాత్ర ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి గుండిచా దేవి మందిరం వరకు సాగుతుంది. అలాంటి పరవమ పవిత్రమైన ఈ రథయాత్ర ఎప్పుడు జరగనుందంటే..ఆ రోజు నుంచి ప్రారంభం..ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16, గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు జూలై 24న ముగుస్తాయి. చివరి రోజున స్వామివారు తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దీనినే బహుదా యాత్ర లేదా తిరుగు రథయాత్ర అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు పూరీ క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది.ఎందుకింత ప్రాముఖ్యత అంటే..రథయాత్ర దర్శనానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. "రథంపై ఉన్న జగన్నాథుడిని దర్శించుకుంటే సర్వపాపాలు నశించి, మరణానంతరం మోక్షం లభిస్తుంది," అని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ జగన్నాథుడి రథాన్ని లాగే వారికి అక్షయ పుణ్యం లభిస్తుందనేది భక్తుల నమ్మకం. అలాగే ఆలయానికి రాలేని భక్తులను కలుసుకోవడానికి స్వయంగా స్వామివారే వీధుల్లోకి వస్తారనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో కుల, మత, వర్ణ భేదాలు లేకుండా లక్షలాది మంది భక్తులు పాల్గొని ఈ రథాలను లాగడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.(చదవండి: సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..) -
ఆత్మబోధ – జీవన మార్గం
భారతీయ తత్వశాస్త్రంలో అద్వైత వేదాంతం అత్యంత ప్రభావవంతమైనది. ఈ తత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఆది శంకరాచార్యులు. ఆయన రచనల్లో అత్యంత లోతైన తాత్విక సందేశాన్ని అందించే కతి నిర్వాణషట్కం. కేవలం ఆరు శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం మనిషి అసలు స్వరూపం, జీవిత పరమార్థం గురించి అద్భుతమైన వివరణ ఇస్తుంది.మనిషి తనను తాను శరీరంగా, మనస్సుగా భావించడం వల్లే అన్ని బాధలు కలుగుతున్నాయని శంకరాచార్యులు బోధించారు. మనం ‘నేను’ అని సంబోధించినప్పుడు పేరు, వత్తి, హోదా వంటి తాత్కాలిక గుర్తింపులనే వాడుతుంటాం. కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఈ మార్పులన్నిటినీ గమనిస్తూ ఉండే సాక్షియే ’ఆత్మ’. అద్వైత వేదాంతం ప్రకారం ఆత్మ శాశ్వతమైన చైతన్యం. నేను మనస్సు, బుద్ధి, అహంకారం కాదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ప్రస్తుత కాలంలో అందం, ఆస్తి, హోదా వంటి బాహ్య ఆకర్షణలే జీవిత లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమని నిర్వాణషట్కం గుర్తుచేస్తుంది.శరీరం కేవలం ఒక సాధనం మాత్రమే. ఈ అవగాహన మనిషిలో వినయాన్ని పెంచి, బాహ్య ప్రపంచం పట్ల సమతుల్య దక్పథాన్ని కలిగిస్తుంది. మనిషి జీవితాన్ని ఎక్కువగా ఇష్టాయిష్టాలే ప్రభావితం చేస్తాయి. ఈ రాగద్వేషాల వల్లే అసంతృప్తి కలుగుతుంది. కానీ ఆత్మ స్వరూపం చిదానందం(చైతన్యం తో కూడిన ఆనందం). అది వీటికి అతీతమైనది. ఈ తాత్విక దృష్టి వల్ల ఇతరుల పట్ల అసూయ, ద్వేషం తగ్గి సమత్వ భావన పెరుగుతుంది. నేటి సమాజంలో పెరుగుతున్న విభేదాలను అరికట్టడానికి ఈ ఆలోచనా విధానం ఎంతో అవసరం. సాధారణంగా మనిషిని మరణభయం వేధిస్తుంటుంది. కానీ శరీరం నశించినా ఆత్మ నశించదనే సత్యం తెలిసినప్పుడు ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది.అలాగే పాపపుణ్యాలకు, కర్మల ప్రభావానికి ఆత్మ అతీతమైనదని గ్రహించడం వల్ల గతాన్ని తలచుకుని బాధపడే మనసుకు విముక్తి లభిస్తుంది. నిర్వాణషట్కం కేవలం ఒక స్తోత్రం కాదు, అది ఒక గొప్ప తాత్విక ప్రకటన. జాతి, మత, వర్గ విభజనలకు అతీతంగా అందరం ఒకే చైతన్యానికి ప్రతిరూపాలమనే సామాజిక çస్పృహను ఇది కలిగిస్తుంది. ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న మనిషికి తన అంతర్గత ప్రశాంతతను వెతుక్కునేందుకు ఇది ఒక దిక్సూచి. అహంకారాన్ని వీడి తన అసలు స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే మనిషికి నిజమైన విముక్తి సాధ్యమవుతుంది. – సత్యశ్రీ బాలాంత్రపు -
సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తున్నారా!
లోకమంతా గాఢనిద్రలో మునిగిపోయిన వేళ. నిశ్శబ్దం అగాధంగా ఆవరించిన ఆ అర్ధరాత్రి సమయంలో, ఎప్పుడైనా అకస్మాత్తుగా మీ కళ్ళు తెరుచుకున్నాయా? చుట్టూ శూన్యం, గుండెపై ఏదో తెలియని భారం. రేపటి జీవన పోరాటం, మోయలేని బాధ్యతలు, తీరని ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ చింతలు... ఒక్కసారిగా మదిని తొలిచేస్తూ, ఈ అనంత విశ్వం లో నేనొక్కడినే ఒంటరినైపోయానా అనే వేదన మిమ్మల్ని చుట్టుముడుతుంది.ఆ ఏకాంత క్షణంలో మీరు అస్సలు ఒంటరి కారు. ఆ నిశ్శబ్దం నిరాశ కాదు... అది విశ్వసృష్టికర్త నుండి మీకు అందిన పరమ పవిత్రమైన ఆహ్వానం! జగమంతా నిద్రిస్తున్న వేళ, ఆ రాజులకే రాజు మీకోసం అంతరంగ ఆత్మీయ సదస్సును సిద్ధం చేశాడు. మీ మనసులోని కల్లోలాన్ని తుడిచేసి, అనంతమైన ప్రశాంతతను అమృతంలా కురిపించడానికి ఆయన వేచి చూస్తున్నాడు. అయితే, దుప్పటి ముసుగులో తాత్కాలిక సుఖాన్ని పొందుతూ ఆ అమృత ఘడియలను జారవిడుచుకుంటారా, లేక ఆ పరమ ప్రభువును దర్శించుకోవడానికి మేల్కొంటారా? నిర్ణయం మీదే!శారీరక బద్ధకంపై ఆధ్యాత్మిక విజయంఎప్పుడైతే నిద్రను జయించి మీరు పరుపు వదులుతారో, అప్పుడే మీ అహంకారం నశిస్తుంది. ‘నా దేహ సుఖం కంటే, నా సృష్టికర్తను ఆరాధించడమే నా ప్రథమ కర్తవ్యం’ అని మీ అంతరాత్మ ఘోషిస్తుంది. సూర్యుడు ఇంకా ఉదయించక ముందే, ఆ చల్లని నేలపై మీ తలను వంచి, మీ అంతరంగ రహస్యాలను దేవునికి విన్నవించుకున్నప్పుడు లభించే పరమశాంతి ఈ సృష్టిలో మరెక్కడా దొరకదు.ఆరాధనలోని ఆ నిగూఢమైన ప్రేమే దాసుడిని దేవుడికి దగ్గర చేస్తుంది. రాత్రి చివరి మూడవ భాగంలో ప్రకృతిలో ఒక అద్భుతమైన దైవిక సువాసన పరిమళిస్తుంది. అది కారుణ్యపు తలుపులు తెరుచుకునే మహత్తర సమయం. ఆ అల్లాహ్ మొదటి ఆకాశానికి దిగివచ్చి... ‘నన్నుప్రార్థించే దాసులు ఎవరున్నారు, వారి మొర ఆలకించడానికి? నన్ను అడిగేవారు ఎవరున్నారు, వారి కోరికలు తీర్చడానికి? క్షమాపణ కోరేవారు ఎవరున్నారు, వారి ΄ా΄ాలను కడిగేయడానికి?’ అని మధురంగా పలికే దివ్యక్షణాలవి.ఈ సమయంలో ప్రకృతిలోని అదృశ్య శక్తులు, పుణ్య దైవదూతలు ఎంతో చైతన్యవంతంగా సంచరిస్తూ ఉంటారు. రాత్రివేళ విధుల్లో ఉండే దైవదూతలు, పగటివేళ బాధ్యతలు స్వీకరించే దైవదూతలు పరస్పరం కలుసుకునే సంధి కాలం ఈ తెల్లవారుజాము. మీరుప్రార్థనలో నిలబడినప్పుడు, ఆ దైవదూతలు మీ పేరును ధన్యుల జాబితాలో లిఖించి, ఆ వేడుకోలును నేరుగా ఆకాశాలకు తీసుకెళ్తారు. ఆ సర్వశక్తిమంతుడే మీకు రక్షణ కవచంగా మారినప్పుడు, లోకంలో ఎలాంటి తుఫానులు వచ్చినా మీ మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది.జీవితాన్ని మార్చే ‘బరకత్’ (దైవిక అనుగ్రహం)ఉదయాన్నే నిద్రలేవడం వల్ల జీవితంలోకి ‘బరకత్’ అనే దైవిక అనుగ్రహం ప్రవాహంలా వస్తుంది. ఇది మీ సమయాన్ని, శక్తినీ రెట్టింపు చేసే దైవ వరం. ప్రవక్త ముహమ్మద్ (స) తన అనుచరుల కోసం... ‘ఓ అల్లాహ్! నా జాతికి వారి తెల్లవారుజాము సమయాల్లో అమితమైన శుభాలను ప్రసాదించు’ అని మనసారాప్రార్థించారు. ఈ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మీ కాలానికి ఒక అదృశ్యమైన దైవికహస్తం తోడవుతుంది. మీ పనులు సులువవుతాయి, హృదయం తేలికవుతుంది. ఇతరులు రోజంతా చేసే పనిని మీరు కేవలం కొన్ని గంటల్లోనే అలవోకగా పూర్తి చేయగలుగుతారు.షైతాను సంకెళ్ళను తెంచేయండిమనం నిద్రిస్తున్నప్పుడు షైతాను మన తల వెనుక మూడు బలమైన ముడులను వేస్తాడని ఆధ్యాత్మిక సత్యాలు చెప్తున్నాయి. ఆ అదృశ్య సంకెళ్ళను తెంచడానికి ఒకే ఒక్క దివ్య ఔషధం1. మీరు నిద్ర లేచి అల్లాహ్‌ను స్మరించుకున్న క్షణంలో మొదటి ముడి విడిపోతుంది.2. ప్రార్థన కోసం పవిత్రమైన శుద్ధి (వజూ) చేసుకున్నప్పుడు రెండవ ముడి విడిపోతుంది.3. ప్రార్థన (నమాజ్) లో దేవుని ముందు నిలబడినప్పుడు మూడవ ముడి పూర్తిగా తెగిపోతుంది.ఈ ముడులను తెంచుకున్న దాసుడు ఆ ఉదయం ఉత్సాహపు కెరటంలా, పవిత్రమైన ఆనంద నిధిలా మేల్కొంటాడు. – ముహమ్మద్ ముజాహిద్ -
స్నేహమాధుర్యం..
స్నేహం గూర్చి ఎంతో గొప్పగా చెప్తారు.. సృష్టిలో తియ్యనిదని కొందరంటే, కొందరు మధురమైనదని అన్నారు. స్నేహబంధం విడదీయరాని బంధం అన్నారు...పురాణాల్లో రామ సుగ్రీవుల మైత్రి, కృష్ణుడు కుచేలుల మైత్రి, కృష్ణార్జునల మైత్రి చెప్పుకోదగ్గవి... స్వభావరీత్యా దుష్టులైన దుర్యోధనుడు, కర్ణుల మైత్రి అయినా మంచి ఉదాహరణ కాదు. ఇలాంటి వారి విషయంలో శతకనీతి మనకు ఎంతో మంచి మార్గం చూపిస్తుంది...సజ్జన సాంగత్యం గొప్పదంటాడు భర్తృహరి... ఏనుగు లక్ష్మణ కవి తాను చేసిన అనువాదంలో... ‘సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్పుగౌరవమొసంగు, జనులకు గలుష మడచుగీర్తి బ్రకటించు, చిత్తస్ఫూర్తిజేయుసాధుసంగంబు సకలార్థ సాధనంబు’సజ్జన సహవాసం వలన ఉపయోగాలు చెప్తున్నాడు కవి. సమస్త ప్రయోజనాలు సాధించబడతాయి. అంటే కాదు సకలార్ధ సాధకం అని సెలవిచ్చాడు. ఇదే బాణీని అందరూ కొనసాగించారని అనిపిస్తుంది.. వేమన ‘నీచగుణములెల్ల నిర్మూలమై పోవు, కొదువ లేదు సుజన గోష్టి వలన’ అని సుజన గోష్టి వలన నీచ గుణాలు తొలగిపోతాయంటాడు.‘కాని వానితోడగలసి మెలంగినహాని వచ్చు నెంతవానికైనకాకి గూడి హంస గష్టంబు పొందదా’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు, వేమన. దుష్టుని స్నేహం గూర్చి వివరిస్తాడు, సుమతీ శతకంలో.‘ఉపమింప మొదట తియ్యనకపటం బెడనెడను జెఱకుకైవడినే పోనెపములు వెదకును గడపటగపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ‘ చెడు స్నేహానికి మంచి ఉదాహరణ చె΄్పారు ఇక్కడ.. చెడ్డవారితో స్నేహం మొదట్లో చెఱకు గడ తీపిలా ఉంటుంది. మధ్యలో రుచి తగ్గుతుంది, చివరికి పూర్తిగా చప్పగా ఉండి, ఏమి లేదనిపిస్తుంది. అటువంటి వాడికి తప్పులే కనిపిస్తాయి.‘ఎప్పుడు తప్పులు వెదకెడునప్పురుషుని గొల్వగూడడది’ అని అంటాడు సుమతీ శతకంలో.‘కాదు సుమీ దుస్సంగతి’ అని హెచ్చరిక చేస్తాడు ఇదే శతకంలో.మరో పద్యంలో ‘కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు’ అని అన్నారు..‘కొంచెపునరు సంగతిచేనంచితముగ గీడు వచ్చునది’ అంటూ ఒక ఉపమానం చెప్తాడు.. నల్లి కుడితే మంచానికి దెబ్బలు తగులుతాయి..‘పాలను గలసిన జలమునుపాలవిధంబునె యుండు బరికింపంగాబాల చవి జెఱచు గావునబాలసుడగువాని పొందు వలదుర సుమతీ‘ పాలు కలిసిన నీళ్లు పాల లాగే ఉంటాయి, అలాగే దుర్జనుడు సజ్జనుడు ఉంటే సజ్జనుడు లాగా ఉంటాడు... అందుకు సజ్జనుడే జాగ్రత్త వహించాలి..‘లేమి కలిమి రెండు సమముగ జూచేడి పురుషుడే మిత్రుడెన్ని పొగడారయా’ అని వేమన అంటే ‘మంచి గుణము లేని వానితో మైత్రి చేసి తుది సుఖము బడయుదురా భాస్కరా’ అంటారు భాస్కర శతకంలో.చివరగా భర్తృహరి భాషలో ‘త్యజేత్ ధనం రక్షణార్థం, ధనం త్యజేత్ ఆపది ఆత్మర్థం పృథివీం త్యజేత్, మిత్రార్థే త్యజేత్ ఆత్మనఃకాపాడుకోవడానికి సంపద, ధనం, రాజ్యం అని వదులుకోవచ్చు,కాని మిత్రుడి కోసం నువ్వు నిన్నే వదులుకోవాలి.. అంత గొప్పది స్నేహం. – డా. కందాళ సత్య నారాయణ మూర్తి -
పాదయాత్రే జైత్రయాత్రగా...
జైత్రయాత్ర అనగా గెలుపు కోసం చేసే యాత్ర. యేసు తన జీవితకాల చివరి మూడున్నర సంవత్సరాల పాదయాత్రను జైత్రయాత్రగా చూడవచ్చు. నిజానికి యేసు పాదయాత్రే జైత్రయాత్ర. రెండూ ఒక్కటే. పాదయాత్ర సాధారణ రీతిలో జరుగకపోగా అసాధారణ రీతి లో జైత్రయాత్రగా మార్చబడి గొప్ప సంచలనాలకు కేంద్రం అయ్యింది. ఇక్కడ మాత్రం పాదయాత్రకు జైత్రయాత్ర పర్యాయపదం కాక అంతకు మించినది కావడం విశేషం. ఆనాటి యేసు జైత్రయాత్ర ఇచ్చే ప్రేరణ ఇంతా అంతా కాదు.జైత్ర అంటే జయించేది అని అర్థం. అది విజయానికి సంబంధించినది అని చెప్పవచ్చు. విజయ శీలుడు, విజయశీలమైనది అనే అర్థాలు కూడా ఉన్నాయి. యాత్ర అంటే క్షేత్రస్థాయి పర్యటన. శత్రువులపై దండెత్తి విజయం సాధించడానికి వెళ్ళే యాత్రే జైత్రయాత్ర. ఆత్మ సంబంధంగా చూస్తే, దైవవాక్కుల ఖడ్గంతో దూసుకెళుతూ శత్రువైన సాతానుపై యేసు దండెత్తిన విధానం కనువిందే కాక చరిత్రలో అదొక గొప్ప వాగ్యుద్ధం. యావత్ ప్రపంచానికి దీన్ని మించిన స్ఫూర్తి మరొకటి లేదు. ఒకరు ఏదైనా ఒక రంగంలో వరుస విజయాలు సాధిస్తూ ముందుకు సాగే ప్రయాణాన్ని కూడా జైత్రయాత్ర అంటారు.కుష్ఠురోగియైన సీమోను ఇల్లు, ఆ ఇంటి పరిసరాలు గొప్ప సువాసనతో నిండేలా ఒక స్త్రీ అత్యంత విలువగల బహు ఖరీదైన అచ్చ జటామాంసి అత్తరు తీసికొనివచ్చి యేసు తలమీద అదిపోసి తనదైన ప్రేమను ఉన్నతంగా వ్యక్తం చేసింది. మరియొక స్త్రీ అత్తరు బుడ్డితో యేడ్చుచు వచ్చి కన్నీటితో యేసు పాదాలను తడిపి కడిగి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకొని ఆ అత్తరు ఆయన పాదాలకు పూసింది. గొప్ప జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ యేసు అసాధారణ బోధలకు బహుగా ఆశ్చర్యపోతూ, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పింది. ‘మేము ఎవరి దగ్గరకు వెళతాం? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు’ అంటూ పేతురు యేసును గట్టిగా పట్టుకున్నాడు. ఇదంతా పరిశీలనగా చూస్తే యేసుకు జైజైలు పలుకుటే.ప్రవచనం ప్రకారంగా కట్టబడియున్న ఒక గాడిద పిల్లను శిష్యులు విడిపించి తెచ్చిన వెంటనే యేసు గాడిదపిల్ల మీద కూర్చోగానే హోసన్నా నినాదాలు హోరెత్తాయి. ఖర్జూర మట్టలతో ఆయనకు స్వాగతం పలికారు. దారి ΄÷డుగున తమ బట్టలు, ఒలీవకొమ్మలతో పాటు వివిధ చెట్లకొమ్మలు తెచ్చిపరుస్తూ తమ సంతోషానందాలు వ్యక్తం చేసారు. దావీదు కుమారునికి జయం. ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక! సర్వోన్నత స్థలములలో జయము అంటూ బహు జనసముహం మహా శబ్దంతో కేకలు వేశారు. మిన్నంటిన జయజయధ్వనులతో బేత్పగే, బేతనియ గ్రామాలు మార్మోగాయి.యెరూషలేము పట్టణపు యూదులే కాకుండా, పస్కా పండుగ చేయుటకు వివిధ దేశాల నుండి ముందుగానే వచ్చిన యూదులు కూడా మెస్సీయాను ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన్ను జేజేలతో కీర్తించారు. ఎలుగెత్తి చేస్తోన్న ఈ గొప్ప శబ్దాన్ని చూసి ఓర్వలేని వినలేని వినుటకు మనస్సులేని పరిసయ్యులు అభ్యంతరాలు చె΄్పారు. బోధకుడా, నీ శిష్యులను గద్దించు అంటూ యేసుకే ఫిర్యాదు చేశారు. వీరు ఊరకుండి మౌనంగా నిశ్శబ్దంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని యేసు పరిసయ్యులను హెచ్చరించాడు.ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అను కొండగ్రామాల మీదుగా యేసు విజయయాత్ర ్రపారంభమై కిద్రోను లోయను దాటి దేవుని ఆలయం ఉన్న పవిత్ర నగరం యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించేవరకు సాగింది. ఈయన ఎవరో అనుకుంటూ యెరూషలేము పట్టణమంతా ఒకసారిగా కలవరానికి గురైంది. యేసు జైత్రయాత్రలకు ముచ్చటపడిపోతూ ఇలా ఆరోజున ఆయనకు ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జైకొట్టినవారే. నాట్యమాడే అంతరంగాలతో క్రీస్తుకు జేజేలు పలికినవారు నాడు ఎందరెందరో. – జేతమ్ -
విశ్రాంత స్వాంతుడు..
దీపం ఉన్నచోట వెలుగు ఉన్నట్లుగా, ఒక పువ్వు ఉన్న ప్రదేశం మనసును ఆహ్లాదపరచే సుగంధంతో నిండి ఉన్నట్లుగా, సూర్యుడు ఉంటే అది పగలై ఉన్నట్లుగా, చిత్తము, చేతన జాగ్రదావస్థలో ఉంటే సమస్త ప్రపంచము ఉత్తేజితమై ఉంటుంది. రత్నము తన నైజగుణంగా ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా ప్రకాశిస్తుందో, ప్రపంచంలో ప్రకృతి సిద్ధములు, మానవ నిర్మితములు అయినట్టి వివిధ వస్తు సముదాయములు అన్నీ ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా దృష్టి గోచరములు అవుతాయో, ఆ విధముగానే కేవలం అణుమాత్రమైన పరమాత్మునిలో జగములన్నియు నిండి ఉండి సంచరిస్తూ ఉంటాయి.మనిషి అనుభవించే సుఖానికైనా, దుఃఖానికైనా ఆ మనిషి మనసులోని ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలను తగిన విధంగా కట్టడి చేసి అదుపులో పెట్టుకోకుంటే కొండంతగా ధనమున్నా, కోట్లకు పడగలెత్తిన మిత్రులు ఎంత మంది ఉన్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టుకున్నా, మనశ్శాంతి మాత్రం కరవైనదిగానే మిగులుతుంది.కం. సంతోషము సుఖతరమగు, /సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్, సంతుష్టుండెందును వి / శ్రాంతస్వాంతుండు, రామ సౌజన్యనిధీ!మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్ని సుఖాలకు మూలం. ప్రయత్నం చేసి మనసుని దుఃఖం వైపునకు మరలకుండా చేయడాన్ని సాధించాలి. అనవసరమైన దిగులుని దరిచేరనీయకుండా చూసుకుంటూ, మనసును ఆనందంగా ఉంచుకోవడం వలన సుఖశాంతులు దక్కుతాయి. విశ్రాంత స్వాంతుడు మోక్షప్రాప్తికి దగ్గరివాడౌ తాడు– అని మడికి సింగన రచించిన ‘వాసిష్ఠ రామాయణము’, ప్రథమాశ్వాసములోని పై పద్యంలో చెప్పబడిన మాటలు వెలలేనివి. మానసిక ప్రశాంతతను కోరుకునే మనుషులకు అవి బహుదా ఆచరణీయములైనట్టివి. – భట్టు వెంకటరావు -
మహోన్నత శిఖరాలు
వారికి వారే సాటి. వారిద్దరినీ క్రీస్తు ప్రధాన శిష్యులుగా చెప్పుకోవడం పరిపాటి. ఇద్దరూ ఇద్దరే! సౌవార్తిక సేవలో మహోన్నత శిఖరాలు! క్రీస్తు తన వారసులుగా ఎన్నుకున్న ప్రధాన వ్యక్తులు. ఒకరు క్రీస్తు మొదటి శిష్యుడు పేతురు. మరొకరు క్రీస్తుకు ప్రత్యేక శిష్యుడు పౌలు! ఇద్దరూ జైలు జీవితం అనుభవించారు. సంఘానికీ, వ్యక్తులు మారడానికీ పత్రికలు రాశారు.పేతురు సముద్ర తీర వాసి, ఒక జాలరి. పౌలు రోమన్ సామ్రాజ్య ఉద్యోగి, ఒక సైనికుడు. పేతురు ‘నన్ను వెంబడించు’ అని పిలువబడి సిలువ వరకు వెళ్ళాడు. పౌలు ‘నా నామం కోసం శ్రమపడాలి’ అని పిలువబడితల ఇచ్చాడు. ఒకరు క్రీస్తుచే యాదృచ్ఛికంగా ఆహ్వానితుడైనవాడు. మరొకరు క్రీస్తుచే అదృశ్యకంగా కొట్టబడి ప్రశ్నింప బడినవాడు. ఒకరు ఇజ్రాయేలీయ దేశ స్వస్థలీయుడు. మరొకరు ఇరాన్ దేశం నుంచి వచ్చి స్థిరపడినవాడు.ఒకరు నిరక్షర కుక్షి. మరొకరు విద్యా బుద్ధులు బాగా నేర్చినవాడు. ఒకరు పన్నెండు మంది శిష్యుల్లో జ్యేష్ఠుడు. మరొకరు సువార్త అందించ పంపబడ్డ అపోస్తులుడు. ఒకరు క్రీస్తుతోపాటు సుఖ దుఃఖాల్లో కలిసి తిరిగాడు. మరొకరు క్రీస్తును చూడలేదు. ఆయన గురించి విన్నాడు. ఒకరు క్రీస్తు స్థాపించిన సంఘానికి మూల రాయిలాంటి వాడు. మరొకరు ఆ మూలరాతిని కరిగించి సారం అందించిన వాడు. పేతురు రాసిన పత్రికలు రెండు. పౌలు రాసిన పత్రికలు పదమూడు. ఇద్దరూ యేసు కోసం ప్రాణం పెట్టి, హతసాక్షులుగా రోమ్‌లో చనిపోయినవారే. ఇద్దరూ క్రీస్తు సువార్తా ప్రకటనకు మూలస్తంభాల్లా నిలిచినవారే! – డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (జూన్ 29న పునీత పేతురు – పౌల్ మహోత్సవం) -
అహంకార శిల్పం..
ఒక రాజ్యంలో ఒక మంచి శిల్పి ఉండేవాడు. ఎలాంటి శిలనైనా శిల్పంగా మార్చగల నైపుణ్యం అతడి సొంతం. ఉండేది. ‘నీ పనితనం చాలా గొప్పది, అందుకే ఎన్నో అద్భుతమైన శిల్పాలను చెక్కగలుగుతున్నావు. నీవు చెక్కుతున్న శిల్పాలలో జీవం ఉట్టిపడుతోంది’ అని అందరూ అతడిని ప్రశంసించేవారు. దాంతో ఆ శిల్పిలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. మరింత గొప్పగా శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు.ఆనోటా ఈనోటా పాకిన ఈ విషయం ఆ పెద్ద సామ్రాజ్యపు చక్రవర్తి వరకు వెళ్ళింది. ఆ చక్రవర్తి శ్రీ కృష్ణుడి భక్తుడు. ఆయన ఆ శిల్పిని పిలిపించి, ఒక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వమన్నాడు. శిల్పి రాత్రింబగళ్ళు కష్టపడి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని చూసిన చక్రవర్తి పరమానందభరితుడయ్యాడు. ఆ దివ్య సౌందర్యానికి పులకరించిపోయాడు. ప్రజల సమక్షంలో శిల్పిని ధన కనక వస్తువాహనాలతో సన్మానించాడు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అతడికి ‘మహాశిల్పి’ అని బిరుదునిచ్చాడు.శిల్పి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, అతడిలో ఉన్న ఆత్మవిశ్వాసం మెల్లగా అహంకారంగా మారింది. అతడు ఇంటికి వెళ్ళి తండ్రితో, ‘నాకు మించిన శిల్పి ఈ భూలోకంలోనే లేడు’ అని విర్రవీగాడు. కొడుకు మాటలను ఆ శిల్పి తండ్రి పట్టించుకోలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. ‘ప్రపంచమే నాకు నీరాజనాలు పడుతుంటే, తండ్రివైన నీవు నన్ను పొగడవేమిటి?’ అని శిల్పి తండ్రిని గట్టిగా నిలదీశాడు. అప్పుడు తండ్రి నవ్వి, ‘పిచ్చివాడా... ఈ సృష్టికర్త ముందర మనమెంత? ఈ కీర్తి, బిరుదులు ఇవన్నీ నీటి బుడగల్లాంటివి. ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోవలసిందే’ అన్నాడు. శిల్పి కోపంగా తండ్రి వైపు చూస్తూ,‘నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు అసూయ కలిగించినట్లుంది’ అని నిష్టూరమాడాడు.దానికి జవాబుగా తండ్రి ఒక పలక, బలపాన్ని శిల్పి చేతికిచ్చాడు. సృష్టికర్త సృష్టించినట్లుగా కాకుండా, మరో భిన్నమైన రూపంలో ఒక మానవ ఆకారాన్ని గీసి చూపించమన్నాడు. ‘అదెంత పని!’ అన్నట్లుగా శిల్పి వాటిని చేతిలోకి తీసుకున్నాడు. శిల్పి మూడు రాత్రులు నిద్ర లేకుండా రకరకాలుగా ప్రయత్నించాడు.కాలు, చేయి, కన్ను, ముక్కు, చెవి... ఎలా మార్చినా మానవ శరీరం సంపూర్ణం కాలేదు సరి కదా, ఒకవేళ మరో విధంగా మార్చితే మానవ మనుగడే సాధ్యం కాదని అతడు తెలుసుకున్నాడు. ఏ అవయవాన్ని కూడా మరో రకంగా మార్చలేమని, వాటి స్థానాలను అంగుళం కూడా కదపలేమని గుర్తించాడు. చివరికి తల వెంట్రుకలను సైతం ఆ సృష్టికర్త ఎంతో నైపుణ్యంతో అమర్చాడని గ్రహించాడు. సృష్టికర్తకు మించిన మహాశిల్పి ఈ విశ్వంలోనే మరొకరు ఉండరని అతడికి స్పష్టమైంది. తన అహంకార ధోరణి తనకే అర్థం కావడంతో, ఆ శిల్పి పశ్చాత్తాపంతో తండ్రి ముందర తల దించుకున్నాడు. – ఆర్.సి. కృష్ణస్వామిరాజు -
మనమే క్షమించే ధోరణితో ఉంటే.. అదెంత గొప్ప గుణం!
మనం తప్పులు చేసి క్షమించమని దేవుణ్ణి మనసారా కోరుకుంటాం. ప్రతి మత విశ్వాసం ప్రకారం అలా కోరుకుంటే దేవుడు మనల్ని క్షమించి కరుణించుతాడని నమ్మకం... మానవ జీవితంలో మనం అలవరచుకోవలసిన గొప్ప అలవాటు.. క్షమించడం. ఆదిశంకరాచార్యులు వారు రాసిన ఎన్నో శ్లోకాల్లో పూజావిధానంలో జరిగే తప్పులను క్షమించమని అర్థిస్తాం. ఇంకా ‘కరచరణ కృతం వాక్కాయజం వా... సర్వమేతమస్వ’లో భావం అదే.. క్షమాప్రార్థనతోనే పూజ ముగుస్తుంది. ఇదంతా వేడుకోవడం.. కాని మనమే క్షమించే ధోరణితో ఉంటే, అదెంత గొప్ప గుణం! మన శతకాల్లో క్షమాగుణాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించారు..‘ఓర్పు లేని వాడు ఊరకే చిక్కునుక్షమయా ధరిత్రిగాదె క్షమయే భూషణము’ అంటాడు వేమన. క్షమాగుణమే ఆభరణం...సుమతీ శతకంలో క్షమాగుణం లేని వాడు పశువంటాడు, బద్దెన..‘క్షమ లేనివాడు పశువు, క్షమయే సర్వోత్తమ గుణము’భాస్కర శతకంలో ...‘క్షమ గలవాడే ధన్యుడు, క్షమ లేని వాడు దరిద్రుండు క్షమచే జయింపరానిది లేదు మూడు లోకములందు’.. మూడు లోకాల్లోను గెలవవచ్చు క్షమ అనే గుణంతో అన్నాడు.భర్తృహరి ‘క్షమా బలం అబలానాం’ అని సెలవిచ్చాడు.. దెబ్బ సహించటమే గొప్ప శక్తి...రామదాసుగా శాశ్వత కీర్తి గడించిన కంచెర్ల గోపన్న తాను రాసిన దాశర థీ శతకంలో ‘క్షమ లేని చదువు గుణహీన విద్యయు క్షమ లేని తపము వ్యర్థ తపంబు క్షమ లేని దానము కల్మష దానంబు క్షమ లేని మాన్యత కపట మాన్యత’..క్షమ లేనిదే విద్య, తపం, దానం, గౌరవం తగవని చెప్పాడు.కుమార శతకంలో ‘క్షమయే పరమధర్మము క్షమయే పరమ సుఖము క్షమయే పరమవిద్యయు క్షమయే పరమ గతి క్షమలేని యోగము, భోగము పనికిరాదు క్షమయే ముక్తికి మార్గము సుమ్ము కుమారా’ అని చెప్పారు.సారంగధర శతకంలో ఓర్పు ఉన్నవాడిదే గెలుపని, ఓర్పు ఉన్నవాడే యోగి అని అర్థం వచ్చే పద్యం ఉంది.నారాయణ శతకంలో ‘క్షమయే విష్ణురూపంబు క్షమయే పరబ్రహ్మము క్షమయే జగతికి ఆధారము క్షమయే నిజమైన భక్తి క్షమించేవాడు నరుడు మిగిలిన వారెల్ల పశువులు’...చూశారా... క్షమకి ఎంతప్రాముఖ్యత ఇచ్చేరో... మానవ సంబంధాలు బల పడాలంటే అందరం క్షమాగుణం అలవర్చుకోవాలి. – డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
432 ఏళ్లుగా ఆగని అడుగులు..
సాక్షి, హైదరాబాద్: రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. రాజులు మారారు. రోజులు మారాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ.. 1594 నుంచి ఒక్క ఏడాది కూడా ఆగకుండా భాగ్యనగర గుండెల్లో నడిచే చరిత్ర ఇది. కుతుబ్ షాహీల వారసత్వం, నిజాం పాలనకు ముగింపు పలికినా చెక్కుచెదరని సంప్రదాయం బీబీ కా అలం. వజ్రాలు, వైఢూర్యాలు పొదిగిన అలంతో ఏనుగుపై సాగే ఈ ఊరేగింపు ఈ నెల 26న మరోసారి నగర వీధుల్లో పునరావృతం కానుంది. మొహర్రం సందర్భంగా ఈ ఏడాది కేరళ నుంచి ప్రత్యేకంగా ఏనుగును తీసుకురావడం విశేషం.వజ్ర, వైఢూర్యాల వైభవం.. మహ్మద్ ప్రవక్త కుమార్తె బీబీ ఫాతిమా కాలం చేసిన అనంతరం ఆమె చివరి స్నానంగా వినియోగించిన బల్లను ఆరో కుతుబ్ షాహీ రాజు మహమ్మద్ కులీ తల్లి హయత్ భక్షి బేగం కోరిక మేరకు తీసుకొచ్చి దాంతోనే తయారు చేసిన అలంను ఆమె జ్ఞాపకార్థం నగరంలో 1594లో ప్రతిíÙ్ఠంచారు. నిజాం పాలకులు బహుమతిగా ఇచి్చన వజ్రాలు, వైఢూర్యాలు, అరుదైన రత్నాలు అలం చుట్టూ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.ఏడాది పొడవునా దబీర్‌పురాలోని బీబీ కా అలావాలో పోలీసుల ఆర్మ్డ్ గార్డ్ రక్షణలో భద్రంగా ఉంచి, ఊరేగింపు రోజు మాత్రమే వీటిని బయటకు తీస్తారు. పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో 432 ఏళ్లుగా ఊరేగింపు కొనసాగుతోంది. ఈ నెల 26న దబీర్‌పురా నుంచి చార్మినార్, గుల్జార్ హౌజ్ మీదుగా చాదర్‌ఘాట్ వరకు సాగే ఊరేగింపునకు 2వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సంప్రదాయం హైదరాబాద్ మత సామరస్యానికి, గంగా జమునా తెహజీబ్‌కు నిలువెత్తు నిదర్శనం. -
పరమ తండ్రి ప్రేమ
ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచనలు చేయక తప్పదు. విలువైన మూలాల వలన మూల΄ాఠములవలన ఇట్టి క్షేత్రస్థాయి వనరుల వలన సువాసనసారం ఎది ఉన్నా అది నేరుగా బయటపడి జీవితాలకు వంటబడుతుంది. పరిశోధనాత్మక ఆత్మ సంబంధ అభ్యాస జీవితానికి అన్వయించుకునేలా క్రీస్తు సందేశాలు ఎప్పుడూ ఘనంగానే ఉండుట అనేది గమనార్హం.‘నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను’ అంటాడు అద్వితీయ సత్యదేవుడు. ఆయన మనస్సు ఎరిగిన ప్రభువైన యేసుక్రీస్తువారి ఉన్నతమైన బోధ ఏమంటే ‘ఈ భూమి మీద ఎవరికిని తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందు ఉన్నాడు’. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అనేది వేరే అంశం. ధర్మశాస్త్రాన్ని మరింత లోతుగా పరిశోధించినా, యేసు అసాధారణ బోధల ప్రకారంగా చూసినా కూడా ఒకరు ఆత్మ సంబంధంగా తండ్రి హోదాను అనుభవించడం దేవునికి కోపం తెప్పించే విషయమే కాక, ఇదొక గొప్పదైన విశేషం కూడానూ.గ్రంథప్రకారంగా దేవుని మహిమను దొంగిలించడం ఘోరతప్పిదమే అని చెప్పక తప్పదు. మేము మీకు ఆత్మీయ తల్లిదండ్రులం అంటూ సువార్తికులు, బోధకులు, సంఘ పెద్దలు పిలిపించుకోవడం లేఖన విరుద్ధం. మీరంతా సహోదరులు అనునదే క్రీస్తు బోధ. మనమంతా క్రీస్తునందున్నా సహోదరీ సహోదరులం. దేవుని పిల్లలం అనేదే లేఖన సంబంధ సర్వసత్యం. ఎప్పుడూ యేసును రబ్బునీ అని పిలుచుకొనే మగ్దలేనే మరియకే సమాధి దగ్గర మొట్టమొదటగా యేసు పునరుత్థానుడిగా దర్శనమిస్తూ చెప్పిన మాట ఆశ్చర్యకరమే. ‘నా సహోదరులవద్దకు వెళ్ళి – నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని వద్దకు ఎక్కి΄ోవుచున్నానని వారితో చెప్పుమనెను’. యేసుక్రీస్తు వారి తండ్రి, సర్వమానవాళి తండ్రి ఒక్కరే. ఆయనే యెహోవా అనబడే తండ్రియైన దేవుడు.హెబ్రీగ్రంథ లేఖికుని వివరణలో ‘నీవు నాకు ఇచ్చిన పిల్లలు’ అని ఒకచోట క్రీస్తు అన్నట్టుగా వ్రాయబడింది గానీ తండ్రి అని ఆయన పిలిపించుకొన్న దాఖలాలు ఎక్కడనూ లేవు. క్రీస్తు అపొస్తలులు కూడా ‘అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే’ అన్నది చాలా సూటిగా సుస్పష్టంగా ఉన్నతంగా వివరిస్తూ దేవున్ని ఎంతగానో హెచ్చిస్తూ గొప్ప చేసారు. సంఘ సహకారం తీసికొని సంఘసమక్షంలో సంఘంతో కలిసి గ్రంథాన్ని పఠిస్తే యేసు తన తండ్రియైన దేవునికి ఎంతగా విధేయుడై లోబడ్డాడో అనేది తేటగా అర్థమవుతుంది.ఒక తండ్రికి ఎంతటి కఠినాత్ముడైనా, అవిధేయుడైనా కుమారుడు ఉన్నప్పటికీ అతనికి యేసు విధేయతా జీవిత విధానం గూర్చి బోధిస్తే మొదట ఆలోచనలోపడి ఇక మార్పు తప్పని పరిస్థితే అతనికి ఎదురవుతుంది. కుమారునిగా యేసు జీవితం అంతటి ఉన్నతమైనది. పరమందున్న తండ్రియైన ఆ దేవదేవునికి, ఇంట్లో ఉన్న నాన్నకు లోబడి జీవించడం మనకెప్పుడూ గౌరవం తెచ్చే సత్క్రియే అనుటలో ఎలాంటి సందేహం లేదు. – జేతమ్ -
అంతా ఆచార్యుడి నిర్ణయమే..!
‘నాకు రాజ్యమూవద్దు, రాజ్యాధికారమూ వద్దు. నన్ను పట్టాభిషిక్తుని చేయనక్కర లేదు. నేను ఆచార్యుని చేతిలో కీలుబొమ్మలా వున్నాను. నాకు ఒక స్వేచ్ఛలేదు, సుఖం లేదు, స్వంత నిర్ణయం తీసుకోలేను. చివరకు నా వివాహం కూడా ఆచార్యుడి నిర్ణయమే. అందులోనూ ఆయన రాజకీయ కోణం చూస్తున్నారు .’’ అన్నాడు చంద్రగుప్తుడు వార్తాహరునితో. ఆ వార్త ఆచార్య విష్ణుగుప్తుని చేరింది. ఆచార్యులు చంద్రగుప్తుని వద్దకు వచ్చి ‘‘నేను విన్నది నిజమేనా?’’ అని అడిగారు.‘‘అవును’’ చంద్రగుప్తుని సమాధానం .‘‘ఎందుకు ?’’ ఆచార్యుని ప్రశ్న .‘‘నాకు స్వేచ్ఛ లేదు, సుఖంలేదు, ఏం, చక్రవర్తి సుఖాన్ని కోరకూడదా? నేను మీ చేతిలో జీతం తీసుకుంటున్న పెద్దనౌకరు లా వున్నాను.’’ అన్నాడు.‘‘అవును రాజు, రాజ్యంలో ప్రజాసేవచేసే పెద్దనౌకరే. చక్రవర్తికి సుఖం ఉండదు. ఉండకూడదు. ప్రజాసుఖమే చక్రవర్తి సుఖం. ప్రజాహితమే రాజుకి హితం.నేను నీకు రాజ్యాన్ని అప్పగిస్తానన్నాను గాని, సుఖాన్ని కాదు. దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితోబాధపడుతున్నా చక్రవర్తికి సుఖమెలావుంటుంది? సుఖానికి మూలం అర్థం. అర్థ, కామాలు ధర్మం మీద ఆధార పడి వుంటాయి. సంపాదన సక్రమ మార్గంలో వుండాలి. అక్రమ మార్గమైతే అర్థం, అనర్థమౌతుంది. రాజ్య సంక్షేమం, ప్రజల సుఖంకోసం అర్థం ఎంత అవసరమో, అది ఎందుకు ధర్మబద్ధం కావాలో వివరించారు ఆచార్య చాణక్యులు.చంద్రగుప్తుని చివరి రోజుల్లో దేశంలో కరువు తాండవించింది. ప్రజలు ఆకలికి అలమటించారు. అప్పుడు చంద్రగుప్తుడు కూడా ఆహారం తీసుకోలేదు. ప్రజాహితమే తమ హితంగా భావించిన ఆ ఇద్దరూ ధన్యులే. – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
కాబాను కాపాడిన పక్షుల కథ!
చాలాకాలం క్రితం.. అంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టడానికి కొద్ది రోజుల ముందు జరిగిన కథ ఇది. అప్పట్లో యెమెన్ దేశాన్ని ‘అబ్రహ’ అనే ఒక క్రూరమైన రాజు పాలిస్తుండేవాడు. మక్కా నగరంలోని పవిత్ర ‘కాబా’ మందిరానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు రావడం, అక్కడప్రార్థనలు చేయడం అబ్రహకు అస్సలు నచ్చలేదు. ప్రజలందరూ తన దేశానికే రావాలనుకున్నాడు.అనుకున్నదే తడవుగా, కోట్లు ఖర్చు పెట్టి తన రాజధానిలో ఒక పెద్ద, అందమైన చర్చిని కట్టించాడు. ‘ఇకపై ఎవరూ మక్కాకు వెళ్లకూడదు, అందరూ నా దగ్గరికే రావాలి‘ అని హుకుం జారీ చేశాడు. ఈ విషయం తెలిసి అరబ్బులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలో ఒక అరబ్ వ్యక్తి, రాత్రికి రాత్రే అబ్రహ కట్టించిన చర్చిలోకి దూరి, అపవిత్రం చేశాడు. దీంతో అబ్రహకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘నా చర్చిని అవమానిస్తారా? ఆ మక్కాలో ఉన్న కాబా మందిరాన్ని పునాదులతో సహా కూల్చేస్తా!’ అంటూ కరడుగట్టిన సైన్యంతో మక్కా వైపు బయలుదేరాడు.గజరాజుల సైన్యం.. వణికిపోయిన మక్కా!అబ్రహ సైన్యం మామూలు సైన్యం కాదు. శత్రువులను తొక్కి పారేయడానికి కొండల లాంటి భారీ ఏనుగులను ఆ సైన్యంలో చేర్చాడు. దారిలో అడ్డువచ్చిన చిన్న చిన్న తెగలను చీల్చిచెండాడుతూ అబ్రహ సైన్యం మక్కా సరిహద్దుల్లోకి చేరుకుంది. అక్కడ అమాయక ప్రజల ఆస్తులను, ఒంటెలను దోచుకుంది. అలా దోచబడిన వాటిలో మక్కా నాయకుడు, ప్రవక్త ముహమ్మద్ గారి తాతగారైన ‘అబ్దుల్ ముత్తలిబ్’కు చెందిన 200 ఒంటెలు కూడా ఉన్నాయి. యుద్ధం వద్దనుకుంటే కాబాను కూల్చడానికి అడ్డుపడొద్దని అబ్రహ సందేశం పంపాడు. దాంతో చర్చల కోసం అబ్దుల్ ముత్తలిబ్ నేరుగా అబ్రహ డేరాకు వెళ్లారు. ఆయన గంభీరమైన రూపాన్ని చూసి అబ్రహ ముచ్చటపడ్డాడు. ‘ఏం కావాలి?’ అని అడిగాడు.‘నీ సైన్యం నా 200 ఒంటెలను పట్టుకెళ్లింది, వాటిని నాకు ఇచ్చేయ్’ అన్నారు అబ్దుల్ ముత్తలిబ్ ప్రశాంతంగా. అబ్రహ ఆశ్చర్యపోయాడు, నవ్వుతూ అవహేళన చేశాడు. ‘మిమ్మల్ని చూసి గొప్పవాడనుకున్నా! నేను మీ పవిత్రమైన కాబా మందిరాన్ని కూల్చేయడానికి వస్తుంటే, దాని గురించి అడగకుండా మీ ఒంటెల గురించి అడుగుతున్నారేంటి?’ అన్నాడు.దానికి అబ్దుల్ ముత్తలిబ్ ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ఎంతో ధీమాగా.. ‘ఆ ఒంటెలకు యజమానిని నేను, అందుకే నా ఒంటెలను అడిగాను. కానీ, ఆ కాబా మందిరానికి ఒక యజమాని (అల్లాహ్) ఉన్నాడు. దానిని ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు!’ అని చెప్పారు. తిరిగి వచ్చిన అబ్దుల్ ముత్తలిబ్, ప్రజలందరినీ కాబా ఖాళీ చేసి,ప్రాణాలు కాపాడుకోవడానికి చుట్టుపక్కల ఉన్న కొండలపైకి వెళ్ళిపోవాలని ఆదేశించారు.మోకాళ్లూనిన ఏనుగు.. ఆకాశంలో అద్భుతం!మరుసటి రోజు ఉదయం.. అబ్రహ సైన్యం కాబా వైపు అడుగులు వేయడంప్రారంభించింది. ‘మహమూద్’ అనే ఒక పెద్ద ఏనుగు ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తోంది. కానీ, సరిగ్గా కాబా వైపు నడవమనేసరికి ఆ ఏనుగు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మోకాళ్లూని కూర్చుండిపోయింది! దానిని ఎంత కొట్టినా, పొడిచినా కదలలేదు. అదే విచిత్రంగా యెమెన్ వైపో, లేదా వేరే దిశల వైపో తిప్పితే మాత్రం పరిగెత్తింది. అబ్రహ సైన్యానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. సముద్రం వైపు నుండి వేలాది పక్షుల సమూహాలు మక్కా వైపు రాసాగాయి. వాటిని అరబ్బీలో ‘అబాబీల్’ అంటారు. ఆ చిన్న చిన్న పక్షుల నోట్లో ఒక రాయి, రెండు కాళ్లలో రెండు రాళ్లు ఉన్నాయి. అవి మామూలు రాళ్లు కావు.. కాల్చిన మట్టి రాళ్లు (సిజ్జీల్).తిన్న గడ్డిపరకల్లా.. సర్వనాశనం!ఆ పక్షుల సైన్యం అబ్రహ సైన్యంపైకి రాగానే, తమ కాళ్లలో, నోట్లో ఉన్న రాళ్లను పైనుంచి తుపాకీ గుళ్లలా వర్షింపజేశాయి. ఆ చిన్న రాళ్లు ఏనుగుల మీద, సైనికుల మీద పడగానే.. శరీరాన్ని చీల్చుకుంటూ అవతలికి వెళ్ళిపోయాయి. రాజు అబ్రహతో సహా సైన్యమంతా కకావికలమైపోయింది.పవిత్ర ఖురాన్ లోని ‘సూరహ్ అల్–ఫీల్’ (105:5) లో దేవుడు చెప్పినట్లుగా.. ఆ భారీ సైన్యం అంతా ‘పశువులు నమిలి పారేసిన గడ్డిపరకల్లా, పొట్టులా’ మారిపోయింది. అహంకారంతో వచ్చిన అబ్రహ ఘోర పరాజయాన్ని మూటగట్టుకునిప్రాణాలతో పారిపోతూ దారిలోనే అంతమయ్యాడు. కాబా మందిరం సురక్షితంగా నిలిచింది! – ముహమ్మద్ ముజాహిద్ -
శ్రీవారి జ్యేష్ఠాభిషేకానికి వేళాయెరా!
తిరుమలేశుడు ఉత్సవాల వేల్పు. నిత్యపూజలతోపాటు విశేష పూజలెన్నో జరుగుతుంటాయి. అలాంటి వాటిలో జ్యేష్ఠాభిషేకం ఒకటి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం రోజున ముగిసేలా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ‘అభిధ్యేయక అభిషేకం’ అని కూడా పిలుస్తారు.ఏడాది పొడవునా జరిగే వివిధ ఉత్సవాలు, ఊరేగింపుల వల్ల శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, వాటి కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఈ 26 నుంచి 28 వరకు జ్యేష్ఠాభిషేకం జరగనున్న సందర్భంగా ఆ విశేషాలు.ఏడాది పొడవునా స్వామివారి ఉత్సవమూర్తులకు ఉండే బంగారు కవచాన్ని ఈ ఉత్సవం మొదటి రోజున తొలగిస్తారు. కవచాలు లేని స్వామివారి నిజరూపాన్ని చూసే అరుదైన అవకాశం కేవలం ఈ సమయంలోనే భక్తులకు దక్కుతుంది.స్నపన తిరుమంజనం: మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి ద్రవ్యాలతో వైభవంగా ‘స్నపన తిరుమంజనం’ (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. అభిషేకం పూర్తయిన తర్వాత ప్రతి రోజూ స్వామివారికి వేర్వేరు కవచాలను సమర్పిస్తారు. శతాబ్దాల నాటి శ్రీ మలయప్ప స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ప్రతి ఏటా వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ‘అభిధ్యేయక అభిషేకం‘ నిర్వహిస్తారు. – ఫొటోలు: కేతారి మోహన కృష్ణ, సాక్షి, తిరుపతిఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలుమూడు రోజుల ముఖ్య కార్యక్రమాలు (జూన్ 26 – 28)మొదటి రోజు (జూన్ 26, శుక్రవారం): స్వామివారికి ఏడాది పొడవునా ఉండే బంగారు కవచాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పిస్తారు. తిరుమంజనం అనంతరం స్వామివారికి వజ్రకవచం అలంకరించి మాడ వీధుల్లో ఊరేగిస్తారు.రెండవ రోజు (జూన్ 27, శనివారం): ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన తర్వాత అత్యంత శోభాయమానంగా ముత్యాలకవచం సమర్పిస్తారు.మూడవ రోజు (జూన్ 28, ఆదివారం): చివరి రోజు తిరుమంజన కార్యక్రమాలు పూర్తి చేసి, స్వామివారికి బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని తిరిగి వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు తీయరు. -
శతక నీతి: త్యాగం!
పిల్లల పెంపకంలో తల్లితండ్రులకు ఓపిక, సహనంతోబాటు ఎంతో త్యాగగుణం.. తాము పస్తులుండి పిల్లలను పెంచే తల్లిదండ్రుల సహజగుణం త్యాగమే.. దేశసేవలోప్రాణాలను ఫణంగా పెట్టి తెగించి త్యాగం చేసే సైనికుల త్యాగం నిస్వార్ధబుద్ధికి మరో ఉదాహరణ...వేమన త్యాగాన్ని ‘వివేకంతో కూడిన దానం’గా పరిగణిస్తాడు..‘తనకు గలదెల్ల ఇతరలకు దానమిచ్చుత్యాగియగు వాడు భువికి దైవమగును సుమ్ము’...అంటాడు.. తన దగ్గర ఉన్నదంతా దానం చేసే వ్యక్తి ‘దేవుడ’ట... దీన్ని బట్టి త్యాగం చేసే వ్యక్తి స్థాయి ఎంత ఉన్నతమో ఆలోచించండి.. దానం చేసేటప్పుడు ఎటువంటి ప్రతిఫలం, పేరు ప్రతిష్టలూ ఆశించకూడదు. అందుకే గుప్తదానం అంటారు.. తనకున్న దానిలోంచి కొంత ఇవ్వడం దానం అయితే పూర్తిగా వదులుకోవడం త్యాగం అని అనవచ్చు.. తన ఆస్తిని, సౌఖ్యాన్ని, సుఖాన్ని పరులకోసం వదులుకోవడం త్యాగం అవుతుంది.సుమతీ శతకంలో...‘కష్టకాలమందు సహాయము చేయువాడుత్యాగియని బుధులు పొగుడుదురు కదరా సుమతీ’...అటుపక్క వ్యక్తులు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వ్యక్తిని త్యాగి అని కొనియాడారు. పరోక్షంగా ‘విత్తము గలవాడు వితరణి చేయక, పొదుపు చేసినచో పురుగుగ పుట్టును’ అని శపించాడు, బద్దెన సుమతీ శతకంలో. వైరాగ్యకోణంలో భోగాలను, సుఖాలు, సిరిసంపదలను త్యాగం చేసి.. అంటే వదులుకుని ఆత్మజ్ఞానం పొందండని భర్తృహరి సలహా.. ‘భోగేరోగభయం కులే చ్యుతిభయం.. సర్వం వస్తుభయాన్వితం’.. అన్నీ భయమే, అందుకే వదులుకోండి అని ఉవాచ.నారాయణ శతకంలో, కుమార గిరి శతకంలో, దాశరథి శతకంలో దేవుడు కోసం త్యాగం చేయమంటారు..ధనత్యాగం, భోగత్యాగం, కక్ష, గర్వం, కోరికలు మొ... త్యాగం చేయటం చాలా గొప్ప... పురాణాల్లో కర్ణుడు, దధీచి, శిబి, బలి హరిశ్చంద్రుడు మొదలగు వారు ఉంటే కలియుగంలో ఎందరో మాతృమూర్తులు, సైనికులు, మహానుభావులు... ధనం,ప్రాణం త్యాగం చేసిన వారున్నారు.. వారికి నివాళులతో... – డా. కందాళ సత్యనారాయణమూర్తి -
అంతఃశక్తి... అంతులేని బలం
జీవితం అనేది నిరంతరాయంగా సాగిపోయే ఒక ప్రవాహం. ప్రయాణంలో ఎదురుదెబ్బలు తగలడం సహజమే అయినా, నేటి ఆధునిక కాలంలో చాలామంది చిన్నపాటి కష్టాలకే నైరాశ్యంలో మునిగిపోతున్నారు. విజయాల కోసం, బాహ్య ప్రపంచంలో ఎవరో వస్తారని ఎదురుచూడటం కన్నా.. ప్రతి మనిషి తనలోని అపారమైన అంతర్గత శక్తులను గుర్తించడమే పరమార్థం.భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించినట్లు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. కాలం కలిసిరానప్పుడు బాహ్య పరిస్థితులను నిందించడం మాని, ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా మలచుకోవాలి. మనలోని లోపాలను సరిదిద్దుకుంటూ, సృజనాత్మకతకు పదును పెట్టినప్పుడే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అవకాశాలుగా మార్చుకునే వివేకం లభిస్తుంది.ఈ అంతఃశక్తిని మేల్కొలిపి, జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మన మహర్షులు కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాలను నిర్దేశించారు. నిత్యం ధ్యానం చేయడం ద్వారా చంచలమైన మనస్సు ప్రశాంతతను ΄÷ంది, సరైన నిర్ణయాలు తీసుకునే స్పష్టత వస్తుంది. దీనితో పాటు సద్గ్రంథ పఠనం బుద్ధిని వికసింపజేసి జీవన సత్యాలను బోధిస్తే.. సత్సంగం (మంచి వ్యక్తుల సహవాసం) మనలో సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.సముద్రంలో అలలు ఎంత సహజమో, జీవితంలో కష్టాలూ అంతే సహజం. ఎడారిలో సైతం వేళ్లను లోతుగా పాతుకుని జీవాన్ని వెతుక్కునే మొక్కలా.. మనిషి తన ఆత్మబలాన్ని నమ్ముకుని, ప్రతి కొత్త రోజును ఒక అవకాశంగా భావించి విజయపథంలో ముందుకు సాగాలి. – పసుపులేటి వెంకటేశ్వరరావు -
కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా?
ఒక సభలో జ్ఞాని, మేధావి అయిన వ్యక్తి భారతీయ సనాతన ధర్మం, సంస్కృతులపై అనర్గళంగా, అద్భుతంగా ప్రవచనం చెబుతున్నాడు. గంగాఝరిలా ఆయన ఉపన్యాసం సాగుతోంది. వందల మంది శ్రోతలు మైమరచి ఆయన ప్రవచనం ఆనందంగా వింటున్నారు. ఇంతలో ఒక తుంటరి యువకుడు లేచి నిలపడి, ఆయన వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ ‘మంత్రానికి శక్తి ఉన్నదా?’ అని ప్రశ్నించాడు. అయోమయానికి గురైన శ్రోతలు ఆందోళన చెందారు.ఆ ఉపన్యాసకుడు ఆ యువకుని వైపు కాసేపు నిశ్చలంగా చూసి ‘ఏం కూశావురా వెధవా!’ అని బిగ్గరగా అరిచాడు. అందరూ విస్తుపోయారు. ఇలా అందరి ముందు తనని అవమానించిన ప్రవచనకారునిపై ఆ యువకునికి విపరీతమైన క్రోధం కలిగింది. రక్త ప్రవాహ వేగం హెచ్చి ఆ యువకుని బుగ్గలలోకి ప్రవహించి అవి ఎరుపెక్కాయి. పెదవులు వణకుతున్నాయి. ఎర్రని నిప్పు క ణికల లాగా అతని కళ్ళు కెంపులయ్యాయి. అతను వెంటనే తన పొడవాటి చొక్కా చేతులు పైకి మడవ సాగాడు. పిడికిలి బిగించి భౌతిక దాడికి సిద్ధమయ్యాడు. సభలో స్తబ్ధత ఏర్పడింది. రెండు నిముషాలాగి ఆ ప్రవచనకారుడు బిగ్గరగా నవ్వాడు. తర్వాత ఇలా అన్నాడు. ‘నాయనా! అప్పటికప్పుడు, అనాలోచితంగా, ముందుగా అనుకో కుండా నేను పలికిన నాలుగు సాధారణ అక్షరాల పదమైన ’ మాట ఎంత మార్పు తెచ్చిందో గమనించావా? నీ కళ్ళు ఎర్రబడి, దేహమంతా వణుకుతూ, కోపంతో ఊగిపోతున్నావే! అనాలోచితంగా అన్న మాటకే ఇంత శక్తి ఉంటే, నేను ఏకాగ్రతతో, ధ్యాన నిమగ్నుడనై గాయత్రీ మంత్రం జపిస్తే దానికి అపరిమితమైన శక్తి ఉండదంటావా?’ అని సౌమ్యంగా, అనునయంగా అడిగాడు. సభా ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ యువకుడు మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అది శబ్దానికి, మాటకు ఉన్న శక్తి. – డా. గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
ముహర్రం నెల అల్లాహ్ మాసం..
ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ) ఆరంభం కేవలం క్యాలెండర్ మారడం కాదు; అది అంతరాత్మను రగిల్చే ఒక అద్భుత అవకాశం. నూతనత్వాన్ని వేడుకలతోనే ముగించకుండా, ఆత్మపరిశీలనతో స్వాగతించాలని ఇస్లాం బోధిస్తోంది. ఈ ప్రయాణంలో అత్యంత పవిత్రమైనవి ‘ముహర్రమ్’ నెలలోని మొదటి పది రోజులు. ప్రవక్త ముహమ్మద్ (స) ఈ నెలను ‘షహ్రుల్లాహ్’ (అల్లాహ్ మాసం) అని పిలిచారు.1. ఆషూరా మహత్తు.. ఒక దైవిక అద్భుతం.ముహర్రమ్ 10వ రోజును ‘ఆషూరా’ అంటారు. నాడు క్రూరుడైన ఫరోసైన్యం నుంచి ప్రవక్త మూసా (మోషే), అతని అనుచరులను అల్లాహ్ ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చి కాపాడిన అద్భుత ఘట్టం ఈ రోజే జరిగింది. ఈ దైవిక రక్షణకు కృతజ్ఞతగా ప్రవక్త మూసా ఉపవాసం ఉండేవారు. ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ముహర్రమ్ 9, 10 తేదీలలో ఉపవాసం ఉండటం ముస్లింలకు పుణ్యప్రదం. నిష్ఠతో ఉండే ఈ ఒక్క రోజు ఉపవాసం.. గడిచిన ఏడాది కాలపు చిన్నపాపాలన్నింటినీ తుడిచిపెడుతుందని ప్రవక్త నమ్మకాన్ని వ్యక్తపరిచారు.2. ఆచరించాల్సిన ముఖ్యమైన పుణ్యకార్యాలుఈ పది రోజులను వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఈ అలవాట్లను భాగం చేసుకోవాలి:ఉపవాసాలు: రంజాన్ తర్వాత నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాలకు అత్యుత్తమమైన మాసం ఇదే.దైవస్మరణ (జిక్ర్): ‘సుబ్హానల్లాహి వబిహమ్దిహీ, సుబ్హానల్లాహిల్ అజీమ్‘ లాంటి పదాలతో నోటిని పవిత్రంగా ఉంచుకోవడం.పశ్చాత్తాపం (తౌబా): గడిచిన ఏడాది తప్పులను ఒప్పుకుంటూ, నూతన సంవత్సరంలో సన్మార్గంలో నడవాలని సంకల్పించడం.దానధర్మాలు (సదఖా)పవిత్ర మాసంలో చేసే చిన్న సహాయానికైనా పుణ్యం రెట్టింపు అవుతుంది.ఖురాన్ పఠనం: నిత్యం దైవవాణిని చదవడం, దాని భావాన్ని అర్థం చేసుకోవడం.జీవిత పాఠంఆషూరా కథ నేటి మానవాళికి ఒక గొప్ప ధైర్యం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక వేదనల రూపంలో మన ముందు ‘ఎర్రసముద్రం’ లాంటి అగాధం ఉన్నప్పుడు.. ప్రవక్త మూసా చూపిన పరిపూర్ణ విశ్వాసమే మనకు శరణ్యం. ‘నా ప్రభువు నా వెంట ఉన్నాడు, ఆయన నాకు తప్పక మార్గం చూపుతాడు‘ అనే నమ్మకంతో ప్రార్థిస్తే, దైవం మన కష్టాల సముద్రాన్ని చీల్చి కొత్త దారి చూపిస్తాడు.త్యాగాల స్మరణ...ఆషూరా రోజున ప్రవక్త ముహమ్మద్ (స) ప్రియ మనవడు హజ్రత్ హుసైన్ , వారి అనుచరులు ‘కర్బలా’ మైదానంలో సత్యం, న్యాయం కోసం ప్రాణాలర్పించారు. వారి అమరత్వాన్ని గుండెల్లో స్మరిస్తూనే, ప్రవక్త సంప్రదాయం ప్రకారం ఉపవాసాలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడమే నిజమైన విశ్వాసి లక్షణం. జ్ఞానం ఆచరణలోకి వచ్చినప్పుడే దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఈ పది రోజులు మీ జీవితంలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు!– ముహమ్మద్ ముజాహిద్ -
మహా శివమ్: చెంగల్ శివ పార్వతి క్షేత్రం
మహేశ్వరా! మహాశివా పరమ శివా అని ఈశ్వరుని ఆరాధిస్తాం. అంటే మహాపర్వతం మీద వాసం ఉండేవాడు అని అర్ధం. అంతటి మహాశివుడికి పెద్ద మహా శివాలయాన్ని కేరళలో నిర్మించారు. నిరూపధారిగా లింగ రూపంలో మహా మహా రుద్రాలను తనలో ఆవహించుకున్న మహాదేవుడు లోక రక్షకుడు పరమ శివుడు. మన పుణ్యభూమిలో పలుచోట్ల జ్యోతిర్లింగాలు... ఆత్మలింగాలుగా కొలువుదీరాడాయన. అలాంటి మహాలింగం కేరళలో నిర్మించారు.కేరళ రాజధాని తిరువనంతపురానికి దగ్గర నెయ్యాటింకర అనేప్రాంతంలో ఉంది. నూట పదకొండు అడుగుల ఎత్తు గల శివలింగాన్ని ప్రతిష్టించారు.అక్కడ ఎనిమిది అంతస్థులలో మన దేశంలోకెల్ల పెద్ద శివ క్షేత్రం. దీని పేరు చెంగల్ శివ పార్వతి క్షేత్రం. ఈ స్థల మహాత్మ్యం చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ రెండు సార్లు అతి రుద్ర యజ్ఞం చేశారు. అలాగే మరెన్నో సార్లు అతిరుద్ర యజ్ఞం చేయాలనే సంకల్పం కూడా ఉంది. ఒకసారి అతి రుద్ర మహా యజ్ఞం చేయడమే గొప్ప విషయం. చెంగల్ శివ పార్వతి క్షేత్రం ఉన్న ప్రదేశం ఎంతో పుణ్యభూమిగా భావిస్తారు.ఈ స్థలానికి ఉండే మహత్వాన్ని గమనించి స్వామి మహేశ్వరానంద సరస్వతి ఈ మహా శివలింగ ప్రతిష్ట కోసం పూనుకున్నారు. వీరికి కంచికామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి మంత్ర దీక్ష ఉపదేశించారు. ఈ పుణ్యస్థలం పేరు పుట్టురాకల్. ఇక్కడే శివపార్వతులు పుట్టరూపంలో వెలిశారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో దొరికిన ఆధారాల వలన దేవాలమం 5 వేల ఏళ్ళ పురాతనమైనది అని తెలిసింది. దేశం నలుమూలల నుంచి మట్టి, పవిత్ర నదీ జలాలు వనమూలికలు తెచ్చి నిర్మించారు. మూలాధారంగా వినాయకుడు సరస్వతి బ్రహ్మ రూపాలను ప్రతిష్టించారు. మొదటి అంతస్థు భూ మట్టానికి కింద నిర్మించారు.64 మహారూపాలలో శివుని విగ్రహాలను ఉంచారు. భక్తులు కూర్చుని ధ్యానం చేయడానికి వీలు కల్పించారు అలాగే ప్రతి అంతస్థులో ఓంకారనాదం వినిపిస్తుంటుంది. పంచభూతాలు తనలో ఇమిడి ఉన్నట్టుగా ప్రకృతి అందాలను చిత్రీకరించారు. ఏడవ అంతస్తులోకి వెళితే కైలాసానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది మనకి. సహస్రదళ పద్మాకృతి కింద శివ పార్వతి విగ్రహం ముందు నిలబడి ధ్యానంలోకి వెళ్లడం మనస్సుకి ప్రశాంతంగా ఉండడం గమనించవచ్చు. కింద అంతస్థులో శివలింగ ప్రతిష్ట ఉంది ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. పన్నెండు జ్యోతిర్లింగాల భావన కలిగిన శివ ప్రతిష్ట అద్భుతం. శివపార్వతుల తనయునికి ఇక్కడ చాలప్రాధాన్యత ఉంది. అందుకే 32 విఘ్నేశ్వర రూపాల ప్రతిష్ట ఉంది. బాల గణపతి నుండి యోగ గణపతి వరకు ఉన్న రూపాలకి నిత్యపూజలు జరిపే దేవాలయం ఇక్కడ మాత్రమే ఉంది.అసామాన్య శిల్పకళాచాతుర్యంమహాబలి పురం నుండి వచ్చిన శిల్పుల కళాచాతుర్యం ఇక్కడ ఉన్న విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతుంది. రుద్రుడు అంటేనే మానవ కష్టాలను హరించేవాడు అని అర్ధము. మహా రుద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతి రుద్ర మహా యజ్ఞం చేశారు ఈ యజ్ఞం చేయడం నిజంగా ఎంతో మహత్తర విషయం. పదకొండు రోజులపాటు 121 మంది వేద పండితులు 121 కలశాలతో అభిషేకం, పదకొండు సార్లు రుద్రా మంత్రం జపిస్తే ఫలప్రాప్తి కలుగుతుంది .అటువంటిది రెండుసార్లు జరగడం శివుని శక్తికి నిదర్శనం అని నమ్ముతారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా భావంతో ఇక్కడకు భక్తులు వస్తుంటారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంచెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం 111.2 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన శివలింగం గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇంతకుముందు, కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలోని 108 అడుగుల ఎత్తైన శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైనది గా ఉండేది.10 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తు గల శివలింగం నిర్మాణం 2012 లోప్రారంభమైంది, దీని నిర్మాణం పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పట్టింది. దాని ఎత్తు మాత్రమే కాదు, దాని విశిష్టమైన స్థూపాకార నిర్మాణం, దానిలోపల దాగి ఉన్న అద్భుతమైన ఆశ్చర్యాలు కూడా చూడటానికి ఒక అద్భుతం.కాశీ, గంగోత్రి, రిషికేశ్, రామేశ్వరం, ధనుష్కోడి, బద్రీనాథ్, గోముఖ్, కైలాసం వంటి వివిధ పుణ్యక్షేత్రాల నుండి నీరు, ఇసుక, మట్టిని కూడా నిర్మాణ సామగ్రిలో కలిపారు. అందువల్ల, చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం ఒక దైవిక నిర్మాణంగా భావిస్తారు. ఈ కట్టడంలో 8 అంతస్తులు ఉన్నాయి, వాటిలో ఆరు అంతస్తులు మానవ శరీరంలోని ఆరు చక్రాలు లేదా శక్తికేంద్రాలకుప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ అంతస్తులలో భక్తులు, యాత్రికులు, పర్యాటకులు ఆయా చక్రాలపై ధ్యానం చేయడానికి 6 ధ్యానమందిరాలు ఉన్నాయి. ఈ కట్టడం మొదటి అంతస్తులో 108 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి, ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు.భక్తులు మహా శివలింగంలోకి ప్రవేశించవచ్చు. ఈ శివలింగం లోపల, శివలింగం విశ్వ ప్రభావాన్ని అనుభవించడంతో పాటు, శరీరంలోని చక్రాల శక్తిని పెంచుకోవడానికి ధ్యానం కూడా చేయవచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
పసుపు కొమ్ము అలా పుట్టింది..! అందుకే గణపతిని..
పసుపు కొమ్ము గణపతి దీన్నే హరిద్రా గణపతి అంటారు. అష్టోత్తరంలో ఓం హరిద్రా గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తుంటాం. గురు గ్రహ అనుగ్రహం కోసం హరిద్రా గణపతిని పూజించాలని పండితులు చెబుతుంటారు. గురువు అనుకూలంగా లేనివారు పసుపుకొమ్ము గణపతిని పూజించి ఉపశమనం పొందవచ్చని జ్యోతిష నిపుణులు పేర్కొంటారు. ఈ నేపథ్యంలో పసుపు కొమ్ము గణపతి ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఏంటి? పశువు కొమ్ము కాస్తా పసుపు కొమ్ముగా ఎలా మారింది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..?పూర్వం త్రిపురాసురలనే రాక్షసులుండేవారు. వారు తమను ఏకకాలంలో చంపాలనే వరాన్ని పొంది ఉన్నారు. దాంతో నందీశ్వరుడు ఆ ముగ్గురిని తన త్రిశృంగములతో అంటే మూడు కొమ్ములతో ఏకకాలంగా పైకెత్తగా శివుడు తన త్రిశూలంతో ముగ్గురిని సంహరించాడు. అయితే శివుడి త్రిశూలం ధాటికి నంది మధ్య శృంగం అంటే మధ్యలో ఉండే కొమ్ము ఊడిపోయి, కింద పడిపోయింది. దాన్ని గమనించిన పరమేశ్వరుడు పశువు కొమ్మును పసుపు కొమ్ముగా మారేలా వరమిచ్చి విఘ్నేశ్వర మూర్తి రూపంలో ఆ పసుపు కొమ్ముకు హరిద్రా గణపతిగా పూజలు అందుకునే వరాన్ని ఇచ్చారు.శుభానిక ప్రతీక..అందుకే హల్దీ..పసుపు కమ్ము గణపతి శుభానికి ప్రతీక. గురు గ్రహం పసుపు వర్ణానికి అధిపతి. శుభకార్యాల్లో కూడా పసుపు వర్ణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పెళ్లికి ముందు హల్దీ వంటి వేడుకలు.. పసుపు బట్టలతో పెళ్లి పీటలపై వధువరులను కూర్చోబెట్టడం వంటివి ఉదాహరణలు. అర్చనలు ఆధ్యాత్మిక క్రతువుల్లో కూడా పసుపునకు ప్రాధాన్యం ఉంది. ఇక జ్యోతిష్య శాస్త్రంలో గురువు జ్ఞాన కారకుడు, సంతాన కారకుడు గురువు అనుగ్రహంతో పాటు గృహ సౌఖ్యం ఆచారాలు మొదలైన వాటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు పసుపు కమ్ము గణపతిని పూజించడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. జాతకంలో గురువుస్థానం సరిగ్గా లేనప్పుడు కాలేయ సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఇక పైకి తెలియకుండా లోపల లోపలే విస్తరించే షుగర్, కేన్సర్ వంటి వ్యాధులు కూడా గురువు అనుగ్రహం లేకపోవడం వల్లనే కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఇలాంటి వారు పసుపు కమ్ము గణపతిని పూజించాలని పెద్దలు చెబుతున్నారు.గురుసేవ, గురుపారాయణం..అయితే గురు గ్రహం ప్రతికూలంగా ఉన్నప్పుడు వచ్చే దుష్ఫలితాల భారి నుంచి కొంతలో కొంతైనా తప్పించుకునే మార్గాలు లేకపోలేదని పెద్దలు చెబుతున్నారు. దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి రామకృష్ణ పరమహంస వంటి గురువులను పూజించడం వల్ల బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చని దక్షిణామూర్తిని స్మరించడం వల్ల గురువును శాంతింపచేసి ఆయన ద్వారా ప్రాప్తించే వ్యతిరేక ఫలితాల నుంచి బయట పడవచ్చని పెద్దలు చెబుతున్నారు. శనగలు గురు సంబంధమైన ధాన్యంగా చెబుతారు. వాటిని దానం చేయడం వలన కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. మొత్తంగా గురు పారాయణం గురు ధ్యానం గురు స్మరణ గురుసేవ మాత్రమే గురు గ్రహం అనుగ్రహానికి కారణం అవుతాయని చెబుతుంటారు. అనేక వ్యాధుల బారి నుంచి దూరంగా ఉంచడానికి గురువు ఒక్కడే కారణమని అందుకోసం హరిద్రా గణపతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. హరిద్రా గణపతిని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న వారికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. ధన కనుక వస్తువాహనాభివృద్ధి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. పసుపు గణపతిని పూజించడం వల్ల దేహం కాంతిమంతంగా మెరుస్తుంది. అంటే చర్మరోగాలు దరిచేరవు. ఒకవేళ చర్మ వ్యాధులు ఉన్నట్లయితే అవి నయంవుతాయని చెబుతారు. వ్యాపారులు కూడా ఓల్డ్ స్టాక్ ను క్లియర్ చేయడానికి ఆయా వస్తువులను హరిద్రా గణపతితో తాకించడం మనం ఉత్తరాదిలో ఎక్కువగా చూస్తుంటాం. రుణ విముక్తికి ధన లాభానికి హరిద్రా గణపతిని పూజించడం చక్కటి మార్గంని పెద్దలు వివరిస్తున్నారు. (చదవండి: ఆలయాల్లో.. ద్వారపాలకులు ఎందుకు? ఇంతకీ ఎవరు వాళ్లు??) -
ఆలయాల్లో.. ద్వారపాలకులు ఎందుకు?
సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా.. గర్భాలయం వెలుపల.. ద్వారానికి అటూఇటూ ఇద్దరు ద్వారపాలకులుంటారు. ప్రాచీన ఆలయాల్లో కూడా అందమైన విగ్రహాల రూపంలో ద్వారపాలకులను ప్రతిష్టించారు. అసలు ఆలయాల్లో ద్వారపాలకులెవరు? ప్రధాన దేవతలకు ద్వారపాలకుల అవసరం ఉంటుందా? వైష్ణవ, శైవ, శక్తి ఆలయాల్లో ఎవరెవరు ద్వారపాలకుల బాధ్యతలను నెరవేరుస్తారు? ఈ వివరాలను గురించి సవివరంగా తెలుసుకుందాం..ఆలయాల్లో గర్భాలయాల వెలుపల విగ్రహాల రూపంలో ఉండే ద్వారపాలకులు కేవలం కావాలివారు అనుకోవడానికి వీళ్లేదు. ఆలయానికి వచ్చే భక్తుడి మానసిక స్థితిని దైవదర్శనానికి అనుగుణంగా మార్చే ఆధ్యాత్మిక సంకేతాలుగా ద్వారపాలకులు నిలుస్తారని పండితులు చెబుతుంటారు. సైన్స్ కూడా.. గర్భాలయం నిర్మాణ శైలి.. గాలిగోపురం వంటివి భక్తుల్లోని నెగటివ్ ఎనర్జీని లాక్కొని.. ఆకాశంలోకి కలిపేసి.. వారిలో పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేసేందుకు దోహదపడే అంశాలుగా ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ ద్వారపాలకులు కూడా సరిగ్గా అదే పని చేస్తారని తెలుస్తోంది. భక్తుల చిత్తాన్ని దేవుడిపై ఉండేలా వీరు అనుగ్రహిస్తారని పెద్దలు చెబుతుంటారు.ఆలయంలో దేవతను బట్టి..ద్వారపాలకులు..గర్భాలయంలో ఉండే దేవతలను బట్టి.. ద్వారపాలకులు ఉంటారు. విష్ణు ఆలయాల్లో జయవిజయులు ద్వారపాలకులుగా ఉంటారు. వీరిద్దరూ వైకుంఠంలో మహావిష్ణువుకు ద్వారపాలకులు అనే విషయం తెలిసిందే..! వీరిద్దరికీ కూడా విష్ణుదేవుడి మాదిరిగా నాలుగు చేతులుంటాయి. శంఖచక్రాలను ధరించి ఉంటారు. ఇక శివాలయాల్లో చూస్తే.. ద్వారపాలకులుగా దిండి, మొండి ఉంటారు. వీరిద్దరూ శివుడి ప్రధాన గణాల్లోని మహాకాలుడు, నందికి ప్రతిరూపాలుగా చెబుతారు. దిండి, మొండి.. వీరిద్దరిలో ఒకరు శూలాన్ని, ఢమరుకాన్ని ధరించి ఉంటారు. కొన్ని ఆలయాల్లో ధాత్రి, విధాత్రి అనే పేర్లతో కూడా వీరిని పిలుస్తారు. వీరిద్దరూ భక్తుల హృదయంలో ఉండే భయాన్ని, భీతిని తొలగించి, వారి చిత్తం శివుడిపైకి మళ్లేలా చూస్తారని పండితులు చెబుతున్నారు. ఇక అమ్మవారు, శక్తి ఆలయాల్లో స్త్రీ ద్వారపాలికలు ఉంటారు. మీరు గమనించవచ్చు.. గర్భాలయంలో ఉండే అమ్మవారు శాంతస్వరూపిణి అయితే.. ద్వారపాలికలు శాంతంగాను.. అమ్మవారు క్రోదం, రౌద్ర స్వరూపిణిగా ఉంటే.. ద్వారపాలికలు ఉగ్రంగా ఉంటారు. అందుకు కారణాలను మనం మరో వీడియోలో తెలుసుకుందాం. అయితే.. అమ్మవారి స్వరూపాన్ని బట్టి.. ద్వారపాలికలు మారుతుంటారు.ప్రతీ ఆలయంలో ద్వారపాలకులకు విశిష్ఠత ఉంటుంది. వీరు ఆలయ పవిత్రతను, అనంత శక్తిని కాపాడతారని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా భక్తులు గర్భాలయంలో ప్రధాన దేవతామూర్తిని దర్శించడానికి ముందు.. ద్వారపాలకులకు నమస్కరిస్తేనే ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ద్వారపాలకులు అనేది కేవలం శిల్పకళ కోసమో.. అలంకారం కోసమో కాదని, వారి అనుమతితోనే ముందుకు సాగాలని వివరిస్తున్నారు. ఆలయాలను నిర్మించిన రాజులు, రాజవంశాలు కూడా ద్వారపాలకుల శిల్పాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవి. గంగైకొండ చోళపురం వంటి చోట్ల.. భారీకాయులైన ద్వారపాలకులు కనిపిస్తారు. పల్లవుల కాలంలో సహజసిద్ధమైన మానవరూపాలకు సారూప్యంగా ఉండే ద్వారపాలకులకు ప్రాధాన్యమిచ్చారు. చాళుక్యుల కాలంలో ద్వారపాలకులకు కూడా అలంకారానికి ప్రాధాన్యతనిచ్చారు. బౌద్ధ, జైన ఆలయాల్లో యక్షుల రూపంలో లేదా ధర్మరక్షకులుగా, సౌమ్యులుగా ద్వారపాలకులు దర్శనమిస్తారు. సో.. ద్వారపాలకుల గురించి తెలిసింది కదా?? ఇకపై ఏ దేవాలయానికి వెళ్లినా.. ముందుగా ద్వారపాలకులకు నమస్కరించాకే.. ప్రధాన దేవతామూర్తిని దర్శించుకోవాలనే విషయాన్ని మర్చిపోవొద్దు. (చదవండి: హిమాలయాల నడుమ చల్లని స్వర్గం) -
సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! ఆఖరికి విజయ్ సైతం..
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్. ఆయన ఇటీవలే కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు ఆలయాన్ని ఎందరో దర్శించుకున్నారు. అంతేగాదు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం ఈ ఆలయానికే తరలి వస్తుంటారు. మన టాలీవుడ్ హీరో ఎన్టీర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా వంటి దిగ్గజాలు వరకు చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రులు ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అంతా ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. అలా అంతటి అతిరథమహారథులంతా తరలివస్తున్న ఈ కొల్లూరు మూకాంబిక క్షేత్రం విశిష్టత ఏంటి, ఎందుకు రాజకీయ నాయకులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఈ అమ్మ దర్శనానికి బారులు తీరుతున్నారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబికా దేవాలయం.. దక్షిణాదిన ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. పార్వతీదేవి ఇక్కడ మూకాంబికాగా పూజలందుకుంటోంది. దీన్ని పరశురాముడు సృష్టించిన ఏడు మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా స్థానిక పురాణాలు పేర్కొంటున్నాయి.ఆకుపచ్చని పశ్చిమ కనుమల్లో వెలిసిందీ ఆలయం. ఇక్కడి అమ్మవారి విగ్రహం.. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే అయిదు పంచలోహాల సమ్మేళనంతో రూపొందింది. మూకాంబికా దేవిని మాట, అక్షరం, విద్యకు సంబంధించిన శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కూడా ఉంది.ఎంజీఆర్ టు అమ్మ జయలిలత వరకు..అంతేగాదు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజీ రామచంద్రన్ ఈ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడకు వచ్చారు. అలాగే, ‘అమ్మ’ జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జులై 30, 2004లో కొల్లూరు నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీయాగం కూడా జరిపించి, అన్నదానం కోసం రూ. 30,000లను జయలలిత సమర్పించారు. ఇక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ కూడా ఎన్నికలకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వారి బాటలోనే ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని వెండి ఖడ్గాన్ని సమర్పించారు. ఆలయ చరిత్ర..పురాణాల ప్రకారం.. ఈ ప్రాంతాన్ని పాలించిన కౌమాసురుడనే రాక్షసుడు తనకు మరణం లేకుండా వరం పొందడానికి శివుడి కోసం తపస్సు చేశాడట. తన మనోబలంతో ఆ రాక్షసుడి కోరికను పసిగట్టిన కోల మహర్షి.. సరస్వతికి తెలియజేయడంతో శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో అతడ్ని అమ్మవారు మూగవాడిని చేసిందట. అప్పటి నుంచి అతడ్ని మూసాసురుడిగా పిలిచేవారు. అయినప్పటికీ అతడు గర్వం వీడకపోగా.. దేవతలను, యక్షులను హింసించేవాడట. తననే పూజించాలని హుకుం జారీచేసి.. యజ్ఞయాగాదులను కూడా అడ్డుకోవడంతో కోల మహర్షి ఆధ్వరంలో మునులు పార్వతిదేవి వద్దకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో అమ్మవారు దైవగణాలతో వచ్చి ఆ మూసాసురుడిని సంహరించింది.ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆది శంకరాచార్యులు కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిందట. దీనికి శంకరాచార్యులు.. కేరళలోని తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని, తద్వారా ఆ ప్రాంతం సుభిక్షమవుతుందని, ఆలయాన్ని దర్శించుకునే వారికి ఎన్నుకున్న రంగంలో విజయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కోరారట. ఇందుకు సరేనన్న అమ్మవారు.. ముందుగా శంకరాచార్యులను నడవమని, తర్వాత వెనుకగా వస్తాని, గమ్యం చేరే వరకూ తిరిగి చూడొద్దని చెప్పిందట. అలా మూకాసురుడ్ని వధించిన ప్రాంతానికి వచ్చేసరికి దేవి ఆగిపోయిందట. అమ్మవారి గజ్జల శబ్దం వినబడకపోవడంతో శంకరాచార్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడే మూకాంబికగా వెలిసిందట.దీంతో నిరాశకు గురైన శంకరాచార్యలకు అమ్మవారు తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆయన అలాగే చేశారని అంటారు. అమ్మవారి మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరంపై ఉండేదని.. కానీ అక్కడకు వెళ్లడం భక్తులకు కష్టంగా ఉండటంతో శంకరాచర్య ఆలయాన్ని కొల్లూరులో తిరిగి ప్రతిష్ఠించారని చెబుతుంటారు స్థానికులు.అంతేగాదు ఆదిశంకరాచార్యులు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆయనే ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం మధ్యలో ఒక 'స్వర్ణ రేఖ' ఉంటుంది. ఇది శివశక్తుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. అంటే ఒకే క్షేత్రంలో అటు పరమశివుడిని, ఇటు పరాశక్తిని కలిపి దర్శించుకునే అరుదైన భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది.ఈ అమ్మ ఆసీస్సుల కోసమే ఎందుకంటే..ఈ మూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే, తమ కెరీర్ అద్భుతంగా రాణిస్తుందని, విజయాలు వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాల గట్టి నమ్మకం. అందుకే ముఖ్యమైన సినిమాలు ప్రారంభించే ముందు లేదా రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రముఖులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది. అంతేగాదు ఈ అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిగా (లక్ష్మి, సరస్వతి, కాళీ స్వరూపిణిగా) భక్తులు విశ్వసిస్తారు. ఆ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల్లో జయాలు సాధించిన తర్వాత, తమ పదవికి, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు, చండీ యాగం వంటివి నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి ఒడిలో, సౌపర్ణిక నది తీరాన వెలసిన కొల్లూరు క్షేత్రం అటు ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఇటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం. అందుకే సామాన్య భక్తుల నుంచి కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ అమ్మవారి పాద చెంతకు చేరుకుంటున్నారు.🚨 Why CM Vijay’s visit to the Kollur Mookambika Temple is a massive political statement.Tamil Nadu Chief Minister Vijay is visiting the Kollur temple in Karnataka today at 3 PM. While it looks like a standard spiritual visit, the historical context is fascinating.He is…— MacroMatrix (@MacroMatrix1) June 12, 2026 (చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
వారధి: అది ఒక సరస్సు.. ఆ సరస్సుకు రెండు వైపులా..
అది ఒక సరస్సు. ఆ సరస్సుకు రెండు వైపులా రెండు గ్రామాలు. ఆ సరస్సులో ఏడాది పొడవునా నీరు అతి వేగంగా పారుతుంటుంది. ఆ నీటి ప్రవాహవేగానికి ఎదురీది ముందుకు పోవడం అనేది చాలా కష్టం. అనా ఒకరిద్దరు ఆ నీటివేగం తమనేం చేస్తుందని చెప్పి సరస్సులో దిగి ప్రమాదంలో చిక్కుకుని బతుకుజీవుడా అంటూ అతి కష్టంమీద ఒడ్డుకు చేరుకున్నారు.ఈ విషయం తెలిసినప్పటి నుంచి రెండు గ్రామాల ప్రజలెవరూ ఎదురీతకు సాహసించలేదు. అంతేకాదు, ఎవరికి వారు తామున్న గ్రామంలోనే సురక్షితంగా ఉండడానికి నిశ్చయించుకుని అలాగే ఉంటూ వచ్చారు. ఇరు గ్రామాల ప్రజల మధ్య సంబంధాలూ ఉండేవి కావు. అలాగని శత్రుత్వమూ లేదు.ఒకరోజు, సరస్సుకు కుడివైపున ఉన్న పల్లెకు ఓ గురువు వచ్చారు. ఆయన సరస్సు ఒడ్డున నిల్చుని ఎడమవైపున ఉన్న పల్లె వంక చూశారు.‘‘నేను ఆ పల్లెకు వెళ్ళాలనుకుంటున్నాను’’ అని అన్నారా గురువు.ఇంతలో ఓ పెద్దమనిషి ‘‘అది కష్టమండి’’ అని జవాబిస్తూ ‘‘నీటి ప్రవాహవేగం సామాన్యమైనది కాదు. అసలీ సరస్సులో ఈదాలనుకోవడమే చాలా కష్టం’’ అని అన్నాడు. అలాగే మరో ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు. హెచ్చరిక చేశారు. అయినా ఆ గురువు వారి మాట పట్టించుకోలేదు.‘‘నీటి ప్రవాహవేగాన్ని ఓ కారణంగా చెప్పుకుని మీ రెండు గ్రామాల మధ్య సంబంధాలు పెట్టుకోకపోవడం సరికాదు. మీరందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి దీనిపై ఓ వారధి నిర్మించుకోవచ్చు కదా?’’ అని జెన్ గురువు ఓ సలహా ఇచ్చారు.అయితే ఈసారి మరో ఇద్దరు ఒక్కసారిగా గొంతు కలిపి ఇలా చెప్పారు ‘‘బలే వారు స్వామీ, ఈ సరస్సులో ఈదడమే కష్టమనుకుంటుంటే దాని మీద వంతెన కట్టడమా...అది అసాధ్యం’’ అని అన్నారు.అయినా జెన్ గురువు ఆగలేదు. ‘‘అది సాధ్యమే’’ అని అన్నారు.‘‘నేను మీకందుకు సాయం చేస్తాను’’ అని ఆ గురువు వారికి హామీ ఇచ్చారు.ఏదో మాట చెప్పానని ఊరుకోకుండా ఆ జెన్ గురువు పల్లెలోని వంద మంది యువకులను ఎంపిక చేసారు. వంతెన నిర్మాణానికి పూనుకున్నారు.రాత్రీ పగలూ, ఎండా వానా అనేవేవీ లెక్కచేయకుండా ఆ వంద మంది యువకులతోపాటు జెన్ గురువూ శ్రమించారు. అనుకున్నట్టే ఆ సరస్సుపై ఓ వారధి ఏర్పాటైంది. ఇప్పుడు ఆ రెండు గ్రామాల ప్రజల మధ్య సత్సంబంధాలు పెరిగాయి. రాకపోకలు పెరిగాయి. అంతేకాదు, ఒకరి మధ్య ఒకరు సహకరించుకోవడం మొదలుపెట్టారు. ఈ ఊరు అబ్బాయిని ఆ ఊరు అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేశారు. ఇరు గ్రామాల ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా కాలం గడుపుతున్నారు.ఓ ఏడాది గడిచింది. ఓ రోజు ఇరు గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో ఊరు పొలిమేరలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళి తమ ఆనందానికి కారణమైన గురువును కలిశారు. నమస్కరించారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘‘మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాం’’ అని ముక్తకంఠంతో చెప్పారు. కానీ గురువు తనకెలాంటి సన్మానమూ వద్దని సున్నితంగా తిరస్కరించారు.‘‘నాకు ఎలాంటి ఆడంబరాలూ వద్దు. పొగడ్తలూ వద్దు. ప్రచారమూ వద్దు. మీరందరూ ఇప్పటిలాగే ఎప్పుడూ కలసి మెలసి ఉంటే అదే నాకు ఆనందం’’ అని చెప్పారాయన. – జగద్రేణు -
ఇవాల్టి నుంచే యమునా నది పుష్కరాలు ప్రారంభం
దేవగురువు బృహస్పతి జూన్ 2, మంగళవారం రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ పుష్కరాలు జూన్ 13, శనివారం తో ముగుస్తాయి. ఈ పన్నెండు రోజుల పాటు యమునా నది తీరంలో ఆది పుష్కరాలు నిర్వహిస్తారు.యమ బాధలు తీర్చే పవిత్ర స్నానం!పురాణాల ప్రకారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి యమునా దేవి కుమార్తె. యమధర్మరాజుకి స్వయాన సోదరి. అందువల్ల యమునా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే యమ బాధలు తొలుగుతాయని విశ్వాసం. సూర్యుడి సంతానంలో యముడు, యమున, శని ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకం. ఈ భూమ్మీద మానవుడు చేసే పాప పుణ్యాల కర్మను శని భగవానుడు అనుభవింపజేస్తాడు. జీవుడు ప్రస్తుత జన్మలో, అనేక జన్మల ద్వారా ఏర్పడిన పాప పుణ్య కర్మల ఫలితాలను మరణం తర్వాత యమధర్మరాజు చూస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ యమ బాధలు, పాపాల నుంచి విముక్తి పొందేందుకు యమునా నది స్నానం ఉత్తమమైనదని పేర్కొంటున్నాయి. అందువల్లే, శ్రీకృష్ణుడు స్వయంగా యమునా నది ఒడ్డున జన్మించడంతో పాటు ఈ నదితో ముడిపడి అనేక పురాణ విషయాలు ఉండటం యమున వైభవాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.భారతీయ సనాతన ధర్మం, పురాణాలలో యమునను కాళిందీ నదిగా పేర్కొన్నారు. 'యమునా నది కృష్ణ ప్రియః' అంటే యమునా నది కృష్ణుడికి ప్రియమైనదిగా చెబుతారు. యమునా నది నీటి స్పర్శ తాకితే పాపాల తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ,తొలగుతాయని, మనఃశాంతి, పితృదోష నివారణ, ఆత్మశుద్ధి వంటివి కలుగుతాయని విశ్వాసం. మరీ ముఖ్యంగా ఇక్కడ పుణ్యస్నానంతో శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందగలరని శాస్త్రవచనం. ఇంతటి విశేషం, మహత్యం కలిగిన నదికి పుష్కరాలు రావడం, పుష్కరాల్లో భక్తి శ్రద్ధలతో స్నాన విధి ఆచరిస్తే విశేష ఫలితాలు దక్కుతాయని విశ్వాసం.జ్యోతిష శాస్త్రం ప్రకారం.. దేవగురువు అయిన బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు సంభవిస్తుంటాయి (ఉదా: బృహస్పతి మేష రాశిలో ఉంటే గంగా నదికి , వృషభంలో పరాభవ నామ సంవత్సరంలో దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల జూన్ 2 నుంచి 13 వ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి.ఎక్కడ స్నానమాచరించాలి ?యమునా నది ప్రవహించే కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి పుణ్య ఫలాలు పొందుతారు. ముఖ్యంగా పుష్కరాల సమయంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం వలన వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని, మధ్యాహ్న సమయంలో చేసే స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుష్కర స్నానం ఆచరించవచ్చు. గంగా , యమున , సరస్వతి నదులు కలిసే ఈ పవిత్ర సంగమంలో పుష్కర స్నానమాచరించడం విశేష పుణ్యఫలం లభిస్తుంది.మథుర/బృందావనం: శ్రీకృష్ణుడు స్వయంగా జన్మించి తన బాల్యాన్ని గడిపి, లీలలను ప్రదర్శించిన ప్రాంతమిది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఘాట్లలో పుష్కర స్నానం ఎంతో విశేషం.యమునోత్రి: యమునా నది జన్మస్థలం ఇది. ఇక్కడ యమునా నదిని దర్శించుకొని పుష్కర స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం.ఇంద్రప్రస్థం (ఢిల్లీ): పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజ్యంగా చేసుకొని అనేక యజ్ఞయాగాదులు చేసిన పవిత్ర ప్రదేశమిది. ఇలా ఈ పుణ్య నది పరిసర ప్రాంతాల్లో పురాణాలకు సంబంధించిన విశేషం ఉన్న ప్రాంతాల్లో పుష్కర స్నానం ఆచరించడం మంచిదిఏయే దానాలు చేస్తే మంచిది ?పుష్కరస్నానం అనంతరం దానం (అన్నదానం గోదానం , భూదానం , సువర్ణదానం , లవణదానం, పుస్తక దానం వంటివి) చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. యజ్ఞ యాగాదులు, హోమాలు వంటివి నిర్వహించడం లేదా ఆయా పవిత్ర కార్యాల్లో పాల్గొనడం వంటివి ఆచరిస్తే పుణ్యం.పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడం వల్ల వారికి సద్గతులు ప్రాప్తిస్తాయని విశ్వాసం. పుష్కరాల్లో పురాణ పఠనం, మంత్రోచ్ఛారణ , భగవన్నామస్మరణ , జపం , తపం వంటివి ఆచరించడం ఉత్తమం.పుష్కరాలంటే సబ్బులు , శాంపూలతో స్నానమాచరించి నదులను కలుషితం చేయడం కాదు. యత్ర స్వచ్ఛః తత్ర లక్ష్మి అన్నారు పెద్దలు. పుష్కరాల్లో స్నాన విధిని అనుసరించి పురుషులు పంచె వంటివి ధరించడం , మహిళలు తమకు సౌకర్యమైన చీరవంటివి ధరించడం, దంపతులైతే భార్య , భర్త కొంగుముడి వేసుకొని భక్తి శ్రద్ధలతో మూడు మునకలతో చేసే స్నానం పుష్కర స్నానం. ఇలా స్నానమాచరించి దేవతలకు, రుషులకు, నదికి అర్ఘ్యం సమర్పించడం, పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తే విశేష పుణ్యఫలం దక్కుతుంది నదులలో చెడు పదార్థాలను విడిచిపెట్టడం పాతకం వీటిని దృష్టిలో ఉంచుకొని పుణ్యార్చన కోసం భక్తి శ్రద్ధలతో పుష్కర స్నానం ఆచరించాలని సూచన.పుష్కర స్నాన మహత్యంనదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని, నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. మనం కూడా యమునా నది పుష్కరాలలో స్నానమాచరించి మోక్షాన్ని పొందుదాం. (చదవండి: శ్రీ కోదండరామాలయంలో ఆధ్యాత్మిక వైభవం.) -
కోటిలింగేశ్వరా.. శిరసా నమామి
కోటి లింగేశ్వర నమఃశివాయ అనే ఉచ్చారణ వింటుంటే మనకి ఒక సందేహం కలుగుతుంది... కోటి లింగాలతో శివాలయమా అని... ఔను! నిజంగానే కోటి లింగాలతో శివాలయం ఉంది అంటే ఆశ్చర్యపోతాము. దానికి తోడు 108 అడుగుల ఎత్తు కలిగిన అతి ఎత్తయిన శివలింగం... ఎదురుగా 36 అడుగుల పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంది. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్య పెద్ద త్రిశూలం స్థాపించారు. సుమారు 97 లక్షల శివలింగాల ప్రతిష్ట జరిగి ఉంటుందని లెక్క. ఇవికాక ఉపదేవతలు... దేవి పీఠాలు వెరసి భక్తితో ఓం నమఃశివాయ అనే ఉచ్చారణతో లోకమే మర్చిపోతాము. కోటి లింగాల స్థాపన అంటేనే చిన్న విషయం కాదు. ఈ దేవాలయ ప్రతిష్టతో ఆ ఊరి అసలు పేరు మారిపోయి కోటి లింగేశ్వర అని చెప్తేనే తెలుస్తోంది. మరి అంతటి ప్రశస్తి పొందింది. ఈ కోటి లింగేశ్వర దేవాలయం బెంగుళూరుకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరి పేరు కమ్మసంద్ర. ట్రైన్లో వెళ్తే బంగారుపెట్ట రైల్వేస్టేషన్లో దిగితే 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఉండడానికి అంత సౌకర్యాలు లేవు. బెంగళూరు, కమ్మసంద్ర రెండు వేరు వేరు లోకాలని చెప్పొచ్చు. బెంగళూరు యాంత్రికమైన వేగంతో కూడుకున్న జీవితం అయితే కమ్మసంద్రలో ప్రశాంతమైన పల్లె వాతావరణం... భక్తితో కోటి లింగేశ్వర లోకం అని అనిపిస్తుంది. మరి ఈ దేవాలయాన్ని ప్రతిష్టించిన వ్యక్తి పేరు స్వామి సాంబశివమూర్తి. పేరులోనే శివ నామం ఉంది. అందుకేనేమో కోటి శివలింగాలను ప్రతిష్టించాలని మనసులో అనుకున్నారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే కేంద్ర సంస్థలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి శివనామస్మరణతో కోటి లింగేశ్వర దేవాలయంలో తన శేష జీవితం గడిపారు. వీరి స్వప్నమే కోటిలింగాల ప్రతిష్ట. 2018లో స్వామి సమాధి ΄పొంది శివైక్యం అయ్యారు. ఇక్కడ 17 శక్తి స్వరూపాలను ప్రతిష్టించారు. అలాగే దుర్గ, పార్వతీదేవిల ప్రతిష్ట ఉంది. ఉప దేవతలుగా అన్నపూర్ణేశ్వరి, కరుమారి అమ్మ, సుబ్రమణ్యేశ్వర స్వామి, పాండురంగస్వామి, సీతారామలక్ష్మణులు, పంచ ముఖ గణపతి, కన్యకాపరమేశ్వరి ఉపదేవతా క్షేత్రాలు ఉన్నాయి. ముందుగా బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను పూజించి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ చూడదగ్గది సహస్రనామ శివలింగం. ఏకశిల మీద వేయి శివలింగాలను చెక్కి ఉంటుంది. ఒకేసారి వేయి శివలింగాల దర్శనం చేసినంత పుణ్యం దక్కుతుంది. అలాగే మరో పుణ్యఫలం పంచ ముఖ శివలింగం. ఇక్కడ భక్తులకి మరో మంచి పుణ్యం శివునికి అభిషేకం స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ దేవాలయ యాజమాన్యాన్ని సంప్రదించి మనకి నచ్చిన వారి జ్ఞాపకార్ధం ఎనిమిది వేల నుండి రెండు లక్షల రూపాయలు వరకు చెల్లించి శివలింగ ప్రతిష్ట చేసుకోవచ్చు. ఆ విధంగా మనం కూడా కోటిలింగేశ్వర యజ్ఞంలో పాలుపంచుకోవచ్చు. ఎందరో ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు పేర్లు కనిపిస్తాయి. గుడిలో వినాయకుడి గుడి ముందు భారీ బిల్వపత్ర వృక్షం, నాగలింగ వృక్షాలు ఉన్నాయి. ఆలయంలో పూజించే పవిత్రమైన దారాన్ని తీసికొని ఈ చెట్లకు కడితే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయాల్లో నిత్యసేవ, అన్నదానం, పేదలకు వస్త్రదానం జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం, జాతర జరుగుతుంది. మంజునాథుడు పరమ శివ భక్తుడు. వీరి చరిత్రలో కూడా కోటి లింగేశ్వర ప్రసక్తి ఉందని అంటారు. స్వతహాగా మంజునాథుడు భక్తిభావం లేకుండా తిరిగేవాడు. ఒకరోజు అతనిలో శివుని మీద భక్తి కలిగింది ఎవరు నమ్మలేదు. అప్పుడు మంజునాథుడు పక్కనే ఉన్న శివాలయంలోకి వెళ్లారు. అప్పుడు దీపాలు ఆరిపోయాయి. అది చూసి బాధతో శివ నామ స్మరణ చేసి కీర్తనలు పాడారు. అప్పుడు దీపాలు తిరిగి వెలిగాయి. అప్పుడే ఆయన తన తప్పుకి ప్రాయశ్చిత్తం కోసం కోటి లింగాలను ప్రతిష్ట చేయడానికి సంకల్పం చేశారని చెబుతారు. కోటిలింగేశ్వర యాత్రా దర్శనం అద్భుతం అని చెప్పొచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
శని జయంతి ప్రాముఖ్యత..ఆయన అనుగ్రహం పొందాలంటే..!
శనీశ్వరుడి జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు. ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది.శనీశ్వరుడి జయంతిదేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం. ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి.చేయవలసిన పూజలుశని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి. అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి. దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి. ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి.అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి.శని దేవుడి ప్రాముఖ్యతసూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.శని శాంతి మంత్ర స్తుతి..ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహారవర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయకృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయశుద్ధబుద్ధి ప్రదాయనేయ ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతినవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి , తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.శన్యారిష్టే తు సంప్రాప్తేశనిపూజాంచ కారయేత్శనిధ్యానం ప్రవక్ష్యామిప్రాణి పీడోపశాంతయేఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు , నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.వై.వెంకటసుబ్బారెడ్డి9849100044మరిన్ని వివరాలకు కింది వీడియోపై క్లిక్ చేయండి (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
కలియుగ కల్పవృక్షం 'రావిచెట్టు'
భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే ప్రథమ తాంబూలం. చెట్టును, చేమను, పుట్టను, గుట్టను, రాతిని కూడా దైవ స్వరూపంగా భావించే ఉదాత్తమైన సంప్రదాయం మనది. ఈ వృక్ష సంపదలో అగ్రతాంబూలం అందుకునేది ‘రావి చెట్టు’. ఋగ్వేదం మొదలుకొని భగవద్గీత వరకు ప్రతిచోటా కొనియాడబడిన ఈ మహావృక్షాన్ని ‘కలియుగ కల్పవృక్షం’ అని ఎందుకు అంటారు. ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగానూ ప్రాణికోటిని రక్షించే ఈ అశ్వత్థ వృక్ష వైభవంపై ప్రత్యేక కథనం..సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వృక్షాలన్ని నేను రావి చెట్టును అని ప్రకటించిన ఈ వృక్షం సామాన్యమైనది కాదు.. త్రిమూర్తుల సమ్మేళనం. దీని వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో శ్రీమహావిష్ణువు, అగ్రభాగంలో పరమశివుడు కొలువై ఉంటారని పురాణోక్తి. అందుకే ఈ చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం.దోషాల నుంచి విముక్తికి...జీవితంలో ఎదురయ్యే గ్రహ దోషాలకు, పితృదోషాలకు రావి చెట్టు చెంత చక్కని పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శనిదేవుడు రావి చెట్టును వరమిచ్చాడని, ఎవరైతే శనివారం నాడు ఈ చెట్టును పూజించి దీపం వెలిగిస్తారో వారికి తన పీడ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారని, తద్వారా వంశాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు.శాస్త్రీయ కోణంలో .. రావి చెట్టును కల్పవృక్షం అనడానికి కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. ప్రకృతిలో 24 గంటల పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువును విడుదల చేసే ఏకైక వృక్షం రావి. దీని విశాలమైన నీడ పర్యావరణంలోని విష వాయువులను హరిస్తుంది. ఆయుర్వేదంలోనూ రావి బెరడు, ఆకులు, పండ్లను ఎన్నో మొండి వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తారు. అందుకే ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం.అనుగ్రహం పొందే మార్గం..ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక అశాంతితో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ‘ మంత్రాన్ని జపిస్తూ ఏడు ప్రదక్షిణలు చేయడం విశేష ఫలితాలనిస్తుంది. నమ్మకంతో చేసే ఈ చిన్న ప్రయత్నం అపారమైన మనశ్శాంతిని, కార్యసిద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ప్రకృతిని ప్రేమిద్దాం.. దైవత్వాన్ని పూజిద్దాం..! – పసుపులేటి వెంకటేశ్వరరావు (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం) -
లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..!
మన దక్షిణాదిన శుచీంద్రం ప్రముఖ శివ క్షేత్రాలలో ఒకటి. ఎంతో మహిమ గల శైవదేవాలయం. స్వర్గాధిపతి దేవేంద్రుడు శాపవిమోచన పొందిన స్థలం. మరి మనకి కూడా తెలిసీ తెలియక చేసిన తప్పులకి ప్రార్థనతో పొదవచ్చు. స్త్రీవ్యామోహంతో శాపం పొందిన ఇంద్రుడు ఇక్కడ పాప మోచనం పొంది శుచిత్వం పొందడంతో శుచీన్ద్రం అని పేరు వచ్చింది. ఆ కథ, శుచీంద్ర క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. ఒకసారి అహల్య అందాన్ని చూసి మోహ పరవశుడు అయ్యాడు దేవేంద్రుడు. అప్పుడు ఇంద్రుడు తెల్లవారక ముందే కోడికూత వేసి గౌతమ మునిని స్నానానికి పం΄ాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతమ ముని వేషంలో అనసూయ దగ్గరకి వచ్చాడు. జరిగిన మోసం గ్రహించి గౌతమ ముని తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఇంద్రుడిని, అహల్యని చూసి శపించాడు. శిలగా మారిన అహల్య శ్రీ రాముని పాదస్పర్శ తగిలి ఇక్కడే శాప విమోచనం పొందింది. ఇక్కడే అత్రి మహా ఋషికి ఆశ్రమం ఉండేది అందుకే జ్ఞానారణ్యం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక చెట్టు మొదలు నరికినప్పుడు శివలింగం కనిపించింది. గొడ్డలి దెబ్బకి శివలింగం నుండి రక్తం కారసాగింది. ఇది దేవాలయ మూలస్థానంగా చెబుతారు. సుచీన్ద్రంలో మహాశివుని ప్రతిష్ట ఉన్నప్పటికీ త్రిమూర్తి సంకల్పం కూడా ఉంది. కారణం ఇక్కడ వృక్షాలలో త్రిమూర్తులు ఉన్నారు అని చెట్లకు పూజ చేస్తారు. తప్పు చేసిన వారు పాప పరిహారంగా సుచీన్ద్రుని దర్శించుకుని భక్తులు పాప విమోచనం పొందుతారు. సుచీన్ద్రుని ముందు మరుగుతున్న నేతిలో వెండి విగ్రహాన్ని వేస్తాడు పూజారి. తప్పు చేసిన వారు ఆ విగ్రహాన్ని చేతితో తీయాలి. పూజారి ఆ చేతిని వస్త్రంతో కట్టి మూడు రోజుల తరువాత విప్పుతాడు. చేతి చర్మం రంగు మారినా వ్రణం ఏర్పడినా ఆ వ్యక్తి తప్పు చేసినట్టుగా నిర్ధారిస్తారు. బ్రిటిష్ వారు ఈ విధానానికి స్వస్తి పలికారు. మహాభిషేకం సమయంలో భక్తులు రథం లాగుతారు. ఈ కార్యక్రమానికి సుచీన్ద్రం వాసులు ఎక్కడ ఉన్నా వచ్చి పాల్గొంటారు. ఆ విధంగా తమ పాప ప్రక్షాళనం చేసుకుంటారు. ఈ దేవాలయం శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. ఇక్కడి స్తంభాలను మీటితే సప్తస్వరాల ధ్వని వినిపిస్తుంది. స్త్రీ రూపంలో చెక్కిన వినాయకుడు, రుద్రవీణ వాయిస్తున్న రావణాసురుడు, నోటిలో తిరుగుతున్న భూగోళం, రామాయణ మహాభారతాల రాతి శిల్పాలు... ఎంత చూసినా అద్భుతమే. మన దేశంలో లాటరీ విధానం ఇక్కడ నుండి ప్రారంభించారు అని అధికారిక పత్రాలు ఉన్నాయి ఇక్కడ. శుచీన్ద్రం రాజ గోపుర పునరుద్ధరణకు డబ్బు అవసరం ఏర్పడింది. అప్పటి తిరువనంతపురం రాజు గారి అనుమతితో ఒక రూపాయి లాటరీ టికెట్ అమ్మకం చేశారు. పదివేల రూపాయల బహుమతి. యాభై వేల టికెట్లు అమ్మారు. బహుమతి సొమ్ము పోను మిగిలిన డబ్బుతో ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయం మంచి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. పచ్చని అడవితో పాలార్ నదీ ప్రవాహం, శిల్పకళా వైభవం మంచి అనుభూతినిస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నా కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళ టూర్ శబరిమల యాత్రలో సుచీన్ద్రం వెళ్లడం సులువు. కన్యాకుమారి నుండి 18, నాగర్‌కోయిల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది సుచీన్ద్రం శివ క్షేత్రం. సుచీన్ద్రంలో అంతగా లాడ్జీలు లేవు. నాగర్‌కోయిల్‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. – ఇ.ఎస్. మాధవన్, విశాఖపట్నం(చదవండి: మైసూరు మహాదేవి చాముండేశ్వరి) -
విద్యార్థి దశలో భక్తి కూడా ప్రధానమే..!
ఈ కాలంలో పిల్లలు చదువుల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. భక్తి అనేది వారిలో ఒక రకమైన భరోసాను నింపుతుంది. ‘మనల్ని రక్షించే శక్తి ఒకటి ఉంది‘ అనే నమ్మకం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన పురాణగాథల్లోని ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారి కథలు వినడం ద్వారా సత్యం, ధర్మం, ఓర్పు వంటి లక్షణాలు అలవడతాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ‘దైవ భీతి’ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడనే భావన పిల్లలను చెడు మార్గాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది. దైవ చింతన, ఆధ్యాత్మిక పరిమళం ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలకు క్రమశిక్షణ ఉంటుంది.సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్. నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః (శంకరాచార్యుల భజగోవిందం) చిన్నతనంలోనే దైవచింతన ఉన్నవారితో కలవడం వల్ల కలిగే మార్పు. మంచి వారితో స్నేహం (సత్సంగం) వల్ల ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. భక్తి అనేది ఇంట్లోనే మొదలవ్వాలి. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథిదేవో భవ. బాల్యంలోనే ఈ భావం కలగడం వల్ల పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. క్రమశిక్షణ, సత్యం పలకడం, ఇతరులకు సహాయం చేయడం వంటి ఉత్తమ గుణాలను అలవరుచుకోవడం.‘కౌమారే విద్యార్థినః’విద్యతోపాటు విజ్ఞానాన్ని ఇచ్చే భక్తి కూడా అవసరం. లోకజ్ఞానాన్ని ‘విద్య’ ఇస్తే, భక్తి విచక్షణా జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రాణం పోయాక ఎంతో ప్రేమగా చూసుకునే భార్య వాకిలి వరకే వస్తుంది. బంధుమిత్రులు వల్లకాటి వరకే వస్తారు. కాని ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఏ దేహం ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నాడు. అటువంటి పరబ్రహ్మను వదిలేసి జీవితమంతా ప్రాపంచపు విషయాల్లో ఉంటూ జల్సాలు చేస్తే చివరికి మిగిలేది దుఃఖమే. చిన్నప్పుడే దైవ భక్తిని అలవరచుకోవడం అనేది వ్యక్తి జీవన ప్రయాణానికి బలమైన దిక్సూచిని నిర్మించుకోవడంతో సమానం. బాల్యంలో మనసు స్వచ్ఛంగా, మృదువుగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో నాటిన భక్తిబీజాలు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
భక్తితో బాల్యంలోనే భరోసా
ఈ కాలంలో పిల్లలు చదువుల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. భక్తి అనేది వారిలో ఒక రకమైన భరోసాను నింపుతుంది. ‘మనల్ని రక్షించే శక్తి ఒకటి ఉంది‘ అనే నమ్మకం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన పురాణగాథల్లోని ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారి కథలు వినడం ద్వారా సత్యం, ధర్మం, ఓర్పు వంటి లక్షణాలు అలవడతాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం కలుగుతుంది. ‘దైవ భీతి’ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తప్పు చేస్తే దేవుడు చూస్తున్నాడనే భావన పిల్లలను చెడు మార్గాల వైపు వెళ్లకుండా అడ్డుకుంటుంది. దైవ చింతన, ఆధ్యాత్మిక పరిమళం ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలకు క్రమశిక్షణ ఉంటుంది.సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్. నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః (శంకరాచార్యుల భజగోవిందం) చిన్నతనంలోనే దైవచింతన ఉన్నవారితో కలవడం వల్ల కలిగే మార్పు. మంచి వారితో స్నేహం (సత్సంగం) వల్ల ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. భక్తి అనేది ఇంట్లోనే మొదలవ్వాలి. మాతృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథిదేవో భవ. బాల్యంలోనే ఈ భావం కలగడం వల్ల పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. క్రమశిక్షణ, సత్యం పలకడం, ఇతరులకు సహాయం చేయడం వంటి ఉత్తమ గుణాలను అలవరుచుకోవడం.‘కౌమారే విద్యార్థినః’విద్యతోపాటు విజ్ఞానాన్ని ఇచ్చే భక్తి కూడా అవసరం. లోకజ్ఞానాన్ని ‘విద్య’ ఇస్తే, భక్తి విచక్షణా జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రాణం పోయాక ఎంతో ప్రేమగా చూసుకునే భార్య వాకిలి వరకే వస్తుంది. బంధుమిత్రులు వల్లకాటి వరకే వస్తారు. కాని ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఏ దేహం ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నాడు. అటువంటి పరబ్రహ్మను వదిలేసి జీవితమంతా ప్రాపంచపు విషయాల్లో ఉంటూ జల్సాలు చేస్తే చివరికి మిగిలేది దుఃఖమే. చిన్నప్పుడే దైవ భక్తిని అలవరచుకోవడం అనేది వ్యక్తి జీవన ప్రయాణానికి బలమైన దిక్సూచిని నిర్మించుకోవడంతో సమానం. బాల్యంలో మనసు స్వచ్ఛంగా, మృదువుగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో నాటిన భక్తిబీజాలు జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
భగవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు?
Tallapaka Annamacharya Jayanthi భగవంతుడు ఎవర్ని అనుగ్రహిస్తాడు? ఇది తరతరాల ప్రశ్న.. ప్రతి యుగం లోని సరి అయిన జవాబు దొరికినా మళ్ళీ అదే ప్రశ్న!.. అలవైకుంఠపురంలోని మూల సౌధంబు లోంచి బయలు దేరాడు విష్ణువు శరణు కోరిన కరిరాజుని రక్షించడానికి.. తక్కువ కులస్థుడైనా గుహుడిని అక్కున చేర్చుకున్నాడు, రామచంద్రుడు.. శబరి ఎంగిలి పళ్ళు తిన్నది ఆ రాముడే.. ఉడత చేసిన సహాయానికి ఉడతని స్పృశించినది ఆ ఉత్తమోత్తముడే.. భారతంలో విదురుణ్ణి విజ్ఞానిగా పరిగణించారు, కులంతో నిమిత్తం లేకుండా. కర్ణుడి వ్యధ ఏకలవ్యుడి కధా కులరహిత సమాజం కోసమే. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు నేను నాల్గు వర్ణాలనే సృష్టించాను అని స్పష్టంగా చె΄్పాడు. వేద వేదాంగాలు, ఉపనిషత్తులు ముక్తకంఠం తో ఘోషించాయి కులం లేదని.. ‘ఇదంతా బ్రహ్మమే’ అని...పురాణాల్లో ఉదాహరణలు తీసుకోలేదు కానీ వాటి సారాన్ని తన ‘తత్వ బోధన’ మధురంగా, మనోరంజకంగా మనకు సులువైన తెలుగు భాష లో అందించాడు అన్నమయ్య.... 600 సంవత్సరాల క్రితమే ఇప్పటి మన రాజ్యాంగంలో కుల మత ప్రసక్తి ఉండ కూడదన్న విషయానికి ఊపిరి ΄ోశాడేమో అన్నమయ్య...అన్నమయ్య కోశం నుండి జాలు వారిన ఆధ్యాత్మిక ఆణిముత్యాల సారం కులం కన్నా భక్తి మిన్న అని... సమదృష్టి సక్రమ మార్గం అని. సకల శాస్త్రాల సారాన్ని అందమైన భాషలో అనంతమైన భావాన్ని రాగవంతంగా మేళవించి వేదాంత ధోరణిలో సంఘానికి ‘సమ దృష్టి’ తో ఉండాలని సలహా ఇచ్చాడు.... ‘బ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే’ అని ఎలుగెత్తి చాటుతూ, హీనం, అధికం లేవని, ఎక్కువ తక్కువలు లేనే లేవని, జంతువులు, మనుషులు అనే భేదం లేకుండా, కుల మత భేదం లేకుండా ఉండాలని, అందరిలో ని శ్రీహరి ఉన్నాడని, శ్రీ హరే పరబ్రహ్మస్వరూపం అని చెప్పాడు.‘తందనాన ఆహి తందనాని పురె’ లో కూడా అదే భావాన్ని జోప్పించాడు.. అందరికి శ్రీ హరే అంతరాత్మ అని అంటాడు.. రాజు గారి నిద్రకి బంటు నిద్రకి తేడా లేదంటాడు.. భౌతికంగా చూడొద్దు, భేదభావాలు వద్దని చె΄్తాడు. చని΄ోయాక బ్రాహ్మణుడైన, చండాలుడైన చేరవలసింది ఒకచోటుకే అని చె΄్తాడు.. ప్రకృతికి తారతమ్యాలు లేవంటూ ఎండకు ఏనుగైనా, శునకమైనా సమానమే అని సెలవి స్తాడు..‘చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు’ అని ప్రశ్నిస్తూ సమ బుద్ధితో సంకీర్తనం చెయ్యండి. వేషభాషలతో విష్ణువుకు దగ్గర కాలేరని చెబుతాడు.వేదవట్టి యికనేమి వేదకేరు చదివేరు’ అని వెటకారం చేస్తూ వేదాలు చదివినా భగవంతుని తెలుసుకోజాలరని, భక్తి ముఖ్యమని, చదువు, కులం జ్ఞానం కన్నా భక్తి ముఖ్యమని ముక్తాయింపు చేస్తాడు.‘ఎక్కువ కులజుడైన హీన కులజుడైనా నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడ’ని నిజమైన భక్తి, నిక్క మైన జ్ఞానం ఉన్నవాడే గొప్పవాడని ఘోషిస్తాడు.‘వేదాలు వచ్చినా హరిభక్తి లేని సోమయాజి కన్నా విష్ణుపాదాలని వదలని కుల హీనుడే ఘనుడు’ అని ఘంటాపదంగా నొక్కి వక్కాణించాడు.‘ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగినవాడు’ అంటూ తుది ఘడియల్లో హరినే స్మరిస్తే హరిని చేరుకుంటారని భక్తిమార్గం చూపిస్తున్నాడు.ఇలా ఎన్నో కీర్తనల్లో జీవరాశుల పట్ల సమదృష్టి ఉండాలని బోధించాడు... కొంగు బంగారమైన స్వామిని కొలవమన్నాడు.. అదివో అల్లదిగో, కొలువై ఉన్నాడు గోవిందరాజు, వేడుకుందామా అని శరణు వేడుకుంటున్నాడు, ఎందుకంటే ఇందరికి అభయమిచ్చు చేయి కాబట్టి...చివరగా... గాలికి కులమేది, నేలకి కులమేదని డా. సి నారాయణ రెడ్డి ప్రశ్నిస్తే, ఏ కులము నీదంటే, గోకులం నవ్విందని వాపోయారు వేటూరి సుందర రామ మూర్తి గారు. కులమతాలు వద్దంటూ వెంకటేశ్వరునిలో ఐక్యమైన అన్నమయ్య కుల మతాలతో చిచ్చువద్దని, అవి జాతి ఐక్యతని దెబ్బ తీస్తాయనీ పరోక్షంగా పలికాడు.. ఈ కీర్తనలను స్ఫూర్తిగా తీసుకుని కుల మత చిచ్చులో పడకుండా మన జాతిని మనం రక్షించు కుందాం..– డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..
తిరుపతి సమీపంలోని రాయలచెరువులో ఉన్న శ్రీ శక్తి పీఠం ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని ఈ శ్రీ శక్తి పీఠాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పీఠం భారతీయ సనాతన సంస్కృతి, యోగ విద్యలకు నిలయంగా అలరారుతోంది. ఈ పీఠాన్ని మాతాజీ రమ్యానందభారతీ స్వామిని (సిద్ధాశ్రమ యోగి) నిర్వాహిస్తున్నారు. ఆమె ధర్మాచరణ ప్రచారంలో భాగంగా మన భాగ్య నగరానికి విచ్చేసిన నేపథ్యంలో మన సాక్షి ఆ అమ్మతో సంభాషించి..మన పాఠకులుకు కలిగే ఎన్నో దర్మసందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. మరి అవేంటో సవివరంగా చూద్దామా.."శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అన్న రీతిలో సామాన్యులు సైతం సులభంగా ఆ భగవంతుని కృపకు ఎలా పాత్రులు కాగలరు, అలాగే శ్రీ విద్యా ఉపాసన, సులభంగా ఇంట్లోనే చేయడం, యజ్ఞ యాగ క్రతువులు ఏవిధంగా చేయొచ్చు, ఇంకా..మరకతవర్ణ కాళిదేవి విశిష్టత, క్షుద్ర పూజలు ఉన్నాయా..? తదితర ధర్మ సందేహాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!తిరుపతి శ్రీశక్తి పీఠాధిపతి మాతాజీ రమ్యానందభారతీ స్వామిని జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామివారి ప్రధాన శిష్యులలో ఒకరు. ఆమెను స్వయంగా సిద్ధేశ్వరానందభారతీ స్వామివారే "సిద్ధాశ్రమ యోగి"గా అభివర్ణించారు. మాత రమ్యానంద భారతీ స్వామి ప్రస్థానం డాక్టర్‌గా మొదలైన ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసిన గొప్పయోగి ఆమె. సామాన్య భక్త జనం మదిలో మెదిలో ఎన్నో సందేహాలను చిరుదరహాసంతో నివృత్తి చేసేలా అద్భుతమైన పరిష్కార మార్గాలను అందించారు. అవేంటంటే.సువాసిని పూజ ప్రధానోద్దేశ్యం? ఎందుకోసం?లలితాదేవిని "సువాసినర్చన ప్రీత" అని లలితా త్రిశతి మంత్రల్లో ఉంటుంది. అంటే దీని అర్థం సువాసినులను (భర్తతో కూడిన స్త్రీలను) పూజించడం (అర్చించడం) వల్ల సంతోషించే దేవత అని. ఇక్కడ సువాసినీ: అంటే సౌభాగ్యవతి, పసుపు కుంకుమలతో ఉన్న స్త్రీ. లలితా దేవిని సువాసినీ పూజ ద్వారా ఆరాధిస్తే, ఆమె అత్యంత ప్రసన్నురాలై భక్తుల కోరికలను నెరవేరుస్తుందని లలితా త్రిశతి తెలియజేస్తుంది. అలాగే ఎక్కడ యత్ర నార్యంతు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! అన్న ఆర్యోక్తిని చాటి చెప్పేలా ఈ పూజలను నిర్వహిస్తున్నామని చెప్పారు అమ్మ రమ్యానంద భారతీ. అదీగాక జనవరిలో తిరుపతి క్షేత్రంలో కలియుగ వేంకటేశ్వరుడు, పద్మావతి దేవి వకుళమాత ఉన్న ఆ పుణ్యక్షేత్రంలో దశసహస్ర సువాసినీ పూజ జగడమే గాక గిన్నిస్ రికార్డులకెక్కిన సంగతి కూడా తెలిసిందే. స్తీల గొప్పతనం, వారిని గౌరవించటం గురించి సమాజానికి తెలియజేయడమే ఈ పూజ ప్రదానోద్దేశ్యమని అన్నారామె.పంచాయతన పూజ..పంచాయతన సమేత/పూజ అంటే..?హిందూ సాంప్రదాయంలో, ముఖ్యంగా స్మార్త సంప్రదాయంలో పంచాయతన పూజ (ఐదుగురు ప్రధాన దేవతల ఆరాధన) చాలా ముఖ్యమైనది.పంచాయతన 'పంచ' (ఐదు) + 'ఆయతన' (స్థానం/నివాసం). ఐదుగురు ప్రధాన దేవతల సమూహం.దేవతలు: శివుడు, విష్ణువు, శక్తి (దేవి), గణపతి, మరియు సూర్యుడు.ఉద్దేశ్యం: ఆది శంకరాచార్యులచే ప్రచారం చేయబడిన విధానం ఇది. వివిధ ఆరాధనా మార్గాల (శైవం, వైష్ణవం, శాక్తేయం మొదలైనవి) మధ్య ఐక్యతను తెస్తుంది.పంచాయతన సమేతపైన పేర్కొన్న ఐదుగురు దేవతలను ఒకే సమయంలో, నిర్దిష్టమైన స్థానాల్లో ఉంచి పూజించటం. క్తుడు తన ఇష్ట దైవాన్ని (శివుడు, విష్ణువు మొదలైనవారు) మధ్యలో ఉంచి, మిగిలిన నలుగురిని నాలుగు దిక్కులలో ఉంచి పూజిస్తారు. ఉదాహరణకు, శివుడు ప్రధానమైతే, అది "శివ పంచాయతనం" అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇష్టం దైవం మధ్యలో ఉంచి మిగిలిన వారిని పరివార దేవతలుగా పూజించటం. తంత్రం అంటే..తంత్రం అంటే.. మనల్ని రక్షించేదాన్ని తంత్రం అంటారు. అవి చాలా రకాలు ఉదాహరణకు శ్రీ విద్యా తంత్రం మేరుశాస్త్ర తంత్రం అని పలు రకాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో. అదీగాక సమస్త శాస్త్రంలో తంత్ర శాస్తం ఉత్తమం అని, వేద సమ్మతమైనదని మన పురాణాలే నొక్కి చెబుతున్నాయి. దేవతకు ఎటువంటి పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, ఏవిధంగా ఆరాధించాలి వంటివే ఈ తంత్రాలు. ఏ సమయంలో పూజ చేయాలి, ఎలాంటి హోమాలు చేయాలి. వీటి గురించి వివరించేది తంత్ర శాస్త్రం.కాళి అంటే అరుణ వర్ణం, శ్యామ వర్ణం మరకతవర్ణ కాళి అంటే..?కాలంతో ప్రకాశించే దేవి కాబట్టి నలుపు అని అంతా భావించి అందరూ ఆ మాతను నల్లనిదిగా చెప్పారు. కానీ ప్రతీదేవతకు సత్వ, తామస, రాజస లక్షణాలు ఉంటాయి. తామస లక్షణం కలిగింది నల్లటి కాళి, శ్యామా కాళీ. ఇక శ్రీశక్తిపీఠంలో కొలువుదీరిన మరకతవర్ణం కాళి అంటే..అక్కడ అమ్మ మరకతవర్ణంతో ప్రకాశించాలని ఆదేశింంచిదని, అందువల్ల ఈ ఏర్పాటు చేశామని మాత రమ్యానంద భారతీ చెప్పారు. అదీగాక ప్రకృతి రూపమే మరకతవర్ణం. ఇక్కడ మరకతవర్ణం అంటే చిరునవ్వుతో ప్రేమ స్వరూపిణీగా కనిపించే కాళిమాత. త్వరగా భక్తులను గ్రహిస్తుంది. మరకతవర్ణశిలపై చెక్కిన దేవత. ఇక్కడ కొలువుదీరిన సిద్ధేశ్వరుడు సైతం మరకతవర్ణమే. అంతేగాదు ఈ మరకతవర్ణం ఐశ్వర్యాన్ని, మనశ్శాంతిని అందిస్తుంది. కోరుకున్న సంకల్పం నెరవేరడానికి మరకతవర్ణంలోని దేవతలను పూజించే ఆచారం మన పురాణాల్లో కూడా ఉంది.శ్వేత పాతాళ వారాహి అంటే..?హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోయాడు. ఆయన బ్రహ్మదేవుడి గురించి తప్పస్సు చేసినట్లు పురాణాల్లో విన్నాం, చదివాం. కానీ ఆయన వారాహి దేవి కోసం తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే. మరణం లేని వరం కావాలని కోరాడు. అందుకు అమ్మ సమ్మతించకపోవడంతో హిరణ్యాక్షుడు తెలివిగా నువ్వే సంహరించాలి..అలాగని ఆమెనే స్వయంగా సంహరించకుండా ఉండేలా వరం కోరతాడు. అమ్మ ప్రసన్న వదనంతో తథాస్తు అంటుంది. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు భూమిని పాతాళలోకంలో దాచే ప్రయత్నం చేస్తాడో అప్పుడు మానవులకు దేవతాలకు భూ కష్టాలను నివారించేందుకు విష్ణువు సమాయక్తమవుతాడు. అప్పుడు వారాహి దేవిలోని శ్వేత వరాహం విష్ణువులో ప్రవేశింపచేస్తుంది. దాంతో విష్ణువు వరాహరూపం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. అలా వచ్చిందే శ్వేత వరాహం. ఆమె వ్యవసాయ దేవత కూడా. అందువల్ల భూ సంబంధమైన కష్టాలు, ఆస్తి తగదాలతో సతమతమయ్యే వాళ్లు ఈ అమ్మ పూజించి ఆ సమస్యలను పోగొట్టుకుంటారని చెప్పారు. ఇంట్లోనే హోమాలు, యాగాలు చేయొచ్చా?అయితే ఇలాంటి క్రతువులు ఇంట్లోనే చేయడం అనేది సులభం కాదని అన్నారు. అలాగే మన పురాణాల్లో చూసినా కూడా ఎక్కడా కూడా.. పలాన పర్వతం, దేవాలయం, అడవుల్లో చేసినట్లే ఉంటాయి. పైగా ఓ క్షేత్రం, పీఠం అని కూడా ఉంటుంది. అంటే అక్కడ ప్రాణ ప్రతిష్ట చేసి ఎంతో నిష్టతో పూజలు కైంకర్యలు నిర్వహిస్తారు. పైగా అక్కడ అత్యంత శక్తిమంతంగా ఉంటుంది. అందుల్లో అలాంటి పీఠాలలో లేదా దేవాలయాలు, ప్రుమఖ పుణ్యక్షేత్రాల్లోనే హోమాలు, యాగాలు చేయడం శ్రేష్టమని అన్నారామె. అలాగే అంత ఖర్చు పెట్టలేని వారు, తమ శ్రీశక్తిపీఠంలో చేయించుకోవచ్చని, ఇక్కడ ఉచితంగానే నిర్వహిస్తామని, అన్ని తామే ఇస్తామని చెప్పారామె.శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా?ఎలా పూజించాలి?యంత్రంలలోకెల్లా గొప్పది శ్రీయంత్రం..విగ్రహాన్ని గానీ, యంత్రాన్ని గానీ తెచ్చి ప్రాణప్రతిష్ట చేస్తే నిత్య పూజలు, నైవేద్యం పెట్టాలి. ప్రాణ ప్రతిష్టలేకుండా విగ్రహం, యంత్రం పూజించినా ఎలాంటి దోషం లేదు. ఎప్పుడైతే ప్రాణప్రతిష్టం చేస్తామో అక్కడ అమ్మవారి వచ్చి కూర్చోంటుంది కాబట్టి అనునిత్యం పూజ చేయాలి. అయితే గృహస్థులకు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆటంకాలు వస్తాయి. అలాంటి సందర్భంలో బియ్యం డబ్బాలో ఉంచుకుంటే సరిపోతుంది. కానీ ఇంట్లో మాత్రం ప్రాణప్రతిష్ట చేయకుండా పెట్టుకుని పూజించొచ్చు. ఎలాంటి సమస్య లేదన్నారామె.క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయా? అది నిజమేనా?ప్రకృతి ఉంటే వికృతి ఉంటుంది. దైవం ఉంటే దెయ్యం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు అంత నిష్టగా క్షద్రప్రయోగాలు చేయడం లేదు గానీ మనుషులంతా కేవలం తమ నెగిటివ్ వైబ్రేషన్స్‌తో అవతవాళ్లపై ప్రయోగాలు చేస్తున్నారని చమత్కరించారామె. తపస్సుకి, మంత్రానికి అధిదేవతలు దేవుళ్లు. దేవతా సాధన చేసేవాళ్లు, మానసిక పరిస్థితి స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్లపై ఇలాంటి ప్రయోగాలు అంతగా పనిచేయవన్నారు. ఆందోళనలు, బలహీన మనస్సు ఉన్నవారు సులభంగా ఆ ప్రభావానికి గురవ్వుతారని అన్నారు. ఎవ్వరూ ఎలాంటి ప్రయోగాలు చేసినా..మీరు తట్టుకునేలా స్ట్రాంగ్‌గా మారండి. భగవంతుడి సాధన చేయండని పిలుపునిచ్చారామె. మరి ఎవరైనా ప్రయోగాలు చేస్తే..వాటి లక్షణాలు కనిపిస్తాయా? అంటే ఈజీగా తెలుసుకోవచ్చన్నారు. కొన్నింటికి పరిష్కారమార్గం తెలుసుకునే వ్యవధి ఉండదని, కొన్నింటికి మాత్రం సమయం ఉంటుందని అన్నారు కావున సకాలంలో మంచి గురువులని ఆశ్రయించి వాటి నుంచి సులభంగా బయటపడొచ్చని అన్నారు.వామాచారం అంటే..ఏకశ్వేరోపాసనే అసలైన వామాచారం. ఒకే దేవుడిని పూజిస్తా అనేదే వామాచారం. ఇందులో సరైన గురువు దొరికితే ఫలితం రావొచ్చు. మన పురాణాల్లో నరకాసురుడి దీన్ని అనుసరించి శక్తులు ఎన్ని సంపాదించినా కామాఖ్య దేవి వెళ్లిపోయింది అన్న విషయాన్ని గుర్తుచేశారామెడాక్టర్ కమ్ ఆధ్యాత్మిక వేత్తగా మంత్రం అనారోగ్యం నుంచి రక్షించగలదా?ఆధ్యాత్మికతలోనే ఎన్నో వైద్య రహస్యాలు ఉన్నాయి. మణి మంత్ర, ఓషధులతో ఎన్నో రోగాలను నయం చేయొచ్చని అన్నారు. తాను వైద్యాన్ని మంత్ర సారాన్ని అనుసంధానిస్తు..కొన్ని పుస్తకాలను సైతం రాశానని చెప్పారు. మరింత పూర్తివివరంగా ధర్మ సందేహాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వీడియోపై క్లిక్ చేయండి. (చదవండి: ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!) -
ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొద్దిరోజుల ముందు తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ ఆధ్యాత్మిక పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం(ఏప్రిల్ 28, 2026) తెల్లవారుజామునే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్న ఆయన, అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు పంచె, పట్టు చొక్కా ధరించిన విజయ్, స్వామివారి ‘విశ్వరూప దర్శనం’లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారి ప్రసాదంతో పాటు వెండి ‘వేల్’ను బహుకరించారు. ఇది మత విశ్వాసాలకి సంబంధించినది మాత్రమే కాదు..సర్వమత సామరస్యానికి అతీతంగా చేసిన ఒక సంజ్ఞ కూడా. ఈ నేపథ్యంలో ఆ ఆలయం ప్రత్యేకత, ప్రాశస్త్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఈ తిరుచెదూర్ ఆలయం సముద్రపు ఒడ్డున ఉంది. సుబ్రమణ్యస్వామి పిలవబడే మురుగన్ దేవునికి చెందినదే ఈ తిరుచెందూర్ ఆలయం. మరుగన్ ఆరు నివాసాలో ఒకటిగా పేరొందిన మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఈ గుడి తమిళ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మికత వంటి అపార ప్రాముఖ్యత కలిగిన ఆలయం. చరిత్ర..ఈ ఆలయం చరిత్ర ప్రాచీన కాలం నాటిది. దీని ప్రస్తావన తమిళ సంగం సాహిత్యం కనిపిస్తుంది ఇక్కడ మురుగన్ దేవుడు రాక్షసుడైన సూరపద్మన్‌తో పోరాడి ఓడించాడని నమ్ముతారు. ఈ పౌరాణిక ఘట్టాన్ని సూరసంహారంగా జరుపుకుంటారు. శతాబ్దాలుగా, పాండ్య, చేర, చోళ, విజయనగర పాలకులతో సహా వివిధ తమిళ రాజవంశాలు దీని అభివృద్ధికి దోహదపడ్డారు. అలాగే, 17వ శతాబ్దంలో డచ్ వారి దండయాత్ర సమయంలో, కొన్ని విగ్రహాలను తీసుకువెళ్లారు, కానీ తరువాత వాటిని భక్తులు తిరిగి కనుగొనడం విశేషం.ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ వాస్తుశిల్పానికి నిలయం. ఇందులో విస్తృతమైన శిల్పాలు, స్తంభాల మండపాలు, ఎత్తైన గోపురాలు ఉంటాయి. ఇక్కడ సుమారు 137 అడుగుల ఎత్తులో ఉన్న 9-అంచెల రాజగోపురం నుంచి సముద్రాన్ని వీక్షించడం ప్రధాన ఆకర్షణ. అలాగే ఇక్క ప్రధాన గర్భగుడిలో యోగ భంగిమలో ఉన్న మరుగన్ దేవుడు వల్లి, దేవసేన సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. అంతేగాదు ఇక్కడ మురుగన్ వల్లి వివాహాల గాథలతో ముడిపడి ఉన్న ఒక గుహ కూడా సమీపంలో ఉంది. అలాగే సముద్రానికి సమీపంలో ఉన్న సహజ మంచినీటి ఊట నాజికినారును కూడా భక్తలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వెనక్కి తగ్గిన సునామీ..2004 డిసెంబర్లో వచ్చిన సునామీ తమిళనాడు తీరంపైనా తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. సునామీ కారణంగా మిగతా ప్రాంతాల్లో సముద్ర జలాలు ముందుకు రాగా.. తిరుచెందూర్‌లో మాత్రం సముద్రుడు వెనక్కి తగ్గాడు. దీంతో సముద్ర తీరానికి ఆనుకొని ఉండే ఈ ఆలయానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. నీటి వల్ల ఈ ఆలయానికి ఎలాంటి హాని జరగదనే వరం ఉందని చెబుతారు.ఆలయ ఆచారాలు..ఆలయం సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.సాంప్రదాయబద్ధంగా రోజుకు ఆరుసార్లు మురుగన్ పూజ నిర్వహిస్తారు.దేవుడికి పాలు, చందనం, పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు.ఆలయంలో భక్తులు భక్తికి చిహ్నంగా వేల్స్ సమర్పించి, తలనీలాలు సమర్పించుకుంటారు.ఎలా చేరుకోవాలంటే..సమీప విమానాశ్రయం - తూత్తుకుడి విమానాశ్రయం (సుమారు 40 కి.మీ.), మదురై విమానాశ్రయం (సుమారు 190 కి.మీ.) ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.తిరుచెందూర్ రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన పట్టణాలతో అనుసంధానించబడి ఉంది.మదురై, తిరునెల్వేలి, తూత్తుకుడి నుంచి ఈ పట్టణానికి బస్సుల ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది.(చదవండి: సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..) -
విశిష్ట ఫలదాయకం... వైశాఖ పూర్ణిమ
వైశాఖ శుద్ధ పూర్ణిమ (వైశాఖ పౌర్ణమి) హిందూ, బౌద్ధ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన రోజు. దీనిని ‘బుద్ధ పూర్ణిమ’ అని, ‘మహా వైశాఖి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును కూర్మావతారంలో పూజించడం, నదీస్నానం చేయడం, అశ్వత్థ వృక్షాన్ని అంటే రావి చెట్టును ఆరాధించడం వల్ల అక్షయ పుణ్యఫలం లభిస్తుందని, చేతనైనంత దానధర్మాలు చేయడం వల్ల నరఘోష తొలగిపోతుందని శాస్త్రోక్తి.విశిష్టతలు: బుద్ధ పూర్ణిమ/జయంతి: సిద్ధార్థుడు జన్మించడం, జ్ఞానోదయం పొందడం, మహా పరినిర్వాణం చెందడం అనే మూడు ముఖ్యమైన ఘట్టాలు ఇదేరోజు జరగడంతో దీనిని ‘త్రివిధ పుణ్యదినం’గా బౌద్ధులు జరుపుకుంటారు.శ్రీ కూర్మ జయంతి: శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించిన రోజుగా కూర్మ పురాణం చెబుతోంది.ఈ రోజు కూర్మనారాయణుని ఆరాధించడం సత్ఫలితాలనిస్తుంది.సముద్ర/నదీ స్నానం: ఈ రోజున సముద్రంలో లేదా గంగానదిలో స్నానం చేయడం అత్యంత పవిత్రం. కరక్కాయను సముద్రంలో వేసి స్నానం చేస్తే నరదిష్టి, నరఘోష తొలుగుతాయని నమ్మకం.చదవండి: మంచుకొండల్లో ఓంకార నాదంరావి చెట్టు పూజ: వైశాఖ మాసంలో రావిచెట్టుపై విష్ణుమూర్తి కొలువై ఉంటాడని, ఈ పూర్ణిమ రోజు రావి చెట్టును పూజిస్తే శని, బృహస్పతుల అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు లభిస్తాయని పెద్దల మాట.అన్నమాచార్య జయంతి: సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యుల వారు జన్మించిన రోజు కావడంతో దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. దానధర్మాలు: ఈ రోజున చేసే జలదానం, వస్త్రదానం, ఆహార దానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయని పురాణోక్తి.– డి.వి.ఆర్. -
నా దేహాన్ని మీకు భిక్షగా ఇస్తాను.. స్వీకరిస్తారా?
ఆమ్రపాలి క్రీ.పూ. 500 సంవత్సర ప్రాంతానికి చెందినది. గౌతమ బుద్ధుని సమకాలికురాలు. ఆమ్రపాలి అంటే ‘మామిడి చిగురు’ అని అర్థం. ఆమ్రపాలికి అంబపాలిక, అంబపాలి, ఆమ్ర అనే నామాంతరాలూ ఉన్నాయి. ఆమె తల్లిదండ్రులెవరో తెలియదు. వైశాలి నగరంలో మామిడి తోటలో ఒక చెట్టు కింద పసిపిల్లగా ఏడుస్తూ పడి ఉంటే సోమదత్తుడు అనే ఆయన ఇంటికి తెచ్చుకొని ఆ పాపను పెంచి పెద్ద చేశాడు. కౌమార దశలోనే ఆమ్రపాలి అపురూప సౌందర్యవతిగా, అద్భుత నాట్య కళాకారిణిగా ఖ్యాతి గడించింది.లిచ్ఛవి జాతికి చెందిన రాజులకు వైశాలి నగరం రాజధానిగా ఉండేది. ఆ కాలంలో అందమైన స్త్రీలు పెండ్లిచేసుకొని కేవలం ఒక వ్యక్తితో జీవించడం కాక, తమకు నచ్చిన పురుషునితో రోజుకు ఒకరితో గడిపే ఆచారం వైశాలిలో ఉండేది. ఆమ్రపాలి తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు అయిన పుష్ప కుమారుని వివాహం చేసుకోవాలనుకొంది. కానీ వైశాలి రాజు మనుదేవుని కన్ను ఆమ్రపాలిపై పడింది. ఆమె పెండ్లి రోజునే పుష్పకుమారుని హత్యచేసి మనుదేవుడు ఆమ్రపాలిని వైశాలి ‘నగర వధు’ (వేశ్య)గా అధికారికంగా ప్రకటించాడు.ఆమ్రపాలి రాజనర్తకిగా నియమింప బడింది. ఆమె జగన్మోహన సౌందర్యం, అసమాన నాట్య కౌశలం ఎంతోమంది రాజులను, ధనవంతులను ఆకర్షించింది. ఆమె నాట్యం చూడటానికి, ఆమెతో గడపటానికి యాభై ‘కార్షపణములు’ వెలగా నిర్ణయింపబడింది. స్వల్పకాలంలోనే ఆమ్రపాలి సంపద ఏ రాజు కోశాగారంలో లేనంతగా పెరిగి పోయింది. అలా రాజనర్తకి, సౌందర్యరాశి అయిన ఆమ్రపాలి రాజాధిరాజుల, ధనవంతుల ప్రాపకంలో అత్యంత ధనవంతురాలై, సుఖంగా జీవించ సాగింది. గౌతమ బుద్ధుడు వైశాలి నగరానికి వచ్చాడు. ఆయన గొప్పదనం గూర్చి చెలికత్తెల ద్వారా విని, ఆయన తన వద్దకు ఎందుకు రాలేదా అని ఆశ్చర్య పడింది ఆమ్రపాలి.ఒకరోజు బుద్ధుడు వచ్చి, ఆమె భవనం ముందు నిలబడి భిక్ష కోరాడు. సమస్త ఆభరణాలూ ధరించి, ద్విగుణీకృత అలంకారాలతో ఆమ్రపాలి బయటకు వచ్చి, తన సౌందర్యవంతమైన రూపలావణ్యాలను ప్రదర్శిస్తూ బుద్ధుని ముందు నిలబడి, ‘‘నా ఈ దేహాన్ని మీకు భిక్షగా ఇస్తాను. స్వీకరిస్తారా’’ అని వగలొలికిస్తూ అడిగింది. ఆమె మాటలు విని కొంతసేపు కండ్లు మూసుకొని, తర్వాత కండ్లను తెరిచి, బుద్ధుడు ఆమ్రపాలితో ‘అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు నీ భిక్షను తప్పక స్వీకరిస్తాను. అందాకా సెలవు‘ అని చెప్పి వెళ్ళిపోయాడు.కొంతకాలానికి ఆమ్రపాలి శరీర పటుత్వం తగ్గింది. వేశ్యావృత్తి వలన ఆమె శరీరాన్ని అనేక రోగాలు చుట్టుముట్టాయి. క్రమంగా ఆమె కుష్ఠురోగి అయ్యింది. కురూపి అయ్యింది. విటులతోబాటు దాసదాసీ జనమంతా దూరమయ్యారు. సంపద నశించి పోయింది. ఆమె వికార రూపం అందరితో అసహ్యించుకోబడింది. సమాజంచే బహిష్కరింపబడిన ఆమ్రపాలి ఊరి బయట ఒక చిన్న కుటీరంలో దుఃఖభూయిష్ట జీవితం గడపసాగింది. ఒకరోజు వర్షం పడుతూండగా సాయంత్రంవేళ, చిరుచీకట్లు అలుముకొంటున్న సమయంలో, తన కుటీర ఆవరణలో కూర్చొని ఉన్న ఆమ్రపాలికి ’అమ్మా’ అన్న పిలుపు వినబడింది. ఒక ఆజానుబాహువు తన దగ్గరకు వస్తూండడం చూసి, బుద్ధుడు అని గ్రహించి, ‘అక్కడే ఆగు. సమీపానికి రావద్దు. నేనొక కుష్ఠు రోగిని’ అనింది ఆమ్రపాలి.‘అమ్మా, మరిచావా నన్ను. ఒకరోజు భిక్షకోరి మీ ఇంటికి వస్తే మీ శరీరాన్నే భిక్షగా ఇస్తానన్నారు. అలాంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు తప్పక స్వీకరిస్తానని అన్నాను. ఇప్పుడు ఆ భిక్షను ఇవ్వమ్మా’ అని ఆర్ద్రంగా పలికాడు బుద్ధుడు. ‘ఆ రోజు నేను నీకు ఇస్తానన్నది అందం, ఆరోగ్యం, యవ్వనంతో కూడిన శరీరాన్ని. ఈ రోజు ఆ దేహం వ్యాధిగ్రస్తమయ్యింది’ అంటూ దూరం జరిగింది ఆమ్రపాలి. చదవండి: సంకల్పం ముందు వైకల్యం ఎంత!దయామయుడైన బుద్ధుడు ‘అమ్మా, అందచందాలతో మాకు అవసరంలేదు. భయంకరమైన రోగంతో దేహం శిథిలమైనా పరివర్తన చెందిన మనసు మీది’ అంటూ మరింత దగ్గరగా రాసాగాడు. ఆయన నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళే ప్రయత్నంలో కిందపడిపోయిన ఆమ్రపాలిని తన రెండు చేతులతో ఎత్తుకొని ‘నా కన్నతల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. ఆమెకు సేవ చేసే భాగ్యం నాకు లేక పోయింది. నీలో నా కన్నతల్లిని చూసుకుంటూ సేవచేసే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ’ అంటూ ఆమెను మెల్లగా కుటీరంలోకి చేర్చి, ఆమె తుది శ్వాస విడిచే వరకూ సేవలు చేశాడు కరుణామూర్తి బుద్ధ భగవానుడు.బుద్ధం శరణం గచ్ఛామి– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
మంచుకొండల్లో ఓంకార నాదం
హిమగిరి గుండెల్లో వెలిగిన జ్యోతిర్లింగం విశ్వనాథుడి కైలాస ధామం కేదార్నాథ్ ఈ యాత్ర అంటేనే మదిలోని గుబుళ్లన్నీ వదిలేసి పరమశివుని పాదాల దగ్గర మౌనంగా కూర్చోవడంలాంటిది. గాలిలో వినిపించే ‘ఓం నమఃశివాయ‘ మంత్రం, గంటల నాదం, ఆలయ ప్రాంగణంలో ఉండే అద్మాత్మిక దివ్య శక్తి మనకు తెలియకుండానే మనల్ని ఒక భక్తి లోకానికి తీసుకుని వెళ్తుంది.కేదార్నాథ్ కేవలం ఒక టూరిజం స్పాట్ మాత్రమే కాదు. ఇది ప్రతి భక్తుడి జన్మ ధన్యం అయ్యే ఒక పవిత్ర క్షేత్రం. హిమవంతుడి ఒడిలో, పర్వతాల మధ్య కొలువుతీరిన ఆ మహాదేవుని చూసే ప్రతి కన్ను ధన్యమే అని భక్తుడికి అనిపిస్తుంది. మహాదేవుడి దివ్య సన్నిధిలోకేదార్నాథ్ ఆలయం దగ్గర నిల్చుని ఆకాశంలో చూస్తే ఆ ధవళ వర్ణపు మంచు కొండలు, శివ భగవానుడి జటాజూటంలా కనిపిస్తాయి. ఆయలం లోపల ఉండే స్వయంభూ లింగం ముందు తలవంచితే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఆ చల్లటి గాలిలో కూడా భక్తుల గుండెల్లో ఉన్న భక్తి వేడిని నింపుతుంది.సందర్శనీయ ప్రదేశాలు ఆలయం వెనక ఉన్న భైరవనాథ్ క్షేత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే మొత్తం కేదార్ లోయ మహాదేవుడి పాదాల దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. అది చూస్తేనే భక్తి పరవశం కలుగుతుంది.కొంచెం దూరంలో ఉండే వాసుకి తల్ సరస్సు నిత్య ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుంది. అది చూస్తే ప్రకృతి మొత్తం ఆ శివుడి రూపమే అని అర్థం అవుతుంది.తెలియాల్సినవి..దర్శన సమయం: ఆలయ ద్వారాలు అక్షయ తృతీయ నుంచి కార్తీక పౌర్ణమి వరకు భక్తుల కోసం తెరిచి ఉంటాయి.ప్యాకేజీలు: కేదార్నాథ్ వెళ్లాలనుకునే భక్తుల కోసం 5 రోజుల నుంచి 10 రోజుల వరకు బడ్జెట్‌ను బట్టి అనేక ప్యాకేజీలు లభిస్తాయి.రిజిస్ట్రేషన్: యాత్రకు వెళ్లే ముందు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ పోర్టల్‌లో బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. క్యూఆర్ కోడ్ పాస్ జాగ్రత్తగా కాపాడుకోవాలి.ప్రయాణం: ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ నుండి రుద్రప్రయాగ్ మీదుగా గౌరీకుండ్ చేరుకోవాలి. అక్కడి నుండి 16 కి.మీ ట్రెక్కింగ్ ప్రారంభమవుతుంది.వసతి సదుపాయాలు: కేదార్నాథ్ టాప్ దగ్గర కాటేజీలు, రూమ్‌లు ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మంచిది.ఏం చూడాలి? ఏం తినాలి?కేదార్నాథ్ వెళ్తే సాయంత్రం జరిగే హారతి తప్పక చూడాలి. ఆ హారతి వెలుగులో ఆలయం బంగారు వర్ణంలో మెరిసి΄ోతుంది. కేదార్‌నాథ్‌లో భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఖర్చు మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక్కడ లభించే ‘పహాడి మ్యాగీ’ ఒక క్విక్ స్నాక్‌లా ఎంజాయ్ చేయవచ్చు.ఎలా వెళ్లాలంటే.. హరిద్వార్‌లో గంగా స్నానం చేసి రిషికేష్ నుంచి కేదార్ యాత్ర మొదలు పెట్టడం ఒక సంప్రదాయం. అక్కడి నుంచి రిషికేష్ సోన్ ప్రయాగ్ మార్గంలో నుండి గౌరీకుండ్ చేరుకోవాలి. అక్కడి నుంచి కాలినడకన యాత్రనున కొనసాగించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ యాత్రను ట్రెక్కింగ్ అని పిలుస్తుంటారు. కానీ మనం మాత్రం దీనిని ఒక తపస్సులా భావించి అంతే పవిత్రంగా అడుగులు ముందుకేయాలి. ప్రతి అడుగులో ‘శంభో శంకర’ అంటూ భక్తులు పైకి వెళ్తుంటే ఆ పర్వతాలే స్పందిస్తున్నట్టుగా అనిపిస్తుంది.ఎక్కడ ఉండాలి?కేదార్నాథ్ లోయలో ఉండటం అంటే మహాదేవుడి ఒడిలో నిద్రించడం లాంటిదే. చిన్న చిన్న కాటేజీల్లో కూర్చుని బయట చూస్తే గుడి దగ్గర వెలిగే దీపాలు ఆకాశంలోని నక్షత్రాల్లా కనిపిస్తాయి. ఏం చేయాలి? ఆలయ ప్రాంగణంలో మౌనంగా కూర్చుని ధ్యానం చేయవచ్చు. ఫోన్లలో ఫొటోలు తీయడానికి బదులు కళ్లతో చూస్తూ మనసులో శివుడిని కొలుస్తూ గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి. వీలు చూసుకొని మందాకిని నది తీరంలో కూర్చొని ఆ ప్రవాహాన్ని ఫీల్ అవ్వాలి. నది ప్రవాహంలో మన మదిలోని ఆలోచనలను కొట్టుకు పోతున్నట్టుగా భావించి, కడిగిన ముత్యంలాంటి మనసుతో ఇంటికి తిరిగి చేరుకోవచ్చు. సూర్యోదయం సమయంలో ఆలయం బంగారు వర్ణంలో మారడం చూడటాన్ని అస్సలు వదులుకోకూడదు.యాత్ర – బడ్జెట్ వివరాలుకేదార్నాథ్ యాత్ర ప్లాన్ చేస్తున్నప్పుడు ప్యాకేజీ అంటే కేవలం టికెట్ మాత్రమే కాదు. అది మన ప్రయాణం, భోజనం, వుండే చోటు అన్నీ కలిసిన ఒక పూర్తి ప్రణాళిక. ఈ యేడాది కేదార్నాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తెరుచుకున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే మీ యాత్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. పర్యటను ఎలా ఎంచుకుంటున్నారు అనేదానిని బట్టి, మొత్తం ఖర్చు మారుతుంది.బడ్జెట్ అంచనాసాధారణంగా 5 రోజుల నుంచి 10 రోజుల వరకు యాత్రకు అయ్యే ఖర్చు బడ్జెట్లో రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుంది.కాస్త కంఫర్ట్‌గా వెళ్లాలి అనుకుంటే రూ.45,000 నుంచి రూ.65,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇక లగ్జరీగా, సౌకర్యవంతంగా యాత్ర చేయాలి అనుకుంటే మాత్రం రూ.1.4 లక్ష నుంచి రూ.2.3 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.రవాణా ఖర్చులుట్రావెల్ విషయానికి వస్తే.. రైలులో సుమారు రూ.5,000 వరకు ఖర్చు అవుతుంది. హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు అప్ అండ్ డౌన్ రూ.17,000 నుంచి రూ.33,000 వరకు, లేదా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు రూ.13,000 నుంచి రూ.17,000 వరకు ఖర్చు అవుతుంది. చాలా మంది ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి హరిద్వార్ లేదా రిషికేష్‌కు బస్ లేదా ట్రైన్లో వెళ్లి యాత్రను కొనసాగిస్తారు.వసతి సదుపాయాలుగౌరీకుండ్, సోన్ ప్రయాగ్ ప్రాంతాల్లో బడ్జెట్ గెస్ట్ హౌజ్‌లు రూ.1,000 లోపు దొరుకుతాయి. స్టాండర్డ్ హోటల్స్ సుమారు రూ.3,000 వరకు ఉంటాయి. కేదార్నాథ్ టాప్ దగ్గర పీక్ సీజన్లో ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. జీఎంవీఎన్ టెంట్స్ లేదా రూమ్స్ రూ.1,000 నుంచి ప్రారంభమవుతాయి కానీ ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి.ఫుడ్ ఖర్చుఫుడ్ విషయానికి వస్తే సింపుల్ థాలీ లేదా స్నాక్స్ కోసం రోజుకు ఒక వ్యక్తికి సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అవుతుంది. మొత్తంగా ఫుడ్, స్టే కలిపి రోజుకు రూ.1,200 నుంచి రూ.4,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.ప్యాకేజీలు, హెలికాప్టర్ఐఆర్సీటీసీ ఫ్లైట్ ప్యాకేజీలు ఎంచుకుంటే హైదరాబాద్ నుంచి సుమారు రూ.74,000లో సకల సౌకర్యాలతో ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు. అదే కొన్ని బడ్జెట్ ప్యాకేజీలు రూ.27,000 నుంచే లభిస్తాయి. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి రూ.7,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ సర్వీస్‌ను ఐఆర్సీటీసీ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.లోకల్ ట్రాన్స్పోర్ట్లోకల్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్‌కు గవర్నమెంట్ షటిల్ ట్యాక్సీ ఫేర్ కేవలం రూ.50 మాత్రమే ఉంటుంది, అయితే ప్రైవేట్ ట్యాక్సీలు ఎక్కువగా చార్జ్ చేసే అవకాశం ఉంది.ముఖ్య సూచనలుమే, జూన్ నెలల్లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాస్త ప్రశాంతంగా యాత్ర చేయాలనుకుంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలోనూ న్ చేసుకోవచ్చు. వెళ్లే ముందు వాతావరణ అప్డేట్స్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. స్థానిక అధికారుల సూచనలు టించడం చాలా ముఖ్యం. ఈ బడ్జెట్ వివరాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే, ప్లాన్, సీజన్ ఆధారంగా ఖర్చులు మారవచ్చు. – ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు -
దౌర్జన్యానికి దైవశిక్ష తప్పదు!
మానవ సంబంధాలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది ’సహోదరత్వం’. అయితే నేటి సమాజంలో స్వార్థం, అహంకారం పెరిగిపోయి ఇతరుల హక్కులను కాలరాయడం, బలహీనులపై దౌర్జన్యం చేయడం సర్వసాధారణమైపోయింది. కానీ, ఇస్లామీయ బోధనల ప్రకారం దౌర్జన్యం (జులుమ్) అనేది అల్లాహ్ దృష్టిలో క్షమించరాని మహాపరాధం.దౌర్జన్యం అంటే ఏమిటి?అరబీలో ’మజాలిమ్’ అంటే అకారణంగా ప్రజలను వేధించడం, ఒకరి ఆస్తిని అక్రమంగా కబళించడం మరియు ఒకరి హక్కులను బలవంతంగా లాక్కోవడం. వివేకవంతులైన విశ్వాసులు అల్లాహ్ హెచ్చరికను గుర్తుంచుకోవాలి: ‘దుర్మార్గులు చేస్తున్న దానిని అల్లాహ్ పట్టించుకోవడం లేదని భావించకండి. ఆయన వారిని శిక్షించే రోజును వాయిదా వేస్తున్నాడు మాత్రమే.‘ ఆనాడు ఏ అధికార బలగం, ఏ సంఖ్యా బలం వారిని రక్షించలేదు.పరలోకంలో శిక్షా రూపంప్రవక్త ముహమ్మద్ (సఅసం) హెచ్చరించినట్లుగా, ఈ లోకంలో ఇతరులపై చేసే దౌర్జన్యం ప్రళయదినాన దట్టమైన చీకటిగా మారుతుంది. పీడితుని ఆక్రందనకూ, అల్లాహ్ కీ మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు. ఒక వ్యక్తి వేరొకరి జానెడు భూమిని అన్యాయంగా ఆక్రమిస్తే, ప్రళయదినాన ఏడు భూభాగాల గుదిబండను అతని మెడలో వేయడం జరుగుతుంది. ఇది కేవలం భూమికే కాదు, ఇతరుల మాన మర్యాదలను మంటగలిపేవారికి కూడా వర్తిస్తుంది.అసలైన సహాయం: బాధితునికీ, దౌర్జన్యపరునికీ!మత సామరస్యం, సామాజిక న్యాయం వెల్లివిరియాలంటే ముస్లింలు తమ తోటి సోదరులకు అండగా ఉండాలి. ప్రవక్త (సఅసం) ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు: ‘మీ సోదరునికి అతను దౌర్జన్యపరుడైనా, బాధితుడైనా తోడ్పడండి. బాధితునికి సహాయం చేయడం అంటే అతనికి న్యాయం జరిగేలా చూడటం. మరి దౌర్జన్యపరునికి సహాయం చేయడం అంటే ఏమిటి? అతను అన్యాయం చేయకుండా అతని చేతిని పట్టుకోవడం, అతన్ని తప్పు నుండి మళ్ళించడం.క్షమ – ప్రాయశ్చిత్తంఒక వ్యక్తి చేసిన పాపాలను అల్లాహ్ క్షమిస్తాడేమో కానీ, తోటి మనిషికి చేసిన అన్యాయాన్ని ఆ బాధితుడు క్షమించే వరకు అల్లాహ్ కూడా క్షమించడు. అందుకే పారలౌకిక విచారణ రాకముందే, ఈ లోకంలోనే బాధితుని వద్ద క్షమాపణ పొంది, వారి హక్కులను తిరిగి చెల్లించాలి. లేదంటే, పుణ్యాలన్నీ బాధితుని ఖాతాలోకి వెళ్లిపోయి పాపాలే మిగిలే ప్రమాదం ఉంది.ఆక్రందనలు అరణ్య రోదనలు కావులోకంలో పీడితుల ఆక్రందనలు అరణ్య రోదనలు కావు. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తప్పక జరుగుతుంది. ఒక విశ్వాసి మరో విశ్వాసికి భవనంలోని ఇటుకల వలె ఒకరికొకరు బలం చేకూర్చుకోవాలి. అప్పుడే సమాజంలో శాంతి, అల్లాహ్ కారుణ్యం లభిస్తాయి. క్షమించడం, సర్దుకుపోవడం అనేది కేవలం బలహీనత కాదు, అది ఒక గొప్ప సాహసం, దృఢ సంకల్పం.– ముహమ్మద్ ముజాహిద్ -
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలు : ముస్తాబైన మఠం
భారతదేశం ఎందరో గురుదేవుళ్ల పుణ్యధామం. వారు సమాజంలో జ్ఞాన దీప్తులు వెలిగించారు. అలాంటి వారిలో సుప్రసిద్ధులు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బ్రహ్మంగారి మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో స్వామి చరిత్ర, ఉత్సవ విశేషాలపై ప్రత్యేక కథనం. శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి గొప్ప కాలజ్ఞానిగా భూ మండలంపై కీర్తి గడించారు. అంతేకాక ఆయన రాజయోగి, హేతువాది, తత్త్వవేత్తగా ప్రసిద్ధి చెందారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనడం మనం వింటుంటాం. రాబోయే కాలంలో జరిగే విపత్తులపై కాలజ్ఞానం ద్వారా వివరించి.. మానవాళికి ఎన్నో సూచనలు, హెచ్చరికలు చేశారు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి. కావున మిగతావి కూడా జరుగుతాయని భక్తులు నమ్ముతున్నారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే.. సన్మార్గంలో నడవాలని బోధించారు. ఎన్నో మహిమలు చూపి మహిమాన్వితుడిగా విరాజిల్లారు. కులమతాలను రూపుమాపేందుకు కృషి చేసి సంఘ సంస్కర్తగా పేరు పొందారు. కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసి జగద్గురువుగా ప్రఖ్యాతి గాంచారు. చివరికి దైవ స్వరూపులుగా వినుతి కెక్కారు. సజీవసమాధి నిష్ట పొంది భక్తులను అనుగ్రహిస్తు న్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో నేటి నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.సన్మార్గంలో నడిపించడం కోసం...మానవులకు జ్ఞాన బోధ చేసి, సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. తెలుగు నేల నలుచెరగులా సంచరించి బోధనలు చేసి 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. (ఆ ్ర΄ాంతంలోనే ప్రస్తుతం శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి క్షేత్రం ఉంది.) నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామిచే ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది.ఏటా వేడుకలుస్వామి సజీవసమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహిస్తారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సాతోపాటు పలు రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం తరలిరానున్నారు. స్వామి మాల ధరించిన భక్తులు ఇప్పటికే చేరుకుంటున్నారు. వారితో కందిమల్లాయపల్లె కళకళలాడుతోంది. ఆరాధనోత్సవానికి ఇంకా పెద్ద ఎత్తున రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు.. మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేస్తున్నారు.ఉత్సవాలు ఇలా..శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్యబృందం, భక్తులు.. ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఉత్సవాలు 28 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిషేకం, సహస్ర నామార్చన కార్య్రçకమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి. అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 23న శేషవాహనోత్సవం, 24న గజవాహనోత్సవం, 25న నరనంది ఉత్సవం, 26న నంది ఉత్సవం, 27న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 26న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామి వారు దీక్షాబంధన అలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 28న మహాప్రసాదం నివేదనతో ఉత్సవాలు ముగుస్తాయి.– వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, వైఎస్ఆర్ కడప జిల్లాఘనంగా ఏర్పాట్లుశ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల ఆరాధనోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. వసతి, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను.– శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వాముల వారు, మఠాధిపతులు, బ్రహ్మంగారిమఠం -
51 క్వింటాళ్ల పూలతో కేదార్నాథ్ ముస్తాబు
కేదార్నాథ్: మంచు కొండల నడుమ నెలకొన్న మహా శివుని క్షేత్రం కేదార్నాథ్ అపూర్వ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శీతాకాలపు సుదీర్ఘ నిశ్శబ్దాన్ని వీడి, భక్తులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏటా అత్యంత ఘనంగా జరిగే చార్ధామ్ యాత్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు (ఏప్రిల్ 22న) కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనుండటంతో ఆ పుణ్యక్షేత్రమంతా శివనామస్మరణతో, భక్తి పారవశ్యంతో మారుమోగుతోంది.పూల వనంలా పరమశివుని సన్నిధిదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 51 క్వింటాళ్ల తాజా పూలతో కేదార్నాథ్ ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ పూల అలంకరణతో రాతి కట్టడమైన ఆ పవిత్ర మందిరం భక్తిభావానికి సజీవ సాక్ష్యంగా, కన్నుల పండువగా మారింది. అధికారులతో పాటు స్థానికులు సైతం అహర్నిశలు శ్రమిస్తూ, అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా చేరుకున్న భక్తులు కూడా అధికారులకు సహకరిస్తూ వివిధ పనుల్లో స్వచ్ఛందంగా సేవలు అందిస్తుండటం విశేషం.భద్రత కట్టుదిట్టంభారీ సంఖ్యలో రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. మంచుతో కప్పుకుపోయిన నడక మార్గాలను పూర్తిగా క్లియర్ చేశారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, క్రౌడ్ మేనేజ్మెంట్ పద్ధతులను అమల్లోకి తెచ్చారు. యాత్రికుల భద్రత కోసం ప్రత్యేక బృందాలు అనునిత్యం పర్యవేక్షిస్తున్నాయి.ఉత్సాహంగా చార్ధామ్ యాత్రఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాల ప్రారంభంతో ఉత్తరాఖండ్ పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది భక్తులు హిమాలయాలకు చేరుకున్నారు. రేపు (ఏప్రిల్ 22న) కేదార్నాథ్ ఆలయం తెరుచుకోనుండగా, ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయ ద్వారాలను సైతం భక్తుల దర్శనార్థం తెరవనున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’ -
సనాతన సారథి ఆదిశంకరులు
‘దేవుడనే వాడున్నాడా ‘అని వితండవాద నాస్తికవాదులకు ఎదురుగా అగుపడే వ్యక్తి దేవుడే అయితే అంత కన్నా సరి అయిన ఋజువు, సమర్థన మరేం కావాలి? కథల్లో, పురాణాల్లో భగవంతుడు వచ్చాడని, రక్షించాడని విన్నాం, నమ్మాం.. నిజంగా నిలబడి నడిచొస్తూ నాస్తికత్వాన్ని ఖండించి అద్వైత తత్త్వాన్ని సుస్థిరం చేసి అద్వైత వాదిగా అరుదెంచి హిందూమతాన్ని రక్షించి జాతిని నడిపించే దేవుడే శంకర భగవత్పాదులు.. పరమాచార్య శంకరాచార్యులు...శివుడే శంకరులుగా...హిందూమతం క్షీణదశలో ఉన్నప్పుడు ఆ మత పరిరక్షణకై పుణ్యదంపతులు శివగురు, ఆర్యాంబలు చేసిన తపః ఫలంగా కాలాడి అగ్రహారంలో సాక్షాత్తు ఈశ్వరుడే శంకరులుగా జన్మించాడు.. ఆవేళ ప్రకృతి పరవశించింది. ప్రపంచంలో పరమశాంతి పరిమళించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ బాలుడిలో చంద్రవంక, మూడవ నేత్రం, శూలం ఉన్నాయి. తెల్లని కాంతి.. లక్షణాల్లో సూర్యుడు.. మేరు పర్వతం.. సరస్వతీదేవి పోలిక.. ఈశ్వర వర ప్రసాదుడు. తోటి బాలురు తప్పటడుగులు వేస్తుంటే శంకరాచార్యులు సర్వ భాషలందు ప్రావీణ్యం, ప్రజ్ఞ సాధించి అసాధారణ బుద్ధితో వేద, వేదాంగాల్లో బ్రహ్మని, బృహస్పతిని మించి΄ోయాడు. శివ రహస్యంలోనూ, కూర్మ పురాణం లోనూ ఈ అవతార ప్రస్తావన ఉంది.అద్వైత తత్వ స్థాపన –జైత్రయాత్రశంకరాచార్యుల తన ప్రజ్ఞాపాటవాలతో, వాగ్ధాటితో నాస్తిక మతాన్ని మట్టుపెట్టటానికి విద్వాంసులతో వాద ప్రతి వాదనలకు దిగి అందరినీ ఓడించారు. ఒకసారి వేయిమంది పండితులను అవలీలగా జయించారు. విష్ణు సముడైన వ్యాసభగవానుడినే తన వాదనతో మెప్పించారు. దేశంలో నలు మూలల్లో పీఠాలు స్థాపించి సనాతన మత పునరుద్ధరణలో భాగంగా తత్వ, వేదాంత పూజాది నియమాలు, సంప్రదాయాలు నెలకొల్పి జ్ఞాన జ్యోతులను వెలిగించారు.ఎన్నెన్నో రచనలు – నిత్య సాధనలుబ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గిత, విష్ణు సహస్ర నామం, గాయత్రి మంత్రానికి భాష్యాలు రచించారు. వీటివల్ల మనకి దైవ సన్నిధి, పెన్నిధి ఏర్పడ్డాయి. పలు ప్రకరణ గ్రంథాలు రచించారు. మనం రోజు చదివే స్తోత్రాలలో ఎక్కువ వారు రాసినవే. వివేక చూడామణి, నిర్గుణ మానస పూజ, శివానంద లహరి, సౌందర్యలహరి, ఆనంద లహరి, కనకధార స్తోత్రం.. ఇలా ఎన్నెన్నో. తాను నడుస్తూ మన అందరిని మంచి ద్రోవలో నడిపిస్తున్న ఆ దేవుడికి జేజేలు. ఇదీ చదవండి: Ramanuja Jayanthi 2026 ఈ ఆసక్తికకర విషయాలు తెలుసా? – డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...
కృష్ణా... గురువాయురప్పా..! ఈ ఒక్క మాట మనకి బాగా పరిచయం ఉన్న కేరళంలో ఎక్కువ వినిపిస్తుంటుంది. కేరళం పేరు వింటే మనకి గుర్తుకు వచ్చే దేవాలయం గురువాయూర్. శ్రీ కృష్ణ దేవాలయాలలో కేరళలో ఉన్న గురువాయురప్పన్ దేవాలయం ఎంతో విశిష్టమైనది.ఆయనను బాలగోపాలుడిగా భక్తితో కొలుస్తారు. ఆర్ద్రతతో కృష్ణా... గురువాయురప్పా అనిపిలిస్తే పలుకుతాడని కేరళవాసుల నమ్మకం. ఎంతో మంది కృష్ణ భక్తులు భక్తితో పలవరిస్తుంటారు. బాలగోపాలుడు ఇక్కడ అల్లరి చేస్తూ తిరుగుతాడు అని చూసిన వాళ్ళు చెప్తుంటారు. కురూరమ్మ బిల్వమంగళుడు వీరి ఇంట్లో అల్లరి కన్నయ్య తిరుగాడేవాడని ఇక్కడివారి నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తామే కురూరమ్మ బిల్వమంగళుడిగా భావిస్తుంటారు. మన తెలుగు వారు అయ్యప్ప మాల వేసుకుని దర్శనం తరువాత లేదా ముందు ఇక్కడ అల్లరి కన్నాయని గురువాయూర్ లో దర్శనం తప్పనిసరిగా దర్శనం చేసుకుంటారు. తాము రాధాకృష్ణులమని భావించి తులసి మాలలు వేసుకుని గురువాయూర్‌లో వివాహం చేసుకోవడం గొప్ప అనుభూతి. అలాగే అల్లరి కన్నయ్యకి నృత్యం, ఆటపాటలు అంటే ఇష్టం. అందుకే ప్రతిరోజు అరంగేట్రం సంగీత కచేరీలు జరుగుతుంటాయి. కన్నయ్యకి పాలు, బియ్యం పంచదార వేసి పాయసం చేసి నైవేద్యం పెడతారు. పసిపిల్లలను తులాభారం చేయిస్తారు. అలాగే మొక్కు తీర్చడానికి ఏనుగులు సమర్పించేవారు. ఆ విధంగా సుమారు 38 ఏనుగులతో పునాథూర్ కోటలో చూడవచ్చు. విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఏనుగులతో పరుగు పందాలు, ఏనుగులకు విందు కార్యక్రమాలు ఉంటాయి మరి కృష్ణష్టామి రోజు విశేషమైన పూజలు జరుపుతారు. కేరళ వాళ్ళ కొత్త సంవత్సరాది రోజు ఉదయం ఈ కన్నయ్యని ముందుగా చూస్తారు. దానిని విషు కని అంటారు. గురువు, వాయువు కలిసి నదిలో దొరికిన విగ్రహం ఇక్కడ బాల గోపాలుడి దర్శనం. ఈ ఆలయం త్రిచూర్ రైల్వే స్టేషన్‌కి 20 కిలోమీటర్లు లేదా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో ఉంది. – ఈఎస్. మాధవన్ (చదవండి: శక్తిపీఠం-సిద్ధ పీఠం వ్యత్యాసాలు..?) -
ఉగాది రోజునే పంచాంగ శ్రవణం ఎందుకంటే..?
తెలుగు సంవత్సరాల ప్రకారం చైత్రమాసంలోని పాడ్యమితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. ఆ రోజు ప్రముఖంగా ఆచరించేది పంచాంగ శ్రవణం. ఈ రోజునే ఎందుకంటే..తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది ఆ పర్వదినంతోనే కాబట్టి. ఉగాది రోజున ఆలయంలోగానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మరి అంత విశిష్టత గల పంచాంగ శ్రవణం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదోక దిక్సూచిలా ఉండేది. శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగమును వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్లీ ఏడాది వచ్చే ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు.సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.పంచాంగకర్తలు తమ పంచాంగాల్లో ఈ క్రింద శ్లోకంతో పంచాంగ రచన కుపక్రమిస్తారు.తిధిః వారంచ నక్షత్రం యోగః కరణమేవ చపంచాంగమితి విఖ్యాతం కాల్కోయం కర్మసాధకతిధి వారము, నక్షత్రము, యోగము, కరణము అనునవి ఐదు అంగములు కలది కనుక ‘పంచాంగం’ అన్నారు. మానవుల జీవితాలు కాలంపైన, కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉన్నాయి. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి పుట్టినది మొదలు గిట్టేవరకు వాని భవిష్యత్తు గ్రహ సంచారంమీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం తిథి, వారం, నక్షత్రములను బట్టి జాతక రచన జరుగుతుంది. ఈ వివరణలన్నిటికీ పంచాంగమే ప్రమాణము. పంచాంగం మనిషి యొక్క జాతక ఫలాన్ని తెలుపుతుంది. పంచాంగం ఏఏ ఫలాలనిస్తుందో జ్యోతిష శాస్తజ్ఞ్రులు ఇలా చెప్పారు.తిధేశ్చ శ్రీయమాప్నోది వారాదాయుష్మవర్ధనీమ్నక్షత్రాద్హరతే పాపమ్ యోగాద్రోహ నివారణమ్కర్ణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం దశమే ఫలమ్కాల విత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్సంపదల కోరేవారు తిథియందు, దీర్ఘాయువు కోరేవారు వారం యందు, పాప విముక్తిని పొందగోరేవారు నక్షత్రమునందు, ఆరోగ్యము అభిలషించేవారు యోగమునందు, కార్యసిద్ధిని కాంక్షించేవారు కరణముయందు శ్రద్ధ వహించాలని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శాస్త్రం పంచాంగం గురించి ఇంకా ఏమి చెప్పుచున్నదంటే.‘‘ శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదో షారుహంగంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాంఆయుర్వర్థన ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రాదంనానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం’’.ఇది శుభాన్ని, మంగళాన్ని ఇచ్చేది, శత్రువులను హరించేది, దుస్స్వప్నాలను దోషాలను తొలగించేది; గంగాస్నాన ఫలం ఇచ్చేది, గోదాన ఫలం ఇచ్చేది, సత్సంతానాన్ని ప్రాప్తింపజేసేది అంటూ అందరూ పంచాంగం ప్రయోజనాన్ని పొందాలని ఆకాంక్షించింది.పంచాంగశ్రవణం చేసిన వారికి సూర్యభగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, గురుడు-సంపదను, కుజుడు- శుభాన్ని, బుధుడు-బుద్ధిని, కుజుడు- సుఖాన్ని, శని- ఐశ్వర్యాన్ని, రాహువు- బాహు బలాన్ని, కేతువు-కులాధిక్యాన్ని కలిగిస్తారు.ప్రతి ఒక్కరు సాయంత్రం దేవాలయాలలో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని స్పష్టపరిచింది శాస్త్రం. జ్యోతిషశాస్త్ర రీత్యా తెలియజేసే ఫలితాలను తెలుసుకుని, ఆసంవత్సరంలో తాము తీసుకోబోయే లేదా ఆచరించవలసిన కార్యక్రమాలకు తగు విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది.(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!) -
'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగను..
భాషాపరంగా యుగాది సరైన పదం. ఉగాది అనే పదం వికృతిపదం. అయితే రెండూ ఒకే అర్థాన్ని బోధించే పదాలే. నిజానికి “యుగాది” అనే పదమే కాలాంతరంలో 'ఉగాది'గా మారింది. సోమకాసురుని నుండి వేదాలను విష్ణువు రక్షించిన రోజు ఉగాది. నూతన కల్పంలో జగత్తు సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజు. ఆరు రుచుల కలయికతో అనారోగ్యాలను అంతం చేసేది ఉగాది. హిందువుల పండుగల సంప్రదాయానికి మొదలు ఉగాది. వరాహమిహిరుడు ఈ ఉగాది నాడే పంచాంగాన్ని పరిచయం చేశాడని అంటారు. శ్రీరా ముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు మొదలైన వారు ఉగాదినాడే పట్టాభిషిక్తులైనారని ఆర్యులు చెబుతారు. సంవత్సరాది నాడు ప్రజలు తెల్లవారక ముందే నిద్ర లేచి, కాలకృ త్యాలు తీర్చుకొని, తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవానికి పూజలు చేసి, షడ్రుచుల పచ్చడిని ఆరగించాలి. నిర్ణీత సమయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం చేయాలి.తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ,పంచాగస్య ఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్.తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగ శ్రవణం వల్ల గంగా స్నానంతో సమానంగా పుణ్యం, పురు షార్థం లభిస్తుందని పై శ్లోకం చెబుతున్న భావం. కొత్త సంవత్సరంలో గ్రహ, రాశిఫలాల్లో, నామ నక్షత్రాల్లో తేడా వస్తే దోషనివారణ కోసం శాంతి హోమాలు, వ్రతాలు, పూజలు చేసి సుఖశాంతులతో ప్రజలు జీవించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. నవగ్రహాల్లో సూర్యుడు తేజస్సును, చంద్రుడు భోగభాగ్యాలను, కుజుడు శుభాలను, బుధుడు బుద్ధి వికాసాన్ని, గురుడు జ్ఞాన విత్తాన్ని, శుక్రుడు కార్యసిద్ధిని, శనీశ్వరుడు దుఖ వినాశాన్ని, రాహువు సంతోషకరమైన రాణింపును, కేతువు చెప్పుకోదగి నంత గొప్పదనాన్ని కలిగిస్తారని విద్వాంసులు చెబుతారు.ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని కలిగించేది ఉగాది పచ్చడి. శాస్త్రవచనాల్లో దానికి నింబకుసుమ భక్షణం, అశోకకళికా ప్రాశనం అనే పేర్లు కూడా ఉన్నాయి. తీపి, ఉప్పు, చేదు, వగరు, పులుపు, కారం సమపాళ్లలో కలిపి ఈ పచ్చడిని తయారు చేస్తారు. తీపికి బెల్లం, ఉప్పునకు ఉప్పు, చేదుకు వేపపూత, వగరుకు మామిడి ముక్కలు, పులుపునకు చింత పండు, కారమునకు మిరియాలు ఉగాది పచ్చడిలో వాడు తారు. వీటికి తోడు తమతమ ఇష్టాలను బట్టి జీలకర్ర, అరటిపండ్లు, ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటివి కూడా కలిపి గొప్ప ఔషధంగా ఆరగిస్తారు. ఈ పచ్చడిని చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు ఒక పక్షం రోజులు సేవిస్తే వాత, పిత్త, కఫములకు చెందిన రోగాలన్నీ పటాపంచలవుతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. భారతదేశంలో ఆంధ్ర రాష్టేతరులు సైతం సంవత్సరాది ఉత్సవాలను జరుపుకుంటారు. తమిళులు, మళయాళీలు, మరాఠీలు, సిక్కులు ఈ పండుగను జరుపుకోవడం విశేషం.(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!)


