మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని పవన్‌గావ్–భరత్‌వాడా వి-పాయింట్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
సీసీటీవీ ఫుటేజ్‌లో కారు అత్యంత వేగంగా దూసుకొస్తూ ఎలాంటి బ్రేకులు వేయకుండానే ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కలమ్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు.
సీసీటీవీ ఫుటేజ్
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
నాగ్‌పూర్‌లోని భరత్‌వాడా చౌక్ వద్ద అతివేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
దీంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన మరో యువకుడు pic.twitter.com/k2Q3moSozR— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026


