త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.
ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 25న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హీరో శ్రీ విష్ణు విచ్చేశారు.


