మొబైల్‌ గేమ్స్‌తో అప్పుల ఊబి.. వివాహిత ఆత్మహత్య | Karnataka Crime: Online Gaming Debt Drives Married Woman Ranjitha to Suicide in Nelamangala | Sakshi
Sakshi News home page

మొబైల్‌ గేమ్స్‌తో అప్పుల ఊబి.. వివాహిత ఆత్మహత్య

Aug 13 2026 1:29 PM | Updated on Aug 13 2026 1:35 PM

married woman ends life in karnataka

కర్ణాటక: ఆన్‌లైన్‌ గేమ్‌లు, జూదాలకు బానిసై అప్పులు చేసిన వివాహిత చివరకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా బొమ్మనహళ్లిలో జరిగింది. రంజిత (28) మృతురాలు. స్థానికంగా ప్రైవేటు కంపెనీలో కారి్మకురాలైన రంజితకు, భర్త అరుణ్, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. 

గుల్బర్గాకు చెందిన వీరు 5ఏళ్ల క్రితం నెలమంగలకు వచ్చి స్థిరపడ్డారు. ఏడాది కాలంగా రంజిత మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్, జూదాలకు అలవాటుపడి లక్షల రూపాయలు పోగొట్టుకుంది. సుమారు రూ.15లక్షల వరకూ అప్పులు చేసింది. భర్త అరుణ్‌ ఎలాగో అప్పులన్నీ తీర్చాడు. అయినా రంజిత గేమ్స్‌ ఆడుతూ తిరిగి అప్పులు చేసింది. 2 రోజుల క్రితం భర్త పనిమీద గుల్బర్గాకు  వెళ్లగా, రంజిత మంగళవారం రాత్రి  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలమంగల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement