కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన యవకుడు బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో అతివేగంతో లగ్జరీ కారు టెస్లా కారును నడిపి ఒక మహిళ మృతికి కారణ మయ్యాడు. అతనిపై పోలీసులు కేసునమోదు చేశారు. డిటెన్షన్ సెంటర్‌కు తరలించిన అతని బెయిల్ ఫీజు రూ. 10.81కోట్లు( 1.2 మిలియన్ డాలర్లు) గా నిర్ణయించారు.
కాలిఫోర్నియాలో 240 కిలోమీటర్ల వేగంతో టెస్లాతో ఎస్‌యూవీని ఢీకొట్టాడు నిందితుడు 28 ఏళ్ల వ్యక్తి బాదల్ ధోలారియా .శనివారం (నవంబర్ 29) ప్రమాదం జరిగినప్పుడునిందితుడు మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు ఆరోపించారు. టెస్లా మోడల్ 3ని కారుతో, ఫోర్డ్ బ్రోంకో అనే ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న 41 ఏళ్ల మహిళా ప్రయాణీకురాలు అలిక్స్ మారి స్పార్క్స్ ని బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. దీంతో అతనపై సెకండ్ డిగ్రీ హత్య మరియు ఇతర నేరారోపణలు మోపబడ్డాయి.
డోలారియా అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఫోర్డ్ బ్రోంకో వెనుక నుంచి ఢీకొట్టాడని శాన్ రామన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. డోలారియా కస్టడీలో ఉండగా అతని బెయిల్ కోసం ఏకంగా 1.2 మిలియన్ల డాలర్లుగా నిర్ణయించారు. అంతేకాదు "మీరు బలహీనంగా ఉంటే, డ్రైవ్ చేయవద్దు. మీరు జీవితాలతో జూదం ఆడుతున్నారు. మద్యం, గంజాయి, చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలు లాంటి వాహనాన్ని సురక్షితంగా నడపగల మీ సామర్థ్యాన్ని దెబ్బతీసే ఏదైనా పదార్థం మన రోడ్లపై మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది." దీన్ని సహించ బోము అని కాంట్రా కోస్టా కౌంటీ జిల్లా న్యాయవాది డయానా బెక్టన్ తీవ్రంగా హెచ్చరించారు.
ఇదీ చదవండి: IndiGo Crisis: హద్దే లేదు రారమ్మంటున్న ఎయిరిండియా


