స్మార్ట్‌ ఫోన్‌లు వద్దు..ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లే ముద్దు..!: పేరెంట్స్‌ | Know Reason Behind Why US Parents Are Buying Landlines Instead Of Smartphones Goes Viral | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ ఫోన్‌లు వద్దు..ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లే ముద్దు..!: పేరెంట్స్‌

Mar 1 2026 1:24 PM | Updated on Mar 1 2026 4:49 PM

US Parents Are Buying Landlines Instead Of Smartphones Goes Viral

ప్రస్తుతం తల్లిదండ్రులకు ఈ జెనరేషన్‌ పిల్లలను పెంచడం బహుకష్టం. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌లకు చిన్నప్పటి నుంచి అడిక్ట్‌ అయిపోతున్నారు ఈ తరం పిల్లలు. జస్ట్‌ మూడేళ్ల పిల్లలే స్మార్ట్‌ఫోన్‌ అంటూ పేచీలు, మారాంలు..అది ఇస్తే గానీ కుదురుగా ఉండరు. పైగా సాంకేతిక ప్రభావం చిన్నప్పటి నుంచి వారిపై ఉండటంతో సరిగా చదువుతారనే బెంగ ఎక్కువైపోతోంది తల్లిదండ్రుల్లో. పైగా రీల్స్‌ పిచ్చిలో..ఇన్‌ఫ్లుయెన్స్‌ర్‌ అవుతాననే అంటున్నారు తప్ప..ఇదివరకటి పిల్లల్లా ఇంజనీర్‌, డాక్టర్‌ అని చెప్పడం లేదు. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు అమెరికాలోని తల్లిదండ్రులు ఎలాంటి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారో తెలుసా..!?..అదేంటో తెలిస్తే కంగుతింటారు. 

చిన్న పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వడానికి ప్రత్యామ్నాయంగా అమెరికాలో చాలా కుటుంబాలు తిరిగి ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నాయట. సోషల్‌మీడియాఎక్స్‌పోజర్‌, ఆన్‌లైన్‌ భద్రత, పట్ల తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ ధోరణి ఎక్కువైంది అక్కడ. కొన్ని కుటుంబాలు పిల్లల్లో మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు అందిపుచ్చుకోవడానికి ఈ ల్యాంఢ్‌లైన్‌ టెలిఫోన్‌ మంచివని, యాప్‌లు, ఇంటర్నెట్‌ వంటి వాటి సాయం లేకుండా మంచిగా నేర్చుకోగలరని ప్రగాఢంగా నమ్ముతున్నారట. 

ఇలా అయితేనే పరధ్యానం లేకుండాం మంచి సంభాషణా చాతుర్యం పెరుగుతుందంటున్నారు. ఈ ఫోన్‌లు  కాన్ఫిడెన్స్‌గా మాట్లాడగలరిని, తల్లిదండ్రలులు అంటున్నారు. అంతేగాదు ఈ ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ద్వారానే మర్యాదగా సంభాషించడం, సమాధానం ఇవ్వడం తెలుసుకోగలరని, ఎవరితోనైనా మాట్లాడటానికి జంకరని చెబుతుండటం విశేషం. అదీగాక ఈ ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ల వల్ల సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అవ్వరు, బాధ్యతయుతమైన డిజిటల్‌ ఉపయోగం ఎలా అనేది కూడా తెలుసుకుంటారని అంటున్నారు. 

అంతేగాదు అక్కడ సైకాలజిస్టులు సైతం తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలకు ఉపయోగకరమైన మీడియా ప్లాన్‌ రూపొందిచాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతుండటం విశేషం. పైగా ఈ ధోరణిని భద్రత తోపాటు మంచి అర్థవంతమైన కమ్యూనికేషన్‌ పిల్లలలో ఉండాలని ఆకాంక్షిస్తూ చేస్తున్న వినూత్న ప్రయోగమని అక్కడి నిపుణులు సైతం దీనికి మద్దతు తెలుపుతున్నారట. మరి ఇదెంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాల్సిందే కదూ..!.

(చదవండి: బతుకు కోసం కాదు..గుర్తింపు కోసం చేసిన పోరాటం..!)

 

Advertisement
 
Advertisement
Advertisement