డ్యాన్సర్‌గా ప్రయాణం మొదలైనా ఆ అమ్మాయి ప్రయాణం.. అతి కొద్ది సమయంలోనే అంచెలంచెలుగా ఎదిగి..అత్యున్నత స్థాయిలో నిలిచింది. కేవలం 29 ఏళ్లకే అత్యంత పిన్న వయస్కురాలైన యువ బిలియనర్ రికార్డులకెక్కింది. ఆమె స్థాపించిన కంపెనీ ఏకంగా వేల కోట్ల విలువను చేరుకుంది. అలాగే ఆమె సందప కూడా రూ 10 కోట్లు పైనే నికర విలువను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఆమె ఎవరు.. అంత చిన్న వయసులో బిలియనీర్‌గా ఎలా అవతరించింది ఆ సక్సెస్ మంత్ర ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
ఆ అమ్మాయే బ్రెజిల్‌కు చెందిన లువానా లోప్స్ లారా. స్వయంకృషితో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా అవతరించింది. కేవలం 29 ఏళ్ల వయసుకే ఈ ఘనతను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆమె స్థాపించిన ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ కాల్షి.. ఇటీవలే 11 బిలియన్ డాలర్లు అంటే మన కరెనన్సీలో అక్షరాల రూ. 90 వేల కోట్లకు పైగా విలువను చేరుకోవడంతో ఈ ఘనత సాధించింది.
బ్రెజిల్‌లో జన్మించిన ఆమె రష్యాలోని బోల్షోయ్ థియేటర్ స్కూల్‌లో ప్రొఫెషనల్ బ్యాలరీనాగా (డ్యాన్సర్) ట్రైశిక్షణ పొందింది. ఆ తర్వాత కొంతకాలం ఆస్ట్రియాలో ప్రొఫెషనల్ బ్యాలెరినాగా ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అలాగే విద్యారంగంలో కూడా రాణించిందామె. అమెరికా వెళ్లి అక్కడ ఎంఐటీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సులో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే క్లాస్‌మేట్ తారెక్ మన్సూర్ (29 ఏళ్ల) కలిసింది.
ఆ తర్వాత 2018లో న్యూయార్క్ నగరంలోని ఫైవ్ రింగ్స్ క్యాపిటల్‌లో ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్నప్పుడూ వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ నేపథ్యంలోనే అంచనా-మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ను కాల్షి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారిద్దరు. అనుకున్నట్లుగా 2019లో కాల్షి కంపెనీని ప్రారంభించారు. . అయితే పలు సవాళ్లు అనంతరం 2020లో కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (CFTC) నుంచి ఆమోదం పొంది.. USలో మొదటి సమాఖ్య నియంత్రిత అంచనా-మార్కెట్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది.

2023లో నియంత్రణ సంస్థలు దాని ఎన్నికల ఆధారిత ఒప్పందాలను నిరోధించినప్పుడు పోరాటం తీవ్రమైంది. నిరుత్సాహపడకుండా, లోప్స్ లారా పోరాడారు. ఫలితంగా 2024 సెప్టెంబర్‌లో అమెరికా ఎన్నికల ట్రేడింగ్‌కు సంబంధించిన ఒక కీలకమైన దావాలో స్నేహితులిద్దరూ విజయం సాధించారు. అంతుముందు కాల్షి కంపెనీ నికర విలువ రూ. 4,100 కోట్లుగా ఉంది. ఎప్పుడైతే ఎన్నికల ట్రేడింగ్ పొందిన రాత్రి ఒక్కసారిగా రూ. 8 వేల కోట్లకు ఎగబాకింది.
అలా ఈ స్టార్టప్ సంపదలో దూకుడుగా విస్తరించింది. అంతేగాదు ఈ కాల్షి కంపెనీలో లారా 12 శాతం వాటా కలిగి ఉంది. దీంతో లారా వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగింది. ఆమె ఆస్తులు 1.3 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.10 వేల కోట్లకు పైమాట. దాంతో లారా ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కురాలైన స్వయంకృషి బిలియనీర్‌గా నిలిచింది. ఇక లారా తల్లి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా.. తండ్రి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. వారిద్దరి స్ఫూర్తితోనే ఆమె మసాచుసెట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, గణితంలో డిగ్రీలు పూర్తి చేసింది.
ఇంటర్న్‌షిప్‌ల ద్వారా క్వాంటిటేటివ్ ట్రేడింగ్‌లో అనుభవాన్ని పొందింది. అలా రియల్ వరల్డ్ సంఘటనల ఫలితాలపై.. ట్రేడింగ్ చేయాలనే ఆలోచనతో కాల్షి సంస్థను లారా స్థాపించడం విశేషం. ఇక లారా బిలియనీర్ కథ ఆర్జనలో సరికొత్త ట్రెండ్‌ని సృష్టించింది. దృఢ సంకల్పం, అభ్యున్నలి కోసం చేసే పదునైన ఆలోచనలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేందుకు లారానే ఒక ఉదాహరణ.
Kalshi raised $1B at an $11B valuation.
A decade ago, only a few thousand people knew what a prediction market was.
Eighteen months ago, most prediction markets were banned - until we overcame the government to set them free.
Over the past seven years, our community has opened… pic.twitter.com/hGDkYxkSlh— Tarek Mansour (@mansourtarek_) December 2, 2025
(చదవండి: Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్ మాయాజాలం)


