ఓ మారుమూల గ్రామంలో పచ్చటి పొలాల నడుమ పెరిగిన యువకుడు మొబైల్ ఫోన్‌తో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అతడి బాల్యం మొత్తం పొలాల మధ్య చిన్న చితక కూలి పనులతో సాగింది. అలా సరదాగా సాగిపోతున్న అతడి జీవితంలోకి సరదాగా కొన్న మొబైల్ ఫోన్ లైఫ్‌నే టర్న్ చేసింది.తొలుత తల్లిదండ్రులు చదువు పాడవుతుందని చాలా బయటపడ్డారు. కానీ అతడు తన క్రియేటివిటీతో సోషల్ మీడియా స్టార్‌గా ఎదగడమే కాదు నలుగురికి ఉపాధి మార్గం చూపించే రేంజ్‌కి వెళ్లిపోయాడు.
అతడే మహారాష్ట్ర, నెవాషేలోని గోమల్వాడి గ్రామనికి చెందిన రాహుల్ రాందాస్ తమ్నార్. తన బాల్యం ఎండల్లో కష్టపడి పనిచేయడంతో సాగింది. తన చుట్టూ ఉండే పచ్చిన పొలాల మధ్య తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా చిన్న చితక కూలిపనులు చేస్తూ పెరిగాడు. ఒకరోజు తల్లిదండ్రులు అడిగి మరి సరదాగా మొబైల్ ఫోన్ కొనుకున్నాడు.
ఇంత చిన్న వయసులోనూ ఫోన్‌తో ఆడుకుంటూ చదువు పాడు చేసుకుంటాడేమో అని తల్లిదండ్రుల చాలా బయటపడ్డారు. అయితే నేర్చుకోవాలనే ఒకే ఒక్క జిజ్ఞాసతో సోషల్ మీడియా గురించి, ప్రమోషన్‌లు, ఆన్‌లైన్ మార్కెటింగ్ వంటి వాటి గురించి బాగా తెలుసుకున్నాడు. అయితే ఆ క్రమంలో కొన్ని తప్పులు కూడా జరిగాయి. పలు సవాళ్లు కూడా ఎదురయ్యాయి. కానీ అతనెప్పుడూ ఆశను వదులుకోలేదు.
అలా ఏదో ఒకనాటికి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే తప్పనతో తన ప్రయత్నాన్ని విరమించలేదు. నెమ్మదిగా అతడి కష్టం ఫలించడం ప్రారంభించింది. రోజుకు రూ. 5వేలు నుంచి రూ. 6 వేలు రూపాయల వరకు సంపాదించడం ప్రారంభించాడు. అలా చాలా కొద్ది టైంలోనే లక్ష రూపాయాలు సంపాదించే రేంజ్‌కి ఎదిగిపోవడమే కాదు, ఏకంగా 400 నుంచి 500 మంది యువతకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా సాయం చేస్తున్నాడు.
అతని అంకితభావానికి డిజిటల్ స్కిల్ అవార్డు సైతం వరించింది. పొలాలతో మొదలైన అతడి ప్రస్థానం డిజిటల్ ప్రపంచంలోకి అడుపెట్టి తన జీవితాన్నే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా మార్చేస్తున్నాడు. ప్రస్తుతం అతడి స్టోరీ వైరల్‌గా మారింది. కేవలం డబ్బు ఉంటేనే గుర్తింపు రాదు, కష్టపడేతత్వం, నేర్చుకోవాలనే ఆరాటం ఉన్నవారికి విజయం వారి ఒడిలోకే వచ్చే వాలుతుంది అనేందుకు ఈ రాహుల్ రాందాస్‌నే ఉదాహరణ.
(చదవండి: ఆ అమ్మకు SIR సర్‌ప్రైజ్ గిఫ్ట్..! పాపం 40 ఏళ్లుగా..)


