హార్ట్‌బీట్‌ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..! | Heart Stopped 14 Seconds: Stroke Survivors Story | Sakshi
Sakshi News home page

హార్ట్‌బీట్‌ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!

Mar 1 2026 2:58 PM | Updated on Mar 1 2026 2:58 PM

Heart Stopped 14 Seconds: Stroke Survivors Story

పుట్టుకతో వచ్చే రెండు రకాల గుండె లోపాలతో జన్మించిన కార్షియాక్‌ స్పెషలిస్ట్‌ అయినా ఆ మహిళ అలుపెరగని పోరాటం చేసి మరి జీవిస్తోందామె. ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్లు చేయించుకున్నా ఆశా అనే జ్యోతిని వెలిగిస్తూ..తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ప్రాణాంతకమైన ఆ గుండె పరిస్థితిని మందులతో నిర్వహిస్తూనే ఆరోగ్యకరంగా జీవిస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య పరిస్థితికి కుంగిపోయే వారికి ఆమె కథ ఓ ప్రేరణ

పుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మించిన కార్డియాక్ స్పెషలిస్ట్ ఏంజెలికి అసిమాకి ఇంటర్మెటెంట్‌ ఏవీ బ్లాక​ కారణంగా 14 సెకన్లపాట్లు గుండె ఆగిపోయే పరిస్థితితో పోరాడుతోందామె. ప్రాణాంతకమైన పరిస్థితిలో పోరాడుతున్న ఆమెకు సరిగ్గా 36 ఏళ్ల వయసులో వచ్చిన స్ట్రోక్‌ మరోసారి కుప్పకూలిపోయేలా చేసింది. అప్పుడే తెలిసింది ఈ ప్రాణాంతక పరిస్థితికి తోడు  గుండెలో "గ్యాపింగ్ హోల్" కూడా ఉందని నిర్థారణ అయ్యింది. ఆమెది ఆకస్మిక కార్డియాక్‌ మ సంబంధం ఉన్న పరిస్థితికి ఇది మరింత ప్రమాదకరమైన సంకట స్థితి.

ఎప్పటి నుంచి పోరాడుతోందంటే..
25 ఏళ్ల వయసులో ఏంజెలికీ తొలిసారిగా తనకు గుండెజబ్బుకి సంబంధించిన లక్షణాలు తొలిసారిగా కనిపించాయని చెప్పుకొచ్చింది. నెమ్మదిగా తలతిరడం నుంచి మొదలై నెలలుగా మూర్చపోయే వరకు దారితీసింది. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర లేకపోయినా..ఆమె ప్రాణాంతక గుండెజబ్బు బారినపడింది. పలు వైద్య పరీక్షల అనంతరం ఆమె హృదయస్పందన నిమిషానికి 120 బీట్స్ దాటినప్పుడల్లా ఆమె గుండె 14 సెకన్ల వరకు ఆగిపోతుందని వైద్యులు నిర్ధారించారు. దీని కారణంగా గుండెలో "పై నుంచి దిగువ గదులకు విద్యుత్ ప్రవహించదు, కాబట్టి ఆమెకు పేస్‌మేకర్ అవసరం. 

ఈ తీవ్రమైన గుండె జబ్బు గురించి వినడంతోనే ఏంజెలి ఇక తన జీవితం ముగిసిపోయిందనుకుంది. ఎందుకంటే బెడరూమ్‌ నుంచి బాత్రూమ్‌ వరకు కూడా వెళ్లలేనంతగా స్ప్రుహతప్పి పడిపోయేది. ఆ తర్వాత ఏంజెలికి ఫేస్‌మేకర్‌ని అమర్చారు. 1990లలో ఈ యంత్రంలో అనేక సమస్యలతో రావడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి ఆమెకు. ముఖ్యంగా బ్యాటరీలను నిరంతరం మార్చాల్సి వచ్చేది. ఆ క్రమంలో మెదడులోని రక్తనాళం పగిలి రక్తస్రావం కావడంతో స్ట్రోక్‌ను ఎదుర్కొంది. దాంతో ఆమెకు  ఓపెన్-హార్ట్ సర్జరీతో సహా ఐదు ఫేస్‌మేకర్లు, మూడు అబ్లేషన్‌ల, ఒక ఓపెన్-హార్ట్ సర్జరీతో సహ తొమ్మిది వైద్య చికిత్సలు తీసుకుంది. 

ఇలా ఆమె జీవితాంతం ఇన్ని అనారోగ్య సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ..లండన్ నుండి కార్డియోమయోపతిలో పిహెచ్‌డి పూర్తి చేసింది, తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్ చేసింది, అక్కడ ఆమె  ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది,. అలాగే అమెరికాలో 11 ఏళ్లు గడిపింది. అంతేగాదు ఏంజెలి తనలాంటి గుండె సమస్యతో బాధపడుతున్న వారికోసం..ఆ వ్యాధి నిర్థారణ పర్యవేక్షణ కోసం..ఒక పద్ధతిని ఆవిష్కరించింది. ఇది ప్రమాదకరమైన గుండె బయాప్సీలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. 

ఇక ఏంజెలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదీగాక ఏంజెలి పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కారణంగా అనేక గర్భస్రావాలను ఎదుర్కొని మరి..ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారామె. అయితే ఆ పిల్లలు ఇద్దరు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యల లోపాన్ని అధిగమించడమే కాకుండా దాన్నే తన కెరీర్‌గా ఎంచుకుని..ఆ సమస్యకు చెక్‌పెట్టే దిశగా అడుగులు వేయడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం.

(చదవండి: ఆర్మీ ట్రైనింగ్‌ సెంటర్‌లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్‌ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement