పానీపూరీని ఇలా కూడా సర్వ్‌ చేయొచ్చా..!? | Mumbai Vendor Served Pani Puri To People Using Upersoaker Water Gun Filled, Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

పానీపూరీని ఇలా కూడా సర్వ్‌ చేయొచ్చా..!?

Feb 24 2026 2:03 PM | Updated on Feb 24 2026 2:07 PM

Mumbai vendor served pani puri to people using upersoaker water gun filled

ఆహార విక్రేతలు వాళ్ల ఫుడ్‌ స్టాల్‌ అ‍మ్మకాల కోసం ఎన్నో రకాల వ్యూహాలతో సాగుతారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కానీ ఈ పానీపూరీ విక్రేత అంతకుమించి క్రియేటివిటీతో అందర్నీ విస్తుపోయేలా చేశాడు. మొత్తం సెటప్‌ చూస్తే..అది పానీ పూరీ అమ్ముతున్నట్లుగా ఉండదు..ఏదో వార్‌లా కనిపిస్తుంది. ఈ వ్యక్తి క్రియేటివిటీకి, ఐడియాకు మెచ్చుకోకుండా ఉండలేం. అంతలా ఫుడ్‌స్టాల్‌ని సెటప్‌ చేశాడు మరి..!. ఎక్కడంటే..

ముంబైకి చెందిన పానీపూరీ వ్యాపారి అసాధారణమైన రీతీలో సర్వ్‌ చేస్తూ అందర్ని ఆకర్షిస్తున్నాడు. ఆఖరికి అతడి ఆహార్యం సైతం పూర్తి విభిన్నంగా ఉంది. అతడు పానీపూరీని పోరాట అడిషన్‌గా మార్చేశాడు. యుద్ధం చేసే సైనికుల మాదిరిగా పవర్‌ఫుల్‌ వార్‌మ్యాన్‌లా దుస్తులు ధరించి చేతిలో సూపర్‌సోకర్‌ వాటర్‌గన్‌తో ప్రజలకు పానీపూరీని సర్వ్‌ చేస్తున్నాడు. 

ఆలుకర్రీ స్టఫ్‌తో ఉన్న పానీపూరీలోకి మసాలా నీటిని గరిటెతో కాకుండా..ఇలా వాటర్‌గన్‌తో సర్వ్‌ చేస్తున్నాడు. కొందరికీ నేరుగా నోటిలోకే వచ్చేలా అందిస్తున్నాడు. కస్టమర్లు సైతం ఆ విధానాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటుండం విశేషం. అంతేగాదు ఒకరకంగా ఆవిచిత్రమైన శైలిని చూసి.. జనాలు ఎగబడి మరి అక్కడకు వచ్చి పానీపూరీలని ఆస్వాదిస్తున్నారు. 

ఇది మార్కెటింగ్‌ ట్రిక్‌ అయినా..పొట్టకూటి కోసం మనిషి ఎంత దూరమైన వెళ్తాడు..పైగా తనలోని టాలెంట్‌ మొత్తం బయటకు తీసి ఏదోరకంగా బతుకుబండిని నడిపించేందుకు ఆరాటపడతాడు. అందుకు నిదర్శం ఈ పానీపూరీ వ్యాపారి క్రియేటివిటీనే కదూ..!.

(చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్‌ పేరెంటింగ్‌ స్టైల్‌)

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement