breaking news
heart attach
-
హార్ట్‌బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!
పుట్టుకతో వచ్చే రెండు రకాల గుండె లోపాలతో జన్మించిన కార్షియాక్ స్పెషలిస్ట్ అయినా ఆ మహిళ అలుపెరగని పోరాటం చేసి మరి జీవిస్తోందామె. ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్లు చేయించుకున్నా ఆశా అనే జ్యోతిని వెలిగిస్తూ..తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ప్రాణాంతకమైన ఆ గుండె పరిస్థితిని మందులతో నిర్వహిస్తూనే ఆరోగ్యకరంగా జీవిస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య పరిస్థితికి కుంగిపోయే వారికి ఆమె కథ ఓ ప్రేరణపుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మించిన కార్డియాక్ స్పెషలిస్ట్ ఏంజెలికి అసిమాకి ఇంటర్మెటెంట్ ఏవీ బ్లాక కారణంగా 14 సెకన్లపాట్లు గుండె ఆగిపోయే పరిస్థితితో పోరాడుతోందామె. ప్రాణాంతకమైన పరిస్థితిలో పోరాడుతున్న ఆమెకు సరిగ్గా 36 ఏళ్ల వయసులో వచ్చిన స్ట్రోక్ మరోసారి కుప్పకూలిపోయేలా చేసింది. అప్పుడే తెలిసింది ఈ ప్రాణాంతక పరిస్థితికి తోడు గుండెలో "గ్యాపింగ్ హోల్" కూడా ఉందని నిర్థారణ అయ్యింది. ఆమెది ఆకస్మిక కార్డియాక్ మ సంబంధం ఉన్న పరిస్థితికి ఇది మరింత ప్రమాదకరమైన సంకట స్థితి.ఎప్పటి నుంచి పోరాడుతోందంటే..25 ఏళ్ల వయసులో ఏంజెలికీ తొలిసారిగా తనకు గుండెజబ్బుకి సంబంధించిన లక్షణాలు తొలిసారిగా కనిపించాయని చెప్పుకొచ్చింది. నెమ్మదిగా తలతిరడం నుంచి మొదలై నెలలుగా మూర్చపోయే వరకు దారితీసింది. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర లేకపోయినా..ఆమె ప్రాణాంతక గుండెజబ్బు బారినపడింది. పలు వైద్య పరీక్షల అనంతరం ఆమె హృదయస్పందన నిమిషానికి 120 బీట్స్ దాటినప్పుడల్లా ఆమె గుండె 14 సెకన్ల వరకు ఆగిపోతుందని వైద్యులు నిర్ధారించారు. దీని కారణంగా గుండెలో "పై నుంచి దిగువ గదులకు విద్యుత్ ప్రవహించదు, కాబట్టి ఆమెకు పేస్‌మేకర్ అవసరం. ఈ తీవ్రమైన గుండె జబ్బు గురించి వినడంతోనే ఏంజెలి ఇక తన జీవితం ముగిసిపోయిందనుకుంది. ఎందుకంటే బెడరూమ్ నుంచి బాత్రూమ్ వరకు కూడా వెళ్లలేనంతగా స్ప్రుహతప్పి పడిపోయేది. ఆ తర్వాత ఏంజెలికి ఫేస్మేకర్ని అమర్చారు. 1990లలో ఈ యంత్రంలో అనేక సమస్యలతో రావడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి ఆమెకు. ముఖ్యంగా బ్యాటరీలను నిరంతరం మార్చాల్సి వచ్చేది. ఆ క్రమంలో మెదడులోని రక్తనాళం పగిలి రక్తస్రావం కావడంతో స్ట్రోక్‌ను ఎదుర్కొంది. దాంతో ఆమెకు ఓపెన్-హార్ట్ సర్జరీతో సహా ఐదు ఫేస్మేకర్లు, మూడు అబ్లేషన్ల, ఒక ఓపెన్-హార్ట్ సర్జరీతో సహ తొమ్మిది వైద్య చికిత్సలు తీసుకుంది. ఇలా ఆమె జీవితాంతం ఇన్ని అనారోగ్య సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ..లండన్ నుండి కార్డియోమయోపతిలో పిహెచ్డి పూర్తి చేసింది, తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్ చేసింది, అక్కడ ఆమె ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది,. అలాగే అమెరికాలో 11 ఏళ్లు గడిపింది. అంతేగాదు ఏంజెలి తనలాంటి గుండె సమస్యతో బాధపడుతున్న వారికోసం..ఆ వ్యాధి నిర్థారణ పర్యవేక్షణ కోసం..ఒక పద్ధతిని ఆవిష్కరించింది. ఇది ప్రమాదకరమైన గుండె బయాప్సీలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఇక ఏంజెలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదీగాక ఏంజెలి పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కారణంగా అనేక గర్భస్రావాలను ఎదుర్కొని మరి..ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారామె. అయితే ఆ పిల్లలు ఇద్దరు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యల లోపాన్ని అధిగమించడమే కాకుండా దాన్నే తన కెరీర్‌గా ఎంచుకుని..ఆ సమస్యకు చెక్‌పెట్టే దిశగా అడుగులు వేయడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం.(చదవండి: ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..) -
రామ్ విలాస్ వేదాంతి కన్నుమూత
అయోధ్య: రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి(67)సోమవారం గుండెపోటుకు గురై కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈ నెల 14వ తేదీన మధ్యప్రదేశ్‌లోని రేవాలోని ఆస్పత్రిలో చేర్పించారు. రక్తం విషపూరితం కావడంతో కిడ్నీలు ఫెయిలయ్యాయని, ఆదివారం రాత్రి గుండెపోటుకు గురయ్యారని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ అమర్చిన కొద్ది గంటల్లోనే సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారన్నారు. వేదాంతి అంత్యక్రియలను అయోధ్యలో నిర్వహిస్తామని ఆయన శిష్యుడు చోటె దాస్ మహారాజ్ చెప్పారు. ఈ నెల 10వ తేదీన రేవాలో జరిగే ఆధాత్మిక కార్యక్రమం కోసం వేదాంతి అయోధ్య నుంచి వెళ్లారని, అక్కడే అనారోగ్యానికి గురయ్యారని అయోధ్య మేయర్ గిరీశ్‌పతి త్రిపాఠీ చెప్పారు. 1958లో రేవాలో జన్మించిన వేదాంతి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీ అయ్యారు. ఈయన అయోధ్యలోని ప్రముఖ హనుమాన్‌గఢి మహంత్ అభిరామ్ దాస్ శిష్యుడు. 1949లో బాబ్రీ మసీదులో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించింది అభిరామ్ దాసేనని ఆయన శిష్యులు చెప్పారు. వేదాంతి అయోధ్యలో వశిష్ట భవన్ పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. -
16 ఏళ్ల అమ్మాయికి గుండెపోటు
వాజేడు : పదహారేళ్ల ప్రాయం.. ఎన్నో ఉన్నత చదువులు చదవాలనుకుంది. పదవ తరగతి 8.7 జిపిఏతో పాసైంది. ఇంటర్లో చేరడానికి సిద్దమవుతోంది. ఇంతలోనో విధి వక్రీకరించింది. గుండెపోటు రూపంలో ఆమెను బలితీసుకుంది. ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. వాజేడు మండలంలోని జంగాలపల్లికి చెందిన గజ్జల మల్లక్క, గజ్జల సమ్మయ్య దంపతుల కూతురు గజ్జెల నాగేంద్రమణి (16). స్థానిక వాజేడు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివింది. ఆదివారం రాత్రి ఛాతి ఎడమ వైపున నొప్పి వస్తుందని చెప్పడంతో తల్లి దండ్రులు హుటా హుటిన వాజేడు వైద్య శాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ తీసుకెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. దాంతో రాత్రికి రాత్రే వరంగల్ ఎంజిఎంకు తరలించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స చేస్తుండగానే మృతి చెందింది. గత సంవత్సరం నాగేంద్ర మణికి అనారోగ్యం చెయ్యడంతో ఆరోగ్య శ్రీకి దరఖాస్తు చేసుకున్నారు. కాని స్థానికంగా వైద్యం చేయించడంతో తగ్గింది. దీంతో అప్పటి నుంచి పెద్దగా పట్టించుకోలేదు. గత నెల రోజుల ముందు ఎడమ వైపు నొప్పి రావడంతో హైద్రాబాద్ లోని ఒక ప్రయివేట్ వైద్య శాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిక్షలను నిర్వహించి ఊపిరి తిత్తుల్లో నిమ్ము చేరిందంని తెలిపి మందులను ఇచ్చారు. నెల రోజుల తరువాత మల్లీ రావాలని సూచించారు. ఆ తర్వాత నెల దాటినా నాగేంద్ర మణిని వైద్యం కోసం హైద్రాబాద్‌కు తీసుకెళ్లలేకపోయారు. తెచ్చిన మందులు కూడా అయిపోయాయి. ఆదివారం రాత్రి వచ్చిన నొప్పితో ప్రాణం పోయింది. గుండ పోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్టు తండ్రి సమ్మయ్య తెలిపాడు. సమ్మయ్య, మల్లక్కలకు గతంలో ఇద్దరు అబ్బాయిలు పుట్టిన ఆరు నెలకే చనిపోయారు. ఈమె మూడవ సంతానం ఒక్కతే కూతురు కావడంతో తల్లి దండ్రుల రోధన వర్ణనాతీతం. విద్యార్ధ్ని మృతి పట్ల విద్యార్ధులు, ఉపాద్యాయులు సంతాపం ప్రకటించారు. -
విషాదం
– గుండెపోటుతో పుష్కర విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి – తీవ్ర సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం, ఐజీ, డీఐజీ, కలెక్టర్, ఎస్పీ – రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం – కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కృష్ణాపుష్కరాల ముగింపు రోజు మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పుష్కరాల బందోబస్తుకు శ్రీశైలం వచ్చిన కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గోపాలకృష్ణ (39) గుండెపోటుతో మృతి చెందాడు. కమ్యూనికేషన్ సిబ్బందికి సహకారం అందించేందుకు నియమించిన గోపాలకృష్ణ ఉదయం 6.30 గంటల సమయంలో విధుల్లో ఉండగా ఒక్కసారిగా తీవ్ర గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సన్నిహితులు దేవస్థానం ఉచిత వైద్యశాలకు తరలించారు. అక్కడి అపోలో డాక్టర్లు కానిస్టేబుల్‌కు అత్యవసర చికిత్సలు చేసినా ప్రాణాలను కాపాడలేకపోయారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవిష్ణ హుటాహుటిన దేవస్థానం వైద్యశాలకు చేరుకుని కానిస్టేబుల్ మృతదేహానికి నివాళులు అర్పించారు. జరిగిన సంఘటన తెలుసుకున్న రాయలసీమ జోన్ ఐజీ శ్రీధర్‌రావు కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 1985వ బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణ స్వస్థలం కర్నూలులోని కృష్ణానగర్. ఆయనకు భార్య రామలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారని ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా: డిప్యూటీ సీఎం గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మంగళవారం ప్రకటించారు. స్థానిక దేవస్థానం వీవీఐపీ భ్రమరాంబా అతిథిగహంలో ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయస్సులోనే గోపాలకృష్ణ గుండెపోటుతో మరణించడం దిగ్భ్రాంతి కలిగించందని, ఆయన కుటుంబానికి తనప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని, ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని బుధవారమే వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాబు ప్రసాద్, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి. నారాయణ పాల్గొన్నారు. ================== సంగమేశ్వరంలో కానిస్టేబుల్‌కు నివాళి ఆత్మకూరురూరల్: శ్రీశైలంలో పుష్కర విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్ గోపాలకృష్ణకు సంగమేశ్వరం ఘాట్‌లో జేసి హరికిరణ్, డీఎస్పీ వెంకటాద్రి, ఇతర పోలీసు అధికారులు నివాళులర్పించారు.


