మాజీ ఐఏఎస్ అధికారి కె. జయకుమార్ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం రాత్రి ఈ నియామకం ఖరారయ్యింది. కేరళలోని సీపీఎం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో తుది రౌండ్‌లో ఐదు పేర్టను షార్ట్‌లిస్ట్ చేశారు. వారిలో జయకుమార్‌కు అగ్రప్రాధ్యానత్య లభించింది.
దేవస్వం మంత్రి విఎన్ వాసనవన్ పతనం తిట్ట నుంచి సతీషన్‌ను సిఫార్సు చేయగా, పార్టీ ముఖ్యమంత్రి ఎంపికనే ఫైనల్ చేయాలని నిర్ణయించింది. దాంతో మాజీ ఐఏఎస్ అధికారి నియామకానికి మార్గం సుగమం అయ్యింది. ఇలా టీడీపీ చీఫ్ సెక్రటరీగా, వైస్ ఛాన్సలర్‌గా, ప్రత్యేక కమిషనర్‌గా, అలాగే శబరిమల మాస్టర్ ప్లాన్ చైర్మన్‌గా పనిచేసిన ఒక పరిపాలనాధికారి(ఐఏఎస్ అధికారి) ఇలా ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుకి అధ్యుకుడిగా బాధ్యతలు స్వీకరించడం టీడీబీ చరిత్రలోనే తొలిసారి.
ఈ మేరకు మాజీ ఐఏఎస్ అధికారి జయకుమార్ మాట్లాడుతూ..శబరిమలలో తనకున్న పూర్వ అనుభవాన్ని చెబుతూ..శబరిమల పనితీరు తనకు బాగా తెలుసని చెప్పారు. భక్తులు సంతృప్తికరంగా ఆలయాన్ని సందర్మించేలా చూస్తానని అన్నారు. అలాగే రాజకీయ జోక్యం లేకుండా దేవస్వం బోర్డు వ్వవస్థ మొత్తాన్ని పునరవ్యవస్థీకరించి శబరిమల, టీడీపీపై ప్రతి అయ్యప్ప భక్తుడికి నమ్మకం, విశ్వాసం కలిగేలా గట్టి చర్యలు తీసుకుంటానని నమ్మకంగా చెప్పారు.
(చదవండి: Pulmedu Sabarimala forest path: శబరిమలకు వెళ్లే.. ఈ రూటు ఎన్నో విశిష్టతలకు ఆలవాలం..!)


