108 అశ్వాలతో ప్రధాని మోదీ శౌర్య యాత్ర | Prime Minister Holds Mega Shaurya Yatra With 108 Horses | Sakshi
Sakshi News home page

108 అశ్వాలతో ప్రధాని మోదీ శౌర్య యాత్ర

Jan 11 2026 11:05 AM | Updated on Jan 11 2026 3:17 PM

Prime Minister Holds Mega Shaurya Yatra With 108 Horses

గాంధీనగర్‌: గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తన రెండో రోజు పర్యటనను ఆదివారం ప్రారంభించారు. ఆధ్యాత్మికత, దేశభక్తి మేళవింపుతో ఇది మొదలయ్యింది. ఉదయం 9:45 గంటలకు సోమనాథ్‌లో నిర్వహించిన భారీ ‘శౌర్య యాత్ర’లో ఆయన పాల్గొన్నారు. 108 అశ్వాలతో సాగిన ఈ ప్రదర్శన సోమనాథ్ ఆలయ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరిస్తూ ముందుకు సాగింది.


 

 ‘శౌర్య యాత్ర’లో పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా వేలాది మంది భక్తులు జైజై నినాదాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష్ సంఘ్వీ తదితరులు పాల్గొన్నారు. ఆలయ పునర్వైభవానికి ప్రతీకగా నిర్వహించిన స్వాభిమాన్ పర్వ్ శౌర్య యాత్ర అనంతరం ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెయ్యేళ్ల క్రితం (క్రీ.శ. 1026లో) జరిగిన దాడులను తట్టుకొని నిలబడిన ఈ పుణ్యక్షేత్రం భారత నాగరికతకు, పట్టుదలకు నిదర్శనమని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.
 


 ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు శనివారం సాయంత్రం ఆయన శ్రీ సోమనాథ్ ట్రస్ట్ సమావేశంలో పాల్గొని, భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. సోమనాథ్‌లో నిర్వహించే కార్యక్రమాల అనంతరం ప్రధాని రాజ్ కోట్ చేరుకోనున్నారు. అక్కడ మధ్యాహ్నం 1:30 గంటలకు పారిశ్రామిక ప్రదర్శన  ప్రారంభించనున్నారు. అనంతరం మార్వాడీ యూనివర్సిటీలో ప్రాంతీయ వైబ్రెంట్ గుజరాత్ సదస్సును ప్రారంభించి, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement