12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్‌ | Harsh Goenka Shares Benne Dosa Success Mantra: From 12-Seater to Rs 350 Crore Brand | Sakshi
Sakshi News home page

12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్‌

Aug 14 2026 1:10 PM | Updated on Aug 14 2026 1:14 PM

From 12 Seater To Rs 350 Crore Harsh Goenkashares Benne Dosa  success mantra

ఒక సాదాసీదా దోశ  వ్యాపారాన్ని కోట్ల  రూపాయల  స్థాయికి  చేర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు.  ఫుడ్‌ బిజినెస్‌లో కోట్ల రూపాయలు సంపాదించాలంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వడ్డించే వంటకాన్ని సరిగ్గా, పరిశుభ్రంగా అందిస్తే వ్యాపారం విజయవంతం కావచ్చని ముంబైలోని బెన్నె దోస రెస్టారెంట్ నిరూపించిందని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా అంటున్నారు. బెన్నె దోశ లేదా వెన్న దోశ విజయ రహస్యాన్ని విశ్లేషిస్తూ దాని సక్సెస్‌ స్టోరీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.

ముంబైలోని బాంద్రాలో కేవలం 12 సీట్ల సామర్థ్యంతో ప్రారంభమైన ‘బెన్నె’ (Benne) దోశ కేఫ్, ప్రస్తుతం రూ. 350 కోట్ల విలువైన బ్రాండ్‌గా ఎదిగి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకాను ఆకర్షించింది.  ప్రముఖ దోశల చైన్ అయిన 'బెన్నె' ఇంత భారీ విజయం సాధించడానికి కారణమని తాను నమ్మే విషయాలను గోయెంకా విశ్లేషించారు. ఒక నిర్దిష్టమైన మెనూ, తెలివైన నిర్వహణ, అందుబాటు ధరలు,  అన్నింటికన్నా ముఖ్యంగా, ఆ బ్రాండ్ చుట్టూ  అల్లుకున్న ఎమోషన్‌ లాంటి అంశాలను ఆయన పేర్కొన్నారు.

దావణగెరె-శైలి బెన్నె (వెన్న) దోశ  స్పెషల్‌ : చాలా మందికి అలవాటైన పెద్ద, పలుచని, కరకరలాడే దోశలలా కాకుండా, ఈ కర్ణాటక  స్టైల్‌ దోశ విభిన్నంగా ఉంటుంది.  చిన్నగా, లోపల మెత్తగా ఉండి, వెన్నతో నిండుగా ఉంటుంది. ఈ విలక్షణమైన శైలే బెన్నెకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది.

 అఖిల్ అయ్యర్, శ్రియా నారాయణ్ అనే భార్యాభర్తలు ప్రారంభించిన ఈ స్టార్టప్, దేశంలోని ప్రముఖ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్‌లకు గట్టి పోటీనిస్తోంది.  ముంబైలో అథెంటిక్ కర్ణాటక/బెంగళూరు శైలి దావణగెరె బెన్నె దోశ దొరకకపోవడంతో, ఈ రుచిని అందరికీ అందించాలనే ఆశయంతో   ఈ జంట స్వయంగా కేఫ్ పెట్టాలనుకున్నారు. 2024 లో ముంబైలోని బాంద్రాలో కేవలం 12 మంది కూర్చునే చిన్న అవుట్‌లెట్‌తో ప్రయాణం మొదలైంది. సాంప్రదాయ దక్షిణ భారత శైలి హోటల్ అయిన దానికి వారు 'బటర్' అని పేరు పెట్టారు.

ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్‌ మార్చిన ఇన్‌స్టా, నెటిజన్ల స్పందన వైరల్
 

దీని విజయానికి గల ప్రధాన కారణాలలో ఒకటి, వారు దావణగెరె శైలి వెన్న దోశను తమ కాన్సెప్ట్‌గా చేసుకోవడమే అంటారు హర్ష గోయెంకా. సాధారణ రెస్టారెంట్లలా వంద రకాల మెనూ కాకుండా, కేవలం 'దావణగెరె స్టైల్ బెన్నె దోశ'పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. అంతేకాదు సరైన చట్నీ రుచి కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు, సాంప్రదాయ రుచి కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుండి కాస్ట్ ఐరన్ పెనాలను తెప్పించారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, వ్యాపారం పెరిగేకొద్దీ అదే పద్ధతిని, రుచిని  అందించేలా జాగ్రత్త వహించారు. క్విక్-సర్వీస్ రెస్టారెంట్‌కు, ఆ సరళత  మరో పెద్ద ప్రయోజనం. ఫలితం  ఈ కేఫ్ రోజుకు 800 పైగా దోసలు విక్రయిస్తూ, నెలకు  రూ.1 కోటి రాబడిని అందుకుంటోంది.

ఇక బెన్నే ఎలక్ట్రానిక్ సెల్ఫ్-ఆర్డరింగ్, సెల్ఫ్-సర్వీస్‌ను ఉపయోగిస్తుంది, దీనివల్ల విస్తృతమైన టేబుల్ సర్వీస్ అవసరం తగ్గడమే కాకుండా, కస్టమర్లను కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేస్తుంది. తద్వారా క్యూలో నిల్చునే కష్టాలు లేకుండా,  రెస్టారెంట్‌కు ప్రజలకు త్వరగా సేవ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. అయినా ఈ రెస్టారెంట్‌ వద్ద  ఆహార ప్రియులు బారులు తీరిన  వైనం  ఈ వెన్న దోశ  క్రేజ్‌కు అద్దం పట్టాయి. అంతేనా దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ వంటి సెలబ్రిటీలు రెస్టారెంట్‌ను సందర్శించడం, సోషల్ మీడియా పోస్టులు ఆసక్తిని మరింత పెంచాయి.  ఇపుడీ బెన్నె దోశ ఖ్యాతి ముంబైలో అనేక శాఖలతో పాటు, ఢిల్లీలోని బ్రాంచ్‌లో కూడా వెలుగొందుతోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement