సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చైనా మాంజాకు మరో వ్యక్తి బలి అయ్యాడు. బైక్‌పై వెళ్తున్న సాయి వర్దన్ మెడకు మాంజా చుట్టుకోవడంతో అతడి చెయ్యి, మెడకి తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే సాయి వర్ధన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో జరిగినట్టు తెలిసింది.
మరోవైపు.. శుక్రవారం కూడా చైనా మాంజా కారణంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన సభావల్ మధు శుక్రవారం హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి బైక్‌పై వెళ్తున్నారు. మార్గ మధ్యలో సాగర్ హైవేపై మాల్ మార్కెట్లో విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న చైనా మాంజా చేతి వేళ్లకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు యాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి.. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యాపారి వివరాలపై ఆరా తీశారు.


