లండన్‌లో సమోసాలు అమ్ముతున్న బిహార్ వ్యక్తి నెట్టింట తెగ వైరల్ అయ్యాడు. అది మరువక మునుపే తాజాగా మరో బిహార్ వ్యక్తి అదే బాటలో నడుస్తూ అందర్నీ అమితంగా ఆకర్షించాడు. లండన్‌లో రుచికరమైన సమోసాలను విక్రయిస్తున్న ఒక బిహార్ వ్యక్తి నెట్టింట సంచలనంగా మారి..ఎంతలా బిజినెస్ రన్ చేస్తున్నాడనేది అందరికీ తెలిసిందే.
అచ్చం అలానే ఇప్పుడు ఈవ్యక్తి లాస్ ఏంజిల్స్ వీధుల్లో చాయ్ పోహ అమ్ముతున్న వీడియో అందర్నీ విస్మయానికి గురి చేసింది. అంతేగాదు ఒకరకంగా ఇది కష్టపడేతత్వం, ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక గర్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవడం విశేషం. పైగా స్వతహాగా స్వదేశానికి దూరంగా ఉన్నా..వాటి మూలాలతో కనెక్ట్ అయ్యే ఉన్నా అన్నట్లుగా అతడు జీవిస్తున్న విధానం ఉంది.
అంతేగాదు విదేశాల్లో ఉన్నా.. హిందీలోనే మాట్లాడతాడు, బిహారీ వ్యక్తిగా గుర్తింపునే అత్యంత గౌరవంగా భావిస్తాడు. అంతేకాదండోయ్ లండన్‌లో ఆ వ్యక్తి అమ్మే టీ ఖరీదు రూ.782 కాగా, పోహా ఖరీదు రూ. 1,512లు. అంతర్జాతీయ నగరానికి అనుగుణంగా అతడు విక్రయించే ధరలు నిజాయితీని, సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అక్కడ స్థానిక లండన్‌ప్రజలు అతడి పొడవాటి జుట్టు, మీసాలను చూసి..ఏసుక్రీస్తుతో పోలుస్తూ ఉంటారని చెబుతున్నాడు.
(చదవండి: వలస వచ్చి..ప్రేమ 'నరకం'లో పడి..ఇప్పుడు 'కరోడ్‌పతి'గా..)


