ఐడియా అదుర్స్‌..! ఫ్యాషన్‌ని ఇలా కూడా చూపించొచ్చా..!? | Diya Joukani Becomes Viral Sensation With Cool Girl From India Fashion Reel, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ట్రెండీగా 'కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా' ..! ఫ్యాషన్‌ని ఇలా కూడా చూపించొచ్చా..

Feb 25 2026 6:02 PM | Updated on Feb 25 2026 6:19 PM

The Cool Girl From India Going Viral Globally On Instagram

సోషల్‌ మీడియా పుణ్యమా అని..చాలామంది ఓవర్‌నైట్‌ స్టార్‌లుగా, సెలబ్రిటీ హోదాను పొందుతున్నారు. ఆ జాబితాలోకి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు చేరి.. సక్సెస్‌ని అందుకోవడం విశేషం. అయితే ఫ్యాషన్‌ వద్దకు వచ్చేటప్పటకీ.. మనలోపల టాలెంట్‌ మొత్తం తీసి ..రీల్స్‌ చేసినా..క్లిక్‌ అవ్వడం కొంచెం కష్టమే. ముఖ్యంగా అందరికి చేరువవ్వాలంటే అంత సులభమైన టాస్క్‌ కాదు. ఫ్యాషన్‌ అనగానే బాగా డబ్బున్నవాళ్లకే చెల్లుతుందనే అభిప్రాయం బాగా ఎక్కువ జనాల్లో. కానీ దాన్ని సామాన్యుల చెంతకు చేర్చి..అది మన లైఫ్‌లో భాగమనిపించేలా అందంగా చూపించింది ఈ అమ్మాయి. ఈ ఒక్క రీల్‌తో సెన్సేషన్‌గా స్టార్‌గా మారి.. ప్రపంచ వేదికపై నిలిచింది. అంతేగాదు ఎవరా ఆ అమ్మాయి అంత కూల్‌గా, చాలా క్యాజువల్‌గా ఫ్యాషన్‌ని ఎంత బాగా పరిచయం చేసింది.. అని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరంటే ఆమె..

ఆ అమ్మాయే దియా జౌకానీ. వృత్తిరీత్యా ఆమె హై-ఎండ్ ఫ్యాషన్‌ డిజైనర్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో"కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" అనే క్యాప్షన్‌తో ఆమె షేర్‌ చేసిన ఫ్యాషన్‌ వీడియో నెట్టిం ప్రభంజనం సృష్టించింది. ఎవరీ కూల్‌గర్ల్‌ అని చర్చలకు తెరతీసేలా..హాట్‌టాపిక్‌గా మారిందామె. ఆ రీల్‌లో ఆమె ధరించిన దుస్తులు కూడా స్వయంగా ఆమె డిజైన్‌ చేసినవేనట. సోషల్ మీడియాను ఆమె తన ఫ్యాషన్‌ ప్రదర్శనకు ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుంటూ..తన డిజైన్లను ఇలా రీల్స్‌ ద్వారా నిశబ్దంగా ప్రదర్శించింది. 

తన డిజైనర్‌వేర్‌లతో చాలా స్మార్ట్‌గా మార్కెటింగ్‌ చేస్తోందామె. ఆ వీడియోలో దియా హై ఫ్యాషన్‌ను సరదాగా ధరించగలిగేలా ఆకర్షించింది. అంతేగాదు దియా ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం ఆమె ఫ్యాషన్‌ ప్రపంచాన్ని చూడొచ్చు. తన కంటెంట్‌ మొత్తం చాలా నిరాడంబరంగా ప్రజెంట్‌ చేస్తుండటంతో..ప్రజలు ఒక్క క్షణం వేచి వీక్షించగలిగేలా ఆకట్టుకుంటున్నాయి ఆ వీడియోలు. ప్రస్తుతం దియా చేసిన "కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" ఎంత ట్రెండీగా మారిందంటే..అందురు ఆమెలా అనుకరించే యత్నం చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు..ఆ వీడియో ఎంతగా నెటిజన్ల మనసులను తాకిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కాగా, నెట్టింట వైరల్‌ అవుతున్న ఆ వీడియోల బ్యాగ్రౌండ్‌లో క్లాసిక్ ఫ్రాంక్ ఓషన్స్ నైట్స్ ప్లే అవుతూ ఉంటే.. దియా చక్కటి ఫ్యాషన్‌వేర్‌లో చాయ్ తాగుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత నగర వీధుల గుండా నడవడం ప్రారంభిస్తుంది. కొద్ది సెకన్లలో గుర్రపు స్వారీ చేస్తూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండటం లేదా ఆమె వ్యక్తిగత రైడ్ లాగా JCB పారపై కూర్చోవడం..ఇలా విలక్షణంగా కనబడుతుంది ఆయా వీడియోలలో. అయితే వాటి అన్నింటిలోనూ దియా వివరణాత్మక, హై-ఫ్యాషన్ దుస్తులను ధరించడం స్పష్టంగా చూడొచ్చు. 

ఈ వీడియో ఇంతలా క్లిక్‌ అవడానికి కేవలం ప్రజెంటేషన్ చేసిన విధానమే ఆమెను ఐకానిక్‌గా మార్చేసింది. ఇక్కడ దియా విలాసవంతమైన దుస్తులను ధరించింది కానీ..స్టూడియో లేదా లగ్జరీ నేపథ్యం ఎంచుకోకుండా..ఇలా సాధారణ వీధుల గుండా వెళ్తూ..హై ఫ్యాషన్‌ మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ఎలాగో నేర్పుతున్నట్లుగా ఉంది. అందుకే ఇది ఎక్కువ మంది ప్రజలకు రీచ్‌ అయ్యి..అంతలా వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి ఆ వీడియోకి.  ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అన్నట్లుగా ఒక్క రీల్‌తో దియా సెన్సేషన్‌గా మారింది కదూ..!.

 

(చదవండి: అరుదైన పెళ్లి: ట్విన్‌ సిస్టర్స్‌ని పెళ్లాడిన ట్విన్‌ బ్రదర్స్‌..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement