భర్తను వదిలి లవర్‌తో పారిపోయి, చివరికి శవమై సూట్‌కేసులో | Woman leaves husband for lover he kills her and hides body in suitcase | Sakshi
Sakshi News home page

భర్తను వదిలి లవర్‌తో పారిపోయి, చివరికి శవమై సూట్‌కేసులో

Aug 12 2026 11:48 AM | Updated on Aug 12 2026 12:05 PM

Woman leaves husband for lover he kills her and hides body in suitcase

బిహార్‌లో జరిగిన దారుణ ఘటన దిగ్బ్రాంతి రేపింది.  ఛోటీ కుమారి అనే వివాహితను ఆమె ప్రియుడు రిషభ్‌ కుమార్‌ దారుణంగా హత్య చేసి, శవాన్ని సూట్‌కేసులో దాచిపెట్టిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రెండేళ్ల క్రితం భర్తను వదిలి లవర్‌తో పారిపోయి, చివరికి అతని చేతిలో దారుణంగా హత్యకు గురైన  ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బిహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన ఛోటీ కుమారికి ఇదివరకే వివా మైంది. అయితే, తన గ్రామానికి చెందిన ప్రేమికుడు రిషభ్ కుమార్ సింగ్‌తో కలిసి దద్రా అండ్ నగర్ హవేలీలోని సిల్వాస్సాకు పారిపోయి పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్ని ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి.  దీంతో రిషభ్‌పై కిడ్నాపింగ్ కేసే నమోదైంది.

మరోవైపు పెళ్లయిన తర్వాత తమ సొంత ఊరికి తిరిగి వెళ్దామని ఛోటీ పదేపదే కోరడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో జూన్ 9న జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత, రిషభ్ కోపంతో ఛోటీని గొంతు నులిమి హత్య చేశాడు. బాడీని సూట్‌కేస్‌లో కుక్కి అక్కడినుంచి పారిపోయాడు. అయితే ఆగస్టు 3న గది యజమాని వేరే వారికి అద్దెకు ఇవ్వడం కోసం తాళం పగులగొట్టి చూడగా, బాత్‌రూమ్‌లో ఉన్న సూట్‌కేస్ నుండి తీవ్ర దుర్వాసన రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం హత్య తర్వాత వారణాసికి పారిపోయిన రిషభ్, తన పేరు మార్చుకుని ఒక ప్రైవేట్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement