breaking news
murder case
-
భర్తను వదిలి లవర్‌తో పారిపోయి, చివరికి శవమై సూట్‌కేసులో
బిహార్‌లో జరిగిన దారుణ ఘటన దిగ్బ్రాంతి రేపింది. ఛోటీ కుమారి అనే వివాహితను ఆమె ప్రియుడు రిషభ్ కుమార్ దారుణంగా హత్య చేసి, శవాన్ని సూట్‌కేసులో దాచిపెట్టిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రెండేళ్ల క్రితం భర్తను వదిలి లవర్‌తో పారిపోయి, చివరికి అతని చేతిలో దారుణంగా హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బిహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన ఛోటీ కుమారికి ఇదివరకే వివా మైంది. అయితే, తన గ్రామానికి చెందిన ప్రేమికుడు రిషభ్ కుమార్ సింగ్‌తో కలిసి దద్రా అండ్ నగర్ హవేలీలోని సిల్వాస్సాకు పారిపోయి పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్ని ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. దీంతో రిషభ్‌పై కిడ్నాపింగ్ కేసే నమోదైంది.మరోవైపు పెళ్లయిన తర్వాత తమ సొంత ఊరికి తిరిగి వెళ్దామని ఛోటీ పదేపదే కోరడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో జూన్ 9న జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత, రిషభ్ కోపంతో ఛోటీని గొంతు నులిమి హత్య చేశాడు. బాడీని సూట్‌కేస్‌లో కుక్కి అక్కడినుంచి పారిపోయాడు. అయితే ఆగస్టు 3న గది యజమాని వేరే వారికి అద్దెకు ఇవ్వడం కోసం తాళం పగులగొట్టి చూడగా, బాత్రూమ్లో ఉన్న సూట్‌కేస్ నుండి తీవ్ర దుర్వాసన రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం హత్య తర్వాత వారణాసికి పారిపోయిన రిషభ్, తన పేరు మార్చుకుని ఒక ప్రైవేట్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. -
రెజ్లర్ సుశీల్‌కు బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఆందోళనల దృష్ట్యా జస్టిస్ పురుషైంద్ర కుమార్... సుశీల్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సుశీల్ కుమార్‌ను 2021లో యువ రెజ్లర్ సాగర్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రశాల్ స్టేడియం హత్య కేసులో ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. సుశీల్ కుమార్ నుంచి తుపాకీ స్వాదీనం చేసుకోవడం, వీడియో ఆధారాలు ఉండటం ఆరోపణలను బలపరుస్తున్నాయని తెలిపింది. సుశీల్ కుమార్‌కు సమాజంలో ఉన్న పలుకుబడితో గతంలో అతడికి బెయిల్ లభించిన ప్రతిసారీ సాక్షులను ప్రభావితం చేశారని సుప్రీంకోర్టు కూడా గుర్తించినట్లు హైకోర్టు పేర్కొంది. కేసు ఏంటంటే... భూ వివాదాల నేపథ్యంలో జూనియర్ నేషనల్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్కర్ను 2021లో సుశీల్ కుమార్ తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. అనంతరం అతడిని ఛత్రశాల్ స్టేడియంకు తీసుకువచ్చి బేస్‌బాల్ బ్యాట్లు, హాకీ స్టిక్స్‌తో దారుణంగా కొట్టారు. దీంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఘటన అనంతరం కొన్ని రోజులు పరారీలో ఉన్న సుశీల్ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది బెయిల్ మీద బయటకు వచ్చిన సుశీల్ కుమార్ సాక్షులను ప్రభావితం చేసి విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించిన సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దుచేసింది. -
డేరా బాబా విడుదలపై సుప్రీంకోర్టు సీరియస్!
న్యూఢిల్లీ: జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్పందన కోరింది. ఈ కేసుకు సంబంధించి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు సీబీఐ కూడా ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 2026 నవంబర్ 16వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.2002 అక్టోబర్‌లో జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ నవంబర్ 21న మృతి చెందారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయగా, 2019 జనవరిలో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్ రహీంతో పాటు మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ రామ్ రహీమ్ హైకోర్టును ఆశ్రయించగా, తగినన్ని సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ 2026 మార్చిలో పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.దిగువ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసింది. కాగా, ఈ కేసులోని మరో ముగ్గురు దోషుల శిక్షలను మాత్రం హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రామచంద్ర ఛత్రపతి కుమారుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుపై అప్పీల్ చేయలేదని ప్రస్తావిస్తూ రామ్ రహీమ్, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పుపై నవంబర్‌లో జరిగే విచారణలో సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: కొరియా కార్యాలయాల్లో.. బయటకు చెప్పుకోలేని ఐదు నిజాలు! -
ప్రియురాలి హత్య, జర్మనీలో భారతీయ విద్యార్థి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలో ప్రియురాలి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరవై ఏళ్ల భారతీయ విద్యార్థిని పోలీసులు జర్మనీలో అరెస్టు చేశారు. స్వదేశానికి వెళ్లే క్రమంలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కేలోపే అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... బచ్చిగారి వరుణ్ అనే విద్యార్థి అరిజోనా యూనివర్సిటీలో బిజినెస్ అనలిటిక్స్ విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల ఆరవ తేదీ ప్రియురాలు ’జులిస్సా రూబీ సలజార్ (19)ను టక్సన్ సిటీలోని ఆమె అపార్ట్మెంట్లో హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు హత్య అనంతరం వరుణ్ టక్సన్ నుంచి జర్మనీ మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు టక్సన్ పోలీసులు తెలిపారు. అయితే టక్సన్ పోలీసులు, ఎఫ్‌బీఐలు సమన్వయంతో వ్యవహరించి జర్మనీలో విమానం దిగుతూండగానే వరుణ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ తన ప్రియురాలిని హత్య చేసిన తరువాత ఆమె ఫోన్, క్రెడిట్ కార్డులు తీసుకుని ఆమె తల్లికి మోసేజ్‌లు పెడుతూ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. అయితే ఆ మెసేజీలపై అనుమానంతో కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమె యోగక్షేమాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆగస్టు ఆరవ తేదీ సాయంత్రం టక్సన్ అగ్నిమాపక సిబ్బందికి గుండెపోటు ఘటనకు సంబంధించిన సమాచారం ఒకటి అందింది. వారు సలజార్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మెడవరకూ బ్లాంకెట్ ఒకటి కప్పి ఉన్నట్లు గుర్తించారు. సలాజర్ మెడపై గొంతు నులిమిన గుర్తులు, గీతలు ఉన్నట్లు తెలిసింది. గతంలో దాడి కేసు... వరుణ్‌పై గతంలోనే ఒక దాడి కేసు నమోదైనట్లు, దీనిపై అరిజోనా యూనివర్శిటీ పోలీసులు దర్యాప్తు చేసినట్లు అరెస్ట్ వారంట్ ద్వారా తెలిసింది. మనస్పర్ధల కారణంగా సలాజర్ గత ఏడాది ఆఖరు నుంచి వేరుగా ఉంటోందని, గృహ హింస ఆరోపణల నేపథ్యంలో అతడితో తెగతెంపులు చేసుకోవాలని తీర్మానించుకుందని ప్రత్యక్ష సాక్షుల విచారణలో తెలిసింది. పలు సందర్భాల్లో వరుణ్ హింసకు పాల్పడినట్లు కూడా సాక్షులు తెలిపారు. ఈ ఏడాది మే నెలలో పిమా కౌంటీ కోర్టులో వరుణ్‌పై దాడి, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం వంటి ఆరోపణలపై ఒక కేసు నమోదైనట్లు న్యూయార్క్ పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఈ మధ్యే ఉద్యోగం కోల్పోయాడని, అద్దె చెల్లించే స్థితిలోనూ లేకపోవడంతో అతడి వీసా పరిస్థితి ప్రమాదంలో పడిందని కూడా పోస్ట్ వెబ్సైట్ తెలిపింది. వరుణ్ ఒకానొక హాలోవీన్ పారీ్టలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, కానీ తాను ఆ విషయాన్ని పోలీసులకు తెలపలేదని ఒక సాక్షి విచారణ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. వరుణ్ తాలూకూ రికార్డులను పరిశీలించిన ఫాక్స్ న్యూస్ అతడు యూనివర్శిటీ నుంచి బహిష్కృతుడైనట్లు గుర్తించింది. అయితే హత్యారోపణలు వచ్చే నాటికి అతడి వీసా చెల్లుబాటులోనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వరుణ్‌ను అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. అనంతరం అతడిని అరిజోనాకు తరలించి పిమా కౌంటీ అడల్ట్ డిటెన్షన్ కాంప్లెక్స్‌లో ఉంచనున్నారు. -
నటుడు దర్శన్ కేసులో మరో సంచలనం!
రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎలా దాడి చేసి చంపారు?.. అనంతరం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు.. ఆపై తెరపైకి వచ్చిన కవర్అప్ కథను అందులో అతను ‘పూసగుచ్చినట్లు’ వివరించాడు. దీంతో నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది.సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రగౌడ, దర్శన్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రదోష్ ఏ-14గా ఉన్నాడు. అప్రూవర్‌గా మారేందుకు 59వ సెషన్స్ కోర్టులో అతను వేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి.. తొలుత రేణుకాస్వామిని దర్శన్ మనుషులు కొందరు ఎత్తుకొచ్చారు. పవిత్ర గౌడకు పంపినట్లు చెబుతున్న సందేశాల విషయంలో దర్శన్ అతడిని ప్రశ్నించాడు. ఆ తర్వాతే తన మనుషుల్ని ఉసిగొల్పడంతో.. దాడి జరిగింది. కర్రలు, తాళ్లతో అతన్ని తీవ్రంగా గాయపరిచారు. రేణుకాస్వామి మరణించాడని నిర్ధారించుకున్నాక.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు.మృతదేహాన్ని తరలించి.. కథ మార్చే ప్రయత్నం?రేణుకాస్వామి మరణం తర్వాత ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రత్యామ్నాయ కథనం సిద్ధం చేసుకున్నారు. తొలుత శవాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొందరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. ఆ నేరం వాళ్ల మీద వేసుకునేందుకు దర్శన్ పవిత్రలు వాళ్లకు డబ్బులు ఆఫర్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది కూడా.అయితే ఈ కేసులో జరిగిదంతా నిజాయతీగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకే అప్రూవర్ హోదా ఇవ్వాలని ప్రదోష్ కోర్టును కోరాడు. జైల్లో తనకు భద్రత కల్పించాలని, ఇతర నిందితులతో కలిపి ఉంచొద్దని కూడా విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రదోష్ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు అతన్ని అప్రూవర్‌గా అంగీకరిస్తే.. ఆపై వాంగ్మూలం లభిస్తే.. దర్శన్, పవిత్ర గౌడ సహా ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్ కేసుకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్‌గా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామాలు కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్‌కు వీరాభిమాని. అయితే నటి పవిత్రా గౌడ వల్ల దర్శన్ వ్యక్తిగత జీవితం నాశనమైందని అతను కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పవిత్రకు అసభ్యమైన సందేశాలు పంపాడు. ఈ విషయంలోనే ఆగ్రహించిన దర్శన్.. అతన్ని కిడ్నాప్ చేయించి తన మనుషులతో అతికిరాతకంగా హత్య చేయించాడన్నది అభియోగం. ఈ కేసులో అరెస్టైన దర్శన్‌కు తొలుత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది. కేసు విచారణ త్వరగా ముగించాలని ట్రయల్ కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో దర్శన్, పవిత్రలు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
భారత యువతి హత్య: ఏడు నెలల తర్వాత ప్రియుడి అరెస్ట్!
టొరంటో: కెనడాలోని టొరంటోలో గత డిసెంబర్లో జరిగిన భారత సంతతికి చెందిన హిమాన్షీ ఖురానా (30) హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆమె భాగస్వామి అబ్దుల్ గఫూరీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 20, 2025న ఈ హత్య జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న గఫూరీని, ఆగస్టు 7న టొరంటో విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు టొరంటో పోలీసులు శనివారం ప్రకటించారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది.నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతనికి పెరోల్ లేని జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. డిసెంబర్ 19న హిమాన్షీ కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా, మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం ఆమె ఇంట్లోనే లభ్యమైంది. టొరంటోలోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని ప్రకటించింది. నిందితుడు విదేశాలకు పారిపోయినప్పటికీ, అంతర్జాతీయ పోలీసు ఏజెన్సీల సహకారంతో అతడిని కెనడాకు రప్పించి, అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఇది కూడా చదవండి: బ్రెజిల్లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి! -
పల్నాడులో వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడి దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
రేణుకాస్వామి కేసులో కీలక పరిణామం
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్ (మాఫీ సాక్షి)గా మారేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ప్రదోష్ కోర్టు ముందు నిజాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడంతో.. ఈ పరిణామం దర్శన్‌కు కొత్త చిక్కులు తెచ్చే అవకాశముందనే చర్చ మొదలైంది.రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులు ఉన్నారు. ప్రధాన నిందితులుగా దర్శన్, పవిత్ర గౌడ పేర్లను ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఏ14 నిందితుడు ప్రదోష్ ప్రస్తుతం అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించాడు. అయితే కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలను కోర్టు ముందు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని పిటిషన్లో అతను పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు చట్టపరంగా మాఫీ సాక్షిగా(approver) మారే అవకాశం కల్పించాలని కోరాడు.కేసులో కొత్త మలుపుప్రదోష్ అభ్యర్థనను కోర్టు అంగీకరిస్తే.. రేణుకాస్వామి హత్య కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సాక్షిగా మారితే కేసులోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రదోష్ చెప్పే వివరాలను కోర్టు ఎలా పరిగణిస్తుంది? అతడి వాంగ్మూలం కేసులో ఎంతవరకు ప్రభావం చూపుతుంది? అనేది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.కోర్టు ముందుకు ప్రదోష్ప్రదోష్ ఇవాళో, రేపో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అతడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే.. కేసులోని ఇతర నిందితుల పాత్ర, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.2024 జూన్‌లో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి.. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్‌పై హత్య కుట్ర, కిడ్నాప్, దాడి వంటి అభియోగాలు నమోదు చేసి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. తొలుత కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ దర్శన్‌ను తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో దర్శన్ మళ్లీ జైలు పాలయ్యాడు. అయితే.. ఈ కేసులో సాక్షుల్ని బెదిరిస్తున్నారంటూ తాజాగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జైల్లో దర్శన్ ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జరగ్గా, కర్ణాటక డీజీపీ దానిని పుకారుగా కొట్టి పారేశారు. ప్రదోష్ వాంగ్మూలం కీలకమవుతుందా?తాజాగా ఈ కేసులో ఏ14 నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించడం మరో కీలక పరిణామంగా మారింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తి సాధారణంగా కేసుకు సంబంధించిన కీలకసమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు అతడి అభ్యర్థనను అంగీకరిస్తే.. కేసులోని మరిన్ని వివరాలు, నిందితుల పాత్రకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
యావజ్జీవ శిక్ష నిలిపివేత.. బెయిల్..
సాక్షి, న్యూఢిల్లీ: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో సంచలనం సృష్టించిన బట్ట లింగయ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అప్పటి గ్రామ సర్పంచ్ పోలెబోయిన లింగయ్యకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కింది కోర్టు విధించిన జీవితకాల శిక్షను సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున ఆయన్ను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ప్రత్యక్ష దాడికి పాల్పడలేదు ఈ పిటిషన్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన సమయంలో లింగయ్య సర్పంచ్‌గా ఉన్నారని, మృతుడి భార్య వాంగ్మూలంలో ఆయన ప్రత్యక్షంగా దాడి చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ నేరుగా దాడి చేయకపోయినా నిందితులను రెచ్చగొట్టి హత్యకు పురికొల్పారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దాడిలో పిటిషనర్ ప్రత్యక్ష పాత్ర లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. ఇదీ నేపథ్యం...: 2017 సెపె్టంబర్ 30 దసరా పండుగ రోజున అజీంపేటలోని జమ్మిచెట్టు వద్ద ఎస్సీ వర్గానికి చెందిన బట్ట లింగయ్య దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో నాటి సర్పంచ్ పోలెబోయిన లింగయ్య ప్రోద్బలంతో ఆయన అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సర్పంచ్‌తో సహా మొత్తం 18 మందికి జీవితఖైదు విధించింది. కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించినా, ఉపశమనం లభించకపోవడంతో మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
కూరలో విషం కలిపిన భార్య....
మోపాల్(నిజామాబాద్ రూరల్): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో సెలైన్ ద్వారా టాయిలెట్ క్లీనర్ ఎక్కించి భర్తను హత్య చేసిన ఘటన మరువక ముందే.. ఇదే మండలంలో కూరలో గడ్డి మందు కలిపి భర్త, అత్తలను హత్య చేయడానికి యత్నించిందో భార్య. సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఎస్సై జాడె సుస్మిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మోపాల్ మండలంలోని ముదక్పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల భూమన్నకు వర్ని మండలం తిమ్మాపూర్‌కు చెందిన సోనితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. భూమన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భర్త, అత్త ఇద్దరూ తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని భావించిన సోని వారిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని ప్రణాళిక వేసింది. ఈనెల ఒకటో తేదీన మధ్యాహ్న సమయంలో మీల్మేకర్ కర్రీలో గడ్డి మందును కలిపి వడ్డించింది.ఆ కూరతో అన్నం తిన్న అత్త భూదవ్వకు తీవ్ర వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆ తర్వాత భూమన్న కూడా అదే కూరతో భోజనం చేశాడు. అయితే కూర వాసన రావడంతో తినడం మానేశాడు. అతడు సైతం అస్వస్థతకు గురికావడంతో స్థానికులు నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. భూమన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోనిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించిందని ఎస్సై తెలిపారు. నిందితురాలు సోనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
హత్య కేసులో సాక్షి నుంచి లంచం డిమాండ్, బయటపడ్డ పోలీసుల సంచలన ఆడియో
-
సువేందు పీఏ కేసులో బీజేపీ కార్యకర్తల అరెస్ట్!?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణంలో కేసు దర్యాప్తు కొనసాగగా.. తాజాగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలనే సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ కేసు మరోసారి బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అరెస్టైన వారిని సాగర్ సోంకర్, సాహెబ్ సోంకర్‌గా గుర్తించారు. వీరిద్దరూ సోదరులని, గతంలో చంద్రనాథ్ రథ్ టీమ్‌లో పనిచేసిన వారేనని సీబీఐ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీళ్లు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. హత్యకు ముందు రెక్కీ నిర్వహించడం, దాడికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, షూటర్లతో మాట్లాడుకుని ప్లాన్ చేయడం వీళ్లిద్దరి పనేనని గుర్తించారు. అయితే హత్యకు అసలు కారకులు ఎవరు? కారణం ఏంటి? అనేది ఇంకా తేలాల్సి ఉంది.సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్‌యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు జరగడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా.. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యూపీ, బిహార్ నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి చేరింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం.హత్యకు ముందే వ్యూహం?సీబీఐ దర్యాప్తులో భాగంగా హత్యను పక్కా ప్రణాళికతో అమలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ముందుగానే షూటర్లను ఎంపిక చేయడం, వారికి అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఘటనకు ముందు ప్రాంతాన్ని పరిశీలించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లైంది. బీజేపీ కార్యకర్తలే ఎందుకు అనుమానితులు?తాజా పరిణామాల్లో ప్రధాన అంశం.. అరెస్టైన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు కావడం. వీరు ఒకప్పుడు చంద్రనాథ్ రథ్‌తో కలిసి పనిచేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా వీరికి ప్రత్యర్థి రాజకీయ వర్గాలతో కూడా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాజకీయ విభేదాలా? వ్యక్తిగత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం వాళ్లు గతంలో సువేందు టీఎంసీలో ఉన్నప్పుడు.. చంద్రనాథ్ రథ్ టీంలో పని చేశారని అంటున్నారు. అప్పట్లో సువేందు ఆరోపణలు.. చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సాధించిన విజయం నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.కొత్త మలుపు.. అసలు కుట్రదారులు ఎవరు?తాజా అరెస్టులతో చంద్రనాథ్ రథ్ హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఒకవైపు రాజకీయ కుట్ర కోణం, మరోవైపు సొంత వర్గంలో ఉన్న వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం.. కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. -
ఒకప్పుడు నేను.. ఇప్పుడు నా బిడ్డ కూడా!
విశాఖపట్నం: భర్త జైలులో.. ఒడిలో ఐదు నెలల పసికందు.. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒకప్పుడు అనాథగా పెరిగిన శృతి.. ఇప్పుడు తన బిడ్డ కూడా అదే అనాథ జీవితాన్ని అనుభవించాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమైంది. విశాఖలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో అరెస్టయిన బొలిశెట్టి సురేష్ భార్య శృతి ఊర్వశీ జంక్షన్లో ఉన్న ఇంట్లో బోరున విలపిస్తున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది. ప్రేమతో మొదలై.. విషాదంతో మిగిలింది హాస్టల్లో పెరిగిన శృతి ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుండగా సురేష్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, జీవితాంతం తోడుంటానని నమ్మించి వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత ఆమె జీవితంలో సంతోషం కంటే కన్నీళ్లే ఎక్కువయ్యాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిదేళ్ల కుమార్తెను కోల్పోయింది. గర్భంలో ఉన్న కవలల్లో ఒక శిశువు కూడా మృతిచెందింది. ఇప్పుడు ఒడిలో ఉన్న ఐదు నెలల పసికందే తనకు మిగిలిన ఆశగా నిలిచింది. పాలకు డబ్బులు లేక.. మైనర్ బాలికను హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రైలులో ఒడిశాకు తీసుకెళ్లి, అక్కడ పడేసి వచ్చిన భర్త సురేష్ జైలుకెళ్లడంతో కుటుంబానికి ఉన్న ఏకైక ఆదాయ మార్గం మూసుకుపోయింది. నెలకు రూ.3,500 అద్దె చెల్లిస్తూ గౌరీనగర్‌లో ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని యజమాని చెబుతున్నారని శృతి ఆవేదన వ్యక్తం చేసింది. పాపకు సెరెలాక్ కొనుగోలు చేయడానికి కూడా చేతిలో డబ్బులు లేవని కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఒకప్పుడు నేనే అనాథను. ఇప్పుడు నాతో పాటు నా ఐదు నెలల బిడ్డ కూడా అనాథ అయింది. మా బిడ్డ ఏ పాపం చేసింది?’ అంటూ ఆమె బోరున విలపిస్తోంది. ఒక వ్యక్తి చేసిన నేరానికి చట్టం శిక్ష విధిస్తుంది. కానీ ఆ నేరం వల్ల ఛిద్రమైన కుటుంబాలు, దిక్కులేని చిన్నారులు అనుభవించే బాధకు మాత్రం కొలమానం ఉండదు. ఈ కేసులోనూ నిందితుడి చర్యతో అమాయక పసికందు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
ఇదేం విచిత్రమో.. ఆ లాజిక్కు మిస్సయ్యిందా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కోర్టులో ఇకనైనా వేగంగా సాగుతుందా? ఈ కేసు ఈ ఏడేళ్లలో అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. నిందితులుగా ఉన్న వివేకా రక్త సంబంధికులు ఈ కేసు సత్వరమే విచారణకు రావాలని కోరుతుంటే, స్వయంగా వివేకా కుమార్తె సునీత ఈ విచారణ జాప్యం అవడానికి కారణం అవుతున్నట్లు వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సీబీఐ విచారణపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆమె తరచు వేస్తున్న పిటిషన్లు ఈ జాప్యానికి కారణంగా కనిపిస్తున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. ఆమె ఏకంగా కొత్తగా ప్రైవేట్ కేసును సీబీఐ కోర్ట్‌లో వేసి మళ్లీ మొదటినుండి సీబీఐ విచారణ కోరడం చూసి కోర్ట్ వారు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆ పిటిషన్ చట్టపరంగా మెయిన్టెయినబుల్ కాదని కోర్టు స్పష్టం చేసింది. ఆమె లేవనెత్తిన అంశాలకు కోర్టువారు 70 పేజీలలో ఉత్తర్వులు ఇచ్చారు.. ఆమెకు ఎవరిమీద కోపం ఉంటే వారిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారన్న విమర్శ వచ్చింది.సీబీఐ తమను అక్రమంగా కేసులో చేర్చిందని కొంతమంది నిందితులు వాపోతుంటే, తానే వివేకాను చంపాను అన్న నిందితుడు ఆప్రోవర్గా మారడం విశేషంగా కనిపిస్తుంది. సునీత ఏ లాయర్నైతే నియమించుకున్నారో, ఆయనే ఇతనికి లాయర్‌గా ఉండడం, సుప్రీంకోర్టులో కేసులు వేయడం చిత్రంగా ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వివేకా హత్య జరిగిన తర్వాత కొంతకాలం పాటు ఆమె చేసిన ఆరోపణలకు, ఆ తర్వాత కాలంలో చేసిన అభియోగాలకు ఎందుకు తేడా వస్తోందంటే ఏమి చెబుదాం. వర్తమాన రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అన్న భావన కలుగుతుంది. ఇందులో బంధాలు, అనుబందాల కన్నా, ఇతరత్రా లక్ష్యాలకే ప్రాధాన్యం ఇస్తుండవచ్చు. తన తండ్రిని హత్య చేశానని బహిరంగంగా ప్రకటించిన దస్తగిరి అనే నిందితుడికి బెయిల్ రావడానికి సునీత సహకరించారన్న ప్రచారం ఆమె ప్రతిష్ట మసకబారేలా చేసిందనిపిస్తుంది. అలాగే అన్నిటిని మించి వరుసకు తన సోదరుడయ్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తగాదాపడి, తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న చదరంగంలో ఆమె ఒక పావుగా మారిందన్న ఆరోపణను వైఎస్సార్సీపీ నేతలు చేస్తుంటారు.ఈ కేసులో టీడీపీ చేసే విమర్శలు, ఈమె చేసే ఆరోపణలు గమనిస్తే అది నిజమేనేమో అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్‌ను, ఆయన సతీమణిని ఎలాగైనా ఈ కేసులోకి తీసుకురావాలని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకు ఆమె వెళ్లారు. ఆ సందర్భంగా కోర్టు సూచన మేరకు సీబీఐ మళ్లీ, మళ్లీ విచారణ చేసినా, ఎక్కడా ఎలాంటి కొత్త ఆధారాలు కనిపించలేదు. దాంతో ఎవరెవరిమీదో తోచిన ఆరోపణల్లా చేయడం, ఆ కోణంలో సీబీఐ విచారణ జరపడం నిత్యకృత్యంగా మారింది.ఈ కేసులో సీబీఐ కూడా ఒక కీలకమైన కోణాన్ని వదలిపెట్టిందన్నది నిందితుల తరపు న్యాయవాదుల వాదన. వివేకా రెండో పెళ్లి చేసుకున్నారా? లేదా? ఆమెకు ఈయన ద్వారా సంతానం కలిగిందా? లేదా? ఆమె వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారా?లేదా? దస్తగిరి తరపున వాదించిన లాయర్ కాని, సునీత పక్షాన వాదన చేసిన లాయర్ కాని టీడీపీ తరపున పనిచేసేవారే కావడంలోని ఆంతర్యం ఏమిటి? వారికి ఢిల్లీలో లక్షల రూపాయల చొప్పున ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. అవన్ని ఎవరు సమకూర్చారు?వివేకా హత్య కేసులో ఆయన సమీప బంధువుల ప్రమేయం ఉందా? లేక వ్యక్తిగత స్నేహితుల హస్తం ఉందా? రియల్ ఎస్టేట్ లావాదేవీలు, సంబంధిత డబ్బు కారణంగా ఈ హత్య జరిగిందా? లేక ఎంపీ సీటుకు పోటీ వస్తాడన్న కారణంగా హత్య జరిగిందా?ఇక్కడ ఒక లాజిక్ సీబీఐ కూడా మిస్ అవుతోందన్న అభిప్రాయం ఉంది. అవినాశ్ రెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీగా కొనసాగుతున్న సమయంలో 2019 ఎన్నికలలో కూడా ఆయనే అభ్యర్ధి అని అందరికి తెలుసు. నిజంగా వివేకా ఎంపీ సీటు ఆశించి ఉంటే, అవినాశ్ తరపున ప్రచారానికి ఎందుకు వెళతారు? ఇలాంటి మిస్సింగ్ లింకులన్నీ విచారణ సందర్భంగా ఒక కొలిక్కి వస్తాయోమో తెలియదు. హత్య జరిగిన రోజు వివేకా రాసిన లేఖ, ఆయన పీఏ. కృష్ణారెడ్డి వాదన, సీబీఐ అధికారులను మార్చిన వైనం మొదలైనవి ఎన్నో శేషప్రశ్నలుగా ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు జరిగిన తీరుతెన్నులపై పరిశోధన జరిగితే మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయేమో చెప్పలేం.అంతేకాదు... వివేకా హత్య కేసులో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని పలుమార్లు స్పష్టమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌లు పదేపదే ఆయనపై ఎందుకు ఆరోపణలు చేశారు? ఇప్పటికీ ఎందుకు చేస్తూనే ఉన్నారు. అంతేకాక వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీగా ముద్రవేసి లబ్ది పొందాలని ఎందుకు యత్నిస్తున్నారు? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసి బూడిద కూడా మాయం చేసిన నేపథ్యంలో టీడీపీకి బూడిద పార్టీ అని మాజీ మంత్రి కొడాలి నాని పేరు పెట్టి కౌంటర్ ఇచ్చి ఉండవచ్చు. అది వేరే విషయం.ఇన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సీబీఐ కోర్టు ఇచ్చిన ఒక తీర్పు సునీతకు, బహుశా టీడీపీకి, ఎల్లో మీడియాకు ఆశాభంగం కలిగించి ఉండాలి. మరోసారి విచారణ చేయండని సీబీఐ కోర్టు ఆదేశించి ఉంటే ఆ పేరుతో మరికొంతకాలం గడిచేదేమో! కాని చట్టం ప్రకారం అది కరెక్టు కాదని గౌరవ న్యాయస్థానం అభిప్రాయపడి సునీత పిటిషన్‌ను తోసిపుచ్చింది. సీబీఐ విచారణ సరిపోలేదని సునీత అంటున్నా, కొత్త ఆధారాలు ఏమీ వెలుగులోకి రాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు ఎలా చేయాలో తాము నిర్దేశించజాలమని కూడా కోర్టు స్పష్టం చేసింది.రోజువారీ విచారణ జరగాలని ఒకవైపు కోర్టును కోరుతూ, సీబీఐ దర్యాప్తు మరింత లోతుగా జరపాలని మరో వైపు కోర్టులలో ఆమె పిటిషన్లు వేస్తున్నారని నిందితుల తరపున న్యాయవాదులు పేర్కొంటున్నారు. క్రిమినల్ కేసుల్లో నిరంతర దర్యాప్తు జరగదని, సుప్రీంకోర్టు కూడా వేగవంతంగా ఈ కేసును విచారించాలని ఆదేశించిన విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. కుమార్తె అన్న సానుభూతి పొందడానికి ఆమె ప్రయత్నిస్తున్నారా? లేక చిత్తశుద్దితో తన తండ్రి హత్య కేసు విచారణ సత్వరమే జరగాలని కోరుకుటున్నారా? అన్న ప్రశ్నలను ప్రతివాదులు వేస్తున్నారు.విశేషం ఏమిటంటే ఏ కేసులో అయినా నిందితులు విచారణ జాప్యం కావాలని ప్రయత్నిస్తుంటారు. కాని ఈ కేసులో మాత్రం స్వయంగా వివేకా కుమార్తె పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణ జాప్యానికి కారణం అవుతున్నారన్న భావన ప్రజలలో కలుగుతోంది. ఆ విషయాన్ని ఆమె గ్రహిస్తే మంచిదన్న అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా దురుద్దేశాలతోనో, కక్ష కట్టి ఎవరిపైనో కేసును బనాయించాలని ప్రయత్నించడం సమంజసం కాదని పలువురి వ్యాఖ్యగా ఉంది. పైగా ఇందులో రాజకీయంగా తన తండ్రి ప్రత్యర్థుల సహాయ సహకారాలు తీసుకుంటున్నారన్న విమర్శలు రావడం కూడా ఆమెకు మంచిది కాదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జంటహత్యల కేసులో నిందితుల అరెస్టు
కృత్తివెన్ను: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మామాఅల్లుళ్లను హతమార్చిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బందరు డీఎస్పీ జి.శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. జూన్ 27వ తేదీ రాత్రి పాతగొడవల నేపథ్యంలో చినగొల్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన మామాఅల్లుళ్లు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పను దారుణంగా హత్యచేశారు. అదే గ్రామానికి చెందిన శంకరపు శ్రీనుకు సుబ్బన్న, అయ్యప్పలతో చేపలవేట వద్ద ఘర్షణ జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న శ్రీను అదే గ్రామానికి చెందిన జల్లా నాగరాజు, గుడివాడకు చెందిన నలుగురు స్నేహితుల సహకారంతో సుబ్బన్న, అయ్యప్పలపై కర్రలు, రాడ్డు, కత్తితో దాడిచేశారు. వారిద్దరినీ హతమర్చారు. అనంతరం మృతదేహాలను వారి ద్విచక్ర వాహనానికే కట్టి నీటిలో పడేశారు. కంకిపాడు సీఐ బి.బి.రవికుమార్, ఆర్‌పేట సీఐ కె.ఏసుబాబు, పెడన సీఐ నాగేంద్రప్రసాద్ మూడు బృందాలుగా ఏర్పడి దాదాపు నెలరోజుల పాటు సాంకేతిక అంశాల సాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు హత్యచేసింది శంకరపు శ్రీను, జల్లానాగరాజు, పెదఎరుకపాడుకు చెందిన కటికల కల్యాణ్, అబ్బూరి విజయరత్నం (దాస్), యలవర్తిపాడుకు చెందిన డొక్కుమాల శ్రీకాంత్, గుడివాడ కార్మికనగర్‌కు చెందిన అబ్దుల్ఖాదర్జిలానీ అని గుర్తించారు. ఈ నెల 26వ తేదీ రాత్రి లక్ష్మీపురం సెంటర్లో ఉండగా వారందరినీ పెడన సీఐ నాగేంద్రప్రసాద్, కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఒక కారు, ద్విచక్రవాహనం, ఏడు మొబైల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కత్తి, ఇనుపరాడ్డు, కర్రను స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నెలరోజులపాటు ఎంతో శ్రమించి కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అభినందించారు. అధికార పార్టీ అండతోనే.. జంటహత్యల కేసులో నిందితులు అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. చినగొల్లపాలెంకు చెందిన నిందితులు ఆ పార్టీకి అత్యంత సానుభూతి పరులు. ఈ కారణంగానే హత్య జరిగినప్పటి నుంచి స్థానికంగా ఉన్న ఆ పార్టీ నాయకులు నిందితులు శ్రీను, నాగరాజు, కటికల కల్యాణ్‌ను రక్షించేందుకు అనేక యత్నాలు చేశారని ప్రచారం జరుగుతోంది. శ్రీనుతో పాటు నాగరాజును అనుమానించిన పోలీసులు కొద్ది రోజుల క్రితం విచారణ పేరుతో తీసుకెళ్లారు. అయితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అనంతరం వారిని వదిలేశారని సమాచారం. చివరికి అసలు నిందితులు వారే కావడంతో అరెస్టు చేయక తప్పలేదని తెలుస్తోంది. -
అబిడ్స్‌లో యువకుడి వీరంగం! కారుతో నేరుగా పోలీసుల పైకే..
హైదరాబాద్: గత కొన్నిరోజులనుంచి డ్రగ్స్ డీల్ సమాచారంతో అబిడ్స్‌లో పోలీసులు నిఘా పెడ్తున్నారు. అయితే, ఈరోజు సోమవారం ఉదయం తెల్లవారుజామున, ఓ యువకుడు బలెనో కార్లో డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువకుడు కారుతో నేరుగా పోలీసులపైకి దూసుకెళ్లాడు. ప్రమాదంనుంచి తప్పుకునేలోపు నిందితుడు కారును రివర్స్‌లో తీసి పోలీసులపైకి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌కు గాయాలు కాగా, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అయినాసరే వారి గాయాలను లెక్కచేయకుండా పారిపోతున్న నిందితుడు సైఫ్‌ను పోలీసులు ఛేజ్‌చేసి పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం దగ్గరలో ఉన్నటువంటి యశోధ ఆస్పత్రిలో పోలీసులు చికిత్స పొందుతున్నారు. అయితే, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ ఫిర్యాదుతో నిందితుడిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విభాగం నిందితుడిని విచారిస్తున్నట్లుగా తెలిసింది. -
మరిది వేసిన మాస్టర్‌ప్లాన్! కథ అడ్డం తిరిగింది..
కరీంనగర్, జగిత్యాల: వదినను చంపి ఆస్తి దక్కించుకోవాలన్న పథకాన్ని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రణాళిక రచించిన మరిది, అతని భార్య, సమీప బంధువులను ఇప్పటికే రిమాండ్‌కు తరలించగా.. తాజాగా మరో నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌వర్మను అరెస్ట్ చేశారు. మెట్పల్లి సర్కిల్ ఆఫీస్‌లో డీఎస్పీ రాములు శుక్రవారం వివరాలు వెల్లడించారు.జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, రాజం అన్నదమ్ములు. పొత్తుల ఉన్న 58 గుంటల భూమిని శంకర్ తన అన్నకు తెలియకుండా విక్రయించడమే కాకుండా పొత్తులో ఉన్న ఇంటిని సైతం తన పేరిట రిజి స్ట్రేషన్ చేయించుకోవడం ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీసింది. ఈక్రమంలోనే రెండు సార్లు శంకర్ తన అన్నవదినలు రాజం, లక్ష్మిలపై దాడి చేయగా కేసులు నమోదయ్యాయి. ఆస్తిని దక్కించుకునేందుకు తన వదిన గోనెల లక్ష్మిని హత్య చేయాలని భార్య అనూష, బంధువు ముత్తన్నలతో కలిసి పథకం రచించాడు.తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సచిన్‌వర్మను సంప్రదించి డబ్బు ఆశ చూపాడు. దీనికి ఒప్పుకున్న సచిన్ గత మార్చిలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి అపరిచిత సాధువు వద్ద నాటు పిస్టల్, మూడు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. దీని కోసం శంకర్ రూ.35వేలు ఫోన్‌పే ద్వారా సచిన్‌కు పంపించాడు. సచిన్‌వర్మ మెట్‌పల్లికి తిరిగి వచ్చిన తర్వాత గత నెల 13న లక్ష్మిని చంపడానికి వారి ఇంటికి వెళ్లిన సచిన్ భయాందోళనకు గురై కాల్పులు జరపకుండా వెళ్లిపోయాడు.తిరిగి 15న అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురి ప్రోద్బలంతో సచిన్ బైక్‌పై వెళ్లి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే గురితప్పడంతో బుల్లెట్ ఎడమ చెంప భాగంలో తగిలింది. కాల్పులతో భారీ శబ్దం రావడం, లక్ష్మి కేకలు వేయడంతో సచిన్ పరారయ్యాడు. ఆ తర్వాత నిందితులు ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.సచిన్‌ను ఉత్తరప్రదేశ్‌కు పంపించి కేసులో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి మరుసటి రోజు శంకర్, ముత్తన్న.. 28న అనూషలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేసిన తర్వాత బుల్లెట్ బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఈనెల 20న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి సచిన్‌ను అదుపులోకి తీసుకొని.. పిస్టల్, రెండు బుల్లెట్స్, బైక్, ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ సురేశ్‌బాబు, ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బందిని అభినందించారు. -
కెనడాలో పంజాబ్‌కు చెందిన మహిళ దారుణ హత్య
కెనడాలో ఎడ్మింటన్‌లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 23 ఏళ్ల దమన్ ప్రీత్ కౌర్ దారుణ హత్య కలకలం రేపింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.ఎడ్మంటన్ పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలు, జూలై 9న పంజాబ్‌లోని లుధియానా జిల్లా, సమ్రాలా నివాసి దమన్ ప్రీత్‌కౌర్ స్పృహలేకుండా, తీవ్ర గాయాలతో పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆగ్నేయ ఎడ్మంటన్‌లోని సిల్వర్బెర్రీ నివాస ప్రాంతానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కౌర్ కన్నుమూసింది. ఇది హత్యేనని పోస్ట్ మార్టంలో నివేదిక ద్వారా ధృవీకరణ అయింది. ఈ కేసులో గత కొన్నాళ్లుగా దమన్ ప్రీత్ కౌర్‌తో కలిసి నివసిస్తున్న (Live-in Partner) ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల రీతీష్ కమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనే గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వేరే అనుమానితులు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. 'సెకండ్ డిగ్రీ మర్డర్' ఆరోపణలు నమోదు చేశారు.మరోవైపు కౌర్ మృతదేహాన్ని భారతదేశంలోని ఆమె స్వగ్రామానికి తరలించడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు సహాయంగా ఒక GoFundMe క్యాంపెయిన్ ప్రారంభించారు. 20 వేల డాలర్లకు గాను ఇప్పటికే దాదాపు 19వేల డాలర్ల విరాళాలు అందాయి. ఇదీ చదవండి: 150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు -
ప్రియుడిని నరికి, ట్యాప్ కింద పెట్టి..
థానే: మహారాష్ట్రలోని థానేలో మన్పాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భయానక ఘటన వెలుగుచూసింది. పూణెకు చెందిన హసిబా అనే మహిళ తన ప్రియుడు హమిదిల్లా ఇస్లామ్‌ను దారుణంగా హత్య చేసింది. వివాహేతర సంబంధం లేదా వ్యభిచార కూపంలోకి నెట్టేయాలని చూశాడనే అనుమానంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. సుమారు ఐదు రోజుల క్రితం ప్రియుడిని హతమార్చిన నిందితురాలు, మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. అనంతరం దుర్వాసన రాకుండా, త్వరగా కుళ్లిపోవడానికి బాత్రూమ్లోని రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద ఆ మృతదేహాన్ని గోనెసంచిలో దాచింది.ఈ దారుణానికి పాల్పడిన తర్వాత హసిబా కోల్‌కతాకు పరారైంది. అయితే ఫ్లాట్ యజమానికి వాయిస్ మెసేజ్ పంపి తాను హత్య చేసినట్లు తెలిపింది. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలలో విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తాళాలు పగలగొట్టి పరిశీలించగా, కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితురాలిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని కోల్‌కతాకు పంపారు.ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉద్రిక్తత.. ‘మహా పంచాయత్’తో కదం తొక్కిన అన్నదాతలు! -
జంట హత్యల కేసులో మరణశిక్ష
పాలక్కాడ్: కేరళలో గత ఏడాది సంచలనం సృష్టించిన నెన్మర జంట హత్యల కేసు నిందితుడికి మరణశిక్ష పడింది. పాలక్కాడ్ అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ సోమవారం ఈ మేరకు తీర్పు ప్రకటించారు. జంట హత్యలను అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన న్యాయమూర్తి 61 ఏళ్ల నిందితుడు చెన్‌తామర రూ.20 లక్షల జరిమానా కూడా కట్టాలని ఆదేశించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1), సెక్షన్ 126 (2)ల కింద ఈ శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. గత ఏడది జనవరి 27న చెన్‌తామర తన పొరుగింటి సుధాకరన్తోపాటు తల్లి లక్ష్మిని హత్య చేశారు. చెన్‌తామర ఒకే కుటుంబంలోని వారిని హత్య చేసినందున ఈ కేసును అరుదైనదిగా భావిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. తన దాంపత్య సమస్యలన్నింటికీ కారణమని ఆరోపిస్తూ చెన్‌తామర పొరుగింటి సుధాకరన్ భార్య సజితను 2019లో హత్య చేశాడు. ఈ కేసులో డబుల్ జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే గత ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదలైన సందర్భంగా మరోసారి ఆ ఇంటిపై దాడి చేసి సుధాకరన్తోపాటు అతడి తల్లిని చంపేశాడు. ఈ ఘటన కాస్తా నెన్మర జంట హత్యల కేసుగా ఖ్యాతి చెందింది. పోలీసులు చాలా వేగంగా నిందితుడిని అరెస్ట్ చేయగలిగారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం సుమారు 81 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అలాగే దాదాపు 28 వస్తువులను పరిశీలించింది. సోమవారం ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి కెన్నెత్ జార్జ్ చెన్తామరకు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. బాధితుడి పెద్ద కుమార్తెకు ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఆ ఇంటికెళ్లం నెన్మర జంట హత్యల కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును బాధితుడు సుధాకరన్ కుమార్తెలు అతుల్య, అఖిల స్వాగతించారు. నిందితుడికి తగిన శిక్ష పడటంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు వెలువడిన తరువాత వారిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులతోపాటు నానమ్మను కూడా కోల్పోయిన ఆ ఇంటికి మళ్లీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘‘నాన్న, మిగిలిన వారందరి జ్ఞాపకా>లున్నాయి అక్కడ. మళ్లీ అక్కడికి వెళ్లలేము. వెళితే ఆ జ్ఞాపకాలు చుట్టుముడతాయి.’’అని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ బంధువుల ఇంట్లోనే ఉంటున్నారు. తీర్పు వెలువడిన తరువాత కూడా చెన్‌తామర ముఖంలో ఎలాంటి పశ్చాతాపమూ కనిపించలేదని అతుల్య వ్యాఖ్యానించగా న్యాయప్రక్రియ పూర్తయ్యేంతవరకూ భయం తమను వెంటాడుతూనే ఉంటుందని అఖిల ఆందోళన వ్యక్తం చేసింది. -
‘రేర్ ఆఫ్ ది రేరెస్ట్’.. నెన్మారా కేసులో సంచలన తీర్పు
కేరళలో సంచలనం సృష్టించిన నెన్మారా డబుల్ మర్డర్ కేసులో సోమవారం కీలక తీర్పు వెలువడింది. తల్లీకొడుకులను దారుణంగా హత్య చేసిన కేసులో 61 ఏళ్ల నిందితుడు చెంతమరాకు కోర్టు మరణశిక్ష విధించింది. అంతకు ముందు అదే కుటుంబంలోని వ్యక్తిని హత్య చేసిన చెంతమరా.. బెయిల్‌పై బయటకు వచ్చి జంట హత్యలకు పాల్పడడం గమనార్హం. దీంతో ఈ కేసు అత్యంత అరుదైన కేసుల (రేర్ ఆఫ్ ది రేరెస్ట్) పరిధిలోకి వస్తుందని భావించిన న్యాయస్థానం కఠిన శిక్షను ఖరారు చేసింది.పాలక్కాడ్ జిల్లా నెన్మారా పరిధిలోని పొతుండి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2025 జనవరి 27న సుధాకరన్ (55), ఆయన తల్లి లక్ష్మి (75)పై నిందితుడు చెంతమరా (Chenthamara) దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది.భార్య దూరం కావడంపై అనుమానంతో.. చెంతమరా నేర చరిత్ర మొదలైంది 2019 ఆగస్టు 31న. ఆ రోజు అతను తన పొరుగింటి మహిళ సజిత (35)ను హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. తన భార్య, కుమార్తె తనను విడిచిపెట్టి వెళ్లడానికి సజిత కుటుంబం చేసిన చేతబడే కారణమని చెంతమరా అనుమానించాడు. ఈ అనుమానంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. బెయిల్‌పై బయటకు వచ్చాక ఘాతుకంసుధాకరన్ భార్య సజిత హత్య కేసులో అరెస్టైన చెంతమరా.. బెయిల్‌పై బయటకు వచ్చాడు. సరాసరి సజిత ఇంటికి వెళ్లి.. ఆమె భర్త సుధాకరన్, తల్లి లక్ష్మిలను హత్య చేశాడు. నేర తీవ్రత, హత్య చేసిన తీరు, బాధిత కుటుంబంపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ కేసును అత్యంత అరుదైన నేరంగా పరిగణించింది. సాధారణంగా జీవిత ఖైదు విధించే పరిస్థితుల్లో కాకుండా.. అరుదైన సందర్భాల్లో మాత్రమే విధించే మరణశిక్షను పాలక్కాడ్ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు–IV అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ (Kenneth George) ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు.తీర్పుతో ముగిసిపోలేదా?నెన్మారా జంట హత్యల కేసు కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా కోర్టు తీర్పుతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా నిందితుడికి అప్పీల్ అవకాశాలు ఉండనున్నాయి. -
'మా ఇంటికి ఎందుకొచ్చారు.. వెళ్లిపోండి' అనడమే శాపమైంది..
హైదరాబాద్, బహదుర్‌పురా: ‘మా ఇంటికి ఎందుకు వచ్చారు.. వెళ్లిపోండి’ అన్నందుకు బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన కాలాపత్తర్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మహ్మద్ కలీల్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్ బిర్యానీ షా టెకిడీకి చెందిన మహ్మద్ ఫైజ్ ఎలియస్ అజాన్ (17) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.ఐదేళ్ల క్రితం కాలాపత్తర్‌లో ఉన్న అబ్రార్ ప్రస్తుతం బాలాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి అబ్రార్ తన స్నేహితులు ఆశ్వక్ (21), పర్హాన్ (20) సహా మరో ఇద్దరితో కలిసి మద్యం తాగారు. అబ్రార్ ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఆశ్వక్, పర్హాన్లను వెంటబెట్టుకుని కాలాపత్తర్ బిర్యానీ షా టెకిడీలోని అజాన్ ఇంటి వద్దకు వచ్చాడు. ఇక్కడికి ఎందుకొచ్చారంటూ అజాన్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వారిని అడ్డుకున్నారు.ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం జరిగి ఆశ్వక్, పర్హాన్, అబ్రార్ కలిసి తలపై కత్తితో పొడవడంతో అజాన్ కుప్పకూలాడు. అతను మృతి చెందినట్లు తెలుసుకున్న అబ్రార్ తన స్నేహితులతో కలిసి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అజాన్ మామ సాధిక్ అలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగా అజాన్‌ను హత్య చేశారా? లేక పథకం ప్రకారం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు మూడు టీంలు రంగంలోకి దిగాయి. -
సోషల్ మీడియా మోహం.. సంసారాల్లో క్రైమ్ దాహం!
సాక్షి, అమరావతి: నిండునూరేళ్లు కలిసి జీవించాల్సిన దాంపత్య బంధాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. అనుమానాలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆస్తి వివాదాలు సైతం చివరికి దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. దీంతో కుటుంబ వ్యవస్థ విచి్ఛన్నం అవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భార్యలు భర్తలను హత్య చేస్తున్న ఘటనలు యావత్ సమాజాన్ని విస్తుగొలుపుతున్నాయి.ముఖ్యంగా భర్తలను చంపడంలో మహిళలు అనేక సరికొత్త మార్గాలను ఎంచుకోవడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. ప్రెషర్ కుక్కర్, నీళ్ల డ్రమ్, బాత్రూమ్ టైల్స్ కింద, గ్యాస్ సిలిండర్‌లో ఇలా అనేక చోట్ల భర్త మృతదేహాలను దాచిపెట్టడం భీతిగొలుపుతోంది. కొండపై నుంచి తోసేయడం, తినే ఆహారంలో విషం కలపడం, విషం నింపిన ఇంజక్షన్లు చేయడం, కత్తితో పొడవడం, గొంతు నులిమి చంపేయడం, కిరాయి వ్యక్తులతో హత్య చేయించడం వంటి మార్గాలను ఎంచుకుని మరీ కట్టుకున్న వాడిని కడతేర్చుతున్నారు. ప్రాణం తీస్తున్న పరిచయాలు.. సామాజిక మాధ్యమాల్లో ఏర్పడుతున్న పరిచయాలు తీవ్ర నేరాలకు పురిగొల్పుతున్నాయి. కొంత కాలం పరిచయాలే బంధాలుగా ఏర్పడి, అప్పటికే ఉన్న బంధాలను తెంచుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ఏపీలోని ప్రకాశం, అనకాపల్లి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో, తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో భర్త హత్య కేసులు ఇటీవల సంచలనం సృష్టించాయి.చాలా ఘటనల్లో వివాహేతర సంబంధాలు, అనుమానాలు, కుటుంబ కలహాలే ప్రధాన కారణాలుగా తేలాయి. హత్యలకు కుటుంబ, వ్యక్తిగత వివాదాలే కారణమని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్యులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, హత్యలకు గురైన కేసుల్లో 36.36 శాతం కుటుంబ, ఆస్తి వివాదాలు, 29.55 శాతం వివాహేతర సంబంధాల వల్ల జరిగినట్లు తేలింది. బాధితులు, నిందితులు ఎక్కువగా ఒకరికొకరు పరిచయం ఉన్నవారేనని అధ్యయనం వెల్లడించింది. విస్మయం కలిగిస్తున్న అధ్యయనాలు.. వివాహేతర సంబంధాలపై గ్లీడెన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. దేశంలోని టైర్–1, టైర్–2 నగరాలకు చెందిన 1,503 మంది వివాహితులపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం 37 శాతం మంది ప్రేమలో ఉన్నప్పటికీ భాగస్వామిని మోసం చేయడం సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. 55 శాతం మంది తమ జీవిత భాగస్వామి కాకుండా మరొకరితో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.పది మందిలో ఆరుగురికిపైగా వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపినట్లు సర్వే పేర్కొంది. అలాగే పురుషుల్లో 59 శాతం, మహిళల్లో 53 శాతం మంది తమ భాగస్వామిపై అవిశ్వాసం లేదా అనుమానం వ్యక్తం చేశారు. 44 శాతం మంది సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వారితో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు వెల్లడైంది. పెద్ద నగరాలు, చిన్న పట్టణాల్లో ఈ ధోరణి దాదాపు ఒకే స్థాయిలో ఉండటం గమనార్హం. కుటుంబాలు ఛిన్నాభిన్నం.. మానసిక ఆరోగ్య వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం, సోషల్ మీడియా ప్రభావం, మద్యం వ్యసనం, ఆర్థిక ఒత్తిళ్లు, పరస్పర అనుమానాలు హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి. విభేదాలు వచ్చినప్పుడు కౌన్సెలింగ్, కుటుంబ పెద్దల మధ్యవర్తిత్వం లేదా చట్టబద్ధమైన విడాకుల వంటి మార్గాలను ఎంచుకోవాల్సిన చోట హత్యలకు పాల్పడటం అత్యంత ప్రమాదకర ధోరణిగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. భర్త హత్యకు గురైతే ప్రాణం కోల్పోయేది ఒక్కరే కాదు. తల్లిదండ్రులు కుమారుడిని, పిల్లలు తండ్రిని కోల్పోతారు. నేరానికి పాల్పడిన భార్య జైలుకు వెళ్లడంతో కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నమవుతుంది. నమ్మకం, పరస్పర గౌరవం, సంభాషణ, సమస్యలకు శాంతియుత పరిష్కారాలే ఇలాంటి విషాదాలను నివారించే మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రియుని సహకారంతో భర్తకు పాము కాటు వేయించి..
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ నిర్వాహకుడు అతుల్ పవార్ (35) మృతి వెనుక అతని భార్య దామిని కుట్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితురాలు తన ప్రియుడు, స్కూల్ డ్రైవర్ తుషార్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.పోలీసుల కథనం ప్రకారం, 2019లో ప్రేమ వివాహం చేసుకున్న అతుల్, దామిని దంపతులు కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. అయితే అతుల్ పేరుపై ఉన్న రూ. 20 లక్షల బీమా సొమ్మును కాజేయాలని, ప్రియుడితో కలిసి జీవించాలని దామిని పథకం పన్నింది. ఇందులో భాగంగా గురువారం రాత్రి అతుల్ తాగే పాలల్లో నిద్రమాత్రలు కలిపి, అతను గాఢనిద్రలో ఉన్నప్పుడు గదిలోకి విషపూరితమైన పామును వదిలారు. ఆ పాము కాటుకు అతుల్ మరణించాడు.సందేహం రాకుండా ఉండేందుకు భర్త పాము కాటుకు గురయ్యాడని ఆమె నాటకం ఆడింది. అయితే ఘటనా స్థలంలోని పరిస్థితులపై అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాను విశ్లేషించగా అసలు నిజం బయటపడింది. నిందితుల ఫోన్లలో పాము ఫొటోలు లభ్యమయ్యాయి. తాము పామును కొనుగోలు చేసినట్లు డ్రైవర్ తుషార్ అంగీకరించాడు. 20 రోజుల క్రితం కూడా కారుతో ఢీకొట్టి అతుల్‌ను చంపేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇది కూడా చదవండి: శరీరంలోకి సర్రున దూసుకెళ్లిన ఇనుప రాడ్లు.. ఆ తర్వాత? -
HYD: మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: మాదాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రామేశ్వరం కేఫే సమీపంలో భాస్కర్ అనే యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేయగా, అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రాథమిక సమాచారం ప్రకారం, భాస్కర్ కొంతకాలంగా ఇద్దరు యువతులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదుకాగా, పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా భాస్కర్ లో మార్పు రాలేదని సమాచారం.ఈ మధ్యకాలంలో భాస్కర్ “దమ్ముంటే హైదరాబాద్‌కు రండి” అంటూ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన యువతుల్లో ఒకరి తండ్రి, మరో వ్యక్తితో కలిసి వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు . హత్య అనంతరం నిందితులిద్దరూ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వేధింపుల వివాదమే హత్యకు ప్రధాన కారణమా, లేక ఇతర వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నాయా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉండగా, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి. -
ఆరు హత్యలకు కారణం.. మొదటి నుంచి చివరి వరకు
-
కోటను తవ్వి ఎలుకనూ పట్టలేదు!
సాక్షి ప్రతినిధి, కడప: పర్యాటక ప్రాంతమైన గండికోటలో గత ఏడాది (2025 జూలై 14న) చోటుచేసుకున్న మైనర్ బాలిక అత్యంత క్రూరమైన హత్య కేసు జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, టవర్ లొకేషన్లు, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ వంటి అత్యాధునిక పరీక్షలు నిర్వహించి, ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులు పర్యవేక్షించినా క్షేత్రస్థాయిలో ఫలితం మాత్రం ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ చందంగా మారింది. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు శరవేగంగా అర్ధరాత్రి పూట కూడా స్పందించే సీఎం చంద్రబాబు సర్కార్.. ఒక అబల ప్రాణం పోయి ఏడాదైనా నిందితులెవరో తేల్చలేక చేతులెత్తేయడం గమనార్హం. మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ దాకా.. ఇంటర్మీడియట్ చదువుతున్న సదరు బాలిక కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2025 జూలై 14న ప్రొద్దుటూరు పోలీసులు క్రైమ్ నెంబర్ 257/2025 కింద మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గండికోట పరిసరాల్లో బాలిక హత్య వ్యవహారం బహిర్గతం కావడంతో జమ్మలమడుగు పోలీసులు క్రైమ్ నంబర్ 498/2025 కింద హత్య కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ మైనర్ బాలిక హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. లోకేష్‌కు క్లీన్చిట్ ఇచ్చిన డీఐజీ.. ఆంతర్యమేమిటి? ఈ మైనర్ బాలిక హత్య కేసులో కర్నూల్ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ అత్యంత వేగంగా ఒక నిర్ధారణకు రావడం సర్వత్రా అనుమానాలకు తావిచ్చింది. అప్పట్లో ఘటన స్థలానికి చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్, అప్పటి ఎస్పీ అశోక్‌కుమార్ సమక్షంలోనే విలేకరులతో మాట్లాడుతూ.. హత్యలో బాలిక స్నేహితుడు లోకేష్ ప్రమేయం లేదని హడావుడిగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా, “ఈ రోజు సాయంత్రానికే నిందితులను అదుపులోకి తీసుకుంటామని, ఎస్పీ పూర్తి వివరాలు తెలియజేస్తారన్ఙి మీడియాకు వివరించారు. అయితే, సీసీటీవీ ఫుటేజీలలో బాలిక లోకేష్ బైక్‌పై గండికోటకు వెళ్లినట్లు, తిరుగు ప్రయాణంలో లోకేష్ ఒక్కడే వస్తున్నట్లు స్పష్టంగా రికార్డు అయినా.. డిఐజీ స్థాయి అధికారి కేసులో ఎలాంటి పురోగతి లేకుండానే లోకే‹Ùకు క్లీన్చిట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదు. పరువు హత్య కోణంలోనూ దర్యాప్తు మాయం ముఖ్య అనుమానితుడు లోకేష్‌కు డీఐజీ క్లీన్ చిట్ ఇవ్వడంతో దర్యాప్తు దృష్టి ఒక్కసారిగా మృతురాలి సమీప బంధువుల వైపు మళ్లింది. స్నేహితుడు హత్య చేయలేదంటే, ఇది కచ్చితంగా బంధువులే చేసిన ‘పరువు హత్య’ అయ్యి ఉంటుందనే కోణంలో విశ్లేషణలు నడిచాయి. పోలీసులు మృతురాలి బంధుగణాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణకు బంధువులంతా పూర్తిగా సహకరించినప్పటికీ, అటు వైపు కూడా ఎలాంటి క్లూస్ కానీ, ఆధారాలు కానీ లభ్యం కాలేదని పోలీసులు తేల్చేశారు. ఇద్దరు ఎస్పీలు మారినా తేలని మిస్టరీ.. జవాబు చెప్పాల్సింది విజనరీ సీఎంగండికోట మైనర్ బాలిక హత్య కేసును వైఎస్సార్ కడప జిల్లా పోలీసులు ఏడాది దాటినా చేధించలేకపోవడం పోలీసు యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. అప్పటి ఎస్పీ అశోక్‌కుమార్‌తో పాటు ప్రస్తుత ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సైతం ఈ కేసును స్వయంగా పర్యవేక్షించారు. టవర్ లోకేషన్ల ద్వారా ఫోన్‌కాల్స్ విశ్లేషణ, అనుమానిత వాహనదారుల విచారణ వంటి అన్ని సాంకేతిక వ్యవహారాలను ఉపయోగించి దర్యాప్తు చేసినా సంక్లిష్టత అలాగే ఉండిపోయింది.అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా ఈ కేసు చేధించలేకపోవడం వెనుక ఉన్న తెరవెనుక రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఏమిటో ‘విజనరీ సీఎం’ అని చెప్పుకునే చంద్రబాబు సర్కారే తేల్చి చెప్పాలని రాజకీయ విశ్లేషకులు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
షాబాద్ హత్యలకు ముందు సెల్ఫీవీడియో
సాక్షి, హైదరాబాద్: షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. హత్యలకు ఒక రోజు ముందు నిందితుడు తన ఫోన్లో ఒక సెల్ఫీ వీడియో తీసినట్లు తెలిపారు.. అందులో " నేను అమ్మాయిని నమ్ముకొని చాలా మోసపోయా, ఆ కుటుంబం నన్ను అన్ని విధాలా వాడుకుంది. నాపై కేసు పెట్టి నన్ను మోసం చేశారు. అందుకే వాళ్లని చంపాలనుకున్నా చివరకి నా పిల్లలకి కూడా భూమి లేకుండా పోయింది. డబ్బుమెుత్తం ఇచ్చేసి అప్పులపాలయ్యాను జీవితం మీద విరక్తి కలిగింది." అని రికార్డు చేసినట్లు తెలిపారు.షాబాద్ నిందితుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన అనంతరం అతని వద్ద లభించిన మొబైల్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిలో భాగంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. "ఆ ఘటన జరిగిన రోజు 10.30 గంటల ప్రాంతంలో నిందితుడు రాజ్ కుమార్ ఉర్లోకి వచ్చాడు. అమ్మాయిని తీసుకొని దేవరకొండకు వచ్చాడు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. జీపీఎస్ ఆధారంగా పట్టుకునేందుకు యత్నించాము" అని సీపీ పేర్కొన్నారు.కాగా షాబాద్ హత్య కేసుల నిందితుడు రాజ్‌కుమార్ మృతిచెందాడు. కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతున్న సమయంలో అతని మృతదేహం లభించడం చర్చనీయాంశమైంది.రాజ్‌కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనబడింది. ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
షాబాద్ హత్యలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
షాబాద్ నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ కేసు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. "సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.20 లక్షలు లంచం తీసుకొని ఆరుహత్యల నిందితుడు రాజ్ కుమార్‌ను అరెస్టు కాకుండా కాపాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అండదండలతో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైమ్ ఇచ్చి కాపాడారు. ఈలోపు నిందితుడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని ఆరుగురిని హత్య చేశాడు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ స్పోక్స్‌పర్సన్ నాగార్జున యాదవ్ అనే నాయకుడు రేవంత్ రెడ్డిని పెయింట్ వేస్తారు అన్నందుకే ఆయనను అరెస్ట్ చేశారని, నల్లబాలు ట్విట్టర్లో ట్వీట్ చేస్తే పోలీసులు అతనిని జైలుకు తరలించారు. కానీ రేప్ చేసిన నిందితుడు రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేయకుండా, అతడితో కూర్చొని పోలీసులు మందు తాగారు అని హరీశ్ రావు ఆరోపించారు.కాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఆ హంతకుడి కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. ఈ విషయంలో ఎటువంటి పుకార్లు నమ్మవద్దని ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని పోలీసులు ప్రకటించారు. -
కోనసీమ రావులపాలెంలో యువకుడు దారుణ హత్య..
ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు దుండగులచేతిలో హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా, రావులపాలెంలో విషాదకర ఘటన జరిగింది. ఓ గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు తలను బండరాళ్లతో మోది కిరాతకంగా హత్యచేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి అను సాయి అలియాస్ నల్లసాయిగా గుర్తించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితునికి ఎంఏ పరీక్షలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తీహార్ జైలు నుంచి ఎంఏ పరీక్షలు రాయనున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 20న కోర్టులో వ్యక్తిగత హాజరు నుండి ఢిల్లీ న్యాయస్థానం అతనికి మినహాయింపునిచ్చింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాల నమోదు కోసం కోర్టు జూలై 20 నుండి 25 వరకు రోజువారీ విచారణను గత మే నెలలో ఖరారు చేసింది.అయితే జూలై 20 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తనకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంఏ సోషియాలజీ చివరి పరీక్ష ఉందని, అందుకే ఆ రోజు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ఆఫ్తాబ్ కోర్టును కోరారు. తీహార్‌లోని సెంట్రల్ జైలు నంబర్ 3లో జూలై 11 నుండి 20 వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి.ఈ కేసును విచారిస్తున్న సెషన్స్ న్యాయమూర్తి హర్గురువరిందర్ సింగ్ జగ్గీ.. జూలై 20న విచారణను వాయిదా వేస్తూ, జూలై 21 మధ్యాహ్నం 2 గంటల నుండి తిరిగి సాక్ష్యాల నమోదు ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. కోర్టు ముందుగా నిర్ణయించిన మిగిలిన తేదీల విచారణ యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎనిమిది మంది సాక్షులను విచారించాల్సి ఉందని ప్రాసిక్యూషన్ తెలిపింది. 13 మంది సాక్షుల వాంగ్మూలాలను పాక్షికంగా నమోదు చేయగా, 12 మంది సాక్షుల విచారణ వాయిదా పడింది.లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న తన భాగస్వామి శ్రద్ధా వాకర్ (27)ను ఆఫ్తాబ్ అత్యంత దారుణంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 2023లో ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా తాను నిర్దోషినని ఆఫ్తాబ్ కోర్టులో వాదించారు. జైలు నిబంధనలు, కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు విద్యను అభ్యసించే అవకాశం ఉండటంతో కోర్టు ఈ మినహాయింపునిచ్చింది. -
అమెరికాలో బెజవాడ యువతిని హత్య చేసిన భర్త
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడకు చెందిన సబ్బినేని రజిత గతేడాది అక్టోబర్ 27న అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ బెల్వ్యూ పోలీసులు జరిపిన విచారణలో..రజితను అమె భర్త నార్నే అవినాష్ చంపాడని వెల్లడవడంతో కేసును హత్య కేసుగా మార్చారు. గాయత్రీనగర్‌కు చెందిన సబ్బినేని కృష్ణారావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రజితను గతేడాది తెలంగాణకు చెందిన నార్నే అవినాష్ కు ఇచ్చి హైదరాబాద్‌లో పెళ్లి చేశారు. జులైలో ఈ జంట అమెరికాలోని వాషింగ్టన్కు వెళ్లిపోయారు. పెళ్ళికి ముందుగానే అవినాష్‌కు భారత్‌కు చెందిన మరో మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ కారణంగా రజితను చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. భార్యను ఎలా చంపితే పోలీసులకు దొరక్కుండా ఉంటారనే విషయంపై ఇంటర్నెట్లో వెతికాడు. గాలి ఆడకుండా చేస్తే ఎంత సమయానికి మనిషి ప్రాణాలు పోతాయనే విషయాలను వెతికి, గతేడాది అక్టోబర్ 27న రజితను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. వెంటనే మృతదేహాన్ని ఫొటో తీసి తన ప్రియురాలికి వాట్సాప్‌లో పంపాడు. రజిత బాత్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా రావడం లేదని పోలీసులకు ఫోన్ చేసి అవినాష్ చెప్పాడు. పోలీసులు వచ్చేలోపే రజిత అపస్మారకస్థితిలో పడిఉంది. వైద్యులు పరిశీలించి ఆమె మరణించిందని చెప్పారు. ఆ సమయంలోనే రజిత మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా రజితను ష్ష్ చంపాడని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజిత తల్లిదండ్రులు అమెరికాకు బయలుదేరారు. అమెరికా పోలీసులు అవినా షను అరెస్ట్ చేశారు. -
డబ్బులివ్వద్దన్నా అక్కకు ఇస్తుంది.. అందుకే అమ్మను చంపేస్తున్నా!
నల్గొండ, తుంగతుర్తి: సంపాదించిన డబ్బంతా కుమార్తెకే ఇస్తుందనే కోపంతో భార్యను చంపి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. తుంగతుర్తి సీఐ ఉపేందర్‌రావు, ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టిపర్తి గ్రామానికి చెందిన కోట సత్యనారాయణ (74), కనకలక్ష్మి (66) దంపతులు అల్లం ఎల్లిగడ్డ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరు జీవనోపాధి కొరకు ఒకరు సూర్యాపేటలో, మరొకరు తిరుమలగిరిలో ఉంటున్నారు.అల్లం ఎల్లిగడ్డ వ్యాపారం చేసి సంపాదించిన డబ్బును కనకలక్ష్మి ఎక్కువగా కుమార్తెకు ఇస్తుందని, అంతేకాకుండా కుమార్తెకు రూ.3 లక్షలతో తిరుమలగిరిలో ప్లాటు కొనుగోలు చేసి ఇచ్చిందని ఆమెతో భర్త కోటేశ్వరరావు తరచూ గొడవ పడుతుండేవాడు. భర్త వేధింపులు భరించలేక కనకలక్ష్మి నెల క్రితం పెద్ద కుమారుడు సోమేశ్వర్ దగ్గరకు వెళ్లింది. ఇటీవల పెద్ద మనుషులందరూ కలిసి పంచాయితీ పెట్టి కనకలక్ష్మిని తిరిగి గొట్టిమర్తికి తీసుకొచ్చారు. ఇదే విషయమై బుధవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య పంచాయితీ జరగడంతో కనకలక్ష్మి తన కుమారులకు ఫోన్ చేసింది.కుమారులిద్దరు కాన్ఫరెన్స్‌లో తల్లిదండ్రులతో మాట్లాడి ‘మీరు పంచాయితీ పెట్టుకోవద్దు.. మేము వస్తామని’ చెప్పారు. అదే సమయంలో కోటేశ్వరరావు ఫోన్లో మాట్లాడుతూ.. ‘మీ అమ్మ నేను చెప్పినట్లు వినడం లేదు, నాకు తెలియకుండా డబ్బులన్నీ అక్కకు ఇస్తుంది, ఎలాగైనా మీ అమ్మను చంపుతాను’ అని చెప్పడంతో కుమారులిద్దరు కలిసి తండ్రిని వారించి సర్ది చెప్పారు.సూసైడ్ నోట్ గోడకు అంటించి..!ఎలాగైనా భార్యను చంపాలని నిర్ణయించుకున్న కోటేశ్వరరావు బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో కనకలక్ష్మి తలపై కొట్టి హతమార్చాడు. అనంతరం కోటేశ్వరరావు సూసైట్ నోట్ రాసి ఇంట్లో ఉన్న గోడకు అంటించాడు. తన వద్ద రూ.4.90 లక్షలు అప్పు పత్రాలు ఉన్నాయని, రూ.9వేల నగదు ఉందని, ఆ సొమ్మును ఇద్దరు కొడుకులు చెరి సమానంగా తీసుకోవాలని, గొడవ పెట్టుకోవద్దని సూసైడ్ నోట్లో రాశాడు. 4.20 గంటలకు ఉరేసుకుంటున్నానని, దీనికి ఎవరూ బాధ్యులు కాదని, తాను చేసుకున్న కర్మ అని రాసి ఇంట్లో ఉన్న దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.గురువారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి కుమారులకు సమాచారం ఇచ్చారు. కుమారులిద్దరు వచ్చి చూడగా.. అప్పటికే కోటేశ్వరరావు, కనకలక్ష్మి మృతిచెంది ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ పరిశీలించారు. మృతుల చిన్న కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!
పుణే రియల్టర్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోనావాలా సమీపంలోని లోహగఢ్ కోట వద్ద గత నెలలో హత్యకు గురైన ఈ కేసుపై వేగంగా విచారణ, త్వరితగతిన ట్రయల్ జరిపించాలని కోరుతూ కేతన్ తండ్రి, విశాల్ అగర్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, కేసుత్వరగా ముందుకు సాగేలా సహాయం చేయాలని కోరారు. కేతన్ అకాల మరణాన్ని తట్టుకోలేక, తాత గుండెపోటుతో మరణించిన తరువాత ఈ పరిణామం జరిగింది.బుధవారం రాష్ట్రపతి సెక్రటరీకి పంపిన ఒక భావోద్వేగ ఈమెయిల్లో, కేతన్ మరణం తర్వాత తమ కుటుంబం ఎదుర్కొంటున్న బాధను విశాల్ అగర్వాల్ పంచుకున్నారు. తన మనవడి మరణాన్ని తట్టుకోలేక కేవలం 20 రోజుల తర్వాత తన తండ్రి కూడా కన్నుమూయడంతో ఈ వేదనను తట్టుకోవడం తమవల్ల కావడంలేదని పేర్కొన్నట్లు ఐఏఎన్ఎస్ రిపోర్ట్ చేసింది. తానొక వ్యాపారవేత్తగానో, ప్రభావితవ్యక్తిగానో కాదు, ఎంతో బాధతో, ఆశతో ఇది రాస్తున్నాననంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక తండ్రిగా కొడుకుకు న్యాయం కోసం అర్ధిస్తున్నానంటూ వేడుకున్నారు. కేవలం 20 రోజుల్లోనే అటు కొడుకును, ఇటు తండ్రిని ఇద్దరినీ కోల్పోయి తన కుటుంబం చిన్నాభిన్నమైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.కేతన్ తాతయ్య అతడిని ఎంతగానో ప్రేమించేవారని, మనవడి మరణంతో ఆయన గుండె పగిలిపోయిందని అన్నారు. కేతన్ ఇక లేడని తెలిసి, తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, బీపీ పడిపోవడంతో గుండెపోటుతో చనిపోయారన్నారు. ఇది తమ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చిందంటూ తమ మానసిక ప్రభావాన్ని,కేతన్ మరణం తర్వాత తమ జీవితాలు పూర్తిగా విషాదంగా మారిపోయాని విశాల్ అన్నారు. దారుణంగా హత్యకు గురైన కేతన్కు న్యాయం జరిగేది ఎపుడు? ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకొనేదాకా ఇదే ప్రశ్న తమమెదళ్లను తొలిచేస్తోందని పేర్కొన్నారు. తక్షణమే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేలా చూడాలని, దోషులుగా తేలిన వారికి చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా చూడాలని విశాల్ అధికారులను కోరారు. తమ కుటుంబానికి ప్రత్యేక ట్రీట్మెంట్ అవసరంలేదు కానీ, అనవసర జాప్యం లేకుండా న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నా మన్నారు. లేదంటే తమలాంటి కుటుంబాలు బాధతో మరింత కుంగిపోతాయన్నారు. నా కొడుకును వెనక్కి తేలేం కానీ, కేతన్‌ను మళ్లీ వెనక్కి తీసుకురాలేం, కానీ దోషులు మాత్రం శిక్ష నుండి తప్పించుకోకూడదన్నారు. వారికి కఠినమైన శిక్ష పడినపుడు మాత్రమే తమకు మనశ్శాంతి దక్కడంతోపాటు, ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు తప్పవనే సందేశం సమాజంలో వెళుతుందని, దయచేసి తన కొడుకు కేసును కూడా మరో కేసులా మరుగున పడవేయవద్దని మార్చొద్దని, దీని వెనుక సర్వస్వం కోల్పోయిన ఒక కుటుంబం ఉంది అంటూ ఆవేదనతో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందికాగా పుణె సమీపంలోని లోహగఢ్ కోట వద్ద జూన్ 18న కేతన్ అగర్వాల్ (26) ఒక లోయలో పడి మరణించాడు. మొదట ఇది ట్రెక్కింగ్ ప్రమాదంగా భావించినప్పటికీ, విచారణలో ఇది హత్య కేసుగా మారింది. కేతన్ నిశ్చితార్థం చేసుకున్న సియా గోయల్, ఆమె, ప్రియుడిగా భావిస్తున్న చేతన్ బాబూలాల్ చౌదరి కలిసి ఈ హత్యకు ప్లాన్ చేశారని, అతడిని లోయలోకి తోసేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి, హత్య , నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: 36 ఏళ్లలో 300 ఫైవ్ స్టార్ హోటళ్లలో జల్సాలు పైసా బిల్ కట్టలేదు : కట్ చేస్తే -
ఒక ప్రశ్న.. రెండు నిండు ప్రాణాలు బలి!
సాక్షి, తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పద్మావతి కళ్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఓ వివాహ వేడుకకు వచ్చిన వ్యక్తిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఇద్దరు వ్యక్తులు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయితే దర్యాప్తులో షాకింగ్ విషయం వెలుగు చూసింది.పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ జంట హత్యల వెనుక కుటుంబ వివాదమే కారణమని తెలుస్తోంది. ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్.. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీళ్ల వివాహానికి మునిరత్నం, మణికంఠలు దగ్గరుండి సహకరించారు. అయితే.. కొన్ని నెలలుగా సునీల్ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కారణం ఏంటో చెప్పడం లేదని.. ఎంత బతిమాలినా సునీల్ వినలేదని తెలుస్తోంది. ఈ విషయంలో పెద్దలు సర్దిచెప్పాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో.. బుధవారం రాత్రి తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఓ వివాహానికి అతను హాజరైన విషయం సంపూర్ణమ్మకు తెలిసింది. దీంతో తన కుమార్తెకు అండగా ఉన్న మునిరత్నం, మణికంఠలకు ఆమె సమాచారం ఇచ్చింది. వాల్లిద్దరూ వివాహ మండపానికి చేరుకుని సునీల్‌ను నిలదీశారు. నీ భార్యను ఎందుకు వదిలేశావు? అని ప్రశ్నించారు. దానికి సునీల్ నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ సమయంలో సునీల్‌తో పాటు అతడి తమ్ముడు, అక్క, మరో బంధువు అక్కడికి చేరుకున్నారు. ఆ నలుగురూ కలిసి మునిరత్నం, మణికంఠలపై కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న మణికంఠను తిరుపతి.. రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వీళ్లిద్దరూ జీవకోనకు చెందిన వాళ్లుగా తెలుస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం, సీఐ శ్రీనివాసులు, వెస్ట్ సీఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు. నిందితులు అదుపులోకి.. విచారణ కొనసాగింపుభార్యాభర్తల గొడవ.. పెళ్లి వేదికలో మొదలైన వివాదం.. చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన తిరుపతిలో సంచలనంగా మారింది. జంట హత్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న సునీల్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు పూర్తి కారణాలు, దాడిలో పాల్గొన్న వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. -
భర్తను చంపి 400 కి.మీ. దూరంలో పాతేసింది భయ్యా !
-
ప్రదాన నిందితుని ఎన్కౌంటర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో నాలుగోతేదీన స్నేహితురాలికి పుట్టినరోజు బహుమతి కొనేందుకు బయటకు వెళ్లి అదృశ్యమై సరస్సులో శవమై తేలిక 11 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్యోదంతంలో బుధవారం ప్రధాన నిందితుడు ప్రభాస్ మొండల్‌ను పశ్చిమబెంగాల్ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌ను ఇటీవల ఎన్నికల్లో ఓడించి అధికారంలోకి వచ్చిన సువేంధు అధికారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇది తొలి పోలీస్ చర్యగా నిలిచిపోయింది. ఎన్కౌంటర్ వివరాలను సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు. హత్యాచార ఘటన పూర్వాపరాలను తెల్సుకునేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సుర్జాపూర్ హాట్‌లోని ఘటనాస్థలికి మంగళవారం అర్ధరాత్రిదాటాక 12.45 నిమిషాలకు నిందితుడిని పోలీసులు తీసుకెళ్లారు. అదే సమయంలో పోలీసుల నుంచి సరీ్వస్ తుపాకీని తీసుకుని మొండల్ పోలీసులపైకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. దీంతో బుల్లెట్ గాయాలతో రక్తమోడుతున్న నిందితుడిని హుటాహుటిన సమీప బారుయ్‌పూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు ధ్రువీకరించారు. బాలికను చంపేసి గోనెసంచిలో కుక్కి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడే కొలనులో పడేశారన్న వార్త తెలిసి నాలుగురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. మేజి్రస్టియల్ విచారణ తర్వాత ప్రధాన నిందితుడు మొండల్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించనున్నారు. మరోవైపు ఇదే ఉదంతంలో కబీర్ మొల్లా అనే మరో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. ఆనంద్ సర్దార్, దివాకర్ సర్దార్లను గతంలోనే అరెస్ట్‌చేశారు. గతంలోనే ప్రభాస్ మొండల్‌నూ అరెస్ట్‌చేయగా ఈ కేసులో మొత్తంగా అరెస్టుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ముగ్గురు నిందితులు ఉన్నారు. హత్యోదంతం వెలుగుచూసిన కొన్ని గంటలకే ఈ ఘటనలో సంబంధం ఉందనే అనుమానంతో ఒకతడిని స్థానికులు కొట్టి చంపిన విషయం తెల్సిందే. వాడి శవం నాకు అక్కర్లేదు: తల్లి పోలీసు ఎన్కౌంటర్లో నీ కుమారుడు చనిపోయాడని తల్లి సంధ్యా మొండల్‌కు అధికారులు సమాచారం ఇవ్వగానే ఆమె ఆగ్రహంగా స్పందించారు. ‘‘చెడు అలవాట్లకు బానిసైన వాడు నా కొడుకే కాదు. వాడి మృతదేహాన్ని నేను తీసుకోను. తాగుడు మానేయమని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినిపించుకోలేదు. వాడు చనిపోయినా నాకు ఏమాత్రం బాధ లేదు. బాలికను దారుణంగా హింసించినందుకు వాడికి తగిన శాస్తి జరిగింది. మార్చురీలో వాడి ముఖం చూసేందుకు కూడా నేను వెళ్లను. నేనే కాదు మా కుటుంబంలో ఎవరూ వాడి మృతదేహాన్ని తెచ్చుకోము’’అని తల్లి తెగేసి చెప్పారు. నేనూ బాధితురాలినే: మొండల్ భార్య భర్త మృతిచెందాక ప్రధాన నిందితుని భార్య చంపా స్పందించారు. ‘‘నా భర్త అమాయకుడు, ఈ నేరం చేయలేదు అని నేను చెప్పను. తనతో జీవిస్తూ ఎన్నో బాధలు పడ్డా. హత్యోదంతంలో ఇతని పేరు విన్పించగానే ఇలాంటిదేమో చేసే ఉంటాడని ముందుగానే ఊహించా. పెళ్లయిన నాటి నుంచి వేధింపులకు గురిచేశాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఏ పనీ చేసేవాడు కాదు’’అని ఆమె తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు ప్రధాన నిందితుడు ఎన్కౌంటర్లో హతమవడంతో ఈ ఘటనకు సరైన న్యాయం జరిగిందని బీజేపీ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో 2013లో కామ్‌ధునీలో 20 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసునూ తిరిగితోడి నిందితులకు ‘సరైన’శిక్ష పడేలా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి దేవ్జీత్ సర్కార్ అన్నారు. అయితే ఎన్కౌంటర్లో నిందితుడిని హతమార్చడాన్ని టీఎంసీ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘సువేందు సర్కార్‌కు రాష్ట్ర పోలీసులపై నియంత్రణ ఉందా? రాష్ట్రంలో బెంగాల్–ఉత్తరప్రదేశ్ 2.0ను విధానం అమలుచేద్దామని చూస్తున్నారా? బెంగాల్లో బీజేపీ పాలన ఉందా? ఎన్కౌంటర్లో చంపేయడం అంటే ఆటవికంగా పాలించడమే’’అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ర్యాలీలో బాహాబాహీ.. బాలిక హత్యోదంతాన్ని నిరసిస్తూ బుధవారం కోల్‌కతాలోని హజ్రా రోడ్లో టీఎంసీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన నిరసన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. దొంగలు అని నినదిస్తూ అవాంతరాలు సృష్టించారు. మానవహారంగా నిలబడి ర్యాలీని అడ్డుకోవడంతో ఆగ్రహంతో టీఎంసీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇదికాస్త తోపులాటగా మారింది. కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపుతప్పకుండా నిలువరించారు. -
మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఒక తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్‌లోని ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్లో భార్య మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.నిందితుడిని అవినాష్ నార్నె (30)గా గుర్తించారు. జూన్ 27న బెల్లేవ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భార్య సబ్బినేని రజిత (27) మరణానికి కారణమైనందుకు ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలు మోపారు. ప్రస్తుతం అతడికి కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల (రూ. 47 కోట్లకు పైగా) భారీ బెయిల్ విధించారు. 2025 అక్టోబర్ 27న బెల్లేవ్ డౌన్‌టౌన్‌లోని ఉడ్‌ల్యాండ్ కామన్స్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న బాత్రూమ్లో రజిత అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గమనించారు.వైద్య సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తేలింది. ఆఫీసు నుండి వచ్చేసరికి భార్య బాత్రూమ్ ఫ్లోర్‌పై పడి ఉందని అవినాష్ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరికీ 2025 జూన్‌లో పెద్దలు కుదిర్చిన వివాహం జరగ్గా, ఆ తర్వాతే ఈ అపార్ట్‌మెంట్‌కు మారారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో దీనిని హత్యకేసుగా మార్చారు.సుదీర్ఘ దర్యాప్తులో ఎలక్ట్రానిక్ డోర్ లాక్ రికార్డులు, మొబైల్ డేటా, వాట్సాప్ సందేశాలను డిటెక్టివ్లు పరిశీలించారు. రజిత మరణించిన సమయంలో అవినాష్ మినహా మరెవ్వరూ అపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, అవినాష్‌కు భారతదేశంలో మరో మహిళతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, డిజిటల్ ఆధారాల బట్టి అతడే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి కోర్టులో హాజరుపరిచారు. -
భర్తను లేపేయడానికి చావు తెలివి.. పట్టించిన సెల్ ఫోన్
-
కేతన్ హత్యకు నాలుగు నెలలముందే...సీక్రెట్ మ్యారేజ్
పుణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితురాలు సియా గోయల్, క్రైమ్ జరగడానికి కొన్ని నెలల ముందే మరో నిందితుడు, తన ప్రియుడు చేతన్ చౌదరిని రహస్యంగా వివాహం చేసుకుందని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.పోలీసుల కథనం ప్రకారం.. సియా గోయల్, చేతన్ చౌదరి తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా సుమారు నాలుగు నెలల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా వారి మొబైల్ ఫోన్ల నుండి రికవరీ చేసిన వాట్సాప్ చాట్లను పరిశీలించినప్పుడు ఈ విషయం బయట పడింది. అలాగే జూన్ 14నే కేతన్‌ను చంపడానికి ప్రయత్నించినా చివరి నిమిషంలో సియా ధైర్యం సరిపోకపోవడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సియా, చేతన్‌కు ఒక మెసేజ్ పంపుతూ.. ఒంటరిగా ఈ పని చేయడానికి తనకు ధైర్యం చాలడం లేదని, ఇద్దరం కలిసి కేతన్‌ను కొండపై నుండి కిందకు నెట్టేద్దామని, కాబట్టి తనతో పాటు రావాలని కోరినట్లు దర్యాప్తులో తేలింది.ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటునిందితుల గత ఆరేడు నెలల కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, వాట్సాప్ సంభాషణలు మరియు ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీని పోలీసులు విశ్లేషించారు. ఈ డిజిటల్ ఆధారాలు క్రైమ్ ప్లానింగ్‌కు సంబంధించిన కీలక ఆధారాలను అందించాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అలాగే కుటుంబాల నుండి వ్యతిరేకత వస్తుందనే భయంతోనే సియా, చేతన్ తమ పెళ్లిని రహస్యంగా ఉంచినట్లు చాట్స్ ద్వారా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. వారి రహస్య వివాహం తర్వాతే కేతన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.కాగా సియా, ప్రియుడి సహాయంతో, తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను జూన్ 18న లోనావాలా సమీపంలోని చారిత్రాత్మక లోహగఢ్ కోటపై నుండి కిందకు నెట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన పోలీసులు సియా, చేతన్ చౌదరిలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు రిమాండ్‌లో ఉన్నారు. ఇదీ చదవండి: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి, ఇది గమనించారా? -
భార్య, మరదలిని హత్య చేసిన భర్త?
బెంగుళూరు: కట్టుకున్న భార్యను, ఆమె చెల్లెలిని చాకుతో గొంతుకోసి చంపాడో కిరాతకుడు. అక్కడి నుంచి సొంతూరికి పారిపోయాడు. చింతామణి పట్టణం జెజె కాలనీలో సోమవారం ఈ హత్యాకాండ జరిగింది. వివరాలు.. భార్య షమా తాజ్ (27) మరదలు రేష్మా(18)ను హత్య చేశాడు. 8 ఏళ్ల కిందట స్థానికులు అనిత, సర్దార్ దంపతుల కుమార్తెను కోలారు మిలత్ నగరకు ఎజాజ్ (35)కు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని ఏళ్లు సజావుగా సాగింది, వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. 3 నెలల నుంచి కలహాలు జరుగుతున్నాయి. ఆమె కోలారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పంచాయతీలు చేశారు. పుట్టింటికి వచ్చేసినా.. భర్త వేధింపులను తట్టుకోలేక షమా తాజ్ ముగ్గురు పిల్లలను పిలుచుకొని చింతామణిలో పుట్టింటికి వచ్చింది. ఎజాజ్ ఆదివారం రాత్రి ఆమె వద్దకు వచ్చాడు, ఈ సమయంలోనూ రగడ మొదలైంది. ఉదయమే వాగ్వాదం జరిగి, ఎజాజ్ కత్తి పట్టుకుని ఉన్మాదిగా మారి భార్య, ఆమె చెల్లెలిని గొంతు కోసి, ముగ్గురు పిల్లలను పిలుచుకొని కోలారుకు వెళ్లాడు. ఇంటిలో పిల్లలను వదిలి, గల్‌పేట ఠాణాలో లొంగిపోయాడు. గంజాయి, ఇస్పేటు అలవాట్లు చుట్టుపక్కల జనం అనుమానంతో ఇంట్లోకి వెళ్లిచూడగా ఇద్దరి శవాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, అదనపు ఎస్పీ జగన్నాథ్, సీఐ శివరాజ్ పరిశీలించారు. ఎజాజ్ నిత్యం గంజాయి సేవిస్తూ, ఇస్పేటు ఆడుతూ సంసారాన్ని పట్టించుకొనేవాడు కాదని బంధువులు ఆరోపించారు. షమా తల్లిదండ్రులే డబ్బులు పంపేవారని చెప్పారు. -
మాట్లాడుకుందామంటూ రప్పించి.. కత్తులతో పొడిచి
హైదరాబాద్, పహాడీషరీఫ్: స్నేహితుల మధ్య నెలకొన్న గొడవలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలాపూర్ పోలీసులు తెలిపిన మేరకు.. బార్కాస్ సలాల ప్రాంతానికి చెందిన ఫహద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బాల్కషర్ (29) జిమ్ కోచ్‌తో పాటు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన సయీద్ బిన్ ఫైసల్ బామ్, సాలం బామ్ అనే స్నేహితులు ఉన్నారు.వీరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి. మాట్లాడుకుందామంటూ సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మరియం కాలనీకి ఫహద్‌ను స్నేహితులు పిలిపించారు. అక్కడికి వెళ్లాక మాటామాటా పెరిగింది. పథకంలో భాగంగా అప్పటికే తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో ఫహద్‌పై విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొన ఊపిరితో ఉన్న ఫహద్‌ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. -
కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటు
పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలు సియా గోయల్‌కు మద్దుతుగా నిలుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అదే క్రమంలో నిందితురాలు సియాను దుమ్మెత్తి పోస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. బలవంతపు పెళ్లి పర్యవసానమే ఇది అంటూ సియాను సమర్థించడానికి ప్రయత్నించిన ఒక నెటిజన్‌పై నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. నేరపూరిత ప్రవర్తనను సమర్థించడానికి ఎలాంటి సంస్కృతి లేదా వ్యక్తిగత పరిస్థితులను వాడుకోలేమంటా విమర్శలు గుప్పించారు. అసలు ఏమైంది అంటే... ప్రియుడితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్‌పై సానుభూతి చూపిస్తూ, ఎక్స్ (ట్విట్టర్)లో ఒక యూజర్ స్పందించారు. బలవంతపు వివాహాల వల్లే ఇలా జరుగుతోందని వ్యాఖ్యానించాడు. ఒకవేళ సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అమెరికా లేదా యూరప్‌లో ఉండి ఉంటే, వారు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండేవారని, అప్పుడు కేతన్ అగర్వాల్ ఈ కథలోకి వచ్చేవాడే కాదని పేర్కొన్నాడు. దీనిపై సుచిత్ర కృష్ణమూర్తి ఘాటుగా స్పందించారు.నటి సుచిత్ర కృష్ణమూర్తి కౌంటర్ఒకవేళ సియాపై పెళ్లికి ఒత్తిడి తెచ్చినప్పటికీ, హింసకు పాల్పడకుండా ఆమెకు అనేక చట్టపరమైన, వ్యక్తిగత మార్గాలు ఉన్నాయంటూ కౌంటరిచ్చారు. "ఏ సంస్కృతి కూడా నేరపూరిత ప్రవర్తనను సమర్థించదు. ఇలాంటి నేరాలను సమర్థించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఆమె ఇల్లు వదిలి పారిపోవచ్చు, లేదా తన సమ్మతి లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నందుకు కుటుంబంపై కేసు కూడా పెట్టాల్సింది. కానీ, పక్కా ప్రణాళికతో తన కాబోయే భర్తను కొండపై నుండి నెట్టి చంపడం అనేది కేవలం ఒక సైకోపాత్ (ఉన్మాది) మనస్తత్వం మాత్రమే" అంటూ ఎక్స్‌లో సుచిత్ర విరుచుకుపడ్డారు.ఇదీ చదవండి : కేతన్ హత్య : కోడ్‌వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’కాగా జూన్18న లోహగఢ్ కోట దగ్గర ట్రెకింగ్ చేస్తుండగా కేతన్ అగర్వాల్ మరణించాడు. మొదట ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించి నప్పటికీ, పోలీసుల దర్యాప్తులో ఇదొక ప్రణాళికాబద్ధమైన హత్యగా తేలింది. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.ఇదీ చదవండి: ప్రేయసితో కలిసి భార్యను కాల్చి చంపి, నేపాల్ చెక్కేశాడు! -
ప్రేయసితో కలిసి భార్యను కాల్చి చంపి, నేపాల్ చెక్కేశాడు!
పూణెకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యోదంతం ప్రకంపనలు కొనసాగుతుండగానే మరో దారుణమైన ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన కేవలం మూడు నెలలకే ఒక 25 ఏళ్ల అంకిత్ తన ప్రేయసి సహాయంతో భార్యను కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఆ తరువాత ఏమీ తెలియనట్టు నేపాల్‌కు పారిపోయారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలి తల్లి మనేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన 22 ఏళ్ల కుమార్తెకు ఫిబ్రవరిలో మనేసర్ నివాసి అంకిత్‌తో వివాహం జరిగిందని ఆమె పోలీసులకు తెలిపారు. మృతురాలు గత మే 21న అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికి, అత్తమామలను సంప్రదించినప్పటికీ సరైన సమాధానం లభించలేదు. దీంతో తమ కుమార్తె భర్త,అతని కుటుంబ సభ్యులపై అనుమానం రావడంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించారు.దర్యాప్తులో భాగంగా, పోలీసులు మే 22న మనేసర్‌లోని ఒక గదిలో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను కాల్చి చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితులైన భర్త ఏళ్ల అంకిత్, అతని ప్రేయసి, హర్యానాలోని ఝజ్జర్ జిల్లా నివాసి, 38 ఏళ్ల రజనీ దేవిలను అరెస్టు చేశారు. దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం, అంకిత్ మనేసర్‌లో పొగాకు దుకాణం నడుపుతుండగా, రజనీ అదే ప్రాంతంలోని ఒక బ్యూటీ పార్లర్లో పనిచేసేది.మూడేళ్ల ప్రేమాయణం , హత్య అంకిత్ ,రజనీ గత మూడేళ్లుగా రిలేషన్లో న్నట్టు పోలీసులు గుర్తించారు. భార్యను అడ్డు తొలగించేందుకు అంకిత్, తన భార్యను ఆ గదికి తీసుకెళ్లాడని, అక్కడ నిందితులిద్దరూ కలిసి ఆమెను కాల్చి చంపారని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యలో ఉపయోగించిన ఆయుధాన్ని ఘటనకు సుమారు రెండు నెలల ముందే ఉత్తరప్రదేశ్‌లో కొనుగోలు చేశారట.. కేవలం ఈ హత్యను చేసేందుకే ఆ ఆయుధాన్ని కొనుగోలు చేసి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.గుట్టు చప్పుడు కాకుండా నేపాల్‌కు పోలీసుల సమాచారం ప్రకారం, హత్య జరిగిన తర్వాత అంకిత్ , రజని హరిద్వార్‌కు పారిపోయి, ఆ తర్వాత నేపాల్ వెళ్లిపోయారు.జూన్ 30న తిరిగి భారతదేశానికి వచ్చే వరకు నిందితులు పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మనేసర్‌లో క్రైమ్ బ్రాంచ్ బృందం వారిని అరెస్టు చేసింది. ప్రస్తుతం కోర్టు వీరిద్దరికీ 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. నిందితులను విచారిస్తున్నామని, హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అదనపు ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి : కేతన్ హత్య : కోడ్‌వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’ -
కేతన్ అగర్వాల్ ఇంట మరో విషాదం
పూణే: మహారాష్ట్రలోని పూణే సమీపంలోని లోహగఢ్ కోట వద్ద జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. తన మనవడి హఠాన్మరణాన్ని తట్టుకోలేక కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ (71) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. జూన్ 18న లోహగఢ్ కోటపై నుంచి పడి కేతన్ మృతి చెందినప్పటి నుంచి దేవీచంద్ తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మొదట ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా భావించిన ఈ ఘటనను, పథకం ప్రకారం జరిగిన హత్యగా పూణే రూరల్ పోలీసులు నిర్ధారించారు. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, పెళ్లి ఇష్టం లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా తన స్నేహితుడు చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇద్దరినీ కోర్టు జూలై 16 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. లోహగఢ్ కోటపై డమ్మీతో సీన్ రీక్రియేషన్ చేసిన పోలీసులు, లల్లానగర్ మైదానంలో హత్యకు ముందు వారు చేసిన రిహార్సల్స్ ఆధారాలను సేకరించారు. సియా తండ్రి ప్రవీణ్ గోయల్ ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. -
CODEWORDS, EMOJI లతో సియా సీక్రెట్ చాట్స్
-
కేతన్ హత్య : కోడ్‌వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’
పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ మొబైల్ ఫోన్లో పోలీసులు డిజిటల్ చాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ‘సీక్రెట్ చాట్స్’ సరికొత్త మలుపుగా మారాయి. అసలు కోడ్‌వర్డ్స్ ఎమోజీల అర్థం ఏంటో తెలియక పోలీసులే తలలు పట్టుకుంటున్నారు. పోలీసులు సమాచారం ప్రకారం పోలీసులు స్వాధీనం చేసుకున్న చాట్లలోరహస్య కోడ్వర్డ్లు, మారుపేర్లు , ఎమోజీలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటి అర్థం కేవలం నిందితులకు మాత్రమే తెలుసని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. సియా గోయల్‌కు చెందిన రెండో మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) పరిశీలనకు పంపారు. మరోవైపు నిందితులను మరింత విచారించేందుకు పోలీసు కస్టడీని పొడిగించాలని ప్రాసిక్యూషన్ కోరినప్పటికీ, కోర్టు అందుకు నిరాకరించింది. నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను జూలై 16 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎ.ఎమ్. విభూతే ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: పెళ్లై నాలుగు నెలలే.. యాసిడ్ తాగించి, కన్న కొడుకు హత్యనిందితులు హత్యకు ముందు రిహార్సల్ చేసినట్లుగా భావిస్తున్న ప్రదేశంలో పోలీసులు 'పంచనామా' నిర్వహించారు. అలాగే ముంబై వైపు వెళ్తుండగా కేతన్ అగర్వాల్ పాస్‌పోర్ట్‌ను పడేసిన చోట కూడా పంచనామా పూర్తి చేశారు. కేతన్ అగర్వాల్ నుండి సియా గోయల్‌కు బదిలీ అయిన డబ్బుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్!కాగా కేతన్ అగర్వాల్, సియా గోయల్‌లకు ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే జూన్ 18న పుణె జిల్లాలోని లోహగఢ్ కోటపై నుండి కేతన్‌ను కిందకు తోసి సియా గోయల్, చేతన్ చౌదరిలు హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేతన్పై హత్యా యత్నం సహా అనేక సంచలన విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి.ఇదీ చదవండి: కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ -
సోనమ్ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్‌పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. అయితే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రాథమికంగా తమకు అభ్యంతరాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగు ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. సోనం రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రతివాదులకు(సోనమ్‌కు, ఇతరులకు) నోటీసులు జారీ చేసింది.మేఘాలయ ప్రభుత్వం వాదన ఇదే..మేఘాలయ ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇది ముందే పథకం ప్రకారం జరిగిన హత్య అని, సోనం రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుష్వాహా.. మరో ముగ్గురితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసి లోయలో పడేశారని కోర్టుకు తెలిపారు. హత్య అనంతరం సోనం పరారై ఉత్తరప్రదేశ్‌లో అరెస్టయ్యిందని వివరించారు.అయితే, హత్య కేసుకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) (హత్యకు శిక్ష)కు బదులుగా పొరపాటున సెక్షన్ 403(1)గా అరెస్ట్ మెమోలో టైప్ చేయడాన్ని ఆధారంగా తీసుకుని ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని.. అలాగే హైకోర్టు కూడా ఆ బెయిల్‌ను సమర్థించిందని కోర్టుకు నివేదించారు. అది కేవలం టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఈ ఒక్క కారణంతో బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించారు.సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై తమకు ప్రాథమికంగా కొన్ని సందేహాలు ఉన్నాయని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. నిందితురాలిపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని.. బెయిల్ విషయంలో మేఘాలయా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారాయన. అలాగే అరెస్టు కారణాలను నిందితురాలికి వివరించారని రికార్డుల్లో ఉందని, గతంలో దాఖలైన బెయిల్ పిటిషన్లలో ఈ అంశాన్ని ప్రస్తావించలేదని బెంచ్ ప్రస్తావించింది. కేవలం తప్పుగా సెక్షన్ పేర్కొన్నందుకే బెయిల్ ఇవ్వడం సరైందేనా? అని ప్రశ్నించింది.అయితే, సోనమ్ ఇప్పటికే జైలు నుంచి విడుదలైనందున ఈ దశలో బెయిల్‌పై స్టే విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. ‘‘బెయిల్ రద్దు విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. ఆమె విడుదల కాకపోయి ఉంటే.. బెయిల్‌పై కచ్చితంగా స్టే విధించేవాళ్లం’’ అని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో, బెయిల్ ఉత్తర్వుపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని, తదుపరి విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.హనీమూన్ కేసులో జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనం రఘువంశీ 2025 మేలో వివాహం చేసుకున్నారు. అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట మే 23న అదృశ్యమైంది. జూన్ 2న ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని వైసాడాంగ్ జలపాతం సమీపంలోని లోయలో రాజా మృతదేహం లభించింది. కొద్ది రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సోనం రఘువంశీ కనిపించగా, అనంతరం పలు అనుమానాల నడుమ ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.దర్యాప్తులో భర్త హత్యకు సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కుట్ర పన్నిందని, ఇందుకోసం కిరాయి హంతకులను నియమించిందని మేఘాలయ పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో సోనం, రాజ్ కుష్వాహాతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి 700కు పైగా పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ 27న ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వగా.. జూన్ 29న మేఘాలయ హైకోర్టు సోనం రఘువంశీకి బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ పత్రాల్లో సెక్షన్‌ను తప్పుగా నమోదు చేయడం సాధారణ టైపింగ్ పొరపాటు కాదని, దర్యాప్తు ప్రక్రియలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ హైకోర్టు బెయిల్‌ను సమర్థించింది. ఇప్పుడు ఆ బెయిల్‌ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, బెయిల్‌పై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించినప్పటికీ, హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగించేందుకు అంగీకరించింది. -
లవ్ ఎఫైర్ ముందే పసిగట్టిన కేతన్?
ముంబై: పూణేకి చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో రోజుకో మలుపు తిరుగుతుంది.తనకు కాబోయే భార్య సియా గోయల్ ప్రవర్తనపై కేతన్కు మొదటి నుంచే అనుమానాలు ఉన్నాయని.. పెళ్లికి ముందు ఆమె బ్యాక్గ్రౌండ్సర్గిగా చెక్చేశారా లేదా అని ఆయన తన కుటుంబ సభ్యులను గట్టిగా నిలదీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విచారణలో కేతన్ తండ్రి ఈ వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.తండ్రి వద్ద ఈవిషమమై ఆందోళన వ్యక్తం చేసిన కేతన్పోలీసుల కథనం ప్రకారం... సియా ప్రవర్తన, ఆమె మాటల్లో పదే పదే 'చేతన్ చౌదరి' పేరు రావడంపై కేతన్ తనతో పలుమార్లు మాట్లాడాడు. జూన్ 6న ప్లాన్ చేసిన ప్రీ-వెడ్డింగ్ బాలి (ఇండోనేషియా) ట్రిప్ రద్దయినప్పటి నుండి కేతన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. సియా చిన్న చిన్న విషయాలకే తనతో గొడవ పడుతోందని తండ్రికి చెప్పాడు. అయితే, ఆమె వయసులో చిన్నదని, తాము ఆమెకు నచ్చజెబుతామని తండ్రి కేతన్‌ను ఊరడించారు. కేతన్ ఫోన్ చేసినప్పుడల్లా సియా ఫోన్ బిజీగా వచ్చేదని, వారి సంభాషణల్లో ఆమె తరచూ చేతన్ గురించి ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. కేతన్ ఇన్ని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, గోయల్ కుటుంబం తమ బంధువులకు తెలిసినవారే కావడంతో ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేతన్ కుటుంబ సభ్యులు అతనికి నచ్చజెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది.లోహగఢ్ కోట పర్యటన తర్వాత పెరిగిన అనుమానంజూన్ 14న లోహగఢ్ కోటను సందర్శించి వచ్చిన తర్వాత, కేతన్ మళ్లీ తన తండ్రిని కలిసి... అసలు పెళ్లి నిశ్చయించే ముందు సియా గురించి పూర్తిస్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేశారా లేదా అని గట్టిగా నిలదీశాడు. సియా ప్రవర్తన రోజురోజుకూ అనుమానాస్పదంగా మారుతోందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడని తెలిపారు. అయినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోలేదని పేర్కొన్నారు.లవ్ ట్రయాంగిల్... చివరకు దారుణ హత్యపూణేకి చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్ కు ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, అప్పటికే చేతన్ చౌదరి (22) అనే యువకుడితో ప్రేమలో ఉన్న సియా, కేతన్‌ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.జూన్ 18న లోహగఢ్ కోటపైకి కేతన్‌ను తీసుకెళ్లిన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి అతడిని కొండపై నుండి కిందకు తోసి దారుణంగా హత్య చేశారు.సియా పాయింట్'గా మారిన ఘటనా స్థలంఈ ఘోర హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత, పూణేలోని లోహగఢ్ కోటకు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. కేతన్‌ను ఏ పాయింట్ నుండి అయితే కిందకు నెట్టేశారో, ఆ క్రైమ్ స్పాట్‌ను స్థానికులు, సందర్శకులు ఇప్పుడు 'సియా పాయింట్' అని పిలుస్తూ, ఆ స్థలాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివస్తున్నారు. -
కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!
-
కేతన్ హత్య కేసు: ఏఐ సాయంతో వికృత రీల్స్!
పూణె: మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ఇటీవల లోహగఢ్ కోటపై దారుణ హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఒక కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఘాతుకం.. డిజిటల్ ప్రపంచంలో ఒక వైరల్ వినోదంగా మారిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ)సాంకేతికతతో సృష్టించిన వికృతమైన రీల్స్, మీమ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ, మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. People out there are really making AI edits of Ketan and Siya, Instagram is full of it now pic.twitter.com/Rg6yy86Oyq— Shubham2.0 (@bhav_paaji) June 26, 2026సాంకేతికత దుర్వినియోగంపోలీసుల దర్యాప్తు ప్రకారం, కేతన్ అగర్వాల్‌ను అతని కాబోయే భార్య సియా గోయల్ లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి తోసి హత్య చేసింది. తొలుత దీనిని ప్రమాదంగా చిత్రీకరించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత అసలు నిజం బయటపడింది. కానీ డిజిటల్ క్రియేటర్లు ఈ దారుణాన్ని ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా తరహాలో మలిచేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఏఐ సాయంతో కొండ అంచున ఉన్న ఒక జంట, గంభీరమైన సంగీతం, కిందకు తోసివేయడం, స్లో-మోషన్లో కింద పడిపోవడం లాంటిటి విజువల్స్‌ను అత్యంత స్టైలిష్‌గా రీ-క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఒక మనిషి చివరి క్షణాలు, నేడు క్లిక్‌ల కోసం వాడే కంటెంట్‌గా మారిపోవడం సమాజ పతనానికి అద్దం పడుతోంది.Ketan Agarwal, owner of business worth crores, was ki!!ed by Siya Goyal with the help of her boyfriend Chetan Chaudhary.A marriage worth crores was arranged. Ketan was innocent and in love with her. She had the courage to kill someone rather than tell her family she loved pic.twitter.com/r5JneEr4zQ— Er Nawaz Choudhary (@N143ch) June 24, 2026లింగ వివక్ష.. నెట్టింట వికృత వ్యాఖ్యలుఈ దురదృష్టకర ఘటనపై నెటిజన్లు స్పందిస్తున్న తీరు మరిన్ని కలవరపెట్టే నిజాలను బయటపెడుతోంది. ఇలాంటి దారుణాలలో బాధితులు పురుషులైనప్పుడు సోషల్ మీడియా వ్యాఖ్యల విభాగం హింసకు వ్యతిరేకంగా కాకుండా, మహిళలపై సార్వత్రిక దాడులకు వేదికగా మారుతోంది. ‘మగవారికి రక్షణ లేదు’ అనే తరహా కథనాలతో పాటు సియా గోయల్‌ను విలన్‌గా చూపిస్తూ వేసిన వికృతమైన జోకులు, మీమ్స్ ఇందుకు ఉదాహరణ. నేరం ఎవరూ చేసినా క్షమార్హం కాదు. కానీ ఒక వ్యక్తిగత నేరాన్ని సమాజంపైకి అస్త్రంగా మార్చుకోవడం ఇక్కడి దుస్థితి.केतन और सिया का अनोखा अवतार!' सोशल मीडिया पर वायरल AI वीडियो ने मचाया तहलकाइंटरनेट पर केतन और सिया का एक नया एआई (AI) जेनरेटेड वीडियो तेजी से वायरल हो रहा है, Ketan Siya Viral Video, AI Generated Look, Social Media Reaction, Trending AI Video]#KetanSiya #AIVideo #ViralTrend pic.twitter.com/L6TbD1l8NT— The Lokdoot (@thelokdoot) June 26, 2026ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతారాహిత్యంసోషల్ మీడియా అల్గారిథమ్‌లు సానుభూతికి, దోపిడీకి మధ్య తేడాను గుర్తించవు. అవి కేవలం వినియోగదారుల ‘అటెన్షన్’ (ఆకర్షణ)ను మాత్రమే కోరుకుంటాయి. ఈ ఘోర శోకాన్ని కూడా రీల్స్, షేర్ల రూపంలోకి మార్చి, బాధితుడి తల్లిదండ్రుల వేదనను పట్టించుకోకుండా క్లిక్‌లను లాభాలుగా మార్చుకునే ఒక వికృతమైన వ్యవస్థ నడుస్తోంది. సాంకేతికత చిత్రాలను సృష్టించవచ్చు, కానీ వాటిని అప్లోడ్ చేసి, చూసి, ఆనందిస్తున్నది మనుషులే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. లోహగఢ్ కోటపై జరిగిన హత్య ఒక విషాదమైతే, సోషల్ మీడియాలో సాగుతున్న ఈ వికృత క్రీడ అంతకన్నా పెద్ద మానసిక విషాదంగా పరిణమించింది.ఇది కూడా చదవండి: సింగిల్ శాలరీతో కష్టమే.. మారిన ఆర్థిక సూత్రం -
గాయత్రి మర్డర్ మిస్టరీ.. ముస్సోరిలో జరిగిన అసలు కథ! పేరెంట్స్ చెప్పిన షాకింగ్ నిజాలు
-
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
-
గర్భిణీపై కనికరం లేకుండా.. నీళ్ల బకెట్లో ముంచి..
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టిన ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. పరాయి పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో, ఆరు నెలల గర్భిణీ అయిన భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. నిత్యం ఆమెను ఇంట్లోనే బంధించి నరకం చూపించడమే కాకుండా, చివరకు ఆమె తలను నీళ్ల బకెట్లో ముంచి ప్రాణాలు తీసిన ఈ ఘటనా వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి.రోజుకు 10 గంటల గృహ నిర్బంధంఢిల్లీలోని లాజ్‌పత్ నగర్లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసే అమిత్ గుప్తా (26) అనే వ్యక్తికి, నేహా కుమారి (23) అనే మహిళతో వివాహమైంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అమిత్, ఆమెను ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు. ప్రతిరోజూ ఉదయం 8:30 నుండి రాత్రి 7 గంటల వరకు తను ఆఫీసుకు వెళ్లే సమయంలో, నేహాను కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోనే పెట్టి బయట నుండి తాళం వేసేవాడు. ఒంటరిగా మార్కెట్‌కు వెళ్లేందుకు కూడా ఆమెకు అనుమతి ఉండేది కాదు. ఈ విషయాన్ని నేహా తన పుట్టింటి వారితో చెప్పినప్పటికీ వారు ఎప్పుడూ ఆమె భర్తను నచ్చజెప్పలేదు.బకెట్ నీళ్లలో ముంచి దారుణ హత్యకొన్నాళ్ల నుండి అమిత్ ఆఫీసుకు వెళ్లడం మానేశాడు. ఈ క్రమంలోనే గురువారం నాడు వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన అమిత్.. గర్భవతి అని కూడా చూడకుండా నేహా తలను బలవంతంగా నీళ్లతో నిండిన బకెట్లో ముంచి శ్వాస ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. శనివారం నాడు మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో మృతురాలికి శవపరీక్ష నిర్వహించారు. దీనిపై పూర్తి నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.కట్నం కోసమేనా? పోలీసుల దర్యాప్తుఈ దారుణానికి సంబంధించి ఫరీదాబాద్ పోలీస్ పీఆర్వో యశ్పాల్ యాదవ్ కీలక విషయాలు వెల్లడించారు. నేహా తండ్రి.. అల్లుడు అమిత్ ఒత్తిడి తట్టుకోలేక ఒక స్థలాన్ని కొనుగోలు చేసి, దానిని అమిత్ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా, వారి కోసం ఒక కొత్త ఇల్లు కూడా నిర్మించి ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు అమిత్ గుప్తా పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. -
కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్..? కేతన్ బట్టతలే హత్యకు కారణమా?
-
కేతన్ అగర్వాల్ కేసులో బిగ్ ట్విస్ట్..? కొత్త విషయాలు వెలుగులోకి!
-
పెద్ద సైకో... వాడు మళ్లీ బయట తిరగకూడదు రాధా గాయత్రి తండ్రి, పిన్ని
-
కేతన్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. తవ్వేకొద్దీ బయటపడుతున్న సంచలన నిజాలు!
-
కేతన్ హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు
-
నల్లగొండ: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర ఇది!
నల్లగొండ పట్టణాన్ని కుదిపేసిన నాలుగు హత్యల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం కన్నకూతురు, అల్లుడే.. హసీనా కుటుంబాన్ని దారుణంగా హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నియమించారని.. ఆ గ్యాంగ్ అత్యంత కిరాకతంగా ఆ నలుగురిని హతమార్చిందని తేల్చారు.నల్లగొండ జిల్లాలో సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో నాలుగు హత్యల ఘటన మిస్టరీ వీడింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దారుణ ఘటనలో హసీనా అనే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ముగ్గురు ఘోరంగా హత్యకు గురయ్యారు. మొదట ఇది గుర్తుతెలియని దుండగుల దాడిగా అనుమానించగా.. దర్యాప్తు ముందుకు సాగిన కొద్దీ కేసు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. హసీనా పేరుపై ఉన్న ఆస్తుల విషయంలో కుటుంబంలో తీవ్ర వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆస్తులు తనకు దక్కడం లేదన్న అక్కసుతోనే ఆమె కూతురు(మొదటి భర్త ద్వారా జన్మించిన సంతానం), అల్లుడు కలిసి ఈ హత్యలకు పథకం వేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణానికి వారు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించారు.దర్యాప్తులో మరో కీలక కోణం వెలుగులోకి వచ్చింది. ఘటనకు కొన్ని రోజుల ముందే నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి లోపలికి వెళ్లే మార్గాలు, కుటుంబ సభ్యుల కదలికలు అన్నీ ముందుగానే గమనించి పక్కా ప్లాన్‌తో హత్యలకు పాల్పడ్డారని సమాచారం.ఘటన జరిగిన రాత్రి.. నిందితులు ఇంటి తలుపు తట్టి హసీనాను బయటకు రప్పించినట్లు సమాచారం. తలుపు తెరిచిన వెంటనే ఆమెపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. హసీనా కుమారుడు ముజమ్మీల్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతనిపైనా తీవ్రంగా దాడి చేసి గొంతు కోసి, ఆపై కత్తితో పొడిచి హతమార్చారు.ఆ అలజడికి మెలుకువ వచ్చి వచ్చిన సుల్తాన్‌పై(హసీనా మూడో భర్త) కూడా దుండగులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు తేలింది. దాడి సమయంలో భయంతో బెడ్ కింద దాక్కున్న సుల్తాన్ కుమార్తె అక్సరాను బయటకు లాక్కొచ్చిన దుండగులు.. గోడకేసి బలంగా బాదారు. అనంతరం కత్తులతో పొడిచి హతమార్చారు.దర్యాప్తు ప్రకారం, ఈ మొత్తం కుట్రలో సుపారీ గ్యాంగ్ సహా మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న కూతురు, అల్లుడి సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.ఇదే కేసులో మరో కీలక అంశంగా, హత్యలకు ఉపయోగించిన ఆయుధాలను ఘటన అనంతరం వివిధ ప్రాంతాల్లో దాచినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో దాడి ఎంత క్రూరంగా జరిగిందో వివరాలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.హసీనా(40)కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ఇక సుల్తాన్‌కు కూడా హసీనా మూడో భార్య. మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం ముజమ్మీల్, అక్సరాలతో ఆ భార్యభర్తలు కలిసే ఉంటున్నారు. హసీనా పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇల్లులు ఉన్నాయి. ఆ ఆస్తిని సుల్తాన్ పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో కక్ష పెంచుకొని, హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. -
ఆ నలుగురిదీ హత్యే
నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్(20), కుమార్తె అక్సర (11) అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నలుగురూ హత్యలకు గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మెడ, ఛాతీ భాగంలో గాయాలు ఉండటంతో ఇది కచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్ల పనేనని పోలీసులు భావిస్తున్నారు. అయితే నిందితులకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఇప్పటివరకు లభించలేదు.పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. సుల్తాన్ మృతదేహంపై 6 చోట్ల కత్తి గాయాలు ఉండగా, హసీనాకు 7 చోట్ల, కుమార్తె అక్సరకు 9 చోట్ల, ముజమిల్‌కు ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా కరాటే వచ్చిన ముజమిల్ ప్రతిఘటించడంతో 16 చోట్ల విచక్షణారహితంగా పొడిచి ఉండొవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులకు భయపడి 11 ఏళ్ల అక్సర మంచం కింద దాక్కుంటే ఆమెను బయటకు లాగి చంపి ఉంటారని.. ఆమె మృతదేహం సగం మంచం కింద ఉండటాన్నిబట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే హత్యల అనంతరం నిందితులు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్లిపోవడంతో దుండగులు పక్కా ప్రణాళికతోనే వ్యవహరించినట్లు తెలుస్తోంది.పోలీసుల అదుపులో 20 మంది!ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మృతుల మొబైల్ కాల్‌డేటా ఆధారంగా 20 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆస్తి గొడవలు, బంధువులతో విభేదాల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల కిందట మృతుల ఇంట్లో దొంగతనం జరగడం.. తాజాగా హత్యల అనంతరం ఇంట్లోని బీరువాలు, వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో ఈ రెండు ఘటనలకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇల్లు పట్టణానికి చివరన ఉండటంతోపాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తునకు అడ్డంకిగా మారింది. అయితే ఘటన జరిగిన రాత్రి ఇంట్లో కేకలు వినిపించినట్లు కొందరు స్థానికులు చెబుతున్నారు. ఆ కుటుంబంలో అప్పుడప్పుడూ గొడవలు జరుగుతుండటంతో ఆ రోజు కూడా అదే జరుగుతోందని భావించి దృష్టిపెట్టలేదంటున్నారు. మూడు రోజుల తర్వాత ఇంట్లో దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
చంపేందుకే లోహగఢ్ ట్రెక్కింగ్ ప్లాన్ CCTV కెమెరాలో అంతా రికార్డ్
-
రూ. 17 కోట్లతో పెళ్లి ప్లాన్ : కేతన్ తండ్రి చెప్పిన మరికొన్ని భయానక నిజాలు
మహారాష్ట్రలోని లోహగడ్ కోటవద్ద రియల్ ఎస్టేట్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసి కాబోయే కోడల్ని ఎంతో ఆనందంగా ఇంటికి తీసుకురావాలని ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ఆ కుటుంబం చివరికి కాబోయే కోడలి క్రూరత్వానికి బలైపోయింది. జీవితంలో ఎప్పటికీ కోలుకోలేని తీవ్ర ఆవేదన మిగిల్చింది.కన్నతల్లి ఆవేదన.. ఆఖరి మాటలుకొడుకు మరణవార్త విన్న కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ గుండెకోత తట్టుకోలేక స్పృహతప్పి పడిపోతున్నారు. తనే పంపించానని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. అసలు ఆ రోజు లోహగఢ్ కోట ట్రిప్‌కు వెళ్లమని కేతన్‌ను ఒప్పించింది అతని తల్లే. దాంతో కొడుకును మృత్యుపాశంలోకి తానే నెట్టేసానని తల్లి తల్లడిల్లిపోతోంది. ఆమె తీరని ద్రోహం చేసింది. మా యింటి పిల్ల అనుకున్నాం. కలిసి షాపింగ్‌లు చేశాం, కలిసి భోంచేశాం కానీ ఇంత దారుణానికి తెగ బడుతుందని అస్సలు ఊహించలేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కాబోయే కోడలి గురించి తల్లి, కొడుకుతో చెప్పిన చివరిమాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు."My son is no more. Siya betrayed us. We treated her like family, went shopping and had dinners together, but never imagined this," said Ketan Agarwal's grieving mother. 💔 Meanwhile, Ketan's father has appealed for a fast-track trial and the strictest punishment for the… pic.twitter.com/ebQ5MkWggS— Megh Updates 🚨™ (@MeghUpdates) June 24, 2026చివరి మాటలుకేతన్ ట్రిప్‌కు బయలుదేరే ముందు తల్లి రాఖీ అగర్వాల్ అతనికి చెప్పిన చివరి మాటలు.. ‘‘సియాను జాగ్రత్తగా చూసుకో. ఆమెను అస్సలు ఇబ్బంది పెట్టకు’’ అని కొడుకు ప్రాణాలు తీయబోయే అమ్మాయి గురించే ఆ తల్లి ఆఖరి నిమిషం వరకు అంతగా తాపత్రయపడటం అందరినీ కలచివేస్తోంది.35 ఏళ్ల బంధంఅగర్వాల్, గోయల్ కుటుంబాల మధ్య 35 ఏళ్ల పరిచయం అందుకే రాఖీ అగర్వాల్ కాబోయే కోడలు సియాను తన సొంత కూతురిలా చూసుకున్నారు. అలాంటి సియానే తన కొడుకును చంపడానికి కుట్ర పన్నిందని తెలిసి ఆమె కుప్పకూలిపోయారు.తండ్రి మరో వాదనకేతన్ తండ్రి పుణేలో ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ ఈ హత్యకు సంబంధించిన మరికొన్ని భయంకరమైన వివరాలను పంచుకున్నారు. కేతన్‌ను కోట పైనుంచి కిందకు నెట్టేయడానికి ముందే.. సియా, చేతన్ చౌదరి ఇద్దరూ కలిసి పదునైన ఆయుధంతో కేతన్ తలపై బలంగా కొట్టారు. అతడు స్పృహ తప్పేలా లేదా కనీసం తప్పించుకోలేనంత బలహీనపడేలా చేసిన తర్వాతే పైనుంచి కిందకు నెట్టేసి చంపేశారని వాపోయారు.ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడాలిపోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేసి నిజాన్ని బయటపెట్టారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి, నిందితులకు త్వరగా అత్యంత కఠినమైన శిక్ష పడేలా చేయడమే నా ఏకైక డిమాండ్. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి ఇదొక హెచ్చరిక కావాలి అని తండ్రి విశాల్ అగర్వాల్ ప్రభుత్వాన్ని కోరారు.బర్త్‌డే వేడుక కోసం స్టార్ హోటల్లో 70 రూములు తన కుమారుడి కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజు వేడుకను మహారాష్ట్రలోని హిల్ స్టేషన్ మహాబలేశ్వర్‌లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే, సియా మనసులో తన కుమారుడికి సంబంధించి ఒక భయంకరమైన పథకం ఉందని ఆయనకు తెలియదు.జూన్ 20న మహాబలేశ్వర్‌లో సియా పుట్టినరోజును కేతన్, సియా, కుటుంబాలు కలిసి జరుపుకోవాలని అనుకున్నాయి. ఇందుకోసం కేతన్ తండ్రి ఆ హిల్ స్టేషన్‌లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్లో 70 గదులను బుక్ చేశారు. అయితే, ఆ ప్లాన్‌ను రద్దు చేసుకుని, దానికి బదులుగా పుణె సమీపంలోని లోహగడ్ కోటకు ఒంటరిగా వెళ్లేలా సియా కేతన్‌ను ఒప్పించింది. ప్రియుడితో కలిసి తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసిన కేతన్‌ను హతమార్చింది.రూ. 17 కోట్ల పెళ్లి వేడుక.. అంతలోనే విషాదంకేతన్ (26), సియా (20) ల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం జైపూర్‌లోని ఒక ప్యాలెస్‌ను రూ. 17 కోట్ల భారీ బడ్జెట్‌తో బుక్ చేశారు. బంధువులను, అతిథులను తీసుకురావడానికి రెండు ప్రైవేట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. పెళ్లి కొడుకు ముస్తాబులో చూడాలనుకన్న తమ కుమారుడు ఇలా విగత జీవిగా మారిపోవడం కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: 11 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం : ఆ తర్వాత తాపీగా క్యాబ్ డ్రైవింగ్ఎవరీ కేతన్ అగర్వాల్కుటుంబ యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ 'సక్సెస్ గ్రూప్'కు డైరెక్టర్‌గా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO)గా ఉండేవారు. పూణేలో నివసించేవారు.ఓలిన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశారు. సింబయాసిస్ యూనివర్సిటీ నుండి బీబీఏ డిగ్రీని కూడా పొందారు. కేతన్ లింక్డ్ఇన్ బయో ప్రకారం, సుస్థిరత, ఆవిష్కరణలకు కట్టుబడి ఉండటమే కాదు, కేవలం ఆర్థిక వృద్ధిని పెంపొందించడమే కాకుండా, పచ్చని భవిష్యత్తుకు దోహదపడే ప్రాజెక్టులపై దృష్టి సారించారు.ఇదీ చదవండి : కేతన్ అగర్వాల్ హత్యలో ఎన్ని ట్విస్టులో: అపుడు తప్పిందనీ ప్లాన్ ‘సి’ సిద్ధం!కాగా కేతన్, సియాల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరిగింది, నవంబర్‌లో వారి వివాహం జరగాల్సి ఉంది. కానీ జూన్ 18న, సియాతో కలిసి లోహగడ్ కోటలో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కేతన్ లోయలో పడి మరణించాడు. సియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని భావించినప్పటికీ, విచారణలో సియా ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఎత్తు నుండి కిందకు తోసేశారని తేలింది. ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలు -
‘ముంబై లోకల్’: వర్షం గొడవలో యువకుడి దారుణ హత్య
ముంబై: మహారాష్ట్రలోని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ.. లోకల్ ట్రైన్లో ఊహించని దారుణం జరిగింది. రైలు కోచ్ తలుపు తెరిచి ఉంచే విషయమై ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వాదం.. చివరికి ఒకరి ప్రాణాలను బలిగొంది. తోటి ప్రయాణికుడిపై ఆగ్రహంతో ఊగిపోయిన ఓ గుర్తుతెలియని వ్యక్తి, పదునైన ఆయుధంతో కడుపులో పొడవడంతో 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.తలుపు వివాదం.. ప్రాణాంతక దాడిపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయాంక్ లోహర్ (22) అనే యువకుడు చర్చిగేట్ నుంచి నల్లాసోపారా వెళ్లే ఫాస్ట్ లోకల్ రైలులోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నాడు. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోచ్ తలుపును తెరిచి ఉంచాలా లేదా మూసివేయాలా అనే విషయమై మయాంక్‌కు, మరో ప్రయాణికుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సదరు గుర్తుతెలియని దుండగుడు అకస్మాత్తుగా పదునైన ఆయుధాన్ని తీసి, మయాంక్ కడుపులో బలంగా పొడిచాడు. రాత్రి 11:04 గంటలకు రైలు బోరివలీ స్టేషన్‌కు చేరుకోగానే, రైలు పూర్తిగా ఆగకముందే నిందితుడు జనం రద్దీలోకి దూకి పారిపోయాడు.రైల్వే అధికారుల తక్షణ స్పందనరైలు బోరివలీ స్టేషన్లో ఆగడమే ఆలస్యం.. పశ్చిమ రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. తీవ్రంగా గాయపడిన మయాంక్‌ను పోర్టర్ల సహాయంతో అత్యవసరంగా బోరివలీ స్టేషన్‌లోని మెడికల్ రూమ్‌కు తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు రాత్రి 11:42 గంటలకు కందివలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ మాట్లాడుతూ.. క్షతగాత్రుడికి వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించామన్నారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపుఈ దారుణ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ముంబై సెంట్రల్), సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బోరివలీ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి జీఆర్పీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అందులో భాగంగా అంధేరి, మలాడ్, బోరివలీ రైల్వే ప్లాట్‌ఫారమ్‌లలోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆనవాళ్లను సేకరించి, అతడు ఏ మార్గంలో పారిపోయాడనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. -
రాధా గాయత్రి కేసుపై వివరణ ఇచ్చిన శ్రీచరణ్ తండ్రి
-
తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర?
పట్నా: బిహార్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ పట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆర్జేడీ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు ఆకాష్ యాదవ్‌తో పాటు మరో ఏడుగురు కలిసి తనను, తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన సచివాలయం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించడంతో పాటు, తనకు తక్షణమే భద్రత పెంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.నివాసంలోకి చొరబాటు.. ప్రతిపక్షాల కుట్ర?తనను అంతమొందించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. పట్నాలోని తన నివాసంలోకి నలుగురు వ్యక్తులు బలవంతంగా చొరబడ్డారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించేలోపే వారు పరారయ్యారని మీడియాకు తెలిపారు. ప్రతిపక్ష నేతలతో చేతులు కలిపిన ఆకాష్ యాదవ్, ఈ తరహా హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను, తనను ఒకేసారి మట్టుబెట్టాలనేది వారి ప్లాన్ అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు.రివర్స్ కేసు.. చిన్నారి అపహరణ బెదిరింపులుఇదిలా ఉంటే, ఈ కేసులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తేజ్ ప్రతాప్‌పై కూడా పట్నాలో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆకాష్ యాదవ్ కుటుంబానికి చెందిన ఒక నివాసంలోకి తేజ్ ప్రతాప్ బలవంతంగా దూసుకెళ్లారని, అక్కడ ఉన్న ఒక చిన్నారిని తన ‘కూతురు’గా పిలుస్తూ, ఆమెను కలవనివ్వకపోతే అపహరిస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో అమెరికా నంబర్ నుండి తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, వాయిస్ నోట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.రాజకీయ కక్ష సాధింపే..తనపై వచ్చిన ఆరోపణలను తేజ్ ప్రతాప్ యాదవ్ పూర్తిగా తోసిపుచ్చారు. గతంలో సదరు వ్యక్తి ప్రవర్తనపై తాను చట్టపరమైన నోటీసులు పంపినందుకే, కక్ష గట్టి తనపై తప్పుడు కథనాలతో కూడిన ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వివాదాల కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడైన తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే.ఇది కూడా చదవండి: ఒడిశా లెక్కలే ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడుతున్నాయా? -
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!
-
సీక్రెట్ పెళ్లి, ఫస్ట్ యానివర్శరీ ఇన్‌స్టా స్టోరీ: తీరా ఆరా తీస్తే..!
బెంగళూరులో వరుస ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. అనుమానాస్పద స్థితిలో 22 ఏళ్ల యువతి శవమై కనిపించగా, స్పృహతప్పి పడివున్న ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఇద్దరూ కలిసి చేసుకున్న ఆత్మహత్యా ప్రయత్నమా లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నమా? మిస్టరీగా మారింది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, భవాని (22) ఒక మొబైల్ షోరూమ్‌లో పనిచేస్తూ పశ్చిమ బెంగళూరులోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తోంది. భవానీ, చంద్రశేఖర్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుమారు ఏడాది క్రితం తమ కుటుంబాలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అయితే చంద్రశేఖర్‌కు అప్పటికే పెళ్లయ్యి, ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.ఇన్స్టాగ్రామ్ స్టోరీతో వెలుగులోకిజూన్ 13న భవాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక స్టోరీ పెట్టింది. హ్యాపీ యానివర్సరీ అంటూ చంద్రశేఖర్ కలిసి ఉన్న ఒక ఫోటో స్టోరీగా ప్రత్యక్షమైంది. తమ తొలిపెళ్లి రోజు సందర్భంగా చంద్రశేఖరే ఆ ఫోటోను అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు భవాని కుటుంబ సభ్యులను ఈ పోస్ట్ అలర్ట్ చేసింది. అనుమానంతో వారు వరుసగా భవానికి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఎన్నిసార్లు చేసినా ఆమె ఎత్తకపోవడంతో అనుమానం వచ్చింది. అందోళనతో ఆమె తండ్రి ఇంటి యజమానికి సమాచారం అందించారు. యజమాని, చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా భవాని మృతి చెంది ఉంది, చంద్రశేఖర్ అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.భవాని తండ్రి సమాచారం ప్రకారం, భవానికీ ఇటీవల పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. వచ్చే వారమే నిశ్చితార్థం కూడా చేయాలని భావించారు. బహుశా ఈ విషయం భవాని చంద్రశేఖర్‌కు చెప్పడం వల్లే ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఇద్దరూ కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకుందామని చంద్రశేఖర్ ఆమెను ఒప్పించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే విషం తాగిన తర్వాత భవానికి వాంతులు అవ్వడంతో, చంద్రశేఖర్ ఆమె గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఆ తర్వాత అతడు కూడా ఎక్కువ మొత్తంలో విషం తాగి ఉంటాడే అనేది ప్రాథమిక అంచనా.ప్రస్తుతం చంద్రశేఖర్ కోలుకోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భవాని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఫొరెన్సిక్, మెడికల్ రిపోర్టులు వస్తే తప్ప ఇది ముందే ప్లాన్ చేసి చేసిన హత్యా, లేక ఆత్మహత్యా ప్రయత్నం విఫలమై చేసిన హత్యా అనేది తెలిసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..! -
వాట్సాప్ స్టేటస్ విప్పిన గుట్టు!
ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణాలు చేసుకున్నారు. కానీ ఆ బంధం చివరికి ఓ ఊహించని క్రైమ్ కథగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. చిన్న రోడ్డు ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స.. ఆ తర్వాత ఒక్కసారిగా భర్త గుండెపోటుతో మృతి చెందాడు. కన్నీళ్లతో కుప్పకూలిన ఆమె… ఆ క్షణం అది ముగింపు అనుకుంది. కానీ అదే ముగింపు కాదు. అసలు కథ మొదలు.ఈ కేసులో మలుపు తిప్పింది ఒక వాట్సాప్ స్టేటస్. సాధారణంగా కనిపించిన ఆ ఒక్క మెసేజ్ పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది. అదే ఆధారంగా సాగిన దర్యాప్తు… చివరికి ఇది ప్రమాదం కాదు పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా అని బయటపెట్టింది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో మాజీ ఆర్మీ జవాన్ శాండీప్ మంజర్గి మృతి కేసు.. సంచలన మలుపు తీసుకుంది. ప్రియుడితో కలిసి భార్యే ఆయన్ని.. అదీ ఆస్పత్రిలోనే హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. మొదట ఇది గుండెపోటు వల్ల జరిగిన సహజ మరణమని వైద్య నివేదికలు పేర్కొన్నప్పటికీ.. తర్వాతి దర్యాప్తులో ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసులు తెలుసుకుని కంగుతిన్నారు. ఈ కేసులో అతని భార్య సుమ మంజర్గి, ఆమె ప్రేమికుడు పుండలిక్ దొంబార్ సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఆస్పత్రి సిబ్బంది కూడా ఉండడం గమనార్హం.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 13న శాండీప్ రోడ్డు మీద యాక్సిడెంట్ కావడంతో స్వల్పంగా గాయపడ్డాడు. మొదట ఆయన్ని హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రిలో, తరువాత జీ.జె. ఆసుపత్రికి తరలించారు. చిన్న గాయమే కావడంతో ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జి అవుతారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే రెండ్రోజుల తర్వాత.. హఠాత్తుగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో భార్య సుమ గుండెలు పగిలేలా రోదించడం అక్కడున్నవాళ్లను కంటతడి పెట్టించింది. అయితే.. శవ పరీక్షలో అతని శరీరంలో తీవ్రమైన గాయాలు లేకపోవడం.. అప్పటిదాకా సాధారణంగా ఉన్న ఆరోగ్యం హఠాత్తుగా విషమించడంతో వైద్యులు పోలీసుల వద్ద అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో.. సుమ మంజర్గి స్నేహితుడిగా చెలామణి అవుతున్న పుండలిక్ దొంబార్ తీరుపై పోలీసులకు అనుమానం మొదలైంది. ఫోన్ కాల్ డాటా ఆధారంగా.. ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటున్నారని గుర్తించారు. అలాగే ‘‘యాక్సిడెంట్ తర్వాత ఇలా ఎలా జరుగుతుంది?’’ అంటూ అతను పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఆ అనుమానాల్ని మరింత బలపరిచింది. వైద్యులు ఏం చెప్పారో తెలియకుండానే.. అతను శాండీప్ మరణంపై అలా ఎలా పూర్తి వివరాలను తెలుసుకోగలిగాడు అని ఆశ్చర్యపోయారు. విచారణకు పిలిచారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు. సుమ, పుండలిక్‌కు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే శాండీప్‌ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఈ యాక్సిడెంట్‌ను అవకాశంగా మల్చుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే అతడికి సెలైన్ బాటిల్ ద్వారా విషం ఇచ్చారు. తీసుకునే జ్యూస్‌లో నిద్ర మాత్రలు కలిపారు. అలా నిద్రలోనే శాండీప్ కన్నుమూశాడు. ఆ తర్వాత.. మరణాన్ని సహజ గుండెపోటుగా చూపించేందుకు వైద్య రికార్డులు, ఫోరెన్సిక్ రిపోర్టులు డబ్బు ఎర వేసి మార్చేశారు. దర్యాప్తులో బయటపడ్డ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. శాండీప్ పేరు మీద రూ.2 కోట్ల ఇన్సూరెన్స్‌లు ఉండడం, ఆయన చనిపోయాక వాటిని త్వరగా క్లెయిమ్ చేసుకోవాలని సుమ చేసిన ప్రయత్నాలు. ఇక హత్య కుట్రలో ఆసుపత్రి సిబ్బంది, ల్యాబ్ సిబ్బంది, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వాములైనట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షలపై ప్రభావం చూపేందుకు రూ.3 లక్షలకు పైగా లంచాలు ఇచ్చినట్లు కూడా అనుమానం వ్యక్తమవుతోంది. ఆధారాలు చెరిపివేయడం, టాక్సిక్ పదార్థాలు రిపోర్టుల్లో కనిపించకుండా చేయడం కోసం పెద్ద నెట్వర్క్ పనిచేసినట్లు తెలుస్తోంది.ఇన్వెస్టిగేషన్లో పోలీసులు సిరింజ్‌లు, విష పదార్థాల కంటైనర్లు, మొబైల్ ఫోన్లు సహా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసు కేవలం ఓ భార్య తన పప్రియుడితో కలిసి భర్తకు రాసిన మరణశాసనమే కాదు.. వ్యవస్థలోని లోపాలను బయటపెడుతూ పెద్ద చర్చకు దారి తీసింది. అన్నట్లు తెలంగాణలోని కామారెడ్డిలోనూ ఈ తరహా నేరమే ఒకటి బయటపడడం తెలిసిందే. కామారెడ్డి కేసులో ఓ వ్యక్తి హత్యను మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, అది యాక్సిడెంట్ కాదని పక్కా ప్లాన్‌తో చేసిన హత్యగా తేలింది. భార్యకు తన భర్తను తొలగించాలనే ఉద్దేశం ఉండగా, ఆమెకు సహకరించిన ప్రియుడి పాత్ర కూడా బయటపడింది. ఇద్దరూ కలిసి హత్య చేసి, దాన్ని ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలు, పోస్టుమార్టం రిపోర్ట్లు అసలు నిజాన్ని బయటపెట్టాయి. చివరికి భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
కత్తితో పొడిచి.. డంబెల్‌తో మోది
గోల్కొండ: సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో.. సొంత బావమరుదులే బంధువులతో కలిసి బావను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోల్కొండ కుమ్మర్వాడీకి చెందిన షేక్ మసూద్ అలియాస్ చాందిని మసూద్ (25) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మూడేళ్లుగా షేక్ మసూద్ యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం షేక్ మసూద్ తన బస్తీ కుమ్మర్వాడీకి చెందిన బేగం అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన నాటి నుంచి మృతుడి బావమరుదులు, అత్త, ఇతర బంధువులు షేక్ మసూద్‌ను సూటిపోటి మాటలతో వేధించేవారు.దీంతో మసూద్ వారి ఇంటికి రాకపోకలు మానేశాడు. దారిలో ఎక్కడైనా ఎదురైనప్పుడు మసూద్ బావమరుదులు మసూద్‌ను బెదిరించే వారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఫతేదర్వాజా నూరాని మసీదులో మసూద్ మధ్యాహ్నం ప్రార్ధనలు ముగించుకొని తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే అప్పటికే అతడి బావమరుదులు అప్పు, జావేద్, వీరి బంధువు షేక్ సోహెల్‌తోపాటు మరో ఇద్దరు మహిళలతో మసూద్ ఇంటి ముందు కాపుకాసి ఉన్నారు. మసూద్ అక్కడికి రాగానే అతడిపై కత్తి, రాడ్‌తో దాడి చేశారు. ప్రాణభయంతో మసూద్ తన ఇంట్లోకి వెళ్లిపోయాడు.అక్కడితో ఆగకుండా ఇంట్లోకి చొరబడి కత్తితో పాటు వ్యాయామం చేసే డంబుల్స్తో కొట్టడం ప్రారంభించారు. నిందితుల్లో ఒకరు కత్తితో షేక్ మసూద్ తలపై కొట్టాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మసూద్ తండ్రి నిందితులను అడ్డుకోగా నిందితుల్లో ఒకరైన అప్పు అతడిపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రక్తం మడుగులో కిందపడిపోయిన మసూద్ చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా నిందితుల్లో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
ఇల్లు దక్కలేదని.. నడిరోడ్డుపైనే 82 ఏళ్ల తండ్రి హత్య
ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. కోర్టులో తండ్రికి వ్యతిరేకంగా ఆస్తి కేసు ఓడి పోయాననే ఆగ్రహంతో ఒక వ్యక్తి తన 82 ఏళ్ల తండ్రిని నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది.ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉంటున్న జలవనరుల శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి జాఫర్కమరుద్దీన్ సయ్యద్ పటేల్‌కు, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న కుమారుడు అబ్దుల్ రెహమాన్‌తో చాలాకాలంగా వివాదం నడుస్తోంది. నిత్యం కుటుంబ సభ్యులతో గొడవపడుతూ, వారిపై దాడిచేసేవాడు. దీంతో బాధితుడు జాఫర్ కొడుకు ప్రవర్తనతో విసుగు చెంది, ఇంటి కోసం కేసు వేయడానికి ముందు పూణేలోని తన కుమార్తె ఇంటికి వెళ్లిపోయాడు.కుమారుడి ప్రవర్తనతో వేగలేక, అతడిని ఇల్లు ఖాళీ చేయించడానికి కోర్టును ఆశ్రయించాడు. రెండేళ్లపాటు న్యాయపోరాటం చేశాడు. చివరికి కోర్టు తండ్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, కుమారుడిని ఇల్లు ఖాళీ చేయించాలని ఆదేశించింది. ఆస్తి యాజమాన్యాన్ని తండ్రికి పునరుద్ధరించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో విచక్షణ మరిచిన కొడుకు ఉత్తర్వులతో కోర్టు నుండి ఇంటికి తిరిగి వస్తుండగా జాఫర్‌పై ఎటాక్ చేశాడు. తండ్రి ప్రయాణిస్తున్న ఆటోరిక్షాను ఆపి, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపాడు. పటేల్‌తో పాటు ఆయన కుమార్తె కూడా ఈ దాడిలో గాయపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
జిమ్ ఓనర్‌పై బుల్లెట్ల వర్షం.. స్పాట్లోనే మృతి
హన్సి: హర్యానాలోని హన్సి జిల్లాలో ఒక జిమ్ యజమానిని గుర్తుతెలియని దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపి పారిపోయారు. కేవలం ఐదు సెకన్ల వ్యవధిలోనే పది రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఫవ్వారా చౌక్ సమీపంలో గురువారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. మృతుడిని కపిల్‌గా గుర్తించారు.ఆయన తన ఫిట్నెస్ సెంటర్ వెలుపల వ్యాయామం చేయిస్తున్న సమయంలో, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. హెల్మెట్లు, మాస్కులు ధరించిన ఆ నిందితులు అత్యంత సమీపం నుండి కేవలం ఐదు సెకన్లలో 10 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో కపిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో శిఖ అనే మహిళ కూడా గాయపడగా, ఆమెను చికిత్స నిమిత్తం హిసార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుల ఆనవాళ్లను గుర్తించేందుకు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు సైతం ఆధారాలు సేకరించాయి. ఈ కేసు దర్యాప్తును హర్యానా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ)కి అప్పగించారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నామని, అయితే ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.ఢిల్లీలో కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ కలకలంఇదిలావుండగా గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ఏరియాలో ఉన్న ఒక జిమ్ వెలుపల కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు జిమ్‌పై సుమారు ఏడు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఢిల్లీ దాడికి తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. -
ప్రేమించాడనే కక్షతో ఘోరం: గదిలో బంధించి, కర్రలతో కొట్టి..
తెహ్రీ గర్హ్వాల్: ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్హ్వాల్ జిల్లాలో ఒక విషాద ఘటన వెలుగుచూసింది. తమ ఇంటి అమ్మాయితో స్నేహం చేశాడనే నెపంతో 18 ఏళ్ల ఒక దళిత యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయగా, పోలీసులు నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.అర్ధరాత్రి పిలిచి..మృతుడు కేతన్ లాల్ గత ఆరు నెలలుగా సదరు యువతితో స్నేహంగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో సదరు యువతి నుంచి ఫోన్ రావడంతో, కేతన్ తన స్నేహితుడైన దివాకర్ దిమ్రీతో కలిసి ఆమె నివసించే ఖోల్గఢ్ గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడకు చేరుకోగానే యువతి కుటుంబ సభ్యులు వీరిద్దరినీ ఒక గదిలో బంధించి, కర్రలతో నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు.రక్తపు మడుగులో కుమారుడుమరుసటి రోజు ఉదయం ఆ యువతి తండ్రి.. కేతన్ తండ్రి ధన్పాల్ లాల్‌కు ఫోన్ చేసి, నీ కొడుకును వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. ధన్పాల్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా, కేతన్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండటం చూసి హతాశుడయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో గాయపడిన కేతన్ స్నేహితుడు దివాకర్ ప్రస్తుతం బౌరారీలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.రంగంలోకి పోలీసులు.. నిందితుడి అరెస్ట్ఈ ఘోర ఉదంతంపై తెహ్రీ గర్హ్వాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్వేతా చౌబే స్పందిస్తూ.. నిందితులపై ఐపీసీ హత్య సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2)(వి) కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి యశ్వీర్ సింగ్ పన్వార్ అనే వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎలుగుబంటి స్వైరవిహారం.. 100 పాఠశాలలు మూసివేత! -
బాలిక హత్యాచారం కేసులో దంపతులకు ఉరి
ఢాకా: బంగ్లాదేశ్‌లో తీవ్ర సంచలనం రేపిన బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషులైన దంపతులకు కోర్టు ఉరి శిక్ష విధించింది. కేవలం ఐదు రోజుల్లోనే విచారణ పూర్తి చేసింది. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని న్యాయవాదులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న 19 రోజుల్లోనే ఢాకా మెట్రోపాలిటన్ చైల్డ్ రిప్రెషన్ ప్రివెన్షన్ ట్రిబ్యునల్ ఈ ఘనత సాధించిందన్నారు. మే 18వ తేదీన ఢాకాలోని పల్లబి ప్రాంతంలోని ఓ 8 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆమెను అక్కడే ఓ అపార్టుమెంట్లో ఉండే సోహెల్ రాణా కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అతడికి భార్య స్వప్నా ఖాతూన్ సహకరించింది. అనంతరం ఆ బాలికను ముక్కలుముక్కలుగా నరికి ఇంట్లోనే దాచేసి సోహెల్ పరారయ్యాడు. పోలీసులు 19వ తేదీన సోహెల్, స్వప్నలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. జడ్జి మస్రూర్ సలెకిన్ ఆదివారం తీర్పు వెలువరించారు. నిందితులు ఇద్దరికీ ఉరి శిక్షతోపాటు, రూ.5 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకుంటే వారి ఆస్తులను వేలం వేసి, వసూలు చేయాలని ఆదేశించారు. -
ఆస్తికోసం తల్లిదండ్రులు, సోదరి హత్య, ఆ తర్వాత షాకింగ్ ఘటన
ప్రయాగ్‌రాజ్ : డబ్బు, ఆస్తి మీద విపరీమైన వ్యామోహంతో ఎంతటి దారుణానికైనా తెగ బడుతున్నారు మనుషులు. మానవ విలువల్ని, బంధాల్ని బంధుత్వాల్ని మరిచి సొంత తల్లిదండ్రులను, తోగబుట్టిన సోదరిని హత్య చేశాడో దుర్మార్గుడు. చివరికి అతను కూడా అదే అత్యాశకు బలైపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవనంలోఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కర్మ ఎవరిని విడిచిపెట్టదనే సూత్రం వీరి విషయంలో అక్షరాలా నిజమైంది.పోలీస్ కమిషనర్ జోగేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ మలకా ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో వివాదం నెలకొంది. వీరేంద్ర వైశ్య, ఆయన భార్య తమ ఆస్తి నుండి కుమారుడు అభిషేక్‌కు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు అభిషేక్. తల్లిదండ్రులు, సోదరిని చంపడానికి ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే తన స్నేహితుడు సన్నీ గుప్తాను ఇంటికి పిలిపించు కున్నాడు. ప్లాన్ ప్రకారం వారిని మట్టుబెట్టాడు. ఆ తర్వాత, ఇద్దరూ కలిసి ఇంటో దొంగిలించిన విలువైన వస్తువులను పంచుకోవడానికి గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణానికి వెళ్లారు. అయితే ఈ పంపకాల సమయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో ఏరాడ్తో అయితే తల్లిదండ్రులను హత్య చేశాడో అదే రాడ్‌తో అభిషేక్‌ను హత్య చేసి, శవాన్ని దుకాణంలోనే వదిలేసి, షాప్‌కు తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు సన్నీ.రెండు రోజుల తరువాత ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా భయంకరమైన దృశ్యం కనిపించింది. మే 31 సాయంత్రం అభిషేక్, గుప్తాతో కలిసి వీరేంద్ర, అనిత, మీనాక్షిలను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో వీరేంద్ర వైశ్య (70), ఆయన భార్య అనిత (65), కుమార్తె మీనాక్షి (45) మృతదేహాలను స్వాధీనం తీసుకున్నారు.మొదట, అభిషేక్ హంతకుడై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావించి, అతని కోసం గాలించారు.. కానీ మృతదేహాలపై డిటర్జెంట్, శుభ్రపరిచే రసాయనాలుపూసి ఉండటంతో, రక్తపు మరకలున్న టీ-షర్టు, కుటుంబ కలహాలు, ఆభరణాలచోరీ , నకిటీ నోట్ ఆధారంగా హత్య పథకాన్ని వారు వెలికితీశారు. అదే భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న తాళం వేసిన దుకాణాన్ని బలవంతంగా తెరిచారు. అక్కడ అభిషేక్ వైశ్య (40) మృతదేహం లభించింది. సిసిటివి ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించి నిందితుడైన సన్నీ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అతడినుంచి బంగారం, 360 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.ఫ్యామిలీ బిజినెస్ వీరేంద్ర వైశ్య ఆ ప్రాంతంలో పేరున్న వ్యాపారవేత్త. భార్య అనిత, కుమార్తె మీనాక్షి, పెద్ద కుమారుడు అభిషేక్‌తో కలిసి ఆ భవనంలో నివసించేవాడు. కింది అంతస్తులో సుమారు 15 నుండి 16 దుకాణాలు ఉండేవి, వాటిలో చాలా వరకు అద్దెకు ఇచ్చి, ప్రతి నెలా లక్ష రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జించేవి. లిక్విడ్ డిటర్జెంట్ మరియు టాయిలెట్ క్లీనర్లతో సహా వెస్టిజ్ ఉత్పత్తులను అమ్మే దుకాణాన్ని అభిషేక్ నడిపేవాడు. మరొకటి మీనాక్షికి చెందింది. ఆమె ఇటీవలే ఒక గిఫ్ట్ గ్యాలరీ వ్యాపారాన్ని ప్రారంభించింది.చిన్నకొడుకుతో విభేదాలు, తప్పుడు నోట్కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు, సుమారు 15 ఏళ్ల క్రితం వీరేంద్ర తన చిన్న కొడుకు అశ్వినిని తన కొడుకు కాదని వదిలేశాడని సమాచారం. ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు పదేపదే తలెత్తుతూ ఉండేవి. వీరిద్దరినీ బంటీ, బబ్లూ అని పిలిచేవారు. ఈ హత్యను తప్పు దారి పట్టించేందుకు బంటీ , కోడలు బబ్లూనే చంపారు అనే నోట్ వదిలారు. అయితే వివాహ వెబ్సైట్ మోసాలకు సంబంధించిన ఒక కేసులో అశ్విని, రితు 2024లో జైలు పాలయ్యారు. -
పశ్చాత్తాపంతో 40 ఏళ్ల తర్వాత లొంగిపోయిన కిల్లర్
తిరువనంతపురం: నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం ఇప్పుడు హంతకుడి ఆత్మప్రబోధంతో బయటపడింది. కేరళలో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ హత్యను తానే స్వయంగా చేశానని తెలియజేసి లొంగిపోయాడు. కోజికోడ్ జిల్లా కూడరంజికి చెందిన 55 ఏళ్ల మహమ్మద్ అలీ గత ఏడాది పోలీసులను ఆశ్రయించాడు. 1980ల కాలంలో తాను రెండు హత్యలు చేశానని, తనను అరెస్ట్ చేయాలని కోరాడు.అవి తాను తెలియక చేసిన తప్పులని, ఇప్పుడు పశ్చాత్తాపంతో లొంగిపోతున్నానని మీడియాకు తెలిపాడు. కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే ఈ వింత కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మహమ్మద్ అలీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం.. 1986లో కూడరంజి వద్ద బాధితుడు తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం అతడిని నీటిలో ముంచి చంపేశానన్నాడు. ఈ క్లూ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించగా, డిసెంబర్ 1986లో ఒక పత్రికలో వచ్చిన వార్త కీలకమైంది. కూడరంజి మిషన్ హాస్పిటల్ వెనుక పొలాల్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఆ వార్త సారాంశం.తిరువంబడి పోలీసులు 1980ల కాలంలో మలబార్ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలించారు. సుదీర్ఘ శాస్త్రీయ విచారణ అనంతరం ఆ మృతుడు కన్నూర్ జిల్లా ఇరిట్టికి చెందిన మోహనన్‌గా గుర్తించారు. నిందితుడి వాంగ్మూలానికి, ఘటనా స్థలాలకు సరిగ్గా సరిపోలడంతో ఈ కేసును ధృవీకరించారు. కాగా, 1989లో కోజికోడ్ బీచ్‌లో చేసినట్లు చెబుతున్న మరో హత్యకు సంబంధించిన వివరాలను, బాధితుడి గుర్తింపును కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ టెన్షన్: ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూనే.. -
చినికి చినికి చివరికి హత్యగా!
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ సభ్యుడు ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, విలువైన స్థిరాస్తులు తమ చేయి దాటిపోతున్నాయనే ఉద్దేశంతోనే ఆలంఖాన్లు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. మలక్‌పేట, లక్డీకాపూల్ల్లోని ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్తోపాటు మల్లేపల్లిలో ఉన్న మదర్సా ఏ ఎజాజ్ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఖాజా మొహిజుద్దీన్‌కు తండ్రీకుమారులైన మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్ వర్గాల మధ్య ఏళ్లుగా విభేదాలు నెలకొన్నాయి.13 ఏళ్లుగా వివాదాలు.. ఈ రెండు సంస్థలకు చెందిన స్థిరచరాస్తులు, విద్యాసంస్థల పరిపాలన, నిర్వహణను చేతుల్లోకి తీసుకునే అంశంపై 13 ఏళ్లుగా వివాదాలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే మజ్లిస్ ఏ ఉమ్నాగా పిలిచే ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీ 2013లో మహబూబ్ ఆలంఖాన్‌ను సెక్రటరీ పోస్టు నుంచి తొలగించింది. దీంతో మహబూబ్ ఆలంఖాన్ 17 మంది సభ్యులతో ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ ప్రెసిడెంట్‌తో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలు ఒకదానిపై మరోటి హైకోర్టులో అనేక రిట్ పిటిషన్లు ఫైల్ చేసుకున్నాయి.రాజీ చేసినా.. 2023లో కొందరు ఈ రెండు గ్రూపుల మధ్య రాజీ చేసి క్రిమినల్, సివిల్ పిటిషన్లు ఉపసంహరించునేలా చేశారు. దీంతో మహబూబ్ ఆలంఖాన్ ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్‌కు సెక్రటరీగా పునర్ నియమితులై 2025 ఫిబ్రవరి వరకు కొనసాగారు. ఆర్థిక అవకతవకలపై మరోసారి మహబూబ్ ఆలంఖాన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీని రద్దు చేసింది. ఆ సమయంలో 2025 నుంచి 2027 వరకు చెల్లుబాటు అయ్యేలా ఏర్పడిన కొత్త కమిటీకి ఖాజా మొహిజుద్దీన్ ట్రెజరర్‌గా నియమితులయ్యారు. దీంతో మరోసారి హైకోర్టులో మహబూబ్ ఆలంఖాన్‌కు వ్యతిరేకంగా పిటిషన్లు ఫైల్ అయ్యాయి. వాటికి ఖాజా మొహిజుద్దీన్ వకాల్తా తీసుకున్నారు.వకాల్తా.. ఆర్థికంగా దివాలా.. 2013లో ఉస్మాన్ ఖాన్, కిషన్‌సింగ్ అలియాస్ పప్పుతో కలిసి మహబూబ్ ఆలంఖాన్ లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ద్వారా ఖాజా మొహిజుద్దీన్పై అత్యాచారం కేసు నమోదు చేయించారు. దర్యాప్తు అనంతరం ఈ కేసును పోలీసులు మూసివేశారు. మొహిజుద్దీన్ వకాల్తా కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, అనేక వక్ఫ్ ఆస్తులు చేయి దాటిపోతున్నాయని భావించిన ఆలంఖాన్లు అతడిని అంతం చేయాలని కుట్ర పన్నారు.అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా కనిపించేలా హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతల్ని తమ వద్ద పని చేసే హసన్ అలీతోపాటు ముజాహిద్ ఆలంఖాన్‌కు పరిచయస్తుడైన మునీర్‌లకు అప్పగించారు. కిషన్సింగ్ని కూడా భాగస్వామిని చేశారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసమూ గాలిస్తున్నారు. -
హైదరాబాద్ లో హత్య కలకలం.. గంజాయి మత్తులో దారుణం
-
నల్లమాడులో జంట హత్యలు
ఉంగుటూరు: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు ఆయకట్టు ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో మూడు రోజులు క్రితం జరిగిన జంట హత్యలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. మృతులు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన తల్లీ కుమార్తెగా గుర్తించారు. వీరిద్దరినీ శుక్రవారం రాత్రి హతమార్చినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అనంతపల్లికి చెందిన గంటా అంథోబాయికి నలుగురు పిల్లలు. వీరిలో వెంకటలక్ష్మి అంధురాలు కావడంతో 2009లో బ్యాక్లాగ్ పోస్టులో ఏలూరు మున్సిపాలిటీలో అటెండర్ ఉద్యోగం వచ్చింది.తల్లి అంథోబాయితో కలిసి ఏలూరులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉద్యోగం చేస్తోంది. వెంకటలక్ష్మి సోదరుడు సుదర్శన్ కూడా వీరితోనే ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏలూరులో తల్లీకుమార్తె బయలుదేరి ఫంక్షన్‌కు వెళ్లేందుకు దూబచర్ల వచ్చారు. రాత్రి 8 గంటల సమయంలో దూబచర్ల చేరినట్టు ఏలూరులో ఉన్న కుమారుడికి తల్లి ఫోన్ చేసి చెప్పింది. 9 గంటల నుంచి వారి ఫోన్ పని చేయలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆలపాటి వేణు అనే రైతు పొలంలోకి వెళ్లగా అక్కడ మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు.దీంతో ఏలూరు డీఎస్పీ శ్రావణకుమార్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుకుని వివరాలు సేకరించారు. జంట హత్యల విషయం తెలియడంతో నల్లజర్ల, ఉంగుటూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మృతులను గుర్తించి అనంతపల్లికి చెందిన వారని చెప్పడంతో వారి బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో హంతకుల కోసం వెతుకుతున్నారు. శుక్రవారం రాత్రి బస్సు దిగిన తర్వాత తల్లీకుమార్తె ఆటో ఎక్కి ఉండవచ్చని... ఆటో డ్రైవర్ వీరిని నల్లమాడు ఆయకట్టు పరిధిలోని జీడితోటలోకి తీసుకెళ్లి బంగారం, నగదు కోసం హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. హంతకులు ఎవరు, హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘వీళ్లసలు మనుషులేనా?’.. పోలీసుల ముందే చితకబాదారు
మొదట అది సాధారణ మరణం అనుకున్నారు. తినేటప్పుడు ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని స్వయంగా తల్లే చెప్పడంతో అంతా అదే నిజమనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదిక వెన్నులో వణుకు పుట్టించే విషయాల్ని బయటపెట్టింది. పోలీసులు సైతం ఆ నివేదిక చూసి షాక్‌కు గురయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఆ చిన్నారి కేసు యావత్ సమాజాన్ని కుదిపేసిన ఘటనగా మారింది. పట్టరాని కోపంతో.. అదీ పోలీసుల సమక్షంలోనే జనాలు నిందితుల మీద దాడి చేసే దాకా తీసుకెళ్లింది.. కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగాడ్‌లో.. ఏడాదిన్నర వయసున్న అర్షిద్ మరణం అందరితో ‘అయ్యో పాపం’ అనిపిస్తోంది. భోజనం చేస్తుండగా.. దగ్గు, వాంతులు చేసుకుంటూ ఆ చిన్నారి అస్వస్థతకు గురయ్యాడని.. ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ కన్నుమూశాడని తల్లి అఖిల(24) మీడియా ముందు వాపోయింది. అయితే ఆమె కన్నీళ్లంతా కట్టుకథ అని తేలడానికి 24 గంటలు కూడా పట్టలేదు. అర్షిద్ మాములు చిన్నారేం కాదు. కొన్ని నెలల కిందట.. రెండు చేతులకు బ్యాండ్లతో తల్లి చంకలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాడు. ఆడుకుంటుండగా సైకిల్ మీద నుంచి పడిపోయాడని చెబుతూ.. ఆమె పలువురి సాయం కోరడం నెట్టింట వైరల్ అయ్యింది. అలా ఆ తల్లికి చాలామంది డబ్బు కూడా పంపించారు. కట్ చేస్తే.. మే 29వ తేదీన ఆ చిన్నారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. Tragic incident from God’s own countryHere is a 2-week-old video of 1-and-a-half-year-old Arshad with both hands fractured. In the video, his mother Akhila lies, claiming he broke his hands by falling off a bicycle.Tragically, little Arshad passed away 2 days ago at the… pic.twitter.com/j1WnUTE2fU— Revolutionary Monk (@RevolutionMonk) May 31, 2026అన్నం తింటుండగా ఆ చిన్నారి అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అఖిల, ఆమె స్నేహితుడు అష్కర్ అర్షిద్‌ను హుటాహుటిన పనవూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం అయ్యింది. ఈలోపు ఒంటిపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానంతో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో షాకింగ్ విషయాలు బయటపెట్టాయి. అర్షిద్ ఒంటిపై సుమారు 50కి పైగా గాయాల గుర్తులు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అంతేకాదు.. సిగరెట్లతో ఒంటి నిండా కాల్చిన గాయాలు ఉండడం వైద్యుల్ని విస్మయానికి గురిచేసింది. పైగా ఈ గాయాలు ఒక్కరోజులో జరిగినవి కావని.. చాలా కాలంగా కొనసాగుతున్న హింసకు సంబంధించినవని తేల్చారు.నెలల వయసు నుంచే..అఖిల కడుపుతో ఉన్నప్పుడు ఆమె భర్త అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమె అష్కర్(31) అనే వ్యక్తితో సహజీవనం మొదలుపెట్టింది. ఈ సంబంధం కారణంగానే ఆమె పుట్టిన బిడ్డను తల్లికి అప్పగించింది. అయితే అఖిల భర్త తరఫున బంధువుల అభ్యంతరాలతో తిరిగి చిన్నారిని తన దగ్గరకు తెచ్చుకుంది. అప్పటి నుంచే చిన్నారి అర్షిద్‌కు వేధింపులు మొదలయ్యాయి. ఆ సమయంలోనూ శరీరంపై తరచూ గాయాలు కనిపించేవని.. అడిగితే గాయాలపాలవుతున్నాడని చెప్పేదని అఖిల తల్లి పోలీసులకు చెబుతోంది. అంతేకాదు.. మే నెలలో వైరల్ అయిన వీడియోను కూడా అర్షిద్ అమ్మమ్మ గుర్తు చేసింది. మనవడి చేతులు విరిగిన సందర్భంలోనూ కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఇక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నారి గుక్కపట్టి ఏడ్వడంపై చాలాసార్లు అఖిలను నిలదీసినట్లు చెబుతున్నారు. ఆగ్రహంతో దంచి కొట్టారు!పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి హత్య కేసుగా మార్చారు. కేసు తీవ్రత దృష్ట్యా మే 30న అఖిల, అష్కర్‌లను అరెస్ట్ చేశారు. చిన్నారిపై నిరంతరం హింస కొనసాగుతున్న విషయం తెలిసినా తల్లి అడ్డుకోలేదని, అధికారులకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమైంది. అందుకే ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. అంతేకాదు.. గతంలో చేతులు విరిగిన ఘటనలోనూ ఆమె ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఆదివారం అష్కర్‌ను ఘటనాస్థలికి తీసుకెళ్లి సాక్ష్యాలు సేకరిస్తుండగా.. స్థానికులు ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు కూడా వాళ్లను నిలువరించలేపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని అర్షిద్ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతలు.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అర్షిద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.തിരുവനന്തപുരം നെടുമങ്ങാട് ഒന്നര വയസ്സുകാരൻ കൊല്ലപ്പെട്ട സംഭവത്തിൽ പ്രതികളിൽ ഒരാളായ അഷ്കറുമായി തെളിവെടുപ്പ് നടത്തുന്നതിനിടെ പ്രതിയെ കയ്യേറ്റം ചെയ്ത് നാട്ടുകാർ #nedumangad #ashkar #crime #kerala pic.twitter.com/4MEuPTbAXl— DD News Malayalam (@DDNewsMalayalam) May 31, 2026 -
భర్తను చంపించి.. గుండెలు బాదుకుంది!
రోడ్డుపక్కన మంటల్లో కాలిపోతున్న స్కార్పియో వాహనం, అందులో కనిపించిన మృతదేహాలు, ఇంటివద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య.. ఆ ఘోరం చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు. గ్రామస్తులే కాదు, మొదట్లో పోలీసులు కూడా ప్రమాదమే అనుకుని జాలి చూపించారు. కానీ ఫోరెన్సిక్ దర్యాప్తులో బయటపడిన నిజాలు.. ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేశాయి.రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా శ్రీరాంపుర గ్రామం మే 28వ తేదీన ఉదయం సమీపంలో ఓ స్కార్పియో వాహనం మంటల్లో కాలిపోతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వాహనంలో మూడు కాలిన మృతదేహాలను గుర్తించారు. మరొక మృతదేహం సమీపంలోని పొలంలో లభించింది. మృతులను మాజీ సర్పంచ్ రామ్‌సింగ్ చౌదరి, ఆయన తల్లి పూసీదేవి, రెండో భార్య సూర్యగ్యాన్ దేవి, కుటుంబ సభ్యురాలు మహిమా చౌదరిగా గుర్తించారు. తొలుత ఇది ఘోర ప్రమాదమని భావించిన పోలీసులు.. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల్లో మృతదేహాలపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గాయాలు ఉండటాన్ని గుర్తించారు. దీంతో కేసు మలుపు తిరిగింది.ఈ తరుణంలో.. దర్యాప్తు క్రమంగా కుటుంబ సభ్యుల వైపు మళ్లింది. ఇదే సమయంలో రామ్‌సింగ్ మొదటి భార్య సునీత చౌదరి ఇంటివద్ద తీవ్రంగా విలపిస్తూ కనిపించింది. బంధువుల మధ్య కూర్చుని కన్నీళ్లు కారుస్తూ.. గుండెలు బాదుకుంది. షాక్‌తో పదే పదే మూర్ఛపోసాగింది. అయితే ఆమె పర్ఫార్మెన్స్పై పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. భర్త రెండో వివాహం.. కుటుంబ వివాదాల నడుమ.. ఆమె అలా ప్రవర్తించడం ఆ దిశగా విచారణకు అడుగులేయించింది.అయితే పోలీసులకు సునీత ఓ స్టేట్మెంట్ ఇస్తే.. దర్యాప్తులో అదంతా తారుమారైంది. రామ్‌సింగ్ తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడని ఆమె చెప్పినా.. సాంకేతిక ఆధారాలు, ఇరుపొరుగువాళ్లు ఇచ్చిన స్టేట్మెంట్తో అసలు విషయం బయటపడింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రామ్‌సింగ్‌కు ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం వల్ల తరచూ ఘర్షణలు జరిగేవి. అలా బుధవారం రాత్రి గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఆ సమయంలో సునీత చౌదరి, ఆమె కుమార్తె సరిత, మైనర్ కొడుకు కలిసి.. తొలుత రామ్సింగ్ను హతమార్చారు. ఆపై ఆ హత్యను చూసిన రామ్‌సింగ్ తల్లిని చంపారు. ఆ వెంటనే రెండో భార్య కూడా చూసి ఉంటుందన్న అనుమానంతో చంపేశారు. ఈలోపు అటుగా వచ్చిన రెండో భార్య మేనకోడలిని సైతం ఎవరికైనా చెబుతుందేమోనని చంపేశారు.అనంతరం నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాలను స్కార్పియోలో వేసి హైవేపైకి తీసుకెళ్లి వాహనానికి నిప్పంటించినట్లు ఆరోపిస్తున్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు, మొబైల్ డేటా, గ్రామస్తుల వాంగ్మూలాలు కలిపి చూసినప్పుడు కుట్ర మొత్తం బయటపడిందని అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ తెలిపారు. చిన్నచిన్న ఆధారాలే ఈ కేసును ఛేదించాయని ఆయన చెప్పారు.ప్రస్తుతం సునీత చౌదరి, ఆమె కుమార్తె, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రజలను అత్యంత షాక్‌కు గురిచేసిన విషయం ఒక్కటే. నాలుగు హత్యలకు పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళే.. ఆ తర్వాత మృతుల కోసం కన్నీళ్లు కారుస్తూ, శోకసంద్రంలో మునిగిపోయినట్టు నటించిందని పోలీసులు చెబుతున్నారు. నెలల తరబడి ఎదురు చూసి..పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ హత్యల వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి కుటుంబంలోని మైనర్ కుమారుడేనని ఓ అంచనాకి వచ్చారు. కుటుంబ విభేదాలు, ముఖ్యంగా తండ్రి రెండో వివాహంపై ఇంట్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ముందుగానే ఈ దాడికి సిద్ధమైనట్లు విచారణలో తేలిందని కథనాలు పేర్కొంటున్నాయి. తరచూ తల్లిని, అక్కను తండ్రి కొట్టడం భరించలేకపోయాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆన్లైన్లో పదునైన కత్తిని కొనుగోలు చేసి, దానిని కొంతకాలం ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన రాత్రి తల్లి సునీత, అక్క సరితతో కలిసి పథకం ప్రకారమే నలుగురిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యల అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాలను స్కార్పియో వాహనంలో తీసుకెళ్లి నిప్పంటించడంలోనూ అతడు సహకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. -
కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య
కెనడాలో గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యు గురైంది. మృతురాలిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బోర్సాద్‌కు చెందిన విధి కల్పేష్‌భాయ్ మేఘానిగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. అంతర్జాతీయ మీడియా ప్రకారం మేఘ గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తూ, తన చదువుతో పాటు, పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని కూడా చేసుకుంటూ ఉండేది. అంతేకాదు కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల 15నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపులో కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటిపై కత్తిపోట్లు ఆధారంగా ఆమెను ఎవరో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: సీబీఎస్ఈ వివాదం : ఎట్టకేలకు మౌనం వీడిన ధరేంద్ర ప్రధాన్ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా? -
వివాహేతర సంబంధం, రూ. 2 కోట్ల బీమా కోసం..
మంచిర్యాల క్రైం: వివాహేతర సంబంధం మోజులోపడి కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడి చేత హత్య చేయించింది. ఇందుకోసం భర్త పేరిట ముందే రూ. 2 కోట్ల విలువైన బీమా పాలసీలు చేయించి వాటిని కూడా సొంతం చేసుకోవాలని పథకం రచించింది. ఆపై ఎవరికీ అనుమానం రా కుండా ఉండాలనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం వెలుగు చూడటంతో చివరకు కటకటాలపాలైంది. మంచిర్యాలలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన సాయిని కుమార్ (40) వ్యవసాయం చేస్తూ జీవించేవాడు. అతనికి భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 22న రాత్రి పని నిమిత్తం బయటకు వెళ్లిన కుమార్.. ముల్కల్ల శివారులో రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు హాజీపూర్ పోలీ సులకు సమాచారం అందించారు. అయితే కుమారుడి మర ణం అనుమానాస్పదంగా ఉండటంతో తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏడాది క్రితం నుంచే.. గుడిపేటకు చెందిన రామ్‌మల్లేశ్ వద్ద కుమార్ గతంలో రూ. 60 వేలు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో రామ్ మల్లేశ్ తన అప్పు తీర్చాలంటూ తరచూ కుమార్ ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడు. చంపుతానని కూడా బెదిరించేవాడు. ఈ క్రమంలో రామ్‌మల్లేశ్ భారతికి దగ్గరయ్యాడు. అప్పటికే ఆమె గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో భారతి, కుమార్ మధ్య గొడవలు జరిగాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భారతి ఏడాది క్రితమే నిర్ణయించుకుంది. లోన్ యాప్‌లో అప్పు చేసి బీమా పాలసీలు.. భర్తను హత్య చేస్తే వివాహేతర సంబంధానికి అడ్డులేకుండా పోతుందని.. అదే సమయంలో భర్త పేరిట బీమా చేయిస్తే రూ. కోట్లు పొందొచ్చని భారతి భావించింది. ఇందుకోసం ఆన్లైన్ లోన్ యాప్‌ల ద్వారా ఏకంగా రూ. 15 లక్షలు అప్పు చేసి గతేడాది జనవరిలో భర్త కుమార్ పేరిట వివిధ బీమా కంపెనీల నుంచి సుమారు రూ. 2 కోట్ల విలువైన పాలసీలు తీసుకుంది. అనంతరం భర్త హత్యకు రూ.10 లక్షలతో రామ్ మల్లేశ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని వారిద్దరూ పథకం వేసుకున్నారు. రామ్‌మల్లేశ్... తనకు పరిచయం ఉన్న మంచిర్యాల ఎల్ఐసీ కాలనీకి చెందిన శ్రీరామ్‌కుమార్ సాయం తీసుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 22న రాత్రి రామ్‌మల్లేశ్, శ్రీరాంకుమార్లు కుమార్‌తో కలిసి ముల్కల్ల శివారులో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న కుమార్‌ను ఇనుప సుత్తితో తలపై కొట్టి చంపారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు రోడ్డు పక్కనే మోటార్ సైకిల్ పడేసి వెళ్లిపోయారు. కుమార్ మృతిచెందడం, అతని తల్లి ఈ మరణంపై అ నుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు భార్యపైనే అనుమా నం వ్యక్తం చేస్తూ ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. హత్య చేసింది రామ్‌మల్లేశ్, శ్రీరాంకుమారేనని.. చేయించింది భారతి అని నిర్ధారించారు. అలాగే భారతితో వివాహేతర సంబంధం కొనసాగించిన లగిశెట్టి సురేందర్‌పైనా కేసు నమోదు చేశారు. స్థానిక ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎస్సై కిరణ్‌కుమార్ రెండ్రోజుల వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించారు. మంగళవారం భారతి, రామ్‌మల్లేశ్, సురేందర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీరాంకుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
సంగారెడ్డి ముత్యంరెడ్డి కేసులో షాకింగ్ నిజాలు బయటపెట్టిన పోలీసులు
-
తండ్రిని చంపాడనే కక్షతోనే హత్య
సూర్యాపేటటౌన్: సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇరవై ఏళ్ల క్రితం తన తండ్రి మిద్దె రవీందర్‌ను చంపాడనే కక్షతోనే ఆయన కుమారుడు మిద్దె జీవన్తోటు మరో ఐదుగురు కలిసి చింతలపాటి మధును హత్య చేసినట్టు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ కేసు వివరాలను సోమవారం ఎస్పీ విలేకరులకు వెల్లడించారు. చింతలపాటి మధు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య మౌనిక సూర్యాపేట టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా.. శనివారం తెల్లవారుజామున యర్కారం శివారులోని కల్వర్టు కింద గోనె సంచిలో మధు మృతదేహాన్ని గుర్తించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాళ్లగడ్డలోని ఓ ఇంట్లో హత్య జరిగినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. సోమవారం ఉదయం విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై టేకుమట్లలో ప్రధాన నిందితుడు మిద్దె జీవన్‌తోపాటు మిద్దె ఆనంద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కుట్ర బయటపడింది.మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగా..: 2007లో అప్పటి యర్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య జరగ్గా.. ఆ కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో రవీందర్ కుమారుడు మిద్దె జీవన్ తన తండ్రిని హత్య చేసిన మధును ఎలాగైనా చంపాలనుకున్నాడు. జీవన్ తన స్నేహితులు చింత సైదులు, మేదరి ప్రసాద్‌ల సాయం తీసుకున్నాడు. శుక్రవారం దావత్ ఉందని చెప్పి మధును సైదులు, ప్రసాద్ తాళ్లగడ్డలో సైదులు అద్దెకు తీసుకున్న ఇంటికి పిలిపించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే మద్యం సేవించారు.మధు మద్యం మత్తులో ఉండగా.. జీవన్‌తోపాటు మిద్దె ఆనంద్ అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన వెంటనే ప్రసాద్ మధు చేతులు, కాళ్లు పట్టుకోగా.. మటన్ కొట్టే కత్తితో సైదులు మధుపై దాడి చేశాడు. వెంటనే ఆ కత్తిని తీసుకున్న జీవన్ మధు మెడ, ముఖం, భుజాలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం మధు మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి యరా>్కరం శివారులోని కల్వర్టు కింద పడేశారు. మధు బైక్‌ను మరో ప్రాంతంలో వదిలేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, సెల్ఫోన్లను అడివెంల సమీపంలోని కాల్వలో పడేసి పరారయ్యారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, కారు, బైక్, ఐదు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. భవాని పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. -
లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
హైదరాబాద్: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబాడిగూడాకు చెందిన వినయ్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టినట్లు గుర్తించారు పోలీసులు. దీనిలో భాగంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ హత్య కేసుకు సంబంధించి వినయ్‌తో సహా నలుగుర్ని అరెస్ట్ చేశారు. కాగా, శనివారం(మే 23వ తేదీ) నగరంలోని మాసబ్‌ట్యాంక్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీని ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అడ్వకేట్ హత్యలో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మసబ్ ట్యాంక్ పరిధిలో దారుణహత్యకు గురైన అడ్వకేట్ మెుయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక ఆదారాలు సేకరించారు. అడ్వకేట్ హత్యలో ఆరుగురు నిందితులు పాల్గొన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ హత్యకు వాడింది స్కార్పియో వాహనంగా గుర్తించి ఆ యజమానిని ప్రశ్నించారు. అయితే ఆ వాహనాన్ని ఆరునెలల క్రితమే తాను వేరే వ్యక్తులకు అమ్మానని కానీ కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని యజమాని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ వాహనం ఎవరు కొనుగోలు చేసిన వ్యక్తి ఏవరా అనే విషయం పోలీసులు విచారణ చేస్తున్నారు.కాగా నిన్న( శనివారం) మాసబ్‌ట్యాంక్ పరిధిలో ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ నేత వల్లే మా తండ్రి చనిపోయాడు!
-
‘ఆర్జీ కర్’ పూర్వాపరాలను తేల్చేందుకు సిట్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్జీ కర్ బోధనాస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో కేసు పూర్వాపరాలు, కీలకాంశాలను బయటితీసే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటుచేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు ఆదేశాలిచ్చింది. 2024 ఆగస్ట్ 9వ తేదీ రాత్రి విధులు ముగించుకుని పీ ట్రైనీ వైద్యురాలు భోజనం చేసింది మొదలు రేప్, హత్య, సాక్ష్యాధారాలను ధ్వంసంచేయడం, మృతదేహానికి పోస్ట్‌మార్టమ్, అంత్యక్రియల దాకా జరిగిన క్రమంలో దర్యాప్తులో ఇప్పటిదాకా వెలుగులోకిరాని అంశాలను తెల్సుకునేందుకు సీబీఐ సిట్ రంగంలోకి దిగుతుందని జస్టిస్ షాంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్‌ల హైకోర్టు డివిజన్ బెంచ్ తన ఉత్తర్వులో పేర్కొంది. 2025 మార్చి 28వ తేదీన అందిన నివేదికలో తీవ్రమైన లోపాలున్నాయని, వాటిని నిగ్గుతేల్చేందుకే సిట్ ఏర్పాటుచేశామని ధర్మాసనం వెల్లడించింది. సీబీఐ ఈస్ట్ జోన్ జాయింట్ డైరెక్టర్ సారథ్యంలో సిట్ పనిచేస్తుందని, సిట్‌లో ఇతర సభ్యుల పేర్లను 48 గంటల్లోపు ఖరారుచేస్తామని కోర్టు తెలిపింది. దర్యాప్తు పూర్తిచేసి జూన్ 25వ తేదీలోపు సిట్ తన నివేదికను కోర్టుకు సమరి్పంచాల్సి ఉంటుంది. వైద్యురాలిని రేప్‌చేసి చంపేసిన నిందితుడు, పౌర వలంటీర్ సంజయ్‌రాయ్‌కు ఇప్పటికే జీవితఖైదు పడింది. హేయమైన హత్యోదంతంలో సాక్ష్యాధారాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసంచేశారని, హత్య విషయాన్ని తొలుత తమకు తెలియజేయలేదని, హడావుడిగా సృష్టించి కేసు తీవ్రతను పోలీసులు, ఆస్పత్రి అధికారులు తగ్గించే ప్రయత్నంచేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘‘హత్యోదంతంలో పోలీసులు, ఆస్పత్రి యాజమాన్యం తప్పిదాలతోపాటు తీవ్ర నిర్లక్ష్యపూరిత వైఖరి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఆరోపణలను నివృత్తిచేసేందుకు సిట్ దర్యాప్తు అక్కరకొస్తుంది’’అని ధర్మాసనం అభిప్రాయపడింది. -
భర్తను హత్య చేసిన భార్యకు కేవలం రూ. 500 ఫైన్, ఎందుకలా?
భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్తను కత్తితో పొడిచి చంపేసింది భార్య. ఈకోర్టును విచారించిన కింది కోర్టు ఆమెకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను తెలంగాణా హైకోర్టు రద్దు చేసి కేవలం రూ. 500 జరిమానాగా తగ్గిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అసలేం జరిగింది? కేసు నేపథ్యం ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలోకేసు నేపథ్యంకోర్టు రికార్డుల ప్రకారం.. భార్య పిల్లలు, పుట్టింట్లో ఉండగా భర్త తన పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని అత్తగారింటికి వచ్చాడు. ఇక్కడ దంపతుల మధ్య అకస్మాత్తుగా ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత బైటికెళ్లిపోయాడు. కాసేపటికి ఒంటిపై బట్టలు లేకుండా (దిగంబరంగా) తిరిగి వచ్చాడు. అంతేకాదు భార్యను, ఆమె కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు దిగాడు. ఈ తీవ్ర ఘర్షణ మధ్యలో ఆగ్రహం తట్టుకోలేక ఆ మహిళ కత్తి తీసుకుని అతడిని పొడిచింది. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు.మొదట పోలీసులు ఈ కేసును ఐపీసీ సెక్షన్ 302 (IPC Section 302) కింద హత్యగా నమోదు చేశారు. అయితే, విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. ఇది కావాలని అనుకుని ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కాదని తేల్చింది. చంపాలనే ఉద్దేశం ఆమెకు లేదని భావించి, దీనిని సెక్షన్ 304 పార్ట్-II కిందకు మార్చింది. దీని కింద ఆమెకు నాలుగేళ్ల కఠిన శిక్ష, రూ. 500 జరిమానా విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 300లోని 'ఎక్సెప్షన్ 4' (Exception 4 to Section 300 IPC) ను పరిగణనలోకి తీసుకుని ఆమె జైలు శిక్షను రద్దు చేసింది.ఎక్సెప్షన్ 4 అంటే ఏమిటి?ముందస్తు ప్రణాళిక లేకుండా, ఆవేశంలో, అప్పటికప్పుడు జరిగిన గొడవ వల్ల ఒక వ్యక్తి మరణిస్తే.. అలాగే నిందితుడు ఎలాంటి అక్రమ ప్రయోజనం పొందకుండా, క్రూరంగా లేదా అసాధారణంగా ప్రవర్తించకుండా ఉంటే, ఆ మరణాన్ని 'హత్య' (Murder) గా పరిగణించకూడదు. మహిళ పథకం ప్రకారం కాకుండా, ఆ క్షణంలో జరిగిన గొడవ వల్ల తీవ్ర ఆవేశంతో (Heat of passion) ఆ ఘర్షణలో అలా ప్రవర్తించిందని కోర్టు పేర్కొంది. కత్తితో పొడవడం వల్ల ప్రాణాలు పోతాయనే కనీస జ్ఞానం (Knowledge) ఆమెకు ఉంటుందని భావించి సెక్షన్ 304 పార్ట్-II కింద నేరాన్ని సమర్థించినప్పటికీ.. ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా శిక్ష విషయంలో మానవతా దృక్పథంతో ఉదారత చూపవచ్చని కోర్టు అభిప్రాయపడింది.జైలు శిక్ష పూర్తిగా ఎందుకు రద్దైంది?క్రింది కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షపై మహిళ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఆ సమయంలో ఘటన జరిగిన పరిస్థితులను, ఆమె ఎదుర్కొన్న మానసిక క్షోభను హైకోర్టు నిశితంగా పరిశీలించింది. ఆమెకు ఇకపై ఎలాంటి అదనపు జైలు శిక్ష విధించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. క్రింది కోర్టు విధించిన రూ. 500 జరిమానాను ఆమె అప్పటికే చెల్లించి ఉండటంతో, కేవలం ఆ జరిమానానే శిక్షగా మార్చి ఆమెను విడుదల చేసింది.అంటే, గొడవలో హత్య చేయడం ఎల్లప్పుడూ క్షమించదగినదేనా? కానే కాదు... గొడవల్లో లేదా వాదనల్లో జరిగే ప్రతి హింసను భారతీయ చట్టం క్షమించదు. ఉద్దేశం, ప్రణాళిక, ఉపయోగించిన ఆయుధం యొక్క స్వభావం, దాడి తీవ్రత, నిందితుడు క్రూరంగా ప్రవర్తించాడా లేదా వంటి అంశాలను న్యాయస్థానాలు నిశితంగా పరిశీలిస్తాయి. ఒకవేళ కోర్టుకు చంపాలనే స్పష్టమైన ఉద్దేశం లేదా ముందస్తు ఏర్పాట్లు ఉన్నట్లు ఆధారాలు దొరికితే.. అది ఐపీసీ సెక్షన్ 302 కింద 'హత్య'గానే పరిగణించబడుతుంది. దానికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష వంటి కఠినమైన శిక్షలు ఉంటాయి. -
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనడా నుంచి వచ్చి కిడ్నాప్- హత్య
పంజాబ్‌లో లేడీ సింగర్ హత్య ఉదంతం సంచలనం సృష్టించింది. యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్ (29) మృతదేహాన్ని ఆరు రోజుల తర్వాత పోలీసులు నీటి కాలువలో గుర్తించారు. మే 13న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇందర్ కౌర్.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మృతదేహం లభించడంతో అసలేం జరిగిందనే విషయాలు బయటకొచ్చాయి.(ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే)హత్యకు గురైన ఇందర్ కౌర్ సోదరుడు జోటిందర్ సింగ్ ఫిర్యాదు ప్రకారం.. ఇందర్ మే 13న రాత్రి 8:30 గంటలకు కారులో సరుకులు కొనుగులు చేసేందుకు వెళ్లింది. కాసేపటి తర్వాత నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. అయితే ఈమె కనిపించకపోవడం వెనక మోగా జిల్లాకు చెందిన సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మూడేళ్ల క్రితం ఇందర్ కౌర్‌కి ఇన్ స్టా ద్వారా సుఖ్విందర్ సింగ్ పరిచయమయ్యాడు. ప్రేమ పేరిట పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయిందని తెలుసుకున్న ఇందర్ కౌర్, సుఖ్విందర్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు.. ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసుల దర్యాప్తు ప్రకారం.. కెనడాలో ఉంటున్న సుఖ్విందర్, నేపాల్ గుండా పంజాబ్‌కి చేరుకున్నాడు. 13వ తేదీన తన సహచరులతో కలిసి ఇందర్ కౌర్ కారుని అడ్డగించి తుపాకీతో బెదిరించి ఆమెని కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆమెని హత్య చేసి నీటి కాలువలో పడేశాడు. నేరం చేసిన వెంటనే నేపాల్ ద్వారానే తిరిగి కెనడాకి పారిపోయాడని తెలుస్తోంది.అయితే ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇందర్ కౌర్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15వ తేదీనే జమాల్పూర్ పోలీస్ స్టేషన్లో సుఖ్విందర్ సింగ్, కరమ్‌జిత్ సింగ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇందర్ కౌర్ మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. నిందితులని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదు.. కొత్త తెలుగు సినిమా) -
ఆస్తి కోసం తల్లీకూతుళ్ల దారుణ హత్య
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్‌గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. -
నమ్మకంగా నయవంచన
సాక్షి, హైదరాబాద్: ఒంటరి వృద్ధ జంటల్ని, ఒకవేళ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నా..వారు ఇంట్లో లేని సమయంలో వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వృద్ధులకు అవసరమైన సపర్యలు చేసేందుకు ఇళ్లల్లో పని మనుషులుగా, కేర్ గివర్స్‌గా, కేర్ టేకర్స్‌గా చేరుతున్న ఇతర రాష్ట్రాలవారు, నేపాల్ వంటి దేశాలకు చెందినవారిలో కొందరు నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు. ఆభరణాలు దొంగిలించి పరారవుతున్నారు. ఈ క్రమంలో అవసరమైతే వృద్ధుల ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. పోలీసులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇలాంటి వారి విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు వయో వృద్ధులకు వైద్య సహాయకులను, వ్యక్తిగత సేవకులను అందజేసే నెపంతో ఊరూ పేరు లేని కేర్ గివర్స్ ఏజెన్సీలు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఏ విధమైన చట్టబద్ధత, గుర్తింపు లేని ఇలాంటి సంస్థల ద్వారా అటెండెంట్లు, పని మనుషులుగా చేరుతున్న వారు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని విధాలుగా చట్టబద్ధమైన గుర్తింపు కలిగిన కేర్ గివింగ్ ఏజెన్సీలు 80 వరకు ఉన్నట్లు అనధికార అంచనా. కానీ ఏ గుర్తింపు లేని సంస్థలు మాత్రం వందల సంఖ్యలోనే ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వణికించిన ఉదంతాలు పదవీ విరమణ చేసిన పోలీసు ఉన్నతాధికారి భార్యను నేపాలి ముఠా హతమార్చి దోపిడీకి పాల్పడిన ఘటన మరిచిపోకుండానే జవహర్‌నగర్ పరిధిలోని కౌకూర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో ఇలాంటిదే మరో ఉదంతం చోటుచేసుకుంది. పని మనుషులుగా చేరిన నేపాలీ భార్యాభర్తలు కొంతకాలం నమ్మకంగా ఉంటున్నట్టు నటించి పక్కా పథకం ప్రకారం వృద్ధ దంపతులను బంధించి ఇల్లంతా దోచుకెళ్లారు.ఈ సంఘటనలో ఆ నేపాలీ గ్యాంగ్‌ను వృద్ధ దంపతులు ఏవిధంగానూ ప్రతిఘటించక పోవడంతో వారు బతికి బట్టకట్టారు. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ సంఘటనలే కాకుండా నగరంలో తరచుగా ఎక్కడో ఒకచోట ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెలిసిన వారి ద్వారా లేదా రకరకాల ఏజెన్సీల ద్వారా పని మనుషులు, కేర్ టేకర్లు, అటెండెంట్లుగా చేరుతున్నవాళ్లు కొన్ని సందర్భాల్లో రెండు, మూడు సంవత్సరాల పాటు నమ్మకంగా పని చేసి ఆ తర్వాత దురాగతాలకు పాల్పడుతున్నారు. ఏజెన్సీల ద్వారా చేరి.. వయోభారం, అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన వృద్ధులకు డైపర్లు మార్చడం, స్నానం చేయించడం, వేళకు మందులు ఇవ్వడంతో పాటు నర్సింగ్ విధులు నిర్వహించేందుకు కేర్ గివర్స్‌ను నియమించుకుంటారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేవారు, 12 గంటల పాటు పని చేసేవారు, లేదా ఉదయం, సాయంత్రం మాత్రమే వచ్చి సపర్యలు చేసేవారు ఏజెన్సీల ద్వారా అందుబాటులో ఉంటూ అవసరమైన వారివద్ద విధుల్లో చేరుతున్నారు.ఇందుకోసం రూ.15000, రూ.25000, రూ.30,000 చొప్పున ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. హెల్పేజ్ ఇండియా సంస్థ అధ్యయనం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 10 లక్షల మంది ఒంటరి వయోధికులు లేదా వృద్ధులైన భార్యాభర్తలు ఈ రకమైన సేవలను వినియోగించుకుంటున్నారు. పిల్లలు విదేశాల్లో ఉన్న కొందరు వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతుండగా, మరి కొందరు ఇళ్లల్లోనే పని మనుషులను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వీరిలో కొందరు నమ్మక ద్రోహులుగా మారుతున్న వారి బారిన పడుతున్నారు. పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి సపర్యల విషయం అలా ఉంచితే నిస్సహాయులైన వయో వృద్ధులను ఈ ‘పని మనుషులు’అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు, ఫిర్యాదులు అనేకం ఉన్నాయని హెల్పేజ్ ఇండియా ప్రతినిధి శ్యామ్ వెల్లడించారు. ఒంటరి వయోధికులు ఉండే ఇళ్లపై పోలీసులు ప్రతిరోజూ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని, వృద్ధుల వద్ద తమ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచిస్తున్నారు. అమలుకు నోచని సంక్షేమ చట్టం ⇒ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ (2007) ప్రకారం వృద్ధుల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. ఈ చట్టంలోని సెక్షన్ 21 (2) ప్రకారం వృద్ధులకు సేవలు అందించే గృహ సేవకులు, కేర్ గివర్లు, అటెండెంట్లు, ఏజెన్సీలు, ఇతర సంస్థలు స్థానిక పోలీస్‌స్టేషన్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పత్రాన్ని తీసుకోవాలి. ⇒ నగరంలో ప్రస్తుతం వృద్ధుల సంరక్షణ, హోమ్ నర్సింగ్, హోమ్ కేర్ సేవలు అందించేందుకు అనేక ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిపై ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. వీరికి సంబంధించి ఎలాంటి గణాంకాలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ⇒ చాలావరకు హోమ్ కేర్, హోమ్ హెల్త్ కేర్ సంస్థలుగా పనిచేస్తున్నాయి. అయితే ఇలాంటి ఏజెన్సీల కోసం ప్రత్యేకంగా నియంత్రణ చట్టం లేదా లైసెన్సింగ్ వ్యవస్థ వంటివి లేకపోవడం గమనార్హం. అలాంటి వారికి ఇవి తప్పనిసరి.. ⇒ ఇళ్లల్లో పనిచేసే గృహ కారి్మకులు మొదలుకొని కేర్ గివర్స్ వరకు ఎవరైనా సరే వయోధికుల కోసం విధుల్లో చేరాలంటే తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ⇒ చట్టం ప్రకారం ప్రతి కేర్ గివర్కు ఆధార్ గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, వైద్యులు అందించే ఫిట్నెస్ ధ్రువీకరణ వంటి అర్హతలకు సంబంధించిన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి. ⇒ కొన్ని పేరొందిన సంస్థలు మాత్రమే కఠినమైన ధ్రువీకరణలు కలిగి ఉంటుండగా.. చిన్న స్థాయి ఏజెన్సీలు లేదా వ్యక్తిగతంగా కేర్ గివర్లను పంపించే వారు ఈ నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తున్నారు. ⇒ కుటుంబసభ్యులు కేర్గివర్ల పూర్తి ఆధారాలతో పాటు ఫొటోలు కూడా తీసుకుని పెట్టుకోవాలి. అలాగే సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం మంచిది. ⇒ కేర్గివర్లు లేదా వ్యక్తిగత సేవకులకు డెబిట్, క్రెడిట్ కార్డులు, పిన్ నంబర్లు, చెక్కులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. మెడికల్ రిపోర్ట్లు, ఆస్తి పత్రాలను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి.తస్మాత్ జాగ్రత్త ఎవరిని పడితే వారిని పనిలో పెట్టుకోకూడదు. సాధారణంగా దోపిడీలు, దొంగతనాలే లక్ష్యంగా పనిలో చేరేవారు 6 నెలల పాటు రెక్కీ నిర్వహిస్తారు. ఇంటి పరిసరాలను, ఇంటికి వచ్చి వెళ్లేవారిని గమనిస్తారు. ఏ సమయం అనుకూలమైందో నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత ఏ మాత్రం అనుమానం రాకుండా అవసరమైతే తమ ముఠా సభ్యులతో కలిసి పంజా విసురుతారు. దోపిడీలు, హత్యలకు పాల్పడుతారు. గత పదేళ్లుగా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. – గురజాడ శోభ, తెలంగాణ స్త్రీ సేవా సంస్థ -
చదువుల్లో టాపర్ కానీ ఏమి లాభం..? కన్నతల్లిని చంపేసిన కొడుకు
-
ఆర్జీ కర్ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ల సస్పెన్షన్
కోల్‌కతా: 2024లో సంచలనం రేపిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి దారుణ హత్యాచార ఘటన కేసును తిరిగిదోడుతామంటూ ఇచ్చిన ఎన్నికల హామీ అమలుకు సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ దారుణంపై ప్రాథమిక దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరిగ్గా దర్యాప్తు చేయలేదనే ఆరోపణలపై ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ శుక్రవారం సీఎం సువేందు అధికారి ఆదేశాలిచ్చారు. కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్, మాజీ డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన సెక్రటేరియట్లో ప్రకటించారు. వీరు కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేకపోవడమే కాదు, మృతురాలి తల్లిదండ్రులకు లంచం ఎరజూపారని తెలిపారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు, శాఖాపరమైన దర్యాప్తు నిర్ణీత వ్యవధిలోగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సంఘమిత్ర ఘోష్ ముగిస్తారని సీఎం సువేందు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం సీబీఐ జరుపుతున్న దర్యాప్తు, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. సీబీఐ కంటే ముందు, కోల్‌కతా పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తు దశలపై మాత్రమే ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వివరించారు. -
భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్ రాసింది.. కట్ చేస్తే!
ఊటా (Utah)కు చెందిన రచయిత్రి కౌరీ రిచిన్స్ (Kouri Richins) కేసు కీలక మలుపు తిరిగింది. తన భర్త ఎరిక్ రిచిన్స్‌ను విషమిచ్చి హత్య చేసిందన్న ఆరోపణలు దిగ్భ్రాంతి రేపాయి. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం మే 13, 2026న కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. అయితే ఆమే ఈ హత్య చేసిందనేందుకు పూర్తి సాక్ష్యాలు లేవు. కానీ కోర్టు కొన్ని ఆధారాలు ఆర్థిక కారణాల ఆధారంగ ఈ తీర్పు చెప్పింది. మరోవైపు ముగ్గురు కొడుకులు తల్లి దగ్గరికి వెళ్లాలంటే భయపడుతుండటం ఈ కేసులో మరో కీలక అంశం. అసలు కేసు ఏంటి?2013లో కౌరీ, ఎరిక్ వివాహం చేసుకున్నారు. ఆ సమయానికి, వారికి అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. అలాగే పెళ్లి రోజున వీరొక ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆరేళ్ల తరువాత 2019లో కౌరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. మొదట్లో లాభాలొచ్చినా, 2022 నాటికి ఆమె వ్యాపారం భారీ అప్పుల్లో మునిగిపోయిందని, ఆ అప్పులు తీర్చడానికి ఆమె భర్త అనుమతి లేకుండానే అతని ఖాతాల నుండి డబ్బు వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే 2020 నుంచే తన భార్య తన డబ్బును దుర్వినియోగం చేస్తోందని గ్రహించిన ఎరిక్, తన ఆస్తి తన పిల్లలకు చెందేలా 'ఎరిక్ రిచిన్స్ లివింగ్ ట్రస్ట్' అనే ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తన సోదరిని దానికి ట్రస్టీగా నియమించాడు. ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్ ‘ది స్కిన్ డాక్టర్’ కి షాక్ఎరిక్ రిచిన్స్‌ను ఎందుకు చంపింది? (ఆరోపణలు మాత్రమే)2023 మే 8న సమ్మిట్ కౌంటీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే తరహా ఆరోపణలతో విచారణ జరిగిన వారం తర్వాత ఆమె అదే నేరాన్ని పునరావృతం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. భర్త పానీయంలో విషం కలిపి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కౌరీ తన భర్తను చంపడానికి ప్రధాన కారణం ఆర్థిక లాభం అని ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు.కౌరీ వ్యాపారం మిలియన్ల డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది. పెళ్లి సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఎరిక్ చనిపోతే అతని కంపెనీ కౌరీకి చెందుతుంది. దీంతో ఎరిక్ పేరు మీదున్న భారీ భీమా సొమ్మును పొందేందుకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని సమాచారం.ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లికోర్టు పత్రాల ప్రకారం, కౌరీ తన భర్తకు ఫెంటానిల్ (Fentanyl) అనే శక్తివంతమైన మాదకద్రవ్యాన్ని ఇచ్చి విషప్రయోగం చేసింది. 2022 వాలెంటైన్స్ డే రోజున ఆమె ఎరిక్ ఇచ్చిన శాండ్విచ్లో విషం కలిపింది. అది తిన్న తర్వాత ఎరిక్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతను అనారోగ్యంగా భావించి నిద్రపోయాడు తన భార్య తనను చంపడానికి ప్రయత్నిస్తోందని అప్పట్లోనే ఎరిక్ తన స్నేహితుడితో చెప్పాడు. అయితే, ఆమె ఈ వాదనను ఖండించి, ఆ రోజు తాను కేవలం ఇద్దరి కోసం భోజనం ఆర్డర్ చేశానని, కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పటికీ, మామూలే అనుకొని నిద్రపోయాడని కోర్టులో చెప్పింది.మార్చి 4, 2022న కౌరీ తన భర్తకు ఒక కాక్టెయిల్ తయారు చేసి ఇచ్చింది. అందులో భారీ మోతాదులో ఫెంటానిల్ కలిపింది. ఆ రాత్రి ఎరిక్ చనిపోయాడు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎరిక్ రక్తంలో సాధారణ మరణానికి కారణమయ్యే మోతాదు (3 ng/ml) కంటే ఐదు రెట్లు ఎక్కువగా అంటే 15 ng/ml ఫెంటానిల్ ఉన్నట్లు తేలింది. ఈ కేసులో విచారణలో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.నేను నిర్దోషినిఅయితే, కౌరీ ఇప్పటికీ తాను నిర్దోషినని వాదిస్తోంది. తాను చేయని నేరానికి నిందించవద్దని, తన ముగ్గురు పిల్లల కోసం తానీ పోరాటాన్ని కొనసాగిస్తానని కోర్టులో ప్రకటించింది. మరోవైపు, ఆమె ముగ్గురు కుమారులు తమ తల్లి జైలు నుండి బయటకు రావడం ఇష్టం లేదని, ఆమె వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టుకు తెలిపారు. స్వయంగా రైటర్ అయిన కౌరీ భర్తను చంపి, ఆ తర్వాత అతని జ్ఞాపకార్థం 'Are You With Me?' అనే పుస్తకాన్ని కూడా కౌరీ రాయడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. -
పెళ్లైన నాలుగు రోజులకే దారుణం : బంగారు గొలుసు కోసం
బీహార్‌లో ఒక నవ వధువు కేవలం బంగారం గొలుసుకోసం పెళ్లైన నాలుగు రోజులకే ప్రాణాలు కోల్పోయింది. చాలా నెమ్మదస్తు రాలు, డిగ్రీ చదువుకుంది. సంప్రదాయబద్ధంగా నడుచుకునే పొందికైన అమ్మాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎవరిపైనా ఎప్పుడూ గట్టిగా మాట్లాడని సౌమ్యురాలు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కనేది. కానీ పెళ్లి, అత్తింటి వారి అత్యాశ ఆమె నూరేళ్ల కలల్ని కాలరాచింది. నవవధువు అన్న కనికరం కూడా లేకుండా అత్యంత పాశవికంగా హత్య చేయడమే కాదు, పుట్టింటి వారికి కనీసం చివరి చూపు కూడా దక్కకుండా మృతదేహం దహనం చేయడం కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.బీహార్‌కు చెందిన 23 ఏళ్ల సంజు కుమారికి, వినోద్ పాల్‌తో మే 7న ఘనంగా వివాహం జరిగింది. సంజు కుటుంబ సభ్యులు తమ ఆర్థిక శక్తికి మించి రూ. 4 లక్షల నగదు, మోటార్ సైకిల్, ఫ్రిజ్, ఫర్నిచర్,ఇతర బంగారు, వెండి ఆభరణాలను కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లి సమయంలో వరుడి పక్షం వారు ఒక బంగారు గొలుసు కావాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఇవ్వలేక పోయిన సంజు కుటుంబం, తర్వాత ఇస్తామని హామీ ఇచ్చింది. వధువు కుటుంబం బంగారు గొలుసు తప్ప అన్నీ 'బహుమతిగా' ఇచ్చింది. సంజు బంధువైన తమ తమ ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు పెట్టి మరీ ఏప్రిల్ 30న తిలక్ వేడుక మొదలు, హల్దీ వేడుక ఇలా అంగరంగ వైభవంగా, ఆడంబరంగా పెళ్లి చేశారు. కానీ ఏం లాభం అత్తింటి ఆరళ్లకు ఆమె బలైపోయింది.అత్తింట్లో ఉన్న నాలుగు రోజులు సంజును అత్తగారింటి వారు శారీరకంగా, మానసిక హింసకు గురిచేశారు. "ఇంత గొప్పగా పెళ్లి చేశారు కానీ ఒక బంగారు గొలుసు ఇవ్వలేకపోయారా?" అంటూ సూటిపోటి మాటలతో వేధించేవారు. నరకం చూపించారు. ఆమెను తన పుట్టింటి వారితో మాట్లాడనిచ్చేవారు కాదు. రహస్యంగా ఫోన్ కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, కొట్టే వారట. తనపై జరుగుతున్న ఈ వేధింపుల గురించి ఆ కొత్త వధువు తన కుటుంబానికి ఫిర్యాదు చేసింది. "అన్నా, ఇక్కడ చాలా హింసిస్తున్నారు. నాకు ఇక్కడ బాగోలేదు," అని అన్నతో వాపోయింది. అయితే పరిస్థితులు చక్కబడతాయిలే అని కుటుంబ సభ్యులు అనుకున్నారు.సోదరుడితో సంజు చివరి మాటలు మే 13న అమ్మాయికి పుట్టింటికి తీసుకురావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మే 11న సంజు సోదరుడు శివమ్ తన బావ వినోద్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా, వినోద్ తల్లి ఫోన్ లాక్కొని, "నీ చెల్లి ప్రాణాలతో రాదు, ఆమె శవమే వస్తుంది" అని బెదిరించింది. అదే సమయంలో వెనుక నుంచి సంజు అరుపులు వినిపించాయని శివమ్ ఆరోపించాడు.ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్‌షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?హత్య , హడావిడిగా అంత్యక్రియలు సంజును గొంతు నులిమి చంపేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి పోలీసులు వచ్చేలోపే అత్తగారింటి వారు ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు, అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో మే 12న కుటుంబ సభ్యులు స్మశానానికి చేరుకునేసరికి మృతదేహం దాదాపు కాలిపోయింది. కేవలం కొన్ని శరీర భాగాలు (కాళ్లు, పుర్రె భాగం) మాత్రమే మిగిలాయి.శివం ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు జగదీష్పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుశాంత్ కుమార్ మండల్ తెలిపారు. భర్త వినోద్ ,అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు. సంజు అత్త సుమిత్రా దేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారు గొలుసు విషయంలో గొడవ జరిగిన మాట నిజమేనని, అయితే సంజు ఆత్మహత్య చేసుకుందని ఆమె పోలీసు విచారణలో పేర్కొంది.పోలీసులు దీనిని హత్య, ఆత్మహత్య రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్న యువతి కలలు ఇలా వరకట్నపు విషజ్వాలలకు ఆహుతి కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను -
బెంగాల్ సీఎం సహాయకుని హత్య కేసులో బిగ్ ట్విస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) రంగంలోకి దిగి ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన షూటర్‌గా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన ‘రాజ్ సింగ్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.రాజ్ సింగ్ ఎవరు? బల్లియాలోని ఆనంద్ నగర్‌కు చెందిన రాజ్ సింగ్ స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. అఖిల భారత క్షత్రియ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే ఇతడి పేరు గతంలో ఒక కాల్పుల ఘటనలోనూ వినిపించింది. ప్రొఫెషనల్ షూటర్లతో సహా కనీసం ఎనిమిది మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్నోలో ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా, అయోధ్యలో రాజ్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, బిహార్‌లోని బక్సర్‌లో మయాంక్ మిశ్రా, విక్కీ మౌర్యాలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజ్‌ను తదుపరి విచారణ నిమిత్తం కోల్‌కతాకు తరలించారు.నా కొడుకు నిర్దోషి.. పోలీసులదే కుట్రతన కొడుకును ఈ కేసులో అకారణంగా ఇరికించారని రాజ్ సింగ్ తల్లి జామవంతి సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హత్య జరిగిన సమయంలో తాము ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నామని, 2026 మే 9 ఉదయం అయోధ్యలో గుడికి వెళ్లామని ఆమె ఆజంగఢ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. అయోధ్యలో ఐదుగురు వ్యక్తులు తన కొడుకును బలవంతంగా ఎత్తుకెళ్లి, ఆ తర్వాత బక్సర్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని ఆమె మండిపడ్డారు. తమకు కోల్‌కతాతో ఎలాంటి సంబంధం లేదని, అక్కడికి ఎన్నడూ వెళ్లలేదని పేర్కొన్నారు.ఫోన్ రికార్డులే సాక్ష్యం.. దర్యాప్తు ముమ్మరంరాజ్ సింగ్ లక్నోలో పెళ్లికి హాజరై, మార్కెట్లో షాపింగ్ చేసినట్లు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని తల్లి జామవంతి చెబుతున్నారు. ‘నా కొడుకుకు న్యాయం జరగాలి, మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ రికార్డులను పరిశీలిస్తే నిజాలు బయటపడతాయి’ అని ఆమె ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ దారుణాన్ని ముందస్తు కుట్రగా అభివర్ణించడంతో బెంగాల్ ఎస్టీఎఫ్, సీఐడీ, యూపీ, బీహార్ పోలీసుల సంయుక్త బృందాలు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేశాయి. -
నిందితులకు ఉరిశిక్ష వేయాలి యువన్ కుటుంబ సభ్యుల ఆవేదన
-
IPS భార్య హత్య కేసులో నిందితుల గాలింపు
-
53 ఏళ్ల రాధ వివాహేతర సంబంధం.. షాకింగ్ నిజాలు!
రాప్తాడు రూరల్: ఓ హత్య కేసు దర్యాప్తులో అంతకు ముందు చేసిన హత్య బయటపడడంతో పోలీసులు అవాక్కయ్యారు. వివరాలను రాప్తాడు సీఐ వెంకటేశులు శుక్రవారం వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం సిండికేట్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాధ (53), చెరుకూరి ఆదినారాయణ కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. రాధ కుమారుడు సందీప్‌కుమార్ చౌదరి తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. అలాగే కుమార్తె కూడా భర్తతో కలసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల రాధ, ఆదినారాయణ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో గత నెల 16న ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆదినారాయణ టవల్ తీసుకుని రాధ మెడకు బిగించి హతమార్చాడు. అనంతరం ఆమె మొబైల్ తీసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మరుసటి రోజు బెంగళూరులో ఉన్న రాధ కోడలికి, హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తెకు ఫోన్ చేసి రాధ మృతి చెందినట్లుగా తెలపడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో కుమారుడు సందీప్‌కుమార్ చౌదరి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆదినారాయణ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సిండికేట్ నగర్లో తచ్చాడుతుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసలు కథ వెలుగులోకి ఆదినారాయణను విచారణ చేయడంతో సంచనాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధం రాధ భర్త రవిచంద్రనాయుడు పసిగట్టి ఇద్దరినీ మందలించడంతో ఆదినారాయణ, రాధ ఇద్దరూ కలిసి 2025 మే 20న రాత్రి రవిచంద్రనాయుడిని హతమార్చారు. నిద్రలో ఉన్న సమయంలో ముఖంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పిల్లలను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. అప్పటి నుంచి రవిచంద్రనాయుడు హత్య ఉదంతం వెలుగు చూడలేదు. తాజా దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆదినారాయణపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రూరల్ తహసీల్దార్, వైద్యులు, అసిస్టెంట్ సైంటిఫిక్ టీం సమక్షంలో శుక్రవారం రవిచంద్రనాయుడు మృతదేహాన్ని వెలికితీయించి పంచనామా నిర్వహించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం అస్థికలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. -
భార్యను నడిరోడ్డుపై పొడిచి చంపిన భర్త..!
సూర్యాపేట జిల్లా: కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు భర్త. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ ఎదరుగా బుధవారం జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపలి్లకి చెందిన బత్తుల శిరీష(24), కోదాడ పట్టణ పరిధిలోని బాబునగర్‌కు చెందిన పాయిలి మణిదీప్ ఐదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో మణిదీప్ ఫిర్యాదు చేయడంతో..ఆ కేసు నిమిత్తం శిరీష తన పెద్దమ్మను తీసుకొని బుధవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. రాత్రి కావడంతో పోలీసులు గురువారం ఉదయం రమ్మని చెప్పడంతో శిరీష, ఆమె పెద్దమ్మ కలిసి ఏపీలోని జగ్గయ్యపేటకు వెళ్లేందుకు కోదాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆటోస్టాండ్ వద్దకు చేరుకున్నారు. జగ్గయ్యపేటకు వెళ్లే ఆటోలో ఎక్కి కూర్చున్న శిరీషను ఆమె భర్త కిందకు లాగి కత్తితో పొడిచే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. వారిని నెట్టేసి ఆమె ఛాతీలో నాలుగైదుసార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయింది. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి పెద్దమ్మ వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉలిక్కిపడిన కోదాడకోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జన సంచారం ఉండే బస్టాండ్ సెంటర్లో ఈ హత్య జరగడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. హత్య జరిగిన వార్త వాట్సాప్‌లో ప్రచారం కావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.Cctv record Kodad lo near rk tea stall daggara murder jarigindi https://t.co/JTyAE5Roen pic.twitter.com/jNWyrK3DTt— chintu (@MchintuM) May 7, 2026 -
పాత ఫొటో.. పక్కా స్కెచ్.. 24 ఏళ్లకు హంతకుడు పట్టివేత
ఎడచేరి: నేరస్తుడు ఎంతటి తెలివైన వాడైనా, చట్టం చేతికి చిక్కక తప్పదు అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. దశాబ్దాల క్రితం భార్యను దారుణంగా హత్య చేసి, అజ్ఞాతంలోకి వెళ్లిన ఒక హంతకుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. 24 ఏళ్ల పాటు పోలీసుల కళ్లుగప్పిన ఆ నేరస్తుడిని పట్టించింది ఒక పాత ఫోటో కావడం ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం.నెత్తురోడిన 2001 నాటి గతంకేరళలోని ఎడచేరి ప్రాంతానికి చెందిన జమీలా అనే మహిళ సెప్టెంబర్ 8, 2001న దారుణ హత్యకు గురైంది. ఆమె భర్త హమీద్ ఆమె తలపై బలంగా కొట్టి, గొంతు నులిమి అత్యంత క్రూరంగా ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం అప్పట్లో పోలీసులు ఎంత గాలించినా ఎలాంటి ప్రయోజనం లేక పోయింది, దర్యాప్తుకు అవసరమైన ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు.దర్యాప్తును మలుపు తిప్పిన పాత ఫోటోరెండు దశాబ్దాలకు పైగా అపరిష్కృతంగా మిగిలిపోయిన ఈ కేసు దర్యాప్తును పోలీసులు ఇటీవల తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడు హమీద్‌కు సంబంధించిన ఒక పాత ఫోటో దర్యాప్తు అధికారుల కంటపడింది. ఈ ఒక్క ఫోటో ఆధారంగానే దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, నిందితుడు కాసర్గోడ్ జిల్లాలోని అదూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తలదాచుకున్నట్లు గుర్తించి అతని కదలికలపై రహస్యంగా నిఘా ఉంచారు.చేపలు అమ్ముతూ దొరికిపోయిన కిల్లర్కేసులో పక్కా సమాచారం రాబట్టిన పోలీసులు చివరికి అతని ప్రస్తుత స్థావరాన్ని కనుగొన్నారు. హమీద్ ఇన్నేళ్లుగా అదూర్ సమీపంలోని బోవిక్కానంలో ఉంటూ, ఎవరికీ అనుమానం రాకుండా చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. అతని గుర్తింపు, నివాసాన్ని పక్కాగా నిర్ధారించుకున్న కోజికోడ్ పోలీసులు, 24 ఏళ్ల నిరీక్షణ తర్వాత అతనిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: పత్రికా స్వేచ్ఛ.. దాయాది కన్నా దిగువకు భారత్ -
ఖమ్మం రాము మర్డర్ కేసులో చిన్న కూతురు రితిక మృతి
-
ఖమ్మం రాము మర్డర్ కేసులో వీడని మిస్టరీ
-
34 ఏళ్ల మర్డర్ మిస్టరీ : క్షుద్ర పూజలు, భూత్ బంగ్లాలో ఎముకలు
అహ్మదాబాద్‌లోని వత్వా (Vatva) ప్రాంతంలో ఒక పాత "దెయ్యాల కొంప" (Haunted House) రహస్యం వెల్లడైంది. 32 ఏళ్ల క్రితం జరిగిన ఒక దారుణ హత్యను, క్షుద్రపూజలు గుట్టును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 1992 నాటి హత్యతో సంబంధం ఉన్న ఒక దెయ్యాల కొంపలో మానవ అవశేషాలు లభ్యం కావడంతో మిస్టరీ వీడింది.దర్యాప్తు అధికారులు అందించిన వివరాల ప్రకారం ముంబైకి చెందిన ఫర్జానా రాధన్పురి (40) ఆస్తి వివాదం కారణంగా 1992లో హత్యకు గురయ్యారు. ముఖ్యంగా తన ప్రియుడు షంసుద్దీన్ ఖేడావాలా ఆస్తిలో సమాన వాటా కావాలని ఆమె కోరడంతో వివాదం మొదలైంది. 1992లో జూలై లేదా ఆగస్టు నెలలో ఒక వర్షం కురిసిన రాత్రి, షంసుద్దీన్ తన సోదరుడు ఇక్బాల్, మరో అనుచరుడు అబ్దుల్ జవ్రావాలా సహాయంతో ఫర్జానాను గొంతు నులిమి చంపేశాడు. వాట్వాకు చెందిన అబ్దుల్ జవ్రావాలా ఆమె చేతులను పట్టుకోగా, కుతుబ్నగర్లోని మరో సహచరురాలైన షాలియాబీవి పఠాన్ ఇంట్లో జరిగినట్లు సమాచారం. ఆ తరువాత అందరూ కలిసి ఇంట్లో సెప్టిక్ ట్యాంక్‌ను తవ్వించి, ఆమె మృతదేహాన్ని అందులో వేసి మట్టి, ఇసుక, సిమెంట్‌తో పూడ్చిపెట్టారు. ఇక్కడితో కథ ముగిసిపోతుందనుకున్నారు. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. నిందితులను అపరాధభావం, భయం వెంటాడుతూ వచ్చాయి. దీనికి తోడు వరుస మరణాలతోఫర్జానా ఆత్మ తిరుగుతోందనే భయం నిందితుల్లో మొదలైంది.ముఖ్య నిందితుడు షంసుద్దీన్ 2015లో గుండెపోటుతో మరణించగా, మిగిలిన నిందితులు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. దీంతో కుటుంబ సభ్యుల్లో వణకు మొదలైంది. ఆమె శాపం వల్లే వీరంతా చనిపోతున్నారని కుటుంబ సభ్యులు, ఇతరులు నమ్మారు. ఉపశమనం పొందే ప్రయత్నంలో, వారు క్షుద్రపూజల్ని ఆశ్రయించారు. చివరికి ఆ ఇల్లు ఖాళీ అయిపోవడంతో ఆ ఇంటిని స్థానికులు "భూత్ బంగ్లా" అని పిలవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేరానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. నిందితుడి కుటుంబంలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన పరిణామమనని సీనియర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి పేర్కొన్నారు. ఆ కుటుంబ సభ్యులకు మృతురాలి గురించి పదేపదే ఏవేవో భ్రాంతులు రావడంతో, వారిలో తీవ్ర భయాందోళనలకు, మానసిక క్షోభకు దారితీసింది. దీన్నుంచి ఉపశమనం పొందే ప్రయత్నంలో, వారు క్షుద్రపూజలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే నేరానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.ఇదీ చదవండి: వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు!పోలీసుల ఎంట్రీఆత్మ శాంతి కోసం నిందితుల కుటుంబ సభ్యులు ఈఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారనే సమాచారం అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అందింది. దీనిని కేవలం మూఢనమ్మకంగా కొట్టిపారేయకుండా, పోలీసులు రహస్యంగా నిఘా పెట్టారు. 1992లో అక్కడ ఒక హత్య జరిగిందని, ఆ పాపం కడుక్కోవడానికే వారు ఈ పూజలు చేస్తున్నారని ఇన్ఫార్మర్ల ద్వారా నిర్ధారించు కున్నారు. బుధవారం ఉదయం క్రైమ్ బ్రాంచ్ బృందం ఆ పాడుబడిన ఇంటిపై దాడి చేసి, అనుమానిత స్థలంలో తవ్వకాలు చేపట్టింది. సాయంత్రానికి సుమారు 5-6 పళ్ళు, 7-8 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఫర్జానావేనని భావిస్తున్నారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత! -
మేఘాలయ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
షిల్లాంగ్: దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు తాజాగా అనూహ్య మలుపు తిరిగింది. 2025లో పెళ్లైన కొత్తలోనే భర్తను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీకి షిల్లాంగ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.పోలీసుల ఘోర వైఫల్యంకోర్టు విచారణలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. సోనమ్‌ను అరెస్టు చేసిన సమయంలో అందుకు గల ఖచ్చితమైన కారణాలను ఆమెకు వివరించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఆమెకు ఇచ్చిన అరెస్ట్ గ్రౌండ్స్ ఫారమ్‌లో చెక్ బాక్స్‌లు టిక్ చేయలేదు. పైగా డాక్యుమెంట్లలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)కు చెందిన సెక్షన్ 103(1) వంటి కఠినమైన హత్య అభియోగానికి బదులుగా, తప్పుగా సెక్షన్ 403(1) అని పేర్కొన్నారు.రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనఅరెస్టుకు గల కారణాలను నిందితురాలికి తెలియజేయకపోవడం ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ఉల్లంఘించినట్లయ్యిదని ఆమె తరపు న్యాయవాది వాదించారు. జూన్ 9, 2025న గాజీపూర్‌లో మొదటిసారి కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆమెకు కనీస న్యాయ సహాయం కూడా అందలేదనే విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తన తప్పిదం లేకుండానే విచారణ రెండు నెలల పాటు నిలిచిపోయిందని, విచారణ లేకుండా నిందితురాలిని నిరవధికంగా జైలులో ఉంచలేమని వాదనలు విన్న షిల్లాంగ్ అదనపు డీసీ (జుడీషియల్) డ్యాష్లీన్ ఆర్. ఖార్బ్టెంగ్, సోనమ్‌కు రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తు, ఇతర షరతులతో బెయిల్ మంజూరు చేశారు.అసలేం జరిగిందంటే?మే 20న ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ, సోనమ్ దంపతులు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లగా, మే 23న అదృశ్యమయ్యారు. వారం రోజుల గాలింపు తర్వాత జూన్ 2న సోహ్రాలోని ఒక లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. అనంతరం సోనమ్ గాజీపూర్‌లో లొంగిపోయింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురు కిరాయి హంతకులు (విశాల్ సింగ్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మీ)తో కలిసి ఆమె ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ‘సిట్’ 790 పేజీల ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. సోనమ్‌కు బెయిల్ వచ్చినప్పటికీ, మిగతా నిందితులు ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్ నిజమేనా? ‘ఈసీఐ’ ఏమంటోంది? -
అందుకే కిరణ్‌కు నిప్పంటించా!
ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని వెస్ట్రన్ స్టయిల్లో ప్రపోజ్ చేస్తానంటూ కుర్చీకి కట్టేసి మరీ తగలబెట్టి చంపేసింది ఓ ప్రియురాలు. ఈ కేసు దేశవ్యాప్తంగా.. అందునా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనతో వివాహానికి కిరణ్ ఒప్పుకున్నాడని నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ చెబుతోంది.బెంగళూరులో ప్రియున్ని తన ఇంట్లో కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితురాలు ప్రేమ అలియాస్ ప్రేరణ నెమ్మదిగా నిజాలు బయటపెడుతోంది. కిరణ్‌ను తాను చాలా ప్రేమించేదాన్నని, అయితే అతడు మాత్రం శారీరక అవసరాలు తీర్చే వస్తువుగా తనను భావించేవాడని అంటోంది.వారం కిందట(21 ఏప్రిల్) బెంగళూరు శివారులోని బైదరహళ్లి పీఎస్ పరిధిలోని అంజనానగర్లో ఈ దారుణం జరిగింది. తుమకూరుకు చెందిన కిరణ్.. నగరంలోని ఓ మొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ప్రేమ(ప్రేరణ)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత.. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాంట్, షర్ట్ ఊడదీసి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం కాళ్లు, చేతులూ కట్టేసింది.ఆ సమయంలో కిరణ్ కంగారుపడ్డాడు. అయితే.. పాశ్చాత్య దేశాల్లో ఇలాగే చేస్తారని, తానూ అలా వినూత్నంగా ప్రేమను వ్యక్తం చేస్తానని (Love Proposal) నమ్మించింది. ఆ వెంటనే కిరోసిన్ పోసి నిప్పటించి తన మొబైల్లో రికార్డు చేసింది. స్థానికులు వచ్చేలోపే హాహాకారాలు చేస్తూ కుర్చీలోనే కిరణ్ సజీవదహనమయ్యాడు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూమ్లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె తీరుపై అనుమానంతో పోలీసులు గట్టిగా విచారించారు. దీంతో పథకం ప్రకారమే ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.నార్త్‌వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ నేతృత్వంలోని టీం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించింది. తొలుత దూరం పెడుతున్నాడనే అతన్ని హత్య చేసిందని అంతా భావించారు. అయితే.. ‘‘కిరణ్‌ను తాను ఎంతో ప్రేమించానని.. కానీ, అతను తనను ఎంతో అవమానించేవాడని ప్రేమ పోలీసుల వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. ‘కిరణ్ నన్ను శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నాడన్న విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. పెళ్లి చేసుకుందామని అడిగా. ‘నువ్వు కులం తక్కువదానివి.. మా ఇంట్లో ఒప్పుకోరు’ అనేవాడు. ఈ విషయం ప్రేమించినప్పుడు.. కలిసి తిరిగినప్పుడు తెలియదా? అని గట్టిగా నిలదీశా. దీంతో పెద్దల్ని ఒప్పించి ఎలాగోలా వివాహం చేసుకుంటానన్నాడు. అయితే.. పెళ్లి తర్వాత కూడా కేవలం శారీరక అవసరం కోసమే తనతో ఉంటానని చెప్పేవాడు. ఆ మాట నాతోనే కాదు.. అతని స్నేహితుల వద్ద చెబుతూ నన్ను బూతులు తిట్టేవాడు. ఆ విషయం అతని స్నేహితులు రికార్డ్ చేసి పంపారు. నన్ను వాడుకుంటూ నన్నే తిట్టడం, అవమానించడం ఎంతో బాధించింది. భరించలేకపోయా.. అందుకే నిప్పు పెట్టి చంపేశా’’ అని పోలీసుల ముందు ప్రేరణ కన్నీళ్లతో నిజం ఒప్పుకుంది. -
‘దీదీ రాజ్యంలో ప్రజాస్వామ్యం ఖూనీ’.. రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గూండారాజ్ నడుస్తోందని ఆరోపించారు.దారుణ హత్య.. ఆవేదనలో రాహుల్అసన్సోల్లో కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న దేబ్దీప్ ఛటర్జీ అనే కార్యకర్తను పోలింగ్ అనంతరం కొందరు దుండగులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఉదంతంపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. ఇదొక అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఛటర్జీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, అధికార టీఎంసీ పార్టీకి చెందిన గూండాలే పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. कांग्रेस के कार्यकर्ता देबदीप चटर्जी की चुनाव बाद TMC से जुड़े गुंडों द्वारा की गई हत्या बेहद निंदनीय है। शोकाकुल परिवार के प्रति मेरी गहरी संवेदनाएँ।पश्चिम बंगाल में आज लोकतंत्र नहीं, TMC का गुंडा राज चल रहा है। वोट के बाद विरोधी आवाज़ों को डराना, मारना, मिटाना - यही TMC का… https://t.co/kQn4T9deL0— Rahul Gandhi (@RahulGandhi) April 26, 2026ప్రజాస్వామ్యం కాదు.. గుండారాజ్బెంగాల్లో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, కేవలం టీఎంసీ గూండాల రాజ్యమే నడుస్తోందని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటింగ్ ముగిశాక ప్రత్యర్థుల గొంతు నొక్కడం, దాడులు చేయడం, భయభ్రాంతులకు గురిచేయడమే టీఎంసీ నైజంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హింసను ప్రోత్సహించలేదని, తాము రాజ్యాంగబద్ధమైన మార్గంలోనే నడుస్తామని అన్నారు. ఇదే తమ వారసత్వం, సంకల్పం అని ఆయన పేర్కొన్నారు.కఠిన శిక్ష పడాల్సిందేఈ హత్యాకాండకు పాల్పడిన దోషులను తక్షణమే అరెస్టు చేసి, అత్యంత కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. బాధితుని కుటుంబానికి పూర్తి భద్రత కల్పించడంతో పాటు తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. అసన్సోల్ నార్త్ అభ్యర్థి ప్రసేన్‌జిత్ పుటండికి అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న దేబ్దీప్పై టీఎంసీ అనుబంధ దుండగులే ఈ దారుణ దాడికి పాల్పడ్డారని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతదేశ అహింసా సిద్ధాంతానికి మచ్చ తెస్తున్న ఇటువంటి నీచ రాజకీయాలకు తాము తలొగ్గేది లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ.. ప్రధాని మోదీ గుడ్‌న్యూస్ -
అమెరికాలో పీహెచ్డీ విద్యార్థుల దారుణ హత్య!
అమెరికాలో గత వారం అదృశ్యమైన బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు పీహెచ్ విద్యార్థుల కేసు విషాదంగా మారింది. ఈ ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా ఈ ఇద్దరిని హత్య చేసిన వ్యక్తి వారి రూమ్మేట్ కావడం గమనార్హం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయంలోకి వెళితే.. బంగ్లాదేశ్‌కు చెందిన జమీల్ లిమోన్, నహీదా బ్రిస్టీలు అమెరికాలోని సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో పీహెచ్ చేస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి కనిపించకుండా పోయారు. అంతకుముందు రోజు వీరిద్దరూ యూనివర్సిటీ క్యాంపస్‌లో చివరిసారిగా కనిపించారు. తాజాగా టంపా బే వంతెనపై యువకుడి మృతదేహం గుర్తించగా, బ్రిస్టీ ఆచూకీ లభ్యం కాలేదు.అయితే, ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం ఆమె కూడా మరణించినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్‌లోని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాగా ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరో విద్యార్థి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
42 ఏళ్ల న్యాయపోరాటం... 100 ఏళ్ల వయసులో ముగింపు
‘న్యాయంలో జాప్యం న్యాయ నిరాకరణతో సమానం’ అని న్యాయ కోవిదులు చెబుతుంటారు... న్యాయం ఆలస్యం అయినా.. సుదీర్ఘకాలం ఎదురుచూసినా.. చివరకు తమకు న్యాయం దక్కింది.. అదే చాలని ఓ కుటుంబం సంతోషపడుతోంది.. కానీ ఆ సంతోషం వెనుక 42 ఏళ్ల నిరీక్షణ ఉంది.. కాలం మాటున కరిగిపోయిన ఓ వ్యక్తి జీవితం దాగుంది. మధ్య వయసులో నిందితుడిగా ఆ వ్యక్తిపై ముద్ర పడింది. కోర్టు జీవితఖైదు విధించింది. బెయిల్ వచ్చినా ‘పంజరం’ బతుకైంది. కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. స్వేచ్ఛ లభించింది. కానీ, జీవితాన్ని అనుభవించడానికి వయసు, ఒంట్లో సత్తువ రెండూ మిగల్లేదు. కాలం వెనక్కి రాదు. అంతే కాదు, మరో విషాదమూ ఉంది.. ‘నేను ఏ నేరమూ చేయలేదు. నా కేసు కొట్టేశారు. నేను నిరపరాధిని’ అని సంతోషించేందుకు ఆ వ్యక్తికి జ్ఞాపకశక్తి లేదు.. ఎవరైనా చెబితే వినేందుకు వినికిడి శక్తీ మిగల్లేదు. 42 ఏళ్ల నిరీక్షణకు... 100 ఏళ్ల వయసులో కోర్టు ముగింపు పలికింది. ఆలస్యంగానైనా న్యాయం దక్కింది. నిందితుడనే మచ్చ తొలగింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లా భువ్సీ గ్రామంలో భూ వివాదం ఓ వ్యక్తికి హత్యకు దారి తీసింది. పోలీసులు ముగ్గుర్ని నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు పత్తా లేకుండా పోయాడు. మరో నిందితుడు అప్పీలు విచారణలో ఉండగానే చనిపోయాడు. సజీవంగా ఉన్న వ్యక్తి న్యాయం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూశాడు. జీవిత చరమాంకంలో నిర్దోషిగా కేసు నుంచి బయటపడ్డాడు. హత్యకు దారి తీసిన భూ వివాదం1982 ఆగస్టు 9న రాజుభయ్యా, అతని సోదరుడు గునువా చెరువు నుంచి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన మైకు, సత్తి్తదిన్, ధనీరామ్ ఎదురుపడ్డారు. గతంలో తన తుపాకీని లాక్కున్నాడని, తన భూమిని ఆక్రమించాడనే కోపం మైకులో ఉంది. ఇదే అదనుగా భావించి అతడిపై కాల్పులు జరిపాడు. తుపాకీ గుండు శరీరంలోకి దూసుకెళ్లింది. గునువా నేలకొరిగాడు. సత్తి్తదిన్, ధనీరామ్ చేతుల్లోనూ ఈటె, గొడ్డలి ఉన్నాయి. కాల్పుల శబ్దానికి చుట్టుపక్కల వారు రావడంతో ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు–శిక్ష ఖరారుమైకు, సత్తిదిన్, ధనీరామ్లపై కేసు నమోదైంది. మైకు పరారయ్యాడు. ధనీరామ్ కోర్టులో లొంగిపోయాడు. 1984 జూన్‌లో హమీర్పూర్ అదనపు సెషన్స్ కోర్టు ఐపీసీ సెక్షన్ 302, సెక్షన్ 34 కింద దోషులుగా తేల్చి సత్తిదిన్, ధనీరామ్లకు జీవిత ఖైదు విధించింది. అదే ఏడాది ధనీరామ్‌కు బెయిల్ మంజూరైంది. అలహాబాద్ కోర్టులో అప్పీలులోయర్ కోర్టు విధించిన శిక్షపై ఇద్దరు నిందితులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. అప్పీలు దశలోనే సత్తిదిన్ మృతి చెందాడు. ధనీరామ్ ఒక్కడే మిగిలాడు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఈ కేసు నడిచింది. ఇద్దరు సాక్షులను కోర్టు మరోసారి విచారించింది. కేసు పత్రాలన్నీ పరిశీలించింది. సాక్ష్యాలు.. ఎఫ్ఐఆర్లో తేడాలు కేసులో ప్రధాన సాక్షి రాజుభాయ్, మరో సాక్షి రామా కింది కోర్టులో చెప్పిన సాక్ష్యానికి, హైకోర్టులో చెప్పిన వివరాలకు తేడాలను గుర్తించింది.. వారు చెప్పిన దానికి భిన్నంగా వైద్య నివేదిక ఉంది. వారి వాంగ్మూలాలు నమ్మదగినట్టుగా లేవని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఎఫ్ఐఆర్లోనూ పలు లోపాలు విచారణలో బయటపడ్డాయి. ధనిరామ్ చేతిలో గొడ్డలి ఉంది తప్ప మృతుడిపై ఆ మారణాయుధం తాలూకు గాయాలు లేవని వైద్యుడి నివేదిక స్పష్టం చేసింది.కింది కోర్టు తీర్పు కొట్టివేతసాక్ష్యాధారాలను సహేతుకమైన సందేహాలతో కింది కోర్టు విశ్లేషించలేదని హైకోర్టు ధర్మాసనం భావించింది. ప్రాసిక్యూషన్ నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను చూపించలేకపోయిందని పేర్కొంది. కేసు సుదీర్ఘకాలం నడవడం, నిందితుడి వయస్సు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పింది. గతంలో ఈ తరహా కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ ‘సాక్ష్యాల’ పరిశీలనపై ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితఖైదును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పీలుదారుకి విముక్తి కల్పించింది. ‘నాతండ్రి నిర్దోషి అని తేలడం మాకు ఆనందం. చాలా ఆలస్యమైనా మాకు న్యాయం జరిగింది’ అని ధనీరామ్ కుమారుడు లల్లూరామ్ భావోద్వేగంతో స్పందించాడు. -
ఆ పగతోనే ఢిల్లీలో దారుణ హత్యాచారం, షాకింగ్ విషయాలు
ఢిల్లీలో ఒక ఐఆర్ఎస్ (IRS) అధికారి కుమార్తె, 22 ఏళ్ల ఐఐటి గ్రాడ్యుయేట్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ మీనా ఈ దారుణానికి ఒడిగట్టడానికి కొన్ని గంటల ముందే రాజస్థాన్‌లో మరో మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.పోలీసుల నివేదిక ప్రకారం దక్షిణ ఢిల్లీలో కైలాష్ హిల్స్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన 23 ఏళ్ల రాహుల్ మీనా, రెండు రాష్ట్రాల్లో ఇలాంటి భయంకర నేరాల పరంపర వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.మొదట రాజస్థాన్‌లో, తర్వాత ఢిల్లీలో ఘాతుకంమంగళవారం రాత్రి రాజస్థాన్‌లోని అల్వార్‌లో తన పరిచయస్తుడి భార్యపై రాహుల్ మీనా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన భర్త ఒక పెళ్లికి వెళ్లినప్పుడు, నిందితుడు ఆ రాత్రి తనపై లైంగిక దాడి చేశాడని రాజస్థాన్ మహిళ అల్వార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ చౌదరికి ఫిర్యాదు చేసింది. మరోవైపు నిందితుడు, బాధిత మహిళ భర్తకు మధ్య జూదం కార్యకలాపాల ద్వారా సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.ఆ తర్వాత రాత్రికి రాత్రే క్యాబ్ మాట్లాడుకుని ఢిల్లీకి పారిపోయాడు. బుధవారం ఉదయం సుమారు 6:30 గంటలకు ఢిల్లీలోని కైలాష్ హిల్స్‌కు చేరుకున్నాడు. అక్కడ నివసిస్తున్న ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపి, ఇంట్లో దోపిడీకి పాల్పడ్డాడు.ఆనూ పానూ చూసి, పథకం ప్రకారం బాధితురాలి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి దంత వైద్యురాలు. వీరి ఇంట్లో పది నెలల పాటు పనిచేశాడు. కుటుంబ సభ్యుల అలవాట్లు, ఇంటి భద్రతా వ్యవస్థపై అతనికి పూర్తి అవగాహన ఉంది. బాధితురాలి తల్లిదండ్రులు ఉదయాన్నే జిమ్‌కు వెళ్లేవారు. పనిమనుషుల కోసం మెయిన్ డోర్ దగ్గర ఒక 'స్మార్ట్ కార్డ్' (తాళం) దాచి ఉంచేవారు. ఈ విషయం తెలిసిన రాహుల్, వారు జిమ్‌కు వెళ్లగానే ఆ కార్డుతో లోపలికి ప్రవేశించాడు.తన ఫోన్లలో ఒకదాన్ని రూ. 10వేలకు అమ్మేశాడు. ఆ తరువాత ఆ డబ్బుతో ఒక వ్యాన్‌ను అద్దెకు తీసుకుని, డ్రైవర్‌కు రూ. 6,000 ఇస్తానని నమ్మ బలికాడు. కానీ అతనికి డబ్బులివ్వకుండానే ఢిల్లీ చేరుకుని, ఉదయం 6:39 గంటలకు ఇంట్లోకి వెళ్లిన నిందితుడు, కేవలం 40 నిమిషాల్లోనే (7:15 గంటలకు) ఈ ఘాతుకానికి పాల్పడి బయటకు వచ్చేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలిసింది.నిందితుడికి ఆన్లైన్ జూదానికి (Gambling) బాగా అలవాటు పడ్డాడు. ఇరుగుపొరుగు వారి దగ్గర అప్పులు చేస్తున్నాడనే కారణంతో రెండు నెలల క్రితమే ఆ కుటుంబం అతడిని పనిలో నుంచి తీసేసింది. ఈ పగతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్ పోలీసులు అతడి కోసం వెతుకుతుండగానే, నిందితుడు ఢిల్లీలో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.అది తప్పు...కానీవిచారణ సందర్భంగా, "మీరు ఇంట్లోకి ఎందుకు చొరబడ్డారు?" అని కోర్టు నిందితుడిని ప్రశ్నించినపుడు డబ్బు దొంగిలించడానికే తాను ఇంట్లోకి ప్రవేశించినట్లు చెప్పాడు.మరి మరి ఇతర నేరాలు ఎందుకు చేశావు?" అని అడగ్గా. అది తప్పే.. కానీ ఇప్పుడు తానేమీ చెప్పలేనని’’ బదులిచ్చాడు.రాహుల్ మీనాను, ఢిల్లీ న్యాయస్థానం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ద్వారకాలోని ఒక హోటల్ నుండి అరెస్టు చేసిన అనంతరం, మీనాను న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుడిని నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారించ డానికి అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసు విజ్ఞప్తిని ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దీపికా ఠాకరన్ ఆమోదించారు. మరోవైపు దొంగిలించిన డబ్బు, నగలు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు. అయితే, కేసులో మరెవరైనా ప్రమేయం ఉన్నారేమోనని పరిశీలించడానికి, అతడిని విచారించడానికి తమకు మరింత సమయం అవసరమని తెలిపారు.ఇదీ చదవండి: ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా! -
హిజ్రా హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం
కోనసీమ జిల్లా: 216 ఏ జాతీయ రహదారిలోని జొన్నాడలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన హిజ్రా హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ రాజమహేంద్రవరం పదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు మంగళవారం తుది ఇచ్చింది. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు ఈ కేసు గురించి ఆలమూరు పోలీసులు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలోనున్న ఉప్పరగూడెంకు చెందిన మరుమట్ల ఆనంద్ అలియాస్ ఆనందీ అనే హిజ్రా ఆ సమయంలో ధవళేశ్వరంలో సహచర హిజ్రాలతో కలిసి నివాసం ఉంటోంది. 2023 మే 12 రాత్రి జొన్నాడ హైవే పక్కన పంటకాలువలో దారుణ హత్యకు గురైంది. సంచలనంగా మారిన ఈ హత్యకేసుకు సంబంధించి ధవళేశ్వరం గ్రామానికి చెందిన ధనాల మందాకిని అనే హిజ్రా ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ఎస్.శివప్రసాద్ కేసును నమోదు చేశారు. రావులపాలెం రూరల్ సీఐ ఎన్.రజనీకుమార్ దర్యాప్తు చేయగా కొత్తపేట డీఎస్పీ కెవి.రమణ పర్యవేక్షణ జరిపారు. నేరం రుజువు కావడంతో నిందితులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేత వెంకట భరత్ సుధీర్ అలియాస్ పెద్ద (ధవళేశ్వరం), వేలు కళ్యాణ్ అనే పెద కాళీ (బొమ్మూరు), సింగంపల్లి కార్తీకేయ అలియాస్ సింబ (ధవళేశ్వరం)కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ జడ్జి ఎస్.ఉమా సునంద తీర్పు చెప్పారు. బాధితుల తరఫున పీపీలు కె.రాధాకృష్ణ రాజు, డి.వాణిభాయి వాదనలు వినిపించారు. ఈ కేసును ఛేదించిన కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి.నరే‹Ùను ఏలూరు రేంజ్ ఐజీ జీవీవీ అశోక్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు. -
పాతబస్తీలో దంపతుల హత్య
చార్మినార్: పాతబస్తీలో దంపతుల హత్య ఉదంతం కలకలం రేపింది. నిందితుడు మృతుడికి స్వయాన అన్న. సుల్తాన్పురాలోని ఓ అద్దె ఇంట్లో అఖిల్‌ఖాన్(38), అజ్మేరీ బేగం(35) దంపతులు నివాసముంంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అజ్మేరీబేగం ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. గతంలో నూర్ఖాన్ బజార్లో నివసించే వీరు ఇల్లు ఖాళీ చేసి కొంతకాలం క్రితమే సుల్తాన్‌పురా వచ్చారు. ఈ నేపథ్యంలో అఖిల్‌ఖాన్ తన అన్న ఆదిల్‌ఖాన్ వద్ద రూ.7వేలు చేబదులుగా తీసుకున్నట్టు సమాచారం. నెలలు గడుస్తున్నా, ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఆదిల్‌ఖాన్ సోమవారం సాయంత్రం 4 గంటలకు తమ్ముడి ఇంటికి వచ్చాడు.రూ. 7వేల విషయంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. దాదాపు రెండు గంటల పాటు ఘర్షణ జరిగింది. అయితే రెండురోజుల్లో డబ్బు తిరిగి ఇస్తానని చెప్పినా, ఆదిల్‌ఖాన్ వినకుండా అఖిల్‌ఖాన్ గొంతు, పొట్టలో పొడిచాడు. ఈ గొడవలో తలదూర్చిన మరదలు అజ్మేరీబేగంపై కూడా అప్పటికే కోపంతో ఉన్న ఆదిల్‌ఖాన్ ఆమెను సైతం కత్తితో పొడిచి హత్య చేశాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఇద్దరినీ చంపేశాను పోలీసులకు చెప్పుకోండి అంటూ.. బిగ్గరగా అరుస్తూ వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.అయితే నిందితుడు ఆదిల్‌ఖాన్‌కు పిల్లలు లేకపోవడంతో ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నట్టు సమాచారం. అఖిల్‌ఖాన్ తీసుకున్న డబ్బు ఇవ్వకపోగా, నీకు పిల్లలే లేరు కదా... డబ్బు తీసుకొని ఏం చేసుకుంటావు అని అనడంతో ఆదిల్‌ఖాన్ మనస్తాపానికి గురై తమ్ముడు, మరదల్ని హత్య చేసి ఉండొచ్చని స్థానికులు అనుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి శంషాబాద్ డీసీపీ రాజేశ్, మీర్‌చౌక్ ఏసీపీ శ్యాంసుందర్, ఇన్స్పెక్టర్ ఎం.కొండలరావు వచ్చారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చార్మీనార్ ఎమ్మెల్యే మీర్ జుల్పికర్ అలీ మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. -
ఆర్ఎంపీ వైద్యుడి దారుణ హత్య
అద్దంకి: అర్ధరాత్రి వేళ ఆర్ఎంపీ వైద్యుడిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మవరం గ్రామానికి చెందిన మేడగం కోటిరెడ్డి (45) ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం బ్రహ్మంగారి మాల వేసుకుని దీక్ష చేపట్టాడు. శనివారం రాత్రి భార్య ఆదిలక్ష్మి టిఫిన్ పెట్టగా.. తిని పడుకున్నాడు. అర్ధరాత్రి నల్లటి ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అడ్డొచ్చిన అతని భార్యను నెట్టివేయడంతో స్పృహ కోల్పోయింది.అనంతరం కోటిరెడ్డిని కర్రలు, రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేసినట్టు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని దర్శి డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ పరిశీలించారు. సీఐ సుబ్బరాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. మంగళగిరి నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం హత్య చేయడానికి వచ్చిన వారిలో ఒకరు ‘నా భార్యతో అక్రమ సంబంధం మానుకోవా’ అన్నట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగిందా.. లేక మరేదైనా కారణమా అనేది విచారణలో తేలాల్సి ఉంది. -
మగపిల్లాడి కోసం ఆరుగురిని చంపేశాడు!
వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో ఈ నెల ఒకటిన భర్త తన భార్య, ఇద్దరు పిల్లలను స్విమ్మింగ్‌పూల్‌లో ముంచి చంపిన ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మగ పిల్లాడు కావాలనే ఆశ, ఆడపిల్ల పుడుతుందనే భయంతో గతంలోనే నిందితుడు రెండుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని.. అందుకు కుటుంబ సభ్యులు, కొందరు వైద్యులు, సిబ్బంది సహకరించారని తేలింది.అలాగే భార్య మూడోసారి గర్భం దాల్చడంతో మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే భయంతో ఆమెతోపాటు ఇద్దరు పిల్లలను హతమార్చినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అంటే మొత్తంగా మగ సంతానం కోసం భర్త కిరాతకుడిగా మారి ఆరుగురిని కడతేర్చడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్తతోపాటు హత్యలకు పరోక్షంగా కారణమైన మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ శుక్రవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రేమ వివాహం..హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన అజహరుద్దీన్ అదే గ్రామానికి చెందిన ఫరహాత్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి హుమేరా (9), ఆయేషా (6) అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులకు కుమారుడు పుట్టాలన్న కోరిక ఉండటంతో 2021, 2022లలో ఫరహాత్ గర్భం దాల్చినప్పుడు అజహరుద్దీన్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు ఫరహాత్‌కు లింగనిర్ధారణ పరీక్షలు చేయించారు. అందుకు పున్నేలు గ్రామానికి చెందిన మందుల షాపు నిర్వాహకుడు సట్ల రాజుతోపాటు ఆర్ఎంపీ నరేశ్, ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్, కాజీపేటలోని సురక్షా హాస్పిటల్ డాక్టర్ రవళి, నర్సు స్రవంతి, నెక్కొండకు చెందిన ఉపేందర్ హాస్పిటల్ డాక్టర్ పూర్ణిమ సహకారం అందించారు.గర్భంలో ఉన్నది ఆడపిల్లలుగా నిర్ధారించుకొని ఫరహాత్‌కు ఇష్టం లేకున్నా రెండుసార్లు అబార్షన్ చేయించారు. ఈ క్రమంలో అజహరుద్దీన్ తనకు దూరపు బంధువైన ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని, తనకు కుమారుడు కావాలని చెప్పాడు. అయితే ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకోనని ఆమె తెగేసి చెప్పింది. మరోవైపు గత నెలలో ఫరహాత్ మరోసారి గర్భం దాల్చగా తిరిగి ఆడపిల్ల పుడుతుందనే భయంతో అజహరుద్దీన్‌తోపాటు అతని తల్లిదండ్రులు, తమ్ముడు అబార్షన్ చేయించుకోవాలని ఫరహాత్తో గొడవ పడ్డారు. ఆమె ఒప్పుకోకపోవడంతో భార్య, పిల్లలను చంపి తాను ఇష్టపడిన బాలికను పెళ్లి చేసుకోవాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. వేడుకున్నా కరగని తండ్రి మనసుభార్య, ఇద్దరు పిల్లలను కడతేర్చాలని నిర్ణయించుకున్న అజహరుద్దీన్ ఈ నెల 1న రాత్రి 7:50 గంటలకు ఐస్‌క్రీం తినిపిస్తానని తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్‌పూల్ వద్దకు తీసుకెళ్లాడు. అంతకుముందే అక్కడున్న సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. స్విమ్మింగ్‌పూల్ వద్ద కొన్ని పనులను భార్యతో చేయించి ఒక్కసారిగా ఆమెను నీళ్లలోకి నెట్టాడు. అనంతరం చిన్న కూతురు అయేషాను పూల్‌లోకి విసిరేశాడు. భార్య బయటకు వచ్చే ప్రయత్నం చేయగా నీళ్లలోనే ముంచి చంపేశాడు. పైన ఉన్న పెద్ద కూతురు హుమేరా వద్దు నాన్నా అంటూ కన్నీళ్లతో వేడుకున్నా అతని మనసు కరగలేదు. భార్య, చిన్నకూతురిని చంపాక పెద్ద కూతురిని సైతం నీళ్లలో ముంచి హత్య చేశాడు. -
నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!
క్రైమ్ థ్రిల్లర్‌లా, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన సంఘటన కలకలం రేపింది. అంతేకాదు ఏమీ తెలియనట్టు నేరాన్ని దోపిడీలా చిత్రీకరించడానికి కపట నాటకమాడింది. అందర్నీ నమ్మించాలని మొసలి కన్నీళ్లు కార్చింది. చివరికి పోలీసులు విచారణలో ఆమె దారుణం వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని గొండికోట చరణ్ గ్రామంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి హత్య జరిగింది . సుగంధ ద్రవ్యాల వ్యాపారి 28 ఏళ్ల పురోహిత్ దేవకృష్ణ, తన ఇంట్లో హత్యకు గురైనాడు. అతని శరీరంపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేవకృష్ణకు 12 ఏళ్ల క్రితం ప్రియాంకతో వివాహం జరిగింది. ప్రారంభంలో సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితంలో కలతలు మొదలయ్యాయి. ప్రియాంక, కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో భర్త అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది.ఇదీ చదవండి: పార్కింగ్ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారుప్రియుడు కమలేష్‌తో కలిసి కుట్ర పన్నింది. కమలేష్, సురేంద్ర అనే వ్యక్తికి సుమారు లక్ష రూపాయల సుపారీ ఇచ్చి దేవకృష్ణను హత్య చేయించేలా పథకం వేశారు. ప్రియాంక ఇంటికి కమలేష్, సురేంద్ర వచ్చి దేవకృష్ణపై దాడి చేసి చంపేశారు. అనంతరం ప్రియాంక దొంగలు ఇంట్లోకి చొరబడి, రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను దోచుకుని, తన భర్త ప్రతిఘటించడంతో అతడిని చంపేశారని పోలీసుల ముందు వాపోయింది. మొదట్లో ఇది దోపిడీ, హత్యగానే భావించిన పోలీసులుసంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇంట్లోనే నగలు, డబ్బు అలాగే ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు, ప్రియాంక పదేపదేమాట మారుస్తూ ఉండటంతో అనుమానం పెరిగింది. తమదైన శైలిలో విచారించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. ఈ విషయాన్నిమొబైల్ ఫోన్ డేటాతో సహా సాంకేతిక ఆధారాలు, కమలేష్‌తో ఆమెకున్న సంబంధాన్ని, హత్య జరిగిన సమయంలో ఆమె చేసిన కాల్స్ ఆధారంగా దీన్ని మరింత నిర్ధారించుకున్నారు. అటు ప్రియాంక కూడా చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ప్రియాంకతో పాటు కమలేష్, సురేంద్రలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా? -
మౌనిక హత్య కేసులో కొత్త మలుపు
విశాఖపట్నం: గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో కొత్తమలుపు చోటుచేసుకుంది. నిందితుడు చింతాడ రవీంద్ర పోలీసులనే తప్పుదోవ పట్టించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మౌనికను వేరే అపార్ట్మెంట్లో హత్య చేసి మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్‌లో తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్‌కు తీసుకొచ్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాను నివాసముంటున్న కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో మౌనికను హత్య చేసినట్టు పోలీసుల వద్ద నిందితుడు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ రోజు రవీంద్ర ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు మౌనిక వచ్చినట్టు సీసీ కెమెరాలో ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. దీంతో అతడిని పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారించగా, తాను మౌనికను హత్య చేసింది తన అపార్ట్మెంట్లో కాదని, అక్కడికి సమీపంలో ఉన్న మరో అపార్ట్మెంట్లోని తన స్నేహితుడి ఫ్లాట్‌లోనని చెప్పడంతో పోలీసులు ఆ అపార్ట్మెంట్లో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అక్కడికి మౌనిక వచ్చినట్టు, ఆమె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో తరలించినట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నారు. అసలు ఏం జరిగిందంటే? నగరంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన మౌనికను నేవీ ఉద్యోగి చింతల రవీంద్ర గత నెల 29న పాతగాజువాకలోని ఎల్వీనగర్లోని ఒక అపార్ట్మెంట్లో పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య అనంతరం అతడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడు చెప్పిన దాని ప్రకారం మౌనికను కీర్తి ఎన్‌క్లేవ్‌లోనే హత్య చేశాడని పోలీసులు సైతం అనుకున్నారు. దాని ప్రకారం అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం పలుమార్లు నిందితుడు నివాసముండే అపార్ట్‌మెంట్‌తోపాటు, తల, చేతులు కాల్చిన ధారపాలేనికి వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కీర్తి ఎన్‌క్లేవ్‌లో హత్య జరిగిన రోజుగాని, అంతకుముందు మూడు రోజులుగాని హతురాలు మౌనిక నిందితుడి ఇంటికి వచ్చినట్టు సీసీ కెమెరాలో నమోదు కాలేదు. ఇతర ఆధారాలు కూడా లభించలేదు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. దీంతో పోలీసులు రవీంద్రను తమ కస్టడీకి తీసుకొని పలు కోణాల్లో విచారించారు. ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం.. ఫ్రిజ్‌లో శరీర భాగాలు! మౌనికను తమ అపార్ట్‌మెంట్‌కు సమీపంలో ఉన్న తన స్నేహితుడి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో హత్య చేసినట్టు నిందితుడు చెప్పినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. రవీంద్ర స్నేహితుడు సురేంద్రతోపాటు మరో ఇద్దరు కలిసి హత్య జరిగిన ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. గత నెల 29న స్నేహితుడు సురేంద్రకు ఫోన్ చేయగా, ఇంట్లో ఎవరం లేమని, డ్యూటీలో ఉన్నామని చెప్పాడు. ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడాన్ని అదనుగా భావించిన రవీంద్ర ప్రియురాలు మౌనికను పథకం ప్రకారం హత్య చేయడానికి స్నేహితుడి ఫ్లాట్‌కు తీసుకువెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న క్రమంలో రవీంద్ర ఆవేశంతో మౌనిక నోరు, ముక్కు మూసి ప్రాణాలు తీశాడు. మృతదేహాన్ని ఒక ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి తన ఫ్లాట్‌కు తీసుకెళ్లిపోయాడు. అక్కడ మృతదేహాన్ని ముక్కలుగా నరికి కొన్ని భాగాలను రిఫ్రిజిరేటర్లో, మరికొన్ని భాగాలను మంచం కింద ఉంచాడు. తల, చేతులను ఒక గోనె సంచిలో మూటగట్టి అడవివరం దరి ధారపాలెంలోని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు సురేంద్రకు ఫోన్లో చెప్పగా, పోలీసులకు వెంటనే లొంగిపోవాలని అతడు సూచించడంతోపాటు రాజాంలో ఉన్న నిందితుడి సోదరుడికి, గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈలోగా రవీంద్రను తమ్ముడు గాజువాక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించాడు. కాగా, ఈ హత్యపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మౌనికను హత్య చేసింది రవీంద్ర ఒక్కడేనా, ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక డబ్బుల కోసం వేధిస్తుండటం వల్లే హత్య చేశానని నిందితుడు చెప్పిన నేపథ్యంలో నిజానిజాలపై పోలీసులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. -
కడప రిమ్స్‌లో దారుణ హత్య
కడప కోటిరెడ్డి సర్కిల్ /కడప వైఎస్ఆర్ సర్కిల్ : వైఎస్సార్ కడప జిల్లా కేంద్రమైన కడపకు కూతవేటు దూరంలో గంజాయి బ్యాచ్ ఓ ఇంట్లోకి దూరి విచక్షణా రహితంగా దాడి చేసింది.. బాధితులు విలవిల్లాడిపోతూ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారనే విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి మరీ నట్టనడి ఆస్పత్రిలో కత్తులతో మరోమారు దాడికి దిగింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య పోరాడుతుండటం కలకలం రేపింది. సినిమాల్లో చూపినట్లు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ హత్య జరగడం పట్ల రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యమే హత్యకు కారణమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వృత్తి ధర్మాన్ని గాలికొదిలేయడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికంగా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కడప నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో అలంఖాన్‌పల్లి ప్రాంతంలో శనివారం మారమ్మ తిరునాల జరిగింది. జాతరలో ఉన్న వెంకట దస్తగిరి అనే యువకుడిని వెంకటేష్ అండ్ బ్యాచ్ బెదిరించింది. భయపడిన వెంకట దస్తగిరి ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని తండ్రి పెద్ద దస్తగిరికి చెప్పాడు. ఆయన వెంకటేష్ బ్యాచ్ సభ్యులను నిలదీశాడు. మరోసారి ఇలా చేయొద్దని హెచ్చరించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న వెంకటేష్ గ్యాంగ్ ఆ మరుసటి రోజు ఆదివారం సాయంత్రం వెంకట దస్తగిరిని మరోసారి బెదిరించింది. అంతటితో ఆగకుండా ఇంటి వద్దకు తరుముకుంటూ వెళ్లారు.ఆపై ఏకంగా ఇంట్లోకి దూరి అడ్డొచ్చిన వారందరినీ దారుణంగా కొట్టారు. వీరి దాడిలో ఇంట్లో ఉన్న సిద్దయ్య, కుళ్లాయమ్మ, కె.దస్తగిరి గాయపడ్డారు. పెద్ద దస్తగిరి విషయం తెలుసుకుని హుటాహుటిన ఇంటికొచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. తేలిగ్గా తీసుకున్న పోలీసులు వారికి రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యం చేశారు. హాస్పిటల్‌కు వెళ్లండంటూ ఉచిత సలహా ఇచ్చారు. చీకటి పడిందని.. ప్రత్యర్థుల వల్ల ముప్పు ఉందని, కనీసం ఆస్పత్రి వరకు భద్రత కల్పించాలని కోరినా వినిపించుకోలేదు. దీంతో చేసేదిలేక పెద్ద దస్తగిరి తన తమ్ముడు చిన్న దస్తగిరితో కలిసి గాయపడిన వారిని రిమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వెంటాడి.. వేటాడి హత్య రిమ్స్ హాస్పిటల్లో గాయపడిన తన కుటుంబ సభ్యులకు ఎక్స్‌రే తీయించడం, తదితర పనుల్లో నిమగ్నమైన పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరిపై అర్ధరాత్రి తర్వాత (సోమవారం తెల్లవారుజామున) వెంకటేష్ బ్యాచ్ విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసింది. దీంతో పెద్ద దస్తగిరి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ చిన్న దస్తగిరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు ముందే స్పందించి ఉంటే నిండు ప్రాణం బలయ్యేది కాదు. పోలీసులు వారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ఉంటే ఈ హత్య జరిగి ఉండేదే కాదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దస్తగిరి ఫిర్యాదు చేసిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కనీసం ఒక రోజైనా పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచుకుని ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని ప్రజలు తప్పు పడుతున్నారు. కాగా, రిమ్స్‌లో దారుణ హత్యకు గురైన పెద్ద దస్తగిరి, తీవ్ర గాయాల పాలైన చిన్న దస్తగిరిని, నిందితులు దాడి చేసిన స్థలాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌రెడ్డి, కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కడప తాలూకా స్టేషన్లో కేసు నమోదు చేశారు. కడప రిమ్స్ ఇన్‌ఛార్జి సీఐ ఓబులేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకుపోయిన పెద్ద దస్తగిరిపై గంజాయి మూకలు పక్కా ప్రణాళికతో అత్యంత కిరాతకంగా హత్య చేయడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర అన్నారు. బాధితులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. తమపై దాడి చేసిన వారు గంజాయి మత్తులో ఉన్నారని, వారు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉందని బాధితులు పోలీసులకు చెప్పినా స్పందించక పోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. పెద్ద దస్తగిరి హత్యపై సిట్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కాగా, దస్తగిరి మృతదేహాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ మేయర్ పాకా సురేశ్‌కుమార్, ఇతర నేతలు పరిశీలించారు. నిందితులకు అధికార టీడీపీ నేతల అండదండలు ఉండటం వల్లే పోలీసులు నిర్లక్ష్యం వహించారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పోలీసుల ముందే భార్య హత్య.. జహీరాబాద్‌లో దారుణం!
సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్‌కు చెందిన కవిత (29) అనే మహిళ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధం ఆమె ప్రాణం తీసింది.పోలీసుల వివరాల ప్రకారం.. మార్చి 27న కవిత తన ప్రియుడు పవన్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో ఆమె భర్త సిద్ధారెడ్డి మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, కవిత జడ్చర్లలో పవన్ తో ఉన్నట్లు గుర్తించారు.దీంతో కవితను తిరిగి జహీరాబాద్‌కు తీసుకురావడానికి పోలీసులు, భర్త సిద్ధారెడ్డి కలిసి జడ్చర్లకు వెళ్లారు. కవితను తీసుకువస్తున్న సమయంలో, సిద్ధారెడ్డి మార్గమధ్యంలో ఓ కత్తి కొనుగోలు చేశాడు. అనంతరం సదాశివపేట మండలం నందికంది వద్దకు చేరుకున్నప్పుడు, పోలీసులు ఉన్నప్పటికీ ఆవేశంతో కత్తితో కవిత గొంతులో పొడిచి అక్కడికక్కడే హత్య చేశాడు. హత్య అనంతరం కవిత మృతదేహాన్ని పోలీసులు జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు సిద్ధారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. -
ఒక హత్య.. ముగ్గురు హంతకులు
సమయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు... హైదరాబాద్ శివార్లలోని ఒక విలాసవంతమైన విల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖర్జీ దారుణ హత్యకు గురయ్యాడు. గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి, ముఖర్జీ సోఫాలో ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. అతని మెడపై గట్టిగా నొక్కిన గుర్తులు ఉన్నాయి. హత్యకు గురైంది ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో కమిషనర్ కూడా వచ్చాడు. క్లూస్ టీమ్ తన పని తాను చేసుకుపోతోంది.క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ వైపు చూసి అన్నాడు కమిషనర్... ‘‘మీరు ఎంత త్వరగా కేసు క్లోజ్ చేస్తే అంత మంచిది. ఈ కేసులో అనుమానితులు ముగ్గురు...ముఖర్జీ మేనల్లుడు అజయ్ భారీ అప్పుల్లో వున్నాడు.సెక్రటరీ స్నేహ– ముఖర్జీ తనను ఉద్యోగంలోంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మరో వ్యక్తి ముఖర్జీ బిజినెస్ పార్టనర్ వినాయక్... ఈ ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరో కనిపెట్టాలి.’’ఇన్స్పెక్టర్ విక్రమ్ క్రైమ్ స్పాట్‌ను నిశితంగా గమనిస్తున్నాడు. టేబుల్ మీద మూడు కాఫీ కప్పులు ఉన్నాయి. కాని, గదిలో ఇద్దరు మాత్రమే ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఏసీ ఇంకా ఆన్‌లోనే వుంది. గదిలో ఏసీ 16 డిగ్రీల వద్ద ఉంది. ‘‘సర్ ... వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తాగితే ఈ కూల్లో వెచ్చగా ఉంటుంది’’ పనిమనిషి ఏసీ ఆఫ్ చేయబోతుంటే వారిస్తూ అన్నాడు. ఇన్స్పెక్టర్ విక్రమ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ తెలిసిన కమిషనర్ కాఫీ తీసుకురమ్మని వంటమనిషికి పురమాయించాడు. ముఖర్జీ మేనల్లుడు అజయ్‌ని గదిలోకి పిలిచాడు. ‘‘మీ మేనమామను చంపాలనే బ్రిలియంట్ థాట్ ఎలా వచ్చింది?’’ సూటిగా చూస్తూ అడిగాడు.‘‘నేను చంపడం ఏంటి సర్! మా మామయ్య చనిపోతే నాకేంటి లాభం? బతికుంటే ఎంతోకొంత చిల్లర అయినా వస్తుంది’’ అని చెప్పాడు. అజయ్‌ని బయటకు పంపించి సెక్రటరీ స్నేహను పిలిచాడు. ‘‘పనిలో నుంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చినందుకు లైఫ్‌లో నుంచే మీ బాస్‌ను తీసేశావా?’’ ఆమె వైపే చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్.‘‘సర్! నేను ఒక మాములు ఉద్యోగిని. నేనెలా చంపగలను? చంపితే నాకు ఒరిగేది ఏముంది?’’ సెక్రటరీ స్నేహ అంది.‘‘గుడ్ ఆన్సర్... యు మే గో...’’ అన్నాడు.స్నేహ బయటకు వెళ్ళగానే, ఆ గది మొత్తం మరోసారి పరిశీలించాడు. ఏసీ ఆఫ్ చేయడానికి వెళ్లి రిమోట్ తీసుకుని, ఒకసారి ఏసీ వంక చూశాడు. వంటమనిషి కాఫీ తెచ్చింది. కాఫీ తాగి వంటమనిషిని బయటకు పంపించి, మంచం ఎక్కి ఏసీని పరిశీలనగా చూశాడు.ఒక చిక్కుముడి వీడిపోయింది. ఇన్స్పెక్టర్ విక్రమ్ కిందకి దిగి ముఖర్జీ బిజినెస్ పార్టనర్‌ను పిలిపించాడు.‘‘మిస్టర్ వినాయక్! మీ లాయర్‌కు ఫోన్ చేస్తే మనం బయల్దేరుదాం’’ అన్నాడు.‘‘ఎందుకు ఎక్కడికి?’’ అయోమయంగా అడిగాడు వినాయక్.‘‘మీ బిజినెస్ పార్టనర్‌ను హత్య చేసినందుకు’’ అన్నాడు.‘‘ముఖర్జీ మేనల్లుడు అజయ్, సెక్రటరీ స్నేహ అంతా ఒప్పుకున్నారు’’ వినాయక్ వంక చూస్తూ చెప్పాడు.‘‘వాళ్ళ మాటలు విని నన్ను అరెస్టు చేస్తారా? సాక్ష్యం లేకుండా’’ వినాయక్ కోపంగా అన్నాడు.‘‘ఈ సాక్ష్యం సరిపోతుందా? నువ్వూ... అజయ్... స్నేహ కలిసి ముఖర్జీని చంపడం... ఎలాంటి ఎడిటింగులు లేకుండా ఉన్న ఆధారం ఓకేనా?’’ వినాయక్‌ను అడిగాడు.కమిషనర్ అలానే చూస్తుండిపోయాడు. ‘‘మీరు అన్నంత మాత్రాన అది నిజం అవుతుందా?’’ వినాయక్ అన్నాడు.‘‘అవుతుంది... ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సార్ కెమెరా ఉంది. అందులో మీ ముగ్గురి ముఖాలు స్పష్టంగా పడ్డాయి. నువ్వు అజయ్‌ని, స్నేహను ఇరికించాలనుకున్నావు. అజయ్ అప్పులను తీరుస్తానని ప్రామిస్ చేశావు. స్నేహను మంచి జీతంతో నీ దగ్గర సెక్రెటరీగా పెట్టుకుంటానన్నావు.స్నేహ నిద్రమాత్రలు ఇచ్చింది. అజయ్ నువ్వు రహస్యంగా ఇంట్లోకి రావడానికి సహకరించాడు.’’ముఖర్జీ చనిపోతే అతడి అన్ని వ్యాపారాలనూ తన వ్యాపారంలోకి కలిపేసుకోవచ్చని వినాయక్ అనుకున్నాడు.‘‘ముగ్గురూ కలిసి హత్య చేశాక గది లోపల గడియ పెట్టి కిటికీ గుండా బయటకు వెళ్లారు. కాని, వినాయక్ గమనించని విషయం ఏంటంటే, ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సర్ కెమెరా! అందులో రికార్డు అయిన వాళ్ళ మొహాలు...’’ అంటూ కమిషనర్ వైపు తిరిగి.‘‘ఇదిగోండి ఎవిడెన్స్ ఒక హత్య... ముగ్గురు హంతకులు.’’హత్య చేసినందుకు వినాయక్‌ను; డబ్బు మీద ఆశతో సహకరించినందుకు అజయ్‌ను, క్షణకాలం ఆవేశంతో, స్వార్థంతో చేతులు కలిపినందుకు స్నేహను అరెస్ట్ చేశారు.‘‘థాంక్యూ విక్రమ్! కేవలం గంట వ్యవధిలోనే కేసును మైండ్ గేమ్‌తో సాల్వ్ చేశావు’’ అభినందిస్తూ అన్నాడు కమిషనర్. -
నెల్లూరు జిల్లాలో జంట హత్యలు
కొడవలూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో జరిగిన జంట హత్యలు సోమవారం కలకలం రేపాయి. జిల్లాలోని దగదర్తి మండలం పెద పుత్తేడుకు చెందిన కుందుర్తి వెంకటేష్ (29), సంగం మండలం వెంగారెడ్డిపాళెంకు చెందిన కొప్పోలు బాలవెంకయ్య (26) గండవరం మజరా వడ్డిపాళెం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. వీరిద్దరూ వరిగడ్డి కట్ట కట్టే యంత్రాన్ని తీసుకొని ఆదివారం వడ్డిపాళెం సమీపంలోని పొలాల్లోకి వచ్చారు. యంత్రానికి డీజల్ అయిపోవడంతో సాయంత్రం ఇద్దరూ కలిసి బైక్‌పై వచ్చి డీజల్ తీసుకొని పొలాల్లోకి వెళ్లారు.రాత్రి ఇద్దరూ ఇంటికి రాలేదు. దీంతో వెంకటేష్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి సోమవారం ఉదయం ఇద్దరూ పనికి వెళ్లిన పొలాల వైపు వెతుక్కొంటూ వస్తుండగా వడ్డిపాళెం వద్ద రోడ్డు పక్కనే తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల, ఏఎస్పీ సౌజన్య, నెల్లూరు రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు ఘటనాస్థలికి వచ్చి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.మృతుడి బంధువులతో మాట్లాడి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. వెంకటేష్ కు ఓ వివాహితతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని గుర్తించారు. వివాహిత తరఫు బంధువులే హతమార్చారని ప్రాథమికంగా నిర్థారించారు. వెంకటేష్ ను హత్య చేసేందుకు వచ్చి పక్కనే ఉన్న బాలవెంకయ్యను కూడా హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. పెదపుత్తేడుకు చెందిన బత్తల కళ్యాణ్, బత్తల ప్రశాంత్, బత్తల విజయభాస్కర్‌ను అనుమానితులుగా గుర్తించి ఐదు ప్రత్యేక బృందాలతో ఎస్పీ గాలింపు చర్యలు చేపట్టారు. -
డబ్బులు డిమాండ్‌తోనే దారుణ హత్య
గాజువాక: రిలేషన్షిప్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తుండడంవల్లే మౌనికను నిందితుడు చింతాడ రవీంద్ర హత్యచేసినట్లు సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, గాజువాక సీఐ ఎ. పార్థసారధి వెల్లడించారు. విశాఖలో ఆదివారం తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన వివరాలను సోమవారం వారు మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర (29) విశాఖలోని ఇండియన్ నేవీలోని ఐఎన్ఎస్ డేగాలో పెట్టీ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తూ పాత గాజువాక ఎలీ్వనగర్లోని కీర్తి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నాడు.రవీంద్రకు విజయనగరం జిల్లాకు చెందిన శ్రీలక్ష్మీతో ఏడాది క్రితమే వివాహమైంది. మరోవైపు.. తాటిచెట్లపాలెంలోని సంజీవయ్య కాలనీ–1కు చెందిన పోలిపల్లి మౌనిక (31) ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఈవెంట్ల నిర్వహణకు వెళ్తుంది. ఆమె తండ్రి వేణుగోపాల్ ప్రైవేట్ ఉద్యోగి. మౌనిక, రవీంద్ర మధ్య మింగిల్ డేటింగ్ యాప్ ద్వారా 2021లో పరిచయం ఏర్పడింది. ఇది రిలేషన్‌షిప్‌కు దారితీసింది.పెళ్లి తరువాత కూడా నిందితుడు మౌనికతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. రవీంద్రకు పెళ్లైన విషయం తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యా యి. ఈ నేపథ్యంలో.. డబ్బు కోసం రిలేషన్షిప్ విషయాన్ని నిందితుడి భార్యకు చెబుతానంటూ మౌనిక వేధించడం మొదలుపెట్టింది. మౌనికకు రవీంద్ర నగదు ఇస్తున్నా ఇంకా కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇద్దరికీ సంబంధించిన వీడియోలను రవీంద్ర భార్య శ్రీలక్ష్మి కి షేర్ చేయడంతోపాటు ఇంకా రకరకాలుగా ఒత్తిడి పెంచింది. దీంతో మౌనికను హత్యచేయాలని రవీంద్ర నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్‌తో పాశవిక హత్య.. ఈ నేపథ్యంలో.. భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను అడ్డు తొలగించుకునేందుకు రవీంద్ర స్కెచ్ వేశాడు. ఇన్‌స్టామార్ట్ ద్వారా కత్తి కొనుగోలు చేశాడు. స్థానికంగా కొన్ని కవర్లు కొన్నాడు. ఇక ఆదివారం మధ్యాహ్నం మౌనికను తన ఇంటికి పిలిచాడు. 12.30 గంటల సమయంలో ముక్కు, నోరు మూసి ఆమెను హత్యచేశాడు. ఆ తరువాత ఆమె తల, చేతులు, కాళ్లు ముక్కలు ముక్కలుగా కోశాడు. రక్తపు మరకలు లేకుండా శరీర భాగాలను బాత్రూమ్లో శుభ్రంగా కడిగి కవర్లో ప్యాక్ చేశాడు. తల, చేతి భాగాలను ఒక గోనె సంచిలో, ఇతర భాగాలను క్లాత్ సూట్కేసులోను పెట్టాడు.కొన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టాడు. అనంతరం అడవివరం రోడ్‌లోని ధారపాలెం వద్ద నిర్జన ప్రదేశానికి కారులో వెళ్లి తల, చేతి భాగాలను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్‌చేసి మౌనికను హత్యచేసినట్లు చెప్పాడు. అతని సూచన మేరకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రవీంద్ర లొంగిపోయాడు. తల, చేతి భాగాలను కాల్చేసిన స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లి శాంపిల్స్ సేకరించారు. కవర్లో పెట్టి ఇంట్లో ఫ్రిజ్‌లో ఉంచిన శరీర భాగాలను కేజీహెచ్‌కు తరలించారు. -
ఒంటరి మహిళలే లక్ష్యం
బంజారాహిల్స్: బెట్టింగ్‌లకు బానిసై ఒంటరి మహిళలను మాయమాటలతో తన కారులో ఎక్కించుకుని దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న నగలతో ఉడాయించిన యువకుడిని జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా చినగొల్లపాలెం గ్రామానికి చెందిన కునసాయి వాసు (29) మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి ఓ వ్యాపారి ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బెట్టింగ్‌లకు బానిసై తీవ్రంగా నష్టపోతున్న అతను ఈజీ మనీ కోసం పథకం వేశాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని గత ఐదు వారాల నుంచి ఫిలింనగర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించసాగాడు. ఓఆర్ఆర్ సర్విస్ రోడ్డుకు తీసుకెళ్లి.. ఫిలింనగర్ రోడ్డునెంబర్–16లో నివసించే బోయినపల్లి యాదమ్మ (70)ని వాసు పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 11న ఆమెకు మాయమాటలు చెప్పి తనకారులో ఎక్కించుకున్నాడు. మధ్యాహ్నం నేరుగా నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధి లోని ఓఆర్ఆర్ సర్విసు రోడ్డుకు తీసుకువెళ్లి ఆమెను కిందికి దింపి నెట్టేసి తాడుతో ఉరి బిగించి కిరాతకంగా హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ.. ఆ తర్వాత జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–44లో తాను పనిచేస్తున్న ఇంటి ఎదురుగానే ఓ ఫ్లాట్‌లో బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే మంగతాయారమ్మ (60)ని వాసు టార్గెట్ చేశాడు. ఈనెల 17న ఆమె పని ముగించుకుని మధ్యాహ్నం బయటకు రాగానే జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–46లోని మస్తాన్‌నగర్‌లో దింపుతానని ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. పట్టపగలు కారు కొద్దిదూరం వెళ్లగానే డిక్కీలో బ్యాగ్ మరిచిపోయానంటూ కారు దిగి డిక్కీ తెరిచి అక్కడ ఉన్న తాడుతో వెనుక కూర్చొన్న మంగతాయారమ్మను గట్టిగా ఉరేసి హత్య చేశాడు. అలాగే వెనుక సీట్లో ఆమెను పడుకోబెట్టి మోకిళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో పడే సి ఆమె ఒంటిపై ఉన్న నగలు, అదే రోజు తీసుకున్న జీతం రూ.16 వేలు తీసుకుని ఉడాయించాడు. మిస్సింగ్ కేసులు నమోదు అటు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో యాదమ్మ మిస్సింగ్ కేసు, ఇటు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగతాయరమ్మ మిస్సింగ్ కేసులను పోలీసులు నమోదు చేశారు. యాదమ్మ మృతదేహం కుళ్లిపోయి కనిపించగా నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకుని గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి జీహెచ్ఎంసీకి అప్పగించారు. అయితే మిస్సింగ్ కేసులను సీసీటీఎన్ఎస్లో పరిశీలిస్తున్న పోలీసులకు నార్సింగ్‌లో లభ్యమైన మృతదేహం ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు ఒక్కటేనని తేలింది.దీంతో అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా వరుస హత్యలకు పాల్పడుతున్న వాసు నడిపిస్తున్న కారును గుర్తించారు. నిందితుడిని పట్టుకొని పోలీసులు విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. బెట్టింగ్‌ల కోసమే ఈ ఇద్దరిని హత్య చేసినట్లుగా పోలీసుల ముందు నిందితుడు అంగీకరించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు సీరియల్ సైకో కిల్లర్ వాసును అరెస్టు చేశారు. మంగతాయారమ్మ ఒంటిపై ఉన్న నగలు అమ్మగా వచ్చిన డబ్బును కూడా బెట్టింగ్‌ల్లో పెట్టాడు. ఒకవేళ నిందితుడు పట్టుపడకపోతే తాను పనిచేస్తున్న ఇంటి యజమానురాలిని కూడా ఇలాగే తీసుకువెళ్లి హత్యకు పథకం వేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. -
నలుగురి హత్యకేసులో 12 మందికి జీవితఖైదు
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శివారు చింతకుంటలో 14 ఏళ్ల కిందట జరిగిన నలుగురి హత్యకేసులో 12 మందికి జీవితఖైదు విధిస్తూ నంద్యాల మూడో అదనపు న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పునిచ్చింది. వైఎస్సార్సీపీ నాయకుడు ఇంజేటి క్రిష్ణారెడ్డి, ఆయన భార్య గోవిందమ్మ, కుమారుడు మల్లికార్జునరెడ్డి, ముఖ్య అనుచరుడు మాబు (దుబ్బె)లను హత్యచేసిన ఈ కేసులో 19 మందిపై హత్యానేరం నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగానే ఏడుగురు మరణించారు. నేరం రుజువు కావడంతో మిగిలిన 12 మందికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ న్యాయాధికారి తీర్పుచెప్పారు.దోషులంతా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అనుచరులే. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. ఆళ్లగడ్డ శివారు చింతకుంటలో 2012 ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడు ఇంజేటి క్రిష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి ఇంట్లో ఉండగా.. నిందితులు జీపులో వచ్చి గేటును బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. క్రిష్ణారెడ్డిపై కారంపొడి చల్లి కత్తులతో దాడిచేసి హత్యచేశారు. అడ్డుకోబోయిన ఆయన భార్య గోవిందమ్మ, కొడుకు మల్లికార్జునరెడ్డి, ముఖ్య అనుచరుడు మాబు (దుబ్బె)లను అతి కిరాతకంగా నరికి చంపేశారు.ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి 19 మందిపై చార్జిషిటు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు నాగిరెడ్డి (ఏ1) హత్యకు గురికాగా, ఇంజేటి వెంకట్రామిరెడ్డి (ఏ3), క్రిష్టిపాడు పెద్దదస్తగిరిరెడ్డి (ఏ5), గొల్ల శేషు (ఏ6), కుందూరు వెంకట్రామిరెడ్డి (ఏ7), మాల పెద్దన్న (ఏ17), కొప్పు తిరుపాలు (ఏ19) కేసు విచారణ జరుగుతుండగానే మరణించారు. మిగిలిన 12 మందిపై తుది విచారణ సాగగా హత్యానేరం రుజువైంది. దీంతో 12 మందికి జీవితఖైదు పడింది. అఖిలప్రియ అనుచరులు వీరే.. ఇంజేటి శివకుమార్‌రెడ్డి (ఏ2), కుందూరు రామిరెడ్డి (ఏ4), బాస్సాగారి హుస్సేన్ వలి (ఏ8), కమ్ముబాయిగారి కమల్ (ఏ9), కమ్ముబాయిగారి మహబూబ్ బాషా (ఏ10), కమ్ముబాయిగారి బాబు బాషా (ఏ11), కమ్ముబాయిగారి చిన్న మాబు (ఏ12), పక్కీర్ వలి (ఏ13), ఉయ్యలవాడ చాంద్‌బాషా (ఏ14), మాగిగ పెద్ద అంకాలు (ఏ15), మాల సూరబోయిన తిరుపాలు (ఏ16), మాల లక్కు శ్రీను (ఏ18).దోషులకు టీడీపీ ఎమ్మెల్యే పరామర్శ నలుగురిని దారుణంగా హత్యచేసిన నేరానికి 12 మందికి జీవితఖైదు విధించారని తెలియడంతో ఒక్కసారిగా నంద్యాల కోర్టు ఆవరణలో దోషుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు వినిపించాయి. హత్యకేసులో 12 మందికి శిక్షపడిన విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ టీగీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోర్టు ఆవరణకు చేరుకుని దోషుల్ని పరామర్శించారు. జీవితఖైదు పడినవారిని పోలీసులు కడప జైలుకు తరలించారు. -
20 ఏళ్లకు నిందితుడిని పట్టుకున్న సీబీఐ
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఓ విద్యార్థి హత్య కేసును ఎట్టకేలకు సీబీఐ ఛేదించింది. 2005లో కేరళలో జరిగిన హత్య కేసులో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అండమాన్ వాసిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మారుపేరుతో చలామణీ అవుతున్నాడని గుర్తించి అరెస్ట్ చేసింది. కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన శ్యామ్ మండల్ అనే విద్యార్థి 2005 అక్టోబర్‌లో కిడ్నాపయ్యాడు. దుండగులు అతడి తండ్రికి ఫోన్ చేసి, డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. అదే నెల 23వ తేదీన తిరువనంతపురంలోని వెల్లార్ వద్ద శ్యామ్ మృతదేహం కన్పించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అండమాన్ నికోబార్‌కు చెందిన దుర్గా బహదూర్ భట్ ఛత్రి, మహ్మద్ అలీలను పోలీసులు నిందితులుగా గుర్తించారు. అలీని అరెస్ట్ చేసి, 2022లో జైలుకు పంపారు. ఛత్రి జాడ మాత్రం దొరకలేదు. 2008 డిసెంబర్లో ఈ కేసును కేరళ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి ఇరవయ్యేళ్లుగా ఛత్రి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సూరజ్ భట్ అనే మారుపేరుతో ఛత్రి చలామణి అవుతున్నట్లు సీబీఐ వర్గాలు కనిపెట్టాయి. సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఛత్రి స్థానిక మహిళను వివాహం చేసుకున్నాడు. దీనిపై సీబీఐ స్థానిక పోలీసుల సాయం కోరింది. వారు గుర్తింపు కార్డులతోపాటు అతడి నేపథ్యం గురించి చుట్టుపక్కల వారిని ఆరాతీశారు. ఛత్రినే సూరజ్ భట్ అని పోలీసులు ధ్రువీకరించడంతో శుక్రవారం సీబీఐ బృందం అరెస్ట్ చేసింది. -
పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీహోర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బోర్డ్ ఎగ్జామ్స్‌కు వెళ్తున్న ఇద్దరు తోబుట్టువులను వారి సొంత బాబాయే దారుణంగా కొట్టి చంపాడు. అక్కా తమ్ముళ్లు శీతల్ (20), కుల్దీప్ (18) తమ అడ్మిట్ కార్డులతో పరీక్షా కేంద్రం వైపు నడుచుకుంటూ వెళుతుండగా కాపుకాసి అత్యంత పాశవికంగా వారిని కొట్టి చంపాడు. రక్తపు మడుగులో వారి మృతదేహాలు ఒక పక్క, వారి అడ్మిట్ కార్డులు ఒకపక్క పడిపోయిన ఘటన పలువురి కంట కన్నీరు తెప్పించింది. ఈ జంట హత్యలు తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:పోలీసులు అందించిన సమాచాం ప్రకారం ఇది ఆవేశపూరితంగా జరిగిన హత్యలు కావు. పాతకక్షలతో ప్లాన్ చేసిన మరి వారసులను హతమార్చిన దుర్మార్గ ఘటన ఇది.పిల్లలిద్దరూ ఉదయాన్నే పరీక్షకు వెళ్తారని తెలిసి, నిందితుడు, బాబాయి హరిసింగ్ మాలవీయ రోడ్డుపై కాపు కాశాడు. మార్గమధ్యలో కర్రతో బలంగా తలలపై బాదడంతో వారిద్దరూ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.సీహోర్ జిల్లా ధరంపురి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్కుటుంబ కలహాలే కారణమని మృతుల తండ్రి జగదీష్ మాలవీయ ఆరోపించారు. తమ ఇంటి దీపాలను ఆర్పేశాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి ఎదుగుతారనుకున్న పిల్లలు, ఇలా సొంత బాబాయి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇదీ చదవండి : కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్యమరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధీఖ్‌గంజ్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారైన నిందితుడు హరిసింగ్ కోసం పోలీసులు అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.అతనిని పట్టుకోవడానికి టీమ్‌లను ఏర్పాటు చేశామని, రహస్య ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నట్లు ఎఎస్పీ సునీతా రావత్ తెలిపారు.గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని స్టేషన్ ఇన్చార్జ్ రాజు సింగ్ బాఘేల్ తెలిపారు. -
నిలదీసిన భర్తను నరమేధం చేసిన ప్రియుడు..!
తూర్పు గోదావరి జిల్లా: పెళ్లి బంధం ఎగతాళి అయ్యింది.. భార్య అక్రమ సంబంధానికి మూడుముళ్లు వేసిన భర్తే బలైపోవాల్సి వచ్చింది.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో నిలదీసిన భర్తను, ప్రియుడు దారుణంగా హత్యచేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంటకు చెందిన బక్కా నాగేంద్ర (32) భార్య వీరలక్ష్మితో రంగంపేట మండలం నల్లమిల్లికి చెందిన తోరాటి శివ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై నాగేంద్ర, వీరలక్ష్మి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తన భార్య వీరలక్ష్మితో కలసి శివ ఉండటాన్ని నాగేంద్ర చూశాడు. ఆగ్రహానికి గురైన నాగేంద్ర.. శివను నిలదీయడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి గొడవ పడుతూ పక్కనే ఉన్న పంట బోదె వరకూ వచ్చేశారు. ఈ నేపథ్యంలో శివ బలమైన ఆయుధంతో నాగేంద్రపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య అనంతరం కొద్దిపాటి గాయాలైన శివ కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా నాగేంద్ర మరణం వెనుక భార్య వీరలక్ష్మి, అత్త హస్తం కూడా ఉందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అనపర్తి సీఐ సుమంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ హత్యపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి భార్య పాత్రపై వస్తున్న ఆరోపణలను కూడా విచారిస్తున్నామని సీఐ తెలిపారు. నిందితులకు తగిన శిక్ష పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుని కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.ఎన్నడూ లేని విధంగా హత్యలు, దాడులు : మాజీ ఎమ్మెల్యేపెద్ద దొడ్డిగుంట గ్రామంలో హత్య జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సందర్శించి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచిన క్షణం నుంచే హత్యలు, దాడులు, మానభంగాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఇటీవల పందలపాక, రంగాపురంలలో మహిళల హత్య, అదే గ్రామంలో బాలికపై అత్యాచారయత్నం, ఇప్పుడు దొడ్డిగుంటలో హత్య.. ఇవన్నీ కూటమి పాలన వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనాలు అని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండ ఉందన్న ధైర్యం పెరిగిందని, నేరస్తులకు స్టేషన్ బెయిల్లు, బాధితులకు శిక్షలు పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. నిందితుడు తోరాటి శివను, అతని బైకును రంగంపేట పోలీస్ స్టేషన్‌కు హత్యకు గురైన బక్క నాగేంద్ర అప్పగించినప్పటికీ, ఎస్సై కేసు నమోదు చేయకుండా అతనిని విడిచిపెట్టారని, అదే నిర్లక్ష్యం ఈ రోజు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని అని సూర్యనారాయణరెడ్డి అన్నారు. బిక్కవోలు, రంగంపేట మండలాల ఎస్సైలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏరికోరి తెచ్చుకున్నారని అన్నారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట ఎస్సై శివప్రసాద్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనపర్తి నియోజకవర్గంలో నేరస్తులకు రాజకీయ అండ, పోలీసుల నిర్లక్ష్యం పెరిగి, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని అన్నారు.ఎస్సైపై చర్యలకు డిమాండ్వివాహేతర సంబంధంపై ఈ నెల 6న రంగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మృతుడి నాగేంద్ర తండ్రి బక్కా వెంకటేశులు, తల్లి లక్ష్మి, చిన్నాన్న బక్కా వీర్రాజు, చిన్నమ్మ మంగ, సోదరుడు వీరబాబు తెలిపారు. ఫిర్యాదు చేయడంతో పాటు అక్రమ సంబంధం నడుపుతున్న తోరాటి శివకు సంబంధించిన బైక్‌ను కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించి న్యాయం చేయమని ఎస్సై శివప్రసాద్‌ను వేడుకున్నామన్నారు. అయినా ఎస్సై పట్టించుకోలేదని, నిందితుడు శివ వద్ద లంచం తీసుకుని తాము అప్పగించిన బైక్‌ను కూడా ఇచ్చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మరింత రెచ్చిపోయిన శివ విచ్చలవిడిగా వీరలక్ష్మి వద్దకు వచ్చేవాడని, తాము ఫిర్యాదు చేసినప్పుడే శివపై చర్యలు తీసుకుని ఉంటే తమ బిడ్డ బతికి ఉండేవాడని వాపోయారు. సంఘటనా స్థలం వద్దకు వచ్చిన సీఐ సుమంత్, డీఎస్పీ విద్య వద్ద కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసి ఎస్సై శివప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని వారికి సీఐ, డీఎస్పీ హామీ ఇచ్చారు. -
ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోనలుగురి హత్య తీవ్ర కలకలం రేపింది. వీరిలో గర్భిణీ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. హత్యలు జరిగిన తీరు చేసిన పోలీసులే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయిపోలీసులు అందించిన సమాచారం ప్రకారం బిహార్‌లోని పాట్నా జిల్లాకు చెందినఈ కుటుంబం ఢిల్లీలోని సమయ్‌పూర్ బద్లీలో గత రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. కేవత్ ఆజాద్‌పూర్ మండిలో కూరగాయల విక్రేతగా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం అద్దె ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ గదిలో అనిత (30), మూడు, నాలుగు, ఐదేళ్ల వయస్సున్న ఆమె కుమార్తెలు మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. వీరిని అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది.ఉదయం 8 గంటల ప్రాంతంలో సమీప బంధువు పోలీసులుకు, ఇతరులకు సమాచారం ఇవ్వడం విషయం వెలుగులోకి వచ్చింది. భర్త కేవత్ పరారీలో ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.ఈ సంఘటనతో పొరుగువారు కూడా ఒక్కపారిగా షాక్‌కు గురయ్యారు. మొదట్లో కొంచెం గొడవపడినా, వీరంతా ఆ తరువాత సంతోషంగా ఉండేవారని పొరుగువారు చెప్పారు. అటుఅనిత వదిన, 36 ఏళ్ల సుగ్ని దేవి మాట్లాడుతూ, తన 10 ఏళ్ల కుమారుడు రక్తపు మడుగులో పడి వున్నవారిని గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని, ఆ జంట మధ్య ఎటువంటి వైవాహిక విభేదాలు లేవని, అంతా బాగానే ఉందని చెబుతోంది. ఇద్దరూ చాలా ప్రేమగా ఉండేవారని మరో వదిన సోని దేవి వాపోయింది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వారి మధ్య గొడవ జరిగిందని. కేవత్ తన భార్య, పిల్లలపై దాడి చేయడానికి ముందు వారిని మద్యం తాగించి ఉండవచ్చని ప్రాథమికంగా తేలిందని, నిర్దిష్ట కారణం వెలుగులోకి రాలేదని పోలీసు అధికారి తెలిపారు, వివాహేతర సంబంధం, మగపిల్లవాడి కోసం, సహా ఇతర అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. భర్తను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. హత్య వెనుక గల ఉద్దేశ్యాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పారిపోయినట్టు గుర్తించారు.క్రైమ్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది. -
కన్న కొడుకులా ఆదరిస్తే ఆస్తికోసం పెద్దమ్మనే కడతేర్చాడు, చివరికి
తోడబుట్టిన చెల్లెలే కదా అని ఆదరించింది. ఆమె కొడుకును కన్నకొడుకు కంటే మిన్నగా చూసుకుంది. కట్ చేస్తే ఇద్దరూ కలిసి ఆమె ప్రాణమే తీసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఫిబ్రవరి 19న స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీస్‌లో ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జయలక్ష్మి (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తొలుత అందరూ ఆమెది సహజ మరణమే అనుకున్నారు. కానీ జయలక్ష్మి లివ్-ఇన్ భాగస్వామి శ్రీనివాస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ చిక్కనాయకనహళ్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం తెలిసింది. జయలక్ష్మి సోదరి, ఆమె కొడుకే హత్య చేశారని చిక్కనాయకనహళ్లి పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఆమె చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో సోదరి అనసూయ, ఆమె కుమారుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 19న జయలక్ష్మి మృతి చెందగా, ఒక రోజు తర్వాత ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తుండగాఅసలు విషయం తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం!పోలీసులు సమాచారం ప్రకారం జయలక్ష్మి భర్త, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 19 సంవత్సరాల క్రితం మరణించాడు. భర్త చనిపోయాక ఆమె శ్రీనివాస్ అనే వ్యక్తితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించింది. అటు జయలక్ష్మి సోదరి అనసూయ తన భర్తతో విభేదాలతో విడిగా ఉంటోంది. దీంతో జాలి తలచి అధికారికంగా చంద్రశేఖర్‌ను దత్తత తీసుకున్నట్టు రికార్డులు లేనప్పటికీ సొంత కొడుకు కంటే మిన్నగా ఆదరించింది. చదువుకు అన్ని విధాలా సాయపడింది. అయితే ఇటీవల అనసూయ, కొడుకు జయలక్ష్మి, శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి మకాం మార్చారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. చివరికి జయలక్ష్మ , శ్రీనివాస్ కొత్త లీజుకు తీసుకున్న నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో జయలక్ష్మి నుంచి రావాల్సిన సాయం అందదని, ఆమె ఆస్తులన్నింటినీ తన భాగస్వామికి బదిలీ చేస్తుందని భయపడి, తల్లీకొడుకు హత్యకు కుట్ర పన్నారు. ఆమె మరణం తర్వాత వారు కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని కూడా ప్లాన్ చేశారట. -
పక్షవాతంతో భర్త.. 70 ఏళ్ల మహిళ హత్య : రూ. 65 లక్షల గోల్డ్ చోరీ
బెంగళూరు: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. పెద్ద వయసులో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ దంపతులను టార్గెట్‌గా చేసుకున్నాడో వ్యక్తి. 70 ఏళ్ల మహిళను హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న నగలతో పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన శోభ, రంగనాథ్ దంపతులు. నెలమంగళలోని హీరాపూర్ ప్రాంతంలోని కోటే బీడీలో నివసిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. పైగా గత 15 ఏళ్లుగా భర్త రంగనాథ్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. భార్య శోభ అతణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. సంఘటన జరిగిన రోజు, ఆ జంట తమ దినచర్య ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఇంటికి వచ్చారు. ఇదే అదనుగా భావించిన హోల్‌సేల్ దుకాణ యజమాని శివకుమార్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆభరణాల దుకాణ యజమాని కుమార్తె శోభ ఒంటిమీద ఉన్న గొలుసు, గాజులు, ఇతర బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. మరికొంత బంగారం, డబ్బు కోసం ఇంట్లో వెతికాడు. దాదాపు రూ. 65 లక్షల విలువైన దాదాపు 450 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేసి అక్కడినుంచి ఉడాయించాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టు ప్రేక్షకుడిగా నటిస్తూ నేరస్థలానికి తిరిగి వచ్చాడు. .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగనాథ్‌కు ఫిజియోథెరపీ చేయడానికి వైద్యుడు ఇంటికి వచ్చినప్పుడు ఈ హత్య విషయం వెలుగు చూసింది. ఫిజియో థెరపిస్ట్ ఇంటికి వచ్చేసరికి శోభ రక్తపుమడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె ప్రాణం పోయింది. పక్షవాతంతో బాధపడుతున్న భర్త కూడా ఆమె పక్కనే పడి ఉనన్నాడు. బహుశా ఈ దాడి గురించి తనికి తెలిసి ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మోటార్ సైకిల్‌పై పారిపోతున్న దృశ్యాలను గుర్తించారు. స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా శివకుమార్ ఈ హత్యకు పాల్పడి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. శివకుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు మోటార్ సైకిల్, హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్‌ను సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
Vanasthalipuram: రెండో పెళ్లి చేసుకుందని భార్యను చంపిన మాజీ భర్త
-
ప్రియురాలిని చంపి.. ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఎంబీఏ విద్యార్దిని తన ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. హత్య చేసిన తర్వాత ఆమె ఆత్మతో మాట్లాడేందుకు నిందితుడు తాంత్రిక పూజలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. .అసలేమి జరిగిందంటే?24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని ఫిబ్రవరి 11(మంగళవారం) సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తన స్నేహితుల బర్త్‌డే పార్టీకి వెళ్తున్నానని, రాత్రి 11.00 గంటలకు వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ ఎప్పటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు మిస్సింగ్ కంప్లీట్ ఇచ్చాడు. ఇదే సమయంలో ఆమె మొబైల్ నెంబర్ నుంచి అభ్యంతరకర ప్రైవేట్ వీడియో తన కాలేజ్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ అయింది. కాలేజీ యాజమాన్యం ఆ వీడియోను వెంటనే డిలీట్ చేశారు. ఆ వీడియోలో కనిపించకుండా పోయిన యువతితో పాటు మరో యువకుడు ఉన్నాడు. అతడే ఆమె క్లాస్మేట్, ప్రియుడు పీయూష్ ధనోటియా. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తెస్తుండగా, పీయూష్ నిరాకరించేవాడు. ఇదే విషయంలో ఫిబ్రవరి 12న ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంలో పీయూష్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత నిందితుడు మహారాష్ట్రలోని పన్వేల్‌కు పారిపోయాడు. అక్కడ ఒక హోటల్లో ఉంటూ యూట్యూబ్‌లో "ఆత్మలను ఎలా పిలవాలి?" అని వెతికి, కుంకుమ, గాజులు, పసుపుతో తాంత్రిక పూజలు నిర్వహించాడు. చనిపోయిన తన ప్రియురాలి ఆత్మతో మాట్లాడాలని అతను ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.వెలుగులోకి వచ్చింది ఇలా..ఇండోర్‌లోని ద్వారకాపురి ప్రాంతంలో పీయూష్ ధనోటియా అద్దెకు ఉండేవాడు. అక్కడే వారిద్దరూ కలిసేవారు. అయితే హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ద్దె గది నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా, యువతి మృతదేహం నగ్నంగా మంచంపై పడి ఉంది. -
ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం.. ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు
-
బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతా..!
యశవంతపుర(బెంగుళూరు): ఉత్తర కన్నడ జిల్లా కారవార సిద్ధాపురలో వసంత నాయక్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు కమలాకర భట్‌ను నిందితురాలు సుచిత్ర హనీట్రాప్ చేసి బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది. హనీట్రాప్ చేసిన విషయాన్ని భర్త మహేశ్ నాయక్ వెల్లడించారు. జ్యోతిష్యుడు కమలాకర భట్‌ను సుచిత్ర హనీట్రాప్ చేయటంతో పాటు ప్రైవేట్ వీడియో రికార్డ్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించారు. కమలాకర్ భట్ సుచిత్రకు దగ్గర అయిన తరువాత ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకుంది. పిల్లలు, తాను నీ జతలోనే ఉంటామని కమలాకర భట్‌తో చెప్పి, తమను బాగా చూసుకోవాలని డిమాండ్ చేసింది. బాగా చూసుకోక పోతే నీ మర్యాదను బజారుకు ఈడ్చుతానంటూ కమలాకర భట్‌ను బెదిరించినట్లు సమాచారం. మర్యాద పోతుందనే భయంతో సుచిత్ర, ఆమె పిల్లలను కమలాకర భట్ తన వద్దనే ఉంచుకున్నాడు. ఈ విషయాన్ని తన కుమార్తెలు చెప్పినట్లు మహేశ్ నాయక్ విలేకరులకు వెల్లడించారు. ఫస్ట్‌లుక్‌కు రూ.10 వేలు.. సుచిత్ర బుట్టలో పడిన కమలాకర్ భట్.. ఫస్ట్ లుక్‌లో రూ.36 వేలు చెల్లించాడు. ఫస్ట్‌లుక్‌లో రూ.10 వేలు వస్తే చాలు అనుకున్న సుచిత్రకు ఒక్కసారిగా 36 వేలు రావడంతో సంతోష పడింది. ఇందులో ఆమె వేతనం కింద రూ.25 వేలు, షాపింగ్‌కు రూ.10 వేలు తీసుకున్నట్లు సుచిత్రా భర్త మహేశ్ నాయక్ చెబుతున్నారు. -
వెయిటర్..ఏడేళ్ల ప్రేమ.. హానీమూన్ మర్డర్‌లో కీలక విషయాలు
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హానీమూన్-2 హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితురాలు అంజూతన ప్రియుడు సంజూల మధ్య ఏడేళ్ల క్రితమే ప్రేమ మెుదలైనట్లు అధికారుల విచారణలో తేలింది. అంతేకాకుండా వీరిద్దరూ గతంలో ఓ వివాహంలో పరిచయం అయినట్లు తెలుస్తోంది.పెళ్లైన మూడు నెలలకే జనవరి 30న అంజలి అనే మహిళ తన భర్త అశీశ్‌ను ప్రియుడితో కలిసి హత్య చేయించిన సంగతి తెలిసిందే. అయితే వీరు ఏడేళ్ల క్రితమే తొలిసారిగా పరిచయం అయినట్లు విచారణలో తేలింది. విచారణలోని వివరాలు..2018లో జరిగిన ఓ వివాహంలో అంజలి, సంజయ్‌లు తొలిసారిగా కలిశారు. ఆవివాహంలో వెయిటర్‌గా పనిచేయడానికి వచ్చిన సంజయ్, అంజలిని ప్రేమలోకి దింపాడు. అనంతరం తన ఫోన్ నెంబర్ ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ సమయంలో తనకు మెుబైల్ లేకపోవడంతో వేరే వారి ఫోన్‌తో వారికి సంజయ్‌కి కాల్ అంజలి కాల్ చేసేది. అయితే కొద్దిరోజుల తర్వాత ఇద్దరికి కాంటాక్ట్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 2024లో అంజలి ఫోన్ కొనుగోలు చేయడంతో ఇద్దరికి తిరిగి కాంటాక్ట్ ప్రారంభమయ్యింది. ఆసమయంలో వారిద్దరూ మరింతగా దగ్గరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే వారి కుటుంబసభ్యులు తనకు అశీశ్‌తో వివాహం నిశ్చయించారు. అయితే కుటుంబసభ్యులకు భయపడి అంజలి 2025 అక్టోబర్ 30న అశీశ్‌ను వివాహం చేసుకుంది. అయితే అనంతరం కూడా సంజయ్‌తో వాట్సాఫ్ కాల్ మాట్లాడుతూ వస్తుంది. అయితే ఈ హత్య జరగడానికి 16 రోజుల ముందు అంజలి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. జనవరి 30న తన ప్రణాళిక ప్రకారం భోజనం ముగిసిన తర్వాత వాకింగ్‌కు వెళదామని తన భర్తను కోరింది. అనంతరం తన ప్రియుడికి వాట్సాఫ్‌లో వారున్న సమాచారం పంపింది. దీంతో సంజయ్ తన ఇద్దరు మిత్రులు రోహిత్, సిద్ధార్థ్‌లతో కలిసి అక్కడ ఉన్నాడు. వారిని చూడగానే అశీశ్‌ను కొట్టి చంపారు. అనంతరం అతని మృతదేహాం పైనుంచి వాహనం తీసుకెళ్లారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం తెలియడంతో తన గుట్టు రట్టయ్యింది. విచారణలో తాజాగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. -
4 దశాబ్దాల నిరీక్షణ ఫలించిన వేళ
ప్రయాగ్‌రాజ్: చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకుపైగా కేసులో నిందితునిగా ఉంటూ సమాజంలో హంతకుడు అనే ముద్ర తో బతుకీడిస్తున్న 100 ఏళ్ల వృద్ధునికి ఎట్టకేలకు కేసు నుంచి మోక్షం లభించింది. 1982నాటి హత్యకేసులో ధనీరామ్‌ను నిర్దోషిగా పేర్కొంటూ అలహాబాద్ హైకో ర్టు డిజిజన్ బెంచ్ తాజాగా తీర్పును వెలువర్చింది.దీంతో దాదాపు 42 సంవత్సరాల తర్వాత కేసు నుంచి ధనీరామ్ విముక్తుడయ్యాడు. నత్తనడకన సాగే కేసుల విచారణ, కోట్ల కొలదిగా పేరుకుపోయిన కేసుల కొండల మధ్య సరిగ్గా వందేళ్ల వయసులో ధనీరామ్ నిర్దోషిగా బయటపడడం విశేషం. దేశ న్యాయవ్యవస్థలో న్యాయం కోసం కొన్ని సందర్భాల్లో దశాబ్దాల తరబడి వేచి ఉండక తప్పదన్న చేదునిజాన్ని ధనీరామ్ కేసు మరోసారి స్మరణకు తెచి్చందని పలువురు న్యాయనిపుణులు వ్యాఖ్యానించారు. అసలేంటీ కేసు? ఉత్తరప్రదేశ్‌లో 1982 ఆగస్ట్ 9వ తేదీన ఒక భూవివాదం చివరకు గున్వా అనే వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ వివాదంపై 1984లో కేసు నమోదైంది. ఈ కేసులో హమీర్‌పూర్‌కు చెందిన ధనీరామ్తోపాటు మైకూ, సత్తిదిన్లను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు నేరాభియోగాలు మోపారు. విషయం తెల్సి ప్రధాన నిందితుడు మైకూ పారిపోగా సత్తిదిన్, ధనీరామ్లను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇద్దరినీ దోషులుగా తేలుస్తూ హమీర్పూర్ సెషన్స్‌కోర్టు యావజ్జీవకారాగార శిక్ష విధిస్తూ 1984లోనే తీర్పు చెప్పింది. వెంటనే ధనీరామ్, సత్తిదిన్ హైకోర్టును ఆశ్రయించి అదే ఏడాది బెయిల్‌మీద బయటికొచ్చారుగానీ శిక్షరద్దు పిటిషన్ అలాగే పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఈలోపే సత్తిదిన్ మరణించారు. 42 సంవత్సరాల తర్వాత గత నెల జస్టిస్ చంద్రధారీ సింగ్, జస్టిస్ సంజీవ్ కుమార్ల అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ శిక్షరద్దు పిటిషన్‌ను విచారించింది. ‘‘ఇన్ని సంవత్సరాలుగా ఈ కేసు ఇలాగే పెండింగ్‌లో పడిపోవడం అత్యంత నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆనాడు ప్రత్యక్షసాక్షులుగా చెబుతున్న వాళ్ల వివరాలు, వాంగ్మూలాలు ఎఫ్ఐఆర్లో లేవు. కేవలం అనుమానంతోనే ధనీరామ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. బాధితుడిని ఇతను తుపాకీతో కాల్చిచంపినట్లుగా బలమైన సాక్ష్యాధారాలే లేవు. దశాబ్దాలపాటు విచారణలో ఆలస్యం, అలసత్వంతో న్యాయ వితరణ అనేది సవ్యంగా జరగదు. సంశయలాభం కింద ఇతనికి కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నాం. సెషన్స్ కోర్టు విధించిన శిక్షను రద్దుచేస్తున్నాం’’అని 23 పేజీల తీర్పులో ధర్మాసనం పేర్కొంది. వందేళ్ల వయోభారం, న్యాయ వితరణలో అసాధారణ ఆలస్యం కారణంగానూ ఈయనకు శిక్షను రద్దుచేస్తున్నామని ధర్మాసనం వివరించింది. ఆనాడు బెయిల్ కోసం సమరి్పంచిన బెయిల్బాండ్ నగదు పూచీకత్తులనూ తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. -
సోనమ్‌ను మించిన ఖతర్నాక్ అంజూ.. ఈ హనీమూన్ కథలో ట్విస్టులెన్నో!
ఆ దంపతులకు పెళ్లయి అప్పటికే మూడు నెలలే అయ్యింది. కొత్త కాపురంలో ఎంతో అన్యోన్యంగా మెలిగారు వాళ్లు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఓ సరదా సాయంత్రం ఇద్దరూ హైవేపై వాకింగ్‌కని బయల్దేరారు. ఇంతలో ఓ వాహనం హఠాత్తుగా దూసుకొచ్చి ఇద్దరినీ ఢీ కొట్టింది. భర్త అశీష్‌కు వాహనం బలంగా తగలడంతో స్పాట్లోనే చనిపోయాడు. భార్య అంజూ అపస్మాకర స్థితిలో రోడ్డ పక్కన పడిపోయింది. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు వాళ్లను గమనించి వాళ్లను ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. అశీశ్ మృతదేహం స్ట్రెచ్చర్ మీద ఉంది. తన ప్రియాతిప్రియమైన భర్త ఇక లేడని తెలిసి గుండెలు అవిసెలా రోదిస్తున్న అంజూను చూసి అంతా ‘‘అయ్యో పాపం’’ అనుకున్నారు. ఈ ఘటనను తొలుత హిట్ అండ్ రన్ కేసుగా పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. అయితే విచారణలో అంజూ తడబడింది. పైగా తన బంగారు చెవి పొగులు కనిపించడం లేదని.. ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారని చెప్పింది. దీంతో విచారణను పోలీసులు పలు కోణాల్లో జరపగా.. ఈ కేసు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది.హనీమూన్ పేరిట భర్తను రాష్ట్రంకాని రాష్ట్రానికి తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో ప్రియుడితో కలిసి హత్య చేయించింది మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన సోనమ్. ఆపై ఎలాంటి అనుమానాలు రాకుండా పెద్ద కథే నడిపించింది. హనీమూన్ మర్డర్ కేసుగా మేఘాలయాలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన నెల వ్యవధిలో.. తెలంగాణలోని గద్వాల జిల్లాలో సర్వేయర్‌గా పని చేసే తేజేశ్వర్‌ను అతని భార్య ఐశ్వర్య ఖతర్నాక్ స్కెచ్‌తో మర్డర్ చేయించింది. ఈ రెండు ఘటనలు ఆ జంటకు పెళ్లైన స్వల్పకాలంలో జరగడంతో.. సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చే నడిచింది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఘటనే.. రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలో మరో హనీమూన్ మర్డర్ కేసు బయటపడింది. పెళ్లైన కొన్నాళ్లకే తన భర్త అశీశ్‌ను ప్రియుడి&కోతో కలిసి కిరాతకంగా హత్య చేయించింది భార్య అంజూ. అంతేకాదు.. కేసును హిట్ అండ్ రన్ కేసుగా క్లోజ్ చేయించేందుకు శతవిధాల ప్రయత్నించింది. జనవరి 30వ తేదీ సాయంత్రం జరిగింది ఇదే.. అశీష్-అంజూలు జంటగా.. సాయంత్రం షికారు పేరుతో వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన సంజూ(అంజూ ప్రియుడు) అశీశ్‌పై బలంగా దాడి చేశాడు. కింద పడిపోయిన అశీల్‌ను రాకీ (రోహిత్), బాదల్ (సిద్ధార్థ్) గట్టిగా పట్టుకోగా.. సంజూ-అంజూలు ఊపిరి ఆగేదాకా గొంతు నులిమారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అశీష్ మృతదేహాన్ని తమ వాహనంతో బలంగా ఢీ కొట్టి దూరం పడిపోయేలా చేశారు. ఆపై తన ఒంటిపై ఉన్న నగలను ప్రియుడికి అప్పగించి.. రోడ్డుకు ఓ పక్కన పడిపోయినట్లు నటించింది అంజూ. అక్కడే దొరికింది.. అయితే వాంగ్మూలాల సమయంలో ఒక్కోసారి ఒక్కోలా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్.. ఆమెను అడ్డంగా దొరికిపోయేలా చేసింది. అనుమానంతో అంజూ ఫోన్ రికార్డులు పరిశీలించగా.. అందులో సంజూ అనే వ్యక్తితో తరచూ ఆమె మాట్లాడినట్లు తేలింది. అంతేకాదు.. అశీశ్ కలిశాక ఆ కాల్స్ మరింత ఎక్కువ అయ్యాయని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించగా.. అంజూ-సంజూలు నిజం ఒప్పేసుకున్నారు. అశీశ్‌తో తనకు వివాహం ఇష్టం లేదని.. పెద్దల బలవంతం మేరకే చేసుకున్నానని.. పెళ్లి తర్వాత ఓరోజు సంజూ ఇంటికి వెళ్లి తన భర్తను అడ్డు తొలగించుకోవడం గురించి మాట్లాడుకున్నామని.. ఈ ప్లాన్‌ను సంజూ తన స్నేహితులతో అమలు చేశాడని వాంగ్మూలం ఇచ్చింది. ఆపై దొంగతనం జరిగినట్లు నాటకం ఆడాలని ప్రయత్నిస్తే.. పోలీసులే హిట్ అండ్ రన్‌గా కేసు నమోదు చేసుకోవడంతో తన పని తేలిక అయ్యిందని భావించానని.. కానీ, పోలీసుల విచారణలో కంగారులో తడబడ్డానని అంజూ చెప్పుకొచ్చింది. దీంతో.. కేసును హత్య కేసుగా మార్చుకున్న పోలీసులు అశీశ్ భార్య అంజు, ఆమె ప్రియడు సంజు, సంజూ స్నేహితులు రాకీ, బాదల్‌ను అరెస్టు చేశారు. సోనమ్ కూడా..కిందటి ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన హనీమూన్ హత్య కేసు గుర్తుండే ఉంటుంంది. సోనమ్ తన తండ్రి దగ్గర పని చేసే రాజ్ కుష్వాహా అనే వ్యక్తిని ప్రేమించి.. ఆపై భర్త రాజా రఘువంశీని ఇష్టంలేని పెళ్లి చేసుకుని.. మంచిగా నటిస్తూ హనీమూన్ పేరిట భర్తను మేఘాలయాకు తీసుకెళ్లి అక్కడ ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేయించిది. ఆపై ఏం ఎరగనట్లు కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి.. ఆపై రోడ్డుపై ఓ దాబాకు దీనావస్థలో(డ్రామా) చేరి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భర్త హత్య
నగరంపాలెం (గుంటూరు): నిద్రమాత్రల పొడిని కలిపిన బిర్యానీని భర్తకు వడ్డించి, మత్తులోకి జారుకున్నాక దారుణంగా హత్యచేసిన భార్యను, అందుకు సహకరించిన ప్రియుడిని, ఆర్ఎంపీని దుగ్గిరాల పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసు వివరాలను సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన లోకం శివనాగరాజు (48)కి 2008లో లక్ష్మీమాధురితో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. శివనాగరాజుకు ఉల్లి వ్యాపారం, షేర్ మార్కెట్లో నష్టాలు రావడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో.. భార్య లక్ష్మీమారుతి తొలుత దుగ్గిరాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా, తర్వాత విజయవాడలోని ఓ సినిమా థియేటర్లో పనికి చేరింది.అక్కడి బుకింగ్ కౌంటర్లో పనిచేసే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన కొండవీటి గోపీతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గోపీని భర్తకు పరిచయం చేయగా వీరు స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో.. గతంలో హైదరాబాద్‌లో గోపీ పనిచేసిన కార్యాలయంలో డ్రైవర్‌గా చేరిన శివనాగరాజు ఇటీవల దుగ్గిరాల వచ్చాడు. భార్య, పిల్లలతో గోపీ ఓ ఫ్లాట్‌లో ఉంటున్నట్లు తెలిసి పలుమార్లు హెచ్చరించాడు.దీంతో శివనాగరాజును అడ్డు తొలగించుకోవాలని లక్ష్మీమాధురి, గోపీ నిర్ణయించుకున్నారు. గోపీ తన స్నేహితుడైన గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఎర్రగుంట్లపాడుకు చెందిన ఆర్ఎంపీ కంభంపాటి సురేష్ వద్ద నిద్రమాత్రలు సేకరించాడు. వాటిని లక్ష్మీమాధురికి ఇవ్వగా, ఆమె వాటిని పొడిచేసి బిర్యానీలో కలిపి ఈనెల 18న భర్తకు వడ్డించింది. భర్త నిద్రలోకి జారుకున్నాక లక్ష్మీమాధురి, గోపీ, సురేష్ కలిసి శివనాగరాజు ముఖంపై దిండుతో నొక్కిపెట్టి హత్యచేశారు. గుండెపోటు అంటూ నాటకం.. మర్నాడు ఉదయం భర్త గుండెపోటుతో మరణించినట్లు అందరినీ నమ్మించేందుకు భార్య యత్నించింది. కానీ, శివనాగరాజు మృతిపై తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా భార్యను ప్రశి్నంచగా.. అసలు విషయం బయటపడింది. పోలీసులు లక్ష్మీమాధురి, గోపీ, సురేష్ ను అరెస్టుచేశారు. వారి నుంచి 4 సెల్ఫోన్లు, మత్తుమాత్రల షీట్లు, అప్పడాల కర్ర, బుల్లెట్, కారు స్వా«దీనం చేసుకున్నారు. -
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్‌కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్‌కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్‌లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు. -
భర్తకు బెయిలిప్పించి మరీ.. యమపురికి!
ప్రకాశం జిల్లా: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణం, ఎక్కడ తనను భర్త అంతమొందిస్తాడోనన్న భయంతో కట్టుకున్నవాడినే కాటికి పంపంది ఆ మహిళ. గంజాయి కేసులో జైలుకెళ్లిన భర్తకు బెయిల్ ఇప్పించి మరీ కిరాయి హంతకులతో కలిసి పథకం ప్రకారం హత్యకు పాల్పడింది. ఇందుకు సొంత తమ్ముడితోపాటు సన్నిహితుడి సహకారం తీసుకుంది. పెద్దదోర్నాలకు చెందిన యువకుడు లాలూ శ్రీను మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఈ విషయాలు వెలుగుచూశాయి. హత్య జరిగిన రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. శుక్రవారం పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు పూర్వాపరాలను డీఎస్పీ యు.నాగరాజు వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. పెద్దదోర్నాలకు చెందిన అడపాల లాలూ శ్రీను లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో పేకాటకు అటవాటు పడి డబ్బు నష్టపోయాడు. పోగొట్టుకున్న సొమ్ము రాబట్టుకునేందుకు గంజాయి వ్యాపారం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా పెద్దదోర్నాలో మెకానిక్ షాపు నడుపుతున్న మృతుడి బావమరిది అశోక్‌కుమార్ వద్దకు సూర్యనారాయణ అనే వ్యక్తి తరచూ వచ్చేవాడు. పక్కనే కూల్‌డ్రింక్ పాపు నిర్వహిస్తున్న అశోక్ సోదరి ఝాన్సీతోనూ పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి చర్యలను గమనించిన లాలూశ్రీను భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో గంజాయితో పట్టుబడిన లాలూశ్రీను జైలుకు వెళ్లాడు. తనపై కోపంగా ఉన్న భర్త జైలు నుంచి బయటకు వస్తే చంపేస్తాడని ఆందోళన చెందిన ఝాన్సీ, సన్నిహితుడు సూర్యనారాయణ, సోదరుడు అశోక్‌కుమార్‌తో కలిసి హత్యకు పథకం రచించింది. భర్తను అంతమొందించేందుకు గుంటూరుకు చెందిన కిరాయి హంతకులు పార్థు, శంకర్‌కు రెండు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చింది. ఒంగోలు సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న భర్త లాలూశ్రీనుకు బైయిల్ వచ్చేలా చేయడంతోపాటు అతడిని కారులో దోర్నాలకు తెచ్చేలా ఏర్పాట్లు చేశారు. తొలుత చీమకుర్తి వద్ద శ్రీనును హతమార్చాలని చూసినా అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. మార్గమధ్యంలో పెద్దారవీడు సమీపంలోని అంకాలమ్మ గుడి వద్దకు రాగానే మూత్ర విసర్జన వంకతో కారు ఆపారు. ఆ తర్వాత శ్రీను కళ్లల్లో కారం చల్లి, రాళ్లు, కత్తులతో దారుణంగా హతమార్చారు. నిందితులు ఝాన్సీ, అశోక్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. సమావేశంలో త్రిపురాంతకం సీఐ హసన్, ఎస్సై సాంబశివయ్య పాల్గొన్నారు. -
పవిత్రకు దక్కని ఇంటి భోజనం
కర్ణాటక: చిత్రదుర్గం యువకుడు రేణుకాస్వామి హత్యకేసులో నిందితులు నటి పవిత్రాగౌడ, నాగరాజ్, లక్ష్మణ్‌కు వారానికి ఒకసారి ఇంటినుంచి భోజనం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన బెంగళూరు నగర సెషన్స్‌కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. సెషన్స్‌కోర్టు ఆదేశాలను ప్రశి్నస్తూ కామాక్షిపాళ్య సీఐ వేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు జడ్జి ఎం.నాగప్రసన్న విచారించారు. కింది కోర్టు ఆదేశాలను నిలిపివేశారు. దీనిపై మీ వాదన ఏమిటో తెలియజేయాలని పవిత్రాగౌడ, నాగరాజు, లక్ష్మణ్‌లకు జడ్జి ఆదేశించారు. ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వరాదు ప్రభుత్వ ప్లీడర్లు వాదిస్తూ, నిందితులకు ప్రత్యేక సౌలభ్యాలను కల్పించరాదని పేర్కొంటూ స్టే ఇవ్వాలని కోరారు. ఇదే కేసులో నటుడు దర్శన్ కు ఇంటి భోజనం అందించారా అని జడ్జి ప్రశ్నించారు. లేదు, మొదటి నిందితురాలు పవిత్రాగౌడ, ఇతరులు లక్ష్మణ్, నాగరాజ్‌ల కు ఇంటి భోజనానికి సెషన్స్ కోర్టు ఆదేశించిందని ప్లీడర్లు తెలిపారు. జైలులోని ఆహారం సురక్షత, నాణ్యతతో ఉంటుందని చెప్పారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు రూలింగ్‌లను ఉదాహరించారు. ఆలకించిన న్యాయమూర్తి.. ఎంతపెద్దవారైనా చట్టం అందరికీ ఒకటే, ప్రత్యేక సదుపాయాలను కలి్పస్తే చర్యలు తీసుకుంటామని గతంలో సుప్రీంకోర్టు తెలిపింది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా సౌలభ్యాలు ఇవ్వడం చట్ట విరుద్ధమంటూ స్టే ఇచ్చారు. దీంతో నటి పవిత్రగౌడ ఇంటి భోజనానికి దూరమయ్యారు. -
సునీత పిటిషన్‌పై ‘సుప్రీం’ సీరియస్.. ఇలాగైతే మరో పదేళ్లకే!
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ప్రక్రియను మరింత జాప్యం చేసేలా నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే విచారణ పూర్తయిన అంశాలను మళ్లీ తిరగతోడుతూ, కాలయాపన చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.తదుపరి దర్యాప్తునకు సంబంధించి కింది కోర్టు (ట్రయల్ కోర్టు) ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో ‘మినీ ట్రయల్’ (సమాంతర విచారణ) నిర్వహించలేమని, పిటిషనర్ కోరినట్లుగా ప్రతి చిన్న అంశానికీ మళ్లీ విచారణకు ఆదేశిస్తూ పోతే కేసు కొలిక్కి రావడానికి మరో పదేళ్లు పడుతుందని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. మినీ ట్రయల్ నడపాలనుకుంటున్నారా?సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టు (సీబీఐ కోర్టు) తమ అభ్యర్థనలను పక్కన పెట్టిందంటూ ఛార్జిషీటులోని అంశాలను ఒక్కొక్కటిగా చదివే యత్నం చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ కలుగజేసుకుంటూ.. ‘ఇవన్నీ ట్రయల్ కోర్టు చూసుకోవాలి్సన అంశాలు. మీరు ఇక్కడ మినీ ట్రయల్ నడపాలనుకుంటున్నారా? ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ మళ్లీ దర్యాప్తు కోరుకుంటూ పోతే.. మేం హైకోర్టుకు పంపాల్సి వస్తుంది. అక్కడి నుంచి మళ్లీ కింది కోర్టుకు వెళ్లేసరికి మరో పదేళ్లు పడుతుంది. ఈలోపు ట్రయల్ ముగియదు. నిందితులకూ హక్కులు ఉంటాయి కదా?’ అని ఘాటుగా ప్రశ్నించారు.గోడ మీద పిల్లి వాటం వద్దు: సీబీఐకి సుప్రీం చురకలు.. ఇదే సమయంలో సీబీఐ తీరును కూడా ధర్మాసనం తప్పుబట్టింది. పిటిషనర్ అడిగారు కదా అని ప్రతిదానికీ తలొగ్గడం సరికాదని హితవు పలికింది. ’దర్యాప్తు సంస్థగా మీ వైఖరి ఏమిటి? మీకు దర్యాప్తు అవసరమనిపిస్తోందా? లేదా? ఇప్పటికే చేసిన దర్యాప్తుతో సంతృప్తి చెందారా? ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. అంతేగానీ కోర్టు ఆదేశిస్తే చేస్తాం అంటూ గోడ మీద పిల్లి వాటంగా వ్యవహరించవద్దు. ఒకవేళ నిజంగానే దర్యాప్తులో లోపాలున్నాయని భావిస్తే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. పిటిషనర్ కోరిన మేరకు కాకుండా, సాక్ష్యాధారాల మేరకు మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి. అంతేగానీ, కోర్టు భుజంపై తుపాకీ పెట్టి కాల్చొద్దు. విచారణ అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి..’ అని సీబీఐ న్యాయవాదిని ధర్మాసనం గట్టిగా మందలించింది.ఆ ఒక్క అంశంపైనే అనుమతి..కింది కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. హత్య జరిగిన రోజు (మార్చి 15, 2019) అర్ధరాత్రి సమయంలో కిరణ్ యాదవ్ (ఏ–2 సోదరుడు), అరుణ్‌రెడ్డి (ఏ–1 బంధువు) మధ్య మెసేజ్‌ల మార్పిడిపై మాత్రమే తదుపరి దర్యాప్తునకు సెషన్స్ కోర్టు అనుమతించిందని గుర్తు చేసింది. ఆ ఒక్క అంశం మినహా మిగిలిన వాటిపై దర్యాప్తు అవసరం లేదని కింది కోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు మళ్లీ అవే అంశాలను సుప్రీంకోర్టులో ప్రస్తావించడంపై అసహనం వ్యక్తం చేసింది.నిందితుల హక్కులను కాలరాస్తారా..? ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ.. తాము విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ పిటిషనర్లు ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు పేరుతో కేసును సాగదీస్తున్నారని కోర్టుకు విన్నవించారు. స్పీడ్ ట్రయల్ తమ హక్కు అని, ఏళ్ల తరబడి కేసును సాగదీయడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కేసును లాజికల్ ఎండ్‌కు (తార్కిక ముగింపు) తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. విచారణను నిరవధికంగా సాగదీస్తూ పోతే నిందితుల హక్కులకు భంగం వాటిల్లుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించింది.ఫిబ్రవరి 5న తేల్చేస్తాం.. ఈ నేపథ్యంలో తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అనే దానిపై స్పష్టమైన వైఖరితో రావాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఆ రోజుతో ఈ అంశంపై ఒక స్పష్టతనిస్తామని పేర్కొంది. దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో పిటిషనర్లకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. -
ఎన్నారై సుప్రియ కేసులో బిగ్ ట్విస్ట్
ఆస్ట్రేలియా అడిలైడ్‌లో జరిగిన ఎన్నారై మహిళ సుప్రియ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె భర్త విక్రాంత్ ఠాకూర్ ఎట్టకేలకు నోరు విప్పారు. ఉద్దేశపూర్వకంగా తన భార్యను చంపలేదని.. తన కొడుకు కోసమైనా తనను క్షమించి వదిలేయాలని కోర్టును బతిమిలాడుకుంటున్నాడు.భారత మూలాలు ఉన్న విక్రాంత్ ఠాకూర్(42), భార్య కొడుకుతో అడిలైడ్‌లో స్థిరపడ్డాడు. గతేడాది డిసెంబర్ 21వ తేదీన తన నివాసంలో సుప్రియ(36) అపస్మారక స్థితిలో కనిపించింది. ఎమర్జెన్సీ టీం ప్రయత్నాలు చేసినా ఆమెను కాపాడలేకపోయింది. ఈ ఘటనలో అనుమానాల కింద భర్తను అప్పటికప్పుడు అదుపులోకి తీసుకన్నారు స్థానిక పోలీసులు. ఆపై హత్య కేసు నమోదు చేసి స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే.. అదే ఏడాది(డిసెంబర్ 23) జరిగిన కోర్టు విచారణలో విక్రాంత్ నోరు విప్పలేదు. బెయిల్ కోసం కూడా అప్లై చేసుకోలేదు. దీంతో భార్యను అతనే చంపి ఉంటాడని అంతా భావించారు. ఆ సమయంలో డీఎన్ఏ రిపోర్ట్స్, పోస్ట్‌మార్టం నివేదిక వంటి ఆధారాలు సిద్ధం కావడానికి సమయం కావాలని ప్రాసిక్యూటర్లు కోరారు. దీంతో విచారణ వాయిదా పడింది. తాజాగా జనవరి 14న మరోసారి విచారణ జరగ్గా.. తన భార్యను తాను కావాలని హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది అనుకోకుండా జరిగిన మరణం(manslaughter). నేనేమీ కావాలని ఆమెను చంపలేదు అంటూ వాదించాడు. తన బిడ్డ కోసం తనను వదిలేయాలంటూ వేడుకున్నాడు. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది కోర్టు. విక్రాంత్-సుప్రియ కొడుకు సంరక్షణను అక్కడి ఇండియన్ కమ్యూనిటీ చూసుకుంటోంది. ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. "సుప్రియా తన కొడుకు భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసింది. నర్సుగా మారి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఆమెకు ఉండేది. ఆమె ఆకస్మిక మరణం కుమారుడి జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేసింది" అని ఆ పేజీలో పేర్కొన్నారు. -
22 రూపాయల కోసం హత్య
చేగుంట(మెదక్ జిల్లా): కేవలం 22 రూపాయల పాత బాకీ విషయంలో గొడవపడి, తోటి కార్మికుడిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా అనంతసాగర్ శివారులోని సప్తగిరి కెమికల్ పరిశ్రమలో పనిచేసే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిరాజ్ (30), అదే రాష్ట్రానికి చెందిన మహేశ్‌కుమార్‌ధర్మ ఒకే గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 15న పండుగ రోజు మద్యం సేవించేందుకు ఇద్దరు స్నేహితులు బయటకు వెళ్లారు. గ్రామశివారులో మద్యం తాగుతూ సిరాజ్ తనకు బాకీ ఉన్న రూ.22 విషయంలో మహేశ్‌కుమార్ గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరగడంతో మహేశ్, సిరాజ్ తలను చెట్టుకు బాది, అనంతరం రాయితో తలపై గాయపరిచాడు. దీంతో సిరాజ్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మహేశ్‌కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మాసాయిపేట శివారులో నిందితుడు మహేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యకు దారితీసిన వివరాలు తెలిపాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
ఆహార్యమే ఆధారమై!
నేరస్థలంలో దొరికే ఆధారాలు నిందితులను పట్టించడానికే కాదు, ఒక్కోసారి అమాయకులను రక్షించడానికీ ఉపయోగపడతాయి. నగరంలో నమోదైన హైప్రొఫైల్ కేసులో ఒకటి రికార్డుల్లో నిలిచిపోయే జగదాంబ జ్యూలర్స్ యజమాని ప్రహ్లాద్ అగర్వాల్ భార్య పుష్పాబాయి హత్యకేసు దర్యాప్తులో తొలుత అనుమానితుల జాబితా భారీగా ఉంది. అనేకమందిని విచారించారు. ఎట్టకేలకు సంఘటనా స్థలంలో నిందితుడు వదిలి వెళ్లిన దుస్తులు, జేబులో లభించిన వస్తువుల ఆధారంగా కేసు కొలిక్కి వచ్చింది.బషీర్‌బాగ్‌లో జగదాంబ జ్యూలర్స్ నిర్వహించే ప్రహ్లాద్ అగర్వాల్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.14లో నివసించేవారు. వీరిది ఉమ్మడి కుటుంబం. అగర్వాల్ భార్య పుష్పాబాయితో పాటు ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనుమలు ఒకే ఇంట్లో ఉండేవారు. అగర్వాల్, ఆయన కుమారులు 2005 అక్టోబర్ 5 ఎప్పటిలాగే వారి బంగారం దుకాణానికి వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో కోడలు రాధిక నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ వారందరూ హడావుడిగా ఇంటికి పరిగెత్తేలా చేసింది. అప్పటికే ఆ ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు డాక్టర్లును పిలిపించారు. వాళ్లు వచ్చి రక్తపు మడుగులో ఉన్న పుష్పాబాయిని నిశితంగా పరీక్షించి, చనిపోయినట్లు నిర్ధారించారు. దీన్ని హత్యగా తేల్చారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా హత్యాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ వివిధ ప్రాంతాల్లో లభించిన ఓ చొక్కా గుండీ, ప్యాంటు–షర్టు, ఆడవారి చెప్పులు, కుర్తా–పైజామాలతో పాటు హతురాలు పుష్పాబాయి చేతిలో ఉన్న పొడువాటి వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఓ పాదముద్రనూ గుర్తించి, దాన్ని కెమెరాలో బంధించారు. ఇంటి చుట్టూ క్షుణ్ణంగా పరిశీలించగా, హత్య జరిగిన గది నుంచి వంటింటి మీదుగా బయట వరకు పడిన రక్తపు మరకలు కనిపించాయి. వీటి నమూనాలు సేకరించి, సాంకేతికంగా పరిశీలించిన దర్యాప్తు అధికారులు– అవి హతురాలివి కావని, హంతకుడికి అయిన గాయం నుంచి కారినవని నిర్ధారించారు. తన భార్య ప్రతిరోజూ ధరించే రెండు బంగారు గాజులు కనిపించట్లేదంటూ ప్రహ్లాద్ పోలీసులకు తెలిపారు. ఎక్కువ సొత్తు చోరీకి గురికాకపోవడంతో ఈ హత్య దోపిడీ దొంగల పని కాదని భావించారు. కేవలం పరిచయస్తుల పనిగా అనుమానించి, ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుల పట్టుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు తొలుత ఒక అనుమానితుల జాబితా రూపొందించి, కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరికొందరి పూర్వాపరాలు తెలుసుకుని ఒక్కోక్కరికీ క్లీన్చిట్ ఇస్తూ పోయారు. ఇదిలా ఉండగా, హతురాలి చేతిలో లభించిన వెంట్రుకలను పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు కొందరి అనుమానితుల నుంచి సేకరించిన వాటితో పోల్చారు. అవి ఎవరి వాటితోనూ సరిపోలలేదు. దీంతో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో పుష్పాబాయి నమూనాలతోనూ పరీక్షించి ఆమెవే అని తేల్చారు. హత్య జరిగిన గది బయట స్వాధీనం చేసుకున్న చెప్పులు పుష్పాబాయి కోడలివిగా తేలాయి. ఘటనా స్థలిలో పడి ఉన్న కుర్తా–పైజామా ఆ ఇంట్లో వారివే అని స్పష్టం కావడంతో దానిపై ఉన్న రక్తపు మరకల కోణంలో ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే హత్యానంతరం నిందితులు తమకు అంటిన రక్తపు మరకలు తుడుచుకోవడానికి ఆ దుస్తులు వినియోగించారని వెల్లడైంది. అంతకంతకూ కేసు జటిలంగా మారుతుండటంతో అధికారులు మరింత లోతుగా, సాంకేతికంగా దర్యాప్తు చేశారు. ఆ ఇంట్లో పని చేస్తున్న ఒడిశా యువకుడిని, అతడి కుటుంబీకులు, సన్నిహితులను అనుమానితుల జాబితాలో చేర్చారు. హత్యాస్థలిలో లభించిన నమూనాలు వీరిలో ఎవరి వాటితోనూ సరిపోలేదు. దీంతో దర్యాప్తు అధికారులు వారందరికీ క్లీన్ చిట్ ఇస్తూ వదిలేశారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలుల్లో ఉన్న చొక్కా బటన్, ప్యాంటు–షర్టులపై పోలీసులు దృష్టి పడింది. రక్తపు మరకలు అంటిన ఆ ప్యాంట్, షర్ట్ విప్పే క్రమంలోనే దాని గుండీ తెగిపడి ఉంటుందని తేల్చారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఓ జత బట్టలు కనిపించట్లేదంటూ యజమాని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హత్య చేస్తున్నప్పుడు ధరించిన దుస్తులను అక్కడ వదిలేసిన నిందితుడు– యజమాని దుస్తులను వేసుకు వెళ్లాడని వెల్లడైంది. నిందితుడు వదిలేసిన ప్యాంట్ కాళ్ల దగ్గర మడిచి ఉండటం, జేబులో కాల్చిన చింత గింజలు వంటివి లభించడంతో హత్య చేసిన వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితిగతులను పోలీసులు అంచనా వేశారు. ఆ ఆహార్యంతో ఉండే వ్యక్తులు ఎవరంటూ హతురాలి సంబంధీకులను పోలీసులు ప్రశ్నించగా, వెలుగులోకి వచ్చిన పేరే నర్సింహ. హతురాలి కుమార్తె వద్ద గతంలో పనిమనిషిగా ఉండి మానేసినట్లు వెల్లడైంది. మరోపక్క హత్యకు ముందు ఆ ఇంటికి రాకపోకలు సాగించిన వారి వివరాలు ఆరా తీసిన పోలీసులు ఆ జాబితాలో నర్సింహతో పాటు నారాయణ అనే మరో వ్యక్తి ఉన్నట్లు తేల్చారు. హత్య తర్వాత అతడు ఆ చుట్టుపక్కలకు రాకపోవడంతో అనుమానం నిజమైంది. దీంతో అతడి ఇంటి అడ్రస్ తీసుకున్న పోలీసులు గగన్‌మహల్ వద్ద ఉన్న గదిపై దాడి చేశారు. అప్పటికే అది తాళం వేసి ఉండటం, స్వస్థలమైన మెదక్ జిల్లా చిన శంకరంపేటలోనూ అతడి ఆచూకీ లేకపోవడంతో ఈ హత్య నర్సింహ పనిగా నిర్ధారించారు. నర్సింహ కోసం తాము వెతుకుతుంటే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని పోలీలుసు భావించారు. గగన్‌మహల్‌లో అతడు అద్దెకు తీసుకున్న గదిలో సామాను అలానే ఉందా? లేదా? అనేది గమనించారు. అవన్నీ అక్కడే ఉండటంతో ఎప్పటికైనా తిరిగి వస్తాడని, ముందు అతడి కోసం పోలీసులు గాలించట్లేదని అనుకునేలా చేద్దామని దర్యాప్తు అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు గగన్‌మహల్‌లో ఉన్న గదిపై నిఘా ఉంచిన మఫ్టీ పోలీసులు ఎట్టకేలకు నర్సింహ రాకను గుర్తించి పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా, నారాయణ అనే వ్యక్తిని పనిలో చేర్చే ఉద్దేశంతోనే ప్రహ్లాద్ అగర్వాల్ ఇంటికి అతడితో కలిసి వెళ్లానని, అయితే పుష్పాబాయి వద్ద ఉన్న సొత్తు చూసి దాని కోసం నారాయణతో కలిసి ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత భయం వేయడంతో కేవలం గాజులు మాత్రమే పట్టుకుని పారిపోయామని బయటపెట్టాడు. దీంతో గాలింపు కొనసాగించిన అధికారులు నారాయణను కూడా అరెస్టు చేయగలిగారు. శ్రీరంగం కామేష్ -
కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో..
హైదరాబాద్: విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారులు అనాథలయ్యారు.. హత్యకేసులో తండ్రి జైలుకు వెళ్లగా.. తల్లి నిర్దయగా పిల్లలను వదిలి వెళ్లింది. దీంతో 40 రోజులుగా ఆ చిన్నారులు స్థానికులు ఇచ్చే ఆహారం తిని బతుకుతున్నారు. ఇలా ఎన్నాళ్లు? అని ఆలోచించిన ఓ న్యాయవాది సహకారంతో.. కోర్టు ఆదేశంతో చిన్నారుల బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుంది. సోమవారం కుషాయిగూడలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సత్తు రవీందర్, సిడబ్ల్యూసి మేడ్చల్ జిల్లా చైర్మన్ రాజారెడ్డితో కలిసి వెల్లడించారు. మల్లాపూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు (13) కూతురు (9), చిన్న కూతురు (2). తండ్రి హత్య కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇక పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన తల్లి వారిని వదిలివెళ్లి అనాథలుగా మార్చింది. దీంతో అభం శుభం ఎరుగని ఆ పిల్లలు చుట్టు పక్కలవారు ఏమైన పెడితే తింటూ అర్థాకలితో గత 40 రోజులుగా కాలం గడుపుతున్నారు. ఇరుగు పొరుగువారు, ఇంటి యజమాని పిల్లల దుస్థితిని గోపాల్‌రెడ్డి అనే న్యాయవాది సాయంతో మేడ్చల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జిల్లా న్యాయమూర్తి పిల్లల బాగోగులు చూసుకోవాలంటూ మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్ రాజారెడ్డి ముగ్గురు పిల్లలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇద్దరిని హోంకు తరలించగా మరో చిన్నారి ఆరు సంవత్సరాల లోపు కావడంతో అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ శిశువిహార్‌లో అప్పగించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురుదుష్టకరమని, అనాథలు, అభాగ్యులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసులను కానీ.. న్యాయసేవాధికార సంస్థలను కాని ఆశ్రయిస్తే తగిన న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్ స్పష్టం పేర్కొన్నారు. పిల్లల దీనస్థితిపై స్పందించి చేరదీసిన పెంటయ్య, శ్రీనివాస్, అనితలను అభినందించారు. ప్రజల్లో అవగాహన పెరగాలి చట్టాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి. చట్టంపై సరైన అవగాహన కొరవడి ఉచిత న్యాయసేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి అనాథ పిల్లలు, దిక్కులేని అభాగ్యులను ఆశ్రయం కలి్పంచే అనేక మార్గాలున్నాయి. అలాంటి వారు ఏవరైనా ఉంటే స్థానిక పోలీస్స్టేషన్లు, న్యాయసేవాధికార సంస్థలను ఆశ్రయిస్తే వారికి తగిన న్యాయం జరుగుతుంది. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం జరగాలి. – బాల భాస్కర్, మేడ్చల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
షాకింగ్ ట్విస్ట్: కోరిక తీర్చలేదన్న కోపంతోనే..
ఇంటర్నెట్లో బూతు సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో ఓ టీనేజర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. చాలారోజులుగా ఆమెపై ఓ కన్నేసి ఉంచిన ఆ కామాంధుడు.. అదను చూసి ఆమెపై విరుచుకుపడ్డాడు. ప్రతిఘటించడంతో ఆ కోపంలో ఆమెను అత్యంత కిరాతకంగా చంపాడు. వారం కిందట ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిందని భావిస్తున్న టెక్కీ షర్మిల(36) కేసులో ఈ షాకింగ్ ట్విస్ట్ బయటపడింది.రామమూర్తి నగర్‌లోని సుబ్రమణి లే అవుట్‌లోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్‌లో జనవరి 3న అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో షర్మిల(36) అనే యువతి చనిపోయింది. షార్ట్ సర్క్యూట్‌తో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని.. మంటలు చెలరేగడంతో ఊపిరాడకే ఆమె మరణించినట్లు తొలుత అంతా భావించారు. అయితే.. పోలీసులకు మాత్రం అనుమానం వచ్చింది. అందుకే బీఎన్ఎస్ (BNSS) సెక్షన్ 194(3)(iv) కింద అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే..ఆ ఎవిడెన్స్‌తో..దర్యాప్తులో భాగంగా సైంటిఫిక్ మెథడ్స్, టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలు సేకరించారు. ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు లేవని.. ఆమె ఊపిరి ఆడకే చనిపోయిందని.. అయితే అది హత్యే అని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆమె పక్కింట్లోనే ఉండే కర్నాల్ కురై(18) కదలికలపై నిఘా వేశారు. చివరకు.. అతనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు.ఆరోజు ఏం జరిగిందంటే.. కొడగు జిల్లా విరాజ్పేట్కు చెందిన కర్నాల్ తన తల్లితో కలిసి సుబ్రమణి లే అవుట్‌లోని సంకల్ప నిలయలో అద్దెకు ఉంటున్నాడు. ఇంటర్ చదివే ఈ కుర్రాడు.. నీలి చిత్రాలకు, సోషల్ మీడియాకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో పక్క ఇంట్లోనే ఉంటున్న షర్మిల, ఆమె రూమ్మేట్లపై కన్నేశాడు. తన తల్లి ద్వారా వాళ్లతో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేశాడు. దక్షిణ కన్నడకు చెందిన షర్మిలకు ఇంకా పెళ్లి కాలేదు. ఓ ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తూ కొలీగ్‌తో ఉంటోంది. ఆమె రూమ్మేట్ రెండు నెలల కిందట స్వస్థలం అసోంకి వెళ్లింది. దీంతో షర్మిల ఒక్కతే ఉంటుందని గుర్తించాడు.ఘటన జరిగిన రోజు రాత్రి.. స్లైడింగ్ కిటికీ(పక్కకు జరిగే కిటికీ) గుండా లోపలికి చొరబడ్డాడు కర్నాల్. తన కోరిక తీర్చాలని బతిమిలాడాడు. ఆమె తిరస్కరించడంతో బలాత్కారం చేయబోయాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అరుస్తుందేమోనన్న భయంతో.. నోరు, ముక్కు మూసి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ పెనుగులాటలో ఆమెకు గాయాలై.. తీవ్ర రక్తస్రావం అయ్యింది కూడా. ఆపై భయంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకుని ఆమె బట్టలు, నేరానికి కారణమైన వస్తువులను బెడ్‌పై ఉంచి వాటికి నిప్పంటించి, ఆమె మొబైల్ ను తీసుకుని పారిపోయాడు. చేసిన నేరాన్ని కర్నాల్ ఒప్పుకోవడంతో అతనిపై బీఎన్ఎస్ 103(1), 64 (2), 66, 238 కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. -
పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్ చేస్తే అస్థిపంజరం దొరికింది
అర్థరాత్రి వేళ, కాన్పూర్ పోలీసులు స్థానిక టవర్ సమీపంలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో బయటపడిన దాన్ని చూసిన పోలీసు అధికారులతోపాటు, చలిని కూడా లెక్క చేకుండా పనిలో నిమగ్నమైన కూలీలకూ చెమటలు పట్టాయి. నేలమాళిగలో ఏడు అడుగుల లోతులో దారుణమైన స్థితిలో అస్థిపంజరం దొరికింది. ప్రేమో, వ్యామోహమో, నమ్మిన వ్యక్తికి జరిగిన తీరని ద్రోహం తాలూకు విషాద గాథ ఇదీ..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన తల్లి కనిపించడం లేదని కొడుకు ఫిర్యాదు చేయడం ఈ విషయం వెలుగు చూసింది. దొరికిన అస్థిపంజరం ఏడుగురు పిల్లల తల్లి అయిన 45 ఏళ్ల రేష్మాదిగా పోలీసులు భావిస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా నిర్ధారించేందుకు సిద్ధమవుతున్నారు. రేష్మా భర్త రాంబాబు సంఖ్వార్ మూడేళ్ల క్రితం మరణించాడు. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణం తర్వాత, రేష్మా తన పొరుగువాడైన గోరాలాల్‌తో అనుబంధం పెంచుకుంది. ఆ తరువాత కొద్దికాలానికే, తన పిల్లలను వదిలి గోరాలాల్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. దీంతో మనస్తాపం చెందిన రేష్మా పిల్లలు ఆమెతో సంబంధాలు తెంచుకుని విడిగా జీవిస్తున్నారు.ఎలా బయటపడింది?తల్లితో సంబంధాలు తెంచుకున్న రేష్మా కుమారుడు గత ఏడాది నవంబర్ 29న కుటుంబంలో జరగబోయే ఒక పెళ్లికి ఆహ్వానం పంపాడు. రేష్మా పెళ్లికి రాలేదు. దీంతో బబ్లూకు అనుమానం వచ్చింది. గోరాలాల్ ఇంటికి వెళ్లి రేష్మా గురించి ఆరా తీశాడు."నీ అమ్మ ఇక తిరిగి రాదు" అని గోరాలాల్ బదులిచ్చాడు. జోక్ చేస్తున్నాడనుకుని మొదట్లో పెద్దగా అనుమానం రాలేదు. కానీ పదే పదే అడిగినా, కచ్చితమైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ వచ్చాడు. ఇక లాభం లేదనుకుని బబ్లూ పోలీసులను ఆశ్రయించాడు.డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దిగ్భ్రాంతికరమైన నిజంబబ్లూ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, పోలీసులు గోరాలాల్ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. చివరికి, అతను నిజం చెప్పాడు. గత సంవత్సరం ఏప్రిల్‌లో తనకు, రేష్మాకు మధ్య గొడవ జరిగిందని, దీంతో ఆమెను రేష్మాను వదిలించు కోవాలనుకున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపొమ్మని బెదిరించాడు. రేష్మా నిరాకరించింది. దీనివల్ల తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే అతడు రేష్మాను గొంతు నులిమి చంపేశాడు. రెండు రోజుల పాటు అతను మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, దానిని ఎలా వదిలించుకోవాలో ఆలోచించాడు. ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్!దానిని కాలువలో పడేయాలని ప్లాన్ చేశాడు, కానీ కొన్ని రోజుల్లో మృతదేహం నీటిపై తేలుతుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఆ తర్వాత గ్రామంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టాలనుకున్నాడు. విచారణ సమయంలో ఆ ప్రదేశం గురించి పొరపాటున చెప్పడంతో, ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆభరణాలు , బట్టల ద్వారా ఆమెను గుర్తించారు. అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, రేష్మా ఎముకలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు.ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె? -
ప్రణయ్ హత్య కేసులో శ్రవణ్‌కుమార్‌కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు నిందితుడు శ్రవణ్‌కుమార్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్, మరో రూ.25 వేలకు రెండు పూచీకత్తులు సమరి్పంచాలని ఆదేశించింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్య కేసులో జిల్లా కోర్టు గతేడాది తీర్పు వెలువరించడం తెలిసిందే. తనకు విధించిన జీవిత ఖైదును సవాల్ చేస్తూ శ్రవణ్‌కుమార్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. విచారణ ముగిసే వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) వేశారు. ఈ ఐఏపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. నిందితుడు గతంలో జైల్లో ఉన్న విషయాన్ని, అతని వయసును పరిగణనలోకి తీసుకుని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.


