అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. భవనంలోని టెర్రస్‌పై ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు సదరు భవనంలో సెక్యూరిటీ గార్డుగా నాలుగు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు. ఓ యువతిని టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఆమె గొంతు నొక్కి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమెను టెర్రస్‌పైనే ఉంచి తలుపులకు తాళం వేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట ‘‘ఏక్ బార్ మాఫ్ కర్ దో.. ఫిర్ సే నహీం కరూంగా’’ అంటూ వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఒక్కసారి క్షమించండి.. మళ్లీ ఇలా చేయను’’ అంటూ అతడు క్షమాపణలు కోరుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు.
యువతిపై అత్యాచారం కేసులో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
పీఎస్‌లో ఒక్కసారి క్షమించండి అంటూ ఏడుపు
నాలుగు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిన సెక్యూరిటీ గార్డు#Ahmedabad లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డు
#RapeCase #SecurityGuard #Gujarat #viralvídeo #Anntelugu pic.twitter.com/4jVl94lgQe— ANN Telugu (@ANN_Telugu) August 11, 2026


