నిందితులను వదిలేశారు | Ganesh Murder Case on Ponnuru Road | Sakshi
Sakshi News home page

నిందితులను వదిలేశారు

Oct 23 2025 7:18 AM | Updated on Oct 23 2025 7:18 AM

Ganesh Murder Case on Ponnuru Road

గుంటూరు ఎస్పీకి మృతుడు 

కుర్రా నాగ గణేష్‌ కుటుంబం ఫిర్యాదు
 

పట్నంబజారు (గుంటూరు): తన కుమారుడిని నడిరోడ్డుపై అంతమొందిస్తే పోలీసు­లు డబ్బులు తీసుకుని నిందితులను వదిలేశారని ఇటీవల గుంటూరు పొన్నూరు రోడ్డు­లో దారుణ హత్యకు గురైన కుర్రా నాగగణేష్‌ తల్లి శివనాగ అంజలి ఆరోపించారు. ‘పదహా­రు రోజుల పండుగ కూడా గడవకుండానే నా కుమారుడిని నడిరోడ్డులో బలి తీసుకున్నారు.. వారికి నచ్చని పెళ్లి చేసుకున్నాడని పెళ్లి కుమార్తె అన్న, తండ్రి కలిసి నా బిడ్డను పొట్టన బెట్టుకున్నారు.. 

ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ముగ్గురిని పోలీసులు డబ్బు­లు తీసుకుని వదిలి పెట్టేశారు.. అమ్మా.. చంద్రబాబు భార్య గారూ.. మీకు ఉన్నదీ ఒక్కడే కుమారు­డు.. మీ బిడ్డకే ఇలా జరిగితే ఊరుకుంటా­రా..? పోలీసులు అన్యాయంగా వ్యవహరించారు. రూ.8, 10 లక్షలు ఇస్తే ఎవరినై­నా వది­లేస్తారా..?’ అంటూ విలపించారు. ఈ కేసులో అసలు నిందితులను వదిలేసి పోలీ­సులే దర్యాప్తును నీరుగారుస్తున్నారంటూ బుధ­వారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. 

వేణును తప్పించేందుకే వీరయ్యను చేర్చారు...! 
నాగ గణేష్‌ హత్య కేసులో నిందితులకు సహకరించారంటూ వైఎస్సార్‌ సీపీ నేత, దుగ్గిరాల జడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త దాసరి వీరయ్య­ను కేసులో నిందితుడిగా చేర్చిన విషయం విదితమే. అయితే గుమ్మా వేణును తప్పించేందుకే వీరయ్యను చేర్చారని తాము భావిస్తున్నట్లు మృతుడి సోదరి, తల్లి, భార్య పేర్కొ­న్నారు. తాము ఎప్పుడూ వీరయ్యను చూసింది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వీరయ్యను కేసులో ఇరికించారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement