భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్‌లలో ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నైలలో కెరీర్ ప్లానింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు ఐటీ జంటలు. దాంతో ఆ తర్వాత పేరెంట్స్‌గా మారలేకపోతున్నాం అని బాధపడుతున్న జంటలెందరో. సుదీర్ఘ పనిగంటలు, జీవనశైలి మార్పులు, ఆలస్యంగా వివాహం, పని ఒత్తిడి తదితర కారణాలతో చాలా జంటలు తమ సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు.
చివకికి ఏక్లినిక్‌ని సంప్రదిస్తే మంచిదన్న టెన్షన్‌తో సన్నిహితులు, బంధువులు సూచనలను ఆశ్రయిస్తారు. చివరికి అక్కడ ఈ ఐవీఎఫ్ సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తారు. ఆఖరికి అందులో కూడా వరుస ఫెయిలర్స్ చూసి విసిగివేసారిన దంపతులెందరో. కొందరు మాత్రం పట్టుదలతో తల్లిందండ్రలవ్వగా మరికొందరికి మాతం అదొక కలగానే మిగిలిపోతుంది.
ఆ సమస్యను చక్కబెట్టేందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీ మరో ముందడుగు వేసింది. సహజంగా గర్భం దాల్చలేక ఇబ్బందిపడి క్లినిక్‌లను ఆశ్రయిస్తే ఆఖరికి ఐపీఎఫ్‌లో కూడా నిరాశను ఎదుర్కొన్న జంటలకు ఊరటనిచ్చేలా..భావోద్వేగ మద్దతను అందిస్తోంది ఒయాసిస్ ఆస్పత్రి. సౌకర్యవంతమైన టెలి-కన్సల్టేషన్‌లతో మద్దతిస్తోంది దంపతులకు.
అంతేగాదు సంతానోత్పత్తి సంరక్షణ వృత్తిపరమైన నిబద్ధతలతో సమలేఖనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని అన్ని ఆస్పత్రులు అమలు చేసేందుకు ముందుకొస్తే.. చాలా జంటలకు తల్లిందండ్రులు అయ్యే అవ్వకాశం ఉంటుందని పేర్కొంది.
చదవండి: అతి పిన్న వయస్కురాలైన యువ బిలియనీర్..! ఏకంగా రూ. 10వేల కోట్లు..


